Politburo
-
అవినీతికి దూరంగా ఉండండి: జిన్‌పింగ్
బీజింగ్: అవినీతి, అక్రమాలకు దూరంగా ఉండాలని అధికార కమ్యూనిస్టు పార్టీ అఫ్ చైనా నాయకులకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ సూచించారు. కుటుంబ సభ్యులను, బంధువులను సైతం వాటికి దూరంగా ఉంచాలన్నారు. ఈ నెల 22న సీపీసీ కేంద్ర కమిటీ పొలిట్‌బ్యూరో సభ్యుల భేటీలో జిన్‌పింగ్ ప్రసంగించారు. వ్యక్తిగతంగా క్రమశిక్షణ పాటించాలని, విధి నిర్వహణలో నిర్లక్ష్యం వద్దని స్పష్టం చేశారు. అవినీతిపై మనం పోరాటం చేస్తున్నారని, ఈ విషయంలో పార్టీ నేతలంతా సహకరించాలని కోరారు. కుటుంబ సభ్యులు, బంధువులు, మీ కింద పని చేసేవారు అవినీతి దూరంగా ఉండేలా కఠినమైన నిబంధనలు విధించాలని జిన్‌పింగ్ సూచించారు. ఇటీవలి కాలంలో కమ్యూనిస్టు నాయకుల అవినీతిపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇతరులకు ప్రయోజనాలు కలి్పంచి, వారి నుంచి లంచాలు, బహుమతులు స్వీకరిస్తున్నట్లు కమ్యూనిస్టు పార్టీ అగ్ర నాయకత్వంగుర్తించింది. కొందరిపై విచారణ సైతం ప్రారంభించింది. -
రాఘవులే రైట్...
సాక్షి, హైదరాబాద్: సీపీఎం అధిష్టానం బీవీ రాఘవులును బుజ్జగించింది. పార్టీ పొలిట్‌బ్యూరోలో కొనసాగాలని ఆయన్ను కోరింది. దీంతో రాఘవులు రాసిన లేఖపై రెండు మూడు రోజులుగా నెలకొన్న వివాదం సద్దుమణిగినట్లయింది. పార్టీ పొలిట్‌బ్యూరో నుంచి తనను తప్పించాలని, క్షేత్రస్థాయిలో పనిచేస్తానని బీవీఆర్ ఇటీవల పార్టికి లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ పార్టీ రాష్ట్ర కమిటీలో తలెత్తిన వివాదాల నేపథ్యంలో రాఘవులుపై ఒక వర్గం పొలిట్‌బ్యూరోకు ఫిర్యాదులు చేయడంతో పరిస్థితి వేడెక్కింది. ఈ వివాదంపై పార్టీ పొలిట్‌బ్యూరో ఒక విచారణ కమిటీని నియమించింది. ఆ కమిటీ నివేదిక కూడా పార్టికి చేరింది. రెండ్రోజుల పాటు జరిగిన పొలిట్‌బ్యూరో సమావేశాల్లో రాఘవులు అంశం చర్చకు వచ్చింది. ఆయన్ను పార్టీ బుజ్జగించినట్లు తెలిసింది. దీంతో రాఘవులు కూడా మెత్తబడ్డారని అంటున్నారు. బయటకొస్తే క్యాడర్లో నైరాశ్యం... మతోన్మాదంపై వామపక్షాలు పెద్ద ఎత్తున పోరాటమే చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాలకు ఇన్చార్జిగా ఉన్న రాఘవులు పార్టీ కీలక బాధ్యతల నుంచి బయటకు వస్తే ఆ ప్రభావం క్యాడర్‌పై ప్రభావం చూపుతుంది. పార్టీ ఐక్యతకు నష్టం వాటిల్లుతుంది. ఈ తరుణంలో పార్టిలో లుకలుకలు కనిపించడం మంచిది కాదని పార్టీ పొలిట్‌బ్యూరో అభిప్రాయపడినట్లు తెలిసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లోని పార్టీ సంస్థాగత అంశాలపై చర్చించాం. రాఘవులు వివాదం ముగిసిపోయింది. రాఘవులు పొలిట్‌బ్యూరో సభ్యునిగా కొనసాగుతారు. ఏపీలో పార్టీ నిర్మాణాత్మక అంశాలపై సమస్యలున్నాయి. వాటి కోసం కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. వాటిని ఏపీలో అమలు చేస్తాం’ అని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. రాఘవులు కూడా పార్టీ విజ్ఞప్తికి ఒప్పుకోక తప్పలేదు. ఏపీలో అంతర్గత వివాదాల వల్ల తాను తీవ్ర మానసిక క్షోభ అనుభవిస్తున్నానని చెప్పినట్టు తెలిసింది. ఇక నుంచి అటువంటి పరిస్థితి రాకుండా చూసుకుంటామని పార్టీ అధిష్టానం ఆయనకు నచ్చజెప్పినట్లు సమాచారం. ఒక వెలుగు వ్చెలిగిన రాఘవులు... ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాఘవులు కార్యదర్శిగా ఉండి అనేక పోరాటాలు చేశారు. విద్యుత్ ఉద్యమం ఆయన హయాంలోనే జరిగింది. పోరాట పటిమగల నేతగా ఉన్నత స్థాయి పదవి పొలిట్‌బ్యూరో వరకు వెళ్లారు. ఆయన సింప్లిసిటీ కూడా క్యాడర్‌ను ఉత్తేజపరిచేది. అయితే తర్వాత తర్వాత ఆయన హయాంలోనే పార్టీ వెనుకపట్టు పట్టిందన్న విమర్శలున్నాయి. 10 టీవీ అమ్మడం వంటి విషయాల్లోనూ విమర్శలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. మొత్తంగా కొద్దిరోజులుగా నలుగుతున్న రాఘవులపై అసమ్మతి వ్యవహారం ఎట్టకేలకు సద్దుమణగడంతో సీపీఎం శ్రేణులు ఊపిరిపీల్చుకున్నాయి. -
చైనా కొత్త పొలిట్‌బ్యూరోలో మహిళలే లేరు
బీజింగ్: ముచ్చటగా మూడోసారి చైనా అధ్యక్షుడిగా జిన్‌పింగ్ పగ్గాలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విడుదల చేసిన కొత్త పొలిట్ బ్యూరోలో ఒక్క మహిళా సభ్యురాలు కూడా లేదు. 25 ఏళ్లలో చైనా కమ్యునిస్ట్ పార్టీలో ఇలా జరగడం తొలిసారి. మునుపటి పొలిట్‌బ్యూరోలో కూర్చున్న ఏకైక మహిళ సన్ చున్లాన్ పదవీ విరమణ చేశారు. తదనంతరం ఇంతవరకు ఏ ఇతర మహిళలను నియమించ లేదు. జిన్‌పింగ్ ఏడుగురు సభ్యుల పొలిట్‌బ్యూరో స్టాండింగ్ కమిటీని నలుగురు మిత్ర దేశాలతో ఏర్పాటు చేశారు. ఈ కమిటీలో ఇద్దరు మాజీ కార్యదర్శులు ఉన్నారు. అలాగే వచ్చే ఏడాది పదవి విరమణ చేయనున్న లీ కియాంగ్ కొత్త ప్రీమియర్‌గా బాధ్యతలు స్వీకరించే అవకాశం ఉంది. ఈ మేరకు సింగపూర్ నేషనల్ యూనవర్సిటీలో చైనీస్ రాజకీయ నిపుణుడు ఆల్పెడ్ ములువాన్ మాట్లాడుతూ...చైనా ప్రజలే ఆయనను మూడోవసారి పాలించాలని కోరుకున్నారని చెప్పారు. అంతేగాదు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ పార్టీ దశాబ్దానికి రెండు సార్లు పగ్గాలు చేపట్టిన పాలనను ముగించిన కొద్దిసేపటికే నాయకత్వ పునర్వ్యవస్థీకరణ జరగడం విశేషం. (చదవండి: ‘ప్రపంచానికి చైనా అవసరం’.. మూడోసారి అధ్యక్షుడిగా జిన్‌పింగ్ వ్యాఖ్యలు) -
ఆలస్యమే! అయినా అభిలషణీయమే!
సీపీఎం తన అత్యున్నత నిర్ణాయక విభాగమైన పొలిట్ బ్యూరోలోకి ఎట్టకేలకు ఒక దళితుడిని చేర్చుకుంది. ఒక దళిత నాయకుడికి ఆ స్థానం కట్టబెట్టడానికి భారతదేశంలోని అతిపెద్ద వామపక్ష రాజకీయ పార్టీకి 57 సంవత్సరాల సుదీర్ఘ సమయం పట్టింది. బెంగాల్ నుంచి ఏడుసార్లు ఎంపీగా గెలిచిన రామచంద్ర డోమ్‌ను సీపీఎం ఇటీవలే నిర్వహించిన పార్టీ జాతీయ మహాసభలలో పొలిట్ బ్యూరోలోకి తీసుకుంది. ఇది స్వాగతించదగిన పరిణామం. అయితే ఒక దళిత నాయకుడిని పొలిట్ బ్యూరోలోకి తీసుకున్నంత మాత్రాన పెద్ద మార్పు జరిగిపోదని గ్రహించాలి. ఎందుకంటే భారతదేశంలో వామపక్షం కులవివక్షపై నేటికీ స్పష్టమైన వైఖరిని కలిగిలేదు. వామపక్ష పార్టీలు వర్గ వివక్షను అర్థం చేసుకున్నాయి కానీ కులాన్ని కాదు. ‘ఒక కమ్యూనిస్టుగా పొలిట్ బ్యూరోలో స్థానం సంపాదించుకున్న మొట్ట మొదటి దళితుడిగా నాకు నేనుగా భావించలేను. మరే విషయంలోనైనా సరే అలాంటి ఆలోచనలు నాకు ఉండవు’ అని రామచంద్ర డోమ్ మీడియాతో చెప్పారు. భారతీయ నేపథ్యంలో ఈ ప్రకటన కూడా సమస్యాత్మకమే. పశ్చిమ బెంగాల్లో కమ్యూనిస్టులు సుదీర్ఘ కాలం పాలించినా కానీ దళితులకు లేదా ఆదివాసీలకు కీలకమైన నాయకత్వ స్థానాల్లో చోటు కల్పించలేక పోయారు. జ్యోతిబసు, బుద్ధదేవ్ భట్టాచార్య, సీతారామ్ ఏచూరి, మాణిక్ సర్కార్ తదితర సీపీఎం అగ్ర నేతలు అందరూ అగ్రకుల నేపథ్యాల నుంచి వచ్చారు. వామపక్షంలో బయటకు కన్పించని, లేదా మాట్లాడని కులపక్షపాతం చాలా ప్రమాదకరమైనది. దేశంలోని పలు రాష్ట్రాల్లో వామపక్షాలు తమ రాజకీయ ప్రాధాన్యాన్ని కోల్పోవడం వెనుక ప్రధాన కారణాల్లో ఇదీ ఒకటని చెప్పవచ్చు. పశ్చిమ బెంగాల్లో దళిత ఓట్లు గతంలో కమ్యూనిస్టు పార్టీకే పడేవి కానీ తర్వాత వాటిని తృణమూల్ కాంగ్రెస్ చేజిక్కించుకుంది. ఇప్పుడు దళితుల ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. బెంగాల్లో మాదిరి త్రిపురను కూడా సీపీఎం 25 ఏళ్లు పాలించింది. కానీ ఈరోజు ఆ రాష్ట్రాన్ని కూడా బీజేపీ స్వాధీనపర్చుకుంది. రాష్ట్రంలోని ఆదివాసీ రాజకీయాలను గుర్తించడంలో కమ్యూనిస్టుల వైఫల్యమే ఈ పతనానికి కారణం. కేంద్రీకృత నిర్ణయాలు అందరికీ సమానంగా వర్తించాలని సీపీఎం నమ్ముతుంది కానీ గిరిజనులకు అవసరమైన రాజకీయ ఆవరణను వీరు అనుమతించలేక పోయారు. ఈ రాజకీయ శూన్యతలోకి ఆరెస్సెస్ అడుగుపెట్టి గిరిజనులకు ఒక వేదికను కల్పించింది. క్రమంగా త్రిపురలో గిరిజనుల ఓట్లు బీజేపీ వైపు మళ్లాయి. చివరకు ఆ పార్టీ గెలుపు సాధించింది కూడా! 2018లో తెలంగాణలో దళిత రాజకీయ పార్టీలతో సీపీఎం చేతులు కలిపి బహుజన వామపక్ష ఐక్య సంఘటనను ఏర్పర్చింది. తెలంగాణలో సీపీఎం నాయకత్వం జై భీమ్ – లాల్ సలాం అనే నినాదాన్ని కూడా చేపట్టింది. అంబేడ్కర్‌ని కమ్యూనిస్టులు తమ రాజకీయాల్లో మొట్టమొదటిసారిగా గుర్తించిన సమయమిది. అయితే ఈ ప్రయత్నం కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యవహారంలాగే ఉండిపోయింది తప్పితే దళితులకు, గిరిజనులకు వారి పొలిట్ బ్యూరోలో ఎన్నడూ స్థానం కల్పించలేదు. పైగా దళిత రాజకీయాలను గుర్తింపు రాజకీయాలుగా మాత్రమే వామపక్షం పిలుస్తూ వచ్చింది. అంబేడ్కర్ రాసిన ‘కుల నిర్మూలన’ పుస్తకాన్ని వామపక్షం ఎన్నడూ అంగీకరించలేదు. తమ పొలిట్ బ్యూరోలోకి మొట్టమొదటి దళిత నేతను చేర్చుకోవడాన్ని వ్యూహాత్మక అడుగుగా వామపక్షం ఎన్నటికీ ఆమోదించదు. అయినప్పటికీ ఇది వాస్తవం. తమ రాజకీయ అవకాశాలు ఎన్నడూ లేనంతగా కుదించుకు పోతున్నాయని వామపక్షం కొన్ని సంవత్సరాలుగా గుర్తిస్తూ వస్తోంది. (క్లిక్: మలి అంబేడ్కరిజమే మేలు!) త్రిపుర, బెంగాల్ వంటి రాష్ట్రాల్లో వామపక్షాలకు సంబంధించిన క్షేత్రస్థాయి సంస్థలు దుర్భర పరిస్థితులను ఎదుర్కొంటున్నాయి. కింది స్థాయిలో సంస్థను బలోపేతం చేసుకోవడానికి ఏకైక మార్గం మరింతగా ప్రజారాశులను చేర్చుకోవడమే అని వామపక్ష నాయకత్వం గుర్తించింది. 57 సంవత్సరాల తర్వాత పార్టీ నిర్ణాయక అంగమైన పొలిట్ బ్యూరోలో దళిత, గిరిజన నేతలను చేర్చుకోవడం అనేది సంస్థాగత మార్పులను తీసుకొస్తుందని వామపక్షం గుర్తించింది. (క్లిక్: అభివృద్ధిని అడ్డుకునే ఇంగ్లిష్ వ్యతిరేకత) భారతదేశంలో వామపక్ష పునరుద్ధరణ సాధ్యపడుతుందా అనే ప్రశ్నకు సమాధానం అవుననే చెప్పాలి. కానీ కుల వివక్ష, మైనారిటీల పట్ల వివక్ష ఉందన్న వాస్తవాన్ని ఆమోదించకుండా, వారి స్వరాలకు చోటు కల్పించకుండా వామపక్ష పునరుద్ధరణ అసంభవం. సాంప్రదాయికంగా తాము విశ్వసిస్తూ వచ్చిన రాజకీయ పార్టీల నుంచి ముస్లింలు కూడా బయటపడుతూ తృణమూల్, ఆమ్ ఆద్మీ పార్టీ వంటి కొత్త పార్టీలకు లేదా ఏఐఎంఐఎం వంటి పార్టీలకు ఓటు వేస్తున్నారు. భారతీయ కులాధిక్యతా సమాజంలో మార్క్సి జాన్ని తప్పుగా అన్వయించడం వల్లే వామపక్షం తనదైన చోటును కోల్పోయింది. తన పొలిట్ బ్యూరోలోకి తొలి దళితుడిని సీపీఎం చేర్చుకోవడం అనేది రాబోయే రోజుల్లో నిజమైన మార్పును తీసుకొస్తుంది. భారత రాజకీయాల్లో తమ పునరుద్ధరణకు తొలి అడుగుగా వామపక్షం దీన్ని గుర్తించాల్సి ఉంటుంది. - సాయంతన్ ఘోష్ వ్యాసకర్త స్వతంత్ర జర్నలిస్టు, కోల్‌కతా (‘ఫ్రీ ప్రెస్ జర్నల్’ సౌజన్యంతో) -
MRPS: సభలో ప్రసంగిస్తూ ఎమ్మార్పీఎస్ నేత మృతి
చోడవరం: మాదిగ రిజర్వేషన్ పోరాట మితి (ఎమ్మార్పీఎస్) పొలిట్ బ్యూరో సభ్యుడు పెద్దాడ ప్రకాశరావు గుండెపోటుకు గురై మరణించారు. విశాఖ జిల్లా చోడవరం అంబేద్కర్ భవనంలో శనివారం రాత్రి చోడవరం, మాడుగుల నియోజకవర్గాల ఎమ్మార్పీఎస్ కార్యకర్తల సభ నిర్వహించారు. దీనికి హాజరైన ప్రకాశరావు ప్రసంగిస్తూ సభావేదికపై కుప్పకూలిపోయారు. నాయకులు, కార్యకర్తలు అతనిని అంబులెన్స్‌లో విశాఖపట్నం ఆస్పత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. మృతదేహాన్ని ఆయన స్వగ్రామం కంచరపాలేనికి తరలించారు. (చదవండి: పెళ్లి చేసుకుంటానని యువతిని లోబరచుకుని..) -
కిమ్‌కి ఏమీ కాలేదు
ప్యాంగ్యాంగ్: ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ కోమాలోకి వెళ్లి పోయారని వచ్చిన వదంతులకి తెర పడింది. కరోనా వ్యాప్తి, తుపాన్ ఎదుర్కొనే ఏర్పాట్లపై బుధవారం పొలిట్ బ్యూరో సమావేశంలో కిమ్ సమీక్ష జరుపుతున్నట్లు ఫొటోలను యంత్రాంగం విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్ని ఎదుర్కోవడంలో ఉన్న లోటుపాట్లను కిమ్ అధికారులతో చర్చించినట్టుగా అధికార వార్తా సంస్థ వెల్లడించింది. ఈ సమావేశంలో కిమ్ పొగతాగుతూ కనిపించారని తెలిపింది. కిమ్‌పై అనారోగ్యం వార్తలు ఇదేమీ కొత్త కాదు. గతంలోనూ కిమ్ మృతి చెందారని వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఆయన ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవంలో పాల్గొన్న వీడియో బయటకి వచ్చింది. ఇప్పుడు కూడా కిమ్ కోమాలోకి వెళ్లారని సోదరి కిమ్ యో జాంగ్‌కు బాధ్యతలు అప్పగించారని ప్రచారం జరిగింది. -
కార్పొరేషన్లో అభివృద్ధి జరగలేదు: పోశెట్టి
సాక్షి, నిజామాబాద్: జిల్లా కార్పొరేషన్లో సరైన అభివృద్ధి జరగలేదని టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఏఎస్ పోశెట్టి నిరసన వ్యక్తం చేశారు. గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడతూ.. రోడ్లు, డ్రైనేజ్ వ్యవస్థ అసలు బాగోలేదని, ప్రభుత్వం ఏటా నిజామాబాద్‌కు విడుదల చేస్తున్నా రూ. 100 కోట్లను ఏం చేస్తున్నారని ధ్వజమేత్తారు. రోడ్ల విస్తరణ లేకపోవడం వల్ల ట్రాఫిక్ సమస్యలు తీవ్రం అవుతున్నాయని, కాలనీల్లో అభివృద్ధి అనేది ఎక్కడా కూడా కనిపించడం లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతి పెరిగిపోయిందని, అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో సరైన ఆట స్థలాలు పార్కులు, పార్కింగ్ సౌకర్యం లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. వచ్చే ఎన్నికల్లో అవినీతి పరులకు ఓటు వేయకుండా ప్రజల కోసం పోరాడే అభ్యర్థులకు, పని చేసే యువకులకు ఓటు వేసి గెలిపించాలని ఆయన పేర్కొన్నారు. -
జనసేన ‘ఒకే ఒక్కడి’కి నో ఛాన్స్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఘోర ఓటమి అనంతరం జనసేన దిద్దుబాటు చర్యలు చేపట్టింది. చర్యల్లో భాగంగా పార్టీని స్థానికంగా బలోపేతం చేసేందుకు కసరత్తులు ప్రారంభించింది. దీనిలో భాగంగా పొలిట్ బ్యూరో, పొలిటికల్ అఫైర్స్ కమిటీ, క్రమశిక్షణా సంఘాన్ని ఏర్పాటు చేసింది. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ చైర్మన్‌గా నాదేండ్ల మనోహర్‌ను నియమిస్తూ ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు పవన్ కల్యాణ్ రాజకీయ కార్యదర్శి హరిప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు. నాదేండ్ల మనోహర్‌తో పాటు రామ్మోహన్ రావు, రాజు రవితేజ్, అర్హంఖాన్‌లకు జనసేన పొలిట్ బ్యూరోలో చోటు కల్పించారు. అయితే పొలిట్ బ్యూరోలో జనసేన ఏకైక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్‌కు అవకాశం కల్పించకపోవడం గమనార్హం. దీనిపై పార్టీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక 11 మంది సభ్యులతో కూడిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులను కూడా జనసేన అధినేత ఎంపిక చేశారు. పవన్ అన్నయ్య, నర్సాపురం లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన కొణిదెల నాగబాబుకు పొలిటికల్ అఫైర్స్ కమిటీలో అవకాశం కల్పించారు. పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్‌గా మాదాసు గంగాధరంను నియమించారు. జనసేన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు : తోట చంద్రశేఖర్, రాపాక వరప్రసాద్, కొణిదెల నాగబాబు, కందుల దుర్గేష్, కోన తాతారావు, ముత్తా శశిధర్, పాలవలసి యశస్విని, పసుపులేటి యశస్విని, పసుపులేటి హరిప్రసాద్, మనుక్రాంత్ రెడ్డి, భరత్ భూషణ్, బి. నాయకర్. -
గెలుపే ప్రామాణికంగా అభ్యర్థుల ఎంపిక: కాల్వ
అమరావతి: రాజధాని అమరావతిలో ఏర్పాటు చేసిన టీడీపీ పోలిట్ బ్యూరో సమావేశం ముగిసింది. సమావేశం అనంతరం మంత్రి కాల్వ శ్రీనివాసులు మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపును ప్రామాణికంగా తీసుకుని అభ్యర్థుల ఎంపిక ఉంటుందని చెప్పారు. రేపటి నుంచి ఎన్నికల సన్నాహక కార్యక్రమం ఉంటుందని తెలిపారు. ప్రజలు ఏమి కోరుకుంటున్నారో తెలుసుకునేందుకు ఎన్నికల మేనిఫెస్టో సమావేశం ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. వివిధ వర్గాల ప్రజలతో ఎన్నికల మేనిఫెస్టో కమిటీ సమావేశమవుతుందని మంత్రి కాల్వ శ్రీనివాసులు వివరించారు. అన్ని సామాజిక వర్గాలకు ప్రాధాన్యమిచ్చేలా అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని వివరించారు. మేనిఫెస్టో కమిటీ ఏర్పాటు బాధ్యతను తమ పార్టీ అధ్యక్షుడికి అప్పగించామని వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలకు పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేయడంపై చర్చించినట్లు తెలిపారు. తెలంగాణ అభ్యర్థుల ఎంపిక అక్కడ టీడీపీ శాఖ చూసుకుంటుందని అన్నారు. ఇదే సమావేశంలో పాల్గొన్న టీడీపీ అగ్రనేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల ప్రచారం రేపటి నుంచి ప్రారంభించాలని భావించామని తెలిపారు. ఎన్నికల షెడ్యూల్ కంటే ముందే అభ్యర్థుల మొదటి జాబితా ఉంటుందని, ఎన్నికల ఎత్తుగడల కోసం ఒక స్ట్రాటజీ కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ఈ పోలిట్‌బ్యూరో సమావేశంలో ఆంధ్రా నేతలతో పాటు తెలంగాణ శాఖకు చెందిన ముఖ్య నేతలు కూడా పాల్గొన్నారు. -
చంద్రబాబుపై అలిగిన సీనియర్ నేత
సాక్షి, అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఏపీలో అధికార టీడీపీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు. ఈ జాబితాలోకి సీనియర్ నాయకుడు, కేంద్ర మాజీ మంత్రి పూసపాటి అశోక్‌గజపతి రాజు కూడా చేరినట్టు కనబడుతోంది. చంద్రబాబు అధ్యక్షతన శనివారం జరిగిన టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశానికి అశోక్‌గజపతి రాజు హాజరుకాకపోవడం పలు అనుమానాలు రేకెత్తిస్తోంది. చంద్రబాబుపై ఆయన అలిగినట్టు ప్రచారం జరుగుతోంది. పార్టీలో తనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆయన అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తోంది. తన పార్లమెంట్ పరిధిలో ఉన్న భోగాపురం ఎయిర్పోర్ట్ శంకుస్థాపన కార్యక్రమానికి అశోక్‌గజపతి రాజు రాకపోవడానికి కారణం ఇదేనని సమాచారం. కిశోర్ చంద్రదేవ్ వ్యవహారం కూడా చంద్రబాబు, అశోక్‌గజపతి మధ్య దూరం పెరగడానికి మరో కారణమన్న వాదన కూడా ఉంది. కిశోర్ చంద్రదేవ్‌ను టీడీపీలోకి వస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ వ్యవహారం గురించి తనతో చంద్రబాబు చర్చించకపోవడం అశోక్‌గజపతికి కోపం తెప్పించిందని టీడీపీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే పొలిట్‌బ్యూరో సమావేశానికి ఆయన గైర్హాజరైనట్టు తెలుస్తోంది. -
లోకేష్‌కు లైన్ క్లియర్.. త్వరలో ఎమ్మెల్సీ పదవి
-
టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
-
లోకేష్‌కు లైన్ క్లియర్.. త్వరలో ఎమ్మెల్సీ పదవి
అమరావతి: ఎంతోకాలంగా లోకేష్‌ను కేబినేట్లో చేర్చుకోవాలనుకుంటున్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. సమయం కోసం ఎదురుచూస్తున్న లోకేష్.. ఇందుకు ఇదే సరైన సమయంగా భావిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో లోకేష్‌ను ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ఆదివారం జరిగిన టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశంలో వ్యూహాత్మకంగా లోకేష్ పేరును తెరమీదకు తెచ్చినట్టు తెలిసింది. లోకేష్‌ను ఎమ్మెల్సీగా ఎన్నుకోవాలని కొందరు నేతల ద్వారా ప్రతిపాదన చేయించినట్టు తెలిసింది. లోకేష్‌ను ఎమ్మెల్సీగా ఎన్నుకున్న తర్వాత కేబినేట్లోకి తీసుకోవాలా లేక ముందుగానే చేర్చుకోవాలా? అన్న విషయంపై చంద్రబాబు క్లారిటీ ఇస్తారని పొలిట్ బ్యూరో సభ్యుడొకరు చెప్పారు. ఎమ్మెల్సీ అభ్యర్దుల ఎంపిక నిర్ణయాన్ని పొలిట్ బ్యూరో.. సీఎం చంద్రబాబుకు అప్పగించింది. పార్టీ కోసం పనిచేసిన వారిని ఎంపిక చేయాలని సూచించింది. ఇకపోతే పొలిట్ బ్యూరో సమవేశంలో తెలంగాణ, ఏపీ అసెంబ్లీ లో అనుసరించాల్సిన వైఖరిపైన, పార్లమెంట్ సమావేశాలు, ఐదు రాష్ట్రాల ఎన్నికల తీరుపై చర్చ జరిగింది. అమెరికాలో తెలుగు వారిపై కాల్పుల పై ఆందోళన వ్యక్తం చేశారు. చాలా కాలం తర్వాత నందమూరి హరికృష్ణ పొలిట్ బ్యూరో సమావేశానికి హాజరయ్యారు. మార్చి 2వ తేదీన 11.25 గంటలకు చంద్రబాబు అసెంబ్లీ నూతన భవనాన్ని ప్రారంభించనున్నారు. -
కొలిక్కి వచ్చిన జిల్లా అధ్యక్షుల ఎంపిక!
రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో కూర్పుపై టీఆర్ఎస్ కసరత్తు సాక్షి, హైదరాబాద్: అధికార తెలంగాణ రాష్ట్ర సమితి జిల్లా అధ్యక్షులు, కమిటీల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చినట్లు తెలుస్తోంది. పార్టీ అధినేత, ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు వరసగా బుధ, గురువారాల్లో రెండు రోజుల పాటు ఇదే అంశంపై కసరత్తు చేశారని పార్టీ వర్గాల సమాచారం. ఆయా జిల్లాల మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలు, ఇతర ముఖ్య నేతలతోనూ అవసరమైన సందర్భాల్లో సీఎం మాట్లాడి జిల్లా అధ్యక్షుల పేర్లకు తుదిరూపు ఇచ్చారని తెలిసింది. కాగా, రాష్ట్ర కమిటీ, పార్టీ పొలిట్‌బ్యూరో కూర్పుపై ముఖ్యమంత్రి కసరత్తు చేస్తున్నట్లు చెబుతున్నారు. 31 జిల్లాల అధ్యక్షుల జాబితాను ఒకేసారి ప్రకటించాలని కూడా నిర్ణయించారని సమాచారం. గతంలో జిల్లా అధ్యక్షులుగా పనిచేసిన వారిలో కనీసం ఏడెనిమిది మందికి తిరిగి అవకాశం దక్కనుంది. ఐడీసీ చైర్మన్‌గా నామినేటెడ్ పదవి దక్కించుకున్న కరీంనగర్ జిల్లా(పాత) అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, ఫారెస్టు డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్‌గా నియమితుడైన నల్లగొండ జిల్లా (పాత) అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డి స్థానంలో కొత్తవారికి అవకాశం కల్పించనున్నారు. మిగిలిన ఎనిమిది జిల్లాల్లో పాతవారినే కొనసాగిస్తారని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పార్టీ అధ్యక్షుని ఖరారు కొంత జటిలంగా మారినా, ప్రస్తుత అధ్యక్షుడు మైనంపల్లి హన్మంతరావు పేరు ఖరారైనట్లేనని చెబుతున్నారు. అనుబంధ సంఘాల కమిటీలపై స్పష్టత.. అనుబంధ సంఘాల రాష్ట్ర కమిటీలు, జిల్లా అనుంబంధ సంఘాల కమిటీలపైనా ఒక స్పష్టత వ చ్చిందని తెలుస్తోంది. అయితే, ముందుగా పార్టీ జిల్లా అధ్యక్షుల వరకు ప్రకటి ంచి, మిగిలిన కమిటీలను తర్వాత ప్రకటించే వీలుందని సమాచారం. మరోవైపు పార్టీ రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో, రాష్ట్ర స్థాయి అనుబంధ సంఘాల కమిటీలను మరో విడతలో ప్రకటించే వీలు లేకపోలేదని పార్టీ వర్గాలు అంటున్నాయి. కాగా, పార్టీ సంస్థాగత కమిటీల వివరాలను శనివారం ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు పార్టీ జిల్లా కమిటీల ఏర్పాటు నేపథ్యంలో ఆయా జిల్లాలకు చెందిన నేతల్లో అత్యధికులు హైదరాబాద్‌లోనే మకాం వేశారు. -
రాజకీయ ప్రయోజనాల కోసమే విభజన
– వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్రెడ్డి రాంభూపాల్‌రెడ్డి కొల్లాపూర్ : రాజకీయ ప్రయోజనాల కోసమే టీఆర్ఎస్ ప్రభుత్వం జిల్లాల ప్రకటన చేపట్టిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుండ్రెడ్డి రాంభూపాల్‌రెడ్డి ఆరోపించారు. గురువారం ఆయన కొల్లాపూర్‌లో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం చేపట్టిన విభజన ప్రక్రియ దుందుడుకు చర్యగా ఆయన అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా చాలా జిల్లాల్లో విభజనపై ప్రభుత్వానికి స్పష్టత లేదన్నారు. పరిపాలన సౌలభ్యం కోసం ఆ దిశగా ఎటువంటి చర్యలు చేపట్టలేదన్నారు. డివిజన్ల ప్రక్రియపై కనీస స్పష్టత లేదన్నారు. ఒకే నియోజకవర్గంలోని కొన్ని మండలాలు ఒక జిల్లాలో, మరికొన్ని మండలాల్లో ఇంకొన్ని జిల్లాల్లో ఎలా ఏర్పాటు చేస్తారని ప్రశ్నించారు. ఒక జిల్లాకు చెందిన పోలీస్, జ్యుడీషియల్ డివిజన్లు మరో జిల్లాలో ఉన్నాయన్నారు. వీటన్నింటినీ సరిదిద్దకుండానే జిల్లాల విభజన చేపట్టడం పరిపాలన సౌలభ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. జిల్లాల విభజనకు వైఎస్సార్సీపీ వ్యతిరేకం కాదని, అయితే డివిజన్ల ప్రక్రియను, నియోజకవర్గ సమస్యలన్నీ పరిష్కరించిన తర్వాత ఒక జిల్లా వ్యవహారాలకు మరో జిల్లాతో సంబంధం లేకుండా పూర్తిస్థాయిలో చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని ఆయన కోరారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
పార్టీ మారే ప్రసక్తి లేదు
టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రాథోడ్ రమేష్ ఆదిలాబాద్ రూరల్: తెలుగుదేశం పార్టీతోనే తనకు గుర్తింపు వచ్చిందని, తనతో పాటు తన కుటుంబ సభ్యులు వివిధ పదవులు చేపట్టడం జరిగిందని టీడీపీని వీడే ప్రసక్తే లేదని టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ ఎంపీ రాథోడ్ రమేష్ స్పష్టం చేశారు. శనివారం పట్టణంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో టీడీపీ పశ్చిమ జిల్లా అధ్యక్షుడు శ్యాంసుందర్ అధ్యక్షతన జరిగిన కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని కాపాడుకునేందుకు అన్నివిధాలా కృషి చేస్తానన్నారు. పార్టీని బలోపేతం చేయడానికి ఏప్రిల్‌లో గ్రామ సమావేశాలను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈనెల 29న పార్టీ ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పేర్కొన్నారు. సమావేశంలో ఆ పార్టీ నాయకులు యూనుస్ అక్బాని, అన్నపూర్ణ, రాజిరెడ్డి, రితేష్, సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు. -
కమిటీలేవీ... అధ్యక్షా !
రాష్ట్ర కమిటీ, పొలిట్‌బ్యూరో నియామకాలు ఎప్పుడు ⇒ జిల్లాల్లోనూ ఏర్పాటుకాని కార్యవర్గాలు ⇒నామినేటెడ్ పదవులు ఎలాగూ లేవు.. పార్టీ పదవులన్నా ఇవ్వరా.. ⇒పదవుల కోసం టీఆర్ఎస్ నేతల ఎదురుచూపులు సాక్షి, హైదరాబాద్: అధికార టీఆర్ఎస్ నేతలను కదిలిస్తే చాలు నిర్వేదం ప్రకటిస్తున్నారు. వచ్చే నెల 2వ తేదీకి ప్రభుత్వం ఏర్పాటై సరిగ్గా ఏడాది. ఇప్పటి వరకు నామినేటెడ్ పదవులు కూడా భర్తీ కాలేదన్న అసంతృప్తి వారిలో తీవ్రంగా ఉంది. చివరకు పార్టీ ప్లీనరీ జరిగి మరో రోజు గడిస్తే సరిగ్గా నెల రోజులు. కానీ, ఇప్పటికీ పార్టీ కమిటీల నియామకాలు పూర్తి కాలేదు. ‘నామినేటెడ్ పదవులు ఎలా గూ లేవు, అవి ఎప్పుడు భర్తీ అవుతాయో ఏమో .. కనీసం పార్టీ పదవులన్నా ఇవ్వారా..’ అంటూ ఆవేదన వెల్లగక్కుతున్నారు. జిల్లా అధ్యక్షుల ఎంపిక జరిగి నెల రోజులు దాటినా ఇప్పటి వరకు జిల్లా కార్యవర్గాలను ఏర్పాటు చేయలేదు. పార్టీ అనుంబంధ విద్యార్ధి, యువజన, మహిళ, కార్మిక సంఘాల కమిటీలదీ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లోనూ అదే పరిస్థితి. రాష్ట్ర అధ్యక్షున్ని గత నెల 24వ తేదీన జరిగిన పార్టీ ప్లీనరీలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సీఎం కె. చంద్రశేఖర్‌రావు మరో మారు పార్టీ చీఫ్ అయ్యారు. ఆ తర్వాత ఆయనే రాష్ట్ర కమిటీని ప్రకటించాలి. దీంతోపాటు పొలిట్‌బ్యూరో ఏర్పాటు చేయాలి. ఇలా ఈ నియామకాల్లోనూ అలసత్వం ప్రదర్శిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పదవుల కోసం ఎదురు చూపులు ఎన్నికల్లో గెలిచిన ఎమ్మెల్యేలు, కేబినెట్లో స్థానం పొందిన మంత్రులు మినహాయిస్తే పార్టీ కోసం పనిచేసిన వారెవరికీ ఎలాంటి పదవుల్లేకుండా పోయాయి. ఈ నిరాశ పార్టీ శ్రేణు ల్లో బాగా పేరుకుంది. నామినేటెడ్ పదవులు భర్తీపై ఊరడింపులు మినహా అమలు కాలేదు. వాటిపై ఆశలు ఆవిరైన వారు, కనీసం పార్టీసంస్థాగత పదవులైనా భర్తీ అవుతాయని ఎదురు చూశారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు తమ అనుచరుల పేర్లతో ప్రతిపాదనలు ఇస్తే కానీ కమిటీలను భర్తీ చేయలేని నిస్సహాయ స్థితిలో జిల్లా అధ్యక్షులు ఉన్నారని చెబుతున్నారు. మెజారిటీ నియోజకవర్గాల్లో పాత, కొత్త నేతల గొడవలు ఉన్నాయి. గ్రామ, మం డల, నియోజకవర్గ స్థాయి ఎన్నికల్లో అవి స్పష్టంగా కనిపించాయి. జిల్లా కమిటీలను భర్తీ చేయాలన్నా అదే పరిస్థితి తలెత్తవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. రాష్ట్రస్థాయిలో పార్టీ పదవులు ఆశిస్తున్న నేతల సంఖ్యా ఎక్కువగానే ఉంది. వర్కింగ్ ప్రెసిడెంట్ ఆలోచన ఉండడంతో, రాష్ట్ర కమిటీ భర్తీని ఆలస్యం చేస్తున్నారన్న వ్యాఖ్యలూ వినిపిస్తున్నాయి. ఇక, పార్టీ అత్యున్నత విభాగమైన పొలిట్‌బ్యూరో నియామకం కూడా అందుకే ఆలస్యమవుతోందని సమాచారం. పార్టీ ప్లీనరీ, ఆవిర్భావ సభ తర్వాత పార్టీ శిక్షణ కార్యక్రమం ఉండడంతో ఆలస్యమైందని చెబుతున్నా, అసలు కారణం తెలియడం లేదంటున్నవారే ఎక్కువ. సాహసించి ఎవరూ నోరు మెదపడం లేదు కానీ, పార్టీ పదవులన్నా భర్తీ చేసి అవకాశం కల్పించాలన్న డిమాండ్ బలంగా వ్యక్తం అవుతోంది. -
నేడు టీడీపీ పొలిట్‌బ్యూరో సమావేశం
-
శనివారం టీడీపీ పొలిట్ బ్యూరో భేటీ
-
టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ
హైదరాబాద్: టీడీపీ పొలిట్ బ్యూరో సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే నెల 3 నుంచి పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టాలని నిర్ణయించారు. మహారాష్ట్ర, ఒడిశా, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని నిర్ణయించారు. టీడీపీలో క్రియాశీల కార్యకర్తలకు 2 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పించనున్నారు. -
మద్యం వ్యాపారులతో చంద్రబాబు కుమ్మక్కు
నరసాపురం టౌన్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మద్యం వ్యాపారులతో కుమ్మక్కయ్యారని సీపీఎం కేంద్ర కమిటీ పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు ఆరోపించారు. నరసాపురంలో మంగళవారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మద్యం అమ్మకాలు ద్వారా వచ్చే ఆదాయంతోనే రాష్ట్రాన్ని ముందుకు నెట్టాలనే ఆలోచనలో చంద్రబాబు ఉన్నారని విమర్శించారు. మద్యం బెల్టు షాపులను తొలగించేందుకు సైతం కమిటీలంటూ ముఖ్యమంత్రి కాలయాపన చేస్తున్నారని దుయ్యబట్టారు. రైతు, డ్వాక్రా రుణాలను తక్షణమే మాఫీ చేయాలని, లేదంటే పెద ఎత్తున ఉద్యమం చేపడ తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఎన్నికల ముందు ఒకమాట, ఎన్నికల తర్వాత మరో మాట చెప్పడం చ ంద్రబాబుకు తగదన్నారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేద న్నారు. రిలయన్స్ అధినేతలతో చంద్రబాబు మిలాఖత్ అయ్యారని, అందుకే ఆంధ్రాకు రావలసిన గ్యాస్ వాటాపై ఆయన నోరు మెదపడంలేదన్నారు. గ్యాస్ పైప్‌లైను ప్రమాదాల వల్ల అమాయక ప్రజలు బలి అయిపోతున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. గ్యాస్ ఆధారిత పరిశ్రమల స్థాపనతో రైతులకు మేలు జరగాలని, నిరుద్యోగులకు ఉపాధి దొరకాలని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో సెటి లర్స్‌కు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వబోమని చెప్పటం అన్యాయమని అన్నారు. ఈ విషయంలో ముఖ్యమంత్రి శ్రద్ధ వ హించి విద్యార్థులకు న్యాయం చేయాలన్నారు. రాష్ట్ర విభజన వల్ల ఇలాంటి సమస్యలు ఎన్నో వస్తాయనే తాము వ్యతిరేకించామని చెప్పారు. కోనసీమ, కోటిపల్లి రైల్వేలైను నిర్మాణం చేపట్టి పూర్తి చేయాలని రాఘవులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వాలు ఓడ రేవుల ఏర్పాటులో నిర్లక్ష్యంతో అభివృద్ధి ఆశించిన స్థాయిలో జరగలేదని పేర్కొన్నారు. నరసాపురంలో ఓడ రేవు నిర్మించాలి సముద్ర ముఖద్వారంలో ఉన్న నరసాపురం ప్రాంతంలో ఓడల రేవు నిర్మించాలని బీవీ రాఘవులు డిమాండ్ చేశారు. బ్రిటిష్ వాళ్లు ఇక్కడి నుంచి సముద్రయానం ద్వారా వర్తక, వాణిజ్యాలు సాగించారనే విషయం గుర్తు చేసారు. ఓడలరేవు నిర్మిస్తే జిల్లాలోని తీరప్రాంతం ఎంతో అభివృద్ధి చెందుతుందని అన్నారు. -
మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు మానుకోవాలి
ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తీగల రత్నం నల్లగొండ టౌన్ : ఎస్సీ వర్గీకరణతోపాటు వికలాంగుల హక్కుల కోసం నిరంతరం ఉద్యమిస్తున్న మంద కృష్ణమాదిగపై సొంత సంఘం నేతలు అనుచిత వ్యాఖ్యలు చేయడం మానుకోవాలని ఎంఆర్పీఎస్ పొలిట్‌బ్యూరో సభ్యుడు తీగల రత్నంమాదిగ హితవు పలికారు. ఆదివారం స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. గతంలో సంఘం నుంచి సస్పెండై స్వార్థం కోసం తిరిగి చేరిన వ్యక్తులు మంద కృష్ణపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. ఉద్యమాన్ని నీరుగార్చే చర్యలకు పాల్పడవద్దని, మంద కృష్ణను అవమానపర్చితే యావత్ మాదిగజాతిని అవమానపర్చినట్లు అవుతుందని గుర్తుంచుకోవాలన్నారు. ఇకనైన ఆరోపణలు చేయడం మానుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్ర కార్యదర్శి కనకరాజు సామ్యేలు మాట్లాడుతూ మంద కృష్ణమాదగ గురించి యావత్ రాష్ట్ర ప్రజలకు తెలుసన్నారు. ఉద్యమకారుడిపై ఆరోపణలు చేస్తే జిల్లాలో తిరగనివ్వమని హెచ్చరించారు. వారివెంట సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బకరం శ్రీనివాస్, ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు కొమిరె స్వామి, శివశంకర్ తదితరులు ఉన్నారు. -
కేసీఆర్ అధ్వర్యంలో రేపు టీఆర్ఎస్ కీలక భేటి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పొలిట్ బ్యూరో సమావేశం శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తున్నట్టు ఆపార్టీ ఓ ప్రకటనలో వెల్లడించింది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో మెజార్టీ సీట్లు లభించవచ్చని టీఆర్ఎస్ అంచనా వేస్తున్న నేపథ్యంలో పోలిట్ బ్యూరో సమావేశానికి అత్యంత ప్రాధాన్యత ఏర్పడింది. భవిష్యత్ లో పార్టీ అనుసరించాల్సిన కార్యాచరణ, కేంద్రంలో ఏర్పడబోయే ప్రభుత్వానికి మద్దతుతోపాటు, రాష్ట్ర విభజన నేపథ్యంలో పార్టీ దృష్టి సారించాల్సిన అంశాలపై చర్చ జరిగే అవకాశం ఉంది. టీఆర్ఎస్ పార్టీ అభ్యర్ధుల్లో, నేతల్లో నెలకొన్న పలు సందేహాలపై కేసీఆర్ స్పష్టత ఇచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశానికి పార్టీ నేతలు, అభ్యర్థులు హాజరవుతారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. -
తిరుపతి ‘దేశం’లో ఐక్యత ఒట్టిమాటే!
చదలవాడ, వెంకటరమణ మధ్య కొనసాగుతున్న విభేదాలు సమన్వయం లేదని పొలిట్‌బ్యూరో సభ్యులు కంభంపాటికి ఫిర్యాదు చేసిన నీలం వెంకటరమణ కోటరీకే ప్రాధాన్యం ఇస్తున్నారని టీడీపీ కార్యకర్తల ఆందోళన సాక్షి, తిరుపతి: తిరుపతి తెలుగుదేశం పార్టీలో నేతల మధ్య విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. చివరి క్షణంలో అనూహ్యంగా టీడీపీ టికెట్టు దక్కించుకున్న మాజీ ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ కాంగ్రెస్ నుంచి వచ్చిన కోటరీకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. దీంతో నియోజకవర్గ ఇన్చార్జ్ చదలవాడ కృష్ణమూర్తితోపాటు టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. శనివారం తిరుపతికి వచ్చిన పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యులు కంభంపాటి రామ్మోహన్‌రావుకు వెంకటరమణపై టీడీపీ నేతలు ఫిర్యాదులు చేసే స్థాయికి విభేదాలు చేరుకోవడం పరిస్థితికి అద్దం పడుతోంది. కంభంపాటి రాకకు సంబంధించిన సమాచారం వెంకటరమణకు తెలిసినప్పటికీ చదలవాడకుగానీ ఇతర ముఖ్యనాయకులకుగానీ కబురు చేయలేదు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే మున్ముందు అసలైన టీడీపీ కార్యకర్తలకు ఎలా గౌరవం దక్కుతుందని వారు వాపోతున్నారు. ఒకే సామాజికవర్గానికి చెందిన చదలవాడ, వెంకటరమణల మధ్య విభేదాలు లేవని తెలియజేసేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నాలు కంభంపాటి రాకతో అంతా ఒట్టిదేనని తేలింది. నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారానికి సంబంధించిన బాధ్యతలు డివిజన్ల వారీగా ఏర్పాటు చేసిన పార్టీ కమిటీలకు అప్పగించే విషయంలో వివాదం తలెత్తింది. అదికాస్త బహిర్గతం కావడంతో చదలవాడ, వెంకటరమణ వర్గాల మధ్య తాత్కాలికంగా సమన్వయం కుదిర్చారు. అన్ని డివిజన్ కమిటీలు కాకుండా అవసరమైన చోట మాత్రమే మార్చేందుకు వెంకటరమణకు అవకాశం ఇచ్చారు. మధ్యేమార్గంగా జరిగిన ఒప్పందం తాత్కాలికమేనని శనివారం కంభంపాటి రాకతో స్పష్టమైంది. పార్టీ నాయకులను కలుపుకుపోవడంలో వెంకటరమణ విఫలమయ్యారని రాష్ట్రపార్టీ కార్యదర్శి నీలం బాలాజీ పొలిట్‌బ్యూరో సభ్యునికి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసిన నేత చదలవాడకు అత్యంత సన్నిహితుడు కావడం గమనార్హం. మొత్తం మీద టీడీపీలో అంతర్గతంగా అగ్గి రగులుకుంటూనే ఉంది. వెంకటరమణ చుట్టూ కోటరీ ఎన్నికల బాధ్యతల్లో తన మనుషులకే వెంకటరమణ ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తున్నారు. తన వెంట టీడీపీలోకి వచ్చిన నాయకులను చేరదీస్తున్నారు. దీంతో ఇంతకాలం పార్టీని నమ్ముకున్న కార్యకర్తలకు గౌరవం లేకుండా పోయింది. మాజీ ఎమ్మెల్యే మోహన్, తిరుపతి టౌన్ బ్యాంకు చైర్మన్ పులిగోరు మురళి తదితరులకు ఎన్నికల బాధ్యతలు అప్పగిస్తున్నారు. ఇంతకాలం పార్టీ కోసం పనిచేసిన వారు గుడ్లప్పగించి చూడాల్సిన పరిస్థితి తలెత్తింది. వీరు కాకుండా పార్టీ టికెట్టు కోసం ఆశించిన భంగపడిన వెంకటరమణ సామాజికవర్గానికి చెందిన నాయకులను అసలు పట్టించుకోవడం లేదు. దీంతో వారంతా గుర్రుగా ఉన్నారు. బోత్ ఆస్పత్రి నిర్వాహకులు డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ వంటి నాయకులు ఇప్పుడు ఎక్కడా కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ తిరుపతి పార్టీలో ఐక్యత నేతిబీరలో నెయ్యి చందంగా మారినట్టు ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. -
నేను పోటీ చేయను
సాక్షి ప్రతినిధి, నెల్లూరు : తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు వ్యవహార తీరుపై కలత చెందిన మాజీ మంత్రి, పార్టీ పొలిట్‌బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి జరగబోయే ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తనకు నెల్లూరు రూరల్ టికెట్ కావాలని ముందే అడిగినా బీజేపీకి కేటాయించడంపై ఆయన తీవ్ర అసంతృప్తికి గురయ్యారు. ఈ సారి ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయనని జిల్లాలో పార్టీ ప్రచార బాధ్యతలు మాత్రమే తీసుకుంటానని ఆయన చంద్రబాబుకు స్పష్టం చేశారని తెలిసింది. ఈసారి ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి కాకుండా నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేయాలని ఆరు నెలలుగా సోమిరెడ్డి ఆశపడుతూ వచ్చా రు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకుంటూనే చంద్రబాబుకు తన కోరికను విన్నవించారు. కోవూరు టికెట్ తన మద్దతుదారుడు పెళ్లకూరు శ్రీనివాసులురెడ్డికి ఇవ్వాలని పార్టీ అధిష్టానంపై సోమిరెడ్డి తీవ్రమైన ఒత్తిడి తెచ్చారు. ఈ వివాదాన్ని పరిష్కరించే క్రమంలో భాగంగా చంద్రబాబు సోమిరెడ్డికి నెల్లూరు రూరల్ టికెట్ ఇవ్వడానికి సరేనన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఇటీవల నెల్లూరులో జరిగిన ప్రజాగర్జన సభకు జన సమీకరణ అంశాలపై చర్చించడానికి జిల్లాకు వచ్చిన ఎంపీ సుజనా చౌదరి, గరికపాటి మోహన్‌రావు నెల్లూరు రూరల్ నుంచి సోమిరెడ్డే పోటీ చేస్తాడని పార్టీ నేతలకు బహిరంగంగానే చెప్పారు. దీంతో సోమిరెడ్డి రూరల్ నియోజకవర్గంలో పర్యటనలు చేయడంతో పాటు పార్టీ కేడర్స్‌తో సన్నిహిత సంబంధాలు నెలకొల్పుకునే ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. ఈ సారి తాను నెల్లూరు రూరల్ నుంచి పోటీ చేస్తానని, సర్వేపల్లి నుంచి కొత్త వ్యక్తికి ఎవరికైనా అవకాశం వస్తుందని సోమిరెడ్డి తన సన్నిహితుల వద్ద ఆఫ్‌ది రికార్డ్ వ్యాఖ్యలు చేశారు. అయితే టీడీపీ, బీజేపీ ఎన్నికల పొత్తుల చర్చల్లో నెల్లూరు రూరల్ అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించడానికి చంద్రబాబు అంగీకరించారు. ఈ విషయం గురించి జిల్లా పార్టీ నాయకులతో గాని, టికెట్ ఆశిస్తున్న సోమిరెడ్డితో గాని చంద్రబాబు మాట మాత్రం గా కూడా చర్చించలేదు. మీడియా ద్వారా అసలు విషయాన్ని తెలుసుకున్న సోమిరెడ్డి అప్పటికప్పుడే పార్టీ అధినేత చంద్రబాబు, ఎంపీ సుజనా చౌదరితో ఫోన్లో మాట్లాడి తన నిరసనను తెలియజేశారు. రూరల్‌కు బదులు సర్వేపల్లి, లేదా గూడూరు అసెంబ్లీ స్థానాన్ని బీజేపీకి కేటాయించాలని సూచించారు. ఆ తర్వాత హైదరాబాద్‌లో చంద్రబాబును కలుసుకుని ఈ ప్రతిపాదన గురించి మరోసారి ఒత్తిడి తెచ్చారు. బీజేపీ రాష్ట్ర, జాతీయ నాయకత్వంతో మాట్లాడి సీటు సర్దుబాటు చేయాలని కోరారు. తాను బీజేపీ నాయకులతో మాట్లాడుతానని సోమిరెడ్డికి చంద్రబాబు హామీ ఇచ్చా రు. నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమయ్యే రోజుకు (12వ తేదీకి) ఈ సమస్య సర్దుబాటు అవుతుందని సోమిరెడ్డి భావించారు. అయితే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కావడంతో పాటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులకు సంబంధించి రెండు జాబితాలు విడుదలైనా సోమిరెడ్డి గోడు చంద్రబాబు పట్టించుకోలేదని తెలిసింది. దీంతో తీవ్ర ఆవేదనకు గురైన సోమిరెడ్డి ఈసారి ఎన్నికల్లో తాను ఎక్కడి నుంచి పోటీ చేయనని పార్టీ అభ్యర్థుల విజయం కోసం జిల్లా అంతటా ప్రచారం చేస్తానని పరోక్షంగా చంద్రబాబుకు తన నిరసన తెలియచేశారు. సర్వేపల్లి నుంచి తన పేరు ప్రకటించినా తాను నామినేషన్ వేసేది లేదని తేల్చి చెప్పినట్లు సమాచారం. దీంతో శని, ఆదివారాల్లో జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర, ఎంపీ అభ్యర్థి ఆదాల ప్రభాకర్‌రెడ్డి, పార్టీకి చెందిన ఇతర ముఖ్యనాయకులు హైదరాబాద్‌లో సోమిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను అనేక రకాలుగా బుజ్జగించారు. సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటే పార్టీకి మంచిది కాదని ఈ అసంతృప్తి పార్టీ కేడర్ మీద కూడా పడుతుందని ఆయనకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం తాను ఎంతో కష్టపడుతున్నా, వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్రెడ్డి మీద తీవ్ర స్థాయిలో యుద్ధం చేస్తున్నా చంద్రబాబు తనను పట్టించుకోలేదని సోమిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారని తెలిసింది. ఈ వివాదాన్ని చంద్రబాబు ఏ విధంగా పరిష్కరిస్తారోనని తెలుగుదేశం పార్టీ వర్గాలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే సోమవారం చంద్రబాబుతో మరోసారి సమా వేశమై సీటు బీజేపీ అంగీకరించకపో యినా నెల్లూరు రూరల్ నుంచి సోమిరెడ్డిని స్నేహపూర్వక పోటీ పేరుతో బరిలో దించాలని జిల్లా నాయకులు భావిస్తున్నారు.