pending works
-
పెండింగ్ పనులకు నిధులిస్తాం
సాక్షి, హైదరాబాద్: అవసరమైన రోడ్లను మెరుగు పరచటంతోపాటు రోడ్లు, భవనాల శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన నిర్మాణాలకు సంబంధించిన పెండింగ్ పనులకు నిధులు కేటాయిస్తామని ఉప ముఖ్య మంత్రి, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. సచివాలయంలో రోడ్లు భవనాల శాఖమంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో కలిసి ఆ శాఖ బడ్జెట్ సన్నాహక సమావేశంలో సమీక్షించారు. రాష్ట్ర వ్యా ప్తంగా జరుగుతున్న పనులు, వాటికి సంబంధించి చెల్లించాల్సిన పెండింగ్ బిల్లులు, ప్రస్తుత అవసరా ల గురించి అధికారులను అడిగి వివరాలు తెలుసు కున్నారు. పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ రూపంలో అధికారులు వారికి వివరించారు. రీజినల్ రింగ్ రోడ్డు ఆలైన్మెంట్ ప్రక్రియ పారదర్శకంగా ఉండాలని సూచించారు. ఇష్టం వచ్చినట్టు కాకుండా, క్రమ పద్ధతిలో ప్రజల అవసరాలకు అనుగుణంగా ఆమోదయోగ్యంగా ఉండాలన్నారు. ఆ ప్రాజెక్టు భూసేకరణతోపాటు కలెక్టరేట్ భవనాల నిర్మాణం, రోడ్లకు సంబంధించిన పనులకు నిధులు కేటాయించాలని అధికారులు కోరారు. సీఐఆర్ఎఫ్ పనులకు భూసేకరణ నిధుల కొరత లేకుండా బడ్జెట్లో నిధులు కేటాయించాలని మంత్రి కోమటిరెడ్డి విజ్ఞప్తి చేయగా, భట్టి విక్రమార్క అంగీకరించారు. చేప ప్రసాదం పంపిణీ, బోనాల ఉత్సవాలు, వివిధ ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల నిర్వహణకు బడ్జెట్లో నిధులు కేటాయించాలని కూడా కోరారు. సినీ భూములను కాపాడాలని ఆదేశాలు సినిమాటోగ్రఫీ అంశంపై జరిగిన చర్చలో, సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం కేటాయించిన భూముల ను కాపాడాలని ఉపముఖ్యమంత్రి భట్టి ఆదేశించారు. సామాజిక బాధ్యతలో భాగంగా డ్రగ్స్ లాంటి మహమ్మారిలకు వ్యతిరేకంగా చేపట్టే కార్యక్రమాల్లో సినీ సెలబ్రిటీలు పొల్గొనేలా చూడాలని సూచించారు. నంది అవార్డుల కార్యక్రమం నిర్వహణపై కేబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. సినిమా హాళ్లలో చిరుతిళ్ల ధరలను నియంత్రించాలని, ఆన్లైన్ టికెటింగ్ కోసం వేసిన కమిటీ నివేదిక వచ్చాక వెంటనే నిర్ణయం తీసుకోవాలని సూచించారు. చిత్రపురి కాలనీలో అవకతవకలపై దృష్టి పెట్టాలి: కోమటిరెడ్డి చిత్రపురి కాలనీలో ప్లాట్ల కేటాయింపులో అవకతవ కలు జరిగాయన్న ఆరోపణలు ఉన్నందున ఆ విష యంలో కూడా పరిశీలించి చర్యలు తీసుకోవాల్సి ఉందని కోమటిరెడ్డి పేర్కొన్నారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారా వు, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీనివా సరాజు, ఆర్థికశాఖ జాయింట్ సెక్రెటరి హరిత, ఉప ముఖ్యమంత్రి కార్యదర్శి కృష్ణ భాస్కర్, సమాచార శాఖ కమిషన్ అశోక్‌రెడ్డి, ఈఎన్సీలు రవీందర్ రావు, గణపతిరెడ్డితో పాటు సీఈలు మధుసూధన్ రెడ్డి, సతీష్, మోహన్ నాయక్ పాల్గొన్నారు. -
పోలవరం తొలిదశ సవరించిన అంచనా వ్యయం
-
బాకీ ఎంత?
రెండు నెలలు దాటిపోయింది ప్రపంచం స్తంభించిపోయి.. సినిమా ఆగిపోయి. పనులు మెల్లిగా మొదలవుతున్నాయి. పరుగులు మెల్లిగా ప్రారంభం కాబోతున్నాయి. సినిమా ఎప్పటిలానే పరిగెట్టడానికి వార్మప్ అవుతోంది. కరోనా వల్ల ఈ ఏడాది సమ్మర్లో థియేటర్స్‌లోకి ఒక్క సినిమా రాలేదు. సమ్మర్ అంటేనే సినిమాకు పెద్ద పండగ. మనం జరుపుకునే అతి పెద్ద ఫిల్మ్ ఫెస్టివల్. వారం తర్వాత వారం కొత్త సినిమా థియేటర్స్‌లోకి వస్తూనే ఉంటుంది. కానీ సినిమాలను ల్యాబుల్లోనూ, ప్రేక్షకులను ఇళ్లల్లోనూ కట్టిపారేసింది కరోనా. దాంతో సినిమా సీజన్ లేకుండానే సమ్మర్ గడిచిపోతోంది. ఇంకా ఎన్నాళ్లిలా? అనుకుంటున్న సమయంలో ‘ఇంకొన్ని రోజుల్లో షూటింగులు మొదలుపెట్టుకోవచ్చు’ అనే మాట కూసింత ఊరట అయింది. సినిమా షూటింగ్స్ చేసుకోవచ్చు అని ప్రభుత్వం పేర్కొంది. మొదలవ్వాల్సిన సినిమాలు, మధ్య వరకూ వచ్చి ఆగిన సినిమాలు, ఇంకా పదీ పదిహేను శాతం చేస్తే చాలనే స్థితిలో ఉన్న సినిమాల పనులు త్వరలో తిరిగి ప్రారంభం కాబోతున్నాయి. ఏయే సినిమా షూటింగ్ ఎంత శాతం బాకీ ఉంది? ఆ షూటింగ్ మీటర్ మీకోసం. ఇలా మొదలై... లాక్‌డౌన్‌కు ముందు కొన్ని సినిమాలు ప్రారంభమయ్యాయి. ఇలా షూటింగ్ మొదలైందో లేదో అలా లాక్డౌన్ వాటి ప్రయాణాన్ని ఆపింది. జస్ట్ పదీ పదిహేను రోజులు మాత్రమే షూటింగ్ జరుపుకుని ఆగిపోయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. ‘సింహా’, ‘లెజెండ్’ తర్వాత హీరో బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్లో మొదలైన సినిమా షూటింగ్ పదమూడు రోజులు మాత్రమే జరిగింది. అలాగే అల్లు అర్జున్ నటిస్తోన్న తొలి ప్యాన్ ఇండియన్ మూవీ ‘పుష్ప’. ఈ చిత్రానికి సుకుమార్ దర్శకుడు. కేరళలో మొదలైన ఈ సినిమా షూటింగ్ ఆరు రోజులు జరిగింది. ‘ఆర్య’, ‘ఆర్య 2’ తర్వాత అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్లో వస్తోన్న సినిమా ఇది. వరుణ్‌తేజ్ తొలిసారి ఓ స్పోర్ట్స్ బేస్డ్ మూవీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఇందులో వరుణ్ బాక్సర్‌గా కనిపిస్తారు. కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ వైజాగ్‌లో 15 రోజుల పాటు జరిగింది. నాగశౌర్య హీరోగా సౌజన్య దర్శకత్వం వహిస్తున్న సినిమా షూటింగ్ పది రోజులే జరిగింది. మనోజ్ ‘అహం బ్రహ్మాస్మి’ పూజా కార్యక్రమాలు జరిగాయి. ఇక షూటింగ్ మొదలుపెడదామనుకున్నారు. లాక్డౌన్ కారణంగా ఆగింది. ఇంకా ఐదూ పది శాతం మాత్రమే షూటింగ్ జరుపుకున్న సినిమాలు ఇంకొన్ని ఉన్నాయి. గమనిక: ఏయే సినిమా ఎంత శాతం షూటింగ్ బాకీ ఉందో ఆ సినిమాకి సంబంధించిన పోస్టర్ మీద జతపరిచాం. ఇండస్ట్రీ విశ్వసనీయ వర్గాల సమాచారం ఆధారంగా ఇచ్చిన డేటా ఇది. -
మినీ బండ్లు కలేనా..!
సాక్షి, వరంగల్ రూరల్: చెరువులకు వన్నె తెచ్చేవి మినీ ట్యాంక్ బండ్లు.. ఆనందానికి, ఆహ్లాదానికి కేరాఫ్ అడ్రస్‌గా ఉన్న వీటి నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రతి నియోజకవర్గంలో ఒక చెరువును ఎంపిక చేసి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయం తీసుకుంది. జిల్లాలో నర్సంపేట నియోజకవర్గంలో నర్సంపేట మండలంలోని మాదన్నపేట చెరువు, పరకాల నియోజకవర్గంలో పరకాల మండలంలోని దామెర చెరువులను మినీ బండ్లుగా తీర్చిదిద్దాలని అధికారులు నిర్ణయించారు. 2015–2016 సంవత్సరంలో వీటికి టెండర్లు పిలిచి నిధులు మంజూరు చేశారు. అదే ఏడు పనులను ప్రారంభించారు. దామెర చెరువు.. పరకాల పట్టణానికి సుమారు 100 మీటర్ల దూరంలో దామెర చెరువు ఉంది. 2015–2016 సంవత్సరంలో ఈ చెరువును మిషన్ కాకతీయ పనుల్లో భాగంగా మినీ ట్యాంక్ బండ్‌గా అభివృద్ధి చేసేందుకు ఎంపిక చేశారు. చెరువును అభివృద్ధి చేసేందుకు 1.92 కోట్లకు టెండర్ పిలువగా మూడు శాతం ఎక్కువకు ఓ కాంట్రాక్టర్ దక్కించుకున్నాడు. అగ్రిమెంట్ ప్రకారం 2.8 కిలోమీటర్ల బండ్, రెండు తూములు, 900 మీటర్ల మెయిన్ బండ్, మెట్లు, కట్ట చుట్టూ రాతి కట్టడం, మత్తి పనులు పూర్తి చేయాలి. తొలుత వేసిన ఎస్టిమేషన్ సరిగ్గా లేకపోవడంతో రీ ఎస్టిమేషన్ కోసం అధికారులు ప్రతిపాదించారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి 27న దామెర చెరువుకు రూ 3.08 కోట్లు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీఓ విడుదల చేసింది. ఈ లెక్క ప్రకారం బండ్ పనులకు రూ 5.59 కోట్లు మంజూరైనట్లు. నిధులు ఫుల్‌గానే మంజూరైనా పనులు మాత్రం అంతంతమాత్రంగానే జరిగినట్లు పలువురు ఆరోపిస్తున్నారు. కట్టకు ఆనుకుని రాతి కట్టడం 800 మీటర్లు కట్టాల్సి ఉండగా ఇప్పటి వరకు 450 మీటర్ల వరకే కట్టారు. అగ్రిమెంట్ అయిన తొమ్మిది నెలలకే పనులు పూర్తి చేయాలి కానీ సదరు కంట్రాక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. మాదన్నపేట చెరువుమాదన్నపేట చెరువును 200 సంవత్సరాల క్రితం అక్కన్న– మాదన్నలు నిర్మించారు. చెరువు సామర్థ్యం మొత్తం 17 ఫీట్లు. ఆయకట్టు అధికారికంగా మూడువేల ఎకరాలు కాగా అనధికారంగా మరో 1500 ఎకరాలు సాగవుతోంది. ఈ చెరువు చెరువు పరిసర ప్రాంతాల్లో పచ్చదనం, ఆహ్లాదకరంగా పర్యాటకులను ఆకర్షించే విధంగా ఉంటుంది. నర్సంపేట నియోజకవర్గంలో మాధన్నపేట చెరువుకు 2015–2016 సంవత్సరంలో మిషన్ కాకతీయలో భాగంగా మినీ ట్యాంక్ బండ్‌ను మంజూరు చేశారు. రూ 7.51 కోట్లు నిధులు మంజూరు చేశారు. దీనిని ఓ కన్‌స్ట్రక్షన్‌వారు దక్కించుకున్నారు. చెరువు బండ్ పనులకు నిధులు మంజూరై ఏడాదిన్నర గడిచినా ఇంతవరకూ పనులు పూర్తి కాలేదు. అగ్రిమెంట్ ప్రకారం 2017 మే వరకు పూర్తి చేయాల్సి ఉంది. కాని అధికారులు పనుల పురోగతిపై పట్టించుకోకపోవడంతో సదరు కాంట్రాక్టర్ పనులు పూర్తి చేయడం లేదనే ఆరోపణలు బాహాటంగానే వినిపిస్తున్నాయి. త్వరలో పూర్తి చేస్తాం.. మినీ ట్యాంక్ బండ్ల పనులు త్వరలో పూర్తవుతాయి. జిల్లాలో పరకాల మండలం దామెర చెరువు, నర్సంపేట మండలం మాదన్నపేట చెరువులను మినీ ట్యాంక్ బండ్ ఎంపిక చేశారు. పనులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఆలస్యం కాకుండా పూర్తి చేస్తాం. –శ్రవణ్, ఇరిగేషన్ ఈఈ, రూరల్ జిల్లా -
సీఎం కేసీఆర్ వరాలపై మథనం!
సాక్షి, హైదరాబాద్: ముందస్తు ఎన్నికలకు టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్న అంశాలపై వెంటవెంటనే నిర్ణయం తీసుకుంటోంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీలను పూర్తి చేసే ప్రక్రియ వేగంగా జరుగుతోంది. 30 బీసీ కులాలకు ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం స్థలాలను, నిధులను ఇస్తున్నట్లు సీఎం కేసీఆర్ ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. దీనికి అనుగుణంగా ప్రభుత్వం అధికారికంగా నిర్ణయం తీసుకుంది. బీసీల్లోని 30 కులాల ఆత్మగౌరవ భవనాలకు స్థలాలను, నిర్మాణానికి అవసరమైన నిధులను కేటాయిస్తూ ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి కె.రామకృష్ణారావు బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా వివిధ శాఖల్లో పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులకు నిధులను కేటాయిస్తూ మరో పది ఉత్తర్వులను జారీ చేశారు. – బీసీ కులాల ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాల్లోని స్థలాలను కేటాయిస్తున్నట్లు ఉత్తర్వులో పేర్కొంది. భవనాల నిర్మాణానికి రూ.58.75 కోట్లను కేటాయించింది. ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి ఈ మొత్తాన్ని ఇవ్వనున్నట్లు పేర్కొంది. ► ఆదిలాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఎస్సీ వర్గాల నివాస ప్రాంతాల్లో అభివృద్ధి పనుల కోసం ప్రభుత్వం రూ.7 కోట్లు మంజూరు చేసింది. ► నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలోని అభివృద్ధి పనుల కోసం ఎస్సీ, ఎస్టీ ప్రత్యేక అభివృద్ధి నిధుల నుంచి రూ.2.81 కోట్లను మంజూరు చేసింది. ► మహబూబ్‌నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గంలో భీమా నది పుష్కరాల పనుల కోసం రూ.5 కోట్లు కేటాయించింది. ► పెద్దపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో 242 అభివృద్ధి పనుల కోసం రూ.2.30 కోట్లను విడుదల చేసింది. ► వరంగల్ రూరల్ జిల్లా పరకాల నియోజకవర్గంలోని పరకాల–ఎర్రగట్టు గుట్ట రోడ్డు వెడల్పు పనుల కోసం రూ.4.45 కోట్లను కేటాయించింది. ► సూర్యాపేట జిల్లాలోని అభివృద్ధి పనుల కోసం రూ.3.62 కోట్లను కేటాయించింది. -
నత్తకు మేనత్త!
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ప్రకాశం జిల్లాకు ప్రాణాధారమైన వెలిగొండ ప్రాజెక్టు పనులు ముందుకు సాగడం లేదు. టన్నెల్ పనులతో పాటు కాలువ పనులు, భూ సేకరణ, పునరావాసం సైతం ఏళ్ల తరబడి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుండిపోయాయి. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగిన పనులు తప్ప నాలుగేళ్ల చంద్రబాబు పాలనలో ప్రాజెక్టు పనులు అడుగు ముందుకు పడలేదు. దీంతో వెలిగొండ నీళ్లు కలగానే మారాయి. పశ్చిమ ప్రాంతంలో పంటల సంగతి దేవుడెరుగు గుక్కెడు నీరందక ప్రజల గొంతులెండుతున్నాయి. ఫ్లోరైడ్ నీటి పుణ్యమా కిడ్నీ వ్యాధులతో వందలాది ప్రాణాలు గాలిలో కలుస్తున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. మళ్లీ ఎన్నికలు వచ్చే సరికి సీఎం చంద్రబాబు, ఆయన వందమాగదులకు మళ్లీ వెలిగొండ గుర్తుకొచ్చింది. ఇదిగో నీళ్లిస్తాం.. అదిగో నీళ్లిస్తామంటూ ప్రచారం మొదలెట్టారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణంలో చంద్రబాబు ప్రభుత్వం చూపిస్తున్న వివక్షను ప్రజలకు తెలియచెప్పడంతో పాటు ప్రాజెక్టు పనులు వేగవంతం కోసం ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెంచేందుకు జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పాదయాత్రకు సిద్ధమైంది. ఒంగోలు మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ఈ యాత్ర జరుగుతోంది. ఆగస్టు 15న కనిగిరి నుంచి యాత్ర ప్రారంభం కానుంది. మాజీ మంత్రి, పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ పాదయాత్రను ప్రారంభించనున్నారు. 15 రోజులకు పైగా కనిగిరి, మార్కాపురం, దర్శి, గిద్దలూరు, యర్రగొండపాలెం, నియోజకవర్గాల్లో 207 కిలో మీటర్ల మేర యాత్ర సాగనుంది. ఈ యాత్రకు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ప్రారంభం సందర్భంగా కనిగిరిలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పాదయాత్ర ప్రారంభ కార్యక్రమానికి జిల్లా నేతలే కాక పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు హాజరు కానున్నారు. పాదయాత్రను విజయవంతం చేయాలని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి పిలుపునిచ్చారు. ప్రాజెక్టు ఉద్దేశం ఇదీ.. శ్రీశైలం జలాశయం నుంచి 43.58 టీఎంసీల కృష్ణా నీటిని మల్లించి ప్రకాశం జిల్లాలోని 23 మండలాల పరిధిలో 3,36,100 ఎకరాలకు సాగునీరు అందించడంతో పాటు వైఎస్సార్ కడప జిల్లాలోని పోరుమామిళ్ల, కలసపాడు, కాసిరెడ్డినాయన మండలాల పరిధిలో 27,200 ఎకరాలు, నెల్లూరు జిల్లాలోని ఉదయగిరి, ఆత్మకూరు, వరికుంటపాడు, దుత్తలూరు, సీతారాంపురం, మర్రిపాడు తదితర మండలాల పరిధిలో 84,000 ఎకరాలకు సాగునీరుతో పాటు 15.25 లక్షల మందికి తాగునీరును అందించడమే వెలిగొండ ప్రాజెక్టు ఉద్దేశం. వైఎస్సార్ హయంలో అధిక నిధులు.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టు పనుల కోసం 2004 నుంచి 2009 వరకు రూ.1734.35 కోట్లు కేటాయింపులు చేయగా రూ.1466.46 కోట్లు ఖర్చు చేశారు. ప్రాజెక్టు పరిధిలోని ప్రధాన పనులన్నీ వైఎస్ హాయంలోనే పూర్తయ్యాయి. బాబు అధికారం చేపట్టాక 5వ బడ్జెట్‌తో కలిపి రూ.1208.4 కోట్లు కేటాయింపులు చేసినట్లు చెబుతున్నా ఆ నిధుల్లో కొంత మేర మాత్రమే ఖర్చు చేశారు. దీంతో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనులు ముందుకుసాగడం లేదు. మరోవైపు ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో రూ.2,634 కోట్లు అదనంగా పెంచుకొని అటు కాంట్రాక్టర్లు, ప్రభుత్వ పెద్దలు ప్రజాధనం దోపిడీకి సిద్ధమయ్యారు. కాంట్రాక్టర్లు కోట్లు కొల్లకొట్టడంతో చూపిస్తున్న శ్రద్ధ పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలున్నాయి. నీటి విడుదలపై పూటకోమాట... చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు ముగిసింది. వెలిగొండ ద్వారా నీళ్లిస్తామంటూ మాటలతో మభ్యపెడుతూనే ఉన్నారు. పనులు మాత్రం ముందుకు సాగడం లేదు. టన్నెల్ పనులు మూడు నెలలుగా పూర్తిగా నిలిచి పోయాయి. పరిస్థితి ఇలాగే ఉంటే 2019 నాటికి కూడా టన్నెల్–1 పనులు పూర్తయ్యే పరిస్థితి లేదని ఇంజినీరింగ్ అధికారులు పేర్కొంటున్నారు. 2016 చివరి నాటికే తొలుత వెలిగొండ నీళ్ళిస్తామన్న ముఖ్యమంత్రి ఆ తర్వాత మాట మార్చి 2017, 2018 డిసెంబర్‌కు తాజాగా 2019 సంక్రాంతి అంటున్నారు. తాజా పరిస్థితి చూస్తే ఫేజ్–1 పనులు పూర్తి చేసి ప్రాజెక్టు పరిధిలో 1.19 లక్షల ఎకరాలకు సాగు నీరు అందిస్తామన్న ముఖ్యమంత్రి మాట నెరవేరే పరిస్థితి లేదు. నత్తనడకన జరుగుతున్న పనులను చూస్తే నిర్దేశిత గడువుకు ఫేజ్–1 పనులు పూర్తి కావడం కలే. పునరావాసం దోపిడీ.. వెలిగొండ ప్రాజెక్టు కింద మార్కాపురం, యర్రగొండపాలెం, గిద్దలూరు ప్రాంతాల్లో సుంకేశుల, కలనూతల, గుండంచెర్ల, గొట్టిపడియా, అక్కచెరువు, సాయినగర్, కృష్ణానగర్, లక్ష్మిపురం, మెట్టుగొంది, చింతలపూడి, కాటంరాజుతండా తదితర గ్రామాలు ముంపుకు గురి కానున్నాయి. ఈ గ్రామాలకు పునరావాసం కల్పించాల్సి ఉంది. గతంలో ఇందుకోసం రూ.58 కోట్లు కేటాయించగా, తాజాగా ఆ మొత్తాన్ని రూ.489 కోట్లకు పెంచడం గమనార్హం. మొత్తంగా అంచనాలను పెంపు పేరుతో బాబు ప్రభుత్వం కోట్లు కొల్లగొట్టడంపై పెట్టిన శ్రద్ధ వెలిగొండ ప్రాజెక్టు పనులు పూర్తి చేయడంలో చూపించటం లేదన్న విమర్శలున్నాయి. -
పెండింగ్ పనులను సత్వరమే పూర్తి చేయండి
- మంత్రి భూమా అఖిలప్రియ ఆదేశం - కలెక్టర్‌తో కలిసి అధికారులతో సమీక్ష కర్నూలు(అర్బన్): నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల పరిధిలో పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని రాష్ట్ర పర్యాటక శాఖా మంత్రి భూమా అఖిలప్రియ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ మీటింగ్ హాలులో కలెక్టర్ ఎస్.సత్యనారాయణతో కలసి శనివారం రెవెన్యూ, మున్సిపల్ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అభివృద్ధి పనుల విషయంలో సమస్యలుంటే కలెక్టర్‌తోపాటు తన దృష్టికి తీసుకువస్తే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. నంద్యాలలో రహదారి విస్తరణకు సెంట్రల్ లైనింగ్ మార్క్ పనుల ఆలస్యంపై మున్సిపల్ కమిషనర్‌ను ఆరా తీశారు. స్ట్రక్చర్ల వాల్యుయేషన్ పూర్తి చేసి సంబంధీకులకు నష్టపరిహారం చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఆళ్లగడ్డకు మంజూరైన రూ.43 లక్షల పనులను ప్రారంభించాలన్నారు. నంద్యాల మురికివాడల్లో వీధి లైట్లు ఏర్పాటు చేసి ఆ ప్రాంత ప్రజల ఇబ్బందులు తీర్చాలన్నారు. గృహనిర్మాణ పథకం కింద ఇళ్లు మంజూరై కట్టుకోకుండా ఉన్న వారిని గుర్తించి ఇతరులకు కేటాయించాలన్నారు. ఏడాది కాలంగా పూర్తి కాని గృహనిర్మాణాలను రద్దు చేయాలని జిల్లాకలెక్టర్ ఎస్.సత్యనారాయణ హౌసింగ్ పీడీని ఆదేశించారు. రుద్రవరం, శిరివెళ్ల, దొర్నిపాడు, ఆళ్లగడ్డ మండలాల్లో గృహనిర్మాణాల కోసం భూమి కొనుగోలు చేసినా అర్హులైన లబ్ధిదారులకు గృహాలు కేటాయించడంలో అధికారులు అలక్ష్యం చేస్తున్నారని మంత్రి ఆందోళన వ్యక్తం చేశారు. పట్టాలు మంజూరు చేసిన వారికి ముందుగా నోటీసులు జారీ చేసి విచారణ చేపట్టాలని ఆర్డీఓను కలెక్టర్ ఆదేశించారు. జాయింట్ కలెక్టర్ ప్రసన్న వెంకటేష్, నంద్యాల ఆర్డీఓ రాంప్రసాద్ రెడ్డి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. -
ప్రతి రేవూ.. సమస్యల నెలవు
-
టెండర్లు లేకుండానే హంద్రీ-నీవా పనులు
తిరుపతి : హంద్రీ- నీవా కాలువ పెండింగ్ పనులను టెండర్లు లేకుండానే కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పగిస్తున్నారు. సీఎం చంద్రబాబు మౌఖిక ఆదేశాల మేరకు పనులు వేగంగా జరగలేదనే సాకు చూపి కాంట్రాక్టు ఏజెన్సీలకు పనులు అప్పజెప్పే ప్రక్రియ ప్రారంభమైంది. ఇప్పటికే 53, 52, 8, 11, 25, 26 ప్యాకేజీ పనులను అప్పగించారు. నిబంధన 63సీ ప్రకారం ఈ పనులను కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పజెప్పారు. ఈమేరకు ముఖ్యమంత్రి సైతం నాలుగు నెలల క్రితమే మెమో జారీ చేసినట్లు సమాచారం. కట్టబెట్టిన పనులు ఇవే.... ఆడవిపల్లె రిజర్వాయర్, టన్నెల్-20 పెండింగ్ పనులను ఆర్కె ఇన్ఫ్రా సంస్థకు అప్పగించారు. 8, 53 ప్యాకేజీలను ఎస్ఆర్ కన్స్ట్రక్షన్కు కట్టబెట్టారు. 11, 52 ప్యాకేజీలలో పెండింగ్ పనుల్లో కొంత భాగాన్ని ఆర్కె ఇన్ఫ్రాకు ఇచ్చారు. 25, 26 ప్యాకేజీల్లో కొంత భాగం పనులను ఎంఆర్కెఆర్కు అప్పజెప్పారు. ఇంతకు మునుపు ఉన్న పాత రేట్లకే, వేగంగా పనులు చేస్తామని ముందుకు వచ్చిన కొత్త సంస్థలకు పనులు ఇచ్చినట్లు ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం అప్పగించిన పనులకు ఎంత బిల్లు అవుతుందో, దానిని పాత ఏజెన్సీ నుంచి రాబట్టే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొంత మంది తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహం చూపి పనులను దక్కించుకున్నట్లు తెలుస్తోంది. పనుల పంపకంలో సీఎంతో సన్నిహితంగా మెలిగే వైఎస్సార్ జిల్లాకు చెందిన రాజ్యసభ సభ్యుడి సోదరుడు చక్రం తిప్పుతున్నట్లు సమాచారం. పనులు తనకు అనుకూలమైన వారికే కట్టబెట్టినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఇటీవల తిరుపతి సీఈ కార్యాలయంలో అధికారులతో సమావేశమై దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. భూమి అప్పగిస్తేనే పనులు చేస్తామని మెలిక... భూసేకరణ పూర్తి కాకుండానే నవంబర్ 15వ తేదీలోపు పనులు చేస్తామని ప్రభుత్వం మభ్యపెడుతోంది. ఇప్పటికీ 59 ప్యాకేజీకి పనులు నత్తనడకన సాగుతున్నాయి. భూసేకరణకు ఇంకా రెండు నెలల సమయం పడుతుందని రెవెన్యూ వర్గాలు పేర్కొంటున్నాయి. పనులు ప్రారంభించలేదన్న సాకుగా చూపి వేరే కాంట్రాక్టు సంస్థలకు అప్పజెబుతుండడంతో కొన్ని ఏజెన్సీలు నామమాత్రంగా పని చేస్తున్నట్లు ఇంజనీరింగ్ వర్గాలు పేర్కొంటున్నాయి. కొన్ని పనులు అప్పజెప్పాం... పనులు వేగంగా చేయని ప్యాకేజీలకు నిబంధన 60సీ ప్రకారం కొత్త కాంట్రాక్టు సంస్థలకు అప్పజెప్పాం. 9 ప్యాకేజీలకు కొత్త రేట్ల ప్రకారం టెండర్లను పిలిచాం. పనులు సీఎం నిర్దేశించిన గడువులోపు పూర్తి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నాం. -సుధాకర్, తెలుగంగ సీఈ, చిత్తూరు -
చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు
సాక్షి ప్రతినిధి, కడప: ‘ముఖ్యమంత్రి చంద్రబాబు అబద్ధాల పుట్ట. ఉత్తుత్తి వాగ్దానాలు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తున్నారు. అవగాహన రాహిత్యంతో ఇష్టానుసారంగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు. జూలై నాటికి 35 టీఎంసీలు నీరు జీఎన్ఎస్ఎస్ ద్వారా తెస్తానని ప్రకటించారు. ప్రాజెక్టుల పట్ల ఆయనకు చిత్తశుద్ధి లేదు. ఆ విషయం తొమ్మిదేళ్ల ఆయన గత పాలన తేటతెల్లం చేస్తోంది. క్షేత్ర స్థాయిలో వాస్తవ విషయాలు తెలుసుకుని జీఎన్ఎస్ఎస్ పథకానికి పూర్తి స్థాయిలో నిధులు కేటాయించాలి. సత్వరమే యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు చేపట్టాల’ని కమలాపురం ఎమ్మెల్యే పి రవీంద్రనాథరెడ్డి డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో మూడు రోజులుగా నిరవధికనిరహార దీక్ష చేస్తున్న ఆయన మంగళవారం సాక్షికి ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు విషయాలు వెల్లడించారు. ఇప్పటి పరిస్థితిలో పెండింగ్ పనులు పూర్తి చేసేందుకు జీఎన్ఎస్ఎస్కు కనీసమంటే రూ. 1600 కోట్లు అవసరమన్నారు. పోతిరెడ్డిపాడు నుంచి గండి కోట వరకూ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, ఆ మేరకు ఇంజనీరింగ్ నిపుణులతో చర్చించామన్నారు. జిల్లాకు జీఎన్ఎస్ఎస్ ప్రాణప్రదమని, కమలాపురం నియోజకవర్గానికి అంత్యంత ముఖ్యమైన ప్రాజెక్టు అని ఆయన వివరించారు. ఇంటర్వ్యూ వివరాలు ఇలా.. సాక్షి : గాలేరు-నగరిలో అంతర్భాగమైన గండికోటతోపాటు మైలవరం రిజర్వాయర్లుకు కలిపి జూలై నాటికి 35 టీఎంసీల నీరు ఇవ్వనున్నామని ముఖ్యమంత్రి ప్రక టించినప్పటికీ మీరు దీక్ష చేయడానికి కారణం? ఎమ్మెల్యే: సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. ప్రాజెక్టులపట్ల అవగాహన అస్సల్లేదు. జూలై నాటికి అరకొరగా ఇవ్వచ్చు కానీ, 35 టీఎంసీల నీరు నిల్వ చేస్తాననడం హాస్యాస్పదం. 1996, 1999 ఎన్నికలకు ముందు ఓకే ప్రాజెక్టుకు రెండుసార్లు శంకుస్థాపనలు చేసి ఆపై మిన్నకుండిపోయారు. తొమ్మిదేళ్ల కాలంలో రూ.19 కోట్లు కేటాయించారు. అది ఉద్యోగుల జీతాలకే సరిపోయింది. తట్టెడు మట్టి కూడా తీయని ఆయన ఇప్పుడు నీరు ఇస్తానని చెబుతున్నారు. యుద్ధ ప్రాతిపదికన పెండింగ్ పనులు చేస్తే ఒకటిన్నర్ర సంవత్సరాలకు తొలి దశ పనులు పూర్తి చేయవచ్చు. అందు కోసం రూ.1600 కోట్లు పైగా ఖర్చు చేయాల్సి ఉంది. ఆ మేరకు బడ్జెట్లో ఓకేసారి నిధులు కేటాయించాలనే డిమాండ్‌తో నిరవధిక నిరాహార దీక్ష చేపట్టాను. క్షేత్ర స్థాయిలో స్వయంగా సహ చర ప్రజా ప్రతినిధులు, అఖిలపక్ష సభ్యులతో కలిసి పరిశీలించాను కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాను. ప్రభుత్వం బడ్జెట్లో పూర్తి స్థాయి నిధులు కేటాయించి చిత్తశుద్ధిని ప్రదర్శించాలి. సాక్షి : ప్రభుత్వంపై బురద చల్లేందుకే దీక్ష చేపట్టారని టీడీపీ నాయకులు అంటున్నారు.. ఎమ్మెల్యే: డ్వాక్రా మహిళలు, రైతుల రుణ మాఫీ అని ప్రకటించారు. అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేశారు. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్లు పాలించిన చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టు పనులపై ఏమాత్రం శ్రద్ధ చూపలేదు. ఆ కారణంగానే బ్రజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌లో నీటి వాటా కోల్పోయాం. తెలుగుగంగ పథకం పూర్తి కాకపోయినా పనులు చేశారు కాబట్టి నీటి వాటా దక్కింది. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఆహ్వానిస్తాం. టీడీపీ నాయకులకు చిత్తశుద్ధి లేదు.. వాళ్ల నాయకుడికి అస్సల్లేదు. ప్రజలు వాస్తవాలను గ్రహిస్తున్నారు. సాక్షి : పట్టిసీమ ప్రాజెక్టు ఆరు నెలలల్లో నిర్మించి కృష్ణా డెల్టాకు ఎత్తిపోతల ద్వారా 80 టీఎంసీల నీరు ఇస్తాం. అక్కడ ఆదా చేసిన నీరు శ్రీశైలం ద్వారా రాయలసీమకు ఇస్తామని సీఎం అంటున్నారు.. ఎమ్మెల్యే: రాయలసీమను మోసం చేసేందుకే పట్టిసీమ ప్రాజెక్టు. సీఎం చెబుతున్న మాట అధికారికంగా ఎక్కడైనా ఉందా? రూ.1300 కోట్లు పనులను 27 శాతం అధికంగా కాంట్రాక్టర్‌కు అప్పగిస్తున్నారు. కేవలం ప్రజాధనం దోచుకోవడం మినహా మరొకటి కాదు. నిజంగా ప్రభుత్వం నిజాయితీతో ఉంటే పోలవరం ప్రాజెక్టును సత్వరమే పూర్తి చేయాలని పట్టుబట్టాలి. ఆ ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇచ్చారు కాబట్టి.. కేంద్ర ప్రభుత్వం 90 శాతం వాటాను భరిస్తుంది. మిగిలిన పది శాతం వాటా మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టాలి. పోలవరం నిర్మిస్తే అక్కడ సద్వినియోగం అయిన 80టీఎంసీల నీటిలో ఎగువ రాష్ట్రాల వాటా 35 టీఎంసీలు పోతే, 45 టీఎంసీలు రాయలసీమకు సద్వినియోగం చేయవచ్చు. అటువంటి ఆలోచన చేయకుండా కమీషన్ల కోసమే కోట్లు దండుకోవాలనే ఉద్దేశంతోనే ‘పట్టిసీమ’ అంటున్నారు. భూసేకరణ చేయకుండానే ఆరు నెలల్లో ఆ ప్రాజెక్టును ఎలా నిర్మించగలరు? సాక్షి : పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయింపుపై పూర్తి వివక్ష ప్రదర్శించింది. దానిపై ఆందోళన నిర్వహించే ఆలోచన ఉందా? ఎమ్మెల్యే: పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రావడంపై సంతోషించాం. రాయలసీమకు నీరు లభిస్తుందని ఆశించాం. కేంద్రప్రభుత్వం నిధుల కేటాయింపులో పూర్తిగా వివక్ష చూపింది. అయినప్పటికీ తెలుగుదేశం పార్టీ కేంద్రంలో కొనసాగుతున్నందున మరింత ఒత్తిడి తేవాలి. పోలవరం నిర్మిస్తేనే కృష్ణా జలాలు రాయలసీమకు దక్కుతాయి. ఆ ప్రాజెక్టు సత్వరమే పూర్తి చేయడం కోసం పోరాటం చేసేందుకు ముందుంటాం. సాక్షి : నీరు-చెట్టు కార్యక్రమాన్ని పట్టిష్టంగా నిర్వహించి, మెట్ట ప్రాంతంలో కరువు రాకుండా బయపడేలా చేస్తానని ముఖ్యమంత్రి అంటున్నారు.. ఎమ్మెల్యే: నీరు-చెట్టు కేంద్ర ప్రభుత్వ పథకం. ఇందుకు రూ. 27 వేల కోట్ల నిధులు కేటాయిస్తోంది. చెరువులు అభివృద్ధి చేయడం, చెట్లను పెంచడం ముఖ్య ఉద్దేశం. చెరువుల్లోకి నీరు చేరితేనే కదా ఉపయోగం. ఈ నిధులను సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేయగలిగితే అంతకంటే అధికంగా ఉపయోగముంటుందని అన్ని పార్టీలు ఏకతాటిపైకి వచ్చి అఖిలపక్షంగా కేంద్రానికి వివరించాలి. ఆ దిశగా ప్రభుత్వ చర్యలు ఉంటే సంతోషమే. నీరు-చెట్టు పథకం తెలుగు తమ్ముళ్ల జేబులు నింపడానికే. సాక్షి : జీఎన్ఎస్ఎస్ పూర్తి చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు సహకరిస్తారనే నమ్మకం ఉందా? ఉద్యమాలకు తలొగ్గుతారా? ఎమ్మెల్యే: జీఎన్ఎస్ఎస్ తొలిదశ పనులు పూర్తి అయితే కమలాపురం నియోజకవర్గంలోనే 80 వేల ఎకరాల ఆయకట్టుకు నీరు అందుతుంది. భూగర్భ జలాలు పూర్తిగా పెరుగుతాయి. రాయలసీమ అభివృద్ధి పట్ల చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదు. విభజన చట్టంలో ఉన్న ఉక్కు ప్యాకర్టీ ఊసే లేదు. ఉర్దూ యూనివర్సిటీ కడపకు ప్రకటించి, కర్నూలులో ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారు. మంగంపేటలో చిన్నతరహా పరిశ్రమలు మూత పడేలా చేసి 20 వేల మంది కార్మికులు రోడ్డున పడేలా చేశారు. చంద్రబాబుకు తోలు మందం.. ప్రణాళిక బద్దంగా అఖిలపక్ష పోరాటాలకు సన్నద్ధం కానున్నాం. ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు అనుగుణంగా పాలన అందించేందుకు వైఎస్సార్సీపీ ముందంజలో నిలచి పోరాటాలు చేయనుంది. -
ఎన్నికల ముంగిట్లో.. నిధుల నిగారింపు!
సాక్షి, రంగారెడ్డి జిల్లా: బ్యాంకుల్లో మూలుగుతున్న నిధులకు రెక్కలొస్తున్నాయి. ఏళ్లుగా నిలిచిపోయిన పను లు మళ్లీ మొదలవబోతున్నాయి. సాధారణ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఈ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటివరకు పట్టీపట్టనట్లు వ్యవహరించిన ప్రజాప్రతినిధులు ఎన్నికల ముంగిట్లో ప్రజల్లోకి వెళ్లేందుకు అభివృద్ధి పనుల పేరిట విన్యాసాలకు తెరలేపారు. పాత హామీలను నెరవేర్చే పనిలో బిజీ అయ్యారు. భాగంగా ప్రజాప్రతినిధులు ప్రతిపాదించిన పలు పనులను జిల్లా పరిషత్ ఆమోదిస్తూ మంజూరు చేసింది. రూ.4.07కోట్ల పనులు గతనెల చివరి వారం నుంచి ఇప్పటివరకు జిల్లా పరిషత్ కోటాలో రూ.4.07కోట్ల మేర వివిధ కేటగిరిల్లో 99 పనులు మంజూరయ్యాయి. ఇవన్నీ జడ్పీ సాధారణ నిధులకు సంబంధించినవే. ప్రధానంగా తాగునీరు, కమ్యూనిటీ హాళ్లు, డ్వాక్రా భవనాలు, అంగన్వాడీ భవనాలు, సీసీ రోడ్లు తదితర పనులున్నాయి. అయితే నిధులను క్రమపద్ధతిలో వాడే విధంగా ప్రణాళిక సిద్ధం చేసిన నేతలు.. ముందుగా గతంలో మిగిలిపోయిన పనులను పూర్తిచేసే పనిలో పడ్డారు. తక్కువ సమయంలో పనులు పూర్తిచేసి ఓటర్ల మెప్పుపొందే క్రమంలో ఈ ఉపాయాన్ని ఎంచుకున్నారు. తాజాగా మంజూరైన పనులన్నీ ఆ కోవకు చెందినవే. అగ్రనేతలదే హడావుడి జడ్పీ జనరల్ ఫండ్ నుంచి మంజూరుచేసిన పనుల్లో బడా నేతలు ప్రతిపాదించినవే ఎక్కువగా ఉన్నాయి. మంత్రి ప్రసాద్‌కుమార్, మాజీ మంత్రి సబితారెడ్డి ప్రతిపాదించిన పనులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. ముఖ్యంగా శంషాబాద్, చేవెళ్ల, మొయినాబాద్, మహేశ్వరం, బంట్వారం, బషీరాబా ద్ మండలాలకు సంబంధించిన పనులు అధికంగా ఉన్నాయి. కేవలం శంషాబాద్ మండలానికి సంబంధించిన పనులే రూ.44లక్షల విలువ ఉండడం గమనార్హం. అదేవిధంగా మెయినాబాద్ మండలానికి కూడా పెద్దఎత్తున పనులు మంజూరయ్యాయి. 2013 -14 ఆర్థిక సంవత్సరంలో జిల్లా పరిషత్ సాధార ణ కోటా కింద దాదాపు రూ.25కోట్ల వరకు పనులు మంజూరు చేసినట్లు అధికారుల గణాంకాలు చెబుతుండగా.. కేవలం రెండు నెలల్లోనే పావువంతు పను లు యుద్ధప్రాతిపదికన ఆమోదం తెలపడం ప్రజాప్రతినిధుల ఎన్నికల హడావుడిని స్పష్టం చేస్తోంది. -
పెండింగ్ పనులు పూర్తిచేయాలి
కలెక్టరేట్, న్యూస్‌లైన్: మున్సిపాలిటీల్లో 2010 నుంచి 2013 వరకు మంజూరైన అన్ని పెండింగ్ పనులను ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్ స్మితా సబర్వాల్ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లాలోని మున్సిపల్ కమిషనర్లతో అర్బన్‌డే నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ 2013-14కు సంబంధించి మంజూరైన పనులను ఏప్రిల్ చివరి నాటికి పూర్తి చేయాలన్నారు. 10 నుంచి 13 వరకు ఉన్న పనులను జనవరి నాటికి పూర్తి చేయకుంటే బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. డంపింగ్ యార్డులను ప్రతి మున్సిపాలిటీలో ఏర్పాటు చేయడానికి ప్రభుత్వ భూములు కేటాయించడానికి ఆర్డీఓ, తహశీల్దార్లకు ఆదేశాలు జారీ చేశామన్నారు. ప్రత్యేక స్థలం లేని మున్సిపల్ కమిషనర్లు ఈ నెల 15లోగా అనుకూలమైన ప్రభుత్వ స్థలాలను గుర్తించి ప్రతిపాదనలను అందజేయాలన్నారు. నిర్లక్ష్యం వహిస్తే సంబంధిత మున్సిపల్ కమిషనర్లపై కఠిన చర్యలు తప్పవన్నారు. కమిషనర్లు ప్రతిరోజు వార్డుల్లో పర్యటించి ప్రధాన కూడళ్లు, ఆసుపత్రులు, పాఠశాలలు, నల్లాల వద్ద చెత్త పేరుకోకుండా చూడాలన్నారు. పారిశుద్ధ్య వారోత్సవాల సందర్భంగా కమిషనర్లు క్షేత్ర స్థాయిలో స్వయంగా పర్యటించాలన్నారు. పట్టణ ప్రాంతాల్లో మార్పు కార్యక్రమాన్ని ఈ నెల చివరి నుంచి అమలు చేసేలా చర్యలు చేపడుతున్నామన్నారు. సమావేశంలో మెప్మా పీడీ పూర్ణ చందర్, డీఆర్డీఏ పీడీ రాజేశ్వర్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, హెల్త్ సీఆర్పీలు, టీఎల్ఎఫ్లు పాల్గొన్నారు.