Pablo Escobar
-
కంపు చేస్తున్నాయని.. భారత్‌కు తరలిస్తున్నారు
ఒకప్పుడు వాటి సంఖ్య నాలుగు మాత్రమే. ఇప్పడు ఆ కౌంట్ 130కి చేరింది. పెరిగితే పెరిగాయ్. కానీ, ఆ ప్రాంతమంతా కంపు కంపు చేస్తున్నాయి. అందుకే వాటిని వదిలించుకునేందుకు అధికారులు, ప్రభుత్వం శతవిధాల ప్రయత్నించాయి. ఇక చివరి ప్రయత్నంగా వాటిని భారత్‌కు తరలించేందుకు సిద్ధం అయ్యాయి. కొలంబియా ప్రభుత్వం తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకుంది. డెబ్భై హిప్పోపోటమస్లను పట్టుకుని వాటిని భారత్‌తో పాటు మెక్సికోకు తరలించాలని నిర్ణయించుకుంది. ఇక్కడ విశేషం ఏంటంటే.. ఇవి డ్రగ్ లార్డ్‌గా పేరుగాంచిన పాబ్లో ఎస్కోబార్‌కు చెందినవి కావడం. 1980లో ఎస్కోబార్ నాలుగు హిప్పోపోటమస్(నీటి ఏనుగులను) ఆఫ్రికా నుంచి అక్రమంగా తెప్పించుకున్నాడు. ఆ టైంలో అతని దగ్గర ఏనుగులు, జిరాఫీలు.. ఇలా జంతువుల కలెక్షన్స్‌తో ఒక పెద్ద జూ ఉండేది. పశ్చిమ ప్రాంతంలోని తన ఎస్టేట్‌లో వీటిని ఉంచాడు. అయితే.. 1991లో ఎస్కోబార్ లొంగిపోయాక.. అక్కడి ప్రభుత్వం వాటికి స్వేచ్ఛ కల్పించింది. అటుపై.. ఆ ఈ ముప్పై ఏళ్లలో ఆ నాలుగు నీటి ఏనుగుల సంఖ్య కాస్త 130కి చేరుకుంది. ప్రస్తుతం అవి మాగ్డలీనా నది ప్రాంతంలో ఉంటున్నాయి. అయితే.. అక్కడి నేల సారవంతాన్ని పాడు చేయడంతో పాటు, అక్కడి నీటిని కలుషితం చేస్తున్నాయి. మొక్కలను పాడు చేస్తున్నాయి. పైగా స్థానికులు సైతం వాటి వల్ల ప్రాణపాయం ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ తరుణంలో.. వాటి జనాభాను నియంత్రించేందుకు కొలంబియా ప్రభుత్వం ప్రయత్నించింది. కానీ, ఆ చర్యలు ఫలించలేదు. చేసేది లేక వాటిని చంపేందుకు కూడా అనుమతులు మంజూరు చేసింది. దీంతో తీవ్ర ఎత్తున నిరసన వ్యక్తం కావడంతో ఆ ఆదేశాలను వెనక్కి తీసుకుంది. ఇక చివరి ప్రయత్నంగా వాటిని దూరంగా తరలించడమే మార్గమని కొలంబియా ప్రభుత్వం భావిస్తోంది. భారత్‌కు 60, మెక్సికోకు పది హిప్పోలను తరలించాలని నిర్ణయించుకుంది కొలంబియా ప్రభుత్వం. అయితే.. ఈ కొలంబియా ప్రతిపాదనపై భారత్ స్పందన తెలియాల్సి ఉంది. -
దావూద్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
-
దావూద్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారత్ మోస్ట్ వాంటెడ్ అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం ఆస్తుల విలువ ఎంతో తెలుసా? ప్రపంచంలో అత్యంత ధనవంతులైన గ్యాంగ్స్టర్ల జాబితాలో రెండోస్థానంలో ఉన్నాడు. బ్రిటన్‌లో దావూద్ ఆస్తుల జప్తు నేపధ్యంలో ఈ ఆశ్చర్యకర విషయాలు వెలుగులోకి వచ్చాయి. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఫోర్బ్స్ బిజినెస్ మేగజైన్ ఈ వివరాలు వెళ్లడించింది. కొకైన్ కింగ్‌గా పిలువబడే ఎస్కోబార్ మొదటి స్థానంలో ఉన్నాడు. అమెరికాలో ఉపయోగించే డ్రగ్స్‌లో సుమారు 80శాతం ఎస్కోబార్ సరఫరా చేస్తాడు. డైలీన్యూస్ కథనం ప్రకారం 1990ల నాటికే ఎస్కోబార్ 30 బిలియన్ డాలర్ల విలువైన సంపదలు ఉన్నాయని సమాచారం. అతను అత్యంత సంపన్నుడైన నేరస్థుడిగా డైలీన్యూస్ ప్రచురించింది. దావూద్‌కు 2015నాటికి 6.7 బిలియన్ డాలర్ల విలువ చేసే నికర ఆస్తులు ఉన్నాయని డైలీన్యూస్ తెలిపింది. తాజాగా బ్రిటన్ ప్రభుత్వం పెద్ద మొత్తంలో దావూద్ ఇబ్రహీం ఆస్తులను జప్తు చేసిన సంగతి తెలిసిందే. -
డ్రగ్ కింగ్ ఇల్లా.. మజాకా?
తన తండ్రి బతికున్న రోజుల్లో తాను మహారాజులా ఉండేవాడినని, అప్పట్లో ఇంట్లో కాకుండా డిస్నీలాండ్లో ఉన్నట్లు అనిపించేదని అలనాటి డ్రగ్ కింగ్ పాబ్లో ఎస్కోబార్ కుమారుడు జువాన్ ఎస్కోబార్ చెప్పాడు. కొలంబియా ప్రాంతంలోనే కాక యావత్ ప్రపంచంలోనే అతి పెద్ద డ్రగ్ స్మగ్లర్‌గా పేరొందిన ఎస్కోబార్.. తన ఇంటి పెరట్లో ఏనుగులు, జీబ్రాలు.. ఇలాంటి పెద్దపెద్ద జంతువులను కూడా పెంచేవాడట. 1993లో ఎస్కోబార్ మరణంతో అతడి డ్రగ్స్ సామ్రాజ్యం మొత్తం కుప్పకూలింది. అప్పుడు పేరు మార్చుకుని కొలంబియా వదిలి వెళ్లిపోయే అవకాశం ఉన్నా జువాన్ మాత్రం అలా చేయలేదు. తన తండ్రి అంటే అతడికి అంతులేని ప్రేమ. ఇంట్లో బోలెడన్ని ఏనుగులు, జిరాఫీలు, పెద్దపెద్ద మోటార్ సైకిళ్లు అన్నీ ఉండేవని, ఇక ఖర్చుపెట్టుకోడానికి డబ్బులైతే లెక్కలేనన్ని ఉండేవని జువాన్ చెప్పాడు. తండ్రి కోసం కావాలంటే తన ప్రాణాలు సైతం ఇవ్వడానికి సిద్ధంగా ఉండేవాడినన్నాడు. తన తండ్రిని ద్వేషించడానికి తనకు ఒక్క కారణం కూడా లేదని, ఎందుకంటే ఆయన ఏం చేస్తారో అప్పటికి తనకు సరిగ్గా తెలియదని వివరించాడు. ఈశాన్య కొలంబియాలోని మెడెలిన్ అనే పట్టణంలో ఒక నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ఎస్కోబార్.. ప్రపంచంలోనే మోస్ట్ వాంటెడ్ స్మగ్లర్‌గా ఎదిగాడు. కొకైన్ స్మగ్లింగ్ ద్వారా దాదాపు వారానికి 2862 కోట్ల రూపాయలు సంపాదించేవాడు! డ్రగ్స్ స్మగ్లింగ్ నుంచి మొదలుపెట్టి.. వేలాది హత్యలు చేయించడం, చివరకు ఒక విమానాన్ని కూడా పేల్చేసేవరకు తన నేరసామ్రాజ్యాన్ని విస్తరించాడు. సంపాదించిన డబ్బులో చాలావరకు పేదలకు పంచిపెట్టేసేవాడు. దాంతో అతడిని కొలంబియా రాబిన్ హుడ్ అనేవారు. పార్లమెంటుకు పోటీ చేయాలని భావించడంతోనే తన తండ్రి పతనం ప్రారంభమైందని జువాన్ ఎస్కోబార్ చెప్పాడు. ఎన్నికల్లో పోటీ అంటేనే అందరి దృష్టి ఆయనమీద పడుతుందని, ఆ పని చేసి ఉండకపోతే ఇప్పటికీ తన తండ్రి బతికే ఉండేవాడని తెలిపాడు. చాలాసార్లు పోలీసు దాడులు, ఇతర గ్యాంగ్స్టర్ల దాడుల నుంచి తప్పించుకున్న ఎస్కోబార్.. చివరకు 1993 డిసెంబర్ రెండో తేదీన కొలంబియా పోలీసుల కాల్పులలో మరణించాడు. తన తండ్రి చనిపోవడానికి పది నిమిషాల ముందు కూడా ఆయనతో తాను మాట్లాడానని జువాన్ అన్నాడు. తండ్రి పోయిన ఆవేశంలో.. ఆయన వ్యాపారాన్ని తాను కొనసాగిస్తానని చెప్పినా, తర్వాత నిర్ణయం మార్చుకుని శాంతియుత జీవనం గడిపాడు. -
శాంతినివ్వని సంపద..!
ఎనిమిదేళ్ల వయసులో ‘మాన్యుయేలా’ ఓ వింత కోరిక కోరింది. పుస్తకాల్లో మాత్రమే కనిపించే రెక్కల గుర్రంతో ఆడుకోవాలని ఉందని చెప్పింది. ‘పాబ్లో ఎస్కబార్’కు కూతురంటే ప్రాణం. తన కోసం ఏదైనా చేయాలనుకుంటాడు. అతడు తలచుకుంటే చేయగలడు కూడా. రెక్కల గుర్రాన్ని కూడా అలాగే తెప్పించాడు..! అది చూసిన చిన్నారి మాన్యుయేలా మురిసిపోయింది. లవ్యూ డాడీ.. అంటూ తండ్రిని గట్టిగా హత్తుకుంది. ఆమెకు తెలీదు, అది మామూలు గుర్రమేనని.. ఎస్కబారే దాని వీపుపై రెక్కలను అతికించాడనీ..! మాన్యుయేలా కోరుకున్నవన్నీ అందించగలడు ఎస్కబార్. ఒక్క శాంతియుత జీవితాన్ని తప్ప! అవును.. అతనో డ్రగ్‌లార్డ్..!! చుట్టూ పదుల సంఖ్యలో సెక్యూరిటీ, వందల ఎకరాల విశాలమైన ఇల్లు, ఒక్కరోజులో లెక్కపెట్టడం సాధ్యం కానంత సంపద, ప్రభుత్వాలనే గడగడలాడించే నెట్వర్క్.. ఇవేవీ పాబ్లో ఎస్కబార్కు పెద్దగా సంతృప్తిని ఇవ్వవు. తన పిల్లలిద్దరితో ఆడుకోవడం కంటే మరేదీ అతనిని సంతోషపరచదు. కానీ, ఎస్కబార్ది విచిత్రమైన పరిస్థితి. చేతినిండా డబ్బు ఉండాలనుకుంటాడు. అది చేతులనే విరిచేసేంత బలమైనదైనా సరే.. తనతోనే ఉండాలనుకుంటాడు. అందుకోసం చేయకూడని పనులెన్నో చేస్తాడు. దొంగ లాటరీ టికెట్లు అమ్మడం, కిడ్నాప్‌లు, డ్రగ్స్ సరఫరా చేయడం.. ఇలా ఏవేవో చేస్తాడు. సంపాదనంతా తన పిల్లల కోసమే అని చెప్పుకొని మరీ సంపాదిస్తాడు. ఎంత సంపాదిస్తాడో తెలుసా..? చిన్న చిన్న దేశాల ప్రభుత్వాలు కూడా కూడబెట్టలేనంత! రోజుకు 70 మిలియన్ డాలర్లు.. కొందరి లెక్కల ప్రకారం ఏడాదికి 21 బిలియన్ డాలర్ల పైమాటే! కుప్పలు తెప్పలుగా వచ్చిపడే సొమ్మును కట్టకట్టేందుకే వారానికి వెయ్యి డాలర్లు ఖర్చు చేస్తాడట. అది కూడా రబ్బరు బ్యాండుల కోసం! ఎంత సంపదో కదా..! కొలంబియాలోని దిగువ మధ్యతరగతి కుటుంబంలో జన్మించాడు పాబ్లో ఎస్కబార్. ఏడుగురు సంతానంలో ఒకడు. చిన్నతనంలో పాఠశాలకు సరిగ్గా వెళ్లేవాడు కాదు. ఎక్కడెక్కడో తిరిగేవాడు. చెడు సావాసాలు అప్పుడే అలవాటయ్యాయి. ఖర్చులకు తల్లిదండ్రులు డబ్బులు ఇవ్వడం లేదనే సాకుతో దొంగ లాటరీ టికెట్లు అమ్మడం మొదలుపెట్టాడు. దొంగచాటుగా మత్తుపదార్థాలు నింపిన చుట్టలు, సిగరెట్లు కూడా అమ్మేవాడు. ఇవి చాలవన్నట్టు ఎవరిదైనా కారో, బైకో కనిపించడం చాలు.. చేతివాటం చూపేవాడు. ఇలా నేర ప్రవృత్తిని తనలో అణువణువునా నింపుకొన్నాడు. అమెరికా అప్పటికీ ఇప్పటికీ సంపన్నదేశమే. ఆ దేశానికి మత్తుపదార్థాలు సరఫరా చేస్తే ఎక్కువ సొమ్ము సంపాదించొచ్చని తెలుసుకున్నాడు. కానీ, అది చాలా కష్టమైన పని. దొరికితే అమెరికన్ అధికారుల చేతిలో చావు దెబ్బలు తినాల్సిందే. ఎస్కబార్ ఏరోజూ దొరకలేదు. మొదట్లో కొద్దిమొత్తంలో అమెరికాకు పంపించే కొకైన్‌ను ఏకంగా రోజుకు 15 టన్నుల ఎగుమతి స్థాయికి చేర్చాడు. ఇదంతా ఎలా సాధ్యమని ప్రశ్నిస్తే ఒక్కటే చెబుతాడు.. ‘‘సింపుల్..! ఇక్కడ కొంత లంచమిచ్చా.. అక్కడ కొంత. ఓ మంచి బ్యాంకర్‌ను పట్టుకున్నా. అతడికీ కాస్తంత ముట్టజెప్పా. అంతే..!’’ అంటాడు ఏమాత్రం పశ్చాత్తాపపడకుండా. తను చేస్తోంది ఘోర తప్పిదమని అతడికీ తెలుసు. కానీ, అతడికి డబ్బు కావాలి. డబ్బు తీసుకొచ్చే పేరు కావాలి. ఈ పేరు కోసమే కొలంబియాలో ఇళ్లు కట్టించాడు, ఆసుపత్రులు నిర్మించాడు, పిల్ల్లలకు ఫుట్‌బాల్ కిట్లు, పాఠశాలలు, పెద్దలకు భారీ స్టేడియాలు, చర్చిలు, నిరుపేదలకు చేతి నిండా సొమ్ము, కడుపు నిండా తిండి..! చాలా చేశాడు ఎస్కబార్. ఎలా చేశాడన్నది అతడికి అనవసరం, ప్రజల సంగతి సరేసరి! ఎస్కబార్ను దేవుడిలా చూశారు స్థానికులు. అతడికి నీరాజనాలు పట్టారు. కొలంబియాలోని ఓ రోమన్ కేథలిక్ చర్చిలో అతడికి బాగా పలుకుబడి వచ్చింది. ఎస్కబార్ కోరుకునేదీ అదే! తానో ‘రాబిన్ హుడ్’నని భావిస్తాడాయన. ఎంతచేసినా అక్రమం సక్రమం కాబోదు. కాలేదు కూడా..! అప్పటివరకూ చూసీ చూడనట్టు ఊరుకున్న కొలంబియా ప్రభుత్వానికి ఎస్కబార్పై పట్టలేనంత కోపమొచ్చింది. కానీ, ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి. ఎందుకంటే.. కొలంబియా కంటే ఎస్కబార్ పెద్దవాడు. అతడి స్థాయి, శక్తి పెద్దది. అతడిని ఒంటరిగా ఓడించడం కష్టం. ఇరవై ఏళ్లలో అతడో మహావృక్షమై కూర్చున్నాడు. అందుకే అమెరికా సాయమడిగింది కొలంబియా. అగ్రరాజ్యానికీ ఎస్కబార్తో తలనొప్పే. ఎంత నియంత్రించాలనుకున్నా తమ దేశంలోకి కొకైన్‌ను పంపుతూనే ఉన్నాడు మరి! ఒక్క అమెరికా ఏం ఖర్మ? అప్పటికి ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మత్తుపదార్థాల వ్యాపారం ఒక్క ఎస్కబారే నిర్వహించేవాడంటే అతడు ఏ స్థాయిలో అక్రమ వ్యాపారాలు చేసేవాడో తెలుసుకోవచ్చు. ఇక అతడిని ఉపేక్షించకూడదని నిర్ణయించుకుంది అమెరికా. ప్రపంచ చరిత్రలోనే అత్యంత ధనవంతుణ్ని మట్టుబెట్టాలని తుపాకులు ఎక్కుబెట్టింది. అయితే, అదేమంత సులభం కాలేదు. రెండు దేశాలు కలిసి ఓ ఆపరేషన్ నిర్వహిస్తే పాబ్లో ఎస్కబార్ను అంతమొందించడానికి ఏడాది పట్టింది. ఎంత సంపాదిస్తేనేం.. దిక్కులేని చావుచచ్చాడు! అక్రమ మార్గా ల్లో సంపాదన ఎన్నటికైనా చేటేనని ప్రపంచానికి మరోసారి తెలిసొచ్చేలా చేశాడు. కొసమెరుపు డ్రగ్‌లార్డ్, కొకైన్ కింగ్‌గా చరిత్రకెక్కిన పాబ్లో ఎస్కబార్ చావుకు కూడా ముందు చెప్పుకున్న పుత్ర వాత్సల్యమే కారణం. తన కుమారుడితో ఫోన్లో సంభాషిస్తూ నిఘా వర్గాలకు అడ్డంగా దొరికిపోయాడు. ఆ సంభాషణలో ఎస్కబార్ ఏం చెప్పాడో తెలుసా..? తాను ప్రభుత్వానికి లొంగిపోవాలనుకుంటున్నానని..!!