no water
-
పంటలెండుతున్నా పట్టింపేదీ?
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నెలకొన్న కరువుతో రైతులు దారుణమైన పరిస్థితుల్లో ఉన్నా, లక్షలాది ఎకరాల్లో పంటలు ఎండుతున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి జి.జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. బ్యాంకులు రుణం ఇవ్వకున్నా ప్రైవేటు వ్యక్తుల నుంచి అప్పు తెచ్చి మరీ సాగు చేసిన రైతులు నష్టపోతున్నా.. ప్రభుత్వానికి సోయి లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్లో ఆదివారం పార్టీ నల్లగొండ ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి, భువనగిరి అభ్యర్థి క్యామ మల్లేశ్, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, పార్టీ నేత మల్లికార్జున్ రెడ్డితో కలిసి జగదీశ్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి వంద టీఎంసీల నీటిని ఎత్తిపోసే అవకాశమున్నా.. కుంగిన పిల్లర్ల పేరిట రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులపై వెంటనే సమీక్షించాలని, కర్నాటక నుంచి 10 టీఎంసీల నీరు తెచ్చి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. గతంలోనూ కేఆర్ఎంబీ ఉన్నా రైతుల కోసం సాగు నీరు ఇచ్చామని జగదీశ్‌రెడ్డి గుర్తు చేశారు. నల్లగొండ జిల్లా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఉత్తమ్ కుమార్‌రెడ్డికి నాగార్జునసాగర్ ప్రాజెక్టుపైకి వెళ్లేందుకు లాగులు తడుస్తున్నాయని ఎద్దేవా చేశారు. నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కు నీళ్ల మీద పరిజ్ఞానం లేదన్నారు. కాంగ్రెస్ మంత్రులు వసూళ్లు, ముడుపుల చెల్లింపులు మొదలు పెట్టారన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఒకరికొకరు బీ టీమ్‌లా పనిచేస్తున్నాయన్నారు. ఈడీ కేసుల పేరిట ఎన్నికల ముందు ప్రతిపక్షాల నోరు నొక్కడం బీజేపీ పనిగా పెట్టుకుందని.. కేజ్రీవాల్, కవిత అరెస్టులే నిదర్శనమని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. -
నీళ్లు లేక బోసిపోయిన కందకుర్తి త్రివేణి సంగమం
-
శ్రామిక రైళ్లలో ఆకలి కేకలు!
సాక్షి, న్యూఢిల్లీ: అది మంగళవారం. సమయం ఉదయం నాలుగు గంటలు. ముంబై నుంచి బిహార్‌లోని కటియార్‌కు వలస కార్మికులను తీసుకొని బయల్దేరిన ప్రత్యేక శ్రామిక రైలు. ఏవో ఏడ్పులు వినిపించడంతో 34 ఏళ్ల మొహమ్మద్ కలీముల్లా హఠాత్తుగా నిద్ర లేచారు. 58 ఏళ్ల సయ్యన్ కుమార్ సింగ్ మరణించినట్లు ఆయన సన్నిహితులు తెలిపారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్ స్టేషన్‌కు రైలు చేరుకోగా పోలీసులు వచ్చి కుమార్ సింగ్ మృతదేహాన్ని తీసుకుపోయారు. (వలస కార్మికులకు ఉపాధి ఎలా?) కుమార్ సింగ్ కరోనా లక్షణాలతో చనిపోలేదని, ఆయన రోజువారి బీపీ, సుగర్ ట్యాబ్లెట్లు వేసుకునేందుకు పచ్చి మంచినీళ్లు కూడా దొరక్క పోవడంతో చనిపోయారని ఆయన సన్నిహితులు తెలిపారు. తాను ప్రయాణిస్తున్న రైల్లో మే 25వ తేదీన ఒక్క పూట భోజనం అందించారని, ఒక్క చుక్క నీరు కూడా ఎవరూ ఇవ్వలేదని కలీముల్లా ఆరోపించారు. అన్నం పెట్టకపోయినా ఫర్వాలేదని, మంచినీళ్లు ఇచ్చుంటే బాగుండేదని ఆయన వాపోయారు. మంగళవారం ఉదయం 6.15 గంటలకు ఆ రైలు వారణాసికి చేరుకుంది. అక్కడ మధ్యాహ్నం ఒంటి గంట వరకు రైలును నిలిపి వేశారు. ఆ సమయంలో కూడా అధికారులెవరూ మంచినీళ్లుగానీ, ఆహారంగానీ అందించలేదు. మంచినీళ్లు లేకపోతే కుమార్ సింగ్ లాగా తాము కూడా చనిపోతామని కలీముల్లా ఒంటి గంట ప్రాంతంలో సెల్‌ఫోన్ ద్వారా మీడియాకు అతికష్టం మీద తెలిపారు. దాహంతో నోరెండుకు పోవడంతో ఆయన నోటి నుంచి మాట సరిగ్గా రావడం లేదు. (‘రీడ్ అండ్ టేలర్’ కన్నీటి కథ) ఆ రైలు 36 గంటల్లో బిహార్‌లోని పాట్నాకు చేరుకోవాలి. మీడియా సంప్రతించేటప్పటికీ 40 గంటలు దాటిపోయింది. అయినా రైలు కనుచూపు మేరలోకి కూడా పోలేదు. ఈ సంఘటన ఓ ఉదాహరణ మాత్రమే. దాదాపు అన్ని శ్రామిక రైళ్లు గంటలు, రోజులు ఆలస్యంగా నడుస్తున్నాయని, వేలాది మంది వలస కార్మికులు అన్నపానీయాలు లేక అలమటిస్తున్న ఉదంతాలు మీడియా దృష్టికి వస్తున్నాయి. కొన్ని రైళ్లలో కార్మికులు పేలాలు బుక్కి కడుపు నింపుకుంటున్నారు. వలస కార్మికుల తిరుగు ప్రయాణం మొదలైన నాటి నుంచి ఇప్పటి వరకు రోడ్డు, రైలు ప్రమాదాల్లో 200 మందికిపైగా కార్మికులు మరణించారు. మే 25వ తేదీ వరకు 44 లక్షల ప్రయాణికులను తరలించేందుకు భారతీయ రైల్వే 3,274 ప్రత్యేక శ్రామిక రైళ్లను నడిపినట్లు ‘ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో’ తెలిపింది. -
ఆయకట్టుకు గడ్డుకాలం
సాక్షి, పరిగి: జిల్లాలో రెండో అతిపెద్దదైన లఖ్నాపూర్ ప్రాజెక్టు నీరులేక వెలవెలబోతోంది. గత రెండేళ్ల వరకు ప్రాజెక్టు నీటితో కళకళలాడింది. ఈసారి పరిగి నియోజకవర్గంలో లోటు వర్షపాతంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ ఏడాది ఓ మోస్తరు వర్షాలు కురిసినా ప్రాజెక్టులోకి ఆశించినస్థాయిలో నీరు రాలేదు. ప్రస్తుతం ఒక అడుగు మేర మాత్రమే నీళ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టు ఆయకట్టు రైతులు ఖరీఫ్ సాగు ప్రారంభించకుండానే సీజన్‌కు ముగింపు పలకాల్సిన పరిస్థితి ఏర్పడింది. రబీలోనైనా పంట వేద్దామనుకుంటే నీరు లేని దుస్థితి నెలకొంది. జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిసినా నియోజకవర్గంలో పరిస్థితి మరోలా ఉంది. ఈ ఏడాది ఇక్కడ భారీ వర్షాలు కురవకపోవడంతో ప్రాజెక్టులోకి నీరు చేరలేదు. పరిగి మండలంలోని లఖ్నాపూర్, మిట్టకోడూర్ గ్రామాలతో పాటు ధారూరు మండల పరిధిలోని మోమిన్‌కలాన్, రాజాపూర్, ఐనాపూర్ తదితర ఎనిమిది గ్రామాల రైతులు ఈ ప్రాజెక్టు ఆయకట్టులో సాగు చేస్తుంటారు. బీళ్లుగా మారిన భూములు ప్రస్తుతం ప్రాజెక్టులోకి నీరు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మిగతా ప్రాంతంలో వర్షపాతం ఆశించిన స్థాయిలో ఉండగా ఇక్కడ భిన్నంగా ఉంది. గడిచిన వేసవిలో ఏప్రిల్, మే మాసాల్లో సాధారణం కంటే అధిక వర్షాలు కురవగా ప్రస్తుత వర్షాకాల సీజన్లో పరిగి ప్రాంతంలో మాత్రం లోటు వర్షపాతం నమోదైంది. అగస్టులోనూ అంతంత మాత్రంగానే వర్షాలు కురిశాయి. 50 శాతానికి మించి వర్షాలు పడలేదు. ఈ నేపథ్యంలో తగ్గిన వర్షపాతం లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులపై తీవ్ర ప్రభావం చూపింది. కొత్తగా ప్రాజెక్టులోకి కనీసం ఒక ఫీటు నీరైనా చేరలేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. ఈ నేపథ్యంలో దాదాపు 2,600 ఎకరాల ఆయకట్టు రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. వర్షాకాలం ముగుస్తుండటం, ఇక భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా సన్నగిల్లడంతో రబీ సీజన్‌పైనా కర్షకులు ఆశలు వదులుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. రైతులకు తీవ్రనష్టం ఖరీఫ్‌లో వర్షాలు విరివిగా కురుస్తే వరి సాగు చేద్దామనుకున్న రైతుకు నిరాశే మిగిలింది. మామూలుగా కురిసిన వర్షాలు మెట్ట పంటలకే సరిపోయాయి చెరువుల్లోకి ఏమాత్రం నీరు వచ్చి చేరలేదు. దీంతో లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టు కూడా వెలవెలబోయింది. సాగు చేయకుండానే ఖరీప్ సీజన్ ముగుతోంది. కాస్త ఆలస్యంగానైనా ప్రాజెక్టు నిండితే రబీతోపాటు వేసవిలో వరి పండించుకోవచ్చని ఆశపడ్డ రైతుల ఆశ నెరవేరేలా లేదు. భారీ తుఫాన్లు వస్తేగాని ప్రాజెక్టులోకి నీరు వచ్చేలా కనిపించడం లేదని రైతులు చెబుతున్నారు. రూ. 12 కోట్ల నష్టం.. లఖ్నాపూర్ ప్రాజెక్టు ఆయకట్టులో దాదాపు 2,600 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రాజెక్టులోకి కొత్త నీరు చేరకపోవడంతో ఖరీఫ్, రబీ సీజన్లో సాగు చేసే పరిస్థితి లేదు. దీంతో భూములు బీళ్లుగా మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఈ రెండు సీజన్లలో కలిపి దాదాపు రూ. 12 కోట్లకు పైగా నష్టం వాటిల్లనుందని రైతులు చెబుతున్నారు. ఖరీఫ్ సీజన్లో ఆయకట్టులో వరి సాగు చేస్తే దాదాపు రూ. 6 కోట్ల పైచిలుకు విలువ చేసే ధాన్యం పండుతుందని ఇక్కడి రైతులు అంటున్నారు. రెండు సీజన్లలో సుమారు రూ. 12 కోట్లకు పైగా నష్టం తప్పదని అధికారులు అంచనా వేస్తున్నారు. -
జంఝాటం !
ఆ ప్రాంతంలో సాగునీటి సమస్య తీర్చడానికి ప్రాజెక్టు ఉంది. దాని ద్వారా నీరు తరలించడానికి కాలువలున్నాయి. కానీ నిర్వహణే లేదు. కాలువల్లో గుర్రపుడెక్క... పిచ్చిమొక్కలు... పెరిగిపోయాయి. చుక్కనీరైనా సాగడానికి అనువుగా లేదు. మరోచోట కాలువకు అడ్డంగా పెద్దరాయి పడింది. దానిని తొలగించకపోవడంవల్ల నీరు రావట్లేదు. దీనివల్ల వేలాది ఎకరాలకు సాగునీరు అందడం లేదు. దీనంతటికీ కారణం గత ప్రభుత్వం నిర్లక్ష్యం... అధికారుల్లో చిత్తశుద్ధి లోపం. ఇదీ జంఝావతి రిజర్వాయర్ పరిధిలోని కాలువల దుస్థితి. వీరి నిర్వాకం వల్ల పార్వతీపురం సబ్‌డివిజన్ పరిధిలోని మూడు మండలాలకు సాగునీరు అందక అవస్థలు పడుతున్నారు. సాక్షి ప్రతినిధి, విజయనగరం: అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్టుంది మన రైతన్నల పరిస్థితి. పంటల సాగుకు అవసరమైన ప్రాజెక్టులున్నాయి. నీటి వనరులున్నాయి. కాని అధికారుల పర్యవేక్షణ లోపంతో సాగునీరు సకాలంలో అందక కరువు పరిస్థితులను ఎదుర్కొనాల్సి వస్తోంది. పార్వతీపురం డివిజన్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన బడుగు రైతుల పరిస్థితి మరీ అధ్వానంగా మారింది. జంఝావతి ఎగువ, దిగువ కాలువల అభివృద్ధికి రూ.28.44 కోట్లు నిధులున్నా అధికారులు సకాలంలో పూడికలు తీయకపోవడం, ఎస్టిమేట్లు వేయడంలో నిబద్ధత లోపించడంవల్ల రైతన్నలు ఈ ఏడాది ఖరీఫ్‌కు దూరమై కరువు పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. దిగువ కాలువను వేధిస్తున్న అడ్డంకులు.. జంఝావతి దిగువ కాలువ పొడవు 26.09 కిలోమీటర్లు. ఇది జంఝావతి రబ్బరు డ్యాం నుంచి సీతానగరం మండలం నిడగల్లు, ఇప్పలవలస వరకు ఉంది. కాలువలో గుర్రపు డెక్క ఆకు పెరగడం, కాలువలో కొన్ని ప్రాంతాల్లో రాతి బండలు అడ్డంగా ఉండటంతో కాలువ ద్వారా రైతులకు అవసరమైన సాగునీరు రావడంలేదు. అలాగే సీతానగరం మండలం నిడగల్లు వద్ద పోతినాయుడు చెరువు వద్ద బాక్స్ కల్వర్టు నిర్మించాల్సి ఉంది. నర్సిపురం వద్ద ఒక కల్వర్టు, నర్సిపురం కనుమల చెరువు వద్ద ఒక సూపర్ పాసేజ్‌ను నిర్మించాల్సి ఉంది. మృత్యుంజయవలస వద్ద ఒక కల్వర్టు నిర్మించాల్సి ఉంది. ఈ కల్వర్టులకు నిధులు కూడా మంజూరై ఉన్నాయి. 2016–17 ఆర్థిక సంవత్సరంలో కాలువకు అడ్డుగా ఉన్న రాయిని తొలగించడానికి, కల్వర్టులు నిర్మాణానికి, అడ్డాపుశిలనుంచి సీతానగరం మండలంలోని తామర చెరువు వరకూ కాలువ అభివృద్ధి చేయడానికి కాంట్రాక్ట్ ఇచ్చి 2017–18 ఖరీఫ్ సీజనులో నిర్దేశించిన భూములకు సాగునీరందించడానికి సిద్ధం చేయాలని మార్గదర్శకాలున్నా పనులు జరగడం లేదు. కాని కాంట్రాక్టర్ సకాలంలో వీటిని నిర్మించడంలేదు. గుర్రపు డెక్క ఆకును తొలగిస్తే చాలు నీరు దిగువకు వెళుతుంది. కాని అధికారులు నిధులు వినియోగించకుండా, పనులు చేయకుండా చేతులు ముడుచుకుని కూర్చోవడంతో రైతన్నలు సాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పడకేసిన ఎగువకాలువ.. జంఝవతి ఎగువ కాలువ జంఝావతి రబ్బర్ డ్యాం నుంచి జమదాల గ్రామం వరకు 27.29 కిలోమీటర్ల పొడవు ఉంది. నెల్లూరుకు చెందిన ఆర్‌కెఎన్ ప్రాజెక్ట్సుకు చెందిన కాంట్రాక్టరు ఈ కాలువ పనుల టెండర్ దక్కించుకున్నారు. కొమరాడ మండలం డంగభద్ర వద్ద రాయిపణుకు తగిలింది. 1300 నుంచి 1700 మీటర్ల మేర రాళ్ళను పేల్చి కాలువల నిర్మాణం చేపట్టాల్సి ఉంది. కాంట్రాక్టర్ రూ.6 కోట్ల వరకు ఖర్చు పెట్టగా అప్పటి ప్రభుత్వం రూ.3 కోట్ల వరకు బిల్లులు చెల్లించలేదు. దీనివల్ల పనులు ఆగిపోయాయి. నీరున్నా... అందని వైనం.. పార్వతీపురం మండలంలోని ఎమ్మార్‌నగర్, కృష్ణపల్లి, మరిపి, ఎల్.ఎన్.పురం, చినబొండపల్లి, వెంకంపేట, పెదబొండపల్లి, లచ్చిరాజుపేట, తాళ్ళబురిడి, జమదాల గ్రామాలకు అందాల్సిన సాగు నీరు అందకుండా పోయింది. ఒక వైపు అధికారుల పర్యవేక్షణ లోపం, మరో వైపు కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం కారణంగా రైతన్నలకు కళ్ళముందే సాగునీరు ఉన్నా అది సాగుకు అందకుండా పోతోంది. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, అధికారులు ఈ సమస్యను తీవ్రంగా పరిగణించి నిధులు విడుదల చేస్తే కేవలం వారం రోజుల్లోనే పనులు పూర్తి చేసి పంట చేలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. -
కళావిహీనంగా కృష్ణా గోదావరి సంగమం
-
ఇలా వచ్చి.. అలా ఆగాయి!
సాక్షి, హైదరాబాద్: నైరుతి నిరాశపరచడం, ఎగువ రాష్ట్రాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రంలోని భారీ నీటి పారుదల ప్రాజెక్టులపై ప్రభావం పడుతోంది. జూన్ ఆరంభంలో ఎగువన మహారాష్ట్ర, కర్ణాటకలో కురిసిన వర్షాలతో ప్రాజెక్టుల్లోకి ప్రవాహాలు మొదలైనా.. ప్రస్తుతం నిలిచిపోవడం రాష్ట్రాన్ని కలవరపెడుతోంది. సీజన్ ఆరంభమైనప్పటి నుంచి నేటి వరకు కృష్ణా, గోదావరి బేసిన్ల పరిధిలోని ప్రధాన ప్రాజెక్టుల్లో 9.17 టీఎంసీల నీరే చేరడం, ఎగువ రాష్ట్రాల్లోని ప్రాజెక్టుల పరిస్థితి కూడా అలాగే ఉండటంతో దిగువ ప్రాజెక్టుల కింద సాగు ప్రశ్నార్థకం కానుంది. చుక్క ప్రవాహం లేదు: జూన్ తొలివారంలో కురిసిన వర్షాలతో శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి భారీ ప్రవాహాలొచ్చాయి. రోజుకి 10 వేల క్యూసెక్కులకు మించి ప్రవాహాలు రావడంతో ప్రాజెక్టులో నీటి లభ్యత పెరుగుతుందని భావించారు. కానీ కొత్త నీరు 3.99 టీఎంసీలే వచ్చింది. ప్రస్తుతం చుక్క ప్రవాహం కూడా లేదు. ప్రాజెక్టు పూర్తి నిల్వ సామర్థ్యం 90 టీఎంసీలు కాగా ప్రస్తుతం 10.25 టీఎంసీల లభ్యతే ఉంది. సింగూరులోకి సైతం తొలుత ప్రవాహాలొచ్చినా ప్రస్తుతం పూర్తిగా నిలిచిపోయాయి. ప్రాజెక్టులోకి ఇప్పటివరకు 0.93 టీఎంసీల కొత్త నీరే వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 29.9 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 7.76 టీఎంసీల నిల్వలు ఉన్నాయి. గతేడాది ఇదే సమయానికి ప్రాజెక్టులో 18.9 టీఎంసీల లభ్యత ఉంది. ఇక నిజాంసాగర్‌లోకి ఇంతవరకు చుక్క నీరు రాలేదు. కడెంలోకి 1.48 టీఎంసీలు, ఎల్లంపల్లిలోకి 1.36 టీఎంసీల కొత్త నీరు వచ్చింది. ఈ రెండు ప్రాజెక్టులకి కొంత మేర ప్రవాహాలున్నా మునుపటితో పోలిస్తే తగ్గాయి. కృష్ణా బేసిన్లో తొలివారంలో జూరాలకు గణనీయంగా ప్రవాహాలు కొనసాగడంతో ప్రాజెక్టులోకి కొత్తగా 2.41 టీఎంసీల నీరు వచ్చింది. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 9.6 టీఎంసీలు కాగా ప్రస్తుతం 5.71 టీఎంసీల నీరుంది. కానీ సాగర్, శ్రీశైలంలోకి కొత్త నీరు రాలేదు. మొత్తంగా అన్ని ప్రాజెక్టుల్లోకి 9.17 టీఎంసీల నీరే వచ్చింది. ఆల్మట్టి నిండితేనే దిగువకు.. ఎగువ రాష్ట్రాల ప్రాజెక్టుల్లో ఒక్క తుంగభద్రకే ఆశాజనక ప్రవాహాలు వచ్చాయి. ప్రాజెక్టులోకి 23 రోజుల వ్యవధిలో 23.08 టీఎంసీల మేర కొత్త నీరొచ్చింది. దీంతో ప్రాజెక్టులో 100 టీఎంసీకు గానూ 26.21 టీఎంసీలు లభ్యతగా ఉన్నాయి. శనివారం కూడా ప్రాజెక్టులోకి 6 వేల క్యూసెక్కుల మేర ప్రవాహం కొనసాగింది. నారాయణపూర్‌లో వారం కిందటి వరకు ప్రవాహాలు కొనసాగినా ప్రస్తుతం నిలిచిపోయాయి. ఈ ప్రాజెక్టు సామర్థ్యం 37 టీఎంసీలు కాగా ప్రస్తుతం 24 టీఎంసీల మేర లభ్యత ఉంది. అతి ముఖ్యమైన ఆల్మట్టిలోకి ఇంతవరకు పెద్ద ప్రవాహాలే లేవు. ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 129.72 టీఎంసీలకు గానూ ప్రస్తుతం 22.88 టీఎంసీల నీరే ఉంది. ఆల్మట్టి నిండితేనే దిగువ రాష్ట్ర ప్రాజెక్టులకు ప్రవాహాలు మొదలవుతాయి. -
నీళ్ల బొట్టు లేదు..
జన్నారం : గోదావరిలో పుణ్యస్నానానికి నీటి కటకట ఏర్పడింది. జన్నారం మండల పరిధి నదీ తీరంలో మహాశివరాత్రి పర్వదినాన పుణ్యస్నానం ప్రయాసగా మారింది. పరమేశ..గంగను విడువుము అని వేడుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు పక్కనున్న కడెం ప్రాజెక్టు నుంచి సైతం నీటి బొట్టు విడుదల లేదు. దీంతో మడుగుల్లోనే పుణ్యస్నానం చేయాల్సి వస్తుంది. జన్నారం మండలంలో కలమడుగు, ధర్మారం, బాదంపల్లి, చింతగూడ, రాంపూర్ గ్రామాలలో గోదావరి రేవులున్నాయి. ఇందులో కేవలం కలమడుగు గోదావరి రేవులో మాత్రమే ప్రస్తుతం నీళ్లున్నాయి. అవికూడా హస్తల మడుగులో ఎక్కువగా ఉన్నాయి. అయితే మడుగు ప్రాంతం అతి ప్రమాదకరం కాబట్టి భక్తులను పుణ్యస్నానాలకు అనుమతించడం లేదు. మిగతా గోదావరి తీర ప్రాంతాలలో నీరు లేదు. గత సంవత్సరం ఆయా రేవులలో నీరు పుష్కలంగా ఉంది. దీంతో శివరాత్రికి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగలేదు. కానీ ఈఏడాది స్నానాలకు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కడెం ప్రాజెక్టు ఉన్నా.. గతంలో కూడా గోదావరి నదిలో నీరు లేని సమయంలో భక్తుల సౌకర్యం కోసం కడెం ప్రాజెక్టు నుంచి నీటిని వదిలారు. దీంతో భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. ఈసారి కడెంలోనూ సరిపడా నీరు లేకుండపోయింది. దీంతో నీటి విడుదల కుదరదని ప్రాజెక్టు అధికారులు స్పష్టం చేశారు. కడెం పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా ప్రస్తుతం 681 అడుగుల్లో నీటి నిల్వ ఉన్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో గోదావరిలోకి చుక్కా నీరు రావడం లేదు. జాగ్రత్త వహిస్తే మేలు.. మండలంలో కేవలం కలమడుగు గోదావరి నది రేవులో మాత్రమే నీరు ఉంది. దీంతో భక్తులు అధిక సంఖ్యలో ఇక్కడకే వచ్చే అవకాశముంది. ఇక్కడ కూడా హస్తల మడుగు(అత్తమడుగు) ప్రాంతంలో నీళ్లు ఉన్నాయి. ఇది చాలా ప్రమాదకరం. ఈ మడుగులో సుమారు 20 మంది వరకు స్నానాల కోసమని వెళ్లి మృత్యువాత పడ్డారు. ఈసారి శివరాత్రికి కూడా ఇదే ప్రాంతంలో ఎక్కువ మంది స్నానాలకు వచ్చే అవకాశం ఉంది. అధికారులు తగు జాగ్రత్తలు తీసుకోవాల్సి న అవసరం ఎంతైనా ఉంది. రాత్రి కడెం నీరు విడుదల.. శివరాత్రిని పురస్కరించుకుని స్నానాల కోసం గోదావరి నదీలోకి కడెం ప్రాజెక్టు నుంచి మూడువేల క్యూసెక్కుల నీటిని ఎస్ఈ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సోమవారం రాత్రి విడుదల చేశారు. నేటి ఉదయం 12 గంటలకు గేట్లు బంద్ చేయనున్నట్లు వెల్లడించారు. అయితే కడెం నీరు విడుదల చేసినా జన్నారం మండలం వరకూ వచ్చే అవకాశాలు లేకపోవడం గమనార్హం. -
‘పథకం’ ప్రకారం ‘నీరు’గార్చారు!
- మాయమైన జేసీ నాగిరెడ్డి పథకం యంత్ర పరికరాలు - ఇతర అవసరాలకు వినియోగం! - నీరుగారిపోయిన భారీ పథకం - ‘అపహరణ’పై ప్రభుత్వానికి నివేదిక - ఈ విషయం తెలిసి ఉన్నతాధికారిపై ఓ ప్రజాప్రతినిధి చిందులు అనంతపురం సిటీ : అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జేసీ నాగిరెడ్డి తాగునీటి పథకం నీరుగారిపోయింది. కొందరు నేతల స్వార్థం, అధికారుల అలసత్వం కారణంగా ఈ పథకం ఉద్దేశం నెరవేరలేదు. ఈ పథకానికి సంబంధించిన యంత్ర పరికరాలు సైతం మాయమైపోయాయి. వాటిని అపహరించి..ఇతర అవసరాలకు వినియోగిస్తున్నట్లు సమాచారం. 2007లో రూ.508 కోట్ల అంచనా వ్యయంతో ఈ పథకానికి శ్రీకారం చుట్టారు. వైఎస్సార్ జిల్లాలోని గండికోట రిజర్వాయర్ నుంచి పైపులైన్ ద్వారా తాగునీటిని తీసుకొచ్చి తాడిపత్రి, శింగనమల, గుంతకల్లు నియోజకవర్గాలు, రాప్తాడు నియోజకవర్గంలోని కొన్నింటికి కలిపి...మొత్తం 514 గ్రామాలకు సరఫరా చేయాలన్నది ఈ పథకం ముఖ్యోద్దేశం. మొత్తం రూ. 508 కోట్ల పనుల్లో ఇప్పటిదాకా రూ.370 కోట్ల పనులు పూర్తి చేసినట్లు రికార్డులు చెబుతున్నాయి. ఇంకా రూ.138 కోట్ల నిధులు మిగిలివున్నాయి. ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి రికార్డులు కూడా అధికారుల వద్ద లేవని తెలుస్తోంది. గతంలో పనిచేసిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, కొందరు నేతలు కలిసి వీటిని మాయం చేసినట్లు సమాచారం. పథకం మొదలుపెట్టి పదేళ్లు అవుతున్నా, రూ.370 కోట్ల వరకు నిధులు ఖర్చు చేసినా.. కనీసం ఐదు శాతం గ్రామాలకు కూడా నీటిని అందించలేకపోతున్నారు. ప్రస్తుతం తాడిపత్రి నియోజకవర్గంలోని 14 గ్రామాలతో పాటు మునిసిపాలిటీకి మాత్రమే సరఫరా చేస్తున్నారు. పనులు అసంపూర్తిగా ఉండటంతో మిగిలిన నియోజక వర్గాలకు నీటి సరఫరా సాధ్యం కావడం లేదు. రెండేళ్ల క్రితమే పనుల కాంట్రాక్టు గడువు కూడా ముగిసింది. కొందరు నేతల స్వార్థం కారణంగానే సకాలంలో పూర్తి కాలేదన్న విమర్శలున్నాయి. పనులు వేగవంతం చేసిన అప్పటి అధికారులకు స్థానికంగా ఉన్న కొందరు నేతలు అడ్డు పడుతూ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అధికారులు కూడా ‘నీటి కొరత’ సాకుతో పథకాన్ని గాలికొదిలేశారు. పత్తా లేని పరికరాలు జేసీ నాగిరెడ్డి పథకానికి వినియోగించిన పైపులు, పంప్ హౌస్‌ల్లోని యంత్ర పరికరాలు చాలావరకు మాయమయ్యాయి. వాటి వివరాలు కూడా అధికారుల వద్ద లేవు. ఈ విషయంలో కాంట్రాక్టర్‌దే బాధ్యత అని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు చెబుతున్నారు. ఈ వ్యవహారంపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వానికి నివేదించారు. ‘అపహరణ’ వెనుక పెద్దల హస్తం ఉండటంతో ఈ తలనొప్పి తమకెందుకులే అనుకుని సర్కారుకే అప్పగించినట్లు తెలుస్తోంది. కాగా.. అపహరించిన పరికరాలను మరో చోట వినియోగించి బిల్లులు చేసుకున్నట్లు సమాచారం. అధికారులకు ఓ నేత వార్నింగ్ యంత్ర పరికరాల అపహరణ విషయాన్ని ఆర్డబ్ల్యూఎస్ అధికారులు గత కలెక్టర్ కోన శశిధర్ దృష్టికి కూడా తీసుకెళ్లారు. ఈ విషయం తెలుసుకున్న ఓ ప్రజా ప్రతినిధి.. ఆర్డబ్ల్యూఎస్ ఉన్నతాధికారికి తనదైన శైలిలో వార్నింగ్ ఇచ్చారు. తమ పేర్లు బయటకు వస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించినట్లు తెలిసింది. -
మొక్కలైతే నాటారు కానీ సంరక్షణ మరిచారు
-
వర్షించని తుపాకీ
ఉత్సవ విగ్రహాల్లా రెయిన్గన్లు సెంటు భూమికైనా నీరందని వైనం పంటలు ఎండిపోతున్నా పట్టని ప్రభుత్వం ఆర్భాటమే తప్ప ఆచరణ శూన్యం విజయనగరంఫోర్ట్: రాష్ట్రంలో ఏ రైతు పంటలనూ ఎండిపోనివ్వం... రెయిన్గన్లు తెస్తాం... ఆధునిక టెక్నాలజీతో పంటలు రక్షించుకుందాం... ఇందుకోసం ఎంత ఖర్చయినా భరిస్తాం... రాష్ట్రంలో ఐదు లక్షల ఎకరాలకు నీరు అందిస్తాం. ఇదీ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆర్భాటంగా చేసిన ప్రకటన. జిల్లాకు వచ్చిన రెయిన్గన్లు ఎక్కడున్నాయో ఎవరీ అంతుచిక్కడంలేదు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో పంటలు ఎండిపోతున్నా... వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు. ఐదు సెంట్లకయినా... తడులు అందివ్వలేని దుస్థితిలో ప్రస్తుత ప్రభుత్వం ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న మాటలకు, చేతలకు పొంతన ఉండడం లేదు. రాష్ట్రంలో రెయిన్గన్ల ద్వారా 5 లక్షల ఎకరాలకు నీరు అందిస్తామని చంద్రబాబు ప్రచారం చేసుకుంటున్నారు. మిగతా జిల్లాల్లో ఏవిధంగా ఉన్నా గానీ జిల్లాలో మాత్రం ఒక్క సెంటు భూమికైనా ఇంతవరకు నీరు అందించలేదు. జిల్లాకు 62 రెయిన్గన్లు సరఫరా అయ్యాయి. వీటిని ఆయా మండల వ్యవసాయ అధికారి కార్యాలయాలకు పంపించారు. కొన్ని మండలాలకు రెండు, కొన్ని మండలాలకు ఒకటి చొప్పన కేటాయించారు. రైతులకందని గన్లు జిల్లాకు రెయిన్గన్లు వచ్చాయి. కాని వాటిని రైతులకు ఇంతవరకు అందించలేదు. వాటిని ఏవిధంగా అందించాలన్న విషయంపైన కూడ ఇంతవరకు రైతులకు అవగాహన లేదు. జిల్లాలో వరి పంట91,385 హెక్టార్లలోను, చెరుకు 13,133 హెక్టార్లు, నువ్వులు 9930 హెక్టార్లు, మొక్కజొన్న 15,997 హెక్టార్లు, పత్తి 12,062 హెక్టార్లు, వేరుశనగ 12062 హెక్టార్లు, గోగు 3080 హెక్టార్లు, చోడి 1470 హెక్టార్లు, కంది 1043 హెక్టార్లు, మినుము 454 హెక్టార్లు, పెసర 375 హెక్టార్లు, మిరప 178 హెక్టార్లలో సాగవుతునానయి. ఇందులో ప్రధాన పంట వరి. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలు ఆ పంటను ఏమాత్రం ఆదుకోవడంలేదు. వీటిని ఆదుకోవడానికి రెయిన్ పనికిరాదు. ఎండిపోతున్న పంటలు వర్షాలు సకాలంలో కురవని కారణంగా జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యంగా వరి పంట నీరు లేక బీటలు వారుతోంది. పంటలు ఎండిపోతున్నా చెరువుల్లో, గుంతల్లో నీరు లేక రైతులు ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టు మిట్టుడుతున్నారు. చెరుకు, నువ్వు, చోడి, వేరుశనగ పంటలు కూడ నీరు లేక ఎండి పోతున్నాయి. దీనిపై వ్యవసాయశాఖ జేడీ లీలావతి వద్ద సాక్షి ప్రస్తావించగా రెయిన్గన్లు జిల్లాకు వచ్చాయని, వాటిని ఏవిధంగా వినియోగించాలనే దానిపై రైతులకు ఒకటి రెండు రోజుల్లో అవగాహన కల్పిస్తామనీ వివరించారు. -
కరుణించు తండ్రీ..
పుట్లూరు : కరువుతో జనం కష్టాల్లో ఉన్నారు. అయినా చవితి పండుగ నాడు నాకు ఏ లోటూ చేయలేదు. కడుపారా ఉండ్రాళ్లు పెట్టారు. వారి స్తోమతను బట్టి విగ్రహాలను కొలువుదీర్చారు. ఆటపాటలతో నన్ను అలరించారు. వారి కన్నీటి కష్టాలను దాచిపెట్టుకుని.. నన్ను మాత్రం కన్నబిడ్డలా ఆదరించారు. అంతే ఆదరణతో గంగమ్మ ఒడికి చేర్చాలని తపన పడ్డారు. అయితే.. చెరువులు, వాగులు, వంకలు ఇలా ఎక్కడ వెతికినా గంగమ్మ ‘తల్లి’ జాడ కన్పించలేదు. పాపం..! ఇక వారు ఇంతకన్నా ఏం చేయగలరు?! అందుకే నన్నిలా వదిలివెళ్లారు. తండ్రీ.. కరుణించు! గంగమ్మను పంపి..జలకళను ప్రసాదించు! నీ బిడ్డను ఆదరించిన ఈ జనం రుణం కొంతైనా తీర్చుకో! -
పేరుకే పెద్దచెరువు
అయినా చుక్కనీరు కరువు చిన్నశంకరంపేట : చిన్నశంకరంపేట మండలం అంబాజిపేట పెద్ద చెరువు నీటి సామర్థ్యం 21 అడుగులు.900 ఎకరాల ఆయకట్టుకు ఆధారమైన చెరువు ఇది .పెద్ద చెరువు నిండితే చిన్నశంకరంపేట, అంబాజిపేట, అగ్రహారం, గవ్వలపల్లి, మల్లుపల్లి, చందాపూర్, జంగరాయి గ్రామాల్లోని 900 ఎకరాలు సాగవుతుంది. కానీ చెరువులోకి చుక్కనీరు చేరలేదు.పెద్ద చెరువు ఎప్పుడు పూర్తిస్థాయిలో ఎండిపోయింది లేదు. కానీ ఇసారి వేసవిలో చుక్కనీరులేకుండా ఎండిపోయింది. బోసిపోయిన చెరువులో మూడు రోజుల క్రితం కురిసిన వర్షాలతో కొద్దిపాటి నీరు మాత్రం చేరింది. దీంతో రైతులు చెరువుల కింద పంటల సాగుచేయడం లేదు. కొందరైతే బోరుబావుల ద్వారా వ్యవసాయం చేస్తున్నారు. మరి కొందరైతే ఇటుక బట్టిలు పెట్టేందుకు భూములు లీజుకు కూడా ఇచ్చారు. ఇంకొందరు వర్షంపై ఆధారపడి మొక్కజొన్న పంటలు వేశారు. చెరువు నిండక కరువు తలపిస్తోంది. రెండెకరాలు బీడుగానే ఉంది: ఎర్రి నర్సింలు, చిన్నశంకరంపేట పెద్ద చెరువు కింద రెండెకరాల పోలం ఉంది. కానీ చెరువులో నీరులేకపోవడంతో పొలం బీడుగానే ఉంది. చెరువులోకి చుక్కనీరు కూడా చేరకపోవడంతో చెరువు కింద ఎవరు కూడా పంటలు వేసేందుకు ముందుకు రాలేదు. దీంతో కరువు పరిస్థితని ఎదుర్కొంటున్నాం. పొలం ఇటుక బట్టిలోల్లకు లీజుకిచ్చిన: నర్సింహారెడ్డి, చిన్నశంకరంపేట వర్షాకాలంలో చెరువు నిండుతుందని ఆశపడ్డాం.కానీ చెరువులోకి చుక్క నీరురాలేదు. పేరుకే పెద్ద చెరువుగా మారింది, వర్షాలు కురవకపోవడంతో చుక్కనీరు చేరడంలేదు. దీంతో బీడుగాఉన్న పొలాన్ని చేసేదేమీలేక ఇటుక బట్టిలోల్లకు లీజుకిచ్చా.. ప్రభుత్వం కరువు సాయం అందజేసి ఆదుకోవాలి. -
మా కష్టాలు తీర్చండి
ఇళ్లు, పింఛన్లు, కరెంట్ లేవు బాత్రూంలు లేక ఆరుబయటే స్నానాలు కలెక్టర్‌కు సమస్యలు విన్నవించిన పిట్టలగూడెం వాసులు రఘునాథపల్లి : ఇళ్లు.. నీళ్లు లేవు.. పింఛన్లు ఇవ్వడం లేదు. కరెంటు లేక కటిక చీకట్లోనే కా లం వెళ్లదీస్తున్నాం. తమ జీవితాలు ఆగమ్యగోచరంగా ఉన్నాయి. మా కష్టాలు తీర్చండి అం టూ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ వద్ద మండలంలోని భాంజీపేట గ్రామ శివారు పిట్టలగూడెం వాసులు గోడు వెళ్లబోసుకున్నారు. పలు శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం గూడెంను సందర్శించి ఆలయం ఎదుట నేల పైనే కూర్చొని గంటసేపు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరుకు గదుల్లో 10 నుంచి 15 మంది బతుకుతున్నాం. తాగునీరు లేక అవస్థలు పడుతున్నాం. బాత్రూంలు లేక పాత చీరలతో గుడారాలు ఏర్పాటు చేసుకొని స్నానాలు చేస్తున్నాం. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు గూడెం వాసులు మొరపెట్టుకున్నారు. చలించిన కలెక్టర్ సత్వర చర్యల కోసం అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హులను గుర్తించాలని, గూడెంలో 20 మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని ఎంపీడీఓ బానోతు సరితను ఆదేశించారు. గతంలో గూడెం వాసులు కొనుగోలు చేసిన భూములకు పట్టాలివ్వాలని తహసీల్దార్ రవిచంద్రారెడ్డిని ఆదేశించారు. తాగునీటి కోసం గూడెంలో బోరు, వ్యవసాయ భూముల్లో సాగు చేసేం దుకు మరో బోరు పాయింట్‌ను జియాలిస్ట్‌లతో గుర్తించి వేయాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వేట మానండి.. ఉపాధి కల్పిస్తాం అడవికి వెళ్లి జంతువులను వేటాడడం మానుకోవాలని మెరుగైన జీవనం కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గూడెంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థచే మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్బెడ్రూం ఇళ్లు, మేకల పెంపకానికి వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదు లు, అంగన్వాడీ కార్యకర్త నియామకం, ప్రత్యే క వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పరిమిత కుటుంబం కోసం కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. పిట్టలగూడెంను సా మాజిక దృక్పధంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మా జీ సభ్యుడు రాజారపు ప్రతాప్ దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ కె.అనితారెడ్డి, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ బానోతు శారద, గిరిజన సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు. -
మా కష్టాలు తీర్చండి
ఇళ్లు, పింఛన్లు, కరెంట్ లేవు బాత్రూంలు లేక ఆరుబయటే స్నానాలు కలెక్టర్‌కు సమస్యలు విన్నవించిన పిట్టలగూడెం వాసులు రఘునాథపల్లి : ఇళ్లు.. నీళ్లు లేవు.. పింఛన్లు ఇవ్వడం లేదు. కరెంటు లేక కటిక చీకట్లోనే కా లం వెళ్లదీస్తున్నాం. తమ జీవితాలు ఆగమ్యగోచరంగా ఉన్నాయి. మా కష్టాలు తీర్చండి అం టూ జిల్లా కలెక్టర్ వాకాటి కరుణ వద్ద మండలంలోని భాంజీపేట గ్రామ శివారు పిట్టలగూడెం వాసులు గోడు వెళ్లబోసుకున్నారు. పలు శాఖల అధికారులతో కలెక్టర్ మంగళవారం గూడెంను సందర్శించి ఆలయం ఎదుట నేల పైనే కూర్చొని గంటసేపు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇరుకు గదుల్లో 10 నుంచి 15 మంది బతుకుతున్నాం. తాగునీరు లేక అవస్థలు పడుతున్నాం. బాత్రూంలు లేక పాత చీరలతో గుడారాలు ఏర్పాటు చేసుకొని స్నానాలు చేస్తున్నాం. వృద్ధులకు పింఛన్లు ఇవ్వడం లేదని కలెక్టర్‌కు గూడెం వాసులు మొరపెట్టుకున్నారు. చలించిన కలెక్టర్ సత్వర చర్యల కోసం అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పింఛన్లు మంజూరు చేసేందుకు అర్హులను గుర్తించాలని, గూడెంలో 20 మరుగుదొడ్లు వెంటనే నిర్మించాలని ఎంపీడీఓ బానోతు సరితను ఆదేశించారు. గతంలో గూడెం వాసులు కొనుగోలు చేసిన భూములకు పట్టాలివ్వాలని తహసీల్దార్ రవిచంద్రారెడ్డిని ఆదేశించారు. తాగునీటి కోసం గూడెంలో బోరు, వ్యవసాయ భూముల్లో సాగు చేసేం దుకు మరో బోరు పాయింట్‌ను జియాలిస్ట్‌లతో గుర్తించి వేయాలని ఆర్డబ్ల్యూఎస్ డీఈని, విద్యుత్ సౌకర్యం కల్పించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. వేట మానండి.. ఉపాధి కల్పిస్తాం అడవికి వెళ్లి జంతువులను వేటాడడం మానుకోవాలని మెరుగైన జీవనం కోసం ఉపాధి అవకాశాలు కల్పిస్తామని కలెక్టర్ పేర్కొన్నారు. గూడెంలో బాల వికాస స్వచ్ఛంద సంస్థచే మినరల్ వాటర్‌ప్లాంట్ ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. డబుల్బెడ్రూం ఇళ్లు, మేకల పెంపకానికి వడ్డీ లేని రుణాలు అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలకు అదనపు గదు లు, అంగన్వాడీ కార్యకర్త నియామకం, ప్రత్యే క వైద్యశిబిరం ఏర్పాటు చేస్తామని చెప్పారు. పరిమిత కుటుంబం కోసం కుటుంబ నియంత్రణ పాటించాలన్నారు. పిట్టలగూడెంను సా మాజిక దృక్పధంతో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మా జీ సభ్యుడు రాజారపు ప్రతాప్ దత్తత తీసుకోవడం అభినందనీయమన్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్ పర్సన్ కె.అనితారెడ్డి, ఐటీడీఏ పీఓ అమయ్‌కుమార్, ఆర్డీఓ వెంకట్‌రెడ్డి, జెడ్పీటీసీ బానోతు శారద, గిరిజన సంక్షేమ అధికారి చందన పాల్గొన్నారు. -
ఇరిగేషన్ నిర్వాకం.. ఆయకట్టు రైతులకు శాపం
ఆధునీకరణ పనులు జరిగినా ఊరుముందర కాలువకు పారని నీరు ఆందోళనలో అన్నదాతలు రూ.కోట్లతో ఆధునీకరణ పనులు జరుగుతున్నాయి.. పొలాలకు సాగునీరు అందుతుందని భావిస్తున్న రైతులు అడియాశలయ్యేలా ఉన్నాయి. ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలోపంతో పనులు జరిగినా రైతులకు ఎటువంటి ఉపయోగం లేకుండాపోయింది. సోమశిల : అనంతసాగరం మండలంలోని అమానిచిరివెళ్ల చెరువు నుంచి మొదలయ్యే కొమ్మలేరువాగు ఆత్మకూరు మండలంలోని బండారుపల్లి, బట్టేపాడు వరకు సాగుతుంది. ఈ వాగు పూడికతో నిండిపోవడంతో సుమారు రూ.23 కోట్లతో 2013 సంవత్సరంలో ఆధునీకరణ పనులు ప్రారంభించారు. మండలంలోని రేవూరు సమీపంలో కొమ్మలేరు వాగుకు ఊరుముందర కాలువనే చీలుకాలువ ఉంది. దీని కింద రేవూరు, ఇస్కపల్లి గ్రామాల్లో సుమారు 250 ఎకరాలు సాగులో ఉంది. కొమ్మలేరు వాగు ఆధునీకరణలో ఊరుముందర కాలువకు ఏర్పాటుచేయాల్సిన ఆనకట్ట సక్రమంగా నిర్మాణం చేపట్టకపోవడంతో ఊరుముందర కాలువకు నీళ్లు ఎక్కడంలేదు. ఫలితంగా ఈ కాలువ ఆయకట్టు రైతులు వారి పొలాల్లో పంట వేసుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులు స్పందించి సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నదాతలు కోరుతున్నారు. -
పొలమారుతోంది
ఆంధ్రా అన్నపూర్ణగా పేరొందిన ‘పశ్చిమ’లో రైతులకు కొత్త కష్టమొచ్చిపడింది. ముందెన్నడూ ఎరుగని రీతిలో వర్షాకాలంలోనూ నారుమడులు, నాట్లు వేసిన చేలు నీరందక ఎండుతున్నాయి. పలు పంట కాలువలు, బోదెలు నీరు లేక అడుగంటాయి. ఒకవైపు గోదావరి ఉరకలెత్తి ప్రవహిస్తున్నా.. నది చెంతనే ఉన్న మండలాల్లోనూ వరి చేలు బీడువారుతున్నాయి. ఫలితంగా అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. కొవ్వూరు/పెరవలి/ యలమంచిలి : గోదావరి డెల్టాలోని నరసాపురం, మొగల్తూరు, యలమంచిలి, భీమవరం, పాలకొల్లు తదితర మండలాల్లో నీరందక నాట్లు వేసిన చేలు ఎండిపోతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇంకా నాట్లు పూర్తికాలేదు. ఈ మండలాలన్నీ కచ్చితంగా నీరందించాల్సిన పర్మినెంట్ జోన్లో ఉన్నాయి. అయినా అక్కడి రైతులకు నీటికష్టాలు తప్పడం లేదు. మొగల్తూరు మండలంలోని కాళీపట్నం, శేరేపాలెం గ్రామాల రైతులు ఈ ఖరీఫ్‌లో పంట విరామం∙ప్రకటించినా ప్రభుత్వం నుంచి స్పందన కరువైంది. ఈ మండలంలో 18,069 హెక్టార్లలో నాట్లు వేయాల్సి ఉండగా.. ఇప్పటి వరకు నాట్లు వేసిన విస్తీర్ణం 100 హెక్టార్లు మించలేదు. అయినా ఇక్కడి రైతులకు సాగునీరు అందించేందుకు ప్రయత్నించటం లేదు. ఆగస్టు రెండో వారం దాటుతున్నా ఇప్పటి వరకు ఈ మండలంలో ఐదుశాతం నాట్లు కూడా పూర్తికాలేదు. యలమంచిలి మండలంలో ఇప్పటికీ సుమారు 1,500 ఎకరాల్లో నాట్లు పడలేదు. దీనిని బట్టి పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో అర్థమవుతోంది. .నరసాపురం మండలంలో ఆయకట్టు శివారు ప్రాంతాల్లో సుమారు 800 ఎకరాల్లో నాట్లు వేయలేదు. సముద్ర తీర ప్రాంతానికి సమీపంలో ఆయకట్టు ఉన్న మొగల్తూరు, నరసాపురం మండలాలకు చెందిన రైతులు ఈ సీజన్లో పొలాల్లో నాట్లు వేయకపోతే భూములు చౌడుబారిపోతాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పెరవలి, పెనుగొండ మండలాల్లోనూ ఇదే దుస్థితి నెలకొంది. పెరవలి మండలం ఖండవల్లి, ఉసులుమర్రు, నల్లాకులవారిపాలెం గ్రామాల్లో నాట్లు ఎండుతున్నాయి. గోదావరిలో పుష్కలంగా నీరున్నా సాగునీరు అందకపోవడం ఏమిటో అర్థం కావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సార్వా పంటకు ఇటువంటి పరిస్థితి కల్పించి.. దాళ్వా సాగు లేకుండా చేయడానికే ప్రభుత్వం కుట్ర పన్నుతోందని రైతులు ధ్వజమెత్తుతున్నారు. దాళ్వాలో గోదావరి నీరంతా పట్టిసీమకు తరలించుకుపోయేందుకే కుయుక్తులు పన్నుతోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పెండ్యాల ఆయకట్టు పరిస్థితి ప్రశ్నార్థకం కొవ్వూరు మండలం సీతంపేటలోని విజ్జేశ్వరం విద్యుత్ కేంద్రం(జీటీపీఎస్)లో ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో పెండ్యాల పంపింగ్ స్కీమ్ ఆయకట్టు కింద ఉన్న 6,800 ఎకరాల సాగు ప్రశ్నార్థకంగా మారింది. పశ్చిమ డెల్టా కాలువ నుంచి జీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తికి తీసుకున్న నీటిని తిరిగి పెండ్యాల స్కీమ్‌కు సరఫరా చేస్తున్నారు. ఈనెల 8 నుంచి జీటీపీఎస్‌లో విద్యుత్ ఉత్పత్తి పూర్తిగా నిలిచిపోవడంతో వారం రోజుల నుంచి నిడదవోలు, పెరవలి మండలాల పరిధిలో ఆయకట్టు రైతులు నీటికోసం అష్టకష్టాలు పడుతున్నారు. మరో వారం రోజులు నీరందకపోతే పంటలు ఎండిపోయే పరిస్థితి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నరసాపురం కాలువ, బ్యాంక్ కెనాల్‌కు అవసరమైన నీరు సరఫరా చేయకపోవడంతో ఆయకట్టు రైతులు ఇబ్బందులు చవిచూస్తున్నారు. మెట్టలో చుక్కనీరులేక.. గోపాలపురం : మెట్టప్రాంతంలోనూ సాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. గోపాలపురం మండలం గుడ్డిగూడెం, నందిగూడెం, కొవ్వూరుపాడు, తొక్కిరెడ్డిగూడెం గ్రామాల్లోని చెరువులు అడుగంటాయి. ఈ చెరువుల పరిధిలో సుమారు 2,500 ఎకరాల ఆయకట్టు ఉంది. ప్రస్తుతం ఈ ఆయకట్టు సాగు ప్రశ్నార్థకంగా మారింది. గుడ్డిగూడెం దూదుశిల చెరువు చుట్టూ తాడిపూడి కాలువ ఉన్నా ఈ చెరువులో చుక్క నీరు లేదు. భూములు బీడువారాయి. మండలంలో 4,200 హెక్టార్లకుగాను సగమే నాట్లు పూర్తయ్యాయి. చింతలపూడి, కామవరపుకోట, లింగపాలెం, టి.నరసాపురం మండలాల్లోనూ 80శాతం నాట్లు వేశారు. పూర్తిగా వర్షాధారంపై ఆధారపడిన ఆయకట్టులో సగం ఆయకట్టులో నాట్లు పడలేదని అధికారులు చెబుతున్నారు. అలాగే కృష్ణా డెల్టా ఆయకట్టు పరిధిలో ఉన్న పెదపాడు మండలంలో 20శాతం మాత్రమే నాట్లు వేశారు. 18,500 ఎకరాల ఆయకట్టుకు గానూ ఇప్పటికీ 13వేల ఎకరాల్లో నాట్లు పడలేదు.పెదవేగి, దెందులూరు మండలాల్లోను ఇదే దుస్థితి నెలకొంది. -
చేలు తడారి.. డెల్టా ఎడారి
పెనుగొండ: మిగుల జలాలతో నదుల అనుసంధానం చేస్తున్నామని గొప్పలు చెప్పుకుంటున్న సర్కారు.. అన్నపూర్ణ లాంటి ‘పశ్చిమ’ డెల్టాను ఎడారిగా మార్చేస్తోంది. గోదావరి నదికి సమీపంలోని గ్రామాల్లోనూ నీరందక వరిచేలు ఎండుతున్నాయి. దాళ్వాలో మాత్రమే సాగు నీటి కష్టాలు ఎదుర్కొనే రైతులు చంద్రబాబు సర్కారు పుణ్యమాని సార్వాలోనూ ఎద్దడిని చవిచూస్తున్నారు. నారుమడుల సీజన్లో నీరందక మడులు ఎండిపోగా.. రైతుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతో కలెక్టర్ కె.భాస్కర్ హడావుడిగా నీటిపారుదల సలహా మండలి సమావేశం ఏర్పాటు చేసి మూడు రోజుల్లోనే సమస్యకు చెక్ పెడతామని ప్రకటించారు. అయినా పలు ప్రాంతాల్లో నేటివరకూ నీటి ఎద్దడికి పరిష్కారం లభించలేదు. పెనుగొండ మండలం కొఠాలపర్రు, తామరాడ, వడలి, రామన్నపాలెం గ్రామాల్లో సాగునీటి కోసం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నాట్లువేసి 15 రోజులు దాటుతున్నా చేలకు నీరందడం లేదు. వడలి–ఆచంట చానల్ పరిధిలో 700 ఎకరాలకు, ఐతంపూడి–చెరుకువాడ చానల్ శివారు ప్రాంతాల్లో 100 ఎకరాలకు నీరు అందడం లేదు. పంట కాలువల్లో మట్టాలు తక్కువగా ఉండటంతో చేలల్లోకి నీరు చేరడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. నరసాపురం ప్రధాన కాలువ, కోడేరు బ్యాంక్ కెనాల్లో నీటిమట్టం తక్కువగా ఉండటంతో ఈ పరిస్థితి దాపురించింది. రెండు అడుగుల నీటిమట్టం పెంచాలని రైతులు కోరుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ‘కలెక్టర్ గారూ.. కనికరించరూ’ అని రైతులు వేడుకుంటున్నారు. -
నోరెళ్లబెట్టిన చెరువులు
జిల్లాలో నిండిన చెరువులు పదిశాతమే మహబూబాబాద్, వరంగల్ డివిజన్ల వెనుకంజ ముందంజలో ములుగు మైనర్ ఇరిగేషన్ విభాగం నివేదికలో వెల్లడి సాక్షి, హన్మకొండ : ఓ వైపు వర్షాలు కురుస్తూనే ఉన్నా.. జిల్లాలోని చెరువులు మాత్రం ఆశాజనకమైన స్థాయిలో నిండలేదు. మెుత్తం చెరువుల్లో కేవలం 10 శాతం మాత్రమే పూర్తిగా నిండాయనే విషయాన్ని మైనర్ ఇరిగేషన్ విభాగం తాజా నివేదికలు స్పష్టం చేశాయి. దీంతో ఈనెలలో కురిసే వర్షాలపైనే చెరువులు నిండటం అనేది ఆధారపడి ఉంది. వర్షాలు బాగా కురిస్తే ఖరీఫ్‌లో పంటల సాగుకు ఢోకా ఉండదని అన్నదాతలు అభిప్రాయపడుతున్నారు. భారీ సాగునీటి ప్రాజెక్టులన్నీ సగం వరకే పూర్తి కావడంతో రైతులు ప్రధానంగా చెరువులపై ఆధారపడుతున్న సంగతి తెలిసిందే. మత్తడిపోసినవి 77 మైనర్ ఇరిగేషన్ శాఖ లెక్కల ప్రకారం జిల్లాలో 5,550 చెరువులు ఉన్నాయి. వీటిలో పూర్తిగా నిండి, మత్తడి పోసిన చెరువులు కేవలం 560 మాత్రమే. ఇందులో కేవలం వంద ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 483. జిల్లావ్యాప్తంగా వంద ఎకరాలకు మించిన ఆయకట్టు కలిగిన చెరువులు 802 ఉండగా, వీటిలో 77 చెరువులు మాత్రమే నిండి, మత్తడిపోశాయి. కేవలం 25 శాతం నీరు చేరిన చెరువుల సంఖ్య 2864, 25 శాతం నుంచి 75 శాతం మధ్య నిండిన చెరువుల సంఖ్య 365గా ఉంది. డివిజన్లవారీగా.. ములుగు డివిజన్లోని చెరువుల్లో నీరు అధికంగా చేరగా, మహబూబాబాద్ డివిజన్లోని చెరువుల్లో నామమాత్రంగానే నీరు చేరినట్లు మైనర్ ఇరిగేషన్ అధికారుల పరిశీలనలో వెల్లడైంది. ములుగు డివిజన్లో 1859 చెరువులు ఉండగా, రికార్డు స్థాయిలో 534 చెరువులు పూర్తిగా నిండాయి. మానుకోట డివిజన్ పరిధిలో చిన్నా, పెద్దా కలిపి 1470 చెరువులు ఉండగా, ఒక్కటి కూడా నిండలేదు. అయితే 50 శాతం(సగం) కంటే ఎక్కువగా నిండిన చెరువులు 302 ఉన్నాయి. వరంగల్ డివిజన్లోని చెరువులు సైతం వాన నీటి కోసం నోరెళ్లబెట్టి ఎదురు చూస్తున్నాయి. ఇక్కడ వంద ఎకరాల్లోపు ఆయకట్టు కలిగిన నాలుగు చెరువులు నిం డటం గమనార్హం. ఏటూరునాగారం డివిజన్లో మొత్తం 1071 చెరువులు ఉండగా 22 నిండగా, మరో 135 చెరువులు 80 శాతానికిపైగా నిండాయి. డివిజన్ చెరువులు నిండినవి సగం లోపు నిండినవి వరంగల్ 1,148 4 1,115 మహబూబాబాద్ 1,470 0 1,168 ములుగు 1,859 534 724 ఏటూరునాగారం 1,075 22 538 -
ఈసీవాగు వెలవెల
⇒ వానాకాలంలో ఇప్పటి వరకు వాగులో చేరని వరద ⇒ హిమాయత్‌సాగర్ సైతం ఎండుముఖం ⇒ పెరగని భూగర్భజలాలు శంషాబాద్ రూరల్ : వర్షాకాలంలో వరదతో కళకళలాడాల్సిన ఈసీవాగు నీరు లేక వెలవెలబోతోంది. జంట నగరాలకు తాగునీటిని అందించే జంట జలాశయాల్లో ఒకటైన హిమాయత్‌సాగర్‌లోకి వరదను చేర్చే ఈ ప్రధాన వాగులో ఇప్పటి వరకు చుక్కనీరు పారలేదు. వర్షాకాలం మొదలై రెండు నెలలు గడుస్తున్నా ఆశించిన వానలు కురవలేదు. జిల్లాలోని వికారాబాద్ ప్రాంతంలో మొదలై ఈ వాగు చేవెళ్ల, షాబాద్, మొయినాబాద్, శంషాబాద్ మండలాల పరిసరాల నుంచి హిమాయత్‌సాగర్‌కు చేరుకుంటుంది. ఎగువ ప్రాంతంలో భారీగా వర్షాలు కురిస్తే వాగులో వరద పారుతుంది. అయితే ఈ ఏడాది ఇప్పటి వరకు ఆశించిన వర్షాలు లేక వాగులో వరద రాలేదు. గత ఏడాది సైతం తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనడంతో గత రెండేళ్ల నుంచి వాగులోకి పెద్దగా నీరు పారలేదు. వాగులో వరద పారితే భూగర్భజలాలు పెరిగి సమీప గ్రామాల్లోని బోర్లలో నీరు పుష్కలంగా వస్తాయి. కానీ.. ప్రస్తుతం పరిస్థితులు భిన్నంగా మారడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వాగు పరిసర ప్రాంతాల్లో రైతులు బోర్ల కింద ఎక్కువగా వరి, కూరగాయల పంటలు సాగు చేస్తుంటారు. వర్షాభావ పరిస్థితులతో గతేడాది డిసెంబరు నుంచి బోర్లు ఎండిపోతూ వచ్చాయి. సరైన వర్షాలు లేక భూగర్భజలాలు పెరగక నేటికీ బోర్లు రీచార్జ్ కాలేదు. దీంతో వరిసాగుకు తీవ్రఇబ్బందులు ఎదురవుతున్నాయి. మరోవైపు హిమాయత్‌సాగర్‌లో నీటి మట్టం కనిష్ట స్థాయికి చేరుకోవడమే కాకుండా నగరానికి నీటి సరఫరా కూడా నిలిచిపోయింది. వర్షాకాలంలో నీటితో కళకళలాడి పర్యాటకులను ఆకర్షించే హిమాయత్‌సాగర్ నేడు నీరు లేక వట్టిపోతోంది. -
జల కళ లేక కృష్ణమ్మ విలవిల
-
నిధులివ్వరు... నీళ్లూ ఇవ్వరు
ప్రాధాన్యతా ప్రాజెక్టులకూ కేటాయింపులు అంతంతే అందులో రాయలసీమ ప్రాజెక్టులకు నిధుల కేటాయింపు అరకొరే.. వేగంగా పూర్తి చేస్తామంటూ సర్కారు కబుర్లు.. అందరూ వద్దంటున్నా పట్టిసీమపై ప్రేమ.. బడ్జెట్లో ఈ ప్రాజెక్టు ఊసే లేని వైనం ఇతర ప్రాజెక్టుల కేటాయింపుల్లో కోతపెట్టి.. దీనికి వెచ్చించే అవకాశం! అన్ని ఏర్పాట్లు చేస్తే, కుళాయి తిప్పిన వెంటనే నీళ్లొస్తాయి. మరి నీళ్లిచ్చిన ఘనత దాన్ని తిప్పిన వారిదే అవుతుందా? అందులో నీళ్లు రావడానికి అవసరమైన అన్ని ఏర్పాట్లు చేసిన వారికి చెందుతుందా? హంద్రీ-నీవాలో మోటార్లు ఆన్ చేసిన తనకే అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చిన ఘనత దక్కుతుందని చెప్పుకుంటున్న చంద్రబాబు బండారం ఇదీ.. ఆ ప్రాజెక్టు పనులు ఎవరి హయాంలో పూర్తయ్యాయనే విషయాన్ని చూస్తే ఇట్టే తెలిసిపోతుంది. ఒక్క హంద్రీ-నీవా ప్రాజెక్టే కాదు.. జలయజ్ఞం కింద మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి చేపట్టి, వేగంగా పనులు చేసి ముగింపు దశకు చేర్చిన ప్రాజెక్టుల్లో.. తోటపల్లి బ్యారేజ్, హంద్రీ-నీవా, గాలేరు-నగరి, వంశధార రెండోదశ, వెలిగొండలను ఇప్పుడు బాబు ప్రభుత్వం ప్రాధాన్యతా ప్రాజెక్టుల కింద చేపట్టి.. వాటి ఘనత తనదేనని చెప్పుకునే ప్రయత్నం చేస్తోంది. మరోవైపు అందరూ వ్యతిరేకిస్తున్న పట్టిసీమ లిఫ్ట్‌ను కూడా ఆ జాబితాలోనే చేర్చింది. అయితే ఇలా గుర్తించిన వాటినీ వేగంగా పూర్తి చేయడానికి తగినన్ని నిధులు కేటాయించకపోవడం గమనార్హం. ఆయా ప్రాజెక్టులవారీగా పరిశీలిస్తే ఈ విషయం బోధపడుతుంది. ఆ వివరాలివీ.. అందరూ వ్యతిరేకిస్తున్నా పట్టిసీమపై పట్టు.. గోదావరిపై పట్టిసీమ వద్ద లిఫ్ట్ ఏర్పాటు చేసి పోలవరం కుడికాల్వకు 80 టీఎంసీల నీటిని మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. దీనివల్ల గోదావరి డెల్టా బీడుబారుతుందని, కృష్ణా డెల్టాకు నీరందే గ్యారంటీ లేదని, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు ప్రకారం ఎగువ రాష్ట్రాలు వాటా కోరితే.. కృష్ణా నికరజలాల్ని కోల్పోవాల్సి వస్తుందని టీడీపీ మినహా వివిధ పార్టీలు, ప్రజలు, రైతుసంఘాలు వ్యతిరేకిస్తున్నా ప్రభుత్వం మొండిపట్టుదలతో ముందుకెళుతోంది. ప్రాజెక్టు చేపట్టడానికి రూ.1,300 కోట్ల పరిపాలనా అనుమతులిచ్చి ప్రారంభోత్సవమూ చేసింది. ఏడాదిలో పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. కానీ బడ్జెట్ కేటాయింపుల్లో ఈ ప్రాజెక్టు పేరే లేదు. అంటే రాష్ట్రంలో ఇతర ప్రాజెక్టులకు చేసిన కేటాయింపులకు కోత పెట్టి, దీనికి ఖర్చు చేస్తారనే అనుమానం అధికారుల్లో ఉంది. ప్రజలు కోరుకుంటున్న ప్రాజెక్టులకుగాక, కాసుల కక్కుర్తితో చంద్రబాబు కోరుకుంటున్న ప్రాజెక్టుకు నిధులు ఖర్చుచేసి పూర్తి చేస్తే రాష్ట్రానికి లాభంకంటే నష్టమే ఎక్కువ ఉంటుందనే ఆందోళన నెలకొంది. తోటపల్లి బ్యారేజ్-నిధుల కేటాయింపు అంతంతే.. తోటపల్లి బ్యారేజ్ద్వారా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో 1.84 లక్షల ఎకరాలకు సాగునీరు, తాగునీటికోసం 42 చెరువులను నింపడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించిన దీనికి చంద్రబాబు తొమ్మిదేళ్ల హయాంలో ఖర్చుచేసింది రూ.3 కోట్లే. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రూ.399 కోట్లు వ్యయం చేశారు. తర్వాత రోశయ్య, కిరణ్ ప్రభుత్వాలు రూ.200 కోట్లకుపైగా ఖర్చు చేశాయి. 2014 మార్చి 31 వరకు రూ.609.61 కోట్లు ఖర్చుపెట్టి 80 శాతం పనులు పూర్తి చేశారు. తాజాగా బాబు అధికారంలోకి వచ్చాక 2014-15 ఆర్థిక సంవత్సరంలో(2015 ఫిబ్రవరి వరకు) రూ.12 కోట్లు ఖర్చుపెట్టారు. సవరించిన అంచనాలప్రకారం ప్రాజెక్టు వ్యయం రూ.774.9 కోట్లు. భూసేకరణ ఇంకా పూర్తవలేదు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రాజెక్టుకు రూ.162 కోట్లు కేటాయించారు. కాంట్రాక్టర్లకు ధరల పెంపునకు ప్రభుత్వం అంగీకరించిన నేపథ్యంలో.. ఈ ఏడాది కేటాయించిన నిధులు వారికి చెల్లించడానికి సరిపోతుందని అధికారులు చెబుతున్నారు. మిగిలిన 20 శాతం పనులు, భూసేకరణ పూర్తి చేయడానికీ ఈ ఏడాది నిధులిస్తే... 1.84 లక్షల ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుందని, కానీ నిధుల కేటాయింపు అంతంతేనని అంటున్నారు. హంద్రీ-నీవా సుజల స్రవంతి- బడ్జెట్లో ఇచ్చింది రూ.200 కోట్లే! దేశంలోనే అత్యంత తక్కువ వర్షపాతమున్న అనంతపురం జిల్లాకు తాగు, సాగు నీరివ్వడంతోపాటు రెండోదశలో చిత్తూరు జిల్లాకూ నీరివ్వడానికి ఉద్దేశించిన ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం రూ.6,850 కోట్లు. గతంలో చంద్రబాబు తొమ్మిదేళ్లలో చేసిన ఖర్చు రూ.13 కోట్లే. వైఎస్ హయాంలో అనంతపురం జిల్లాకు ఎంత ఖర్చయినా నీళ్లివ్వాలనే లక్ష్యంతో రూ.4,340 కోట్లు ఖర్చుపెట్టి తొలిదశను ముగింపునకు తెచ్చారు. తర్వాత ప్రభుత్వాలు రూ.2,143 కోట్లు ఖర్చు చేశాయి. చంద్రబాబు తిరిగి అధికారంలోకి రాగానే.. హంద్రీ-నీవా ద్వారా అనంతపురం జిల్లాకు కొంతమేర నీళ్లిచ్చారు. కాలువల్లో చిన్న పెండింగ్ పనులు పూర్తి చేసి ఉంటే.. మరింతగా నీటిని తరలించడానికి అవకాశముండేది. కానీ దీన్ని సర్కారు వినియోగించుకోలేదు. గత ప్రభుత్వాలు పూర్తి చేసిన మేరకు నీళ్లివ్వడానికి చంద్రబాబు ప్రభుత్వం చేసినపని కేవలం పంపులు ఆన్ చేయడమే. కానీ అనంతపురం జిల్లాకు నీళ్లిచ్చిన ఘనత తనదిగా చెప్పుకుంటున్న బాబు తీరును చూసి నీటిపారుదలశాఖ ఇంజనీర్లు నవ్వుతున్నారు. హంద్రీ-నీవా పూర్తికి రూ.1,100 కోట్లు అవసరమని, ఆ మేరకు నిధులిచ్చి తానే పూర్తిచేశానని చెప్పుకోవడానికి వీలున్నా.. ఈ ఏడాది బడ్జెట్లో కేటాయించింది రూ.200 కోట్లేనని పేర్కొంటున్నారు. అది కూడా కాంట్రాక్టర్లు రెండేళ్లుగా చేసిన పనులకు అధిక ధర చెల్లించడానికే సరిపోతాయంటున్నారు. గాలేరు-నగరి సుజల స్రవంతి- అరకొర కేటాయింపు రాయలసీమను సస్యశ్యామలంగా మార్చడానికి చేపట్టిన ఈ ప్రాజెక్టుకు బాబు హయాంలో చేసిన ఖర్చు రూ.17 కోట్లే. వైఎస్ హయాంలో గాలేరు-నగరికి అత్యంత ప్రాధాన్యమిచ్చారు. ఆయన ఉన్నంతకాలం ప్రాజెక్టు నిర్మాణం శరవేగంగా సాగింది. మహానేత మరణాంతరం వచ్చిన పాలకులు ఈ ప్రాజెక్టును చిన్నచూపు చూపడంతో నిర్మాణం అటకెక్కింది. ప్రాజెక్టు మొత్తం వ్యయం రూ.7,216.45 కోట్లు. వైఎస్ హయాంలో దాదాపు రూ.4 వేల కోట్లు ఖర్చు చేశారు. తర్వాత వచ్చిన రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వాలు, తాజాగా బాబు అధికారంలో ఉన్న 11 నెలల్లో.. మొత్తం కలపి చేసిన వ్యయం రూ.330 కోట్లే. ఈ ఏడాది బడ్జెట్లో చేసిన కేటాయింపులు రూ.169.58 కోట్లు. ఇంత తక్కువ కేటాయింపులు జరిగితే.. ప్రాజెక్టుపై ఆశలు వదులుకోవాల్సిందేనని అధికారులంటున్నారు. మొత్తం పనులన్నీ పూర్తయితే శ్రీశైలం బ్యాక్షోర్ నుంచి 38 టీఎంసీల వరద నీటిని ఏటా ఆగస్టు, నవంబర్ నెలల మధ్య తరలించి కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 2.90 లక్షల ఎకరాలకు నీరివ్వచ్చు. వంశధార ప్రాజెక్టు రెండోదశ - పూర్తయ్యేది ఎప్పుడు? వంశధార రెండోదశ కింద రెండు ఫేజ్‌లు ఉన్నా యి. తొలి ఫేజ్ అంచనా వ్యయం రూ.209 కోట్లు, మలి దశ అంచనా వ్యయం రూ.933 కోట్లు. బాబు తొమ్మిదేళ్ల పాలన లో రూ.44.26 కోట్లు ఖర్చు చేయగా, వైఎస్ కలల ప్రాజెక్టుగా దీన్ని చేపట్టి తన హయాంలో రూ.657 కోట్లు ఖర్చు చేసి నిర్మాణ ప్రగతికి వేగం అందించారు. తర్వాత ప్రభుత్వాలు రూ.138.96 కోట్లు ఖర్చు చేశాయి. కానీ ఈ ఏడాది బడ్జెట్లో ప్రభుత్వం కేటాయించింది రూ.63 కోట్లే. ప్రాధాన్యతా ప్రాజెక్టుగా గుర్తించినా.. తగినన్ని నిధులివ్వకపోవడంతో ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందనేదానిపై ఉత్తరకోస్తా ప్రజల్లో అనుమానాలు తలెత్తుతున్నాయి. వెలిగొండ ప్రాజెక్టు- ప్రభుత్వంలో చలనమేదీ? ఈ ప్రాజెక్టును పూర్తిచేయడంద్వారా ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల్లో 4.47 లక్షల ఎకరాల భూమిని సాగులోకి తీసుకురావడం, దుర్భిక్ష, ఫ్లోరైడ్ ప్రభావిత 30 మండలాల్లోని 15 లక్షలమందికి తాగునీటి సౌకర్యం కల్పించడం లక్ష్యం. చంద్రబాబు గత పాలనాకాలంలో రూ.13 కోట్లు కేటాయించారు. కానీ అది కూడా ఖర్చుపెట్టలేదు. ప్రాజెక్టు శంకుస్థాపనకు శిలాఫలకం వేయడానికిమాత్రం రూ.10 లక్షలు ఖర్చుచేశారు. తర్వాత అధికారం చేపట్టిన వైఎస్సార్ రూ.4,785 కోట్ల అంచనా వ్యయంతో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. 2005 డిసెంబర్ 28న సైట్ క్లియరెన్స్, 31-3-2006న పర్యావరణ అనుమతి, 30-9-09న స్టేజ్-1 అటవీ అనుమతి లభించాయి. ఇప్పటివరకు సుమారు రూ.3,674 కోట్లు ఖర్చుచేశారు. తాజా అంచనాలప్రకారం ప్రాజెక్టు వ్యయం పెరుగుతుంది. ఈ ఏడాది బడ్జెట్లో కనీసం రూ.550 కోట్లు కేటాయించాలంటూ జిల్లా అధికారులు ప్రతిపాదనలు పంపగా.. ఇచ్చింది రూ.153.89 కోట్లే. ఇంకా 6,200 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉంది. భూసేకరణకు సంబంధించి తాజా చట్టాన్ని తమకు వర్తింపజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ప్రాజెక్టును వేగంగా పూర్తి చేయడానికి కనీస చర్యలూ చేపట్టట్లేదు. ఇటీవల టన్నెల్ బోరింగ్ మెషీన్(సొరంగం తవ్వే యంత్రం)లకు సంబంధించి కొత్త సమస్య లేవనెత్తారు. లోపల నల్లరాయి పడిందని, తద్వారా బ్లేడ్లు విరిగిపోతూ పనులు మందకొడిగా సాగుతున్నాయని, దీనివల్ల తమకు వ్యయం పెరుగుతుందంటూ కాంట్రాక్టర్ వెనుకంజ వేశారు. డాలర్ రేటు పెరగడం, కరెంటు యూనిట్ కాస్ట్ కూడా ఇటీవలికాలంలో పెరిగినందున.. వాటికీ అదనంగా నిధులివ్వకపోతే పనులు చేయలేమంటూ చేతులెత్తేశారు. కానీ ఈ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపట్లేదు. -
‘పానీ’ పాట్లు
హైదరాబాద్ శివార్లలో మంచి నీటికి కటకట ఎండాకాలం రాకముందే హైదరాబాద్ శివార్లు గొంతెండుతున్నాయి.. మహానగరంలో విలీనమవడంతో గ్రేటర్‌లోని శివారు ప్రజలు ‘పానీ’ పాట్లు పడాల్సి వస్తోంది. భూగర్భ జలాలు అడుగంటిపోవడం... బోరు బావులు వట్టి పోవడంతో గొంతు తడుపుకునేందుకు జేబులు గుల్ల చేసుకోవాల్సి వస్తోంది.. మంచి నీళ్ల కోసం డబ్బును ‘నీళ్ల’లా ఖర్చు చేయాల్సి వస్తోంది. ఇంత జరుగుతున్నా జలమండలి ప్రేక్షక పాత్రే వహిస్తోంది... ప్రభుత్వం మౌనంగానే చూస్తోంది.. సాక్షి,హైదరాబాద్: హైదరాబాద్ శివారువాసులకు క‘న్నీటి’ కష్టాలు మొదలయ్యాయి. మహానగరంలో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీలు, సమీప గ్రామాల్లోని సుమారు వెయ్యి కాలనీలు, బస్తీల్లో మార్చి ప్రారంభంలోనే నీటి ఎద్దడి ప్రారంభమైంది. దాదాపు 30 లక్షల మంది నీటి కోసం రోజూ ‘జలయజ్ఞం’ చేయాల్సిన పరిస్థితి దాపురించింది. శివారు ప్రాంతాల్లో జలమండలి మంచి నీటిని సరఫరా చేయకపోవడం, వర్షపు నీటిని సద్వినియోగం చేసే ఇంకుడు గుంతలు లేకపోవడం, బోరుబావులు వట్టి పోవడంతో సమస్య మరింత తీవ్రమవుతోంది. ఇక్కడ పలు ప్రాంతాల్లో 2,000 అడుగుల వరకు బోర్లు వేసినా చుక్క నీరు దొరకడం లేదు. దాహార్తి తీర్చుకోడానికి ట్యాంకర్లపై ఆధారపడాల్సి వస్తోంది. రోజువారీ వినియోగం కోసం నెలకు రూ.2,000 నుంచి రూ.5 వేలు ఖర్చు చేయాల్సి వస్తోంది. ప్రగతినగర్, నిజాంపేట్, బోడుప్పల్, కాప్రా, మల్కాజిగిరి,అల్వాల్,యాప్రాల్,మాదాపూర్,శేరిలింగంపల్లి,బాలానగర్,కుత్బుల్లాపూర్,మియాపూర్,చందానగర్,ఎల్బీనగర్,బండ్లగూడ,గాజులరామారం తదితర శివారు ప్రాంతాల్లో నీటి ఎద్దడి తీవ్రమవుతోంది. ఇక్కడ ఇంటి అద్దెతో పాటు అందులో సగం మొత్తాన్ని అదనంగా నీటి కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది. ఇక కొన్ని బస్తీల్లో మహిళలు గుక్కెడు మంచి నీటికి బిందెలతో యుద్ధం చేయాల్సి వస్తోంది. ఇటీవల బోడుప్పల్లో నీటి కోసం ప్రజలు రోడ్డెక్కి ఆందోళన బాట పట్టారు. ప్రేక్షకపాత్రలో జలమండలి.. గ్రేటర్ పరిధిలో 20 లక్షల నివాస సముదాయాలుండగా.. జలమండలి 8.64 లక్షల నివాసాలకు మాత్రమే రోజూ 340 మిలియన్ గ్యాలన్ల నీరు సరఫరా చేస్తోంది. కొన్ని చోట్ల వారం, మరికొన్ని చోట్ల 15 రోజులకోసారి సరఫరా జరుగుతోంది. బోడుప్పల్, మేడిపల్లిలోని కొన్ని చోట్ల నెలకో రోజు మాత్రమే కుళాయిల్లో నీళ్లొస్తాయి. 11 మున్సిపల్ సర్కిళ్ల పరిధిలోని వెయ్యికి పైగా కాలనీల్లో రిజర్వాయర్లు, పైప్లైన్లు లేవు. ఇక్కడి వారు బోరు బావులపైనే ఆధారపడి దాహార్తిని తీర్చుకోవాల్సివస్తోంది. 2,000 అడుగుల లోతుల్లోకి వెళ్లినా.. గ్రేటర్ పరిధిలోని దాదాపు అన్ని మండలాల్లో భూగర్భ జల మట్టాలు గతేడాదితో పోలిస్తే బాగా తగ్గాయి. బహదూర్‌పురా మండలం మినహా ఆసిఫ్‌నగర్,చార్మినార్,నాంపల్లి,హయత్‌నగర్,సరూర్‌నగర్,శేర్,ఉప్పల్,చార్మినార్,బండ్లగూడ,ఘట్కేసర్,మేడ్చల్ తదితర మండలాల్లో భూగర్భ జల మట్టా లు గణనీయంగా పడిపోయాయి. మొత్తంగా గ్రేటర్ పరిధిలో గతేడాది సగటున 7.97 మీటర్ల లోతున భూగర్భ జలాల జాడ దొరకగా ఈ ఏడాది ఫిబ్రవరిలో 10.46 మీటర్ల లోతుకు వెళితే గాని నీటి జాడ దొరకడం లేదు. అంటే గతేడాది కంటే ఈసారి అదనంగా 2.49 మీటర్ల మేర నీటిమట్టం పడిపోయిందన్నమాట. నిజాంపేట్... నీళ్లు లేక ఖరీదైన నిజాం పేట్ ఏరియాలో ఇంటి అద్దెలు సుమారుగా రూ.6 వేలు. ఇక నీటి కోసం వీరు అదనంగా మరో రూ. 3 వేలు చెల్లించాల్సి వస్తోంది. ఇటీవల మంజీరా నీళ్ల కోసం ఇక్కడ వాటర్ ట్యాంక్‌ను నిర్మించారు. కానీ, సరిపడా నీటి సరఫరా మాత్రం లేదు. దీంతో చాలా మంది బోరు నీటిపైనే ఆధారపడుతున్నారు. ఎండాకాలం రాకముందే ఆ బోరుబావులు కూడా అడుగంటుతున్నాయి. దీంతో ఇక్కడివారు రూ.1,400 చెల్లించి ప్రైవేట్ నీటి ట్యాంకర్లను కొనుగోలు చేస్తున్నారు. ఉప్పల్... తిప్పల్.. హైదరాబాద్‌లో అత్యంత ముఖ్య ప్రాంతమైన ఉప్పల్‌లోనూ నీటి కష్టాలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి... ఇక్కడ భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. ఇక బోడుప్పల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ఇక్కడ 25 వేల మంది నివసిస్తున్నారు. మొత్తం 12,304 నల్లా కనెక్షన్లున్నాయి. రోజుకు 10 వేల కిలో లీటర్లు తాగునీరు అవసరం ఉంటే.. 3,340 కిలో లీటర్ల మంచినీళ్లు మాత్రమే సరఫరా అవుతున్నాయి. 2002 జనాభా లెక్కల ప్రకారం సరఫరా జరగడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పీర్జాదిగూడలో వారానికి ఒకసారి మాత్రమే కొన్ని కాలనీల్లో మంచి నీళ్లు వస్తాయి. ఇక్కడి బుద్ధానగర్,మల్లికార్జున నగర్లలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటాయి. మేడిపల్లిలో అయితే నెలకోసారి మాత్రమే నీటి సరఫరా జరుగుతోంది. అదికూడా కేవలం 30 నిమిషాలు మాత్రమే. ఇక్కడ అందరూ ట్యాంకర్ నీళ్లు కొనాల్సిందే. రామంతాపూర్‌లోని కొన్ని కాలనీల్లో 2,000 అడుగుల మేర బోరు వేసినా చుక్క నీరు కూడా కనిపించడం లేదు. ఇటీవల నెహ్రూనగర్‌లో జీహెచ్ఏంసీ అధికారులు 1,500 అడుగుల లోతుకు బోరు వేసినా నీటి జాడ దొరకలేదు. హైటెక్ సిటీలో అదే పరిస్థితి... మాదాపూర్, గచ్చిబౌలి, మియాపూర్, చందానగర్, కొండాపూర్ తదితర ప్రాంతాలలో బోరుబావుల్లో నీళ్లు లేకపోవడంతో మంచినీటి సమస్య తీవ్రమైంది. ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు నెలకు రూ.2,500 వరకు మంచి నీటికోసం ఖర్చు చేయాల్సి వస్తోంది. ఉదాహరణకు మియాపూర్‌లోని ఎస్.ఆర్.ఎస్టేట్స్‌లో 322 ఫ్లాట్స్ ఉన్నాయి. ఇందు లో దాదాపు వెయ్యి మందికిపైగా నివసిస్తున్నారు. జలమండలి కనెక్షన్ ఉన్నప్పటికీ తగిన ంత తాగు నీరు లేక వీరు ప్రతిరోజూ 35 ట్యాంకర్ల నీటిని కొంటున్నారు. అంకెల్లో దాహార్తి... 30 లక్షలు... గ్రేటర్‌లోని శివారు ప్రాంతాల్లో దాహార్తితో అలమటిస్తున్న ప్రజలు 1,000...హైదరాబాద్‌లో విలీనమైన 11 శివారు మున్సిపాలిటీల పరిధిలోని నీటి ఎద్దడి తీవ్రంగా ఉన్న ప్రాంతాలు 2,200..ప్రైవేటు ట్యాంకర్ నీళ్లు కొనుగోలు చేయడానికి కొన్ని ప్రాంతాల్లోని ప్రజలు గరిష్టంగా ఖర్చు చేస్తున్న మొత్తం 2,000...కొన్ని చోట్ల భూగర్భ జలాలు పడిపోవడంతో 2,000 అడుగుల లోతుకు వెళ్లినా చుక్క నీరు కనిపించడం లేదు.. -
గ్రేటర్.. నో వాటర్