paada yaatra
-
పాదయాత్రలో నారా లోకేష్ ఆణిముత్యాలు విని నవ్వుతున్న ప్రజలు!
రాజకీయ నాయకుడు ఎవరైనా ఏదైనా అంశం మీద మాట్లాడేటపుడు పూర్తి సమాచారం తెలుసుకోవాలి. విషయం తెలియకుండా నోటికొచ్చింది చెబుతానంటే కుదరదు. మన నారా లోకేశం కదా.. టాపిక్ ఏదైనా.. ఏమీ తెలియకపోయినా..చెప్పేయవచ్చు. పాదయాత్రలో లోకేష్ నోటి నుంచి వెలువడుతున్న ఆణిముత్యాలు విని ప్రజలు నవ్వుకుంటున్నారు. ఇంతకీ నారా వారి లోకేష్ ఏమన్నాడో చూద్దాం! పాదయాత్ర చేస్తున్న చంద్రబాబు పుత్ర రత్నం నారా లోకేష్ అభాసుపాలు అవుతున్నారు. బహిరంగ సభల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలు వివాదాస్పదం కావడమే కాదు.. రాజకీయ వర్గాల్లో తీవ్ర స్థాయిలో దుమారం రేపుతున్నాయి. ప్రతి టీడీపీ కార్యకర్త మీద కనీసం ఇరవై పోలీసు కేసులు ఉండాలని.. అప్పుడే బాగా పనిచేస్తున్నట్లు గుర్తిస్తానని నారా లోకేష్ వ్యాఖ్యానించటం విమర్శలకు దారితీస్తోంది. రాజకీయ ప్రత్యర్ధులపై దాడులు చేయండి.. నేను వెనకేసుకు వస్తా అన్నట్లుగా లోకేష్ చేస్తున్న వ్యాఖ్యలు రెచ్చగొట్టే విధంగా ఉన్నాయనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. రాయలసీమ జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో ఫ్యాక్షన్.. ముఠా కక్షల ప్రభావం ఇప్పటికీ ఉంది. లోకేష్ మాటలు నమ్మి ఎవరైనా హింసా రాజకీయాలకు పాల్పడితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? రాజకీయ లబ్ధి కోసం కార్యకర్తలను రెచ్చగొట్టి.. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడతావా..? అంటూ టీడీపీ నేత నారా లోకేష్ వైఖరిని అందరూ ఖండిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను నారా లోకేష్ తన తండ్రి చంద్రబాబు ఖాతాలో వేసే ప్రయత్నం చేయడాన్ని జనం తప్పుపడుతున్నారు. సీఎం జగన్ కృషితో అనంతపురం నగరానికి 300 కోట్లతో అర్బన్ లింక్ ప్రాజెక్టు 2020లో మంజూరైంది. ఆ హైవే పనులు అనంతపురంలో ముమ్మరంగా జరుగుతున్న తీరును గమనించిన నారా లోకేష్... ఈ జాతీయ రహదారి మేమే తెచ్చామంటూ నోటికొచ్చిన అబద్ధాలు చెప్పారు. ఆయన వ్యాఖ్యలపై మండిపడ్డ అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి.. పంగల్ రోడ్డు నుంచి బళ్లారి రోడ్ దాకా హైవే ఎలా వచ్చిందో ఆధారాలు బయట పెట్టారు. గొప్ప నాయకుడిగా ఫీలవుతున్న నారా లోకేష్ ఆఖరుకు చరిత్రను కూడా వక్రీకరిస్తున్నారు. మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేశారని.. మరో మాజీ రాష్ట్రపతి నీలం సంజీవరెడ్డి ఎస్కే యూనివర్సిటీలో చదివారని నారా లోకేష్ బహిరంగ సభలో చెప్పారు. అయితే ఈ ఇద్దరు ప్రముఖులకు ఎస్కే యూనివర్సిటీతో సంబంధమే లేదు. నీలం సంజీవరెడ్డి రాష్ట్రపతిగా ఉన్న కాలంలోనే ఎస్కే యూనివర్శిటీని 1981 సంవత్సరంలో స్థాపించారు. లోకేష్ చేస్తున్న అజ్ఞానపు ప్రకటనలు చూసి అనంతపురం ప్రజలు నవ్వుకుంటున్నారు. మిడి మిడి జ్ఞానంతో నారా లోకేష్ చేస్తున్న ప్రసంగాల్లో పస లేదనే విషయం జనానికి అర్థం అయిపోయింది. అందుకే ఆయన పాదయాత్రను చూసేందుకు కూడా ప్రజలు ఇష్టపడటం లేదు. లోకేష్ అనుచిత వ్యాఖ్యలు, అజ్ఞానపు ప్రకటనలపై టీడీపీ నేతలు కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి వెబ్‌డెస్క్ -
విద్యా దీవెనపై లోకేశ్ విసుర్లు
సాక్షి, చిత్తూరు/శ్రీరంగరాజపురం: ‘విద్యా దీవెనతో తల్లులను జగన్ మోసం చేస్తున్నారు. ఇదొక పనికి మాలిన పథకం. గతంలో ప్రభుత్వం, కాలేజీ యాజమాన్యానికి నేరుగా ఫీజులు చెల్లించేది. జగన్ దీన్ని తల్లిదండ్రులపైకి నెట్టాడు. చాలీ చాలని డబ్బులిచ్చి తల్లిదండ్రులపై విద్యా భారాన్ని పెంచాడు. దీనివల్ల అనేక మందికి పిల్లల్ని చదివించే పరిస్థితి లేదు’ అని టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ మండిపడ్డారు. ఆయన చేపట్టిన యువగళం పాదయాత్ర 16వ రోజు Ôశనివారం శ్రీరంగరాజపురం మండలంలో సాగింది. ఉదయం ఎస్ఆర్ పురం హనుమాన్ ఆలయం విడిది కేంద్రంలో యాదవ సామాజిక వర్గంతో, తర్వాత దిగువ మెడవడ ఎస్టీ కాలనీ వాసులతో ముఖాముఖి నిర్వహించారు. అనంతరం పిళ్లారికుప్పం, వెంకటాపురం గ్రామాల మధ్య వెంట నడుస్తున్న వారిని ఉత్సాహ పరిచేందుకు కొంత దూరం పరుగెత్తారు. ఆ తర్వాత మాట్లాడుతూ.. ఇంజినీరింగ్ పూర్తి చేసినా, సర్టిఫికెట్లు చేతికందక యువత నిరుద్యోగులుగా ఇళ్లకే పరిమితం అవుతున్నారన్నారు. అవగాహన లేని ముఖ్యమంత్రి వల్ల యువత భవిష్యత్తు నాశనం అవుతోందని ధ్వజమెత్తారు. వైసీపీ పథకాలన్నీ పేపర్లకే పరిమితమని విమర్శించారు. ఒక్క ఉద్యోగానికి కూడా నోటిఫికేషన్ ఇవ్వలేదని.. డీఎస్సీ, ఏపీపీఎస్సీ, కానిస్టేబుల్ పోస్టులు ఇస్తానని మాట తప్పారన్నారు. బిహార్‌కు కూడా పెట్టుబడులు వస్తుంటే ఏపీకి మాత్రం రావడం లేదన్నారు. టీడీపీ హయాంలో బీసీలను అన్ని విధాలా ప్రోత్సహించామని చెప్పారు. -
కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేయాలి
గద్వాల రూరల్/అయిజ రూరల్/మల్దకల్/గట్టు: ‘ప్రజల కష్టాలు తెలియాలంటే కేసీఆర్ మోకాళ్ల యాత్ర చేయాలి. ఆయన చేయకుంటే మేము చేపిస్తం. ప్రధాని మోదీ రోజుకు 18 గంటలు పని చేస్తే సీఎం కేసీఆర్ మాత్రం రోజుకు 4 గంటలే మెలకువతో ఉంటాడు. ప్రజలు కష్టాలు పడుతుంటే ఆయన ఫాంహౌస్‌లో పడుకుంటున్నాడు’ అని బీజేపీ రాçష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. ప్రజాసంగ్రామ యాత్రలో భాగంగా మంగళవారం ఆరో రోజు జోగుళాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం ఎల్కూర్లోకి అడుగుపెట్టిన ఆయనకు ప్రజలు, పార్టీ శ్రేణులు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘పక్క రాష్ట్రంలో ఉండే ఎవరో కేసీఆర్ మా ప్రాంతంలో ఉండుంటే మాకు ఎంతో మేలు జరిగేదని అంటున్నారని టీఆర్ఎస్ వాళ్లు చెబుతున్నారు. అలా ఎవరు అన్నారో చెబితే నా భుజాలపై ఎత్తుకొని వెళ్లి కేసీఆర్‌ను ఆ ప్రాంతంలో పడేసి వస్తాను. రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోతుంది’ అని ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో అమలవుతున్న ప్రతి అభివృద్ధి పథకం కేంద్ర ప్రభుత్వానిదేనని అన్నారు. రాజ్యాంగాన్ని మార్చి కొత్తగా కల్వకుంట్ల రాజ్యాంగం రాస్తానని అంటున్నాడు..’అని విమర్శించారు. -
ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఏ ముఖం పెట్టుకొని పాదయాత్ర చేస్తున్నారని టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కె. తారక రామారావు ప్రశ్నించారు. పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇవ్వనందుకా.. నదీ జలాల్లో తెలంగాణ వాటా తేల్చకుండా శిఖండి సంస్థను ఏర్పాటు చేసి ఏడేళ్లుగా తాత్సారం చేస్తున్నందుకా? అని నిలదీశారు. హైదరాబాద్ మాదాపూర్ హెచ్ఐసీసీ ప్రాంగణంలో ఈ నెల 27న జరగనున్న టీఆర్ఎస్ ప్లీనరీకి సంబంధించిన ఏర్పాట్లపై సోమవారం పార్టీ నేతలతో సమావేశమైన కేటీఆర్ ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు. తమ పాలనపై మహబూబ్‌నగర్ జిల్లా పాదయాత్రలో అడ్డగోలుగా విమర్శలు చేస్తున్న బండి సంజయ్... ఆ పొరుగునే ఉన్న బీజేపీపాలిత రాష్ట్రమైన కర్ణాటకకు వెళ్లి అక్కడి పరిస్థితులతో తెలంగాణ పరిస్థితులను పోల్చి చూడాలని కేటీఆర్ సూచించారు. ఇందుకోసం అవసరమైతే ఆయనకు ఏసీ వాహనం సమకూరుస్తామన్నారు. తెలంగాణలో పాలన, సంక్షేమ పథకాలు బాగున్నందున తమను విలీనం చేయాలని ప్రకటించిన బీజేపీ రాయచూరు ఎమ్మెల్యేను బండి సంజయ్ కలసి రావాలన్నారు. కర్ణాటక మంత్రులు 40 శాతం కమీషన్లు తీసుకుంటున్నారంటూ కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకొనే పరిస్థితి నెలకొందని, అక్కడి అసమర్థ పాలన చూసి సంజయ్ సిగ్గుపడాలని విమర్శించారు. మరో బీజేపీపాలిత రాష్ట్రమైన గుజరాత్లో కరెంటు కోసం రైతులు రోడ్డెక్కారని.. ఆ రాష్ట్ర ప్రభుత్వం పవర్ హాలిడేలు ప్రకటిస్తుంటే సంజయ్ మాత్రం టీఆర్ఎస్ పాలనపై పనికిమాలిన కూతలు కూస్తున్నారని దుయ్యబట్టారు. కేంద్రం ఇస్తానంటే అడ్డుకుంటున్నామా? బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఏం చేసిందో చెప్పకుండా మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రసంగాలతో బండి సంజయ్ పాదయాత్ర సాగుతోందని కేటీఆర్ విమర్శించారు. తెలంగాణలో అధికారంలోకి వస్తే వైద్యం, విద్యను ఉచితంగా అందిస్తామని చెబుతున్న బీజేపీ... అవే పథకాలను పొరుగునే ఉన్న కర్ణాటకలో ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలకు అన్నీ ఉచితంగా ఇస్తే తామేమైనా అడ్డుకుంటున్నామా? అని ప్రశ్నించారు. సొల్లు పురాణం, అబద్ధాలతో బండి సంజయ్ పాదయాత్ర సాగుతోందన్నారు. అంబేడ్కర్ ఆలోచనలకు అనుగుణంగా ఏర్పాటైన టీఆర్ఎస్... కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణను అభివృద్ధి బాటలో ఉద్యమంలా తీసుకెళ్తోందని కేటీఆర్ అన్నారు. రేపు వరంగల్‌కు మంత్రి కేటీఆర్ సాక్షి ప్రతినిధి, వరంగల్: రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన ఖరారైంది. బుధవారం ఆయన వరంగల్, హనుమకొండ జిల్లాల్లో పర్యటించనున్నారు. మహానగర పాలక సంస్థ (స్మార్ట్ సిటీ) పథకంలో భాగంగా వివిధ అభివృద్ధి పనులకు ప్రారంభో త్సవాలు చేయనున్నారు. ప్రాంతీయ గ్రంథాలయం, కాపువాడ భద్రకాళి బండ్, పబ్లిక్ గార్డెన్‌ను మంత్రి ప్రారంభించి, డబుల్ బెడ్రూం ఇళ్లను లబ్ధిదారులకు పంపిణీ చేస్తారు. అనంతరం హనుమకొండ, వరంగల్ జిల్లాల కలెక్టర్లు సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. -
బరాబర్ పాదయాత్ర చేస్తా
అలంపూర్/సాక్షి, హైదరాబాద్: ‘కేసీఆర్ దమ్ముంటే నువ్వు పాదయాత్ర చెయ్. తెలంగాణ ప్రజలకు నువ్వు చేసిన ఘన కార్యాలేమిటో వివరించు.. మేం చేసిన తప్పేంది? పాపమేంది? ప్రజా సమస్యలపై పోరాడటమే నేరమా? ప్రజలు పడుతున్న కష్టాలు తెలుసుకొని వాటిని పరిష్కారం కోసం పోరాటడమే తప్పా? మాపై రాళ్ల దాడులు చేస్తారా? మేం బస చేసే శిబిరాలను ధ్వంసం చేస్తారా..?’అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నేతల బెదిరింపులకు, దాడులకు భయపడే ప్రసక్తే లేద న్నారు. బరాబర్ ప్రజా సంగ్రామ యాత్ర చేసి తీరుతామని స్పష్టం చేశారు. పేదల ప్రభుత్వం రావాలంటే గడీల పాలన పోవాల్సిందే అన్నారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ నియోజకవర్గంలోని ఇటిక్యాల మండలంలో సోమవారం ఐదవ రోజు ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగింది. ఇటి క్యాల మండలంలోని 44వ జాతీయ రహదారి వేముల స్టేజీ నుంచి వేముల, షాబాద, ఉదండాపురం గ్రామాల మీదుగా సాగింది. ఈ సందర్భంగా వేముల, షాబాద గ్రామాల్లో బండి మాట్లాడారు. పాలమూరు గోస చూస్తుంటే బాధేస్తోంది ‘మేం ప్రజా సమస్యలు తెలుసుకుందామని పాదయాత్రగా వస్తే.. కొంతమంది టీఆర్ఎస్ గూండాలు బీజేపీ కార్యకర్తలపై రాళ్లదాడి చేసి, రక్తం కారేలా కొట్టారు. శ్రీకాంతాచారి, సుమన్, పోలీస్ కిష్టయ్య లాంటి అమరవీరులు ఇందుకోసమేనా ప్రాణత్యాగం చేసింది? పాలమూరు ప్రజల గోస, ఇక్కడి కరువు పరిస్థితులను చూస్తుంటే బాధేస్తోంది. ఎక్కడికి వెళ్లినా నీళ్ల సమస్యనే ప్రధానంగా చెబుతున్నారు. 200 కి.మీ. దూరంలో ఉన్న కాళేశ్వరం ద్వారా సీఎం ఫాంహౌస్‌కు నీళ్లు తెచ్చుకోవడానికి రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టిండు. కానీ ఆర్డీఎస్ ద్వారా అలంపూర్‌కు నీళ్లు ఎందుకు ఇవ్వడం లేదో కేసీఆర్ చెప్పాలి. బీజేపీ అధికారంలోకి వస్తే నెట్టెంపాడు, ఆర్డీఎస్ ద్వారా సాగు నీరు అందిస్తాం. నకిలీ విత్తనాలు అమ్మే వాళ్లను బొక్కలో వేస్తాం..’అని బండి అన్నారు. పాదయాత్రలో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, జిల్లా అధ్యక్షుడు రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. దాడిని ఖండించిన బీజేపీ నేతలు... సంజయ్ పాదయాత్రపై టీఆర్ఎస్ కార్యకర్తల దాడిని బీజేపీ ఎంపీ సోయం బాపూరావు, బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్, పార్టీ నేతలు ఈటల, గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి, ఎస్.కుమార్, కొల్లిమాధవి, డా.జి.విజయరామారావు, టీఎస్పీఎస్సీ మాజీ సభ్యుడు సీహెచ్ విఠల్ వేర్వేరు ప్రకటనల్లో ఖండించారు. సంజయ్ యాత్రకు వస్తున్న ప్రజా స్పందన చూసి టీఆర్ఎస్ నేతలు తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. దాడులకు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలన్నారు. సాయి గణేష్ ఆత్మహత్యకు కారణమైన మంత్రి పువ్వాడ అజయ్‌పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. బాహాబాహీ .. రాళ్లదాడి ప్రజాసంగ్రామ యాత్రలో సోమవారం తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. వేముల గ్రామాన్ని దాటుతున్న సమయంలో టీఆర్ఎస్ కార్యకర్తలు కొందరు పాదయాత్రను అడ్డుకోవడానికి ప్రయత్నించగా బీజేపీ కార్యకర్తలు వారిని ప్రతిఘటించారు. పోలీసుల జోక్యంతో పాదయాత్ర కొనసాగింది. కాసేపటికే మళ్లీ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. తర్వాత షాబాద వైపు నుంచి వాహనంలో వచ్చిన కొందరు టీఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులతో వాదనకు దిగారు. వాదన ముదరడంతో బాహాబాహీకి దిగారు. ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు. రాళ్లు సైతం రువ్వుకున్నారు. టీఆర్ఎస్కు చెందిన ముగ్గురికి, బీజేపీకి చెందిన ముగ్గురికి గాయాలయ్యాయి. నాలుగు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. పోలీసులు వారిని చెదరగొట్టేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది. తర్వాత ఎస్పీ రంజన్‌రతన్ కుమార్ అక్కడికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. భోజన విరామం తర్వాత యాత్రకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ఉక్రెయిన్ యుద్ధంతో కష్టాలు పడుతుంటే.. వారికి మాత్రం బిరియానీలు, పాయసాలు!
మైసూరు: ప్రజలు కరోనాతో పాటు అనేక రకాల ఇబ్బందులు పడుతుంటే కాంగ్రెస్ నాయకులు మేకెదాటు పాదయాత్ర పేరుతో రోడ్ల పైన నృత్యాలు చేస్తూ బిరియానీలు తింటు, పాయసాలు తాగుతూ ఉత్సవాలు జరుపుకుంటున్నారని రెవెన్యూ మంత్రి ఆర్.అశోక్ విమర్శించారు. గురువారం మైసూరు కలెక్టరేట్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా, ఉక్రెయిన్ యుద్ధం తదితరాలతో ప్రజలు కష్టాలు పడుతున్నారని అన్నారు. ఇక్కడ కాంగ్రెస్ నాయకులు అవేమీ పట్టించుకోకుండా రోడ్లపై ఉత్సవాలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. మేకెదాటు పాదయాత్ర వల్ల కాంగ్రెస్ పార్టీ మరింత నాశనం అవుతుందని అన్నారు. -
రజకులకు మహర్దశ
సాక్షి, ప్రొద్దుటూరు : పుట్టినప్పటి నుంచి మరణించే వరకు పుట్టెడు చాకిరి చేసే రజకుల బతుకులు నేడు దుర్భరంగా మారాయి. ఒకప్పుడు బండెడు పని ఉండేది. నేడు పనిలేక ఇతర వృత్తుల వైపు పయనిస్తున్నారు. తరతరాలుగా రజక వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నా తమ జీవితాల్లో ఎలాంటి మార్పు లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది ఈ వృత్తితో జీవనం సాగించలేక మానుకొని.. ఇతర వృత్తులను నమ్ముకుని ఆధారపడ్డారు. ప్రతి రజకుడి ఇంటిలో ఒకరు కాకుండా కుటుంబ సభ్యులంతా కలసి వృత్తి పని చేయాల్సిన పరిస్థితి ఉంది. అదే సమయంలో తమకు ఇచ్చే కూలి (మేర) అధ్వానంగా ఉంటోందని వారు అంటున్నారు. జిల్లాలో దాదాపు లక్ష 69 వేల మంది రజకులు వృత్తినే ఆధారంగా చేసుకుని బతుకుతున్నారు. చాలా గ్రామాల్లో దుస్తులు ఉతకడంపై సమస్యలు ఏర్పడటంతో.. రజకులను సాంఘిక బహిష్కరణ చేసిన సంఘటనలు అనేకం ఉన్నాయి. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎక్కువగా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయని సంఘ నాయకులు చెబుతున్నారు. రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామంలో కూడా ఈ సమస్య తలెత్తినప్పుడు అప్పటి కలెక్టర్ జయేష్‌రంజన్ జోక్యం చేసుకుని పరిష్కరించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి గత నెల 17న ఏలూరులో బీసీ గర్జన సభలో ప్రకటించిన బీసీ డిక్లరేషన్‌లో రజకులకు సంబంధించి ఎంతో ప్రాధాన్యతను ఇచ్చారు. దీంతో రజకుల్లో సర్వత్రా ఆనందం వ్యక్తమవుతోంది. తమను ఎస్సీ జాబితాలోకి చేర్చే అంశంపై బీసీ కమిషన్ నివేదికను కేంద్ర ప్రభుత్వానికి పంపాలని రజకులు డిమాండ్ చేస్తున్నారు. 2017 నవంబర్‌లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్పయాత్ర 5వ రోజున ప్రొద్దుటూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా జగన్ రజకుల సమస్యలపై స్పందించారు. అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రంతో గట్టిగా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ విషయం తెలుసుకున్న సీఎం చంద్రబాబు నాయుడు తాము రజకులను ఎస్సీ జాబితాల్లో చేర్చుతామని ప్రకటించారు. సీఎం చంద్రబాబు బీసీ కమిషన్ వేయకుండా ఆంధ్ర విశ్వవిద్యాలయంలోని ముగ్గురు ప్రొఫెసర్లతో అధ్యయన కమిటీ వేశారు. వారు కేవలం రాష్ట్రంలోని విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో మాత్రమే పర్యటించారు. మిగతా జిల్లాలో వీరు పర్యటించడానికి బడ్జెట్ కేటాయించలేదు. హంగూ, ఆర్భాటాల కోసం రూ.కోట్లు ఖర్చుపెడుతున్న చంద్రబాబు ఈ కమిటీకి కనీసం రూ.50 లక్షలు కూడా కేటాయించకపోవడాన్ని చూస్తే తమపై ఎంత మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోందని రజకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నాలుగేళ్లుగా కేంద్రంలోని బీజేపీతో భాగస్వామ్యంగా ఉంటూ 20 మంది ఎంపీలు కలిగిన చంద్రబాబు ప్రభుత్వంలో తమకు న్యాయం జరగలేదని వారు అంటున్నారు. జగన్ ఇచ్చిన మాట తప్పడని వారు పేర్కొంటున్నారు. 2008లో హామీ ఇచ్చి అమలు చేయని చంద్రబాబు రజకులు తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి అండగా ఉంటూ వస్తున్నారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు మాత్రం వారిపై చిన్నచూపు చూస్తున్నారు. రాష్ట్రంలో ఉన్న రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని ఏనాటి నుంచో డిమాండ్ ఉంది. దేశంలోని 17 రాష్ట్రాలతోపాటు మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఈ విధానం అమలు అవుతోంది. వారిలాగే తమను అదే జాబితాలో చేర్చాలని తరతరాలుగా రజకులు డిమాండ్ చేస్తున్నారు. 2008లో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు హైదరాబాద్‌లోని ఇందిరాపార్కు వద్ద రజక గర్జన సభ నిర్వహించారు. సభకు ముఖ్య అతిథిగా హాజరైన అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే.. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని స్పష్టమైన హామీ ఇచ్చారు. 2016లో హైదరాబాద్‌లో జరిగిన చివరి అసెంబ్లీ సమావేశాల్లో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని గవర్నర్ ప్రసంగంలో తెలిపారు. 1999, 2004 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా తెలుగుదేశం పార్టీ రజకులను ఎస్సీ జాబితాలో చేర్చుతామని ప్రకటించింది. కానీ అమలు చేయలేదు. రజక సంఘం డిమాండ్లు ఎ భారతదేశంలోని 17 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్సీ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఎ 50 ఏళ్లు నిండిన రజక వృత్తిదారులకు నెలకు రూ.2 వేల పింఛన్ ఇవ్వాలి. ఎ రజకులపై జరిగే దాడులను అరికట్టడానికి రజక రక్షణ చట్టం అమలు చేయాలి. ఎ రజక ఫెడరేషన్ స్థానంలో కార్పొరేషన్ ఏర్పాటు చేసి రూ.500 కోట్లు కేటాయించాలి. ఎ రజక వృత్తి చెరువులు, ధోబీఘాట్ల స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడి.. రజక కమ్యూనిటీ హాళ్లు, వీలైన చోట రజక కాలనీలను ఏర్పాటు చేయాలి. ఎ ధోబీఘాట్ల నిర్మాణ పనులను నామినేషన్ల కింద రజక సొసైటీలకు అప్పగించాలి. ఎ టీటీడీ, ప్రభుత్వ ఆస్పత్రులు, కార్యాలయాల్లో రజక వృత్తిని కాంట్రాక్టర్లకు కాకుండా రజక వృత్తిదారులకే కేటాయించాలి. ఎ ప్రభుత్వ ఆస్పత్రులు, ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ధోబీ పోస్టుల్లో రజకులనే నియమించాలి. ఎ రాజధాని ప్రాంతంలో స్థలం కేటాయించి రజక భవన్ నిర్మించాలి. ఎ రాజకీయ ప్రాధాన్యత కల్పించాలి. జిల్లాలో రజకుల జనాభా నియోజకవర్గం జనాభా ప్రొద్దుటూరు 20 వేలు జమ్మలమడుగు 18 వేలు బద్వేలు 20 వేలు కడప 18 వేలు మైదుకూరు 15 వేలు పులివెందుల 15 వేలు కమలాపురం 15 వేలు రాయచోటి 18 వేలు రాజంపేట 15 వేలు రైల్వేకోడూరు 15 వేలు మొత్తం 1,69,000 -
కాపులపై సెక్షన్ 144 కత్తి
ఏలూరు (మెట్రో) : కాపుల ఉద్యమంపై ప్రభుత్వం కన్నెర్ర చేస్తోంది. గతంలో కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం పాదయాత్ర ప్రారంభిస్తానని ప్రకటించిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా 144 సెక్షన్ విధించి కాపుల పోరా టాన్ని అణచివేసేందుకు యత్నించింది. అప్పట్లో టీడీపీ నాయకులు నిర్వహించిన జనచైతన్య యాత్రలకు మాత్రం అనుమతి ఇచ్చింది. తాజాగా, మరోమారు ఆ సామాజిక వర్గం వారిపై ఆంక్షలు విధిస్తూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఈనెల 25వ తేదీన కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం రావులపాలెం నుంచి పాదయాత్ర చేపట్టనున్నారు. 30వ తేదీ వరకూ కొనసాగే ఈ యాత్ర అంతర్వేది చేరుకోనుంది. ఈ నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాలోనూ 144 సెక్షన్ అమలు చేస్తున్నట్టు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోనూ కాపులు ఎటువంటి సభలు పెట్టకూడదంటూ నిషేధాజ్ఞలు విధిం చింది. మంగళవారం నుంచి ఈనెల 30వ తేదీ అర్ధరాత్రి వరకు నిషేధాజ్ఞలు అమల్లో ఉంటాయని జిల్లా కలెక్టర్ కె.భాస్కర్ ప్రకటించారు. జిల్లాలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చర్యలు తీసుకోవడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్టు పేర్కొన్నారు. 144 సెక్షన్ ప్రకారం.. ఐదుగురికి మించి గుంపులుగా తిరగకూడదని, అనుమతి లేకుండా సభలు, సమావేశాలు నిర్వహించకూడదని కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు. నిషేధాజ్ఞల అమలుకు జిల్లా పోలీస్ అధికారులతో ప్రజలు సహకరించాలని కోరారు. రేపు చలో రావులపాలెం ముద్రగడ పద్మనాభం బుధవారం రావులపాలెం నుంచి పాదయాత్ర ప్రారంభించనున్న నేపథ్యంలో జిల్లాలో పలుచోట్ల కాపు సంఘాల నేతలు సోమవారం సమావేశమయ్యారు. ముద్రగడకు సంఘీభావంగా కాపులంతా రావులపాలెం చేరుకోవాలని పిలుపునిచ్చారు. అక్కడి నుంచి ఆయనతో కలిసి పాదయాత్రలో పాల్గొనాలని తీర్మానించారు. జిల్లానుంచి తరలివెళ్లే వారిని ఎట్టిపరిస్థితుల్లో అడ్డుకోవాలని పోలీస్ యంత్రాగానికి ఆదేశాలు అందాయి. జిల్లా సరిహద్దుల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేయడంతోపాటు పాదయాత్రకు వెళ్లకుండా కాపు వర్గాలను అడ్డుకోవాలని సూచనలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచే నిషేధాజ్ఞలు అమలు చేసేందుకు పోలీస్ యంత్రాంగం సన్నద్ధమైంది.