personal secretary
-
AAP MP Swati Maliwal: కొట్టాడు.. పొట్టలో తన్నాడు
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ నివాసంలో ఆయన వ్యక్తిగత కార్యదర్శి బిభవ్ కుమార్ తనపై చేసిన దాడిపై ఆప్ రాజ్యసభ సభ్యురాలు స్వాతి మలివాల్ సంచలన విషయాలు బయటపెట్టారు. విచక్షణారహితంగా ఛాతిపై కొట్టాడని, పొట్టలో తన్నాడని, చంపి పూడ్చిపెడతా అని బెదిరించాడని ఆమె ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఎఫ్ఐఆర్ ద్వారా తాజాగా వెలుగులోకి వచ్చాయి. దెబ్బలకు తాళలేక నడవలేకపోయా గురువారం బిభవ్‌పై ఢిల్లీ పోలీసులు నమోదుచేసిన ఎఫ్ఐఆర్లో స్వాతి ఇచి్చన వాంగ్మూలం వివరాలు ఉన్నాయి. ‘‘ కేజ్రీవాల్‌ను కలిసేందుకు డ్రాయింగ్ రూమ్‌లో కూర్చున్నా. పట్టరాని ఆవేశంతో నా వైపు దూసుకొచి్చన బిభవ్ ‘ మా మాట ఎందుకు వినట్లేవు? మాకు ఎదురుచెప్పడానికి ఎంత ధైర్యం? నీచమైన దానివి నువ్వు. నీకు గుణపాఠం చెప్తాం’ అని తిట్టడం మొదలెట్టాడు. తర్వాత 7–8 సార్లు చెంపమీద కొట్టాడు. దీంతో షాక్‌కు గురయ్యా. సాయం కోసం అరిస్తే ఎవ్వరూ ముందుకు రాలేదు. కూర్చున్న నన్ను షర్ట్ పట్టుకుని కిందకు తోశాడు. టేబుల్‌కు తల తగిలి కింద పడ్డా. అంతటితో ఆగకుండా వీరావేశంతో నా ఛాతి, పొట్ట, పొత్తికడుపు, కటి భాగంపై కాలితో పలుమార్లు తన్నాడు. నిలువరించబోతే షర్ట్ పట్టుకుని లాగాడు. షర్ట్ బటన్స్ కొన్ని ఊడిపోయాయి. షర్ట్ పైకి లేస్తోంది ఆపు అని అరిచినా బలంగా నెట్టేసి కొట్టాడు. పిరియడ్ నొప్పికితోడు ఈ దెబ్బల ధాటికి బాధతో విలవిల్లాడిపోయా. పీరియడ్స్ విషయం చెప్పినా అతను ఆగలేదు. దెబ్బల నొప్పికి కనీసం నడవలేకపోయా. ఎలాగోలా అక్కడి నుంచి బయటపడి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి విషయం చెప్పా. లిఖితపూర్వక ఫిర్యాదు అడిగారు. భయంకరమైన నొప్పుల బాధతో రాసే ఓపికలేక అక్కడి నుంచి వెళ్లిపోయా’’ అని స్వాతి చెప్పారు. ‘ఏం చేసుకుంటావో చేస్కో. నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేవు. నీ అంతుచూస్తా. ఎముకలు విరగ్గొట్టి పూడ్చిపెడతా. ఎక్కడ పూడ్చామో ఎవరూ కనిపెట్టలేరు’ అని బిభవ్ నన్ను బెదిరించాడు’’ అని మలివాల్ వాంగ్మూలం ఇచ్చారు. ముఖంపై అంతర్గత గాయాలు శుక్రవారం మలివాల్ ఢిల్లీ ఎయిమ్స్‌లో వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ఆమె ముఖంపై అంతర్గత గాయాలు ఉన్నట్లు వైద్యులు మెడికో లీగల్ కేస్ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. ఈ కేసు విషయమై మలివాల్ శుక్రవారం తీస్ హజారీ కోర్టు మేజి్రస్టేట్ ఎదుట హాజరై తన వాంగ్మూలం ఇచ్చారు. మరోవైపు కేజ్రీవాల్ సెక్యూరిటీ సిబ్బందితో మలివాల్ వాగ్వాదానికి దిగిన మే 13నాటి 52 సెకన్ల వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా షేర్ అవుతోంది. ‘‘ నన్నెవరైనా టచ్‌చేస్తే బాగుండదు. ఉద్యోగం నుంచి తొలగిస్తా. పోలీస్ కంట్రోల్ రూమ్‌కు ఫోన్ చేశా. వాళ్లు వచ్చేదాకా ఆగండి. డీసీపీతో మాట్లాడి మీ సంగతి తేలుస్తా’’ అని మలివాల్ అంటున్నట్లు వీడియోలో ఉంది. పొలిటికల్ హిట్‌మ్యాన్.. మలివాల్ శుక్రవారం ‘ఎక్స్’లో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘‘ పొలిటికల్ హిట్‌మ్యాన్ మళ్లీ తనను తాను కాపాడుకునే పనిలో పడ్డాడు. విషయం లేకుండా సొంత మనుషులతో ట్వీట్లు, వీడియోలు షేర్ చేయిస్తాడు. నేరాలు చేసి కూడా తప్పించుకోవచ్చని ఆయన ధీమా. ఇంటిలోపలి సీసీటీవీ ఫుటేజీ బహిర్గతమైతే నిజం అందరికీ తెల్సిపోతుంది’’ అని పోస్ట్‌చేశారు. ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ చేశారో ఆమె పేర్కొనలేదు. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం కేసు విచారణలో భాగంగా ఢిల్లీ పోలీసు ఫోరెన్సిక్ బృందం ఘటన జరిగిన కేజ్రీవాల్ నివాసానికి వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ కోసం మలివాల్‌ను వెంట తీసుకెళ్లారు. అక్కడి సాక్ష్యాధారాలు, సీసీటీవీ ఫుటేజీని ఐదుగురు సభ్యుల ఫోరెన్సిక్ నిపుణులు స్వా«దీనం చేసుకున్నారు. కాగా, తమ ఎదుట హాజరై వివరణ ఇవ్వాలని జాతీయ మహిళా కమిషన్ ఇచి్చన సమన్లను బిభవ్ బేఖాతరు చేశారు. దీంతో ఆయన జాడ తెల్సుకునేందుకు ఢిల్లీ పోలీసు బృందాలు బయల్దేరాయి. ఒక బృందం ఇప్పటికే అమృత్‌సర్‌కు వెళ్లింది. మహారాష్ట్రకు వచ్చాడేమో అనే అనుమానంతో ఆ రాష్ట్ర పోలీసు విభాగాన్ని సంప్రదించారు. ఇంత జరిగితే మాట్లాడరా?: సీతారామన్ ‘‘ ఇంట్లో సొంత పార్టీ మహిళా ఎంపీపై ఇంత ఘోరమైన దాడి జరిగితే కేజ్రీవాల్ ఎందుకు మాట్లాడట్లేరు? నిందితుడు బిభవ్‌ను ఇంకా వెంటేసుకుని తిరగడం నిజంగా సిగ్గుచేటు. ఈ విషయంలో కేజ్రీవాల్ ఒక బహిరంగ ప్రకటన చేసి క్షమాపణ చెప్పాలి’ అని బీజేపీ నాయకురాలు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ డిమాండ్‌చేశారు. ఇదంతా బీజేపీ కుట్ర: అతిశి మలివాల్‌ను అడ్డుపెట్టుకుని కేజ్రీవాల్‌ను ఈ కేసులో ఇరికించేందుకు బీజేపీ కుట్ర పన్నిందని ఆప్ నాయకురాలు అతిశి ఆరోపించారు. ‘‘ ఈ రోజు ఒక వీడియో చక్కర్లు కొడుతోంది. అందులో మలివాల్ సోఫాలో కూర్చుని వాగ్వాదానికి దిగారు. కొట్టారని, నొప్పితో బాధపడ్డానని, షర్ట్ బటన్లు ఊడిపోయాయని ఎఫ్ఐఆర్లో చెప్పారు. కానీ ఆ వీడియో చూస్తుంటే అదంతా అబద్ధమని తేలిపోయింది. సీఎం బిజీగా ఉంటే కలుస్తానని బిభవ్‌ను ఆమెనే కేకలేసి నెట్టేశారు. ఈ ఉదంతం వెనుక బీజేపీ హస్తముంది’’ అని అతిశి ఆరోపించారు. -
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
రాంచీ: కాంగ్రెస్ నేత, జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఆలంగీర్ ఆలం వ్యక్తిగత కార్యదర్శి(పీఎస్) పనిమనిషి ఇంట్లో బ్యాగుల కొద్దీ నోట్ల కట్టలు బయటపడటం సంచలనం రేపుతోంది. సోమవారం రాంచీలోని గడీఖానా చౌక్‌లోని పనిమనిషి జహంగీర్ ఆలం ఫ్లాట్‌లో సోదాలు జరిపిన ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను బయటపెట్టారు. మంత్రి ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్ లాల్ కూడా ఇదే ప్రాంతంలో నివసిస్తున్నారని చెబుతున్నారు. దాదాపుగా అన్నీ రూ.500 నోట్ల కట్టలు కాగా, కొన్ని ఆభరణాలు కూడా ఉన్నాయని అధికారులు తెలిపారు. సోమవారం రాత్రి వరకు 17 గంటలపాటు లెక్కించిన సొమ్ము రూ.35.23 కోట్లుగా తేలిందన్నారు. ఆరు యంత్రాలతో లెక్కింపు కొనసాగుతోందని చెప్పారు. మొత్తం ఆరు చోట్ల సోదాలు జరపగా మరో చోట రూ.3 కోట్ల నగదు బయటపడినట్లు ఈడీ వర్గాలు తెలిపాయి. ఎన్నికల వేళ చోటుచేసుకున్న ఈ పరిణామంపై కాంగ్రెస్‌కు చెందిన మంత్రి ఆలం స్పందిస్తూ.. ప్రభుత్వం నాకు సమకూర్చిన ప్రైవేట్ కార్యదర్శికి చెందిన ఇంట్లో సోదాలు జరుగుతున్నట్లు టీవీల్లో చూశానన్నారు. దీనిపై అధికారికంగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు. గత ఏడాది అరెస్ట్ చేసిన రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ రిటైర్డు చీఫ్ ఇంజినీర్ వీరేంద్రకుమార్ రామ్‌పై ఉన్న మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగానే తాజాగా దాడులు జరిపినట్లు ఈడీ తెలిపింది. ఈ కేసులో రామ్‌కు చెందిన రూ.39 కోట్ల ఆస్తులను సైతం అటాచ్ చేసింది. -
గాంధీ వ్యక్తిగత కార్యదర్శి కల్యాణం కన్నుమూత
సాక్షి, చెన్నై: మహాత్మా గాంధీ వ్యక్తిగత కార్యదర్శి వి.కల్యాణం (99) మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. స్వాతంత్య్ర సమరయోధుడైన కల్యాణం, 1943 నుంచి 1948 వరకు మహాత్మాగాంధీ వ్యక్తిగత కార్యదర్శిగా పనిచేశారు. చెన్నైలోని కుమార్తె ఇంట్లో ఉంటున్న ఆయన వయోభారం, అనారోగ్య సమస్యలతో మంగళవారం రాత్రి కన్నుమూశారు. బుధవారం చెన్నై బీసెంట్ నగర్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరగనున్నాయి. చదవండి: ప్రముఖ సామాజిక కార్యకర్త, ట్రాఫిక్ రామస్వామి ఇకలేరు -
కేటీఆర్ పీఏనంటూ టోకరా
-
కేటీఆర్ పీఏనంటూ టోకరా
సాక్షి, హైదరాబాద్: మంత్రి కేటీఆర్ పీఏనంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తిని హైదరాబాద్ పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు. నిందితుడిని మాజీ రంజీ క్రికెట్ ప్లేయర్‌గా గుర్తించారు. వ్యాపారులు, ఆస్పత్రుల నుంచి భారీగా నగదు వసూళ్లకు పాల్పడేవాడని నార్త్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు తెలిపారు. నిందితుడి నుంచి రూ.10 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. చదవండి: మిస్సింగ్ కేసు: బాలికకు మాయమాటలు చెప్పి.. స్నేహితురాలితో వీడియో కాల్ మాట్లాడుతోందని.. -
మాట వినకపోతే చంపేస్తాం.. బాబు పీఏ బెదిరింపులు..
కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు దౌర్జన్యాలకు దిగుతున్నారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్నారు. అధినేత పీఏ ఆదేశాలతో రెచ్చిపోతున్నారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై బెదిరింపులకు దిగుతున్నారు. పోటీ నుంచి తప్పుకోవాలని అల్టిమేటం జారీ చేస్తున్నారు. మాట వినకుంటే హతమారుస్తామనే స్థాయికి దిగారు. దీంతో నామినేషన్ వేసిన అభ్యర్థులు భయాందోళనకు గురవుతున్నారు. తమ ప్రాణాలకు రక్షణ కల్పించాలని పోలీసులను ఆశ్రయిస్తున్నారు. సాక్షి, తిరుపతి: కుప్పంలో చంద్రబాబు వ్యక్తిగత కార్యదర్శి మనోహర్ ఆగడాలకు అంతే లేకుండా పోయింది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా ఘనత వహించిన మనోహర్ తాజాగా పంచాయతీ ఎన్నికల్లోనూ దౌర్జన్యకాండ కొనసాగిస్తున్నాడు. టీడీపీకి వ్యతిరేకంగా నామినేషన్ వేసిన వారిని బెదిరిస్తున్నాడు. అందులో భాగంగా కుప్పం మండలం వి.మిట్టపల్లె పంచాయతీకి నామినేషన్ వేసిన వైఎస్సార్సీపీ అభిమాని అంజలికి హెచ్చరికలు జారీ చేశాడు. టీడీపీ మద్దతుతో పోటీచేస్తున్న శివలక్ష్మి భర్త మంజునాథ్‌తో కలిసి అంజలి ఇంటికి వెళ్లి మరీ దాడికి పాల్పడ్డాడు. నామినేషన్ ఉపసంహరించుకోకుంటే చంపేస్తామని బెదిరించాడు. దీనిపై శుక్రవారం బాధితులు పోలీసులను ఆశ్రయించారు. వారి ఫిర్యాదు మేరకు కుప్పం పోలీసులు కేసు నమోదు చేశారు. దందాల్లో ఆరితేరాడు చంద్రబాబు పీఏ మనోహర్ కుప్పం కేంద్రంగా పలమనేరు, మరి కొన్ని ప్రాంతాల్లో టీడీపీ వ్యవహారాలను చూస్తుంటాడు. చంద్రబాబు అండతో అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయంలో ప్రధానంగా రూ.1.6కోట్ల తిరుపతి గంగమ్మ ఆలయ నిధుల దుర్వినియోగం కేసుపై విచారణ సాగుతోంది. ఇదికాక పలు భూకుంభకోణాల్లో తన వంతు పాత్ర పోషించినట్లు ఆరోపణలు ఉన్నాయి. బెదిరింపుల పర్వం! నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ అభిమానుల ఏకగ్రీవమయ్యే పంచాయతీల్లో మనోహర్ డబ్బు ఎరవేసి అనామకులతో నామినేషన్ వేయిస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. అలాగే టీడీపీ మద్దతు అభ్యర్థులు బరిలో ఉన్నచోట్ల పోటీకి నామినేషన్ వేసిన వారిని బెదిరిస్తున్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. సర్పంచ్ అభ్యర్థులను ఎంపిక చేయడం దగ్గర నుంచి ఆర్థిక వ్యవహారాల వరకు మనోహర్ చూసుకుంటున్నట్లు టీడీపీ నేతలే వెల్లడిస్తున్నారు. ఏదిఏమైనా మనోహర్ ఆగడాలు శ్రుతి మించుతున్నాయని కుప్పంవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. (చదవండి: ఇదేం.. బరితెగింపు నాయనా..!) నిబంధనలు ఉల్లంఘించిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే -
పితాని మాజీ పీఎస్ సస్పెన్షన్..
సాక్షి, అమరావతి: ఈఎస్ఐ స్కామ్‌లో అరెస్టయిన మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు మున్సిపల్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్యామలరావు ఉత్తర్వులు జారీ చేశారు. మందుల కొనుగోళ్లలో అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి పితాని సత్యనారాయణ మాజీ పీఎస్ మురళీమోహన్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. (మాజీమంత్రి పితాని పాత్రపైనా ఆరా) టీడీపీ హయాంలో జరిగిన ఈఎస్ఐ భారీ స్కామ్‌లో అప్పటి కార్మిక శాఖ మంత్రి పితాని సత్యనారాయణ పాత్ర ఎంత అనే దానిపైనా అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఆరా తీస్తోంది. కార్మిక శాఖ మంత్రిగా అచ్చెన్నాయుడు తర్వాత పితాని ఆ శాఖ బాధ్యతలు నిర్వర్తించారు. టీడీపీ పాలనలో ఈఎస్ఐలో 988.77కోట్ల నిధులు ఖర్చుపెట్టారు. వీటిలో టెలీ హెల్త్ సర్వీసెస్, మందులు, ఫర్నీచర్, వైద్య సామాగ్రి కొనుగోళ్లతోపాటు అనేక లావాదేవీలు నిబంధనలకు విరుద్ధంగా జరిగాయి. వీటిలో రూ.150 కోట్లకు పైగా అవినీతి, అక్రమాలు జరిగాయని విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం నిగ్గు తేల్చింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఏసీబీ ఈ కుంభకోణంలో 19 మంది ప్రమేయం ఉన్నట్టు ప్రాథమికంగా గుర్తించి.. ఇప్పటికే 10 మందిని అరెస్ట్ చేసింది. -
సీఎం సెక్రటరీనంటూ మాజీ క్రికెటర్ డబ్బులు డిమాండ్
నెల్లూరు: ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి పర్సనల్ సెక్రటరీ పేరుతో మాజీ క్రికెటర్ నెల్లూరులోని కార్పొరేట్ ఆసుపత్రి యాజమాన్యాన్ని మోసం చేసేందుకు ప్రయత్నించిన సంఘటన వెలుగులోకి వచ్చింది. రంజీ స్థాయిలో ఆడిన మాజీ క్రికెటర్ నాగరాజు సీఎం పేరు చెప్పి రూ.3.5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. అనుమానం వచ్చిన ఆసుపత్రి సిబ్బంది పోలీసులకు సమాచారం అందించడంతో వారు నాగరాజును అదుపులోకి తీసుకున్నారు. విచారణలో తనపై ఇప్పటికే ఆరు కేసులు నమోదైనట్టు పోలీసులు వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా పోలంకి మండలం యవ్వారి గ్రామానికి చెందిన బుడమూరు నాగరాజు 2014లో నాన్‌స్టాప్‌గా 82 గంటల పాటు క్రికెట్ ఆడి గిన్నిస్ బుక్ రికార్డు సాధించాడు. ఆతర్వాత విలాసవంత జీవితానికి అలవాటు పడి ప్రముఖల పేర్లను ఉపయోగించి పలువురి నుంచి డబ్బులు వసూలు చేసేవాడు. ఈ క్రమంలోనే నెల్లూరులో పోలీసులకు పట్టుబడ్డాడు. -
గవర్నర్ కార్యదర్శికి హైకోర్టు నోటీసులు
చెన్నై: అనేక వర్సిటీల వైస్ చాన్స్‌లర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్‌పై తమిళనాడు హైకోర్టు స్పందించింది. గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. మాట్రం ఇందియా సంస్థ డైరెక్టర్ పాడం నారాయణన్ వేసిన పిటిషన్‌కు సంబంధించిన వివరాలివీ.. రాష్ట్రంలోని చెన్నై వర్సిటీ, అన్నా వర్సిటీ, కామరాజర్ వర్సిటీ, లా వర్సిటీ వంటి అనేక వర్సిటీలలో వైస్ చాన్స్‌లర్ పదవులు అనేక నెలలుగా ఖాళీగా ఉన్నాయి. అదే విధంగా భారతీదాసన్ వర్సిటీ, పెరియార్ వర్సిటీలలో వైస్ చాన్స్లర్ల పదవీ కాలం త్వరలో ముగియనుంది. సాధారణంగా వైస్ చాన్స్‌లర్ పదవి ఖాళీ కావడానికి మూడు నెలల ముందుగానే కొత్త వీసీని ఎంపిక చేసేందుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. అయితే, అనేక వర్సిటీలలో వీసీని ఎన్నుకునేందుకు కమిటీలను ఇంకా ఏర్పాటు చేయలేదు. వైస్ చాన్స్లర్లు లేని వర్సిటీలలో పలు కార్యక్రమాలు స్తంభించిపోయాయి. స్నాతకోత్సవాలు కూడా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే.. వీసీ పోస్టులను సత్వరమే భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి, గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి ఉత్తర్వులివ్వాలని పాడం నారాయణన్ తన పిటిషన్లో కోరారు. అంతేకాకుండా ఆయన దాఖలు చేసిన మధ్యంతర పిటిషన్లో వైస్ చాన్స్‌లర్ లేకుండానే అన్నా వర్సిటీలో శుక్రవారం స్నాతకోత్సవం నిర్వహించేందుకు సంకల్పించారని, దీనికి స్టే విధించాలని కోరారు. ఈ కేసుపై న్యాయమూర్తులు మహాదేవన్, గోవిందరాజ్ విచారణ జరిపి రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, ఉన్నత విద్యా కార్యదర్శి, రాష్ట్ర గవర్నర్ వ్యక్తిగత కార్యదర్శికి నోటీసులు పంపాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. -
బాలకృష్ణ పీఏ హల్చల్
హిందూపురం అర్బన్ : హిందూపురం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఎమ్మెల్యే బాలకృష్ణ వ్యక్తిగత కార్యదర్శి శేఖర్ శనివారం హల్చల్ చేశారు. తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి కార్యాలయానికి వచ్చి ఎమ్మెల్యే స్థాయిలో అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కిందిస్థాయి ఉద్యోగులపై హెచ్చరికలు జారీ చేస్తూ ఇలాగే ఉండాలంటూ హుకుం వేశారు. కొత్తగా చిత్తూరు నుంచి పదోన్నతిపై ఇక్కడి వచ్చిన సబ్ రిజిస్ట్రార్ వెంకటేశ్వర్లుకు అందరూ సహకరించాలన్నారు. ఏదైనా ఇబ్బంది కల్గించిన సహించేది లేదని హెచ్చరించారు. కండసారా ఫ్యాక్టరీ భూములు రిజిస్ట్రేషన్‌కు ఎందుకు పెట్టాల్సి వచ్చిందని అధికారులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆయన తీవ్రస్థాయిలో హెచ్చరిస్తూ బెదిరిస్తుండటంతో కార్యాలయ సిబ్బంది బెంబేలెత్తిపోయారు. -
మంత్రిగారి పీఎస్సా మజాకా?
కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు అధికారుల పనితీరుపై ఆరా అధికారిక కార్యక్రమాల్లోనూ జోక్యం గగ్గోలు పెడుతున్న ప్రభుత్వాధికారులు గుర్ల: ఆయన మంత్రి కాదు... శాఖలకు ఉన్నతాధికారి అస్సలు కాదు.. కానీ ప్రభుత్వ కార్యాలయాల్లో పెత్తనం చెలాయిస్తారు. అప్పుడప్పుడు ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. మంత్రి లేని సమయాల్లో నేరుగా కార్యాలయాల్లోకి వచ్చి తన ప్రతాపం చూపిస్తుంటారు. ఇదీ రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి డాక్టర్ కిమిడి మృణాళిని పర్సనల్ సెక్రెటరీ(పీఎస్) రామకృష్ణ హంగామా. మంగళవారం గుర్ల మండలంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల్లోనూ ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. బొంగుహారన్ కలిగిన ప్రభుత్వ వాహనంపై నేరుగా గుర్ల ఎంపీడీఓ కార్యాలయానికి చేరుకున్నారు. అక్కడ స్త్రీశక్తి భవనంలో జరుగుతున్న యోగా శిక్షణా కార్యక్రమాన్ని పరిశీలించారు. అనంతరం తహశీల్దారు కార్యాలయానికి చేరుకుని తహశీల్దారు పి.ఆదిలక్ష్మితో పలు విషయాలపై చర్చించారు. తొలుత జిల్లా నీటియాజమాన్య సంస్థ ప్రాజెక్టు డెరైక్టర్ ప్రశాంతి ఎంపీడీఓలు, ఏపీఓలకు నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సు వద్ద కాసేపు కూర్చుని పరిశీలించారు. పీహెచ్సీలో పరిస్థితులపై ఆరా గుర్ల పీహెచ్‌సీలోకి ప్రవేశించి ఆస్పత్రిలో ల్యాబ్, మందులిచ్చే గది, సిబ్బంది గదులను పరిశీలించారు. వైద్యాధికారి డాక్టర్ అభిజ్ఞను పలు ప్రశ్నలు సంధించి సమాధానాలు రాబెట్టారు. ఓపీ ఎంత వస్తోంది.? గత ఏడాది ఏప్రిల్ నుంచి ఇంత వరకూ ఎన్ని మాతృ, శిశు మరణాలు సంభవించాయి. బాల్యవివాహాల నిరోధానికి ఆశ కార్యకర్తలు, ఏఎన్ఎమ్ల సహాయంతో గ్రామాల్లో అవగాహన కల్పిస్తున్నారా..? మందులు సక్రమంగా అందుతున్నాయా...? రోగులకు సక్రమమైన సేవలు అందిస్తున్నారా అంటూ ఆరా తీశారు. గతంలోనూ ఇలా రెండుసార్లు గతంలో పీహెచ్‌సీకి వచ్చి తనిఖీ చేశారు. హాజరు పట్టీని తనిఖీ చేసి గ్రీన్‌పెన్‌తో స్వయానా రౌండప్ చేశారు. ఇలా మంత్రి పీఎస్ పదే పదే కార్యాలయాలను తనిఖీ చేయడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ఈయనే మంత్రిలా స్వయాన గెజిటెడ్ అధికారులను సైతం ప్రశ్నించడంపై అధికార వర్గాల్లో ఆవేదన వ్యక్తమవుతోంది. పీఎస్ వస్తున్నారు అని తెలియగానే తలలు పట్టుకునే పరిస్థితి నెలకొంటోందని అధికార వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. -
వెంకయ్య వ్యక్తిగత కార్యదర్శిగా సౌరభ్ గౌర్
న్యూఢిల్లీ: పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి వెంకయ్యనాయుడు వ్యక్తిగత కార్యదర్శిగా గురువారం ఆంధ్రప్రదేశ్ కేడర్‌కు చెందిన 2002 బ్యాచ్ ఐఏఎస్ అధికారి సౌరభ్ గౌర్ నియమితులయ్యారు. మరో కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ప్రత్యేక అధికారిగా ఉన్నత్ పి.పండిత్‌ను నియమించారు. -
మంత్రి పీఎస్ హల్చల్....
చీపురుపల్లి: రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, హౌసింగ్ శాఖా మంత్రి కిమిడి మృణాళిని పర్యటనలు, వ్యవహారాలు చూసుకోవాల్సిన ఆయన ఒక్కసారిగా మంత్రిగా పరకాయప్రవేశం చేశారు. తానే మంత్రినైనట్టు రాష్ట్ర మంత్రి మృణాళిని పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ వ్యవహరించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో మంత్రి పీఎస్ తనిఖీలు చేసి, ఉద్యోగులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చాలా చోట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంత్రి మృణాళినితో ఫాలో అవ్వాల్సిన ఆమె పర్సనల్ సెక్రటరీ రామకృష్ణ, మంత్రి అసెంబ్లీ సమావేశాల్లో ఉన్నప్పటికీ ప్రభుత్వ వాహనంలో శుక్రవారం చీపురుపల్లి వచ్చి హల్చల్ చేశారు. పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం, ఆర్డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీరింగ్ కార్యాలయాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆర్డబ్ల్యూఎస్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయానికి వెళ్లిన ఆయన మధ్యాహ్నం అక్కడే భోజనం చేసి, అక్కడే ఉన్న నీటి పరీక్షా కేంద్రాన్ని తనిఖీ చేసి అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. అంతేకాకుండా పంచాయతీరాజ్ డిప్యూటీ ఇంజినీర్ కార్యాలయంతో పాటు ప్రాజెక్ట్స్ కార్యాలయంలో ఏకంగా సాంకేతిక రికార్డులను, అటెండెన్స్ రిజిస్టర్లను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. సాంకేతిక అనుమతులు రిజిస్టర్లలో గత నెలకు సంబంధించిన పనులకు వివరాలను ఎందుకు పూర్తిగా నమోదు చేయలేదని అధికారులను నిలదీసినట్లు సమాచారం. అక్కడితో ఆగకుండా జిల్లా పరిషత్ సీఈఓ రాజకుమారి, పంచాయతీరాజ్ ఎస్ఈ, ఈఈలకు అక్కడి నుంచి ఫోన్ చేసి, స్పీకర్ ఆన్‌చేసి చీపురుపల్లి డిప్యూటీ పంచాయతీరాజ్ విభాగం పరిస్థితి ఏమీ బాగాలేదని, దృష్టి పెట్టాలని సూచించారు. అంతకుముందు పట్టణంలోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, కస్తూరిభా గాంధీ బాలికల విద్యాలయాలకు వెళ్లి మధ్యాహ్న భోజనం గురించి ఆరా తీశారు. వారానికి ఎన్ని గుడ్లు పెడుతున్నారో సిబ్బందిని అడిగి తెలుసుకున్నట్లు తెలిసింది. అలాగే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలను కూడా పరిశీలించినట్లు తెలిసింది. అయితే మంత్రి పీఎస్ చర్యలుపై ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఇంజినీరింగ్ అధికారుల్లో చర్చ మొదలయ్యింది. ఈ విషయమై ఏకంగా మంత్రి మృణాళినితోనే మాట్లాడేందుకు ఇంజినీరింగ్ అదికారులు సిద్ధమవుతున్నట్లు సమాచారం. -
కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి మృతి
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శి పెండ్యాల సంతోష్ కుమార్ మృతి చెందారు. ఈరోజు తెల్లవారుజామున 1.30గంటలకు ఆయన గుండెపోటుతో మరణించారు. కేసీఆర్ వ్యక్తిగత కార్యదర్శిగా పెండ్యాల సంతోష్ కుమార్ వారం రోజుల క్రితమే నియమితులయ్యారు. ఆయన మృతికి కేసీఆర్ సంతాపం తెలిపారు.