కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి వింత అనుభవం ఎదురైంది. కేరళలోని పతనం తిట్టలో మంగళవారం జరిగిన ఎన్నికల ప్రచారసభలో రాహుల్ పాల్గొన్నారు. తన ప్రసంగాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రాజ్యసభ మాజీ డిప్యుటీ ఛైర్‌పర్సన్ పీజే కురియన్ మళయాలంలోకి అనువదించారు. అయితే రాహుల్ గాంధీ ఇంగ్లీష్‌లో సీరియస్‌గా ప్రసంగిస్తుంటే మళయాలంలో తర్జుమా చేయడానికి కురియన్ చాలా సార్లు తడబడ్డారు.