Ozone
-
హైదరాబాద్ ప్రజలకు ఊపిరి ఆడట్లే.. కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: గ్రేటర్లో ట్రాఫిక్ రద్దీలో వాహనాలు వదులుతోన్న కాలుష్యంతో గ్రేటర్లో ‘భూస్థాయి ఓజోన్ (పొగ కారణంగా విడుదలయ్యే వాయువు)’ మోతాదు ఈ ఏడాది మార్చి–మే మధ్యకాలంలో అనూహ్యంగా పెరిగింది. మూడు నెలల్లో సుమారు 43 రోజులపాటు భూస్థాయి ఓజోన్ మోతాదు పరిమితులు దాటింది. దీంతో ఆస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో సతమతమయ్యే వారి సంఖ్య పెరిగినట్లు తాజా నివేదికలో వెల్లడించింది. సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్మెంట్ గత మూడేళ్లుగా వేసవిలో భూస్థాయి ఓజోన్ మోతాదుపై ఆరు నగరాల డేటాను పరిశీలించింది. ఇందులో ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా మెట్రో నగరాలు మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో గ్రేటర్ సిటీ నాలుగోస్థానంలో నిలవడం గమనార్హం. వాహనాల నుంచి వెలువడుతోన్న కాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సిటీజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయని ఈ నివేదిక తెలిపింది. ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలియడంతోపాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహించిందని పేర్కొంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడని పరిస్థితిని ఎదుర్కొన్నట్లు స్పష్టంచేసింది. సాధారణంగా ఘనపు మీటరుగాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు.. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 మైక్రోగ్రాములుగా నమోదయినట్లు ఈ నివేదిక వెల్లడించింది. చదవండి: బంజారాహిల్స్: ఖరీదైన కార్లే లక్ష్యంగా ట్రాఫిక్ పోలీసుల తనిఖీలు భూస్థాయి ఓజోన్‌తో తలెత్తే అనర్థాలివే... ►అస్తమా, బ్రాంకైటిస్‌తో సతమతమవడంతోపాటు ఊపిరాడని పరిస్థితి ►గొంతు నొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం. ►ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం. కట్టడి ఇలా.. ►ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్లు ధరించాలి. ►కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయుకాలుష్యం, భూస్థాయి ఓజోన్ వల్ల కలి గే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ►కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. ►గ్రేటర్ పరిధిలో ప్రజా రవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ►పతీ వాహనాని కి ఏటా పొల్యూషన్ చెక్ పరీక్ష లను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు వేయాలి. ►ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. -
ఓజోన్ కాలుష్యంతో ఉక్కిరిబిక్కిరి
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ పరిధిలో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూనే ఉంది. నిత్యం రోడ్డెక్కుతున్న లక్షలాది వాహనాల పొగ కారణంగా భూస్థాయి ఓజోన్ మోతాదు అనూహ్యంగా పెరుగుతోంది. ట్రాఫిక్ రద్దీ అత్యధికంగా ఉండే సమయాల్లో.. ప్రధానంగా ఉదయం 9 నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ పరిస్థితి అధికంగా ఉన్నట్లు పీసీబీ తాజా అధ్యయనంలో తేలింది. ఈ పరిణామంతో నగరవాసులు అస్తమా, బ్రాంకైటిస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఊపిరాడక సతమతం.. వాహనాల నుంచి వెలువడుతున్న కాలుష్య ఉద్గారాలతో పాటు ఓజోన్ వాయువులు.. గాలిలోని నైట్రోజన్ ఆక్సైడ్స్, ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలియడంతో పాటు సూర్యరశ్మి ప్రభావంతో భూఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకొన్న ప్రయాణికులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ నగరంలోని ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే సుమారు వంద కూడళ్లలో ఘనపు మీటరు గాలిలో 120 నుంచి 150 మైక్రోగ్రాములుగా నమోదవుతుండడంతో పలు అనర్థాలు తలెత్తుతుండడం గమనార్హం. ఓజోన్‌తో నష్టాలివే.. ♦శ్వాసకోశ వ్యాధులు, పొడిదగ్గు, బ్రాంకైటిస్‌కు కారణమవుతున్నాయి. చికాకు, అసహనం, శ్వా స తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తుతోంది. తలనొప్పి, పార్శ్వపు నొప్పి హేతువవుతోంది.మోతా దు క్రమంగా పెరుగుతుంటే ఊపిరితిత్తుల క్యాన్సర్లు పెరిగే ప్రమాదం పొంచి ఉంది. ♦ ఇటీవల నగరంలో శ్వాసకోశ సమస్యలు, అస్త మా, క్రానిక్ బ్రాంకైటిస్, సైనస్ సమస్యలు పెరగడానికి ప్రధాన కారణం వాయుకాలుష్యమే. ఉపశమనం ఇలా.. ♦ ఇంటి నుంచి బయటికి వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్క్‌లు, హెల్మెట్లు ధరించాలి. కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగించడం ద్వారా వాయు కాలుష్యం, భూస్థాయి ఓజోన్‌తో కలిగే దుష్ప్రభావాలను కొంతమేర నివారించే అవకాశాలుంటాయని వైద్యులు చెబుతున్నారు. ♦ కాలంచెల్లిన వాహనాలను రోడ్డెక్కకుండా చూడాలి. గ్రేటర్ పరిధిలో ప్రజారవాణా వ్యవస్థను సిటీజన్లు వినియోగించుకోవాలి. ప్రతి వాహనానికీ ఏటా పొల్యూషన్ చెక్ పరీక్షలను తప్పనిసరి చేయాలి. ఉల్లంఘించే వారికి భారీగా జరిమానాలు విధించాలి. ఇరుకు రహదారులు, బాటిల్‌నెక్స్‌ను తక్షణం విస్తరించాలి. -
ఊపిరాడట్లే.. ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలు!
సాక్షి, కర్నూలు(సెంట్రల్): ట్రాఫిక్ రద్దీ.. వాహనాల పొగతో జిల్లాలోని పట్టణాల్లో భూస్థాయి ఓజోన్ మోతాదు అంతకంతకూ అధికమవుతోంది. ఫలితంగా వివిధ వ్యాధిగ్రస్తులు, సీనియర్ సిటిజన్లు అస్తమా, బ్రాంకైటీస్ తదితర శ్వాసకోశ వ్యాధులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. వాహనాల నుంచి వెలువడుతున్నకాలుష్య ఉద్గారాలతోపాటు ఓజోన్ వాయువులు సీనియర్ సిటిజన్లకు పగటి పూటే చుక్కలు చూపిస్తున్నాయి. ప్రధానంగా ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉండే ఉదయం 9 నుంచి 9 రాత్రి గంటల వరకు పలు ప్రధాన రహదారులపై ఓజోన్ వాయువు గాలిలోని నైట్రోజన్ అక్సైడ్ , ఓలటైల్ ఆర్గానిక్ కాంపౌండ్స్, కార్బన్ మోనాక్సైడ్, కార్బన్ డయాక్సైడ్లతో కలసిపోవడంతో పాటు సూర్యరశ్మి ప్రభావంతో భూ ఉపరితల వాతావరణాన్ని ఓజోన్ దట్టంగా ఆవహిస్తోంది. దీంతో ట్రాఫిక్ రద్దీలో చిక్కుకున్న ప్రయాణీకులు, వాహనదారులు, చిన్నారులు, వృద్ధులు, రోగులు, పాదచారులు ఊపిరాడక సతమతమవుతున్నారు. సాధారణంగా ఘనపు మీటరు గాలిలో భూస్థాయి ఓజోన్ మోతాదు వంద మైక్రోగ్రాములకు మించరాదు. కానీ కర్నూలు, నంద్యాల, ఆదోనిలలో ట్రాఫిక్ రద్దీ అధికంగా ఉన్నసమయాల్లో సుమారు ఘనపు మీటరు గాలిలో 125 మైక్రో గ్రాములుగా నమోదు అవుతుండడంతో పలు సమస్యలు తలెత్తుతున్నాయి. అనర్థాలిలా.. –అస్తమా, ట్రాకంఐటిస్‌తో సతమతమవడం, ఊపిరిఆడకపోవడం – గొంతు నొప్పి, ముక్కుపుటాలు దెబ్బతినడం, కళ్లు మండడం – ఊపిరితిత్తుల పనితీరు దెబ్బతినడం, ఛాతిలో అసౌకర్యం ఉపశమనం ఇలా... కర్నూలు,నంద్యాల, ఆదోనిలతోపాటు ఇతర పట్టణాల్లో సుమారు 20 లక్షల వాహనాల్లో పదిహేనేళ్లకు పైబడిన 5లక్షల వాహనాలను రోడ్డు ఎక్కకుండా చూడాలి. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో విధిగా ముక్కు, ముఖానికి మాస్కులు, హెల్మెట్లు ధరించాలి. వాము కాలుష్యం, భూస్థాయి ఓజోన్‌తో కలిగే దుష్ప్రభావాలను కళ్ల రక్షణకు అద్దాలు ఉపయోగిస్తే కొంత మేర నివారించే అవకాశం ఉంది. ప్రజల్లోమార్పు రావాలి రోజురోజుకూ వాహనాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఇందులో కొన్నింటిని కాలం చెల్లినా వినియోగిస్తున్నారు. ఇవి పర్యావరణానికి ఎంతో కీడు చేస్తాయి. అవి విడుదల చేసే వాయువులు, ఓజోన్ కలసి భూ వాతావరణాన్ని వేడెక్కిస్తుండడంతో ప్రమాదం దాపురిస్తోంది. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. ప్రజల్లో అవగాహన వస్తే తప్పా ఏమి చేయలేము. -బీవై మునిప్రసాదు, కాలుష్య నియంత్రణ మండలి రీజినల్ అధికారి, కర్నూలు -
గుడ్ న్యూస్ చెప్పిన జపాన్ శాస్త్రవేత్తలు
టోక్యో: కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. వైరస్ బారి నుంచి జనాలను కాపాడటానికి పలు పరిశోధనలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో జపాన్ శాస్త్రవేత్తలు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ గ్యాస్ కరోనా వైరస్ కణాలను తటస్తం చేయగలదని తెలిపారు. అందువల్ల ఆస్పత్రులు, పరీక్షా కేంద్రాలు వంటి ప్రదేశాల్లో దీన్ని డిస్ఇన్ఫెక్టెంట్గా ఉపయోగించాలని సూచిస్తున్నారు. ఫుజిటా హెల్త్ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఒక సమావేశంలో మాట్లాడుతూ.. ఓజోన్ వాయువు 0.05 నుంచి 0.1 పీపీఎం, మానవులకు హానిచేయనిదిగా భావించే స్థాయి వైరస్‌ని చంపగలదని గుర్తించాము అన్నారు ఈ ప్రయోగంలో వారు కరోనా వైరస్ నమూనా ఉన్న కలిగిన మూసివున్న గదిలో ఓజోన్ జనరేటర్‌ను ఉపయోగించారు. దాదాపు 10 గంటల పాటు తక్కువ సాంద్రత గల ఓజోన్ గ్యాస్‌ను ఉపయోగించడం వలన.. వైరస్ శక్తి 90 శాతం తగ్గినట్లు గుర్తించామన్నారు. ఈ సందర్భంగా చీఫ్ సైంటిస్ట్ తకాయుకి మురాటా మాట్లాడుతూ.. ‘కరోనా వైరస్ వ్యాప్తిని తగ్గించడం కోసం.. ప్రజలు ఉన్న వాతావరణంలో కూడా నిరంతర, తక్కువ సాంద్రత కలిగిన ఓజోన్ వాయువును పంపించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి. అధిక తేమతో కూడిన పరిస్థితుల్లో కూడా ఇది చాలా ప్రభావవంతంగా ఉంటుందని మేము గుర్తించాము’ అన్నారు. ఓజోన్, ఒక రకమైన ఆక్సిజన్ అణువు. ఇది అనేక వ్యాధికారకాలను క్రియారహితం చేస్తుంది. 1-6 పీపీఎం మధ్య అధిక సాంద్రత కల ఓజోన్ వాయువు కరోనా వైరస్‌కు వ్యతిరేకంగా ప్రభావవంతంగా పని చేస్తుంది. అయితే ఈ అధిక సాంధ్రత మానవులకు విషపూరితమైనది అని గతంలో చేసిన ప్రయోగాలు నిరూపించాయి. (చదవండి: వారియర్స్‌పై వైరస్ పంజా!) జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం మనం నిత్యం వాడే గౌన్లు, గాగుల్స్, ఇతర వైద్య రక్షణ పరికరాలను డిస్ఇన్ఫెక్టెంట్ చేయడంలో ఓజోన్ ప్రభావవంతంగా ఉంటుందని తేలింది. సెంట్రల్ జపాన్‌లోని ఐచి ప్రిఫెక్చర్‌లోని ఫుజిటా మెడికల్ యూనివర్శిటీ హాస్పిటల్, వెయిటింగ్ రూంలు, రోగుల గదుల్లో వైరస్ సంక్రమణను తగ్గించడానికి ఓజోన్ జనరేటర్లను ఏర్పాటు చేసింది. (చదవండి: మాస్కులతో పెరుగుతున్న నిర్లక్ష్యం) -
‘ఓజోన్’ ఉచ్చు ఎవరి మెడకు?
సాక్షి, విశాఖపట్నం : విశాఖ నగరాభివృద్ధి సంస్థ (వుడా)లో పెను ప్రకంపనలు సృష్టించిన ఓజోన్ వేలీ కుంభకోణంపై మళ్లీ విచారణ మొదలు కావడంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దాదాపు ఎనిమిదేళ్ల క్రితం వెలుగు చూసిన ఈ అవినీతి బాగోతంలో వుడా ఉన్నతస్థాయి అధికారులతో పాటు దిగువ స్థాయి ఉద్యోగులు, బడా రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఉన్న సంగతి తెలిసిందే. అప్పట్లో కొంతమందిపై చర్యలు తీసుకున్నా కీలక సూత్రధారులు, పాత్రధారులూ తమ పలుకుబడి, ప్రాపకంతో తప్పించుకున్నారు. పరదేశిపాలెంలోని ఓజోన్ వేలీ సహా రుషికొండ, మధురవాడ, ఎంవీపీసెక్టార్–1,2,3, కూర్మన్నపాలెం, పెదగంట్యాడ, ఆదిభట్లనగర్, ఎండాడల్లోని పది లేఅవుట్లలో అక్రమాలు చోటు చేసుకున్నట్టు 2010లోనే తేటతెల్లమైంది. వుడా తొలిసారిగా చేపట్టిన ల్యాండ్ పూలింగ్‌లో ప్రభుత్వ, జిరాయితీ, డి.పట్టా భూములను సేకరించారు. ఇందులో డి.పట్టా యజమానుల నుంచి సేకరించిన భూముల్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. అంతకుముందు రూరల్ ఎమ్మార్వోగా పనిచేసి వుడా ఎస్టేట్ అధికారిగా, కార్యదర్శిగా పనిచేసిన జగదీష్ ఈ కుంభకోణంలో కీలకపాత్రధారిగా గుర్తించారు. రూరల్ ఎమ్మార్వో పరిధిలో తనకున్న అనుభవాన్ని లేఅవుట్ల బాగోతంలో రంగరించినట్టు అప్పట్లో తేల్చారు. ల్యాండ్‌పూలింగ్ సంగతిని ముందుగా తెలుసుకున్న ఆయన డి.పట్టాదారులతో మంతనాలు సాగిం చి వారి నుంచి కొంతమంది బినామీల పేరిట జీపీఏ రాయించుకోవడం.. నిబంధనల ప్రకా రం ఎకరానికి 1200 బదులు 1500 గజాలు ఇచ్చేలా జీవో ఇప్పించడం.. కోరుకున్న చోట్ల ఈ జాగాను ఇప్పించడం.. ఆ స్థలాలను రిజిస్ట్రేషన్లు చేసేయడం.. ఈ వ్యవహారంలో సహకరించిన అప్పటి మున్సిపల్ మంత్రికి, 15 వేల గజాలకు బదులు 12 వేలిచ్చినట్టు ఆరోపణలు రావడం.. అందులో తేడాలు రావడంతో ఈ బాగోతం బయటపడింది. వీసీ విష్ణుపై అభియోగాలు.. ఈ అక్రమాలకు అప్పటి వీసీ వీఎన్ విష్ణు సహకారం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఆయన తర్వాత వీసీగా వచ్చిన కోన శశిధర్ ఈ కుంభకోణం లోతుకెళ్లి విచారణ జరిపించాలంటూ ప్రభుత్వానికి నివేదించారు. దీనిపై 2014లో విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ జనరల్ లేఅవుట్లలో అక్రమాలు నిజమేనని నిగ్గుతేల్చారు. ఆ లేఅవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేశారు. దీనికి బాధ్యులైన నలుగురు వుడా ఉద్యోగులను, బినామీలను, మరికొందరు బాధ్యులను అరెస్టు చేశారు. ఈ వ్యవహారానికి కీలకపాత్రధారిగా భావిస్తున్న జగదీష్ స్వచ్ఛంద పదవీ విరమణ తీసుకున్నారు. వీసీగా పనిచేసిన విష్ణు తెలంగాణ కేడర్‌కు వెళ్లిపోయారు. ఇంకొందరు పదవీ విరమణ చేశారు. ఈ కుంభకోణంలో కీలక వ్యక్తులను వదిలేశారన్న ఆరోపణలు ఎప్పట్నుంచో ఉన్నాయి. తాజాగా ఇప్పుడు సీసీఎల్ఏ ప్రత్యేక కమిషనర్, విజిలెన్స్ జాయింట్ కమిషనర్, సర్వే ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్వోలతో కూడిన కమిటీని ప్రభుత్వం నియమించింది. సీసీఎల్ఏ జాయింట్ డైరెక్టర్ శారదాదేవి నేతృత్వంలో రెండ్రోజులు (గురు, శుక్రవారాలు) ఈ కమిటీ ఈ లేఅవుట్లకు సంబంధించిన డాక్యుమెంట్లు, రికార్డులను పరిశీలించింది. వివాదాస్పద లేఅవుట్లను త్వరలో స్వయంగా పరిశీలించాలని నిర్ణయించారు. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులను కమిటీ సభ్యులు పరిశీలనకు స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఈ కమిటీ ప్రాథమిక పరిశీలనను ముగించినట్టు తెలుస్తోంది. ఈ కమిటీ తన నివేదికను రెండు నెలల్లో ప్రభుత్వానికి సమర్పించాల్సి ఉంది. -
గుండె జబ్బులకూ ఓజోన్ కారణం!
వాహనాల నుంచి వెలువడే పొగలో ఉండే ఓజోన్ వాయువు గుండె జబ్బులతో పాటు అనేక ఇతర వ్యాధులకు కారణమవుతున్నట్లు అంతర్జాతీయ శాస్త్రవేత్తల బృందం గుర్తించింది. చైనా ప్రజలపై జరిపిన పరిశోధన ద్వారా డ్యూక్, షింగువా, డ్యూక్ కున్షాన్, పెకింగ్ విశ్వవిద్యాలయాలు సంయుక్తంగా నిర్వహించిన ఈ పరిశోధన వివరాలు జామా ఇంటర్నేషనల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. ఓజోన్ వాయువు ఊపిరితిత్తుల పనితీరుపై తీవ్రంగా ప్రభావితం చేస్తుందని గతంలోనే తెలిసినా గుండె జబ్బులకు కారణమవుతుందన్న విషయం గుర్తించడం ఇదే తొలిసారి. చైనాలోని ఛాంగ్సా నగరంలో కొందరిపై ఏడాది పాటు ఈ ప్రయోగం జరిపారు. ఇళ్లల్లో, బయట ఉన్న ఓజోన్, తదితర కాలుష్య కారక వాయువుల మోతాదులను గుర్తించడంతో పాటు నాలుగు విడతల్లో వీరి రక్త, మూత్ర పరీక్షలు నిర్వహించారు. వీటితో పాటు స్పైరోమెట్రీ పరీక్షతో వారి ఊపిరిలో గుండె, శ్వాస సంబంధిత సమస్యలకు కారణమయ్యే కారకాలను గుర్తించారు. కొంత కాలం తర్వాత వీరిలో రక్తంలోని ప్లేట్లెట్లు క్రియాశీలకంగా మారడంతో పాటు రక్తపోటు కూడా ఎక్కువైనట్లు తెలిసింది. ఊపిరితిత్తులపై ప్రభావం చూపగల మోతాదు కంటే తక్కువ మోతాదు కూడా గుండెజబ్బులకు దారితీస్తున్నట్లు వెల్లడైంది. -
ఓజోన్ ఆవరణం అని దేన్నంటారు?
భూ ఆవరణాలు – వాతావరణం భూ ఉపరితలంపై నాలుగు ఆవరణాలున్నాయి. అవి.. 1. శిలావరణం 2. జలావరణం 3. వాతావరణం 4. జీవావరణం వీటిని భూ భౌతికాంశాలు అంటారు. 1. శిలావరణం: గ్రీకు భాషలో ‘లిథోస్’ అంటే శిల అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో లిథో స్పియర్ అంటారు. దీన్ని ‘ఆశ్మావరణం’ అని కూడా పిలుస్తారు. 2. జలావరణం: గ్రీకు భాషలో ‘హదర్’ అంటే జలం అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో ‘హైడ్రోస్పియర్’ అంటారు. భూ ఉపరితలంపై ఉన్న జలభాగం మొత్తం దీని కిందకు వస్తుంది. 3. వాతావరణం: గ్రీకు భాషలో ‘అట్మోస్’ అంటే గాలి/ఆవిరి అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో ‘అట్మాస్పియర్’ అంటారు. దీనిలో వివిధ రకాల వాయువులు ఉంటాయి. 4. జీవావరణం: గ్రీకు భాషలో ‘బయో’ అంటే జీవం అని అర్థం. ఈ ఆవరణాన్ని ఆంగ్లంలో బయోస్పియర్ అంటారు. అనేక జీవరాశులు దీని కిందకు వస్తాయి. వాతావరణం భూమిని ఆవరించి ఉన్న దట్టమైన గాలి పొరను వాతావరణం అంటారు. వాతావరణాన్ని అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘మెటియొరాలజి’ అంటారు. భూమిని ఆవరించి ఉన్న వాతావరణం బరువు సుమారు 56 కోట్ల టన్నులు ఉంటుందని అంచనా. కార్బన్ డై ఆక్సైడ్ (ఛిౌ2), నీటి ఆవిరి 90 కి.మీ. ఎత్తు వరకు మాత్రమే ఉంటాయి. ఆక్సిజన్ 120 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. 22 కి.మీ. ఎత్తులో 96% వాతావరణం విస్తరించి ఉంటుందని శాస్త్రవేత్తల అంచనా. వాతావరణంలోని వాయువుల శాతం నత్రజని – 78.08% ఆక్సిజన్ – 20.94% ఆర్గాన్ – 0.93% కార్బన్ డై ఆక్సైడ్ – 0.03% హీలియం, క్రిప్టాన్, గ్జినాన్ ఇతర జడ వాయువులు – 0.02% నత్రజని (నైట్రోజన్): దీన్ని మొక్కలు పరోక్షంగా నైట్రేట్స్ రూపంలో గ్రహిస్తాయి. లెగ్యుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలు వాతావరణంలోని నత్రజనిని గ్రహించి భూసారాన్ని పెంచుతాయి. ఆక్సిజన్: ఇది జీవరాశులన్నింటికీ ప్రాణ వాయువు. సూర్యుడి నుంచి వచ్చే అతినీలలోహిత కిరణాలు భూమిని చేరకుండా అడ్డుకునే ఓజోన్ (ౌ3) పొరను ఏర్పరచడంలో ఆక్సిజన్ ప్రధాన పాత్ర పోషిస్తుంది. కార్బన్ డై ఆక్సైడ్: దీన్నే బొగ్గుపులుసు వాయువు అంటారు. మొక్కలు ఛిౌ2ను గ్రహించి కిరణజన్య సంయోగ క్రియ ద్వారా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుంటాయి. గ్రీన్హúస్ ఎఫెక్ట్‌కు ఛిౌ2 కారణమవుతుంది. ఆర్గాన్: భూ ఉపరితలంపై ఎక్కువగా ఉన్న జడవాయువు. దీన్ని ఎలక్ట్రిక్ బల్బుల్లో వినియోగిస్తారు. వాతావరణం – పొరలు భూ ఉపరితలం నుంచి ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు, ఇతర మార్పుల ఆధారంగా వాతావరణాన్ని ఐదు ఆవరణాలుగా విభజించారు. అవి.. ట్రోపో ఆవరణం ఇది భూ ఉపరితలం నుంచి సగటున 13 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంటుంది. భూమధ్య రేఖా ప్రాంతాల వద్ద 18 కి.మీ, ధృవాల వద్ద 8 కి.మీ. ఎత్తు వరకు ఉంటుంది. ట్రోపో అంటే మార్పు అని అర్థం. వాతావరణంలో మార్పులన్నీ ఈ ఆవరణంలోనే జరుగుతాయి. జీవరాశులన్నీ ఇందులోనే ఉంటాయి. సంవహన వాయు ప్రవాహాల వల్ల ఈ ఆవరణం ఎత్తు భూ మధ్య రేఖ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. ఈ ఆవరణంలో ఒక కి.మీ. ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రత 6.4నిఇ తగ్గుతుంది. 75% వాతావరణం ఈ ఆవరణంలోనే ఉంటుంది. కాబట్టి ఇది జీవక్రియలకు అనుకూలం. మేఘాలు, తుపాన్లు, అవపాతం ఈ ఆవరణంలోనే సంభవిస్తాయి. ఇందులో జెట్ ప్రవాహాల వల్ల వాతావరణంలో గందరగోళ పరిస్థితులు ఏర్పడతాయి. అందువల్ల దీన్ని ‘గందరగోళ ఆవరణం’ అని కూడా అంటారు. ట్రోపో ఆవరణం పైభాగపు సరిహద్దును ‘ట్రోపో పాస్’ అంటారు. స్ట్రాటో ఆవరణం ఇది 50 కి.మీ ఎత్తు వరకు ఉంటుంది. స్ట్రాటో అంటే శ్రీకారం చుట్టడం అని అర్థం. ఈ ఆవరణంలో పైకి వెళుతున్నకొద్దీ ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఇందులో సిర్రస్ మేఘాలు కనిపిస్తాయి. ఇక్కడ దుమ్ము, ధూళి కణాలు; నీటి ఆవిరి పరిమాణం తక్కువ. స్ట్రాటో ఆవరణాన్ని ప్రశాంత మండలం అంటారు. ఇందులో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి. ఓజోన్ పొర ఈ ఆవరణంలో ఉంటుంది. ఇది 35 నుంచి 60 కి.మీ. ఎత్తు ప్రాంతంలో విస్తరించి ఉంది. ఓజోన్ పొర ఉండే ప్రాంతం ఘాటైన చేపల వాసన కలిగి ఉంటుంది. స్ట్రాటో ఆవరణాన్ని ఓజోన్ ఆవరణం అని కూడా అంటారు. ఈ ఆవరణాన్ని చేరిన తొలి భారతీయుడు టీఎన్ సురేశ్ కుమార్. 2014 ఆగస్టు 15న మిగ్–29 నౌకలో ప్రయాణించి ఈ ఆవరణాన్ని చేరుకున్నారు. స్ట్రాటో ఆవరణం పై భాగపు సరిహద్దును ‘స్ట్రాటో పాస్’ అంటారు. మీసో ఆవరణం ఇది స్ట్రాటో పాస్‌ను ఆనుకొని 80 కి.మీ. ఎత్తు వరకు విస్తరించి ఉంది. ఈ ఆవరణంలో ఎత్తుకు వెళ్లేకొద్దీ ఉష్ణోగ్రతలు తగ్గుతాయి. ఇందులో సంవహన క్రియ యథావిధిగా జరుగుతుంది. లక్షణాలు ట్రోపో ఆవరణం మాదిరిగా ఉండటం వల్ల దీన్ని బాహ్య ట్రోపో ఆవరణం అంటారు. కొద్ది పరిమాణంలో ఓజోన్ పొర ఈ ఆవరణంలో కనిపిస్తుంది. ఇందులో కాంతి ప్రేరేపిత రసాయన చర్యలు జరుగుతాయి. అందువల్ల దీన్ని రసాయనిక ఆవరణం అంటారు. ఈ ఆవరణంలో ఉల్కలు నాశనమవుతాయి. మీసో ఆవరణం సరిహద్దును ‘మీసో పాస్’ అంటారు. థర్మో ఆవరణం మీసోపాస్ నుంచి 400 కి.మీ. ఎత్తు వరకు వ్యాపించి ఉంటుంది. ఉష్ణోగ్రత అనూహ్యంగా పెరగడం వల్ల దీన్ని థర్మో ఆవరణం అంటారు. ఇందులో వాయువులు అయాన్ల రూపంలో ఉంటాయి. అందువల్ల దీన్ని ఐనో ఆవరణం అని కూడా అంటారు. ఈ ఆవరణంలో అయోనైజేషన్ ప్రక్రియ జరుగుతుంది. అణుసంబంధ ఆక్సిజన్, నైట్రోజన్ల నిరంతర రసాయన చర్యల వల్ల ఉష్ణం, కాంతి జనిస్తుంది. కాంతి పుంజాలు ఏర్పడతాయి. వీటినే ‘అరోరా’లు అంటారు. ఈ ఆవరణంలో రేడియో, సమాచార తరంగాలు పరావర్తనం చెందుతాయి. అందువల్ల దీన్ని సమాచార పొర అంటారు. స్పేస్ షటిల్స్ ఈ ఆవరణంలో ఉంటాయి. ఎక్సో ఆవరణం ఇది ఐనో ఆవరణంపై ఉంటుంది. అతి తేలిక హైడ్రోజన్, హీలియం వాయువులు ఇక్కడ కేంద్రీకృతమై ఉన్నాయి. ఈ ఆవరణంలో భూమ్యాకర్షణ శక్తి తక్కువగా ఉన్నందువల్ల వాతావరణ సంఘటనంలో మార్పులు కనిపిస్తాయి. అందువల్ల దీన్ని విరుద్ధ ఆవరణం అంటారు. కృత్రిమ ఉపగ్రహాలను ఈ ఆవరణంలో (36,000 కి.మీ. ఎత్తులో) ప్రవేశపెడతారు. మాదిరి ప్రశ్నలు 1. సిర్రస్ మేఘాలు కనిపించే ఆవరణం? 1) ట్రోపో 2) ఐనో 3) స్ట్రాటో 4) మీసో 2. ఓజోన్ రసాయనిక సాంకేతికం? 1) o2 2) o4 3) oc3 4) o3 3. ఉల్కలు నాశనమయ్యే ఆవరణం? 1) మీసో 2) థర్మో 3) ఎక్సో 4) ట్రోపో 4. గ్రీకు భాషలో ‘హదర్’ అంటే? 1) శిల 2) జీవం 3) ఆవిరి 4) జలం 5. భూ ఉపరితలంపై ఎక్కువగా ఉన్న జడ వాయువు? 1) ఆర్గాన్ 2) హైడ్రోజన్ 3) నియాన్ 4) గ్జినాన్ సమాధానాలు 1) 3 2) 4 3) 1 4) 4 5) 1 -
ఓజోన్ పొర దెబ్బతినడంతోనే ప్రకృతి వైపరీత్యాలు
– జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు రాజేంద్రారెడ్డి కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఓజోన్ పొర దెబ్బతింటుండడంతోనే వాతావరణంలో ఆకస్మిక మార్పులు సంభవించి ప్రకృతి వైపరీత్యాలు నెలకొంటున్నాయని పొల్యూషన్ బోర్డు కర్నూలు జోనల్ జాయింట్ చీఫ్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీరు రాజేంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం జి.పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రపంచ ఓజోన్ డేను పురస్కరించుకొని ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వాతావరణంలో మార్పులతో విపరీతమైన ఎండలు, వర్షాలు సక్రమంగా కురవకపోవడం, ప్రజలు రోగాలబారిన పడి చనిపోతుండడంతో ఆందోళన కలిగిస్తుందన్నారు. ఓజోన్ పొరను పరిరక్షించడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఓజోన్ పొర దెబ్బతినడానికి ప్రజలు వాడే ఏసీలు, రిఫ్రిజరేటర్లు, కాస్మిటిక్, టాయిలెట్లకు వినియోగించే పదార్థాలే కారణమన్నారు. వీటిని ప్రజలు మితంగా వాడాల్సిన సమయం అసన్నమైందన్నారు. లేదంటే 50–60 ఏళ్ల మధ్య ఓజోన్ పొరకు పడిన చిల్లులు విస్తరించి అల్ట్రాసోనిక్ కిరణాలు నేరుగా భూమి పడే ప్రమాదం ఉందన్నారు. వాటితో ప్రజలకు చర్మక్యాన్సర్లు, ఇతర వ్యాధులు వ్యాప్తి చెంది ప్రపంచమే నాశనమయ్యే పరిస్థితి నెలకొంటుందన్నారు. అనంతరం ఓజోన్ పొరపై నిర్వహించిన వ్యాసరచన విద్యార్థులకు బహుమతులుగా మెమోంటోలను అందజేశారు. కార్యక్రమంలో పొల్యూషన్ బోర్డు ఇంజినీరు ప్రసాదరావు, ప్రొఫెసర్లు మాధవరెడ్డి, విజయభాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో ఓ‘జోన్’
→ దెబ్బతిన్న పర్యావరణ సమతుల్యత → జిల్లాలో ఎడారి ఛాయలు → నేడు ఓజోన్ పొర పరిరక్షణ దినోత్సవం విపరీతమైన ఎండలు... అప్పుడప్పుడు నేనున్నాంటూ పలకరించపోయే వర్షాలు అనంతపురం జిల్లా వాసులకు కొత్తమీ కాదు. అయితే ఈ వైపరీత్యానికి కారణలేమిటి? కొన్నేళ్లుగా సామాన్య ప్రజలను వేధిస్తున్న ఈ ప్రశ్నకు సమాధానం ఓజోన్ పొర దెబ్బతినడమే నన్నది అక్షర సత్యం. దీనిపై సరైన అవగాహన లేకపోవడంతో జిల్లాలో ఎడారి ఛాయలు శరవేగంగా విస్తరిస్తున్నాయి. కొంచెం ఎండ ఎక్కువైతేనే బయటకెళ్లడానికి భయపడ్తాం. అలాంటిది భగభగ మండే సూర్యకిరణాలు నేరుగా మనపై పడితే తట్టుకోగలమా?! అస్సలు తట్టుకోలేం. కానీ ఈ విధమైన ప్రమాదం భవిష్యత్తులో పొంచి ఉందని పర్యావరణ వేత్తలు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే సూర్యుడి నుంచి వెలువడే అతి నీల లోహిత కిరణాల ప్రభావం నేరుగా మన మీద పడకుండా రక్షించే ఓజోన్ పొర క్రమంగా పలుచబడడమే ఇందుకు కారణం. మానవ చర్యలే ఇందుకు కారణమని 1987 నాటి ‘మాంబ్రెయిల్ ప్రొటోకాల్’ (ఓజోన్ పొర క్షీణతపై జరిగిన పరిశోధన) హెచ్చరించింది. అయితే ఓజోన్ పొర పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? ప్రపంచ వ్యాప్తంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏం చేయాలనే దానిపై 1994, సెప్టెంబర్ 16న సమావేశం జరిగింది. అదే యు.ఎన్.జనరల్ అసెంబ్లీ సమావేశం. ఓజోన్ క్షీణతపై ఈ సమావేశంలో తీవ్ర ఆందోళన వ్యక్తమైంది. ఓజోన్ పరిరక్షణకు తక్షణ చర్యలు తీసుకునే దిశగా అడుగేయాలని, ఇందు కోసం ప్రతి ఏటా సెప్టెంబర్ 16న అంతర్జాతీయ ఓజోన్ పరిరక్షణ దినోత్సవం జరపాలని సమావేశం తీర్మానించింది. పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాలి ఓజోన్ పొర ప్రాముఖ్యత గురించి పాఠశాల స్థాయిలోనే అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు. ఈ విషయంలో ప్రభుత్వం కన్నా స్వచ్చంద సంస్థలే ముందున్నాయి. జిల్లాలో జనవిజ్ఙాన వేదిక, ఆర్డీటి, యాక్షన్ ఫెటర్నా, టింబక్ట్, రిడ్స్ వంటి స్వచ్చంద సంస్థలు, రచయితలు... ఓజోన్ సమస్య గురించి జిల్లా ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. పర్యావరణంపై అవగాహన ఉండాలి ఓజోన్‌పొరను రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత, ముఖ్యంగా విద్యార్థులలో ఈ విషయంపై చక్కటి అవగాహన కల్పించాలి. భూమిపై రక్షణకవచంగా ఆవిరించుకున్న ఓజోన్‌పొర నానాటికి పలుచబడుతూ ప్రమాద స్థాయిని సూచిస్తోంది. కొన్ని దశాబ్ధాల కిందట కేవలం ఇబ్బందులను మాత్రమే కలుగజేసిన వాతావరణం, నేడు ఓజోన్ పొర క్షీణించడం వలన అతి ప్రమాదకర స్థాయికి చేరుకుంది. – వైవీ మల్లారెడ్డి, యాక్షన్ ఫెటర్నా ఎకాలజీ సెంటర్ చెట్లను నరకడం నేరంగా భావించాలి ప్రకతిని యథేచ్చగా నాశనం చేస్తూ బాధ్యతారాహిత్యంగా ఉంటే రాబోయే వినాశనం మానవ మనుగడను ప్రశ్నార్థకం చేస్తుంది. రోజు రోజుకూ కాలుష్యం బారిన పడుతున్న పర్యావరణాన్ని పరిరక్షించుకోక పోతే పెనుముప్పు తప్పదు. చెట్లను కొత్తగా నాటడం దేవుడెరుగు, పెద్దగా పెరిగి నీడను, ప్రాణవాయువును అందిస్తున్న చెట్లను నరకడాన్ని నేరంగా పరిగణించాలి. – జెన్నే ఆనంద్, రచయిత