pj kurian
-
అన్నదొకటి.. అనువాదం మరొకటి
కేరళలో రాహుల్‌గాంధీ ఎన్నికల ప్రసంగం అనువాదంలో అపశృతులు దొర్లాయి. రాహుల్ గాంధీ ఆంగ్లంలో చేసిన ప్రసంగాన్ని మలయాళంలోకి అనువదించడంలో పార్టీ సీనియర్ నేత పీజే కురియన్ చేసిన పొరపాట్లు రాహుల్‌ను బాగా ఇబ్బంది పెట్టాయి. రాహుల్ గాంధీ తన ప్రసంగాన్ని అర్ధంతరంగా ముగించేయడమే కాక తాను ఇప్పటి నుంచి మలయాళం నేర్చుకోవడం మొదలెడతానని చెప్పారంటే కురియన్ అనువాదం ఎంత ఘోరంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అనువాదం తప్పుగా జరుగుతోందని గుర్తించిన రాహుల్ మళ్లీ మళ్లీ చెప్పినా కూడా కురియన్ పొరపాటును సరిదిద్దుకోలేదు. దాంతో రాహుల్ తన అసంతృప్తిని బాహాటంగా వ్యక్తం చేయడమే కాక కురియన్ బదులు వేరొకరిని పెట్టమని కూడా చెప్పినట్టు సమాచారం. కురియన్ అనువాద ప్రహసనపు వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. దీనిపై హాస్యోక్తులు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని పతనంతిట్టలో రాహుల్ మంగళవారం ఎన్నికల ప్రచారం చేశారు. ఆ సందర్భంగా రాహుల్ ప్రసంగాన్ని కురియన్ మలయాళ భాషలోకి అనువదించారు. సాంకేతిక సమస్యలు, సరిగా వినపడకపోవడం వల్ల పొరపాటు జరిగినట్టు కురియన్ చెప్పారు. కారణాలేవైనా కురియన్ తప్పుడు అనువాదం వల్ల చాలాచోట్ల రాహుల్ చెప్పినదానికి వ్యతిరేకార్థం వచ్చింది. కాంగ్రెస్ పార్టీ.. ఆర్ఎస్ఎస్, బీజేపీలపై సైద్ధాంతిక పోరాటం చేస్తోందని రాహుల్ అంటే.. కాంగ్రెస్.. బీజేపీ, సీపీఎంలపై పోరాడుతోందని కురియన్ అనువదించారు. కురియన్ చేసిన అనువాద దోషాలిలా ఉన్నాయి. రాహుల్: సీపీఎం సహా పార్టీల సిద్ధాంతాలను మేం గౌరవిస్తాం కురియన్: సీపీఎం, బీజేపీల ఆలోచనల్ని మేం గౌరవిస్తాం రాహుల్: పేదల ఖాతాల్లో రూ.72 వేలు జమ చేస్తాం కురియన్: పేదల ఖాతాల్లో రూ. 72 వేల కోట్లు జమ చేస్తాం. తమిళనాడులోనూ అదే తంతు.. రాహుల్ గాంధీ అనువాద బాధలు ఎదుర్కొనడం ఇదే మొదటి సారి కాదు. గత నెలలో కన్యాకుమారిలో చేసిన ఎన్నికల ప్రసంగం తమిళ అనువాదంలోనూ ఇలాగే జరిగింది. ఆ ప్రసంగాన్ని కేవీ తంగబాలు అనువదించారు. రాహుల్ తన ప్రసంగంలో ‘..అందుకే మేం తమిళనాడు ప్రజల్ని గౌరవిస్తాం’ అంటే, తంగబాలు ‘నరేంద్రమోదీ తమిళ ప్రజల శత్రువు..’ అంటూ అర్థంలేని అనువాదం చేశారు. అనిల్ అంబానీ తన జీవితంలో ఎప్పుడూ ఒక్క విమానాన్ని కూడా తయారు చేయలేదని రాహుల్ అంటే, ఆయన ఎప్పుడూ నిజం చెప్పలేదని తంగబాలు అనువదించారు. జమ్ము కశ్మీర్లో బీమా కార్యకలాపాలన్నింటినీ అనిల్ అంబానీకి అప్పగించారని రాహుల్ విమర్శిస్తే.. జమ్ము,కశ్మీర్‌నే అనిల్‌కు అప్పగించేశారని తంగబాలు అనువదించారు. -
తెగ నవ్వులు పూయిస్తున్న రాహుల్-కురియన్ వీడియో
సాక్షి, తిరువనంతపురం : కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. కేరళలోని పతనం తిట్టలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ పాల్గొన్నారు. తన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ డిప్యుటీ ఛైర్పర్సన్ పీజే కురియన్ మళయాలంలోకి అనువదించారు. అయితే రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో సీరియస్‌గా ప్రసంగిస్తుంటే మళయాలంలోకి తర్జుమా చేయడానికి కురియన్ చాలా సార్లు తడబడ్డారు. ఇక అనువాదం సరిగా చేయడం రాకపోవడంతో ఒకానొక సమయంలో కురియన్ మైక్‌ను పక్కకు పెట్టి, మళయాలంలో మాట్లాడటానికి ప్రయత్నించారు. అయితే రాహుల్ ఆ మైక్‌ని తిరిగి కురియన్‌కి దగ్గరగా జరపడం తెగ నవ్వు తెప్పిస్తుంది. రాహుల్ ఆపకుండా ప్రసంగం చేస్తుంటే అది అర్థం చేసుకోవడానికి తరచూ కురియన్ చూపించిన హావభావాలు కామెడీని పూయించాయి. రాహుల్‌గాంధీ కూడా కురియన్ హావభావాలు చూసి నవ్వుతూ కనిపించారు. అయితే అనువాదంలో తరచూ తడబడుతుండటంతో రాహుల్ గాంధీకి ఓపిక నశించి మరొకరితో అనువాదం చేయాలని కోరినట్టు సమాచారం. ప్రసంగం పూర్తయిన తర్వాత ఆయన ఇప్పుడే మళయాలం మాట్లాడటం నేర్చుకుంటున్నాడా అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతుంది. -
రాహుల్ గాంధీ-కురియన్ కామెడీ..
-
రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ ఎన్నికపై కసరత్తు
సాక్షి, న్యూఢిల్లీ : రాజ్యసభ (ఎగువసభ) డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ పదవీ కాలం నేటితో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆయనకు వీడ్కోలు విందు ఏర్పాటు చేశారు. ఈ వీడ్కోలు సమావేశానికి రాజ్యసభలోని వివిధ పార్టీలకు చెందిన నేతలను వెంకయ్యనాయుడు ఆహ్వానించారు. ఆదివారం సాయంత్రం వెంకయ్య నాయుడి నివాసంలో ప్రారంభమైన ఈ సమావేశానికి వైఎస్సార్ సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, వివిధ పక్షాల నేతలు హాజరయ్యారు. మరోవైపు కొత్త డిప్యూటీ చైర్మన్ ఎంపిక కోసం అధికార బీజేపీ కసరత్తు మొదలు పెట్టింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాత్రం రాజ్యసభ చైర్మన్ ఎన్నికను ఏకగ్రీవం చేయడానికే మొగ్గుచూపుతున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కాంగ్రేసేతర పార్టీలకు ఎగువ సభ చైర్మన్‌గా అవకాశం ఇవ్వాలని మోదీ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో జనతాదళ్, తృణమూల్ కాంగ్రెస్ పార్టీలతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నారు. -
తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసింది:కురియన్
-
తెలంగాణ బిల్లుపై చర్చ ముగిసింది:కురియన్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ(తెలంగాణ) బిల్లుపై చర్చ ముగిసినట్లు డిప్యూటీ స్పీకర్ పీజే కురియన్ ప్రకటించారు. కాగా, విపక్షాలు ప్రతిపాదించిన సవరణలపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించేందుకు అనుమతిస్తున్నట్లు కురియన్ తెలిపారు. మూజువాణి పద్దతిలో ఓటింగ్ నిర్వహించే సమయంలో కూడా గందరగోళ పరిస్థితులు అలుముకున్నాయి. సభ్యులంతా తమ తమ స్థానాల్లో కూర్చొని ఓటింగ్ నిర్వహించేందుకు సహకరించాలని డిప్యూటీ చైర్మన్ విజ్ఞప్తి చేశారు. అంతకు ముందు సభలో సాధారణ పరిస్థితి కొనసాగేలా డిప్యూటీ చైర్మన్ చూడాలని, అప్పుడు మాత్రమే తెలంగాణ బిల్లు గురించిన సమగ్ర చర్చ జరిగేందుకు వీలుంటుందని బీజేపీ సభ్యుడు వెంకయ్య నాయుడు సూచించారు. తెలంగాణ బిల్లుపై చర్చను ప్రారంభించాల్సిందిగా డిప్యూటీ చైర్మన్ పీజే కురియన్ ఆయనను కోరినప్పుడు వెంకయ్యనాయుడు లేచి నిలబడి మాట్లాడేందుకు ప్రయత్నించారు. అయితే వెల్‌లో అప్పటికే ఉన్న సీమాంధ్ర ఎంపీలు, తమిళనాడు ఎంపీలు తమ నినాదాలు కొనసాగించడంతో ఆయన మాట్లాడేది ఒక్క డిప్యూటీ చైర్మన్‌కు తప్ప ఎవరికీ వినిపించలేదు. సభ సజావుగా సాగితే తప్ప గంభీరమైన ఈ సమస్యపై తాను ఏమీ మాట్లాడలేనని, చర్చలో పాల్గొనలేనని వెంకయ్య అన్నారు.