parade grounds meeting
-
ట్రిలియన్ డాలర్ల శక్తి మహిళలే!
ఎప్పుడైనా కూడా మహిళలకు అండగా నిలిచింది ఇందిరమ్మ రాజ్యమే. ప్రజలు ఇందిరాగాందీని అమ్మ అని పిలిచారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ను అన్నా అన్నారు. ఇప్పుడు నన్ను కూడా అన్నా అని పిలుస్తున్నారు. తోబుట్టువు మాదిరిగా ఆదరిస్తున్నారు. అలాంటి తోబుట్టువుల కోసం నేను ఎలాంటి రిస్క్ అయినా ఎదుర్కొంటా. ఇందిరమ్మ శక్తి, ఎన్టీఆర్ యుక్తి.. రేవంత్ స్ఫూర్తితో మీరు ముందుకెళ్లండి. ప్రజా ప్రభుత్వం ప్రధాన లక్ష్యం ఆడబిడ్డల అభివృద్ధే. ఇందిరా మహిళా శక్తి అంటే ప్రపంచానికే ఆదర్శంగా నిలబడేలా తీర్చిదిద్దుతా.సాక్షి, హైదరాబాద్: తెలంగాణను ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మార్చగల శక్తి మహిళలేనని.. రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వం లక్ష్యమని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి(Revanth Reddy) పేర్కొన్నారు. మహిళలను కోటీశ్వరులను చేస్తే ప్రపంచంలోనే తెలంగాణ రాష్ట్ర బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం(International Women's Day) నేపథ్యంలో శనివారం సికింద్రాబాద్ పరేడ్‌గ్రౌండ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ‘ఇందిరా మహిళా శక్తి(Mahila Shakthi)’కార్యక్రమానికి సీఎం రేవంత్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంలో పదేళ్లు చంద్రగ్రహణంతో మహిళలు చీకటిలోకి నెట్టబడ్డారు.వారు కనీసం మండల కేంద్రంలోని సమాఖ్య కార్యాలయానికి వెళ్లే పరిస్థితి లేకుండా పోయింది. పదేళ్ల పాటు మహిళాభివృద్ధి జాడలేదు. ఇందిరమ్మ ప్రజాప్రభుత్వంతో మహిళలు మళ్లీ వెలుగులోకి వచ్చారు. రాష్ట్ర రాజధాని నగరానికి వచ్చి ఆత్మగౌరవాన్ని చాటే పరిస్థితికి వచ్చారు. జనాభాలో సగభాగం ఉన్న మహిళలకు వడ్డీలేకుండా రుణాలు ఇవ్వడం మొదలు వివిధ ఆర్థిక పురోగతి కార్యక్రమాలతో సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఏర్పాటు కోసం రాష్ట్ర ప్రభుత్వం వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది.రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ విద్యా సంస్థల్లోని విద్యార్థుల కోసం 1.30 కోట్ల యూనిఫారాలు కుట్టే బాధ్యతను మహిళలు విజయవంతం చేశారు. మహిళా సంఘాల ఉత్పత్తులకు అంతర్జాతీయ స్థాయి మార్కెటింగ్ కోసం హైటెక్ సిటీలో మహిళా బజార్ ఏర్పాటు చేశాం. సమావేశాలు ఏర్పాటు చేసుకునేందుకు రూ.25 కోట్లతో మహిళా శక్తి భవనాలు నిర్మిస్తున్నాం. మహిళలను పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం అదానీ, అంబానీలే కాదు.. తెలంగాణ మహిళలు విద్యుత్ వ్యాపారాన్ని చేయగలరనే ధీమాతో వారికి వెయ్యి మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. వారిని పారిశ్రామికవేత్తలను చేస్తున్నాం. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమే కాకుండా.. ఆరీ్టసీకి బస్సులు అద్దెకు ఇచ్చే స్థాయికి తీసుకెళ్తున్నాం.వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులను వారి ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇచ్చేలా ఎంఓయూ కుదిర్చాం. రాబోయే రోజుల్లో ప్రతీ మండలంలో మహిళలకు రైస్ మిల్లులు, గోడౌన్స్ నిర్మించే బాధ్యత తీసుకుంటా. మిల్లుల్లో ధాన్యాన్ని బొక్కుతున్న పందికొక్కులకు, దొంగలకు బుద్ధి చెబుతాం. ప్రభుత్వమే మహిళలకు స్థలం ఇస్తుంది, రుణాలు ఇస్తుంది, గోడౌన్స్ నిర్మించండి, వ్యాపారవేత్తలుగా మారండి. మీకు ప్రభుత్వం ఎల్లవేళలా అండగా ఉంటుంది. కార్పొరేట్ కంపెనీలతో పోటీపడేలా మహిళలు వ్యాపారాల్లో ముందుకెళ్లాలి. మహిళా సంఘాల్లో వయసు సడలింపు.. రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాల్లో (ఎస్‌హెచ్‌జీల్లో) 65 లక్షల మంది ఉన్నారు. మేం కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేసేందుకు ఎస్‌హెచ్‌జీలలో చేరే నిబంధనలు సడలించాలని నిర్ణయించాం. ప్రస్తుతం 18 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య మహిళలు మాత్రమే సభ్యులుగా ఉన్నారు. ఇకపై 15 ఏళ్ల నుంచి 65 ఏళ్ల మహిళలందరికీ అవకాశం కల్పించేలా నిబంధనలు తెస్తాం..’’అని సీఎం రేవంత్ తెలిపారు. ఎస్‌హెచ్‌జీలకు చెక్కును అందజేస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రులు పొంగులేటి, సీతక్క, కొండా సురేఖ, ఉత్తమ్, పొన్నం, జూపల్లి తదితరులు వడ్డీ లేకుండా రూ.21 వేల కోట్ల రుణాలు: డిప్యూటీ సీఎం భట్టి రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలకు వడ్డీలేకుండా రూ.21వేల కోట్ల రుణాలు ఇస్తున్నామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. పదేళ్ల పాటు మహిళా సంఘాలకు పైసా సాయం చేయని గత ప్రభుత్వ నేతలు.. ఈరోజు ఎస్‌హెచ్‌జీలకు వడ్డీలేని రుణాలంటే వెకిలిగా నవ్వుతున్నారని మండిపడ్డారు. మహిళా సంఘాల అభివృద్ధి కోసం ప్రభుత్వం సరికొత్త కార్యక్రమాలను తీసుకువస్తోందన్నారు.రాష్ట్రంలో మహిళలు తలెత్తుకుని మహాలక్ష్మిలా గౌరవంగా బతకాలన్నదే ప్రజాప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు. గత ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్న హరీశ్‌రావు బడితె మాదిరి పెరిగారే తప్ప మహిళలకు కనీసం రుణాలు ఇప్పించలేకపోయారని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం ప్రతి రూపాయి పోగేసి ప్రజల సంపద పెరిగేందుకు కృషి చేస్తోందని.. దాన్ని చూసి ఓర్వలేక ప్రతిపక్షాలు పిచ్చిమాటలు మాట్లాడుతున్నాయని మండిపడ్డారు. అనంతరం మంత్రి సీతక్క మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి కింద ప్రజాప్రభుత్వం 20 రకాల అద్భుత కార్యక్రమాలను అమల్లోకి తీసుకురావడం ఎంతో సంతోషకరమని పేర్కొన్నారు. ‘ఇందిరా మహిళా శక్తి’ విశేషాలివీ.. ⇒ మహిళా సంఘాల ద్వారా ఆర్టీసీకి అద్దెకు ఇవ్వనున్న బస్సులను సీఎం రేవంత్ జెండా ఊపి ప్రారంభించారు. ⇒ కార్యక్రమంలో 2,82,552 స్వయం సహాయక సంఘాల (ఎస్‌హెచ్‌జీ)కు రూ.22,794.22 కోట్ల రుణాల చెక్కులను సీఎం అందించారు. ⇒ ఎస్‌హెచ్‌జీ సభ్యులకు రుణబీమా, ప్రమాద బీమా పథకాల కింద రూ.44.80 కోట్ల చెక్కును అందించారు. ⇒ మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న సోలార్ ప్లాంట్లకు సీఎం వర్చువల్‌గా శంకుస్థాపన చేశారు. ⇒ ఇందిరా మహిళాశక్తి మిషన్–2025 పాలసీని సీఎం ఆవిష్కరించారు. ⇒ సభకు ముందు సీఎం రేవంత్, మంత్రులు వివి ధ మహిళా సంఘాల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసి న కుటీర పరిశ్రమల స్టాళ్లను, మహిళా పెట్రోల్ బంకు నమూనాను పరిశీలించారు.బీఆర్ఎస్ నేతలది పైశాచిక ఆనందం రాష్ట్రంలో ఎలాంటి ప్రమాదం జరిగినా నన్ను తిడుతూ ప్రతిపక్షాలు పైశాచిక ఆనందం పొందుతున్నాయి. టన్నెల్ కూలి కార్మికులు మరణిస్తే సంతోషపడుతున్నారు. రోడ్డు ప్రమాదం జరిగితే నవ్వుతున్నారు. పంటలు ఎండితే బీఆర్ఎస్ నేతలు పైశాచిక ఆనందం పొందుతున్నారు. వాళ్ల పైశాచిక ఆనందం కోసం నన్ను తిడుతున్నారు. ప్రజలకు కష్టం వస్తే ఆదుకోవడానికి ప్రయతి్నంచాలి. పదేళ్ల పాలన అనుభవంతో ప్రభుత్వానికి సూచనలు చేయాలి. కానీ పైశాచిక ఆనందం పొందడం మంచిది కాదు. అలాంటివారు బాగుపడరు. -
‘తల్లీ.. మీ మాట వినడానికే వచ్చాను’
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో శనివారం సాయంత్రం ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొన్న బహిరంగ సభలో ఓ యువతి కాసేపు అందరినీ టెన్షన్ పెట్టింది. ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న సమయంలో ఆమె ఫ్లడ్‌లైట్ స్తంభం ఎక్కింది. దీంతో పోలీసులతో పాటు అందరిలో కంగారు నెలకొనగా.. అది గమనించిన మోదీ ఆమెను వారించారు. ‘‘తల్లీ కిందకు దిగాలి. ఇది మంచిది కాదు. మీతో నేను ఉన్నాను. మీకోసమే ఇక్కడికి వచ్చాను. మీ మాట వినడానికే వచ్చాను. ఇలా చేయడం వల్ల ఎలాంటి ఫలితం ఉండదు. మీరు మందకృష్ణ మాట వినాలి’’ అని మైక్ ద్వారా విజ్ఞప్తి చేశారు. ప్రధాని అలా చెప్పడంతో ఆమె కిందకు దిగింది. కిందకు దిగిన ఆమెను పోలీసులు మందలించి వదిలేసినట్లు సమాచారం. ఎస్సీ వర్గీకరణ అంశంపై మోదీ ప్రసంగిస్తున్న సమయంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. -
మోదీ దళిత వర్గాలకు అండగా నిలిచారు: మందకృష్ణ మాదిగ
-
మాదిగ విశ్వరూప మహాసభ..మోడీ బహిరంగ సభ
-
స్ట్రాటజీ మార్చిన ప్రధాని మోదీ.. కేసీఆర్ ఊసెత్తకుండా..
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు అరగంట పాటు ప్రసంగించారు. ఊహించని విధంగా స్ట్రాటజీ మార్చిన మోదీ.. ఎలాంటి రాజకీయ విమర్శలు లేకుండా తన స్పీచ్ కొనసాగించారు. కేసీఆర్, టీఆర్ఎస్ ఊసెత్తకుండా ప్రసంగం చేశారు. కేసీఆర్ ప్రశ్నల ప్రస్తావన లేకుండా ప్రసంగం ముగించారు. అభివృద్ధే అజెండాగా ప్రధాని స్పీచ్ సాగింది. తెలంగాణకు కేంద్రం చేస్తున్న సాయంపైనే ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్కలు ప్రధాని వివరించారు. చదవండి: తెలంగాణపై బీజేపీ ప్రత్యేక డిక్లరేషన్.. అసలు అందులో ఏముంది? తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాల కోసం బీజేపీ బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. సబ్ కా సాథ్, సబ్కా వికాస్ కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాం. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
'వదిన భువనేశ్వరి ఓటు టీఆర్ఎస్కే'
చంద్రబాబు మాట ఎలా ఉన్నా.. తమ వదిన భువనేశ్వరి మాత్రం టీఆర్ఎస్కే ఓటు వేయడం ఖాయమని తెలంగాణ సీఎం కేసీఆర్ అన్నారు. సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో పలు చెణుకులు విసిరారు. హైదరాబాద్‌ను వదల బొమ్మాళీ వదల అని చంద్రబాబు అంటున్నారని, ఆయన్ను తాము పొమ్మనలేదని చెప్పారు. ఆయన వ్యాపారమంతా.. తమ వదిన భువనేశ్వరి చూస్తుందని, ఈయన కంటే ఆమే బాగా చూస్తోందని అన్నారు. కావాలంటే 15 రోజులకు ఓసారి వచ్చి లెక్కలు చూసుకుని పోవాలని తెలిపారు. భువనేశ్వరి కూడా ఇక్కడే ఉంటున్నారు కాబట్టి, ఆమెకు నిజాయితీ ఉందని, ఆమె మాత్రం గ్యారంటీగా తమకే ఓటు వేస్తారని అన్నారు. చంద్రబాబుకు వాస్తవాలు తెలియవు కాబట్టి ఇక్కడే ఉంటానంటున్నారని విమర్శించారు. నేను అమరావతికి, ముంబైకి వెళ్లి ఇక్కడే ఉంటానంటే కుదురుతుందా అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లో తనకు ఉండబుద్ధి వేయట్లేదని, హైదరాబాద్ నుంచి పాలించాలంటే విదేశాల్లో ఉన్నట్లు ఉంటుందని విజయవాడలో చెబుతారన్నారు. గోదావరి నీళ్లు, కరెంటు అన్ని విషయాల్లో పంచాయతీ పెడుతున్నారని మండిపడ్డారు. నీ పని నువ్వు చేసుకో, మా పని మేం చేసుకుంటామని స్పష్టం చేశారు. -
బాబూ.. నీ నెత్తుటి ముద్రలు అలాగే ఉన్నాయి
హైదరాబాద్ అభివృద్ధిలో అడుగడుగునా తన ముద్రలు ఉన్నాయని చెప్పిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. బషీర్‌బాగ్‌లో రైతులపై ఆయన కాల్పులు జరిపించారని, ఆ నెత్తుటి ముద్రలు ఇప్పటికీ ఉన్నాయని గుర్తు చేశారు. జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా సికింద్రాబాద్ పెరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించిన భారీ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. అనుకున్న సమయం కంటే ఆలస్యంగా వచ్చిన కేసీఆర్ కుడి చేతికి.. ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ దట్టీ కట్టారు. ఈ సందర్భంగా ఆయన ఇతర పార్టీలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణకు గుండెకాయ లాంటి హైదరాబాద్ కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయని, అనేక త్యాగాలు, పోరాటాలు, ఆత్మబలిదానాల ఫలితంగా తెలంగాణ ఏర్పడిందని ఆయన అన్నారు. ఈ తెచ్చుకున్న తెలంగాణ ఇప్పుడిప్పుడే నిలదొక్కుకుని ప్రయాణాన్ని ప్రారంభించిదన్నారు. ఈ సమయంలో జరుగుతున్న ఎన్నికలు చాలా ముఖ్యమైనవని, ఓటు వేసేవాళ్లు చాలా జాగ్రత్తగా ఆలోచించి వేయాలని కోరారు. యూపీఏ సర్కారు తెలంగాణ ఇవ్వడానికి హైదరాబాద్‌పై రాజీ పడతారా అని అడిగిందని, ఈ విషయంలో ఏ కొంచెం రాజీపడినా 2006 నాటికే తెలంగాణ వచ్చేదని అన్నారు. గుండెకాయ లేని మొండెం ఇస్తామంటే తీసుకోడానికి తాము సిద్ధంగా లేమని, హైదరాబాద్‌తో కూడిన తెలంగాణనే ఇవ్వాలని అడిగినట్లు చెప్పారు. అందుకే రాష్ట్ర సిద్ధికి పద్నాలుగున్నర సంవత్సరాలు పట్టిందన్నారు. నిన్న మొన్న హైదరాబాద్‌లో తిరిగిన చంద్రబాబు లాంటివాళ్లు దాదాపు వచ్చేసిన తెలంగాణ రాష్ట్రాన్ని కుట్రలు పన్ని అడ్డుకున్నారని, చివర్లో కూడా హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయాలన్నారని, ఇలాంటి తరుణంలో గట్టిగా నిలబడి, పోరాటం చేసి హైదరాబాద్‌తో సహా తెలంగాణ తెచ్చుకున్నట్లు చెప్పారు. చంద్రబాబుకు ఆంధ్రప్రదేశ్‌లో పని ఉందని, ప్రజలు అక్కడ అవకాశం ఇచ్చారు కాబట్టి అక్కడి బజారు ఊడ్చుకోవాలంటే హిందూపురం నుంచి ఇచ్ఛాపురం వరకు బోలెడు బజార్లున్నాయని, హైదరాబాద్ బజారు మేమే ఊడ్చుకుంటామని చెప్పానన్నారు. తెలంగాణలో వచ్చే ఆదాయం ఇక్కడి ప్రజల అభివృద్ధికే ఖర్చుపెడుతున్నామని చెప్పారు. మన డబ్బు మనకే మిగులుతోంది కాబట్టి పింఛను వెయ్యి, 1500 చొప్పున ఇస్తున్నామన్నారు. ఏపీలో మనిషికి 4 కిలోల బియ్యం ఇస్తుంటే తెలంగాణలో 6 కిలోల బియ్యం ఇస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రం విడిపోతే తెలంగాణ అంధకారం అవుతుందని మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు గానీ.. ఇక్కడ బ్రహ్మాండంగా కరెంటు సప్లై చేసుకుంటున్నట్లు తెలిపారు. పరిశ్రమలకు కూడా కోత లేకుండా 24 గంటల కరెంటు ఇస్తున్నామన్నారు. ఆడపిల్లల పెళ్లిళ్ల కోసం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల్లో రూ. 51 వేలు ఇస్తున్నామని, దేశంలో ఎక్కడా లేని విధంగా పేదల ఆత్మగౌరవం కోసం డబుల్ బెడ్రూం ఇళ్లు కట్టించి ఇస్తున్నట్లు గుర్తుచేశారు. ఇంకా ప్రాజెక్టులు కట్టుకోవాలి, మంచినీళ్లు తెచ్చుకోవాలని.. చాలా సాధించాల్సి ఉందని సీఎం కేసీఆర్ అన్నారు. బల్దియా ఎన్నికల్లో టీఆర్ఎస్ను గెలిపిస్తేనే అభివృద్ధి సాధ్యమని చెప్పారు. చంద్రబాబు నాయుడు వచ్చి కితకితలు పెట్టే ప్రయత్నం చేస్తున్నారని.. దీనిపై జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బల్దియాలో గులాబి జెండా ఎగిరితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మున్సిపాలిటీ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగితే బ్రహ్మాండమైన అభివృద్ధి సాధ్యం అవుతుందన్నారు. మూసీనదిని మురికి, కంపు నదిగా మార్చిన ఘనత కాంగ్రెస్, టీడీపీలది కాదా అని ప్రశ్నించారు. మంచినీటి చెరువు హుస్సేన్ సాగర్‌ను కాలుష్య కాసారంగా మార్చింది కూడా వాళ్లేనన్నారు. పెద్దమనిషి అని తాను భావించిన దత్తాత్రేయ కూడా ఉల్టాపల్టా మాట్లాడుతున్నారన్నారు. కేంద్రం ఇచ్చిన డబ్బులతోనే కేసీఆర్ డబుల్ బెడ్రూం ఇళ్లు కడతారని ఆయన అంటున్నారని.. కానీ కేంద్ర మంత్రిగా ఆయన నిజాయితీగా మాట్లాడాలని చెప్పారు. దేశంలో ఎక్కడైనా ఈ పథకం ఉందా అని ప్రశ్నించారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అక్కడి ముఖ్యమంత్రులు ఇలాంటి పథకం చేపట్టారా అని అడిగారు. చంద్రబాబుతో తిరిగి ప్రచారం చేశారని.. ఆయన పాలించే ఏపీలోనైనా డబుల్ బెడ్రూం స్కీం ఉందా అని నిలదీశారు. హైదరాబాద్ మీద ప్రేమ ఉందని, ఇక్కడే ఉంటానని చంద్రబాబు అంటున్నారు, ఆయన ముద్రలు అడుగడుగునా ఉన్నాయని అంటున్నారని ఎద్దేవా చేశారు. బషీర్‌బాగ్ పోలీసు కాల్పుల్లో నలుగురు రైతులను కాల్చి చంపిన ముద్రలు ఇప్పటికీ ఉన్నాయని, అసెంబ్లీ ఎదుట అక్కచెల్లెళ్లను గుర్రాలతో తొక్కించిన ముద్రలు ఉన్నాయని, కాంట్రాక్టు ఉద్యోగ వ్యవస్థ ముద్ర వేసింది ఆయనేనని, దాన్ని తిప్పి వాళ్లను పర్మినెంటు చేసి వాళ్ల కడుపు నింపే ప్రయత్నం చేస్తున్నామని అన్నారు. పెట్టుబడి దారులకు అండగా నిలబడి కార్మికుల కడుపు కొట్టారని మండిపడ్డారు. నారాయణకు ఎవరైనా చెవి కోస్తే ఆస్పత్రిలో చేర్చాలి.. సీపీఐ నాయకుడు నారాయణ గురించి కూడా ఆయన పలు విమర్శలు చేశారు. టీఆర్ఎస్ సొంతబలంతో గెలిస్తే తాను చెవికోసుకుంటానని ఆయన అన్నారంటూ.. ''5వ తేదీన హైదరాబాద్‌లో ఉండకు.. ఎవరైనా చెవి కోస్తే ఈఎన్టీ దవాఖానలో చేర్పించాలి'' అన్నారు. ఇప్పుడు కూడా చెవి కోసుకుంటా, కాలు కోసుకుంటానన్న బేల ముచ్చట్లు ఎందుకని ఎద్దేవా చేశారు. వరంగల్‌లో కూడా కొందరు చెవి కోసుకుంటా, మెడ కోసుకుంటా.. ఇంకేవో కోసుకుంటామన్నారని, 2వ తేదీన ఎవరెవరికి ఏం కోయాలో ప్రజలే చూసుకుంటారని చెప్పారు.