photo graphy
-
Pic of The Day: ‘క్లిక్’ కొట్టామంటే కిర్రాక్ ఉండాలే!
ఇప్పుడంటే ప్రతి స్మార్ట్‌ఫోన్(Smart Phone) ఓ కెమెరా..గురిపెట్టామా... క్లిక్ అనిపించామా... ఫొటో రెడీ. కానీ...వాస్తవానికి ఫొటోగ్రఫీ(Photography) అంత ఈజీ ఏమీ కాదు..సరైన కెమెరా.. సెట్టింగ్‌లపై అవగాహన.. లైటింగ్.. టైమింగ్..ఇలా బోలెడన్ని విషయాలను అర్థం చేసుకుని మరీ క్లిక్ అనిపించాలి!కావాలంటే.. ఎనజేటర్ పేరుతో ఎక్స్‌పై వచ్చిన ఈ ట్వీట్ చూడండి! అత్యద్భుతమైన ఫొటోగ్రఫీకి కొన్ని మచ్చుతునకలు కనిపిస్తాయి!This is photography at it’s finest. rate all from 1-10! pic.twitter.com/rTHuZjGmUo— Enezator (@Enezator) January 6, 2025 -
ఈ ప్రదర్శనను ఆపండి...!
న్యూఢిల్లీ: ఒక వైపు కన్నకొడుకును కోల్పోయి పుట్టెడు దుఃఖంలో మునిగి ఉన్న ఓ మాతృమూర్తి..పరిహారం చెక్కు ఇస్తూ ఫొటో తీయించుకోవాలనే మంత్రి యావను చూసి అసహనం వ్యక్తం చేశారు. ‘ఈ ప్రదర్శనను ఆపండి’ అంటూ అక్కడున్న వారిని వేడుకున్నారు. యూపీలో చోటుచేసుకున్న ఈ ఘటన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. మంత్రి తీరును ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రంగా ఎండగట్టారు. జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీలో గురువారం ఉగ్రవాదులతో జరిగిన ఎన్కౌంటర్లో యూపీలోని ఆగ్రాకు చెందిన కెప్టెన్ శుభమ్ గుప్తా అసువులు బాశారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పరిహారం చెక్కు అందజేసేందుకు మంత్రి యోగేంద్ర ఉపాధ్యాయ్ శుక్రవారం ఆయన కుటుంబాన్ని కలుసుకున్నారు. తీవ్ర శోకంలో ఉన్న కెప్టెన్ శుభమ్ గుప్తా తల్లితో మంత్రి మాట్లాడారు. అనంతరం పరిహారం చెక్కు ఇచ్చేందుకు మంత్రి ప్రయత్నించగా ఆమె తీసుకోలేదు. ‘నాకు ఏమీ వద్దు, ఈ ఎగ్జిబిషన్(ప్రదర్శని మత్ లగావో)ను ఇక ఆపండి’ అంటూ వేడుకున్నా చెక్కును అలాగే పట్టుకుని ఫొటో తీయించుకునేందుకు మంత్రి ప్రయత్నిస్తున్నట్లు వీడియోలో రికార్డయింది. -
రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్న సురక్ష’ కార్యక్రమం (ఫొటోలు)
-
శారీలో మెస్మరైజ్ చేస్తున్న రింకూ రాజ్‌గురు... ఆకట్టుకుంటున్న (ఫొటోలు)
-
క్లిక్ ట్రెండ్: యోగా ఫొటో
జ్ఞాపకాల పదిలానికి ఫొటోని మించిన సాధనం లేదన్నది మనకు తెలిసిందే. ప్రీ వెడ్డింగ్, మెటర్నిటీ, న్యూ బోర్న్.. అంటూ ఫొటోగ్రఫీలో రకరకాల ట్రెండ్స్‌ను మనం చూస్తూనే ఉన్నాం. వీటితోపాటు యోగా, ఫిట్నెస్ పోజెస్ ఫొటోగ్రఫీ ఇప్పుడొక ట్రెండ్ అయ్యింది. దీనికి సామాజిక మాధ్యమం కూడా ఓ కారణం. ఈ వేడుకకు ఆ ఫొటో తీసుకొని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయడం చాలా సహజంగా జరుగుతుంటుంది. అందుకు అందమైన, అద్భుతం అనిపించే ఫొటోలు కావాలని కోరుకోని వారుండరు. యోగా సాధనలో తాము సాధించిన విజయాలను నలుగురితో పంచుకోవడానికి ఇప్పుడు యోగా ఫొటోగ్రఫీ కళ తప్పనిసరి అవసరంగా మారిందంటున్నారు నిపుణులు. యోగా క్లాసులు ఇవ్వడానికి, యోగాలో తమ ప్రావీణ్యాన్ని ప్రదర్శించడానికి ఫొటోలే ఆధారం. అలాగే, కొత్తగా ఫొటోగ్రఫీ నేర్చుకోవడానికి యోగా ఫొటోలు తీయడం అత్యంత సమర్థవంతమైన మార్గాలలో ఒకటి. ఫిట్నెస్ మీద ఆసక్తి కనబరుస్తున్నవారు తమ శరీరాకృతిని యోగా భంగిమల్లో చూపడానికి ఈ ఫొటోగ్రఫీ ఒక అద్భుతమైన వాహికగా పనిచేస్తుంది. గతంలో యోగా, వ్యాయామం వంటివి చేసి ఆ తర్వాత వదిలేసినవారు ఎప్పుడైనా వీటికి సంబంధించిన ఫొటోలు చూసుకున్నప్పుడు ఒక ప్రేరణగా ఉపయోగపడతాయి. మొట్టమొదటి డాక్యుమెంటరీ యోగా సాధన చేయడానికి యోగా క్లాసుల్లో చేరచ్చు. యూట్యూబ్‌లో వీడియోలు చూడచ్చు. ఆన్లైన్ కోర్సులు, పుస్తకాలు చదివి కూడా ప్రయత్నించవచ్చు. అయితే, యోగా ఫొటోగ్రఫీలో పర్ఫెక్ట్ అవ్వాలంటే యోగా మీద తీసిన ‘ఆన్ యోగా ది ఆర్కిటెక్చర్ ఆఫ్ పీస్’ డాక్యుమెంటరీ చూడాల్సిందే. దీనికి ఫొటోగ్రాఫర్‌గా వర్క్ చేసిన ‘మైఖేల్ ఓ నీల్’ అద్భుతమైన చిత్రణను అందించాడు. పదేళ్లపాటు ఇండియా, టిబెట్, న్యూయార్క్‌లలోని గొప్ప గొప్ప యోగా గురువులతో మాట్లాడి, తీసిన డాక్యుమెంటరీ ఇది. యోగా ఫొటోలు తీయడానికి, తీయించుకోవడానికి ఈ డాక్యుమెంటరీ మంచి పుస్తకంలా ఉపయోగపడుతుంది. ప్రకృతిలో క్లిక్స్... యోగా ఫొటోషూట్ కోసం అందమైన ప్రకృతిని మించిన వేదిక మరొకటి లేదు. మనసు, శరీరం ఆహ్లాదంగా ఉండటానికి చేసే యోగా, ఆ ఆనందాన్ని ఒక్క క్లిక్‌తో బంధించడానికి ప్రకృతి దృశ్యాలు అనువైన స్థలాలు. అడవి, బీచ్, పార్క్ ఫొటో సెషన్‌కు మంచి వేదికలు. అనువైన సంధ్యాసమయాలు... సూర్యోదయ, అస్తమయ సమయాలను బేస్ చేసుకుంటూ తీసే యోగా ఫొటోలు ఒక కళాత్మకమైన అందాన్ని కళ్లకు కడతాయి. ఈ సమయంలో సాధారణ ఆసనాలను వేస్తూ కూడా ఫొటోలు తీసుకోవచ్చు. మ్యాట్ నీట్... మిగతా వాటితో పోల్చితే యోగా ఫొటో సెషనల్లో శుభ్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ధరించే డ్రెస్ అయినా, యోగా మ్యాట్ అయినా శుభ్రంగా ఉండాలి. యోగా ఫొటోలా కాకుండా ఓ కథ చెప్పే విధంగా ఉండాలి. యోగా ఫొటోలు తీయడమంటే ముఖాన్ని షూట్ చేయడం కాదు... మెడలో ధరించే పూసలు, పచ్చబొట్టు, వంపులుగా తిరిగిన చేతులు, శరీరం.. ఇలా యోగా అని తెలిసే విధంగా ఫొటో తీయాల్సి ఉంటుంది. యోగా ఫొటోలు తీయాలని ఆ ఒక్కరికే క్లిక్ మనిపించ కూడదు. చుట్టూ నేపథ్యాన్ని కూడా కెమెరా కన్నుతో బంధించాల్సి ఉంటుంది. యోగా ఫొటోగ్రఫీ అనేది ఒక ఆధ్యాత్మికానుభవాన్ని దగ్గర చేస్తుంది. ఇతరులు స్ఫూర్తి పొందేలా చేస్తుంది. యోగా చిత్రకళా విభాగం మిమ్మల్ని ప్రసిద్ధులను చేస్తుంది. యోగా మెటర్నిటీ మెటర్నిటీ ఫొటోస్ కోసం వచ్చినవారు యోగా ఫొటోస్ కూడా తీసుకోవడంలోనూ ఆసక్తి చూపుతున్నారు. ఇందుకు ఔట్లొకేషన్స్ని ఇష్టపడుతున్నారు. ప్రెగ్నెన్సీ సమయంలో సెలబ్రిటీలు తీయించుకున్న యోగా ఫొటోలు మా వద్దకు తీసుకువచ్చి, అలాంటి పోజులతో ఫొటోలు తీయమని అడుగుతుంటారు. ఫిట్నెస్ ట్రెయినర్స్లోనూ ఇలాంటి ఆసక్తి ఎక్కువ. – మనోజ్ఞ, న్యూ బోర్న్ బేబీ ఫొటో గ్రాఫర్ – నిర్మలారెడ్డి -
ఖాదీ వాక్.. కిర్రాక్స్
-
2021- ఈ ఏడాది ఉత్తమ ఫోటోలు ఇవే..
-
49వ వారం మేటి చిత్రాలు
-
48వ వారం మేటి చిత్రాలు
-
47వ వారం మేటి చిత్రాలు
-
46వ వారం మేటి చిత్రాలు
-
35వ వారం మేటి చిత్రాలు
-
34వ వారం మేటి చిత్రాలు
-
హృదయరాగం
ఈ ప్రపంచమే ఒక రంగస్థలం అయినప్పుడు, నాట్యానికి ప్రత్యేకంగా రంగస్థలం ఎందుకు? అనుకున్నాడేమో న్యూయార్క్‌కు చెందిన డేన్ షిటగి. వివిధ దేశాల్లో, వివిధ భౌగోళిక సౌందర్యాల నేపథ్యంలో బ్యాలే డ్యాన్సర్ల నృత్య విన్యాసాలను తన కెమెరాలోకి అందంగా తీసుకువచ్చాడు. ఈ పని ఆయన పన్నెండు సంవత్సరాలుగా చాలా ఆసక్తితో చేస్తున్నాడు. రంగస్థలం మీద కనిపించని నృత్యాలకు కొత్త వెలుగు ఇస్తున్నాడు. ‘‘నృత్యం అంటేనే అందం...ఆ అందానికి మరింత అందాన్ని జోడించడానికి బాహ్యప్రపంచ అందాలను వాడుకుంటున్నాను’’ అంటున్నాడు డేన్ షిటగి. తీసిన ఒక్కో ఫొటో.... డ్యాన్స్, ఫ్యాషన్ డిజైన్, ఫొటోగ్రఫీల సమ్మేళనం అని గర్వంగా చెబుతాడు. తన ఫోటోల్లో నృత్యకారుల భావోద్వేగాలు కనిపిస్తాయనీ, హృదయరాగాలు వినిపిస్తాయనీ అంటాడు ప్రేమగా. ప్రసిద్ధ నర్తకులతో పాటు, ఒకప్పటి నర్తకులు, ఇప్పుడిప్పుడే పేరు తెచ్చుకుంటున్న నర్తకుల సహకారాన్ని కూడా తీసుకుంటున్నాడు షిటగి. విశేషం ఏమిటంటే, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్న ఈ కాలంలో కూడా షిటగి... పాతకాలపు ఫిల్మ్, కెమెరాలను వినియోగించడం! -
ఇళయరాజా ఫొటో ఎగ్జిబిషన్
‘నా ఫొటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్’ అంటూ ఇళయరాజా ఓ ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయాలనుకుంటున్నారు. ఈ సంగీతస్రష్టకి ఫొటోగ్రఫీ అంటే చాలా ఇష్టం. అందుకే, కంటికి నచ్చినవాటిని తన కెమెరాలో బంధిస్తుంటారు. ఇప్పటివరకు ఐదువేల ఫొటోలకు పైగా తీశారు ఇళయరాజా. కానీ, ఇంతకుముందు తీసినట్లుగా ఇప్పుడు ఫొటోగ్రఫీ మీద ఆయనకు ఆసక్తి లేదు. ఎందుకంటే, ఫిల్మ్రోల్లో తీసిన ఫొటోలతో పోలిస్తే డిజిటల్ కెమెరాలతో తీసిన ఫొటోల్లో అంత డెప్త్ ఉండటంలేదని ఆయన అంటున్నారు. డిజిటల్‌ని ఆవిష్కరించడం ద్వారా ఓ అద్భుతాన్ని నాశనం చేసినట్లుగా ఆయన భావిస్తున్నారు. 1978లో ఇళయరాజా ఫొటోలు తీయడం మొదలుపెట్టారు. ప్రకృతి అందాలను ఫొటో తీయడం ఆయనకు చాలా ఇష్టం. ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఫొటోలు తీస్తుంటారు. తన ఫొటోల్లో ‘జీవం’ ఉంటుందని ఆయన అంటున్నారు. ఓసారి బెంగళూరులో ఓ చిన్నపిల్ల ఏడుస్తుంటే ఫొటో తీశారట ఇళయరాజా. ఆ పాప ఏడుస్తున్న దృశ్యం తనను కదిలించడంవల్లే కెమెరాని క్లిక్మనిపించానని పేర్కొన్నారు. తమిళనాడులోని కోయంబత్తూర్‌తోపాటు ఇతర నగరాల్లోనూ, దుబాయ్, సింగపూర్, లండన్‌లోనూ తను తీసిన ఛాయాచిత్రాలతో ఫొటో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారాయన. ఇప్పటివరకు ఎన్నో కెమెరాలను కొనుక్కున్నారు ఇళయరాజా. వాటిని చాలా పదిలంగా దాచుకున్నారట. దాన్నిబట్టి ఈ స్వరమాంత్రికుడికి ఫొటోగ్రఫీ అంటే ఎంత మమకారమో అర్థం చేసుకోవచ్చు.