Plain area
-
బొట్టు.. బొట్టు.. మెట్ట భూముల్లో పచ్చని పంట చిగురించేట్టు!
మారుతున్న కాలానుగుణంగా.. వ్యవసాయ పద్ధతులలో కొత్త మార్పులు చోటుచేసుకుంటున్నాయి. అందుకు నిదర్శనంగా.. కొందరు రైతులు మైదానంలాంటి మెట్ట భూముల్లో కూడా పంటలు పండిస్తున్నారు. వర్షాకాలం వరకు ఎందుకు ఎదురుచూపులంటూ.. వారి వద్దనున్న నూతన టెక్నాలజీతో కూడిన పరికరాలను ఉపయోగించి పచ్చని పంటలు పండిస్తున్నారు. వారిని గురించి తెలుసుకుందాం. స్ప్రింక్లర్లతో సాగు చేస్తున్న కొత్తిమీర వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో మాడుగులపల్లి మండలంలోని సాగర్ ఆయకట్టేతర ప్రాంత రైతులు బిందు, తుంపర సేద్యంపై దృష్టి సారించారు. డ్రిప్పు, స్ప్రింక్లర్లను ఏర్పాటు చేసుకొని మెట్ట భూముల్లో పచ్చని పంటలు పండిస్తున్నారు. తీగజాతి కూరగాయలు, ఆకుకూరలు, వేరుశనగ తదితర పంటలను సాగు చేస్తున్నారు. మండలవ్యాప్తంగా 3 నుంచి 4 వేల ఎకరాల్లో వేరుశనగ, కొత్తమీర, దోస, ఇతర కూరగాయలు పండిస్తున్నట్లు మండల ఉద్యానశాఖ అధికారి అనంతరెడ్డి తెలిపారు. ప్రభుత్వం బిందు, తుంపర సేద్యం పరికరాలు సబ్సిడీపై అందిస్తే మరింత మంది రైతులు ప్రత్యామ్నాయ పంట సాగు చేసి ఆదాయం గడించే అవకాశం ఉంది. ఇవి చదవండి: ఈ సీసన్లో.. బెండసాగుతో అధిక దిగుబడులు! -
నామిలేటెడ్..!
♦ మార్కెట్ కమిటీల నియామకం ఇంకెప్పుడో..? ♦ ఖమ్మంలో పరిశీలనతోనే సరి, కోర్టు పరిధిలో ‘ఏజెన్సీ’ ♦ ప్రతిపాదనలే లేని 5 కమిటీలు, తప్పని ఎదురుచూపులు ఖమ్మం వ్యవసాయం: జిల్లాలో మొత్తం 13 వ్యవసాయ మార్కెట్లు ఉన్నాయి. వీటిలో ఏడు ఏజెన్సీలో, మిగతావి మైదాన ప్రాంతంలో ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో వ్యవసాయ మార్కెట్ కమిటీల నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తున్న ప్రభుత్వం జిల్లాలో ఇప్పటి వరకు ఏ ఒక్క మార్కెట్‌కు కూడా కమిటీని నియమించలేదు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడుస్తున్నా..ఇంకా ఆచరణకు నోచకపోవడంతో ఆశావహులో నిరాశ నెలకొంది. ఈసారి అధ్యక్ష స్థానాలకు రిజర్వేషన్లు కేటాయించారు. ఉపాధ్యక్షులు, మిగిలిన సభ్యుల పదవులకు రిజర్వేషన్ ఉండదు. ప్రక్రియే మొదలు కాలే.. జిల్లాలోని మైదాన ప్రాంతంలో ఆరు మార్కెట్ కమిటీల్లో కేవలం ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌కు సంబంధించే ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. మిగతా సత్తుపల్లి, వైరా, కల్లూరు, నేలకొండపల్లి, మధిర మార్కెట్లకు సంబంధించి ప్రక్రియనే మొదలు కాలేదు. ప్రతిపాదనలు అందితే..రాష్ట్ర మార్కెటింగ్ శాఖ వారు పరిశీలించి, ఆ పదవులను అలంకరించే వారు అర్హులా..? కాదా..? నివేదిక ఇవ్వాలని జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖకు పంపిస్తారు. కమిటీ సభ్యులు మార్కెట్ పరిధిలోని వారేనా..? అనే విషయాలను రెవెన్యూ శాఖ ద్వారా ధ్రువీకరించుకుంటారు. తుది జాబితా పేర్లను ప్రభుత్వానికి పంపుతారు. ఖమ్మం మినహా మిగతా మార్కెట్లలో ఈ ప్రక్రియకు శ్రీకారమే చుట్టలేదు. ఏజెన్సీలో ‘ఏడు’పే.. జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో ఏడు మార్కెట్లు ఉండగా..కోర్టు పరిధిలో వ్యవహారం ఉండడంతో వీటికి నామినేటెడ్ పదవుల నియామకం నిర్వహించే అవకాశం లేదు. భద్రాచలం, కొత్తగూడెం, ఇల్లెందు, బూర్గంపాడు, ఏన్కూరు, చర్ల, దమ్మపేట మార్కెట్లకు నామినేటెడ్ యోగ్యం లేదు. ఇక్కడి కమిటీలన్నీ తమకే కేటాయించాలని గిరిజనులు కోర్టును ఆశ్రయించడంతో నియామకం నిలిచి పదేళ్లు దాటుతోంది. జాప్యంతో నైరాశ్యం.. వ్యవసాయ కమిటీ అధ్యక్షులను నామినేటెడ్ పద్ధతిలో నియమించే విషయంలో నెలకొన్న తీవ్ర జాప్యంతో ఆశావహులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం కూడా ఖమ్మం జిల్లా వ్యవసాయ మార్కెట్ కమిటీల నియామకం విషయంలో శ్రద్ధ చూపడం లేదని ఆవేదన చెందుతున్నారు. పదవుల కోసం స్థానికంగా వర్గపోరు కూడా కొనసాగుతోంది. జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రాష్ట్ర మార్కెటింగ్ శాఖ మంత్రితన్నీరు హరీష్‌రావుల చేతుల్లోనే ఈ పదవుల నియామకం ఉందని, వారు సూచించిన వారికే పీఠం దక్కుతుందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. -
విశాల మన్యం
‘విలీనం’తో పెరుగుతున్న తూర్పు ఏజెన్సీ విస్తీర్ణం జిల్లాలో అతిపెద్ద రెవెన్యూ డివిజన్‌గా పరిణామం రంపచోడవరం : ఇప్పటి వరకూ తూర్పుగోదావరి జిల్లా విస్తీర్ణంలో మైదాన ప్రాంతం ఎక్కువ శాతం భూభాగాన్ని కలిగి ఉంది. ‘విభజన’ నేపథ్యంలో ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను తూర్పు గోదావరిలో విలీనం చేయడంతో ఏజెన్సీ భూభాగ విస్తీర్ణం గణనీయంగా పెరిగింది. రంపచోడవరం డివిజన్లో ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలు చేరాయి. ఇదీ స్వరూపం రంపచోడవరం రెవెన్యూ డివిజన్లో రంపచోడవరం, దేవీపట్నం, గంగవరం, మారేడుమిల్లి, అడ్డతీగల, రాజవొమ్మంగి మండలాలున్నాయి. వీటిలో దాదాపు 600 గ్రామాలు ఉన్నాయి. కొత్తగా ఖమ్మం జిల్లాలోని కూనవరం, చింతూరు, వీఆర్ పురం, భద్రాచలం రూరల్ ప్రాంతాలను తూర్పు ఏజెన్సీలో విలీనం చేశారు. ఈ మండలాల్లో 277 గ్రామాలు ఉన్నాయి. వీటిలో జనాభా 1,99,825 ఉంది. తూర్పు ఏజెన్సీలో 1,50,024 హెక్టార్ల అటవీ ప్రాంతం కలిసింది. దీంతో జిల్లాలోనే అతి పెద్ద రెవెన్యూ డివిజన్‌గా తూర్పు ఏజెన్సీ పరిణమించింది. వరదలొస్తే..!? పోలవరం ప్రాజెక్టు ముంపు పరిధిలో ఉన్న ఈ నాలుగు మండలాలు గోదావరి వరదల సమయంలో పూర్తిగా బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయి. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం ఈ మండలాల్లో పూర్తిగా అభివృద్ధి పనులను నిలిపివేసింది. గతంలో వరదలొస్తే భద్రాచలం ఐటీడీఏ అధికారులు పునరావాస చర్యలు చేపట్టేవారు. ప్రస్తుతం తూర్పు ఏజెన్సీలో విలీనం చేయడంతో.. విపత్కర పరిస్థితుల్లో రంపచోడవరం ఐటీడీఏ అధికారులు అక్కడ సహాయక చర్యలు చేపట్టాలి. దేవీపట్నం మండలంలో వరదల సమయంలోనే పూర్తి స్థాయిలో సహాయక చర్యలు చేపట్టడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఏజెన్సీలో అనేక గ్రామాల్లో అధికారుల పర్యటనలు కూడా ఉండడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో కొత్తగా చేరిన మండలాల్లో సమర్థ పరిపాలన అందుబాటులోకి రావడం ప్రశ్నార్థకమే. పునరావాసం ఎక్కడ ? ఖమ్మం జిల్లాలోని నాలుగు మండలాలను తూ ర్పు ఏజెన్సీలో కలిపిన ప్రభుత్వం పోలవరం ముంపు కారణంగా గ్రామాలు విడిచిపెట్టే వారికి ఎక్కడ పునరావాసం కల్పిస్తారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఈ నెలఖరున అధికారికంగా తూర్పు ఏజెన్సీలో విలీనం చేస్తారు. పోలవరం ప్రాజెక్టు కారణంగా కూనవరం మండలంలో 48 గ్రామాలు, చింతూరు మండలంలో 17, వీఆర్ పురం మండలంలో 45, భద్రాచలం రూ రల్లో 13 గ్రామాలు ముంపునకు గురవుతున్నాయి. ఆయా గ్రామాల వారికి ఏ స్థాయిలో పునరావాస చర్యలు చేపడతారో అర ్ధంకాని పరి స్థితి నెలకొంది. తూర్పు ఏజెన్సీలో కలిసిన ముంపు గ్రామాల వారికి చింతూరు-మారేడుమిల్లి ప్రాంతాల్లో పునరావాసం కల్పించాలి. పరిపాలనాంశాలు చూడాలన్నారు తూర్పు ఏజెన్సీలో కలిసిన నాలుగు మండలాలకు సంబంధించి పరిపాలనపరమైన అవసరాలు చూడాలని ఆదేశించారు. గెజిట్ నోటిఫికేషన్ ఇంకా రాలేదు. అప్పటివరకు అక్కడి వారికి సంబంధించిన అవసరాలకు రంపచోడవరం అధికారులను సంప్రదించాల్సి ఉంది. - డాక్టర్ బి.శంకర వరప్రసాద్, ఆర్డీఓ, రంపచోడవరం