Peterson
-
భార్యా, కొడుకూ పరాయి అయినప్పుడు...
కొత్త బంగారం ఒకానొక రాత్రి– బయో కెమిస్ట్ అయిన డగ్లస్ పీటర్సన్‌కు భార్య అయిన కోనీ, ‘మనిద్దరి పెళ్ళీ ఇంక కొనసాగలేదు’ అని చెబుతుంది. భార్యని ఎంతగానో ప్రేమించే డగ్లస్, ఆమె లేకుండా తన జీవితాన్ని ఊహించుకోలేకపోతాడు. కోనీ ఆర్ట్ గ్యాలెరీలో పని చేస్తుంది. దంపతులు లండన్ నివాసులు. 18 ఏళ్ళ కొడుకైన ఎల్బీ కాలేజీలో చేరబోయేముందు కొంత మనో వినోదం కోసం తమ ముగ్గురికీ యూరప్ టూర్ ముందే బుక్ చేసుకునుంటాడు డగ్లస్. ఆ ప్రయాణం ముగ్గురికీ దిగులు పుట్టించి తమ తమ జీవితాలని పునరావలోకనం చేసుకునేలా చేస్తుంది. ఈ పర్యటన గురించి డగ్లస్ పాఠకులకి చెప్తున్నప్పుడు, తనకి పెళ్ళయిన పాతికేళ్ళ చరిత్రనీ తవ్వుకుంటాడు. భార్యా, కొడుకూ తననుండి ఎలా దూరం అయ్యారో, తనెక్కడ తప్పు చేశానో అన్న డగ్లస్ ఆలోచనల సమాంతరమైన కథనం ఒకటి వినిపిస్తుంది. తల్లిదండ్రుల మధ్య పోట్లాటలు పెట్టి తన పని సాధించుకోవడం తెలిసిన టీనేజర్ ఎల్బీ. కొడుకు నుంచి డగ్లస్ ఎదురుకునేది నిర్లక్ష్యం, అగౌరవం, ఎగతాళీ. ఆమ్స్టర్డామ్ చేరినప్పుడు ఒక అకార్డియన్ వాయించే ఆస్ట్రే్టలియన్ అమ్మాయితో పారిపోతాడు ఎల్బీ. భార్య లండన్ తిరిగి వెళ్ళిపోతుంది. ఆఖరికి, డగ్లస్ ఒంటరిగానే ఇంటికి చేరుకుంటాడు. డగ్లస్‌కు బయాలజీ గురించిన పరిజ్ఞానం బాగానే ఉంటుంది. జీవితం గురించే వీసమాత్రం కూడా తెలియదు. భార్య ప్రేమని తిరిగి పొందే అతని ప్రయత్నాలూ, కొడుకుతో తనకున్న సంబంధం పట్ల అతని దృష్టికోణమూ మనస్సుని తాకుతాయి. రెండు సమానాంతర కథనాలూ ఒకే ప్రశ్నని భిన్నమైన విధానంలో ప్రశ్నిస్తాయి: డగ్లస్‌ను కోనీ ఎందుకు వదిలి పెట్టింది! ఇద్దరివీ తూర్పూ పడమరా వంటి భిన్నమైన దృక్పథాలయినప్పుడు, అసలు డగ్లస్‌ను కోనీ పెళ్ళెందుకు చేసుకుంది? తను ప్రేమించిన భార్యతో సంబంధం ఎలా నిలబెట్టుకోవాలో, పరాయివాడిగా ప్రవర్తించే కొడుక్కి ఎలా దగ్గిర అవ్వాలో అని ప్రయత్నించే వ్యక్తి కథ ఇది. కథనం హాస్యంగా, స్వీయనిందతో కూడుకున్నది. పుస్తకాన్ని చదివించేది డగ్లస్ పాత్రే. యూరప్‌ను కళ్ళకి కట్టేలా వర్ణిస్తారు రచయిత. పారిస్ వర్ణన అద్భుతంగా ఉంటుంది. ఒకే ఒక్క వ్యక్తి దృక్కోణంతో కథనం సాగినప్పటికీ, డగ్లస్ పట్ల భార్యకీ, కొడుక్కీ ఉన్న అభిప్రాయాల గురించి కూడా పాఠకులకి తెలిసే రీతిలో పుస్తకం సాగుతుంది. ఎవరినీ జడ్జ్ చేయదు నవల. ఒక దగ్గిర కూర్చుని మాట్లాడుకునే అలవాటు లేకపోవడంవల్ల కుటుంబంలో తలెత్తే అపార్థాలు, సంబంధాలు చెడిపోవడం గురించి మాట్లాడుతారు రచయిత. ఒంటరిగా ఇంటికి తిరిగి వచ్చిన డగ్లస్, పూర్తిగా మారిన మనిషి. తన వివాహం విచ్ఛిన్నం అవడం గురించి సంతోషం కలగనప్పటికీ ‘ఆ తరువాత తన జీవితం ఎలా సాగుతుందా!’ అన్న అతని భయం మట్టుకు వదులుతుంది. నిశితమైన విజ్ఞతతో రాయడం వల్ల కథకుని పాత్రలు వాస్తవంగా అనిపిస్తాయి. చదవడానికి చాలా సులభమైన నవలే కానీ కథనంలో ఉన్న హాస్యంలో తాత్విక లోతులు కనిపిస్తాయి. ఈ నవల 2014లో వచ్చింది. స్పెక్సేవర్స్ సంస్థ రచయిత డేవిడ్ నికొల్స్ను ‘యు.కె. ఆథర్ ఆఫ్ ద ఇయర్’గా ఎంచుకుంది. 2014లో మాన్ బుకర్ ప్రైజుకి ఈ నవల లాంగ్ లిస్ట్ అయింది. ఆడియో పుస్తకం కూడా ఉంది. - కృష్ణ వేణి -
రైజింగ్ పుణే కూర్పులో స్పష్టత
హర్షా భోగ్లే బ్యాటింగ్ ఆర్డర్‌పై రైజింగ్ పుణే సూపర్ జెయింట్స్‌కు ఇప్పుడు పూర్తి స్పష్టత వచ్చింది. అయితే తమ ఉత్తమ కూర్పు విషయంలో ఓ అంచనాకు రావడానికి వీరికి కొంచెం సమయం పట్టింది. నిజానికి ధోని సేన తాజా సీజన్లో ఇంకా పూర్తిగా నిలదొక్కుకోలేదనే చెప్పాలి. రహానే, డు ప్లెసిస్, పీటర్సన్, స్టీవ్ స్మిత్, ధోనిలతో టాప్-5 గట్టిగానే ఉంది. ఇందులో ఎవరో ఒకరు తమ జట్టు ప్రణాళికలను అమలుపరచగలుగుతున్నారు. కానీ పీటర్సన్ టోర్నీ నుంచి వైదొలగడంతో స్మిత్ తనకిష్టమైన మూడో నంబర్ స్థానంలో రాగలుగుతున్నాడు. అతడి జాతీయ జట్టులో వార్నర్, ఫించ్లాగా స్మిత్ విధ్వంసకర బ్యాట్స్‌మన్ కాకపోయినా కళాత్మక షాట్లతో పాటు వినూత్నంగా ఆడగలడు. ధోని నంబర్ఫోర్లో రావాల్సి ఉంటుంది. ఫినిషర్స్‌గా మిషెల్ మార్ష్, తిసారా పెరీరాలను ఉపయోగించుకోవచ్చు. ఇక వికెట్ కీపర్, ఇద్దరు బౌలర్లతో టాప్-7లో పుణే కూర్పు పర్ఫెక్ట్గా ఉంది. మరోవైపు చివరి నలుగురిలో ఇద్దరు స్పిన్నర్లను ఆడించుకుంటే సరిపోతుంది. ఒకవేళ నాణ్యమైన ఫాస్ట్ బౌలర్ ఉంటే జట్టు పూర్తి సంతృప్తిగా ఉన్నట్టే. ఈ విషయంలో అశోక్ దిండా సరిపోతాడు. మరో జట్టు గుజరాత్ లయన్స్ మాత్రం బ్యాటింగ్ ఆర్డర్‌తో కాస్త ఇబ్బంది పడుతోంది. వీరికి డ్వేన్ స్మిత్, మెకల్లమ్, ఫించ్‌ల రూపంలో ముగ్గురు సూపర్ విదేశీ ఓపెనర్లు ఉన్నారు. ఒకవేళ సురేశ్ రైనా మూడో నంబర్లో రావాలనుకుంటే వీరిలో ఒకరు నాలుగు లేదా ఐదో స్థానంలో ఆడాల్సి ఉంటుంది. కానీ ఫించ్ గైర్హాజరీతో గతంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు అనేక విజయాలు అందించిన డ్వేన్ స్మిత్, మెకల్లమ్ జోడి ఢిల్లీపై శుభారంభాన్ని ఇచ్చింది. ఫించ్ ఆడినా లోయర్ ఆర్డర్లో దిగాల్సి ఉంటుందేమో.. నిజానికి మెకల్లమ్ మూడు, రైనా నాలుగో స్థానంలో దిగాలని గుజరాత్ భావిస్తే బావుంటుంది. -
మనసు లేని మనిషి
క్రైమ్ ఫైల్ ‘‘ఇదే సర్ ఇల్లు’’... కారు దిగుతూనే అన్నాడు కెల్విన్. ‘‘ఊ... పదండి’’ అన్నాడు ఇన్స్పెక్టర్. అందరూ మెయిన్ డోర్ వైపు నడిచారు. కాలింగ్ బెల్ కొడితే క్షణాల్లో తలుపు తెరచుకుంది. ‘‘ఎస్... ఏం కావాలి?’’ అన్నాడు తలుపు తెరిచిన వ్యక్తి, అందరినీ తేరిపార చూస్తూ. మాట్లాడలేదు ఇన్స్పెక్టర్. జేబులోంచి ఐడీ కార్డు మాత్రం తీసి చూపించాడు. దాన్ని చూస్తూనే... ‘‘ఓహ్... రండి లోపలికి. ఏంటిలా వచ్చారు?’’ అన్నాడతను అందంగా నవ్వుతూ. ‘‘స్టాసీ కనిపించడం లేదని వాళ్ల అక్కయ్య కంప్లయింట్ ఇచ్చారు. ఎంక్వయిరీకి వచ్చాం మిస్టర్ పీటర్సన్.’’ అతను నవ్వాడు. ‘‘అనుకున్నాను ఇలాంటిదేదో జరుగు తుందని. కానీ మీరనుకున్నట్టు, మీకు అందిన కంప్లయింట్లో ఉన్నట్టు తను కనిపించకుండా పోలేదు. వేరే వ్యక్తితో వెళ్లిపోయింది. అది తెలియక అందరూ స్టాసీ మిస్ అయ్యిందనుకుంటున్నారు.’’ ‘‘మీ భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందా? మరి మీరింత ఆనందంగా ఉన్నారేంటి?’’ అన్నాడు ఇన్స్పెక్టర్ తీక్షణంగా చూస్తూ. ‘‘నన్ను కాదనుకుని వెళ్లిపోయినవాళ్ల గురించి ఏడుస్తూ కూర్చోవడంలో అర్థం లేదు. ఎంతో ప్రేమించాను. వంచించి పోయింది. తన ఆనందం తాను వెతుక్కుంది. మరి నా ఆనందాన్ని నేనెందుకు చంపేసుకోవాలి?’’ ఇన్స్పెక్టర్ కనుబొమలు పైకి లేచాయి. ‘‘మీ యాటిట్యూడ్ చాలా ఇంటరెస్టింగ్‌గా ఉందే! కానీ, స్టాసీ వేరే వ్యక్తితో వెళ్లిపోయిందంటూ మీరు చెబుతున్నది నేనెలా నమ్మాలి?’’ వెంటనే టీపాయ్ మీద ఉన్న తన మొబైల్ అందుకున్నాడతను. టకటకా మెసేజులన్నీ చెక్ చేశాడు. ఒక మెసేజ్ ఓపెన్ చేసి ఇన్స్పెక్టర్కి అందించాడు. ‘‘చూడండి... మీకే తెలుస్తుంది’’ అన్నాడు. ఇన్స్పెక్టర్ ఆ మెసేజ్ చదివాడు. ‘‘సారీ డియర్... నేను వెళ్లి పోతున్నాను. నా మనసు నాకు తెలియ కుండానే వేరే వ్యక్తి వైపు మళ్లింది. అతని తోనే నాకు ఆనందం ఉందనిపిస్తోంది. అందుకే నీతో బంధాన్ని తెంచేసుకుంటు న్నాను. సారీ అండ్ బై... స్టాసీ.’’ అర్థమైందన్నట్టు తలూపాడు ఇన్స్పెక్టర్. ‘‘మీరివాళ ఓసారి స్టేషన్‌కి వచ్చి స్టేట్మెంట్ ఇవ్వండి. కేసు క్లోజ్ చేస్తాం’’ అనేసి తన టీమ్‌తో పాటు వెనుదిరిగాడు. కారు ఎక్కుతుంటే అసిస్టెంట్ కెల్విన్ అన్నాడు... ‘‘నాకెందుకో అనుమానంగా ఉంది సర్. మూడేళ్ల క్రితం ఈయన భార్య క్యాథలీన్ సావియో బాత్ టబ్‌లో మునిగి మరణించింది. ప్రమాద వశాత్తూ మరణించిందని కేసు క్లోజ్ చేశారు. ఇప్పుడు మరో భార్య కనిపించ కుండా పోయింది. ఇందులో అనుమానించాల్సిందేమీ లేదంటారా?’’ అప్పటికే ఇన్స్పెక్టర్ బుర్ర పరిపరి విధాల ఆలోచిస్తోంది. ఎక్కడో ఏదో ముడి ఉంది. అది విడితే కానీ అన్ని విషయాలూ బయటకు రావు. అందుకే ముందు దాన్ని విప్పే ప్రయత్నంలో పడ్డాడతను. ‘‘ఏంటి సర్ మళ్లీ వచ్చారు? ఆల్రెడీ స్టేట్మెంట్ ఇచ్చాను కదా?’’... పొద్దున్నే వచ్చిన పోలీసులను చూసి అదే నవ్వు ముఖంతో అన్నాడు పీటర్సన్. ‘‘మీరివ్వాల్సిన స్టేట్మెంట్స్ ఇంకా ఉన్నాయి మిస్టర్ పీటర్సన్. పదండి స్టేషన్‌కి’’ అన్నాడు చేతులకు బేడీలు వేస్తూ. ‘‘ఏం మాట్లాడుతున్నారు మీరు? చెప్పానుగా స్టాసీ ఎవరితోనో వెళ్లిపోయిందని. తను ఇచ్చిన మెసేజ్ కూడా చూపించాను. ఇంకేం సాక్ష్యాలు కావాలి మీకు?’’ అన్నాడు ఆవేశంగా. ‘‘నిజమైన సాక్ష్యానికీ సృష్టించిన సాక్ష్యానికీ తేడాలు ఆమాత్రం తెలియవా? మీరూ ఒకప్పుడు పోలీసేగా... ఇలాంటి వెన్ని చూసుంటారు మీరు? అయినా నేను వచ్చింది స్టాసీ కేసు గురించి కాదు. మీ భార్య క్యాథలీన్ సావియోని హత్య చేసినందుకు అరెస్ట్ చేయడానికి.’’ ఇన్స్పెక్టర్ మాట వింటూనే పీటర్సన్ ముఖం పాలిపోయింది. ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాక మౌనంగా వారి వెంట నడిచాడు. ఫిబ్రవరి 21, 2013... అమెరికాలోని ఇలినాయిస్... ‘‘తన మూడో భార్య క్యాథలీన్ సావియోని హత్య చేసినందుకు డ్రూ పీటర్సన్‌కి ముప్ఫై ఎనిమిదేళ్ల కఠిన కారాగార శిక్ష విధించడమైనది.’’ తీర్పు వింటూనే అవాక్కయి పోయాడు పీటర్సన్. అన్నాళ్లూ ఉన్న కాన్ఫిడెన్స్ ఒక్కసారిగా ఎగిరిపోయింది. బిత్తర చూపులు చూశాడు. ఇలా జరిగిం దేమిటి అన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. అతని దగ్గరకు వచ్చాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎప్పటికీ దొరకననుకున్నారు కదా మిస్టర్ పీటర్సన్. తాడిని తన్నేవాడుంటే వాడి తలదన్నేవాడొకడు ఉంటాడు. ఇక వెళ్దామా?’’ అన్నాడు నవ్వుతూ. ఆ నవ్వులో విజయగర్వం ఉంది. దాన్ని చూసి తల దించుకున్నాడు పీటర్సన్. అతనికి చాలా ఆశ్చర్యంగా ఉంది. ఎప్పుడో క్లోజ్ అయిపోయిన కేసు మళ్లీ ఎలా తెరచుకుంది? తనకిప్పుడు శిక్ష ఎలా పడింది? ఏమీ అర్థం కావడం లేదతనికి. ఎందుకంటే ఆ రోజు తన ఇంటి నుంచి వెళ్లాక ఇన్స్పెక్టర్ ఏం చేశాడో, ఎన్ని రహస్యాలను బయటికి లాగాడో అతడికి తెలియదు కాబట్టి! ఎప్పుడైతే పీటర్సన్ భార్య క్యాథలీన్ మరణం గురించి కెల్విన్ గుర్తు చేశాడో... అప్పుడే వెయ్యి సందేహాలు తలెత్తాయి ఇన్స్పెక్టర్ మనసులో. వెంటనే డ్రూ పీటర్సన్ జీవిత పుస్తకంలోని ప్రతి పుటనీ, ఆ పుటల్లోని ప్రతి అక్షరాన్నీ క్షుణ్నంగా చదవడం మొదలెట్టాడు. పీటర్సన్ చరిత్ర ఇన్స్పెక్టర్కి సరైన దారి చూపించింది. 1954, జనవరి 5న పుట్టాడు డ్రూ పీటర్సన్. చిన్నప్పట్నుంచీ పోలీసు యూనిఫామ్ అంటే పిచ్చి. అందుకే పట్టుబట్టి పోలీసయ్యాడు. అయితే నిజాయతీపరుడైన పోలీస్ కాలేదు. యూనిఫామ్ ముసుగులో అవినీతికి పాల్పడ్డాడు. చివరికి పై అధికారుల కంటికి చిక్కి డిస్మిస్ అయ్యాడు. ఇదంతా ఒకెత్తు. అతడి వ్యక్తిగత జీవితం మరొకెత్తు. పీటర్సన్ మొదట్నుంచీ ఆడపిల్లల విషయంలో చాలా వీక్. పోలీస్ ట్రెయినింగ్ సమయంలోనే హైస్కూల్లో తన సహ విద్యార్థిని అయిన క్యారెల్ను పెళ్లాడాడు. కానీ నాలుగేళ్లలోనే వారి బంధం సడలిపోయింది. ఇద్దరు పిల్లలు పుట్టాక విడాకులు తీసుకున్నారు. రెండేళ్ల తర్వాత విక్టోరియాని పెళ్లాడాడు పీటర్సన్. ఓ పక్క ఆమెతో కాపురం చేస్తూనే క్యాథలీన్ సావియోతో ప్రేమాయణం మొదలెట్టాడు. అది తెలిసి విక్టోరియా వేరుపడిపోయింది. దాంతో క్యాథలీన్ని తన అర్ధాంగినిగా చేసుకున్నాడు. కానీ ఆ బంధమూ బలంగా లేదు. పీటర్సన్ తనను తరచుగా వేధిస్తున్నాడంటూ క్యాథలీన్ పలుమార్లు పోలీస్ కంప్లయింట్ కూడా ఇచ్చింది. కానీ తన పలుకుబడితో వాటిని బుట్టదాఖలు చేయించాడు పీటర్సన్. చివరికి 2004, ఏప్రిల్ నెలలో ఓ రోజు బాత్‌టబ్‌లో శవమై తేలింది క్యాథలీన్. కానీ ఆ సమయంలో పీటర్సన్ ఇంట్లో లేడని ఎలిబీ ఉండటంతో ప్రమాదవశాత్తూ జరిగిన మరణంగా తేల్చి కేసు క్లోజ్ చేశారు. ఆ తర్వాత తనకంటే ముప్ఫ య్యేళ్లకు పైగా చిన్నదైన స్టాసీ యాన్‌ను పెళ్లి చేసుకున్నాడు. 2007లో ఓరోజు తన అక్క ఇంటికని బయలుదేరిన స్టాసీ మాయమైపోయింది. చెల్లెలు ఎంతకీ రాకపోవడంతో పీటర్సన్‌కి ఫోన్ చేసిందామె. అతడు చెప్పిన పొంతన లేని సమాధానాలకు సందేహాలు తలెత్తి, పోలీస్ కంప్లయింట్ ఇచ్చింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. మొత్తం పీటర్సన్ జీవితాన్ని తిరగ తోడారు. ‘‘నేనేదో సందేహంతో మామూలుగా అన్నాను. కానీ మీరు అంత కచ్చితంగా పీటర్సన్ని నేరస్తుడిగా ఎలా నిరూ పించారు సర్?’’... అడిగాడు కెల్విన్. సబార్డినేట్ ఉత్సుకతను చూసి నవ్వు కున్నాడు ఇన్స్పెక్టర్. ‘‘ఎంత పెద్ద నేరస్తుడైనా ఒక్కోసారి చిన్న తప్పు చేసి దొరికిపోతాడు కెల్విన్. పీటర్సన్ కూడా అదే చేశాడు. ఇంటి నుంచి వెళ్లిన రోజు రాత్రి తొమ్మిది గంటలకు స్టాసీ తనకు మెసేజ్ ఇచ్చిందంటూ చూపించాడు కదా! ఆ మెసేజ్ చివర్లో స్టాసీ అని రాసివుంది. ఏ భార్య అయినా తన భర్తకు మెసేజ్ ఇస్తూ చివర్లో తన పేరు రాసుకుంటుందా? అంత అవసరం ఉంటుందా? తన భర్తకి తన నంబర్ తెలియదా?’’ ‘‘నిజమే సర్. నాకిది తట్టనే లేదు’’ అన్నాడు కెల్విన్ ఆశ్చర్యపోతూ. ‘‘అక్కడికీ ఆమె వేరే ఎవరి నంబర్ నుంచైనా మెసేజ్ పెట్టిందేమోనని ఆ నంబర్ స్టాసీదేనా అని కూడా అడిగాను పీటర్సన్ని. అతడు అవునని చెప్పాడు. దాంతో నా అనుమానం బలపడింది. కచ్చితంగా ఏదో నంబర్ నుంచి ఆ మెసేజ్ తన ఫోన్‌కి పీటర్సనే ఇచ్చుకున్నాడని అనిపించింది. మనం నమ్మమేమోనని భయమేసి కింద స్టాసీ పేరు పెట్టాడు. అడ్డంగా దొరికిపోయాడు. దానికి తోడు నువ్వు క్యాథలీన్ని గుర్తు చేశావ్. ఆ కేసు నేను రహస్యంగా రీ ఓపెన్ చేశాను. చని పోయినప్పుడు క్యాథలీన్ నగ్నంగా ఉంది. అంటే స్నాన ం చేస్తూ ప్రమాదవశాత్తూ చనిపోయిందని మనం అనుకోవాలని అలా ప్లాన్ చేశాడు. కానీ ఆమె ఒంటిమీద దెబ్బలున్నాయని పోస్ట్‌మార్టమ్ రిపోర్టులో ఉంది. ఆ విషయం బయటకు రాకుండా మేనేజ్ చేశాడు. అలాగే భర్త హింసిస్తున్నా డంటూ క్యాథలీన్ ఇచ్చిన కంప్లయింట్లన్నీ నా విచారణలో దొరికాయి. అలా ఓ చిన్న తీగ మొత్తం డొంకని కదిలించింది.’’ ‘‘మీరు గ్రేట్ సర్. మూసేసిన కేసును తెరిచి మరీ ఛేదించారు.’’ తల అడ్డంగా ఊపాడు ఇన్స్పెక్టర్. ‘‘లేదు కెల్విన్. నేను ఇంకా గెలవలేదు. స్టాసీ జాడ తెలియట్లేదు. ఆమె ప్రాణాలతో ఉందా? లేక ఆమె కూడా క్యాథలీన్లాగే పీటర్సన్ పైశాచికత్వానికి బలైందా? అది తెలిసినప్పుడే నేను నిజంగా గెలిచినట్టు.’’ ఇన్స్పెక్టర్ ఈ మాట అని రెండేళ్లయ్యింది. కానీ ఇప్పటికీ అతను గెలవలేదు. ఎందుకంటే... నేటికీ స్టాసీ జాడ తెలియలేదు! - సమీర నేలపూడి -
మాకొద్దీ ‘కోటీశ్వరులు’
అగ్రశ్రేణి ఆటగాళ్లను వదిలించుకున్న ఫ్రాంచైజీలు ⇒ యువరాజ్‌ను తప్పించిన బెంగళూరు ⇒ ఢిల్లీ జట్టు నుంచి 13 మంది అవుట్ ⇒ ముగిసిన ఐపీఎల్ బదిలీలు ముంబై: ఐపీఎల్-7 వేలం... యువరాజ్ సింగ్ ఎలాగైనా కావాల్సిందేనని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) కెప్టెన్ విరాట్ కోహ్లి పట్టుదల... ఫ్రాంచైజీ యాజమాన్యం కూడా అతడి మాటకు విలువిచ్చింది. ఏకంగా రూ. 14 కోట్లు పెట్టి యువరాజ్‌ను సొంతం చేసుకుంది. అదే తరహాలో ఈసారి కూడా కోహ్లి, యువీకి అండగా నిలిచాడు. ఇంకా మ్యాచ్ విన్నరే కాబట్టి తప్పించవద్దంటూ మద్దతు పలికాడు. అయితే విజయ్ మాల్యా బృందం కోహ్లిని పట్టించుకోలేదు. భారీ మొత్తం తీసుకున్నా ఆ స్థాయిలో రాణించలేకపోయిన భారత స్టార్ పట్ల నిర్దాక్షిణ్యంగా వ్యవహరించింది. ఆటగాళ్ల బదిలీల్లో భాగంగా యువరాజ్‌ను విడుదల చేసింది. ‘తెల్ల ఏనుగు’లా మారిన యువీని భరించలేమంటూ తేల్చేసింది. ఐపీఎల్-2014లో బెంగళూరు తరఫున యువరాజ్ 14 ఇన్నింగ్స్‌లతో కలిపి 376 పరుగులు చేశాడు. 22.4 ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేసిన అతను ఐదు వికెట్లు పడగొట్టాడు. గత ఐపీఎల్లో ఆర్సీబీ చివరినుంచి రెండో స్థానంలో నిలిచింది. నిబంధనల ప్రకారం యువరాజ్ 2015 ఐపీఎల్ వేలంలోకి వచ్చినప్పుడు ఏ ఫ్రాంచైజీ అయినా అతడిని వేలంలో తీసుకుంటే... అదే మొత్తాన్ని సదరు జట్టుకు చెల్లించి బెంగళూరు మళ్లీ వెనక్కి తీసుకోవచ్చు. ఆర్సీబీ దీనిని వాడుకొని తక్కువ మొత్తంలో యువీని మళ్లీ తీసుకునే చాన్స్ ఉంది. దినేశ్ కార్తీక్ అవుట్ ఐపీఎల్లో భారీ మొత్తంలో కొనుగోలు చేసిన ఆటగాళ్లను తప్పించి, పొదుపు మంత్రం పాటించేందుకు అన్ని జట్లూ సిద్ధమయ్యాయి. స్టార్లుగా గుర్తింపు ఉన్నవారు విజయాలు అందించకపోవడంతో వారికంటే ఇతర యువ ఆటగాళ్లను నమ్ముకోవడమే నయమని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి. ఇందులో భాగంగానే ఐపీఎల్-7లో చిట్టచివరి స్థానంలో నిలిచిన ఢిల్లీ డేర్‌డెవిల్స్ కూడా పెద్ద ఎత్తున మార్పులు చేసింది. ఆ జట్టు ఏకంగా 13 మంది ఆటగాళ్లను విడుదల చేసింది. తమ జట్టులో 11 మందిని మాత్రమే వచ్చే సీజన్‌కు కొనసాగించనుంది. గత వేలంలో రెండో అత్యధిక మొత్తంతో రూ. 12.50 కోట్లకు కొనుక్కున్న దినేశ్ కార్తీక్‌ను ఆ జట్టు విడుదల చేసింది. కార్తీక్‌తో పాటు ఇతర ‘విలువైన’ ఆటగాళ్లను కూడా ఆ జట్టు కాదనుకుంది. పీటర్సన్ (రూ. 9 కోట్లు), మురళీవిజయ్ (రూ. 5 కోట్లు), రాస్ టేలర్ (రూ. 2 కోట్లు)లను ఆ జట్టు తప్పించింది. ప్రధాన ఆటగాళ్లలో డుమిని, డి కాక్, షమీలను మాత్రం ఢిల్లీ కొనసాగించనుంది. ప్రస్తుత ఫ్రాంచైజీలు విడుదల చేసిన ఇతర ఆటగాళ్లలో పుజారా, బాలాజీ, మురళీ కార్తీక్ (కింగ్స్ ఎలెవన్ పంజాబ్) తదితరులు ఉన్నారు. ముంబై ఇండియన్స్ జట్టు జహీర్ ఖాన్ (రూ. 2.60 కోట్లు), ప్రజ్ఞాన్ ఓజా (రూ. 3.25 కోట్లు) లను వదిలి పెట్టగా... సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ స్యామీ (రూ. 3.50 కోట్లు), అమిత్ మిశ్రా (రూ. 4. 75 కోట్లు), ఇర్ఫాన్ పఠాన్ (రూ. 2.40 కోట్లు), ఫించ్ (రూ. 4 కోట్లు), హోల్డర్ (రూ. 75 లక్షలు), వేణుగోపాలరావు (రూ. 55 లక్షలు) లను... విడుదల చేసింది. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీ హిల్ఫెన్హాస్, డేవిడ్ హస్సీలను... ఢిల్లీ డేర్‌డెవిల్స్ పార్నెల్, ఇమ్రాన్ తాహిర్, రాహుల్ శర్మ, నీషామ్లను... రాజస్థాన్ రాయల్స్ బ్రాడ్ హాడ్జ్, కూపర్లను విడుదల చేసింది. -
వర్షంలో ‘సన్‌రైజ్’
నాటకీయ మ్యాచ్‌లో హైదరాబాద్ విజయం .... డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో ఓడిన ఢిల్లీ కాసేపు 20 ఓవర్ల మ్యాచ్... అంతలోనే మళ్లీ 12 ఓవర్లకు మార్పు... మళ్లీ ఐదు ఓవర్లకు కుదింపు.. వర్షం కారణంగా నాటకీయంగా ఓవర్లు మారిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ గట్టెక్కింది. ఢిల్లీ డేర్‌డెవిల్స్‌తో మ్యాచ్‌లో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో గెలిచి వరుసగా రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. న్యూఢిల్లీ: రాజస్థాన్‌పై విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్న సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు... మరోసారి సమష్టిగా రాణించి ఢిల్లీపైనా విజయాన్ని అందించారు. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన ఈ మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో డక్‌వర్త్ లూయిస్ పద్ధతిలో హైదరాబాద్ నెగ్గింది. సన్‌రైజర్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకోగా... ఢిల్లీ డేర్ డెవిల్స్ 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. దినేశ్ కార్తీక్ (30 బంతుల్లో 39; 1 ఫోర్, 2 సిక్స్‌లు), పీటర్సన్ (19 బంతుల్లో 35; 4 ఫోర్లు, 2 సిక్స్‌లు) రాణించగా.. ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ స్టెయిన్(2/20)తో పాటు మిశ్రా (2/23), హెన్రిక్స్ (2/26) ఢిల్లీ బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేశారు. ఆ తర్వాత పలుమార్లు వర్షం ఆటంకం కల్గించడంతో చివరికి సన్‌రైజర్స్ లక్ష్యాన్ని 5 ఓవర్లలో 43 పరుగులుగా నిర్దేశించారు. హైదరాబాద్ మరో నాలుగు బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుంది. నమన్ ఓజా (13 నాటౌట్), వార్నర్ (12 నాటౌట్) జట్టు విజయాన్ని పూర్తి చేశారు. స్కోరు వివరాలు ఢిల్లీ డేర్‌డెవిల్స్ ఇన్నింగ్స్: డి కాక్ (సి) రాహుల్ (బి) స్టెయిన్ 7; పీటర్సన్ (సి) ధావన్ (బి) మిశ్రా 35; అగర్వాల్ (సి) వార్నర్ (బి) మిశ్రా 25; కార్తీక్ (సి) స్టెయిన్ (బి) హెన్రిక్స్ 39; శుక్లా (సి) వార్నర్ (బి) హెన్రిక్స్ 21; డుమిని (బి) భువనేశ్వర్ 4; జాదవ్ (సి) పఠాన్ (బి) స్టెయిన్ 5; రాహుల్ శుక్లా నాటౌట్ 2; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) : 143. వికెట్ల పతనం: 1-10; 2-54; 3-73; 4-128; 5-132; 6-139; 7-143. బౌలింగ్: స్టెయిన్ 4-0-20-2; భువనేశ్వర్ 4-0-23-1; కరణ్ శర్మ 3-0-29-0; హెన్రిక్స్ 3-0-26-2; మిశ్రా 3-0-23-2; పఠాన్ 3-0-18-0. హైదరాబాద్ సన్‌రైజర్స్ ఇన్నింగ్స్: ఫించ్ (బి) రాహుల్ శుక్లా 4; ధావన్ (సి) డుమిని (బి) కౌల్ 4; వార్నర్ నాటౌట్ 12; నమన్ ఓజా నాటౌట్ 13; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (4.2 ఓవర్లలో 2 వికెట్లకు) : 44. వికెట్ల పతనం: 1-13; 2-25. బౌలింగ్: షమీ 1-0-6-0; కౌల్ 1-0-5-1; తాహిర్ 1-0-7-0; రాహుల్ శుక్లా 1-0-13-1; లక్ష్మిరతన్ శుక్లా 0.2-0-7-0. మ్యాచ్ సాగిందిలా... తొలుత మ్యాచ్ షెడ్యూల్ ప్రకారం 20 ఓవర్లే. స్టెయిన్ బౌలింగ్‌లో డికాక్ అవుటైనా... ఢిల్లీ కెప్టెన్ పీటర్సన్ ధాటిగా ఆడటంతో పవర్‌ప్లేలో 52 పరుగులు వచ్చాయి. అయితే అమిత్ మిశ్రా తన వరుస ఓవర్లలో పీటర్సన్, మయాంక్ అగర్వాల్‌లను అవుట్ చేశాడు. తర్వాత వచ్చిన కార్తీక్, శుక్లా నిలకడగా ఆడటంతో ఢిల్లీ 13.1 ఓవర్లలో 103/3 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. ఈ సమయంలో భారీ వర్షం కురవడంతో మ్యాచ్‌ను ఆపేశారు. 75 నిమిషాల పాటు ఆటకు అంతరాయం కలిగినా ఓవర్లు కుదించకుండా మ్యాచ్‌ను కొనసాగించారు. దీంతో మళ్లీ వచ్చిన ఢిల్లీ మిగిలిన ఓవర్లు ఆడింది. నాలుగో వికెట్‌కు శుక్లా, కార్తీక్ కలిసి 55 పరుగులు జోడించాక... హెన్రిక్స్ బౌలింగ్‌లో ఈ ఇద్దరూ అవుటయ్యారు. డెత్ ఓవర్లలో భువనేశ్వర్, స్టెయిన్ అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీంతో చివరి నాలుగు ఓవర్లలో ఢిల్లీ కేవలం 15 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఢిల్లీ ఇన్నింగ్స్ ముగిసిన తరువాత వర్షం పడటంతో మ్యాచ్‌కు మరోసారి అంతరాయం ఏర్పడింది. దాదాపు అరగంట పాటు మ్యాచ్ నిలిచిపోయింది. దీంతో మ్యాచ్‌ను కుదించారు. సన్‌రైజర్స్‌కు 15 ఓవర్లలో 117 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించారు. ధావన్, ఫించ్ కలిసి 1.1 ఓవర్లలో 11 పరుగులు చేశాక మళ్లీ వర్షం వచ్చింది. దీంతో మరోసారి ఓవర్లను కుదించారు. లక్ష్యాన్ని 12 ఓవర్లలో 97 పరుగులుగా నిర్దేశించారు. బ్యాట్స్‌మెన్ వచ్చి మరో ఐదు బంతులు ఆడగానే మళ్లీ వర్షం పడింది. ఈ ఐదు బంతుల వ్యవధిలోనే ధావన్ అవుటయ్యాడు. మ్యాచ్ ఆగే సమయానికి సన్‌రైజర్స్ స్కోరు 2 ఓవర్లలో వికెట్ నష్టానికి 17. మరో 20 నిమిషాల తర్వాత మళ్లీ మ్యాచ్ ప్రారంభమైంది. అయితే ఈసారి లక్ష్యం మళ్లీ మారింది. డక్‌వర్త్ లూయిస్ పద్ధతి ప్రకారం హైదరాబాద్ ఐదు ఓవర్లలో 43 పరుగులు చేయాలి. అప్పటికి 2 ఓవర్లలో 17 చేశారు. అంటే ఇక మూడు ఓవర్లలో 26 పరుగులు చేయాలి. ఇన్నింగ్స్ మూడో ఓవర్లో హైదరాబాద్ జట్టు తాహిర్ బౌలింగ్‌లో 7 పరుగులు రాబట్టింది. ఆ తర్వాతి ఓవర్లో ఫించ్ ధాటిగా ఆడే ప్రయత్నంలో రాహుల్ శుక్లా బౌలింగ్‌లో అవుటయ్యాడు. అయితే వార్నర్ ఓ ఫోర్, నమన్ ఓజా ఓ సిక్స్ కొట్టడంతో నాలుగో ఓవర్లో మొత్తంగా 13 పరుగులు వచ్చాయి. చివరి ఓవర్లో సన్‌రైజర్స్ 6 బంతుల్లో 6 పరుగులు చేయాల్సి ఉండగా... లక్ష్మిరతన్ శుక్లా బౌలింగ్‌లో తొలి బంతికి వార్నర్ సింగిల్ తీశాడు. రెండో బంతికి ఓజా సిక్సర్ బాది సన్‌రైజర్స్ విజయాన్ని ఖాయం చేశాడు. -
ఇకనైనా ‘డేర్’ పెరిగేనా !
ఢిల్లీ డేర్ డెవిల్స్... ఓనర్: జీఎంఆర్; కెప్టెన్: కెవిన్ పీటర్సన్ కోచ్: గ్యారీ కిర్‌స్టెన్ గత ఉత్తమ ప్రదర్శన: సెమీఫైనల్ (2008, 2009, 2012(ప్లే ఆఫ్)) కీలక ఆటగాళ్లు: పీటర్సన్, టేలర్, డుమినీ, దినేశ్ కార్తీక్, విజయ్, మహ్మద్ షమీ ‘అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని’ ఈ సామెత ఢిల్లీ డేర్ డెవిల్స్‌కు అతికినట్లుగా సరిపోతుంది.. ఒంటిచేత్తో గెలిపించే సత్తా ఉన్న ఆటగాళ్లు జట్టులో ఉన్నప్పటికీ గత ఆరు సీజన్లలో ఢిల్లీ డేర్ డెవిల్స్ ఒక్కసారి కూడా విజేతగా నిలవలేకపోయింది. 2008, 2009లో సెమీఫైనల్స్‌కు.. 2012లో ప్లే ఆఫ్ దశకు చేరుకున్నా అవకాశాల్ని అందిపుచ్చుకోలేకపోయింది. దీంతో విసిగి వేసారిపోయిన డెవిల్స్ యాజమాన్యం జట్టులో ఉన్న ఆటగాళ్లందరినీ వదిలించుకుంది. ఆ తర్వాత వేలం పాటలో కోట్లు కుమ్మరించి మరీ స్టార్ ఆటగాళ్లను కొనుగోలు చేసింది. ఎవరూ ఊహించని విధంగా వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ దినేశ్ కార్తీక్‌ను రూ. 12.5 కోట్లకు సొంతం చేసుకుంది. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు పీటర్సన్‌ను రూ. 9 కోట్లకు, మురళీ విజయ్ రూ. 5 కోట్లకు దక్కించుకుంది. మొత్తానికి గతాన్ని మరిచిపోయి కొత్త లుక్‌తో ఐపీఎల్-7లో బరిలోకి దిగుతున్న ఢిల్లీ.. ఇంగ్లండ్ మాజీ ఆటగాడు కెవిన్ పీటర్సన్‌ను సారథిగా నియమించింది. భారమంతా కిర్స్టెన్పైనే... భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా వ్యవహరించి.. విజయవంతమైన కోచ్‌గా పేరు తెచ్చుకున్న కిర్‌స్టెన్ తొలిసారిగా ఐపీఎల్లో కోచింగ్ బాధ్యతలు చేపట్టాడు. గతంలో భారత్ లాగే ఇప్పుడు ఢిల్లీ జట్టును కూడా విజయవంతంగా ముందుకు నడిపిస్తాడని జీఎంఆర్ ఫ్రాంచైజీ ఆశిస్తోంది. ఇక ఢిల్లీ జట్టులో ఉన్న ఆటగాళ్లలో చాలా మందికి కిర్‌స్టెన్‌తో మంచి సంబంధాలు ఉన్నాయి. బలాలు... భారత క్రికెటర్లు, విదేశీ ప్లేయర్లు, దేశవాళీ ఆటగాళ్లతో ఢిల్లీ జట్టు పటిష్టంగా కనిపిస్తోంది. కెప్టెన్ పీటర్సన్ సీజన్ మొత్తం అందుబాటులో ఉండటం.. విజయవంతమైన కోచ్‌గా కిర్‌స్టెన్‌కు పేరుండటం.. ఈ జట్టు బలాలు.. బలహీనతలు...: కొద్దిమంది ఆటగాళ్లు మినహాయిస్తే మిగిలిన వాళ్లంతా ఈ జట్టుకు కొత్త.. ఇది మినహాయిస్తే డెవిల్స్‌కు పెద్దగా బలహీనతలేమీ లేవు. జట్టు: భారత్‌కు ఆడిన క్రికెటర్ల్లు: దినేశ్ కార్తీక్, మురళీ విజయ్, మహ్మద్ షమీ, మనోజ్ తివారీ, జయ్‌దేవ్ ఉనాద్కట్, రాహుల్ శర్మ, లక్ష్మీ రతన్ శుక్లా, సౌరవ్ తివారీ. విదేశీ క్రికెటర్లు: కెవిన్ పీటర్సన్ (ఇంగ్లండ్), జీన్‌పాల్ డుమినీ, క్వింటన్ డికాక్, వేన్ పార్నెల్ (దక్షిణాఫ్రికా), రాస్ టేలర్, జేమ్స్ నీషామ్(న్యూజిలాండ్), నాథన్ కౌల్టర్ నైల్ (ఆస్ట్రేలియా), భారత దేశవాళీ క్రికెటర్లు: కేదార్ జాదవ్, మయంక్ అగర్వాల్, షాబాజ్ నదీమ్, సిద్ధార్థ్ కౌల్, రాహుల్ శుక్లా, జయంత్ యాదవ్, హెచ్. ఎస్. శరత్, మిలింద్ కుమార్.