Non Local
-
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రదాడి.. యూపీ కార్మికునికి తీవ్రగాయాలు
శ్రీనగర్: జమ్మూకశ్మీర్‌లో మరో ఉగ్రదాడి చోటుచేసుకుంది. ఈసారి పుల్వామాలో ఉగ్రవాదులు కాశ్మీరేతరులను లక్ష్యంగా చేసుకున్నారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికుడు తీవ్రంగా గాయపడ్డాడు. అతన్ని ఆర్మీ అధికారులు ఆస్పత్రికి తరలించారు. అతని పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వార్తా సంస్థ పీటీఐ తెలిపిన వివరాల ప్రకారం జమ్మూ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో గల ట్రాల్ ప్రాంతంలో గురువారం ఉదయం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఒక కార్మికునిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. ప్రీతమ్ సింగ్‌ను ఆర్మీ సిబ్బంది చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. గత వారం రోజులుగా కశ్మీర్లో స్థానికేతర కార్మికులపై దాడులు జరుగుతున్నాయి. ఆదివారం రాత్రి గందర్‌బాల్‌లోని శ్రీనగర్-లేహ్ హైవేపై సోనామార్గ్ సమీపంలోని గగాంగిర్ ప్రాంతంలో టన్నెల్ నిర్మిస్తున్న కంపెనీకి చెందిన వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడి చేశారు. ఈ ఘటనలో ఒక వైద్యునితో సహా ఆరుగురు కార్మికులు మృతిచెందారు.మరణించిన కార్మికులలో కశ్మీరీలతోపాటు కశ్మీరేతరులు ఉన్నారు. కశ్మీర్లో వలస కార్మికులు పెద్ద సంఖ్యలో ఉన్నారు. వీరు ఇక్కడి ప్రాజెక్టులలో పనిచేస్తున్నారు. బీహార్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, పంజాబ్‌లకు చెందిన కార్మికులు కశ్మీర్‌లోని యాపిల్ తోటలు, పలు నిర్మాణ పనులు, రైల్వే ప్రాజెక్టులలో పనులు చేస్తున్నారు. 2021లో కూడా వలస కార్మికులపై ఉగ్రవాదులు దాడులకు పాల్పడ్డారు. ఇప్పుడు మళ్లీ కశ్మీర్లో ఈ తరహా దాడులు జరుగుతున్నాయి. ఇది కూడా చదవండి: బాలికపై లైంగిక వేధింపులు.. మణిపూర్‌లో మళ్లీ ఉద్రిక్తత -
ఏపీలో ‘నాన్ లోకల్ లీడర్ల’ హడావుడి ఐదు కోట్ల ప్రజలకు మేలు చేయదు
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గురువారం శ్రీకాకుళం జిల్లా కంచిలి, పలాసలో ప్రజా శ్రేయస్సుకు దారితీసే రెండు పనులు ప్రారంభించారు. కిడ్నీ బాధితుల కోసం మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి–కిడ్నీ రీసెర్చ్ సెంటర్‌ను పలాస సమీపంలో రూ.700 కోట్లతో వైఎస్సార్ సుజలధార కార్యక్రమాన్ని ప్రారంభించాక ముఖ్యమంత్రి జగన్ గారు ప్రజలందరూ గమనించాల్సిన ఒక మంచి విషయం చెప్పారు. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం నేత నారా చంద్రబాబు నాయుడు, తాము రాజకీయాలు చేసే ఆంధ్రప్రదేశ్‌లో స్థిర నివాసం లేకుండా హఠాత్తుగా అప్పుడప్పుడూ వచ్చే ‘నాన్ లోకల్ లీడర్లు’ అని జగన్ గారు వ్యగ్యం జోడించి మాట్లాడారు. ఈ నాయకులు అత్యధిక రోజులు హైదరాబాద్ నగరంలో తమ కుటుంబ సభ్యులతో కాపురం ఉంటే ఎవరికీ అభ్యంతరం లేదు. కాని, ప్రశాంతంగా ప్రగతిపథంలో నడుస్తున్న స్వరాష్ట్రంలోకి అప్పుడప్పుడూ హడావుడిగా ప్రవేశించి లేని సమస్యలు సృష్టించే ప్రయత్నాలే ప్రజాస్వామ్య విరుద్ధంగా ఉన్నాయి. భారత పౌరుడు ఎవరైనా దేశంలో ఏ ప్రాంతంలోనైనా స్థిరపడి, నివసించడానికి రాజ్యాంగం, చట్టాలు వెసులుబాటు కల్పిస్తున్నాయి. అయితే, కొన్ని ప్రాంతాల్లో ఆస్తులు కొనడానికి, ఇళ్లు నిర్మించుకోవడానికి కొన్ని షరతులు, ఆంక్షలు వర్తిస్తాయి. దేశంలో ఎక్కడైనా ప్రముఖులు, సామాన్యులు నివసించే వీలుంది. తమను చట్టసభకు పంపించిన రాష్ట్రానికి దాదాపు 300 కిలోమీటర్ల దూరంలో ఈ ‘ప్రజా నాయకులు’ నివసించడం చట్టబద్ధమేగాని రెండు ప్రాంతీయపక్షాల అధ్యక్షులుగా సొంత రాష్ట్ర ప్రజలకు నిరంతరం అందుబాటులో లేకపోవడం ఇతరులు తప్పుపట్టే విషయమే. పార్లమెంటు సభ్యులు సైతం సొంత రాష్ట్రాల్లోనూ కొన్ని రోజులు ఉంటున్నారే! జాతీయ రాజధాని న్యూఢిల్లీలో పార్లమెంటు సమావేశాలకు ఏటా కొన్ని మాసాలు హాజరయ్యేందుకు వీలుగా అక్కడ ఎంపీలకు ప్రభుత్వం గృహ నివాస సౌకర్యం కల్పిస్తోంది. రాజ్యసభ, లోక్ సభ సభ్యులైన ఎంపీలకు రాష్ట్ర ప్రభుత్వాల కేంద్ర స్థానాలైన రాష్ట్ర రాజధానుల్లో కూడా పాలనాపరమైన పనుల కోసం ఉండాల్సిరావడంతో అనేక మంది ఎంపీలు సొంత లేదా అద్దె ఇళ్లలో కొన్ని రోజులు అక్కడ బస చేస్తుంటారు. పార్టీల రాష్ట్ర అధ్యక్షులు లేదా చట్టసభల సభ్యులు నిరంతరం ఆయా రాష్ట్రాల్లో పర్యటిస్తూ ప్రజల మధ్య తిరగాల్సిన సందర్భాలు, అవసరాలు ఉంటాయి. అయితే, మాజీ సీఎం చంద్రబాబు మాదిరిగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నివాసాన్ని శాశ్వత బసగా మార్చుకోవడం ఐదు కోట్ల ఆంధ్రులు మెచ్చే విషయం కాదు. రెండు దశాబ్దాల క్రితం చట్ట సవరణ చేయక ముందు రాజ్యసభకు పోటీచేయాలనుకునే అభ్యర్థి ఎవరైనా ఏ రాష్ట్రం నుంచి పార్లమెంటు ఎగువ సభకు ఎన్నికవ్వాలనుకుంటున్నారో అక్కడ నివాసం ఉంటున్నట్టు రుజువులు చూపించాల్సి వచ్చేది. అంటే, తమిళనాడు నుంచి రాజ్యసభకు పోటీచేయదలచిన నాయకుడు ఆ రాష్ట్రంలో ఎక్కడైనా నివాసం ద్వారా ఓటు హక్కు కలిగి ఉండాలనే నిబంధన 2003 వరకూ ఉండేది. ఈ కారణంగా 1991 జూన్ మాసంలో నాటి పీవీ నరసింహారావు నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా చేరిన డాక్టర్ మన్మోహన్ సింగ్ అప్పటికీ పార్లమెంటు ఏ సభలోనూ సభ్యులు కాదు. మంత్రి అయిన నేత ఎవరైనా ఆర్నెల్లలోగా పార్లమెంటుకు ఎన్నికవ్వాలనే నిబంధ ప్రకారం డాక్టర్ సాబ్ అదే ఏడాది ఆగస్టులో అస్సాం నుంచి రాజ్యసభకు ఎన్నికయ్యారు. అప్పటి నిబంధన ప్రకారం అస్సాం రాజధాని నగరం గౌహాతిలోని దిస్పూర్లో నందన్ నగర్, వార్డ్ నం.15లోని 3989 నంబర్ ఇంట్లో అద్దెకుంటున్నట్టు రాజ్యసభకు వేసిన నామినేషన్ పత్రాల్లో మన్మోహన్ రాశారు. ఈ ఇల్లు అస్సాం కాంగ్రెస్ మాజీ ముఖ్యమంత్రి హితేశ్వర్ సైకియా భార్య, అస్సాం మంత్రి హేమప్రభా సైకియాది. మన్మోహన్ ఆ ఇంట్లో అద్దెకు ఉంటూ తద్వారా లభించిన ఓటుతో అస్సాం నుంచి కొన్నిసార్లు రాజ్యసభకు ఎన్నికయ్యారు. 2003లో రాజ్యసభకు ఎన్నికకు ‘స్థానికత నిబంధన’ తొలగించి ఎవరైనా ఏ రాష్ట్రం నుంచైనా రాజ్యసభకు పోటీచేసే అవకాశం కల్పించారు. ఇలా ‘స్థానికత’ తప్పనిసరి అయినప్పుడు నాయకులు స్థానికంగా నివసించాలేగాని తాము ప్రాతినిధ్యం వహించే రాష్ట్రానికి దూరంగా, ముఖ్యంగా తాను రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేతగా ఉన్న రాష్ట్రంలో శాశ్వత నివాసం లేకుండా పొరుగు రాష్ట్రంలో నివసించడం ఒక్క చంద్రబాబుకే చెల్లింది. వెస్సార్సీపీ పార్లమెంటరీ నేత విజయసాయిరెడ్డి -
జమ్ములో వివాదాస్పద ఉత్తర్వుల ఉపసంహరణ
శ్రీనగర్: జమ్ము కశ్మీర్లో ఎన్నికల నేపథ్యంతో.. స్థానికేతరులకు సైతం ఓటు హక్కు కలిగేలా జారీ చేసిన ఉత్తర్వులపై తీవ్ర రాజకీయ దుమారం చెలరేగింది. ప్రాంతీయ పార్టీలన్నీ దీనికి వ్యతిరేకంగా ఉద్యమించడంతో.. ఆ ఆదేశాలను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించారు. ఏడాది కాలంగా జమ్ము రీజియన్ జిల్లాలో నివాసం ఉంటున్న వాళ్లకు.. ఎలాంటి ధ్రువీకరణ లేకున్నా నివాస ధ్రువీకరణ పత్రాలు జారీ చేయొచ్చంటూ తహసీల్దార్లకు మంగళవారం కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. తద్వారా.. ఆ నివాస ధ్రువీకరణ పత్రాలతో ప్రాంతీయేతరులు సైతం ఓటర్ జాబితాలో తమ పేరును నమోదు చేసుకునే లభిస్తుందన్నమాట. అయితే.. ఈ ఆదేశాలపై ప్రాంతీయ పార్టీలన్నీ భగ్గుమన్నాయి. ఓటర్లను దిగుమతి చేసుకునే బీజేపీ కుట్రలో ఇది భాగమంటూ మండిపడ్డాయి. గులాం నబీ ఆజాద్.. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించగా, మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు కేంద్రంపై ‘వలసవాద విధానం’ అంటూ మండిపడ్డారు. రాజకీయ దుమారం చెలరేగడంతో.. వివాదాస్పదమైన ఈ ఉత్తర్వులను గత రాత్రి(బుధవారం) వెనక్కి తీసేసుకున్నారు అధికారులు. ఇక జమ్ము కశ్మీర్లో ఓటర్ నమోదు, సవరణల ప్రక్రియ నవంబర్ 25లోపు పూర్తి చేయాలని ఎన్నికల సంఘం నిర్ణయించుకుంది. తాజాగా జమ్ము కశ్మీర్ పర్యటనకు వెళ్లిన కేంద్ర హోం మంత్రి అమిత్ షా.. ఓటర్ల నమోదు ప్రక్రియ పూర్తికాగానే ఎన్నికల నిర్వహణ ఉంటుందని ప్రకటించారు. జమ్ము కశ్మీర్ స్వయం ప్రతిపత్తి రద్దు ముందు దాకా.. అక్కడ శాశ్వత నివాసితులకు మాత్రమే ఓటర్లుగా అవకాశం ఉండేది. అయితే.. ఆగష్టు 2019 తర్వాత స్థానికేతరులకు అవరోధంగా ఉన్న చట్టాలన్నీ రద్దు చేయబడ్డాయి. దీంతో నాన్ లోకల్స్‌ను సైతం ఓటర్ లిస్ట్‌లో చేర్చేందుకు అవకాశం లభించినట్లయ్యింది. ఈ ఆగష్టులో కొత్త ఓటర్ల నమోదు, సవరణ ప్రక్రియ మొదలుకాగా.. స్థానికేతరులకు అవకాశం లభిస్తే 20-25 లక్షల మధ్య కొత్త ఓటర్లు జత అవుతారని జమ్ము కశ్మీర్ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ అంచనా వేస్తున్నారు. -
పొలిటికల్ కారిడార్ : కుప్పంకు నాన్ లోకల్ గా పేరుపడ్డ చంద్రబాబు
-
సంచలనం.. జమ్ము కశ్మీర్ ఓటర్లుగా నాన్-లోకల్స్ కూడా!
శ్రీనగర్: జమ్ము కశ్మీర్ ఎన్నికల సంఘం సంచలన ప్రకటన చేసింది. స్థానికేతరులను సైతం ఓటర్లుగా పరిగణనలోకి తీసుకుంటున్నట్లు.. ఓటు హక్కు కల్పిస్తున్నట్లు తెలిపింది. సీఈవో హిర్దేశ్ కుమార్ స్వయంగా చేసిన ఈ ప్రకటన.. ఇప్పుడు రాజకీయంగా పెను దుమారం రేపుతోంది అక్కడ. ఆర్టికల్ 370 రద్దు, జమ్ము కశ్మీర్-లఢఖ్ కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారిన తర్వాత.. తిరిగి రాజకీయ స్థిరత్వం నెలకొల్పేందుకు కేంద్రం ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో.. ఎన్నికల నిర్వహణ వీలైనంత త్వరలోనే ఉంటుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ప్రకటించారు కూడా. ఈ క్రమంలో.. ఇప్పుడు ఈసీ ఓటర్లుగా స్థానికేతరులనూ గుర్తిస్తామని ప్రకటించడం విశేషం. ఉద్యోగులు, విద్యార్థులు, వలస కూలీలు.. ఇలా బయటి నుంచి వచ్చి జమ్ము కశ్మీర్లో ఉంటున్న వాళ్లకు ఓటు హక్కు దక్కనుంది. అంతేకాదు వాళ్లు ఓటర్ రిజిస్ట్రేషన్ చేసుకునే సమయంలో ‘నివాసం’ అనే ఆప్షన్ తప్పనిసరేం కాదని, మినహాయింపు ఇస్తున్నామని జమ్ము కశ్మీర్ ఈసీ వెల్లడించింది. ఇక జమ్ము కశ్మీర్లో భద్రత కోసం వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన సిబ్బంది సైతం ఓటు హక్కుకు అర్హులేనని, వాళ్లు కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని సీఈవో హిర్దేశ్ కుమార్ వెల్లడించారు. అక్టోబర్ 1, 2022 వరకు పద్దెనిమిదేళ్లు పూర్తి చేసుకున్న వాళ్లు వచ్చే జమ్ము కశ్మీర్ ఎన్నికల్లో ఓటు వేయడానికి అర్హులని, నవంబర్ 25వ తేదీ లోపు ఓటర్ల రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేయడాన్ని లక్ష్యంగా పెట్టుకున్నట్లు హిర్దేశ్ కుమార్ వెల్లడించారు. జమ్ము కశ్మీర్లో పద్దెనిమిదేళ్లు పైబడిన జనాభా 98 లక్షలకు పైనే. అందునా.. ప్రస్తుతంఉన్న ఓటర్లు లిస్ట్‌లో 76 లక్షల మందే ఉన్నారు. ఈసీ తీసుకున్న స్థానికేతరులకు ఓటు హక్కు నిర్ణయంతో మరో పాతిక-ముప్ఫై లక్షలకు పైగా కొత్త ఓటర్లు.. జమ్ము కశ్మీర్ ఓటర్ల కింద జమ కానున్నట్లు అంచనా. ఇక ఈసీ తాజా ప్రకటనను ఆధారంగా చేసుకుని జమ్ము కశ్మీర్ స్థానిక పార్టీలు.. కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. బీజేపీ ఓటు రాజకీయమంటూ మాజీ ముఖ్యమంత్రులు మెహబూబా ముఫ్తీ, ఒమర్ అబ్దుల్లాలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేశారు. GOIs decision to defer polls in J&K preceded by egregious gerrymandering tilting the balance in BJPs favour & now allowing non locals to vote is obviously to influence election results. Real aim is to continue ruling J&K with an iron fist to disempower locals. https://t.co/zHzqaMseG6 — Mehbooba Mufti (@MehboobaMufti) August 17, 2022 Is the BJP so insecure about support from genuine voters of J&K that it needs to import temporary voters to win seats? None of these things will help the BJP when the people of J&K are given a chance to exercise their franchise. https://t.co/ZayxjHiaQy — Omar Abdullah (@OmarAbdullah) August 17, 2022 ఇదీ చదవండి: అదానీకి జెడ్ కేటగిరి భద్రత -
నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక మొండిచేయి?
సాక్షి, బెంగళూరు: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కర్ణాటక నుంచి ఈసారి షాక్ తగలనుందని సమాచారం. ఆమెకు రాజ్యసభ టికెట్ ఇవ్వకుండా స్థానికులకే ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నేతలు పట్టుబట్టినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఆమె యూపీ నుంచి బరిలో దిగే అవకాశం ఉంది. స్థానికేతరులు అవకాశమిస్తున్నా.. రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని చాలామంది నేతలు అసంతృప్తితో ఉన్నారు. జూన్ 10న జరిగే రాజ్యసభ ఎన్నికలకు నేటి (24వ తేదీ) నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. రాష్ట్రం తరఫున కేసీ రామ్మూర్తి, నిర్మలా సీతారామన్‌ల పదవీ కాలం ముగియనుంది. ఈ ఇద్దరికీ మళ్లీ టికెట్ ఇచ్చే విషయం సస్పెన్స్‌గా మారింది. -
ఎంసెట్‌కు నాన్‌లోకల్ పోటీ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఎంసెట్ రాసేవారి సంఖ్య ఈసారి భారీగా పెరిగే అవకాశం ఉందని ఉన్నత విద్యామండలి వర్గాలు భావిస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువ మంది టీఎస్ ఎంసెట్‌కు హాజరయ్యే వీలుందని చెబుతున్నాయి. కరోనా తగ్గుముఖం పట్టడం, హాస్టళ్లు తెరవడంతో ఈ సంకేతాలు కనిపిస్తున్నాయని వివరించాయి. గత రెండేళ్లుగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంసెట్‌కు దరఖాస్తు చేసినా పరీక్ష రాసే వారి సంఖ్య దాదాపు 50 శాతం తగ్గిందని, ఇంజనీరింగ్‌లో చేరే వారి సంఖ్య కూడా 45 శాతం పడిపోయినట్టు ప్రైవేటు కాలే జీలు స్పష్టం చేస్తున్నాయి. ఈసారి ఈ సమస్య లేకపోవడంతో ప్రమాణాలున్న కాలేజీలు, యూనివర్సిటీ క్యాంపస్‌లో సీట్ల కోసం అభ్యర్థులు పోటీ పడే వీలుందని చెబుతున్నారు. ఎంసెట్, జేఈఈ కోసం శిక్షణ పొందే వారు హైదరాబాద్‌నే కేంద్రంగా చేసుకుంటున్నారు. ఇతర రాష్ట్రాలకు చెందిన వారూ ఇక్కడ చదువుతూనే ఎంసెట్, ఇతర పోటీ పరీక్షలకు శిక్షణ తీసుకుంటున్నారు. ఉద్యోగ రీత్యా స్థిరపడిన వారి పిల్లలు సైతం హైదరాబాద్‌లోని కాలేజీల వైపే మొగ్గు చూపుతున్నారు. కరోనాకు ముం దు మేనేజ్మెంట్ కోటా సీట్లలో ఏపీకి చెందిన విద్యార్థులు ఎక్కువగా చేరేవారు. ఇప్పుడూ ఇదే పరిస్థితి కనిపిస్తోందని ఓ కాలేజీ నిర్వాహకుడు తెలిపారు. 15 శాతం కోటాలో పోటీ...: తెలంగాణవ్యాప్తంగా 1.05 లక్షల ఇంజనీరింగ్ సీట్లు ఉంటే అందులో 70 వేల వరకు కన్వీనర్ కోటా కింద భర్తీ చేస్తారు. ఈ సీట్లలో 15 శాతం నాన్–లోకల్ కోటా ఉంది. ఇతర రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు ఈ కోటాలోనే పోటీ పడాల్సి ఉం టుంది. దీంతో ఈసారి పోటీ ఎక్కువ ఉండే వీలుందని ఎంసెట్ వర్గాలు అంటు న్నాయి. కొన్ని కోర్సులకు నాన్‌లోకల్స్ పోటీ వల్ల మేనేజ్మెంట్ కోటా విషయంలో యాజమాన్యాలు భారీగా డిమాండ్ చేసే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది. కరోనా వల్ల రెండేళ్ళుగా ఈసీఈ సహా సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ సీట్ల కోసం ఇతర రాష్ట్రాల అభ్యర్థులు పోటీ పడలేదు. టాప్ టెన్ కాలేజీల్లోనూ ఈ సీట్లకు పెద్దగా డిమాండ్ కనిపించ లేదు. ఈసారి కూడా కంప్యూటర్ కోర్సులనే ఇతర రాష్ట్రాల వారు కోరుతున్నారు. దీంతో ఏపీ నుంచి మేనేజ్మెంట్ కోటా సీట్లలో కంప్యూటర్ కోర్సులకే ప్రాధాన్యం ఉండే వీలుందని భావిస్తున్నారు. 2021 లో జరిగిన ఎంసెట్‌కు 2,51,604 మంది దరఖాస్తు చేస్తే, పరీక్షకు 2,27,00 మంది హాజరయ్యారు. ఇందులో 1,94, 550 మంది అర్హత సాధించారు. -
వీరికి ఐటీ రిటర్నుల నుంచి మినహాయింపు
న్యూఢిల్లీ: ఆదాయపన్ను రిటర్నుల దాఖలు విషయంలో స్థానికంగా నివసించని వారు, విదేశీ ఇన్వెస్టర్లకు వెసులుబాటు కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) ఉత్తర్వులు జారీ చేసింది. భారత్‌లో నివసించని వారు (కార్పొరేట్స్).. నిర్దేశిత ఫండ్‌లో పెట్టుబడులు మినహా ఎటువంటి ఆదాయాన్ని పొందని వారు.. గిఫ్టిసిటీలో ఆల్టర్నేటివ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ కేటగిరీ–3 కిందకు వచ్చే వారు రిటర్నులు దాఖలు చేయనక్కర్లేదని సీబీడీటీ తన నోటిఫికేషనలో తెలిపింది. అర్హత కలిగిన విదేశీ ఇన్వెస్టర్లు.. జీడీఆర్, రూపీ డినామినేటెడ్ బాండ్లు, డెరివేటివ్‌లు లేదా ఎంపిక చేసిన సెక్యూరిటీలు, ఐఎఫ్ఎస్సీలోని గుర్తింపు ఉన్న స్టాక్ ఎక్సేంజ్ల్లోని లిస్టెడ్ సెక్యూరిటీల్లో లావాదేవీలు నిర్వహించిన వారు రిటర్నులు దాఖలు చేయనవసరం లేదని సీబీడీటీ స్పష్టం చేసింది. 2020–21 ఆర్థిక సంవత్సరం నుంచి ఈ వెసులుబాటు అమల్లోకి వస్తుందని తెలిపింది. -
మీరు ప్రేమించే హీరోయిన్స్ అందరూ నాన్ లోకలే : ఆర్జీవీ
తెలుగు చిత్రపరిశ్రమలో ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలకు రంగం సిద్ధమవుతోంది. అయితే ఈసారి ఎన్నికలు రంజుగా సాగనున్నట్లు తెలుస్తోంది. సెప్టెంబర్‌లో జరగాల్సిన ఎన్నికలకు 3 నెలల ముందే వాతావరణం వేడెక్కింది. మా అధ్యక్షుడి స్థానం కోసం ప్రకాశ్ రాజ్, మంచు విష్ణు, జీవితా రాజశేఖర్, హేమ బరిలోకి దిగారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే టాలీవుడ్ మూడు వర్గాలుగా చీలిపోయినట్లు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రకాశ్ రాజ్ మెగాస్టార్ చిరంజీవి మద్దతును సంపాదించగా, విష్ణు సూపర్‌స్టార్ కృష్ణ, రెబల్‌స్టార్ కృష్ణంరాజుల మద్దతును కూడగట్టారు. ఇక ప్రకాశ్ రాజ్ ఇప్పటికే తన ప్యానల్ సభ్యులను ప్రకటించారు. ఈ క్రమంలో ‘కన్నడిగుడైన ప్రకాశ్‌రాజ్ ‘మా’ అధ్యక్షుడేమిటనే ‘లోకల్– నాన్ లోకల్’ చర్చ తెరపైకి వచ్చింది. కర్ణాటకలో పుట్టి పెరిగిన ప్రకాశ్ రాజ్ తెలుగు నటుల సంఘానికి అధ్యక్షత వహించడం ఏంటనే వాదన వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ప్రకాశ్ రాజ్‌కు మద్ధతుగా నిలిచారు. అతని నటన చూసి నాలుగు సార్లు ఈ దేశం అతన్ని శాలువా కప్పి జాతీయ అవార్డుతో సత్కరిస్తే నాన్ లోకల్ అనడం ఏంటని ప్రశ్నించారు. 'ముప్పై ఏళ్లుగా ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని, చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న ప్రకాశ్ రాజ్ నాన్ లోకలా' ? అని ప్రశ్నించారు. కర్ణాటక నించి ఏపీకి వచ్చిన ప్రకాశ్‌రాజ్ నాన్ లోకల్ అయితే,మహారాష్ట్ర నుండి ఎక్కడెక్కడికో వెళ్ళిన రజనీకాంత్ ఉత్తర ప్రదేశ్ నుంచి మహారాష్ట్ర కి వెళ్ళిపోయిన అమితాబ్ బచ్చన్ లోకలా అంటూ తనదైన స్టైల్లో పంచుల వర్షం కురిపించారు. ప్రస్తుతం ప్రకాశ్‌రాజ్‌పై ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్లు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముప్పై ఏళ్లుగా @prakashraj ఇక్కడే ఉండి తెలుగు నేర్చుకొని , చలం పుస్తకాలని మళ్ళీ తనే ముద్రించి , పెళ్ళాం పిల్లలతో ఇక్కడే ఉంటూ , తెలంగాణ లో ఒక గ్రామాన్ని దత్తత తీసుకొని , అక్కడున్న ఎంతో మంది ఆడవాళ్ళకి పని కల్పిస్తున్న వాడు నాన్ localaa??? #MaaElections — Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021 మీరందరూ ప్రేమించే హీరోయిన్స్ అందరూ non లోకల్ .. మైఖేల్ జాక్సన్ నాన్ లోకల్ .. bruce lee non local..రాముడు సీత కూడా నాన్ లోకల్ .. @prakashraaj also Non Local #MAAelections — Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021 కర్ణాటక నించి ఆంధ్రప్రదేశ్ వచ్చిన @prakashraaj నాన్ లోకల్ అయితే, గుడివాడ నించి చెన్నైకి వెళ్లిన రామారావుగారు, నాగేశ్వరరావుగారు …బుర్రిపాలెం నించి మద్రాస్ వెళ్లిన కృష్ణగారు,తిరుపతి నించి మద్రాస్ బయల్దేరిన మోహనబాబు గారు లోకలా ??? ఎలా ఎలా ఎలా ? #MaaElections — Ram Gopal Varma (@RGVzoomin) June 25, 2021 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_1721373393.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); చదవండి : ఆర్టిస్ట్‌లు లోకల్ కాదు.. యూనివర్సల్ MAA Elections 2021: ప్రకాశ్ రాజ్ ప్యానల్ సభ్యులు వీరే -
నా కులంపై దుష్ప్రచారం చేస్తున్నారు: పుష్ప శ్రీవాణి
సాక్షి, విజయనగరం: తన కులంపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని ఏపీ ఉప ముఖ్యమంత్రి పాముల పుష్ప శ్రీవాణి ఆవేదన వ్యక్తం చేశారు. నూటికి నూరు శాతం తాను ఎస్టీ కొండ దొర కులానికి చెందిన వ్యక్తిని అన్నారు. తన సోదరి స్పెషల్ డీఎస్సీ పోస్టును వెనక్కి తీసుకోవడంపై ఆమె స్పందించారు. ‘‘నాన్ లోకల్ కారణంగానే మా సోదరికి స్పెషల్ డీఎస్సీలో పోస్టు వెనుకకి తీసుకున్నారు. కులం కారణం కాదు. ఏ విషయం మీద తొలగించారన్నది ఎందుకు మీరు చెప్పడం లేదు. 2014 ఎన్నికల్లో నామినేషన్ దాఖలు చేసినప్పుడు ఎమ్మార్వో ఇచ్చిన కుల ధృవీకరణ పత్రాన్ని సమర్పించినందుకు రిటర్నింగ్ అధికారికి అనర్హత వేటు వేయాలని కొందరు ఫిర్యాదు చేశారు’’ అని పుష్ప శ్రీ వాణి తెలిపారు. ‘‘అయితే, ఎస్టీ కుల ధృవీకరణ పత్రం ఆర్డీవో కాకుండా ఎమ్మార్వో ఇవ్వచ్చొన్న నిబంధన ఉందని… ఇదే విషయం సంబంధిత రిటర్నింగ్ అధికారి వద్ద నుంచి లిఖిత పూర్వకంగా తీసుకున్నాం. దీనిపై విచారణ జరుగుతుంది. నిజాలు త్వరలోనే తేలుతాయి. రాజకీయంగా కొందరు నాపై ఆరోపణలు చేస్తున్నారే తప్ప.. వాళ్లకీ తెలుసు నేను ఏ తప్పు చేయలేదని. కానీ అబద్దాన్ని పది సార్లు చెప్పి నిజం అనిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. న్యాయం నావైపే ఉంటుందని ఆశిస్తున్నాను’’ అన్నారు పుష్ప శ్రీవాణి. చదవండి: గిరిజనులకు రక్షణగా ఎస్టీ కమిషన్: పుష్పశ్రీవాణి -
రాజంపేటలో స్థానికేతరుల మకాం
సాక్షి, రాజంపేట: రాజంపేటలో ఎన్నికలు ప్రశాంతంగా జరుగుతాయా అనే అనుమానాలు ఓటర్లలో వ్యక్తమవుతున్నాయి. ప్రధానంగా రాజంపేట నియోజకవర్గంలో స్థానికేతరులు భారీగా చొరబడినట్లు ప్రచారం జరుగుతోంది. పక్క నియోజకవర్గమైన రైల్వేకోడూరు నుంచి గత నెల నుంచి రాజంపేట టౌన్, నందలూరుతో వివిధ మండలాల్లో ఒక వర్గం చేరినట్లు తెలుస్తోంది. ఈ వర్గం ప్రతినిధుల కనుసన్నల్లోనే డబ్బు, మద్యం యథేచ్ఛగా పంపిణీ జరుగుతున్నా పోలీసులు, ఎన్నికల (ఓ సామాజికవర్గం) అధికారులు పెద్దగా దృష్టి సారించలేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. ప్రతిపక్షపార్టీకి చెందిన వారినే టార్గెట్ చేసుకొనే ఆకస్మికదాడులు, కేసులో బనాయిస్తున్నారనే అపవాదును ఇప్పటికే పోలీసులు మూటకట్టుకున్నారు. అధికారపార్టీవైపు వారు కన్నెత్తిచూడటంలేదన్న విమర్శలున్నాయి. నాన్లోకల్తోపాటు అసాంఘికశక్తులు దిగిపోయారా? పక్క నియోజకవర్గం నుంచి స్థానికేతరులతోపాటు అసాంఘికశక్తులు వచ్చారనే ప్రచారాలు ఓటర్లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ప్రతి మండలంలో స్ధానికేతరులతో పాటు అసాంఘికశక్తులు రంగంలో ఇప్పటికే దిగిపోయినట్లు తెలుస్తోంది. ఓవర్గంతో కలిసిపోవడమే కాకుండా అధికారపార్టీ నాయకుల అండదండలతో స్థ్ధానికంగా పెత్తనం సాగిస్తున్నారు. పోలింగ్ రోజున ఎటువంటి దుశ్చర్యలకు దిగుతారో అనే ఆందోళన వ్యక్తమవుతోంది. గతంలో కర్ణాటక నుంచి అక్రమమద్యం దిగుమతి చేసిన తరహాలో ఈసారి కూడా రప్పించేందుకు ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతున్నట్లు తెలుస్తోంది. ఎక్సైజ్ అధికారులు స్ధానికంగానే మద్యం సరఫరాపై దృష్టి సారించారు. కానీ కర్ణాటక నుంచి తెప్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్న వైనాలపై దృష్టి సారించాల్సి ఉంది. నియోజకవర్గంలో స్ధానికేతరుల ఓటర్ల నమోదుపై అనుమానాలు.. పొరుగు ప్రాంతాలకు చెందిన స్ధానికేతరులు అధికారపార్టీకి అండగా నిలిచేందుకు వచ్చినట్లు తెలుస్తోంది. రాజంపేటలో నాన్‌లోకల్ అరాచకశక్తులు చెలరేగిపోయే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయనే భయం స్ధానికుల్లో నెలకొంది. రెండువేల నుంచి మూడు వేల వరకు స్ధానికేతరులను కొంతమంది రెవెన్యూ సిబ్బంది సహకారంతోఓటర్లుగా చేర్చినట్లు ఎన్నికల సంఘాలకు ఫిర్యాదులు వెళ్లాయి. వీరు ఓటింగుకు వచ్చిన సందర్భంలో బూత్‌లలో అభ్యంతరాలు వ్యక్తమయ్యే పరిస్ధితుల్లో ఘర్షణలకు దారితీసే అవకాశముందని నిఘా వర్గాలు అనుమానిస్తున్నాయి. ఎన్నికల సంఘం, పోలీసుశాఖ దృష్టి సారించాలని, వెనువెంటనే ఈ విషయంపై జిల్లా కలెక్టరు, జిల్లా ఎస్పీ దృష్టి సారించాలని ఓటర్లు కోరుతున్నారు. -
సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..!
సాక్షి, ఉలవపాడు (ప్రకాశం): ఎన్నికల కోడ్ వచ్చింది. గ్రామాల్లో ఎండలు పెరగడంతోపాటు రాజకీయ వేడి పెరిగింది. ఏ టీ దుకాణం వద్ద చూసినా, రచ్చబండ వద్ద అయినా ఎన్నికలకు సంబంధించిన చర్చే. కాగా రెండు రోజుల నుంచి గెలుపు, ఓటములు పార్టీ అభ్యర్థులపై ప్రజల మధ్య చర్చ నడుస్తోంది. ఈ ఎన్నికల్లో లోకల్, నాన్‌లోకల్ సెంటిమెంట్ తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని గ్రామాల్లో చర్చలు చెబుతున్నాయి. కందుకూరు నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్ సీపీ అభ్యర్థి మానుగుంట మహీధరరెడ్డి స్వగ్రామం నియోజకవర్గ పరిధిలోని మాచవరం గ్రామం. తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోతుల రామారావు స్వగ్రామం కొండపి నియోజకవర్గ పరిధిలోని టంగుటూరు గ్రామం. వీరి స్వగ్రామాలు ఇప్పుడు రాజకీయ చర్చకు దారి తీశాయి. ఇటీవల వైఎస్సార్ సీపీలోకి భారీగా వలసలు చోటుచేసుకున్నాయి. పొరగు పెత్తనం ఇక్కడ ఎక్కువ అయిందనే భావన ప్రజల్లోనూ, నాయకుల్లోనూ ఉంది. దీంతో వలసలు అధికమయ్యాయి. కందుకూరు... టంగుటూరు అయిందనే భావనా ? పేరుకు కందుకూరు నియోజకవర్గం అయినా గత మూడేళ్లుగా ఈ ప్రాంత నాయకులు అందరూ టంగుటూరుకు వెళ్లి పనులు చేయించుకునేవారు. సమావేశాలు, పింఛన్లు, లోన్ల ఎంపిక కూడా అక్కడ నుంచి జరిగింది. ఈ ప్రభావం ఇప్పుడు ఎన్నికల్లో భారీగా పడుతుందని అందుకే గ్రామాల్లో లోకల్, నాన్‌లోకల్ చర్చ ఎక్కువ నడుస్తోంది. ఇక్కడ స్థానికుడు, మాజీ ఎమ్మెల్యే దివిశివరాం ఉన్నా కూడా కేవలం ఆర్థికంగా బలం ఉందని పోతుల రామారావుకు టికెట్ కేటాయించారని టీడీపీ నాయకుల్లో కూడా అసంతృప్తి ఉంది. నియోజకవర్గ టీడీపీ నాయకుల్లో కూడా శివరాం అయితే లోకల్ కదా ఇక్కడే ఉంటాడు అనే భావన ఉంది. ఆయనకు టికెట్ ఇవ్వలేదు. బయట వ్యక్తుల పెత్తనం ఇక్కడ ఎందుకు అనే ఆలోచన పాత టీడీపీ కార్యకర్తల్లో ఉంది. కీలకం కానున్న సెంటిమెంట్.. ఈ ఎన్నికల్లో సెంటిమెంట్ తీవ్రంగా పనిచేసే అవకాశం ఉందని స్థానికుల అభిప్రాయం. మహీధర్‌రెడ్డి నియోజకవర్గంలో ఎప్పుడూ అందుబాటులో ఉంటారు. పోతుల రామారావు నియోజకవర్గంలో కాకుండా టంగుటూరులో ఉంటారు. ఆయనని కలవాలంటే నాయకులు అక్కడికి వెళ్లి కలవాలి. ఎన్నికలు నెలలోపే ఉండడంతో ఈ చర్చలు వాడీవేడిగా సాగుతున్నాయి. -
నాన్ లోకల్
-
జిల్లాలో నిరంతరం కార్డన్‌సెర్చ్
సదాశివపేట(సంగారెడ్డి): జిల్లా వ్యాప్తంగా స్థానికేతరులు ఎక్కువగా నివసిస్తున్న పట్టణాల పరిధిలోని కాలనీల్లో నిరంతరం కార్డన్‌సెర్చ్ నిర్వహిస్తామని జిల్లా ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. గురువారం తెల్లవారుజామున నాలుగు గంటలకు పట్టణ పరిధిలోని సిద్దాపూర్ కాలనీలో 150 మంది పోలీసు సిబ్బందితో కార్డన్‌సెర్చ్ నిర్వహించారు. ప్రతీ ఇంటిలో నివసిస్తున్న ప్రజలను నిద్రలేపి వారి ఆధార్, రేషన్ తదితర వివరాలను తెలుసుకున్నారు. వాహనాలను తనిఖీ చేశారు. ఈ కార్డన్‌సెర్చ్ ఉదయం 7 గంటల వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ స్థానికేతరులు ఎక్కువగా నివసిస్తున్న కాలనీలపై ప్రత్యేక దృష్టిసారించడమే కార్డన్‌సెర్చ్ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. స్థాని కేతరులు అద్దె కావాలని వస్తే వారి గుర్తింపుకార్డులతో తెలుసుకుని అద్దెకు ఇవ్వాలని సూచించారు. ఎవరిపైనైనా అనుమానం వస్తే వెంటనే స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. సిద్దాపూర్ కాలనీలో నిర్వహించిన కార్డన్‌సెర్చ్‌లో 53 బైక్‌లు, 6 ఆటోలను సరైన పత్రాలు లేని కారణంగా సీజ్ చేశామన్నారు. సరైన ధ్రువపత్రాలు పోలీస్ స్టేషన్లో చూపించి తమ తమ వాహనాలను తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి డీఎస్పీ శ్రీనివాస్‌కుమార్, ఇన్స్పెక్టర్లు సురేం దర్‌రెడ్డి, నరెందర్, రా మకృష్ణారెడ్డి, తిరుపతిరాజు, 14 మం ది ఎస్సైలు, ఏఎస్సైలు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
స్థానికేతర ప్రాతినిధ్యం?
విశ్లేషణ బాలీవుడ్ నటుడు అనుపమ్‌ఖేర్ గురించి తాను చేసినట్లు చెబుతున్న వ్యాఖ్యలను ‘తప్పుగా నివేదించార’ని నటుడు నసీరుద్దీన్ షా పేర్కొన్నట్లు ప్రముఖ ఇంగ్లిష్ పత్రిక పేర్కొంది. కశ్మీర్ పండిట్ల సమస్యను ఖేర్ ఎత్తిపడుతున్నట్లు నసీరుద్దీన్ చెప్పి ఉండవచ్చు. ‘కశ్మీర్లో ఎన్నడూ నివసించని వ్యక్తి కశ్మీర్ పండిట్ల కోసం పోరాటం ప్రారంభించారు. ఉన్నట్లుండి ఆయన నిర్వాసితుడిలాగా మారి పోయారు.’ నసీరుద్దీన్ ఈ విధంగానే చెప్పి ఉన్నట్లయితే, నాకు తీవ్ర అభ్యం తరం ఉంది. కశ్మీర్‌ను మనం భారత్‌లో ఒక భాగంగా చూస్తున్నప్పుడు, ఆ సమస్యను ఏవరయినా చేపట్టినప్పుడు దాంట్లో తప్పేముంది? గుజరాత్లో, తర్వాత ఉత్తరప్రదేశ్‌లో ముస్లింల గురించి మనం పట్టించుకుంటున్నందున, కశ్మీర్ పండిట్ల విధి గురించి మీరూ నేను కూడా అదేవిధంగా పట్టించుకోవలసి ఉంటుంది. ‘కశ్మీర్ పండిట్ల సమస్యలపై పోరాడటానికి మీరు కశ్మీరీ అయివుండనవసరం లేదని’ దాంట్లో ఏ ప్రమాదాన్నీ తాను చూడటం లేదని మధుర్ భండార్కర్ వ్యాఖ్యా నించినట్లు ఆ ఇంగ్లిష్ పత్రికే పేర్కొంది. ఆయన మాట ఎంత చక్కగా ఉందో! బయటివారు, స్థానికులకు సంబంధించిన వ్యవహారం చేతులు దాటిపోతోంది. నాగాలాండ్ వంటి చోట్ల ప్రజలు మనల్ని భారతీయులమని, తాము మాత్రం భిన్నమైన వారిమని పరిగణిస్తుండటం ఒక వాస్తవికతగానే ఉంది. మహారాష్ట్రలో మరాఠీ వర్సెస్ మరాఠీయేతరుల సమస్య ఉండనే ఉంది. ఒక సమయంలో ఇది హిందీ మాట్లాడే ప్రజలను భయాందోళనలకు గురిచేసి నాసిక్ నుంచి పారిపోయేలా చేసింది. దీంతో పారిశ్రామిక కార్యకలాపాలు దాదాపుగా స్తంభించిపోయినంత పనయింది. స్థానికుల ప్రయోజనాల కోసం స్థానికేతరులు లేదా బయటి వారు పడుతున్న దుస్థితిని ఇది వాస్తవంగానే వివరించాల్సి ఉంది. కానీ మాటల యుద్ధం జరుగుతున్నప్పుడు, చిత్రసీమకు చెందిన అశోక్ పండిట్ అనే మరో కశ్మీరీ పండిట్, తన వంతుగా అగ్నికి ఆజ్యం పోశారు. ‘మీరట్‌కు చెందిన నసీరుద్దీన్ షా.. గుజరాత్ అల్లర్లపై తన గొంతు పెంచుతున్నారే’. ఇదంతా మీడియా దృష్టికి రావడమే కాదు.. సోషల్ మీడియాలో దుమారం లేచింది కూడా. కానీ అసలు సమస్యలు మాత్రం నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. చాలా కాలం క్రితమే అన్యాక్రాంతమైన లేదా దాదాపుగా విధ్వంసానికి గురైన తమ సొంత ఇళ్లకు తిరిగి రావడంపై కశ్మీర్ పండిట్లు చెందుతున్న ఆందోళనను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. నసీరుద్దీన్ షా ప్రకటనను కానీ, అశోక్ పండిట్ చేసిన అసంబధ్ద వ్యాఖ్యను కానీ పరిశీలించి నట్లయితే, దేశం ఉప జాతీయవాదం కోసం లెక్కలు తేల్చుకోవలసి ఉంటుంది. రాష్ట్రాల ఆవిర్భావానికి విస్తృతమైన భాషా కారణాల్లో ఇది వేళ్లూనుకుని ఉంది. ఇక భాష విషయానికి వస్తే అది ఒక ప్రజాబృందం సంస్కృతితో ముడిపడి ఉంది. తన అభిప్రాయాన్ని వివరించడంలో లేదా కశ్మీర్ పండిట్ల గురించి ఆందోళన వ్యక్తపర్చటంలో ఖేర్ ఏ తప్పూ చేయలేదు. భారత సంతతి ప్రజలు మరొక దేశంలో మూడో స్థాయి పౌరులుగా పనిచేస్తుండటాన్ని మన గర్వకారణంగా భావిస్తున్నట్లయితే, తమ సొంత దేశంలోనే శరణార్థులుగా ఉంటున్న ప్రజలకోసం నెత్తురు కార్చడం సరైందే. రెండు దశాబ్దాలకు ముందు మిలిటెంట్లు దాదాపు 3 లక్షల మందిని తరిమేశారు. వారి హృదయం నేటికీ లోయలోనే ఉంది కానీ మళ్లీ అక్కడకి వెళ్లి స్థిరపడటానికి వారికి ఇచ్ఛ కలగటం లేదు. కశ్మీర్లో మిలిటెంట్లు తమదైన ప్రభావం కలిగి ఉన్నారు కాబట్టి అక్కడ జీవితం కష్టభూయిష్టంగానే దాదాపు బహిష్కార స్థితిలోనే ఉంటుంది. సిమ్లాలో పుట్టి ముంబైలో నివసిస్తున్న కశ్మీర్ ప్రాంతానికి చెందిన వ్యక్తి తన కమ్యూనిటీ వేదనపై గొంతు విప్పలేని నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు, తమిళనాడుకు చెందిన పి.చిదంబరం, రాజ్యసభలో మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించగలగడం (చట్టాలు దానికి వీలు కల్పించి నప్పటికీ) ఎలా సబబు అవుతుంది? అలాగే ఢిల్లీకి ప్రాతినిధ్యం వహించిన కపిల్ సిబల్ ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కు, మునుపటి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిధ్యం వహించిన జైరాం రమేష్ ప్రస్తుతం కర్ణాటకకు ప్రాతినిధ్యం వహించడం ఎలా సబబు? హైదరాబాద్ నివాసి అయిన నిర్మలా సీతారామన్ కర్ణాటక నుంచి, నెల్లూరుకు చెందిన వెంకయ్యనాయుడు గుజరాత్ నుంచి రాజ్యసభకు ఎలా ప్రాతినిధ్యం వహించగలరు? దేశానికి రెండుసార్లు ప్రధానిగా వ్యవహరించిన వ్యక్తి స్థానిక చిరునామాను పొందడానికి ఒక ఇంటిని అద్దెకు తీసుకోవలసి వచ్చింది. పండిట్ల సమస్య నుంచి అనుపమ్ ఖేర్‌ను దూరం జరగాలని కోరుతున్నవారు తమ ప్రశాంతతను కూడా నిలుపుకోవలసి రావచ్చు. తన వ్యాఖ్యలకుగాను అనుపమ్‌ఖేర్‌ను ఎవరూ మందలించాల్సిన అవసరం లేదు. వ్యాసకర్త: మహేష్ విజాపుర్కార్, సీనియర్ పాత్రికేయులు ఈమెయిల్: mvijapurkar@gmail.com -
నాన్లోకల్పై ప్రతిష్టంభన
హైదరాబాద్: ఏపీలో డీఎస్పీ నాన్‌లోకల్ కోటాపై ప్రతిష్టంభన నెలకొంది. నాన్‌లోకల్ కోటా రాష్ట్రంలోని 13 జిల్లాల వారికే వర్తిస్తుందా? ఇతర రాష్ట్రాల వారికి కూడా వర్తిస్తుందా? అన్నదానిపై ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు.ఇతర రాష్ట్రాల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలో, లేదో తేల్చుకోలేకపోతున్నారు. ఈ విషయమై విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస రావును వివరణ కోరగా, ఈ అంశంపై జీఏడీని వివరణ కోరినట్లు తెలిపారు. త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తామని మంత్రి చెప్పారు. ** -
వారు నాన్.. లోకల్!
రిమ్స్ క్యాంపస్, న్యూస్‌లైన్: ట్రామాకేర్ పోస్టుల డ్రామాకు ఇప్పట్లో తెర పడేలా లేదు. టీవీ సీరియల్లా తెగ ‘సాగు’తోంది. ఒక్కో రోజు ఒక్కో ఎపిసోడ్ తెరపైకి వస్తోంది. అధికారులను లీలలను.. అభ్యర్థులకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కడుతోంది. మొదట్లో రోస్టర్ మాయాజాలాన్ని వెలుగులోకి తెచ్చిన ‘సాక్షి’.. ఆ వెంటనే వయసు మీరిన వ్యక్తిని ఎంపిక చేసిన తీరును ఎండగట్టింది. దాంతో తడబడిన రిమ్స్ అధికారులు తప్పులను సరిదిద్దుకుంటామని ప్రకటించారు. అయితే ఈ పోస్టుల భర్తీలో జరిగిన అక్రమాలకు అంతులేదన్నట్లు తాజాగా నాన్ లోకల్ అభ్యర్థులను లోకల్‌గా చూపించిన ఎంపిక చేసిన ఉదంతం వెలుగు చూసింది. అభ్యర్థుల ఎంపికలో అవకతవకలు ఎక్కడ బయటపడతాయోనన్న భయంతో రిమ్స్ అధికారులు మెరిట్ జాబితా లేకుండా తుది జాబితా విడుదల చేసేశారు. దీనిపై ‘సాక్షి’లో కథనాలు రావడంతో స్పందించినకలెక్టర్ ఆదేశాల మేరకు మెరిట్ జాబితా విడుదల చేశారు. మెరిట్, తుది జాబితాలను తరచి చూసిన కొద్దీ అవకతవకలు బయటపడుతున్నాయి. నర్సింగ్ అర్డర్లీ విభాగంలో 9 పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానించగా 377 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో 35 మందిని అనర్హులుగా గుర్తించి, మిగిలిన 342 మందిని మెరిట్ జాబితాలో చేర్చా రు. కాగా తొమ్మిది పోస్టుల్లో ఒకటి బీసీ-సి(డబ్ల్యు) కేటగిరీకి కేటాయించగా.. అభ్యర్థులు లేకపోవడంతో దాన్ని ఖాళీగా ఉంచి, 8 మందిని ఎంపిక చేస్తూ తుది జాబి తా విడుదల చేశారు. ఈ ఎనిమిది మంది ఎంపికలోనూ అవకతవకలు జరిగినట్టు తెలుస్తోంది. మెరిట్ జాబితా, తుది జాబితాల్లో అభ్యర్థుల వివరాల్లో తేడాలు ఉండటం ఈ అవకతవకలను బట్టబయలు చేస్తున్నాయి. మెరిట్లో ఒకలా.. ఎంపికలో మరోలా.. మెరిట్ జాబితాలో నాన్‌లోకల్‌గా ఉన్న అభ్యర్థులు తుది ఎంపిక జాబితాకొచ్చేసరికి లోకల్‌గా మారిపోయి ఉద్యోగాలను తన్నుకుపోయారు. మెరిట్ జాబితాలో 4వ స్థానంలో ఉన్న రేఖా సురేష్(రేకమయ్యపాలెం గ్రామం, రెయ్యిపాలెం పోస్టు, భీమునిపట్నం, విశాఖపట్నం) చిరునామా ప్రకారం నాన్‌లోకల్‌గా పేర్కొన్నారు. తుది జాబితాకొచ్చేసరికి అతన్ని లోకల్‌గా మార్చేసి ఎంపిక చేశారు. అలాగే మెరిట్ జాబితాలో 10వ స్థానంలో ఉన్న శీరపు శారద (కొత్త బైపురెడ్డిపాలెం, బలిఘట్టం పోస్టు, నర్సీపట్నం మండలం, విశాఖపట్నం) చిరునామా ప్రకారం నాన్‌లోకల్‌గా పేర్కొన్నారు. తుది జాబితాలో ఈమెను కూడా లోకల్‌గా చూపించి ఎంపిక చేశా రు. నాన్‌లోకల్ అభ్యర్థులు లోకల్ ఎలా అయ్యారో రిమ్స్ అధికారులే చెప్పాలి. అధికారుల మాయాజాలంతో ఉద్యోగం కోల్పోయిన అభ్యర్థి మెరిట్ జాబితాలో ఐదో స్థానంలో ఉన్న లోకల్ అభ్యర్థి అయిన ఎచ్చెర్ల మండలం సనపలవానిపేట గ్రామానికి చెందిన సనపల చక్రధరరావు అధికారుల మాయాజాలంలో చిక్కుకొని ఉద్యోగావకాశం కోల్పోయాడు. రోస్టర్ పాయింట్ 7 కింద ఓపెన్ కాంపిటీషన్లో ఎంపిక నిర్వహించిన అధికారులు ఐదో స్థానంలో ఉన్నప్పటికీ లోకల్ అయిన చక్రధరరావును నిబంధనల ప్రకారం ఎంపిక చేయాల్సి ఉంది. అయితే నాలుగో స్ధానంలో ఉన్న నాన్‌లోకల్ అభ్యర్థి రేఖా సురేష్‌ను లోకల్‌గా మార్చి ఉద్యోగం కట్టబెట్టారు. తనకు న్యాయం చేయాలని ఆయన కోరుతున్నాడు. ఈ మేరకు కలెక్టర్ సౌరభ్‌గౌర్‌ను గ్రీవెన్స్‌సెల్‌లో కలసి జరిగిన అన్యాయాన్ని వివరించాడు. రెండో అభ్యర్థి విషయంలోనూ ఇదే రీతిలో జరిగింది.