PMO staff
-
తొలి పది పదిలం
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: మోదీ నేతృత్వంలోని కేంద్ర మంత్రివర్గం ప్రమాణ స్వీకారం చేసేందుకు రెండ్రోజులే ఉండటంతో కేబినెట్ కూర్పు కసరత్తు ముమ్మరమైనట్లు బీజేపీ వర్గాలు వెల్లడించాయి. ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాలు పార్టీ సీనియర్ నేతలు, ఎన్డీయే పార్టీల నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపాయి. ప్రధాని కార్యాలయంలో (పీఎంఓ) మార్పులపై ఊహాగానాలు కొనసాగుతున్నాయి. ప్రధాని ముఖ్య కార్యదర్శి నృపేంద్ర మిశ్రా స్థానంలో మరొకరు రావచ్చని తెలుస్తోంది. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పీఎంఓలోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జేఎన్ సింగ్, ఢిల్లీ లెఫ్టినెంట్ జనరల్ అనిల్ బైజాల్‌తో పాటు మరికొన్ని కొత్తపేర్లు తెరపైకి వస్తున్నాయి. వీరి స్థానాలు పదిలం పార్టీ తరఫున పెద్ద సంఖ్యలో ఎంపీలు ఎన్నికైనందున కేబినెట్ కూర్పు కొంత కష్టమేనని, ఒకవేళ సీనియర్లు కొందరికి చోటు దక్కకపోయినా వారు చేయగలిగిందేమీ ఉండకపోవచ్చని పార్టీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏది ఏమైనా రాజ్‌నాథ్, నిర్మలా సీతారామన్, గడ్కారీ, తావర్ చంద్ గెహ్లోత్, ప్రకాశ్ జవదేకర్, జేపీ నడ్డా, మేనకా గాంధీ వంటి పది మంది అగ్రనేతలకు కేబినెట్లో తిరిగి చోటు దక్కే అవకాశం ఉందని చెబుతున్నారు. ఒకవేళ ఆరోగ్యం మెరుగుపడి, వారు అంగీకరిస్తే జైట్లీ, సుష్మా స్వరాజ్లను తీసుకోవచ్చని తెలుస్తోంది. రాజ్యసభ సభ్యులు, ఇటీవలి ఎన్నికల్లో లోక్‌సభకు ఎన్నికైన ముగ్గురు నేతలు రవిశంకర్ ప్రసాద్, స్మృతీ ఇరానీ (ఇప్పటికే మంత్రులు), పార్టీ అధ్యక్షుడు అమిత్ షా (తొలిసారి మంత్రి అవుతారు)లకు కీలక శాఖలు దక్కే అవకాశం ఉందని అంటున్నారు. బెంగాల్‌కు ప్రాధాన్యత పశ్చిమబెంగాల్లో పార్టీ 18 సీట్లతో ఘన విజయం సాధించిన నేపథ్యంలో 2021 అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఆ రాష్ట్రానికి అధిక ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. బాబుల్ సుప్రియో (ప్రస్తుత మంత్రి), లాకెట్ ఛటర్జీ, సుభాష్ సర్కార్, జయంత్ సర్కార్లకు బెంగాల్ నుంచి కేబినెట్లోకి రావొచ్చు. ఎక్కువగా యువతరానికి, కొత్త ముఖాలకు కేబినెట్లో అవకాశం ఉంటుందని పార్టీవర్గాలు వివరించాయి. ఇదే సమయంలో మిత్రపక్షాలకు తగిన ప్రాధాన్యత లభిస్తుందని శనివారం పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మోదీ ప్రసంగాన్ని గుర్తుచేస్తూ ఆ వర్గాలు వెల్లడించాయి. జేడీయూ, శివసేనలతో పాటు ఇతర పార్టీలకు చోటు దొరకొచ్చని చెప్పాయి. కేబినెట్ కార్యదర్శిగా రాజీవ్ గౌబా! గౌబా 1982 బ్యాచ్ జార్ఖండ్ కేడర్ అధికారి న్యూఢిల్లీ: కొత్త కేబినెట్ కార్యదర్శిగా హోం శాఖ కార్యదర్శి రాజీవ్ గౌబా నియమితులయ్యే చాన్సుంది. ప్రస్తుత కార్యదర్శి పి.కె.సిన్హా నాలుగేళ్ల పదవీ కాలం జూన్ 12తో ముగుస్తున్నట్లు అధికారులు సోమవారం తెలిపారు. కాగా హోం శాఖ కార్యదర్శి పోస్టు కోసం ఇతరులతో పాటు కశ్మీర్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం పోటీ పడుతున్నారు. అత్యంత సీనియర్ అధికారి అయిన గౌబా కేంద్రంలో, జార్ఖండ్, బిహార్ ప్రభుత్వాల్లో పనిచేశారు. ఆగస్టు 31తో హోం శాఖ కార్యదర్శిగా ఆయన రెండేళ్ల పదవీకాలం పూర్తవుతుంది. అయితే దేశంలోనే అత్యున్నతమైన కేబినెట్ కార్యదర్శి పోస్టుకు గౌబా ఎంపికయ్యే అవకాశం ఉందని ఈ పరిణామాలపై అవగాహన కలిగిన అధికారి ఒకరు వెల్లడించారు. ఈయన జార్ఖండ్ కేడర్‌కు చెందిన 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి. ఈయన కేబినెట్ కార్యదర్శి అయ్యే పక్షంలో తొలుత రెండేళ్ల పదవీ కాలానికి నియమితులయ్యే అవకాశం ఉంది. తర్వాత మరో రెండేళ్ల పాటు దీనిని పొడిగించే అవకాశం ఉంటుంది. సిన్హా కూడా 2015లో తొలుత రెండేళ్ల పదవీకాలానికి నియమితులై, తర్వాత 2016, 2018లో పొడిగింపు పొందారు. -
వీవీఐపీల ఫోన్ ట్యాపింగ్ సంచలనం
న్యూఢిల్లీ : కేంద్ర మంత్రులు, పారిశ్రామికవేత్తల దగ్గర్నుంచి, న్యాయవాదుల వరకు ఫోన్ల ట్యాపింగ్ జరిగిందనే వార్త ఇపుడు సంచలనం మారింది. ఒక ప్రముఖ కార్పొరేట్ సంస్థ 2001-06 మధ్య కాలంలో ఈ ట్యాపింగ్ కు పాల్పడిందని ఓ సుప్రీంకోర్టు న్యాయవాది వాదిస్తున్నారు. ఈ మేరకు ఆయన పిల్ కూడా దాఖలు చేశారు. క్యాబినెట్ మంత్రులు, అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ లాంటి కార్పొరేట్ వేత్తలు, ప్రముఖ న్యాయవాదుల ఫోన్ల ను ఎస్సార్ సంస్థ ట్యాప్ చేసిందని ఆరోపిస్తున్నారు. ఈ నెల 1న ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఢిల్లీకి చెందిన సుప్రీంకోర్టు న్యాయవాది సురేన్ ఉప్పల్ దీనిపై 29 పేజీల పిర్యాదు చేశారని కథనాలు తెలుపుతున్నాయి. ఈ ఫిర్యాదు మేరకు ఎస్సార్ మాజీ ఉద్యోగి అల్ బాసిత్ ఖాన్ ఈ ట్యాపింగ్ కు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఎస్సార్ సంస్థలో భద్రతా అధిపతిగా చేసే కాలంలో ఖాన్ ప్రముఖుల ఫోన్లకు అంతరాయం కలిగిస్తూ వారి సంభాషణలను రికార్డు చేసేవాడని, మేనేజ్ మెంట్ ఆదేశాల మేరకు అతను ఈ చర్యలకు పాల్పడినట్టు న్యాయవాది పేర్కొన్నారు. కొన్నేళ్లపాటు యథేచ్చగా సాగిన ఈ వ్యవహారం, 2011 మేలో తేడా వచ్చి, ఖాన్ ను సంస్థ నుంచి బయటికి పంపేశారని ఫిర్యాదులో చెప్పారు. ఈ పరిమాణానికి షాకైన ఖాన్ తన దగ్గరున్న టేపులను బయటపెట్టాలనుకున్నాడని, తనను కలిసేందుకు కూడా ప్రయత్నించాడని న్యాయవాది పేర్కొన్నారు. అయితే దీనిపై స్పందించడానికి ప్రస్తుతం ఖాన్ అందుబాటులో లేనట్టు తెలుస్తోంది. ఫోన్లకు, మెసేజ్ లకు అతను అందుబాటులో లేడని ఇండియన్ ఎక్స్ ప్రెస్ రిపోర్టు చేసింది. ఈ విషయాలపై మరిన్ని నిజనిజాలు తెలియాల్సి ఉంది. అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ ను ఎస్సార్ సంస్థ ఖండిస్తోంది. న్యాయవాది స్టేట్ మెంట్ పూర్తిగా తప్పుడు సమాచారమని, అసలు దీనికి ఆధారాలే లేవని ఎస్సార్ సంస్థ పేర్కొంది. అతని డిమాండ్లను సంస్థ నెరవేర్చకపోవడం వల్లే, ఇలా నిందలు వేస్తున్నారని మండిపడింది. అసలు ఎస్సార్ సంస్థ ఎవరి పోన్లపై ఎప్పుడు నిఘా ఉంచలేదని, దీనికోసం అసలు వ్యక్తులనే నియమించలేదని తెలిపింది. ప్రస్తుత రైల్వే మంత్రి సురేశ్ ప్రభు, మాజీ మంత్రి ప్రఫూల్ పటేల్, రామ్ నాయక్, రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేశ్ అంబానీ, ఏడీఏజీ చైర్మన్ అనిల్ అంబానీ, అతని భార్య టీనా అంబానీ, కంపెనీల్లోని వివిధ ప్రముఖ అధికారులు, మాజీ కేబినెట్ మంత్రి ప్రమోద్ మహాజన్, ఎంపీ అమర్ సింగ్ ల ఫోన్లు ట్యాపింగ్ గురయ్యాని తెలుస్తోంది. ఈ లిస్టులో ఇంకా చాలామందే ప్రముఖులున్నట్టు సమాచారం.ఈ ట్యాపింగ్ వ్యవహరంపై రాజకీయ వర్గాలు మండిపడుతున్నాయి. దీనిపై కేంద్రం వెంటనే విచారణ చేపట్టాలని, వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. ఇది ఓ దిగ్భ్రాంతికరమైన వ్యవహారమని, ప్రైవేట్ సర్వీసు ప్రొవేడర్లు చేసే ఈ చర్యలు దేశ రక్షణకు, భద్రతకు హానికరమని జేడీయూ అగ్రనేత శరద్ యాదవ్ అన్నారు. -
రాష్ట్రపతిని కలిసిన ప్రధాని
* ఉపరాష్ట్రపతితోనూ భేటీ * పీఎంఓ సిబ్బందికి కితాబు న్యూఢిల్లీ: ఎన్డీయే ప్రభుత్వ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా మంగళవారం ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీలను గౌరవ పూర్వకంగా కలిశారు. వారితో భేటీలకు సంబంధించిన ఫొటోలను ట్వీటర్లో పోస్ట్ చేశారు. అలాగే, ప్రధానమంత్రి కార్యాలయ అధికారులు, సిబ్బందితో సమావేశమై, సంవత్సరం పాటు వారు చేసిన కృషిని అభినందించారు. ‘టీమ్ పీఎంఓ’ అంటూ వారిని ప్రశంసించారు. ‘అధికారులు, సామాన్యులు ఒకేలా ఆలోచిస్తారన్నది నా అనుభవం. సరైన వాతావరణం కల్పిస్తే.. సామాన్యులకు ఉపయోగపడేలా అధికారులు పనిచేస్తారు’ అని మోదీ పేర్కొన్నట్లు పీఎంఓ ఒక ప్రకటన విడుదల చేసింది. మోదీ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తరువాత పీఎంఓలో తీసుకువచ్చిన సంస్కరణలు, మార్పులను అధికారులు మోదీకి వివరించారని అందులో పేర్కొన్నారు. అలాగే, సాయంత్రం కాసేపు బీజేపీ పార్టీ ప్రధాన కార్యాలయంలో గడిపిన మోదీ.. అక్కడ పనిచేస్తున్న కార్యకర్తలతో ఫొటోలు దిగారు. తాను పార్టీ ఆఫీస్ బేరర్గాఉన్న సమయంలో తనతో పాటు పనిచేసిన వారి గురించి ఆరా తీశారు. మోదీతో పాటు పార్టీ అధ్యక్షుడు అమిత్ షా, పార్టీ ప్రధాన కార్యదర్శి రామ్‌లాల్ ఉన్నారు. అనంతరం అమిత్ షా, ఇతర నాయకులతో సమావేశమయ్యారు.