సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో జరిగిన బీజేపీ విజయ సంకల్ప సభలో ప్రధాని నరేంద్ర మోదీ దాదాపు అరగంట పాటు ప్రసంగించారు. ఊహించని విధంగా స్ట్రాటజీ మార్చిన మోదీ.. ఎలాంటి రాజకీయ విమర్శలు లేకుండా తన స్పీచ్ కొనసాగించారు. కేసీఆర్, టీఆర్‌ఎస్ ఊసెత్తకుండా ప్రసంగం చేశారు. కేసీఆర్ ప్రశ్నల ప్రస్తావన లేకుండా ప్రసంగం ముగించారు. అభివృద్ధే అజెండాగా ప్రధాని స్పీచ్ సాగింది. తెలంగాణకు కేంద్రం చేస్తున్న సాయంపైనే ప్రధాని దృష్టి కేంద్రీకరించారు. కేంద్రం నుంచి వచ్చిన నిధుల లెక్కలు ప్రధాని వివరించారు.
చదవండి: తెలంగాణపై బీజేపీ ప్రత్యేక డిక్లరేషన్.. అసలు అందులో ఏముంది?
తెలుగులో తన ప్రసంగాన్ని ప్రారంభించిన ప్రధాని.. బీజేపీ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పనిచేస్తుందన్నారు. బలహీన వర్గాల కోసం బీజేపీ బడుగు బలహీన వర్గాల కోసం బీజేపీ ఎంతో కృషి చేస్తోందన్నారు. సబ్ కా సాథ్, సబ్‌కా వికాస్ కోసం పనిచేస్తున్నాం. కరోనా కాలంలో ప్రజలకు ఉచితంగా వ్యాక్సిన్లు అందించాం. బీజేపీపై తెలంగాణ ప్రజలకు నమ్మకం మరింత పెరిగింది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా బీజేపీ పనిచేస్తోంది. గత ఎనిమిదేళ్లలో ప్రతి భారతీయుడికి మంచి చేసే ప్రయత్నం చేశాం. దశాబ్దాల నుంచి వంచనకు గురైన వాళ్ల అభివృద్ధి కోసం పనిచేశామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment