one year administration
-
'ఏడాది పాలనలో సీఎంగా చంద్రబాబు విఫలం'
శ్రీకాకుళం: తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టి ఏడాది పూర్తి అయినప్పటికీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల అమలులో సీఎంగా చంద్రబాబు నాయుడు విఫలమయ్యారని వైఎస్సార్సీపీ నేత ధర్మాన కృష్ణదాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో పరిస్థితి అధ్వానంగా ఉందని, ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారని ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటుకు నోటు ఇవ్వజూపి పక్కాగా దొరికిపోయి కూడా ప్రజలను మభ్యపెట్టేందుకు యత్నించడం హాస్యాస్పదమన్నారు. బాబు నీతిమంతుడైతే సీఎం పదవికి తక్షణమే రాజీనామా చేయాలని ధర్మాన డిమాండ్ చేశారు. రాజధాని నిర్మాణం కోసం చేసిన భూమిపూజకు ప్రతిపక్షాలను పిలవకుండా తన కుటుంబ వ్యవహారంలా చంద్రబాబు వ్యవహరించడం దారుణమన్నారు. దొంగల పార్టీ ఎవరిదో ఇప్పటికే బయటపడిందని ఎద్దేవా చేశారు. వైఎస్సార్సీపీలో బొత్స చేరికపై విమర్శించే స్థాయి అచ్చెన్నకు లేదన్నారు. అనేక మంది కాంగ్రెస్ పార్టీ నాయకులను టీడీపీలో చేర్చుకుని మంత్రి పదవులు కట్టబెట్టారని, ఇపుడు కాంగ్రెస్ పార్టీ నాయకులను విమర్శించడం 'గురివిందగింజ' సామెతలా ఉందని ధర్మన కృష్ణదాస్ విమర్శించారు. -
కేసీఆర్ ఏడాది పాలనలో అంతా మోసమే: మంద కృష్ణ
హైదరాబాద్: ఏడాది పాలనలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలను సీఎం కేసీఆర్ మోసం చేశారని ఎమ్మార్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. తెలంగాణ ఏర్పడితే దళితుడే ముఖ్యమంత్రి అని ఎస్సీలను మోసం చేశారని, కేబినెట్లో ఒక్క మాదిగ, మాల వర్గానికి చెందిన వారికి కూడా చోటు కల్పించలేదని విమర్శించారు. అలాగే కేబినెట్లో ఒక్క మహిళకూ చోటివ్వకుండా అవమానించారన్నారు. బుధవారం ఇక్కడ ఆయన తెలంగాణ జర్నలిస్టు యూనియన్ మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కేబినెట్లో మహిళలకు ప్రాతినిధ్యం కల్పించనందుకు నిరసనగా ఈ నెల 5న చలో హైదరాబాద్ పేరిట మహిళా గర్జనను నిర్వహించనున్నట్లు తెలిపారు. తొలి ఏడాది పాలనలో గర్వించడానికి ఏమీ లేకపోగా అనేక మోసాలు, వైఫల్యాలు చోటుచేసుకున్నాయన్నారు. అమరుల త్యాగాలు, ఎన్నో ఆశలు, ఆకాంక్షలతో రాష్ట్రం సాధించుకున్న ఆనందం అట్టడుగువర్గాల్లో ఆవిరై పోయిందని మంద కృష్ణ అన్నారు. వచ్చే తెలంగాణ దొరల పాలు కాకూడదని 2011లోనే తాను హెచ్చరించానని, అయినా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కేసీఆర్ హామీల భ్రమల్లో పడిపోయారన్నారు. మిషన్‌కాకతీయలో భాగంగా 46 వేల చెరువుల గురించి తెలుసుకోగలిగిన వారికి, తెలంగాణ కోసం అమరులైన 1300 మందిని గురించి గుర్తించేందుకు ఏడాది సమయం సరిపోలేదా అని ప్రశ్నించారు. -
ఆ లేఖలో అన్నీ అబద్ధాలే: ఆజాద్
-
'ఐదేళ్ల కోసం మాకు అధికారాన్ని ఇచ్చారు'
-
'ఐదేళ్ల కోసం మాకు అధికారాన్ని ఇచ్చారు'
హైదరాబాద్ : గడిచిన ఏడాది పాలన సంతృప్తికరంగా సాగిందని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు అన్నారు. బీజేపీ ఏడాది పాలనపై ఆయన శుక్రవారమిక్కడ మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రజల ఆశయాల మేరకు పని చేశామని తాము భావిస్తున్నామన్నారు. ప్రధాని మోదీ నేతృత్వంలో దేశం కొత్త పుంతలు తొక్కుతుందని వెంకయ్య ఈ సందర్భంగా తెలియజేశారు. ప్రజలు తమకు ఐదేళ్ల కోసం అధికారం ఇచ్చారని, గత పదేళ్ల అవలక్షణాలను తొలగించటమే ప్రధాన లక్ష్యమన్నారు. మోదీ వేసే ప్రతి అడుగు పేదరిక నిర్మూలన వైపేనని వెంకయ్య చెప్పారు. పేదల జీవితాల్లో వెలుగు నింపాలన్నదే తమ లక్ష్యమన్నారు. 2022 నాటికి అందరికీ ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నదే తమ లక్ష్యంగా చెప్పారు. -
ఆ లేఖలో అన్నీ అబద్ధాలే: ఆజాద్
హైదరాబాద్ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏడాది పాలనపై కాంగ్రెస్ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ పెదవి విరిచారు. ఏడాది పాలనపై మోదీ ప్రజలకు రాసిన లేఖలో అన్నీ అబద్ధాలేనని ఆయన అన్నారు. ధరలు తగ్గాయనీ మోదీ చెబుతున్నది వాస్తవం కాదన్నారు. రైల్వే ప్రయాణ ఛార్జీలు, సరుకు రవాణా ఛార్జీలు పెంచారని ఆజాద్ విమర్శించారు. మోదీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, ధరలు తగ్గాయని మోదీ అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అంతర్జాతీయంగా పెట్రో ధరలు తగ్గినా...దేశంలో మాత్రం తగ్గలేదన్నారు. పెట్రోల్ ధర పెంచటంతో ప్రజలపై భారం పడిందన్నారు. ధరలు తగ్గాయన్న ప్రభుత్వ వాదనలో ఏమాత్రం నిజం లేదన్నారు. -
'జూన్ 2న విజయవాడకు తరలండి'
హైదరాబాద్: "వచ్చే నెల (జూన్) 2న ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉద్యోగులు, ఉన్నతాధికారులెవరూ హైదరాబాద్‌లో ఉండటానికి వీల్లేదు. రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా జూన్ 2న విజయవాడ మున్సిపల్ స్టేడియంలో ప్రధాన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాల్గొంటారు. దీనికి నవ నిర్మాణ దీక్ష అనే పేరు పెట్టారు. ఈ నవ నిర్మాణ దీక్షకు హైదరాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఐఏఎస్లందరూ తమ ఉద్యోగులతో కలిసి విజయవాడ మున్సిపల్ స్టేడియానికి జూన్ 2న ఉదయం 9 గంటలకు చేరుకోవాలి" అని ఆ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద ర్శి ఐవైఆర్ కృష్ణారావు ఆదేశించారు. ఈ మేరకు సీఎస్ బుధవారం ప్రత్యేకంగా సర్క్యులర్ జారీ చేశారు. 'సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొన్న వారిని ముఖ్యమంత్రి సత్కరిస్తారని పేర్కొన్నారు. అదే విధంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లో కూడా నవ నిర్మాణ దీక్ష పేరుతో ర్యాలీలు, కార్యక్రమాలు నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లకు ఆ సర్క్యులర్‌లో సూచించారు. జూన్ 2న నవ నిర్మాణ దీక్ష తరువాత 3 నుంచి 7వ తేదీ వరకు "జన్మభూమి - మా ఊరు" కార్యక్రమం నిర్వహించాలని, 8న బహిరంగ సభలు ఏర్పాటు చేయాలని సీఎస్ అందులో పేర్కొన్నారు.