port construction
-
బాబు ‘ప్రైవేటు’ మమకారానికి.. 3 పోర్టులు బలి
సాక్షి, అమరావతి: ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేయడంలో మరెవరికీ సాధ్యం కాని రికార్డులను నెలకొల్పిన సీఎం చంద్రబాబు ఈ దఫా ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న మూడు ప్రధాన పోర్టులపై కన్నేశారు. వీటిని ప్రైవేటు పరం చేసేందుకు శర వేగంగా చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో ఒక్కో రంగాన్ని ప్రైవేట్ పరం చేసి సీఎం చంద్రబాబు చేతులు దులుపుకొంటున్న విషయం తెలిసిందే. ఒకవైపు కొత్త పోర్టుల నిర్మాణం వేగంగా జరుగుతున్న తరుణంలో వాటిని తన వారికి అప్పగించే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది. 65 శాతానికి పైగా పనులు పూర్తయిన రామాయపట్నం పోర్టును, 50 శాతానికి పైగా పనులు జరిగిన మచిలీపట్నం, మూలపేట పోర్టులను ప్రైవేటుకు అప్పగించేందుకు టెండర్లు పిలవడం అధికార, పారిశ్రామిక వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. అంతిమంగా ఇది న్యాయ వివాదాలకు దారి తీసి పోర్టుల నిర్మాణాలు నిలిచిపోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. మూడు పోర్టుల నిర్మాణానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా నిధులను కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం సమకూర్చింది. వివిధ బ్యాంకుల, ఆర్ధిక సంస్థల నుంచి రుణాలు తీసుకొని ఫైనాన్షియల్ క్లోజర్ పూర్తి చేసిన తర్వాతే పనులు ప్రారంభించారు. కాబట్టి ఇప్పుడు ఈ పోర్టుల నిర్మాణ పనులు కొనసాగించడానికి నిధుల కొరత కూడా లేదు. నిర్మాణ పనులు దాదాపు సగానికిపైగా పూర్తయి వచ్చే ఏడాది అందుబాటులోకి రానున్న తరుణంలో అసంబద్ధంగా ప్రైవేటీకరణ చేయడంలో ఎటువంటి ప్రజా ప్రయోజనాలు లేవని, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్నిచ్చే పోర్టులను ప్రైవేటీకరణ చేస్తున్నారంటే దీని వెనుక ఏదో కుంభకోణం ఉండవచ్చని విశ్రాంత ఐఏఎస్ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. ఇక రాష్ట్రంలో మత్స్యకారులకు మేలు జరిగేలా, లక్షల మందికి ఉపాధి కల్పించి వలసలను నివారించేలా, మత్స్య సంపదను పెంపొందించే దిశగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం చేపట్టిన 10 ఫిషింగ్ హార్బర్లను సైతం ప్రైవేటుకు అప్పగించేందుకు చంద్రబాబు ప్రభుత్వం చర్యలు చేపట్టడం తీవ్ర విస్మయం కలిగిస్తోంది. వాణిజ్యం, ఉపాధికి ఊతమిచ్చేలా రాష్ట్రానికి ఉన్న విస్తారమైన సముద్ర తీరాన్ని సద్వినియోగం చేసుకుంటూ పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధి, ఆదాయాన్ని పెంచడం లక్ష్యంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నాలుగు పోర్టుల నిర్మాణాన్ని చేపట్టిన విషయం తెలిసిందే. తొలిదశలో రూ.13వేల కోట్లకు పైగా వ్యయంతో రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టుల నిర్మాణాన్ని గత ప్రభుత్వమే చేపట్టింది. కాకినాడ గేట్‌వే పోర్టు నిర్మాణాన్ని పీపీపీ విధానంలో చేపట్టింది. ఇవి అందుబాటులోకి రావడం వల్ల వాణిజ్య కార్యకలాపాలు ఊపందుకోవడమే కాకుండా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా వస్తాయి. భారీ సంఖ్యలో యువతకు ఉపాధి కూడా లభిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రైవేట్ రంగంలో నిర్మిస్తే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్దగా ఆదాయం ఉండదన్న ఉద్దేశంతో గత సర్కారు ల్యాండ్‌లార్డ్ మోడల్లో పోర్టుల నిర్మాణం చేపట్టింది. ప్రతి పోర్టుకు ప్రత్యేకంగా స్పెషల్ పర్పస్ వెహికిల్ ఏర్పాటు చేసి రుణాలు తీసుకొని వేగంగా పనులు చేపట్టింది. న్యాయ వివాదాలతో ఆగిపోయే ప్రమాదం..! ఇప్పటికే మూడు పోర్టు పనులను మూడు సంస్థలు చేస్తుండగా.. కొత్తగా తిరిగి నిర్మాణ పనుల కోసం మారిటైమ్ బోర్డు ఈవోఐ పిలవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ టెండర్ల గురించి తమతో ఎలాంటి సంప్రదింపులు జరపలేదని, ఓపక్క తాము పనులు చేస్తుండగా మళ్లీ టెండర్లు ఎందుకు పిలిచారో అర్థం కావడంలేదని కాంట్రాక్టు సంస్థలు వాపోతున్నాయి. నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాకుండానే అప్‌గ్రెడేషన్, పోర్టు మోడర్నైజేషన్ అంటూ టెండర్లు ఎలా పిలుస్తారని పేర్కొంటున్నారు. ప్రస్తుతం జరుగుతున్న పనులను ఎక్కడివక్కడ నిలిపేసి మొత్తం మూడు పోర్టులను ప్రైవేటు పార్టీలకు అప్పగించడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని ఈ వ్యవహారాలను దగ్గర నుంచి గమనిస్తున్న అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం పనులు చేస్తున్న సంస్థలను బెదిరించడానికి టెండరు నోటీసు ఇచ్చినట్లుగా ఉందని మరో సీనియర్ అధికారి వ్యాఖ్యానించారు. ఇప్పటికే పలుచోట్ల భూసేకరణ వివాదాలు నడుస్తున్నాయని, పోర్టులు ప్రైవేటు పరమైతే ఇవి మరింత జటిలమై న్యాయపరమైన చిక్కులతో నిర్మాణాలు ఆగిపోయే ప్రమాదం ఉందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ఏపీ మారిటైమ్ బోర్డు సీఈవో ప్రవీణ్ ఆదిత్య నుంచి వివరణ తీసుకోవడానికి ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. గతంలో పీపీపీ విధానంలో నిర్మించిన గంగవరం, కాకినాడ, కృష్ణపట్నం పోర్టులను దృష్టిలో పెట్టుకొని గత ప్రభుత్వం సొంతంగా పనులు చేపట్టిందని, ఇప్పుడు కూటమి ప్రభుత్వం పబ్లిక్, ప్రైవేటు, పీపుల్ పార్టనర్íÙప్ (పీ 4) పేరుతో అన్నింటినీ ప్రైవేటుపరం చేస్తోందని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఫిషింగ్ హార్బర్లు ఫిషింగ్ హార్బర్లు కూడా.. మన మత్స్యకారులు ఉపాధి కోసం పొరుగు రాష్ట్రాలకు వలస వెళ్లకూడదనే లక్ష్యంతో వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.3,500 కోట్లతో పది ఫిషింగ్ హార్బర్ల నిర్మాణాన్ని చేపట్టింది. ఈ పది హార్బర్లు అందుబాటులోకి వస్తే 10,521 మెకనైజ్డ్ బోట్లు నిలిపే సామర్థ్యంతో పాటు 4.5 లక్షల టన్నుల అదనపు మత్స్య సంపదను పెంచుకునే వెసులుబాటు కలుగుతుంది. వీటిలో ఇప్పటికే జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బరు పూర్తి కాగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన విషయం తెలిసిందే. పోర్టుల నిర్మాణం, నిర్వహణ కోసం బిడ్లు ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన టెండర్ మిగిలిన హార్బర్ల నిర్మాణ పనులు వివిధ దశల్లో ఉన్నాయి. వీటిని కూడా చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటుకు అప్పగించేందుకు సన్నాహాలు ప్రారంభించింది. మొత్తం పది పిషింగ్ హార్బర్లను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి నిర్వహించేందుకు ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్లను ఆహ్వానిస్తూ కూటమి ప్రభుత్వం తాజాగా టెండర్లను పిలిచింది.ఒకేసారి 3 పోర్టులు చరిత్రలో తొలిసారిప్రభుత్వ ఆధ్వర్యంలో ఒకేసారి 3 పోర్టుల నిర్మాణాన్ని చేపట్టడం దేశ చరిత్రలో తొలిసారి. ఈ ఘనతను గత వైఎస్ జగన్ ప్రభుత్వం సాధించింది. రామాయపట్నం పోర్టు పనులను అరబిందో, మచిలీపట్నం పోర్టును మెగా, మూలపేట పోర్టు నిర్మాణ పనులను విశ్వసముద్ర సంస్థలు దక్కించుకున్నాయి. రామాయపట్నం పోర్టులో బల్క్ కార్గో బెర్తు పనులు 100 శాతం పూర్తయ్యాయి. కేంద్రం నుంచి అనుమతులు వస్తే బెర్త్ వాణిజ్య కార్యకలాపాలు నిర్వహించవచ్చు. ఈ దశలో చంద్రబాబు ప్రభుత్వం వాటిని ప్రైవేటుకు అప్పగించేందుకు చర్యలు చేపట్టింది. ప్రభుత్వ ఆదాయానికి తూట్లు పొడిచి ప్రైవేటుకు లబ్ధి చేకూర్చేందుకు సన్నద్ధమైంది. రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను నిర్మించి అభివృద్ధి చేసి నిర్వహించడంపై ఆసక్తి గల సంస్థల నుంచి బిడ్ల (ఈవోఐ)ను ఆహ్వానిస్తూ ఏపీ మారిటైమ్ బోర్డు టెండర్లను పిలిచింది. నవంబర్ 4లోగా బిడ్లు దాఖలు చేయాలని టెండర్ నోటీసులో పేర్కొంది. -
ఉత్తరాంధ్రకు వెలుగు రేఖ.. శ్రీకాకుళం జిల్లాలో పోర్టు నిర్మాణంతో మారనున్న ముఖచిత్రం
సాక్షి, అమరావతి/సంతబొమ్మాళి/ఎచ్చెర్ల క్యాంపస్: శ్రీకాకుళం జిల్లా భావనపాడు వద్ద పోర్టు నిర్మాణంతో ఉత్తరాంధ్ర రూపు రేఖలు త్వరలో మారిపోనున్నాయి. సుదీర్ఘ కాలంగా ఉన్న ఈ ప్రాంత వాసుల కల త్వరలో సాకారం కానుంది. రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్నప్పటికీ, అత్యంత కీలకమైన చోట ఈ పోర్టు ఉంది. కేవలం మన రాష్ట్రం నుంచే కాకుండా ఛత్తీస్‌గఢ్æ, జార్ఖండ్, మధ్యప్రదేశ్‌తో పాటు దక్షిణ ఒడిశా రాష్ట్రాల నుంచి ఎగుమతులు, దిగుమతులకు ఈ పోర్టు అత్యంత కీలకం కానుంది. సుమారు రూ.16,000 కోట్ల వ్యయంతో రాష్ట్రంలో కొత్తగా నిర్మిస్తున్న రామాయపట్నం, మచిలీపట్నం, కాకినాడ గేట్‌వే, భావనపాడు పోర్టుల్లో అత్యంత వేగంగా అభివృద్ధి చెందే అవకాశాలు భావనపాడుకే ఉన్నాయని మారిటైమ్ వర్గాలు పేర్కొంటున్నాయి. పలు కీలక పరిశ్రమలకు అవసరమైన ముడి సరుకులు.. థర్మల్ కోల్, కుకింగ్ కోల్, ఎరువులు, ముడి జీడి గింజలు, సున్నపురాయి, వంటనూనెల దిగుమతికి ఈ పోర్టు కేంద్రం కానుంది. ఇక్కడ నుంచి మినరల్ శాండ్, ముడి ఇనుము, జీడిపప్పు, సోయా మీల్, గ్రానైట్.. ఫెర్రో ఉత్పత్తులు, జూట్, ఐరన్ అండ్ స్టీల్ ఉత్పత్తుల ఎగుమతికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇంతటి కీలకమైన భావనపాడు పోర్టు పనులకు ఏప్రిల్ 19న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భూమి పూజ చేయడం ద్వారా ప్రారంభించనున్నారు. తొలి దశలో నాలుగు బెర్తులు తొలి దశలో భావనపాడు పోర్టును నిరి్మంచడానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.4,361.91 కోట్ల పరిపాలన అనుమతులు మంజూరు చేసింది. ల్యాండ్ లార్డ్ మోడల్ విధానంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న ఈ పోర్టు నిర్మాణ పనులను రూ.2,949.70 కోట్లతో కాంట్రాక్టు సంస్థకు అప్పగించారు. నాలుగు బెర్తుల నిర్మాణం, ఇతర మౌలిక వసతుల కల్పనతో తొలి దశ ఉంటుంది. మొత్తం పోర్టు వార్షిక సామర్థ్యం 83.3 మిలియన్ టన్నులు కాగా, తొలి దశలో నాలుగు బెర్తులతో 23.5 మిలియన్ టన్నుల సామర్థ్యంతో పోర్టును అభివృద్ధి చేయనున్నారు. నాలుగు బెర్తుల్లో రెండు జనరల్ కార్గోకు, ఒకటి బొగ్గు, ఇంకొకటి కంటైనర్‌తోపాటు ఇతర ఎగుమతి, దిగుమతులకు వినియోగించనున్నారు. ఈ పోర్టు నిర్మాణం కోసం రాష్ట్ర ప్రభుత్వం భావనపాడు పోర్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ పేరుతో ప్రత్యేకంగా కంపెనీ ఏర్పాటు చేసింది. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన నిధులను పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ నుంచి రుణ రూపంలో సమకీరించుకుంటున్నారు. ఈ ప్రాజెక్టు పూర్తయితే సుమారు 25,000 మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుంది. దీంతోపాటు చుట్టుపక్కల ప్రాంతం పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతుంది. పోర్టు సిటీగా శ్రీకాకుళం భావనపాడుతో శ్రీకాకుళం జిల్లా పోర్టు సిటీగా మారుతుంది. ఇప్పటికే ఈ పోర్టు నిర్మాణానికి అవసరమైన భూ సేకరణ పనులు పూర్తయ్యాయి. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోర్టు ఆధారిత పారిశ్రామికాభివృద్ధిపై ముఖ్యంగా దృష్టి సారిస్తున్నారు. ఇందులో భాగంగా ఇప్పటికే రామాయపట్నం పోర్టు పనులు వేగంగా జరుగుతుండగా, త్వరలో మచిలీపట్నం పనులు కూడా ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ నాటికి రామాయపట్నం పోర్టుకు తొలి నౌకను తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. అదే స్ఫూర్తితో భావనపాడు పోర్టు పనులు కూడా లక్ష్యంలోగా పూర్తి చేస్తాం. – గుడివాడ అమరనాథ్, పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి రూ.35 కోట్లతో ఆర్అండ్ఆర్ కాలనీ భావనపాడు పోర్టు నిర్వాసితులు 594 మంది కోసం రూ.35 కోట్లతో 55 ఎకరాల్లో నౌపడలో అధునాతన వసతులతో అర్అండ్ఆర్ కాలనీ నిరి్మంచనున్నామని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ తెలిపారు. ఈ నెల 19న భావనపాడు పోర్టుకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్న నేపథ్యంలో శుక్రవారం ఆయన ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఇప్పటి వరకు మూలపేట, విష్ణుచక్రంలో రైతుల నుంచి 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. రైతులకు 10 శాతం మాత్రమే పరిహారం చెల్లించాల్సి ఉందన్నారు. అప్రోచ్ రోడ్డు కోసం మరో 320 ఎకరాలు సేకరించామని తెలిపారు. దీంతో పాటు మొదటి ఫేజ్‌లో సీఆర్‌జెడ్ భూములు, ప్రభుత్వ భూములు, అటవీ శాఖ భూములు.. మొత్తం 1000 ఎకరాలు సేకరిస్తున్నట్లు తెలిపారు. రెండో ఫేజ్‌లో బృహత్తర పోర్టు డెవలప్మెంట్కు మరికొన్ని భూములు రైతుల నుంచి సేకరించాల్సి ఉంటుందన్నారు. ఆర్అండ్ ఆర్ కాలనీకి ఈ నెల 11న ప్రభుత్వం నుంచి ప్లాన్ అప్రూవల్ వచి్చందన్నారు. జిల్లా ప్రజల పోర్టు కల నెరవేరుతుండడం శుభ పరిణామమన్నారు. వలసల నివారణే ప్రభుత్వ ధ్యేయం మత్స్యకారుల వలసల నిర్మూలనే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తోందని రాష్ట్ర పశు సంవర్థక, మత్స్య శాఖ మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. రూ.365 కోట్లతో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం బుడగుట్లపాలెం తీరంలో నిరి్మంచనున్న ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే గొర్లె కిరణ్‌కుమార్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ నెల 19న సీఎం వైఎస్ జగన్ జిల్లా పర్యటనలో ఈ ప్రాజెక్టును వర్చువల్‌గా ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అవసరమైన ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. పాదయాత్రలో ఇచి్చన ప్రతి హామీని సీఎం నెరవేర్చారని చెప్పారు. రాష్ట్రంలో 974 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్నా, హార్బర్లు లేక మత్స్యకారులు వలస వెళ్లే పరిస్థితిని సీఎం పూర్తిగా మార్చేస్తున్నారన్నారు. విశాఖపట్నం, కాకినాడ వంటి ప్రాంతాలకు సమానంగా భవిష్యత్‌లో ఇక్కడ తీరం అభివృద్ధి చెందుతుందన్నారు. నెల్లూరులో హార్బర్ నిర్మాణం చివరి దశలో ఉందని, బాపట్ల, మచిలీపట్నం, రామాయపట్నం వంటి ప్రాంతాల్లో నిర్మాణాలు జరగుతున్నాయని తెలిపారు. అనకాపల్లి వద్ద మరో హార్బర్ నిర్మాణంతో పాటు మంచినీళ్లపేట వద్ద ఫిష్ ల్యాండింగ్ సెంటర్‌ను హార్బర్‌గా తీర్చిదిద్దనున్నట్లు తెలిపారు. విశాఖపట్నం పరిపాలన రాజధాని అయితే మరింత అభివృద్ధి సాధ్యమవుతుందని చెప్పారు. మే 3న భోగాపురం గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టుకు సీఎం శంకుస్థాపన చేయనున్నట్లు వివరించారు. ఉత్తరాంధ్ర భవిష్యత్‌లో పూర్తి స్థాయి ప్రగతి సాధిస్తుందని అన్నారు. పవన్ కల్యాణ్ వంటి వారు అప్పుడప్పుడూ కనిపిస్తూ మత్స్యకారుల కోసం మాట్లాడుతుంటారని, అలాంటి పార్ట్‌టైమ్ నాయకులను నమ్మే పరిస్థితి లేదన్నారు. -
‘పిల్’లతో కాలహరణం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: ప్రజా ప్రయోజన వ్యాజ్యా (పిల్)ల వల్ల వాస్తవ కేసుల నుంచి కోర్టు దృష్టి మళ్లుతోందని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ వ్యాఖ్యానించారు. సోమవారం కర్ణాటకలోని కర్వార్ పోర్టు విస్తరణకు పర్యావరణ అనుమతులపై పెండింగ్‌లో ఉన్న కేసులో జస్టిస్ ఎన్వీ రమణ ఈ మేరకు వ్యాఖ్యానించారు. పిల్స్ కోర్టు సమయం తీసుకోకుంటే వాస్తవ కేసులకు సమయం కేటాయించొచ్చని జస్టిస్ ఎన్వీ రమణ అభిప్రాయపడ్డారు. రాష్ట్రాల బోర్డులు, సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ, ఎన్ఐఓఎస్లు ఈ ఏడాది నిర్వహించే 10, 12 తరగతుల పరీక్షలను భౌతికంగా నిర్వహించరాదంటూ హక్కుల కార్యకర్త శ్రీవాస్తవ దాఖలు చేసిన రిట్ పిటిషన్ విచారణకు సుప్రీంకోర్టు అనుమతించింది. జస్టిస్ ఏఎం ఖని్వల్కర్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ విచారిస్తుందని సీజేఐ పేర్కొన్నారు. -
సపోర్టు లేదాయె..!
అమ్మాయి పెళ్లికి భూమి విక్రయిద్దామంటే వీలు పడదు. కొడుకు చదువుకు కాసింత స్థలాన్ని కుదవ పెట్టడానికీ కుదరదు. సొంత భూమే అయినా క్రయవిక్రయాలకు హక్కు లేదు. భావనపాడు ప్రతిపాదిత పోర్టు పరిధిలోని పలు గ్రామాల్లో నెలకొన్న పరిస్థితులివి. వంశపారంపర్య జాగాలను కూడా విక్రయించలేని స్థితికి సర్కారు తమను దిగజార్చిందని మత్స్యకారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హక్కులను హరించేసి వెక్కిరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భూ సేకరణ అంశంలో చేయాల్సిన సవరణలు ఇంకా చేయకుండా తాత్సారం చేస్తూ చోద్యం చూస్తోందని ఆరోపిస్తున్నారు. టెక్కలి: సంతబొమ్మాళి మండలం భావనపాడు తీరంలో తలపెట్టిన పోర్టు నిర్మాణంలో మత్స్యకారులకు ప్రభుత్వం సపోర్టు ఇవ్వడం లేదు. వీరికి సంబంధించి ఎలాంటి స్పష్టమైన హామీలు కానరావడం లేదు. పోర్టు నిర్మాణం కోసం భూ సేకరణ నోటిఫికేషన్ జారీ చేసిమూడేళ్లవుతోంది. రెండు పర్యాయాలు పోర్టు అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో భా వనపాడు తీరాన్ని పరిశీలించారు తప్ప పోర్టు వల్ల భూములు కోల్పోతున్న బాధితులకు మా త్రం భరోసా కలిగించే విధంగా స్పష్టమైన హామీలు ఇవ్వలేకపోతున్నారు. మొదట 4708 ఎకరాల్లో భూ సేకరణకు జారీ చేసిన నోటిఫికేషన్ తర్వాత 2050 ఎకరాలకు కుదించారు. అయితే నోటిఫికేషన్లో మిగులు భూములను తొలగించకపోవడంతో పోర్టుకు అవసరం లేని మిగులు భూముల క్రయవిక్రయాలకు ఆటంకా లు ఎదురవుతున్నాయి. మొదటి నోటిఫికేషన్ భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం కోసం 2015 ఆగష్టు 28న సుమారు 4708 ఎకరాల భూ సేకరణ కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఇందులో భావనపాడు, మర్రి పాడు, దేవునల్తాడ, పొల్లాడ, సూర్యమణిపురం, కొమరల్తాడ తదితర గ్రామాలను చేర్చారు. అప్పట్లో భూ సేకరణ కోసం అధికారులు గ్రా మాల్‌లోకి వెళ్లగా ప్రభావిత గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రావడంతో ఆ తర్వాత 2274 ఎకరాల భూసేకరణకు సిద్ధమయ్యారు. అయినా వ్యతిరేకత తగ్గలేదు. చివరగా భావనపాడు, కొమరల్తాడ, తామాడపేట, దేవునల్తాడ, సీతా నగరం గ్రామాల్లో మాత్రమే 2050 ఎకరాల్లో భూ సేకరణ చేసేందుకు ప్రభుత్వం తుది ని ర్ణయం తీసుకుంది. అయితే నోటిఫికేషన్లో ముందు పేర్కొన్న భూములను తొలగించలేదు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు పోర్టు నిర్మాణం వల్ల నష్టం వాటిల్లుతుందని తక్షణమే పోర్టు నిర్మాణం నిర్ణయాలు వెనక్కి తీసుకోవాలని భావనపాడు నుంచి 372 మంది, తామాడపేట, కొమరల్తాడ నుంచి 196 మంది, దేవునల్తాడ నుంచి 129 మంది, సీతానగరం నుంచి 16 మంది చొప్పున హైకోర్టును ఆశ్రయించారు. దీంతో కోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో సీతానగరం నుంచి రిట్ పిటిషన్ వేసిన 16 మంది విత్ డ్రా కాగా మిగిలిన గ్రామ ప్రజలు మాత్రం వెనక్కి తగ్గలేదు. హామీలు లేవు భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం విషయంలో బాధితులకు స్పష్టమైన హామీలను పక్కన పెట్టి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో పోర్టు నిర్మాణం కోసం అనుమతులు దక్కించుకున్న అదాని సంస్థతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది. పోర్టు ఆదాయంలో 2.3 శాతం ఆ దాయం రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చేందుకు అదాని సంస్థ అంగీకరించడంతో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. హడావుడేనా..? భావనపాడు తీరంలో పోర్టు నిర్మాణం విషయమై పోర్టు అధికారులు రెండు పర్యాయాలు భావనపాడు గ్రామాన్ని పరిశీలించారు. రెండు రోజుల కిందట పోర్టు డైరెక్టర్ ప్రవీణ్‌కుమార్‌తో పాటు టెక్కలి ఆర్డీఓ ఎం.వెంకటేశ్వరరావు భావనపాడు గ్రామానికి వెళ్లగా అక్కడ మత్స్యకారులు అధికారులపై ప్రశ్నలు వర్షం కురిపించారు. పోర్టుకు అవసరం లేని భూములు నోటిఫికేషన్ ఆధీనంలో ఉండడం వల్ల వివిధ అవసరాలకు భూముల క్రయవిక్రయాలు జరగడం లేదని అంతే కాకుండా స్పష్టమైన హామీలు ఇవ్వకుండా హడావుడి చేస్తున్నారని మత్స్యకారులు అధికారుల వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లు నెరవేర్చకపోతే కోర్టులో వేసిన కేసులను ఉపసంహరించబోమని అంతే కాకుండా పోర్టు నిర్మాణాన్ని అడ్డుకుంటామని స్థానికులంటున్నారు. -
భావనపాడు బాధితుడు మృతి
శ్రీకాకుళం: భావనపాడులో నిర్మించనున్న పోర్టు నిర్మాణం వల్ల తన బోటు, వలలు కోల్పోతున్నానని మనస్తాపానికి గురై అన్న పానియాలు మానేసిన వ్యక్తి మృతిచెందాడు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా భావనపాడులో ఆదివారం జరిగింది. వివరాలు.. గ్రామానికి చెందిన బై తులసీరాం అనే వ్యక్తి అప్పు చేసి ఒక మెకనైజ్డ్ బోటు, వలలు కొన్నాడు. పోర్టు నిర్మాణంతో వీటితో పనిలేకుండా పోతుందని.. వాటి కోసం చేసిన అప్పు తీర్చే దారికానరాకపోవడంతో.. మూడురోజులుగా అన్నపానియాలు మానేసాడు దీంతో ఈ రోజు మృతిచెందాడు. -
చావనైనా చస్తాం.. పోర్టుకు భూములివ్వం
-
చావనైనా చస్తాం.. పోర్టుకు భూములివ్వం
- భావనపాడులో బాధితుల సమావేశం సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: శ్రీకాకుళం జిల్లాలోని సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లోని 8 పంచాయతీల పరిధిలో పోర్టు నిర్మాణానికి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయడంతో పోర్టు నిర్మాణ వ్యతిరేక ఉద్యమ కమిటీ పోరాటాలకు సిద్ధమైంది. చావనైనా చస్తాం గానీ పోర్టు నిర్మాణానికి భూములిచ్చేది లేదని ఆయా గ్రామాల ప్రజలు తెగేసి చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు భూదాహానికి అడ్డుకట్ట వేస్తామని, స్వచ్ఛమైన గాలి, నీరు ఉన్న ప్రాంతాల్లో పేదల కడుపుకొట్టి భూములు లాక్కుంటే ఉద్యమం తప్పదని హెచ్చరించారు. శనివారం వైఎస్సార్సీపీ బాధితులకు పూర్తిస్థాయిలో మద్దతు ప్రకటించడం ఉద్యమానికి మరింత బలం చేకూరినట్టయింది. గ్రామాల్లోకి వచ్చారో ఖబడ్దార్: ఇకపై అధికారులు, నాయకులు గ్రామాల్లోకి వస్తే తరిమి కొట్టాలని ఉద్యమ కమిటీ నిర్ణయించింది. ఈమేరకు శనివారం భావనపాడులో గ్రామస్తులంతా సమావేశమయ్యారు. సోమవారం నుంచి ఇంటింటి నుంచి దరఖాస్తులు సిద్ధం చేసి జిల్లా కలెక్టర్ సహా, ఆర్డీవో, ఎమ్మార్వోలకు విజ్ఞాపనలివ్వాలని తీర్మానించారు. ఈ కార్యక్రమానికి వైఎస్సార్సీపీ, సీపీఎం నాయకులు హాజరై మద్దతు ప్రకటించడంతో గ్రామస్తుల్లో మరింత బలం చేకూరింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో వైఎస్సార్సీపీ హైపవర్కమిటీ సభ్యుడు తమ్మినేని సీతారాం మాట్లాడుతూ ... విపక్ష నేత జగన్మోహన్రెడ్డి ఇక్కడకు వచ్చి మత్స్యకారులకు జరుగుతున్న అన్యాయంపై పోరాడతారని హామీ ఇచ్చారు. పార్టీ బీసీసెల్ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్ మాట్లాడుతూ మత్స్యకారుల్ని ఆదుకున్నది వైఎస్సేననీ, ప్రస్తుత పోరాటాలకు వైఎస్సార్సీపీ సంపూర్ణ మద్దతుంటుందని హామీ ఇచ్చారు. -
భూటకపు సర్వేలు ఆపండి
పూండి(వజ్రపుకొత్తూరు): భావనపాడు తీరంలో ప్రతిపాదిత ఓడరేవు నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న భూటకపు సర్వేలు ఆపాలని అఖిల భారత రైతు కూలీ సంఘం జిల్లా అధ్యక్షురాలు పైల చంద్రమ్మ డిమాండ్ చేశారు. శనివారం ఆమె తన బృందంతో కలిసి భావనపాడు గ్రామంలో రైతులతో సమావేశం ఏర్పాటు చేశారు. అనంతరం పూండిలో విలేకరులతో మాట్లాడారు. పోర్టు నిర్మాణం కోసం సంతబొమ్మాళి, వజ్రపుకొత్తూరు మండలాల్లోని తొమ్మిది గ్రామాల పరిధిలో పది వేల ఎకరాలకు పైబడి భూములు సేకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు విరమించు కోవాలని, లేకుంటే ప్రజా పోరాటాలు ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. దేవునల్తాడ, భావనపాడు, మర్రిపాడు, పొల్లాడ, కొమరల్తాడ ప్రాంతాల్లో రైతులు పోర్టుకు తమ భూములు ఇచ్చేందుకు తీవ్రంగా వ్యతిరేకించి ఉద్యమ బాటపడుతున్న విషయాన్ని ప్రభుత్వం, జిల్లా ఉన్నతాధికారులు గుర్తించాలన్నారు. రైతులు, మత్స్యకారులు పోర్టు, ఫిషింగ్ హార్బర్లను వ్యతిరేకిస్తున్న విషయాన్ని పాలకులు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేను మారాను, ప్రజల అభిప్రాయం లేకుండా ఏ పని ముందుకు తీసుకుపోను అంటూనే ప్రజాభిప్రాయ సేకరణ లేకుండా భూముల సేకరణకు గజిట్ నోటిఫికేషన్ విడుదల చేశారంటూ మండిపడ్డారు. పంచాయతీల తీర్మాణాలు లేకుండా భూ సేకరణ చేపట్టే అధికారం ప్రభుత్వానికి లేదన్నారు. కార్యక్రమంలో న్యూ డెమోక్రసీ జిల్లా సీనియర్ నాయకురాలు పోతనపల్లి జయమ్మ, వంకల పాపయ్య పాల్గొన్నారు. -
పోర్టు ఆశలపై నీళ్లు
మచిలీపట్నం : ప్రభుత్వం గురువారం ప్రవేశపెట్టిన బడ్జెట్లో పోర్టు నిర్మాణ ఆశలపై నీళ్లు చల్లింది. పోర్టు నిర్మాణానికి కేవలం రూ.30 లక్షలు కేటాయించటంపై జిల్లా వాసులు మండిపడుతున్నారు. అధికారం చేపట్టిన ఆరు నెలల్లో పోర్టు పనులు ప్రారంభిస్తామని మంత్రులు హామీలు ఇస్తూ వస్తున్నారు. ఇప్పటికి తొమ్మిది నెలలు పూర్తయినా పనుల ప్రారంభానికి సంబంధించి కసరత్తు జరగటం లేదు. బడ్జెట్లో మాత్రం ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో మచిలీపట్నం పోర్టును అభివృద్ధి చేస్తామనే ఒకే ఒక్క మాటతో ఈ అంశాన్ని పక్కన పెట్టడం గమనార్హం. పోర్టును ప్రైవేటు సంస్థ నిర్మించినప్పటికీ ప్రభుత్వ పరంగా పోర్టు వరకు నిర్మించే రోడ్లు, డ్రెడ్జింగ్ తదితర పనులకు నిధులు కేటాయించకుండా మిన్నకుండిపోయింది. పోర్టు నిర్మించే ప్రాంతంలో 2428 ఎకరాల ప్రభుత్వ భూమి, 411 ఎకరాల అసైన్డ్ భూమి ఉందని ఇటీవల నిర్వహించిన సర్వేలో అధికారులు తేల్చారు. ఈ భూమి సేకరణ ప్రక్రియ పూర్తిస్థాయిలో జరగాలంటే కనీసంగా ఎనిమిది నెలల సమయం పట్టే అవకాశం ఉంది. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు పూర్తయినా బందరు పోర్టు అభివృద్ధికి సంబంధించి ఒక్క అడుగు ముందుకు పడకపోగా బడ్జెట్లోనూ డ్రెడ్జింగ్ తదితర పనులకు ప్రభుత్వపరంగా నిధుల విడుదలపై స్పష్టమైన ప్రకటన చేయకపోవటంతో పోర్టు నిర్మాణ పనులు ఎప్పటికి ప్రారంభమవుతాయనేది ప్రశ్నార్థకంగా మారింది. బందరు మండలం పెదపట్నం వద్ద మెరైన్ అకాడమీని ఏర్పాటు చేస్తామని బడ్జెట్లో ప్రస్తావించారు. 300 ఎకరాల్లో ఈ అకాడమీ నిర్మాణం జరుగుతుందని తెలిపారు. అయితే మెరైన్ అకాడమీకి ప్రభుత్వ పరంగా భూమిని కేటాయిస్తే అకాడమీ నిర్మాణానికి సంబంధించిన వ్యయం మొత్తం కేంద్రమే భరిస్తుంది. ఈ అకాడమీ నిర్మాణానికి రూ.500 కోట్లు ఖర్చు అవుతుందని అప్పట్లో పోలీసు విభాగానికి చెందిన ఉన్నతాధికారులు ప్రకటించారు. -
కాకినాడలో 2500 కోట్లతో జీఎంఆర్ ఓడరేవు
హైదరాబాద్: పోర్టు నిర్మాణ రంగంలోకి తొలిసారి జీఎంఆర్ సంస్థ అడుగుపెడుతోంది. కాకినాడ స్పెషల్ ఎకనామిక్ జోన్ (కేసెజ్) బ్యాక్ యార్డ్ లో భారీ పోర్టు నిర్మాణానికి జీఎంఆర్ ప్రాథమిక అధ్యయనం పూర్తి చేసింది. ఆధునికి గ్రీన్ ఫీల్డ్ పోర్టును డెవలప్ చేయడానికి జీఎంఆర్ సిద్దమవుతున్నట్టు తెలిసింది. కార్గో, కంటైనర్ కార్డో, ఎగుమతి, దిగుమతి ఆపరేషన్ల లాంటి సదుపాయాలు కల్పించే విధంగా జీఎంఆర్ ప్రణాళికను సిద్దం చేసుకున్నట్టు సమాచారం. కాకినాడ సెజ్ కు కెటాయించిన 10,500 ఎకరాల్లో పోర్టు కోసం 2100 ఎకరాలను ఎంపిక చేసుకున్నట్టు తెలిసింది. పోర్ట్ నిర్మాణ ప్రాజెక్ట్ వ్యయం 2500 కోట్లుగా అంచనా వేస్తున్నారు. తూర్పు తీరంలో అతిపెద్ద, అధునిక కార్గో హబ్ గా తీర్చిదిద్దాలనే ప్రణాళికతో జీఎంఆర్ సిద్దమైంది. ఆరునెలల్లో పబ్లిక్ హియరింగ్ కు వెళ్తామని.. ఆతర్వాత మూడేళ్లలో ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని జీఎంఆర్ అధికారులు తెలిపారు.