pending tasks
-
నిధులు ఫుల్.. పనులు నిల్
- 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.11.89 కోట్లు విడుదల - 13వ ఆర్థిక సంఘం నిధుల్లో రూ.35 కోట్ల పనులు పెండింగ్ - నిధుల విడుదలకు యుటిలైజేషన్ సర్టిఫికెట్ మెలిక పెట్టిన ప్రభుత్వం - హడావుడి పనులకు అధికారుల శ్రీకారం విజయవాడ సెంట్రల్ : నగరపాలక సంస్థలో విచిత్ర పరిస్థితి నెలకొంది. నిధులు వరదలా వస్తుంటే పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ప్రభుత్వం 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.11.89 కోట్లు నగరపాలక సంస్థకు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 13వ ఆర్థిక సంఘం నిధుల వినియోగానికి సంబంధించి యుటిలైజేషన్ సర్టిఫికెట్‌ను అందిస్తేనే 14 ఆర్థిక సంఘం నిధులు విడుదల చేస్తామని మెలిక పెట్టింది. దీంతో పాలకులు, అధికారుల్లో హైరానా మొదలైంది. పెండింగ్ పనుల్ని యుద్ధప్రాతిపదికన నిర్వహించేందుకు కసరత్తు మొదలుపెట్టారు. 13వ ఆర్థిక సంఘం కింద 2009-10 నుంచి 2014-15 మధ్య కాలానికి కార్పొరేషన్‌కు రూ.61 కోట్లు విడుదలయ్యాయి. ఇందులో రూ.26 కోట్ల మేర మాత్రమే పనులు జరిగాయి. రూ.35 కోట్ల పనులు జరగాల్సి ఉంది. కొన్ని పనులైతే టెండర్ల దశ దాటలేదు. గంగిరెద్దుల దిబ్బ పటమట ప్రాంతానికి కృష్ణా జలాలను తరలించేందుకు పైప్‌లైన్ పనులకు రూ.9 కోట్లు కేటాయించారు. సర్కిల్-2లో రూ.3.50 కోట్లతో, వన్‌టౌన్ ప్రాంతంలో రూ.9 కోట్లతో సంప్ నిర్మాణ పనుల్ని పూర్తి చేయాలని నిర్ణయించారు. వీటికి సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తయింది. వర్క్ ఆర్డర్ ఇచ్చారు. పనులు మాత్రం ప్రారంభం కాలేదు. నాణ్యతపై అనుమానాలు 14వ ఆర్థిక సంఘం నిధుల్ని అందిపుచ్చుకొనేందుకు అధికారులు మాస్టర్‌ప్లాన్ వేశారు. 13వ ఆర్థిక సంఘం నిధులకు సంబంధించిన పనుల్ని ప్రారంభించడంతో పాటు నిధుల వినియోగానికి సంబంధించి ఖర్చును చూపేందుకు సిద్ధమవుతున్నారు. చేపట్టిన పనుల్ని రెండు, మూడు నెలల వ్యవధిలో పూర్తిచేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. హడావిడి పనుల వల్ల నాణ్యతా ప్రమాణాలు దెబ్బతినే ప్రమాదం ఉందన్న వాదనలు వినిపిస్తున్నాయి. వన్‌టౌన్‌లో స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్, వివిధ గ్రాంట్లతో చేపట్టిన రోడ్ల నిర్మాణ పనుల్లో నాణ్యత సన్నగిల్లిందన్న విమర్శలు ఉన్నాయి. వన్‌టౌన్ ప్రాంతంలో పర్యటన సందర్భంగా మేయర్ కోనేరు శ్రీధర్ ఈ విషయాన్ని ధృవీకరించారు. పనుల్లో నాణ్యత ఉన్నట్లు ముగ్గురు స్థానికులు ధృవీకరిస్తేనే కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో అధికారులు హడావిడిగా చేసే పనుల్లో నాణ్యత ఎంతమేర ఉంటుందన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఆడిట్‌పై దృష్టి ఇంజనీరింగ్ విభాగం పనితీరుపై తీవ్రస్థాయిలో విమర్శలున్నాయి. రూ.50 లక్షలు దాటిన వ ర్క్స్పై సూపరింటెండెంట్ ఇంజనీర్, ఆలోపు అయితే ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ స్థాయిలో చెక్ మెజర్మెంట్స్ ఇవ్వాలి. కానీ అలా జరగడం లేదు. ఎం(మెజర్మెంట్) బుక్స్‌ను తప్పనిసరిగా మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది. నగరపాలక సంస్థలో అత్యధిక శాతం పనులకు సంబంధించి ఎంబుక్స్ లేవని సమాచారం. 13వ ఆర్థిక సంఘం నిధులతో చేపట్టిన పనులపై సాధ్యమైనంత త్వరలో ఆడిట్ పూర్తి చేసి 14వ ఆర్థిక సంఘం నిధుల్ని అందిపుచ్చుకోవాలని అధికారులు భావిస్తున్నారు. -
పెండింగ్ పనులు పూర్తి చేయండి
ప్రగతినగర్ : పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగంలో పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డి.రొనాల్డ్‌రోస్ సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక ప్రగతిభవన్ సమావేశ మందిరంలో శుక్రవారం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ పనుల పురోగతిపై సమీక్షించారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలన్నారు. గత సమావేశంలో జిల్లాకు సంబంధించి రహదారుల మ్యాప్‌ను అందించాలని చెప్పినప్పటికీ సిద్ధం చేయకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశంలో ఎస్ఈ శంకరయ్య, ఈఈలు రాజేంద్రప్రసాద్, సీతారాములు, మాధవి, డిప్యూటీ ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు. ఆలోచించండి.. స్వయం సహాయక సంఘాల ద్వారా కొత్తగా మార్కెటింగ్ చేసి లాభదాయక వ్యాపారాలు నిర్వహించేలా ఆలోచనలు చేయాలని కలెక్టర్ రొనాల్డ్‌రోస్ డీఆర్డీఏ, మెప్మా అధికారులకు సూచించారు. ఆయా శాఖలు నిర్వహిస్తున్న కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. సంఘాలను కేవలం వరి, మొక్కజొన్న కొనుగోలుకు మాత్రమే పరిమితం చేయకుండా వారు ఏ రకమైన వ్యాపారాలు నిర్వహిస్తే లాభదాయకంగా ఉంటుందో సూచించాలన్నారు. విద్యార్థుల యూనిఫారాలు, పెన్సిళ్లు, పాదరక్షలు, నోటుపుస్తకాలు, కూరగాయలు, పాలు తదితర వ్యాపారాలపై దృష్టి కేంద్రీకరించేలా చూడాలన్నారు. మహిళ సంఘాలకు మంజూరు చేసే లింకేజీ రుణాలను ఇతర రుణాల బకాయిలను బదిలీ చేయకుండా బ్యాంకర్లకు సూచనలు చేయాలన్నారు. సంఘాలు బలోపేతం కావడానికి చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశం పీడీలు వెంకటేశం, సత్యనారాయణ, డీపీఎంలు, ఏపీఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రజావాణి నిర్వహించాలి నిజామాబాద్‌నాగారం: ప్రజావాణి కార్యక్రమాన్ని డివిజన్, మండల స్థాయిల్లో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ డి. రొనాల్డ్‌రోస్ శుక్రవారం ఒక ప్రకటనలో సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రజా సమస్యలను పరిష్కరించడానికి ప్రతి సోమవారం తమ కార్యాలయాల్లో ప్రజావాణి నిర్వహించాలని ఆదేశించారు. జిల్లా ప్రజలు, ఆర్జీదారులు ఈ విషయాన్ని గమనించి, సంబంధిత మండలాల్లోనే తమ సమస్యలపై దరఖాస్తులు చేసుకోవాలని కోరారు. -
పెండింగ్ పనులపై ప్రతిపాదనలు
పులివెందుల రూరల్ : పట్టణంలోని ఇందిరాగాంధీ ఉన్నతస్థాయి పరిశోధన కేంద్రం(ఐజీకార్ల్)లో ఉన్న పెండింగ్ పనులకు సంబంధించి వెంటనే ప్రతిపాదనలు తయారు చేసి పంపాలని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం ఆయన ఐజీ కార్ల్‌ను క్షుణ్ణంగా పరిశీలించారు. అసంపూర్తిగా ఉన్న పరిశోధన భవనాలు, ఇతర మౌలిక వసతులను పరిశీలించారు. పెండింగ్‌లో ఉన్న అడ్వాన్స్ బయో సెక్యూరిటీ ల్యాబ్(ఏబీఎస్ఎల్-3), బయో సెప్టిల్యాబ్, పశువుల పరిశోధన కేంద్రంలోని పెండింగ్ పనులను వెంటనే పూర్తిచేసి అప్పగించాలని ఏపీఐఐసీ డిప్యూటీ జోనల్ మేనేజర్ సుబ్రమణ్యంను ఆదేశించారు. బీఎస్ఎల్-3, ఏబీఎస్ఎల్ ల్యాబ్‌ల పైభాగంలో యంత్రాలు, గాలీవాన, ఎండకు మరమ్మత్తులకు గురయ్యే అవకాశం ఉన్నందున వెంటనే టార్పాలిన్ పట్టతో కప్పి వేయాలని సూచించారు. ఐజీ కార్ల్‌లో తాగు, ల్యాబ్‌లకు అవసరమైన నీటి లభ్యతపై చర్చించారు. కేంద్రంలో ఉన్న బోర్ల మరమ్మతులు, విద్యుత్‌కు సంబంధించి 100కిలో వాట్లకు వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు. దొడ్ల పాల డెయిరీ పరిశీలన : ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యాలతో జీవీసీ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తున్న దొడ్ల పాల డెయిరీని మన్మోహన్ సింగ్ పరిశీలించారు. దేశంలో రాజస్థాన్ తర్వాత పులివెందులలో ఏర్పాటు చేసిన సెంటర్ ఫివోట్ ఇరిగేషన్ సిస్టం అమలుపై దొడ్ల డెయిరీ ఎండీ సునీల్‌రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విదేశాలనుంచి తెప్పించిన అధునాతన యంత్రాలు, గడ్డి నిల్వ చేసే కేంద్రాలు, ఆవుల కోసం ఏర్పాటు చేసిన షెడ్డును పరిశీలించారు. కార్యక్రమంలో తిరుపతి ఎస్వీ యూనివర్శిటీ డీన్ చంద్రశేఖరరావు, జిల్లా పశుసంవర్థక శాఖ జేడీ వెంకట్రావు, ఏపీఐఐసీ డీజీఎం సుబ్రమణ్యం, జినోమిక్స్ బయోటెక్సీవో, ఎన్ఆర్ఐ పోలవరపు రత్నగిరి, ఏపీడీడీసీ డీడీ శ్రీనివాసులు, ఐజీ కార్ల్ డిప్యూటీ సీఈవో కేడీ ప్రసాద్, సూపర్‌స్పెషాలిటీ ఆసుపత్రి డీడీ మదన్మోహన్, పశుసంవర్థక శాఖ ఏడీ శ్రీనివాసులరెడ్డి, ఐవీఆర్సీఎల్ సెట్ ఇన్‌ఛార్జి వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు. త్వరలో నూతన పశువైద్య కళాశాల ప్రారంభం ప్రొద్దుటూరు: నూతనంగా నిర్మించిన ప్రొద్దుటూరు పశువైద్య కళాశాలను వీలైనంత త్వరలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామని పశుసంవర్ధకశాఖ ముఖ్య కార్యదర్శి డాక్టర్ మన్మోహన్ సింగ్ తెలిపారు. జిల్లా పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం స్థానిక పశువైద్య కళాశాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పాడి పరిశ్రమాభివృద్ధికి రూ.200కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలిపారు. -
రబీకి కన్నీళ్లే!
నేడు ఐఏబీ సమావేశం కర్నూలు రూరల్: ఈ సారి రబీకి సాగునీరు ఇచ్చే పరిస్థితులు కనిపించడంలేదు. అన్నదాత కష్టాలు తీరేలా లేవు. సాగునీటి కాలువల మరమ్మతులకు పెండింగ్ పనులను రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు ఇవ్వకపోవడం దీనికి ఓ కారణం. కాలువలకు కేటారుుంచిన నీటిని తీసుకురావడంలో పాలకుల నిర్లక్ష్యం, అధికారుల అశ్రద్ధ మరో ప్రధాన కారణంగా చెప్పవచ్చు. నేడు ఐఏబీ సమావేశం సాగు నీటి కాల్వలకు రబీ ఆయకట్టుకు సాగు నీటి విడుదలపై చర్చించేందుకు సోమవారం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన నీటిపారుదల సలహా మండలి సమావేశం జరుగనుంది. ప్రాజెక్టులలో నీటి నిల్వలు లేవనే సాకుతో రబీ ఆయకట్టుకు నీరు ఇవ్వాలని, గత ఐఏబీ సమావేశంలోని తీర్మానాలపై ప్రతిపక్షం చర్చకు పట్టుబడితే తప్పించుకునేందుకు అధికార పార్టీ నేతలు ఎత్తుగడలు వేస్తున్నారు. మీటింగ్‌లో కేవలం అజెండాపై మాత్రమే చర్చించి సమావేశాన్ని ముగించేలా అధికారులపై ఒత్తిడి చేస్తున్నారు. రైతులను నిలువునా ముంచేందుకు కంకణం కట్టుకున్నారు. కర్ణాటక జలచౌర్యం.. తుంగభద్ర దిగువ కాలువ ద్వారా 16 మండలాల్లోని 192 గ్రామాలకు తాగునీరు, 107615 ఎకరాల రబీకి సాగునీరు అందిస్తుంది. డ్యాంలో నీటి ఆధారంగా ఈ ఏడాది మొదటగా 16.302 టీఎంసీలు ఇవ్వాలని నిర్ణరుుంచారు. తర్వాత ఇటీవల 15.62 టీఎంసీలకు తగ్గించారు. ఇందులో ఇప్పటివరకు 6.2 టీఎంసీలు ఖీరీఫ్కు వినియోగించారు. ఇంకా 9.60 టీఎంసీలు ఉండగా వీటిలో తాగునీటికి 4 టీఎంసీలు పోరుుంది. మిగిలిన 5.60 టీఎంసీల నీటిని ఈ ఏడాది 40 వేల ఎకరాలకు సాగు నీరు ఇవ్వాలని అధికారులు ప్రతిపాదించనున్నారు. అరుుతే కర్ణాటకలో సుమారు 70 వేల ఎకరాల నాన్ ఆయకట్టు సాగు కోసం జలచౌర్యం ఏడాది కేడాది పెరిగిపోతోంది. దీనివల్ల ఇక్కడి ఆయకట్టుకు మొండి చేరుు మిగులుతోంది. జలచౌర్యంను అడ్డుకునేందుకు ప్రతి ఐఏబీలో తీర్మానాలు చేస్తున్నా ఆచరణకు నోచుకోవడం లేదు. చివరికి నీరందక రైతులకు నష్టాలే మిగులుతున్నాయి. కేసీ నీటి మళ్లింపు ఉత్తర్వుల రద్దు చేస్తేనే సాగునీరు.. కర్నూలు-కడప కాలువ ఆయకట్టుకు బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం తుంగభద్ర డ్యాం నిల్వ నీటి నుంచి 10 టీఎంసీలు రావాల్సి ఉంది. పూడిక చేరిందనే కారణంలో ప్రతి ఏటా 6.8 టీఎంసీలే విడుదల చేస్తున్నారు. అదేసమయంలో కేసీకి కేటాయించిన నీటిని అనంతపురం జిల్లా తాగునీటి కోసం పెన్నా అహోబిళం రిజర్వాయర్‌కు 2004లో సీఎంగా ఉన్న చంద్రబాబునాయుడు మొదటగా 5 టీఎంసీల నీటిని, ఆ తరువాత అనంతపురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మరో 5 టీఎంసీల నీటి మళ్లింపునకు ఉత్తర్వులు ఇచ్చారు. దీనివల్ల పదేళ్లుగా కేసీ కాల్వ కింద కర్నూలు జిల్లాలో 1,73,627 ఎకరాలు, కడప జిల్లాలో 92,001 ఎకరాల ఆయకట్టు రబీ సీజన్లో సాగుకు నోచుకోవడం లేదు. నీటికోసం అనంత పట్టు.. రబీలో కేసీ ఆయకట్టుకు నీరందదని తెలిసినా అనంతపురం జిల్లాకి చెందిన మంత్రులు, అక్కడి ప్రజాప్రతినిధులు ప్రభుత్వంపై ఒత్తిడి చేసి నీటిని తరలించుకుపోయేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. తొలివిడతగా 3 టీఎంసీల నీటిని మళ్లించుకునేందుకు అనుమతులు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిళ్ళు చేస్తున్నారు. జిల్లాని రైతులకు ఇంత నష్టం జరుగుతున్నా జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం, అధికార పార్టీ ఎమ్మెల్యేలు నోరెత్తకపోవడం గమనార్హం. దీంతో కేసీ రబీ ఆయకట్టుకు సాగు నీరు ప్రశ్నార్థకం కానుంది. మళ్లింపు ఉత్తర్వులు రద్దు చేయిస్తే 0 నుంచి 120 కి.మీ వరకు 20 వేల ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంది. కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటుతోనే న్యాయం.. జిల్లాలోని సాగు నీటి ప్రాజెక్టులకు, కాల్వలకు సంవృద్ధిగా సాగు నీరు అందాలంటే కర్నూలులో కృష్ణా బోర్డు ఏర్పాటు చేస్తేనే న్యాయం జరుగుతుందని లేకపోతే భవిష్యత్‌లో మరిన్నిసాగు నీటి కష్టాలు వచ్చే ప్రమాదం ఉంది. ప్రజాప్రతినిధులు పార్టీలకతీతంగా, అధికారులు ఐఏబీలో కర్నూలులోనే కృష్ణా బోర్డు ఏర్పాటు చేయాలని తీర్మానం చేయాలని పలువురు సాగు నీటి నిపుణులు, ఆయకట్టుదారులు కోరుతున్నారు. ఇదీ అసలువిషయం.. నీరు ఇవ్వలేమనే విషయాన్ని అధికారులు ఐఏబీలో చెప్పనున్నారు. హంద్రీనీవా సుజల స్రవంతి పథకం, ఏపీఎస్ఐడీసీ కర్నూలు సబ్ డివిజన్ కింద తుంగభద్ర, హగేరి,ఎస్ఆర్ఎంసీ, కుందూ నదుల కింది నిర్మించిన సుమారు 70 ఎత్తిపోతల పథకాలకు, గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద నిర్మించిన స్కీమ్‌లకు సైతం రబీ ఆయకట్టుకు సాగు నీరు ఇచ్చే అవకాశమేలేదు. గాజులదిన్నె ప్రాజెక్టు కింద ఈ ఏడాది 8 వేల ఎకరాలకు రబీ కింద సాగు నీరుఇచ్చే అవకాశం ఉంది. నీరిచ్చే అవకాశమే లేదు.. కరువు సీమకు శ్రీశైలం ప్రధాన జల సిరి. శ్రీశైలం జలాశయం గరిష్ట నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం జలాశయంలో 856 అడుగులు మాత్రమే నీరుంది. శ్రీశైలం జలాశయం నిండక ముందే కృష్ణా డెల్టాలో తాగునీటి కోసమని, కరెంట్ ఉత్పత్తి పేరుతో రోజుకు 70 వేల క్యూసెక్కుల ప్రకారం నీటిని కోస్తా ప్రాంతానికి చెందిన అధికార పార్టీ నేతలు కుట్ర పూరితంగా తీసుకెళ్లారు. దీనివల్ల తెలుగు గంగ, ఎస్ఆర్బీసీ, ఎస్కేపు చానల్‌కు సకాలంలో నీరు విడుదల కాలేదు. ఖరీఫ్ పంటల సాగు ఆలస్యమయ్యింది. ఈ లోపు తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తిని నీటిని వినియోగించుకోవడం, పంతాలకు పోరుు ఆంధ్రా ప్రభుత్వం సైతం కరెంట్ ఉత్పిత్తికి నీటిని వినియోగించడంతో 20 రోజులకే శ్రీశైలం నీటి నిల్వలు భారీగా పడిపోయాయి. వాస్తవంగా కుడి, ఎడమ గట్టుల నుంచి కరెంట్ ఉత్పత్తి చేస్తూ దిగువన ఉన్న సాగర్‌కు 300 టీఎంసీలు, అత్యవసరం కింద మరో 50 టీఎంసీల నీటిని మాత్రమే వదలాల్సి ఉంది. అధికారుల నిర్లక్ష్యం, పాలకులకు రైతులపై చిత్తశుద్ధి లేకపోవడంతో అదనంగా ఈ ఏడాది 94 టీఎంసీల నీటిని దిగువకు వదిలేశారు. ఈ కారణంగా తెలుగు గంగ కింద జిల్లాలో 1,03,700 ఎకరాల ప్రతిపాదిత ఆయకట్టు, ఎస్సార్బీసీ సర్కిల్-1 పరిధిలో 1 నుంచి 7బ్లాకుల కింద ఖరీఫ్‌లో 46,857 ఎకరాలు, సర్కిల్-2 పరిధిలోని 8 నుంచి 16 బ్లాకుల కింద 97,460 ఎకరాల ఆయకట్టుకు రబీలో సాగు నీరు ఇచ్చే అవకాశమే లేదు.