PPP system
-
పీపీపీ విధానంలోనే ఆస్పత్రులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నియోజకవర్గ స్థాయిలో పీపీపీ విధానంలో ఆస్పత్రులను ఏర్పాటు చేయనున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. ఆస్పత్రికి స్థలాన్ని ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. ప్రభుత్వ, పీపీపీ ఆస్పత్రులను ఒకే గొడుగు కిందకు తెస్తామని చెప్పారు. వైద్య, ఆరోగ్య శాఖపై సోమవారం సచివాలయంలో జరిగిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్య శాఖలో 2014–19 మధ్య అమలు చేసిన కార్యక్రమాలు, పథకాలను పునరుద్ధరించాలని అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ యాప్‌ను రూపొందించి హెల్త్ కార్డు ద్వారా ప్రైవేట్ ఆస్పత్రిలో చేరే వ్యక్తుల వివరాలు, అక్కడ రోగికి అందించే వైద్య సేవలు, పరికరాలు, మందుల వివరాలు కూడా ఉండాలన్నారు. దీని ద్వారా ఆస్పత్రి పనితీరు తెలుస్తుందన్నారు. మండలాల వారీగా కిడ్నీ బాధితుల వివరాలు సేకరించాలని, సమస్యకు కారణాలు, వ్యాధి ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో నీటిపై అధ్యయనం చేయాలని చెప్పారు. ఉద్దానంలో పూర్తిస్థాయి అధ్యయనంతోనే సమస్యను గుర్తించగలిగామన్నారు.ఆసుపత్రులలో శిశువుల అపహరణ కేసులు అరికట్టాలని చెప్పారు. తల్లులకు మళ్లీ ఎన్టీఆర్ బేబీ కిట్స్ అందించాలన్నారు. సదరం నకిలీ ధ్రువపత్రాల జారీపై చర్యలు తీసుకోవాలన్నారు. ఏజెన్సీల్లో డోలీ మోతలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. ఏడాదికి రూ.10 వేల కోట్ల టర్నోవర్ అయ్యే మెడ్‌టెక్ జోన్ పట్ల గత పాలకులు నిర్లక్ష్యం వహించారని విమర్శించారు. సమీక్షలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్, సీఎస్ నీరబ్‌కుమార్, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. 15 శాతం వృద్ధి రేటే లక్ష్యం దేశంలోని టాప్–5 రాష్ట్రాలతో పోటీ పడేలా, 15 శాతం వృద్ధి రేటు సాధన లక్ష్యంగా నూతన పారిశ్రామిక విధానం ఉండాలని, ఇందులో నీతి ఆయోగ్ ఆలోచనలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని సీఎం చంద్రబాబు చెప్పారు. నూతన పారిశ్రామికాభివృద్ధి విధానం 2024–29 ముసాయిదాను పరిశ్రమల శాఖ మంత్రి టీజీ భరత్, అధికారులు సోమవారం రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ నూతన పాలసీలో పిపిపి, పి–4 విధానాలను పొందుపర్చాలని చెప్పారు. పరిశ్రమలకు అనుమతులు వేగంగా ఇవ్వాలన్నారు. ఈనెల 16న పారిశ్రామకవేత్తలతో సమావేశమవుతామని చెప్పారు. ఆ తర్వాత ఈనెల 23న మరోసారి సమావేశమై విధానంపై చర్చిద్దామని చెప్పారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి డా.ఎన్.యువరాజ్, సీఎం అదనపు కార్యదర్శి కార్తికేయ మిశ్రా, పరిశ్రమల శాఖ కమిషనర్ సీహెచ్ శ్రీధర్, ఏపీఐఐసీ ఎండీ అభిíÙక్త్ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
మారని చంద్రం.. మళ్లీ ప్రైవేట్ మంత్రం..!
చంద్రబాబు ప్రభుత్వం అంటేనే అన్నింటా వసూళ్లకు మారుపేరు. ఎవరికైనా సరే.. ఏదైనా సరే.. ఉచితంగా ఇవ్వడం అనేది ఆయన డిక్షనరీలోనే లేదు. గతంలో యూజర్ చార్జీల బాదుడుతో పేదలను పీల్చి పిప్పి చేసిన ఆయన, ఇప్పుడు అంతకు మించి అంటూ అన్నింటా ‘ప్రైవేట్’ పాట పాడుతున్నారు. ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో ఓ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉంటే ప్రజలకు అత్యుత్తమ వైద్య సేవలు అందడంతో పాటు విద్యార్థులకు అదనంగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయన్న గత ప్రభుత్వ మంచి ఉద్దేశాన్ని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం నీరుగారుస్తోంది. కొత్త మెడికల్ కాలేజీలను పీపీపీ పద్ధతిలో నిర్వహిస్తామని సెలవిచ్చింది. దీంతో ఆ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్ల ఫీజు ఆకాశాన్నంటడం ఖాయం. కష్టపడి కన్వీనర్ సీటు తెచ్చుకోగలిగిన పేద పిల్లలు అంత ఫీజు కట్టలేక వైద్య విద్యకు దూరం కావాల్సిన దుస్థితి. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడిపోయిందన్న చందంగా పరిస్థితి మారిపోయింది.2014-19 బాబు పాలనలో..20 లక్షలకు పైనే జనాభా ఉన్న ఉమ్మడి విజయనగరం జిల్లాలో గతంలో ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఒక్కటీ లేదు. మెరుగైన వైద్యం కోసం విశాఖ వెళ్లాల్సిందే. జిల్లాకు ఒక ప్రభుత్వ వైద్య కళాశాల మంజూరు చేయాలని 2014–19 మధ్య నాటి టీడీపీ ప్రభుత్వాన్ని అసెంబ్లీలో వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధి కోరగా.. ‘రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదు. ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేయలేం. అందుకు రూ.350 కోట్లు కావాలి. నిర్వహణకు ఏటా రూ.30 కోట్లు ఖర్చు చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ వైద్య కళాశాల సాధ్యం కాదు. ప్రైవేట్ వైద్య కళాశాలకైతే అనుమతి ఇస్తాం’ అని నాటి రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది.2019-24 వైఎస్ జగన్ హయాంలో..‘‘ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి ఒక ప్రభుత్వ వైద్య కళాశాలను ఏర్పాటు చేస్తాం. పేద ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేస్తాం’ అని 2019 ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలో 17 కొత్త వైద్య కళాశాలల ఏర్పాటుకు వైఎస్ జగన్ శ్రీకారం చుట్టారు. విజయనగరం జిల్లాకు రూ. 500 కోట్లతో ప్రభుత్వ వైద్య కళాశాలను మంజూరు చేశారు. శరవేగంగా నిర్మాణం చేపట్టి 2023–24 విద్యా సంవత్సరంలో 150 ఎంబీబీఎస్ సీట్లతో వైద్య కళాశాలను ప్రారంభించారు. ఇప్పుడు బోధనాస్పత్రిలో రూపాయి ఖర్చు లేకుండా ప్రజలకు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయి. నేడు మళ్లీ బాబు రాకతో..కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టబోతున్నారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వ అధీనంలో ఉన్న కళాశాల, బోధనాస్పత్రి ప్రైవేట్ వ్యక్తుల అజమాయిషీలోకి వెళ్లనున్నాయి. ప్రైవేట్ కళాశాలల తరహాలో ఎంబీబీఎస్ కోర్సుల ఫీజుల్లో పెరుగుదల చోటు చేసుకుంటుంది. ఇక బోధనాస్పత్రుల్లో నిర్దేశించిన చార్జీలు చెల్లిస్తేనే ప్రజలకు వైద్యం అందించే దుస్థితి దాపురించనుంది. సాక్షి, అమరావతి: వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నెలకొల్పిన కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను గుజరాత్ తరహాలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్య (పీపీపీ) విధానంలో నిర్వహించాలని సీఎం చంద్రబాబు నిర్ణయించడంపై సర్వత్రా తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలను చేరువ చేయడంతో పాటు పేద, మధ్య తరగతి వర్గాల వైద్య విద్య కలను సాకారం చేయాలనే ఉన్నత ఆశయంతో చరిత్రలో తొలిసారిగా ప్రభుత్వ రంగంలో ఏకంగా 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టిన విషయం తెలిసిందే. వాటిని ఇప్పుడు పీపీపీ పేరిట ప్రైవేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో పెట్టి పేద, మధ్య తరగతి ప్రజల వైద్యం, విద్యార్థుల విద్య కలలను కాలరాసేందుకు కూటమి సర్కారు సిద్ధమైంది.జగన్ మోడల్ ఇలా..⇒ పేదలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు ⇒ మెడికల్ సీట్లు మన రాష్టంలోనే ఉంటాయి... ఫీజులు తక్కువ ⇒ పోటీతత్వం పెరిగి ప్రైవేట్‌లో కూడా రేట్లు తగ్గుతాయి. ⇒ ప్రభుత్వమే కాలేజీలను నిర్మించి నిర్వహిస్తుంది. ⇒ మెరుగైన నిర్వహణకు కొన్ని సీట్లు మాత్రమే సెల్ఫ్ ఫైనాన్స్ విధానంలో ఉంటాయి. ⇒ అవి కాలేజీ అభివృద్ధికే ఉపయోగిస్తారు. ⇒ ప్రపంచ స్థాయి ప్రమాణాలతో మెడికల్ కాలేజీలను నిర్వహిస్తారు. గుజరాత్ మోడల్ ఇదీ..⇒ భూమి, ఆస్పత్రిని ప్రభుత్వమే సమకూరుస్తుంది. ⇒ మెడికల్ కాలేజీని మాత్రమే కడతారు ⇒ మొదటి ఏడాదే ఆదాయం రూ.50 కోట్లతో మొదలవుతుంది. ⇒ ఏటా ఫీజులు పెంచుకుంటూ వెళ్లి 30 ఏళ్ల తరువాత వదిలించుకుని వెళ్లిపోతారు.ఒకేసారి 17 కళాశాలలు ఓ చరిత్ర2019లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఒకేసారి 17 కళాశాలలు నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. వీటిలో విజయనగరం, ఏలూరు, రాజమహేంద్రవరం, మచిలీపట్నం, నంద్యాల వైద్య కళాశాలలను గతేడాది ప్రారంభించి ఒకే ఏడాది అదనంగా 750 ఎంబీబీఎస్ సీట్లలో అడ్మిషన్లు కల్పిచారు. 1923లో రాష్ట్రంలో మొదటిసారిగా ఆంధ్రా మెడికల్ కాలేజీ ఏర్పాటైంది. అప్పటి నుంచి 2019 వరకు ప్రభుత్వ రంగంలో కేవలం 11 కళాశాలలు మాత్రమే ఉన్నాయి. అయితే ఒకే ఏడాది ఐదు ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రారంభించి వైద్య విద్యలో సరికొత్త రికార్డును వైఎస్ జగన్ నెలకొల్పారు. ఈ విద్యా సంవత్సరం (2024–25)లో మార్కాపురం, మదనపల్లె, పాడేరు, పులివెందుల, ఆదోని కళాశాలలను ప్రారంభించాల్సి ఉండగా కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. మిగిలిన ఏడు వైద్య కళాశాలలను వచ్చే 2025–26 విద్యా సంవత్సరంలో ప్రారంభించాలని ప్రణాళిక రూపొందించగా ఈలోగా పీపీపీ విధానాన్ని ప్రభుత్వం తెరమీదకు తెచ్చింది. నిజమైన అమ్మకం అంటే ఇదే! గతేడాది మెరుగైన నిర్వహణ కోసం ఐదు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని ప్రవేశపెట్టినప్పుడు గత ప్రభుత్వంపై నారా లోకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. వీరికి వంతపాడే ఈనాడు ‘వైద్య విద్యనూ అమ్మేశారు’ ‘వైద్య విద్య వ్యాపారానికి నయా పెత్తందారు జగన్’ అంటూ కట్టుకథలు రాసుకొచ్చింది. అధికారంలోకి వచ్చాక సెల్ఫ్‌ఫైనాన్స్ విధానాన్ని రద్దు చేస్తామన్న హామీని కూటమి ప్రభుత్వం గాలికి వదిలేసింది. అంతేకాకుండా కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి విద్యార్థులపై ఫీజుల భారాన్ని మోపడానికి రంగం సిద్ధం చేసింది. తద్వారా ప్రభుత్వ పెద్దల బినామీల జేబులు నింపేందుకు బాటలు పరిచారు.పీపీపీతో వైద్యానికి తూట్లు ఇక సీఎం చంద్రబాబు చెబుతున్న గుజరాత్ పీపీపీ విధానాన్ని పరిశీలిస్తే.. గ్రీన్ ఫీల్డ్ (కొత్తగా బోధనాస్పత్రి, కళాశాలను నెలకొల్పడం), బ్రౌన్ ఫీల్డ్ (అప్పటికే ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి కొత్త వైద్య కళాశాలను నెలకొల్పడం) ఇలా రెండు విధాలుగా పీపీపీ విధానాన్ని అవలంబిస్తున్నారు. గ్రీన్ ఫీల్డ్ విధానంలో కళాశాల, ఆస్పత్రి నెలకొల్పడానికి ఎంతో చౌకగా ప్రభుత్వమే భూమిని కేటాయిస్తుంది. ఆ భూమిలో ప్రైవేట్ వ్యక్తులు కళాశాల, బోధనాస్పత్రిని నిర్మిస్తారు. కొన్నేళ్ల పాటు వారి ఆధ్వర్యంలోనే ఆస్పత్రి, కళాశాల నడుస్తుంది. బ్రౌన్ ఫీల్డ్ విధానంలో అప్పటికే నడుస్తున్న 300 పడకల ఆస్పత్రిని బోధనాస్పత్రిగా అభివృద్ధి చేసి, ఇచ్చిన భూమిలో కళాశాలను ప్రైవేట్ వారు నిర్మిస్తారు. ఈ రెండు విధానాల్లో కళాశాలల్లో ఫీజులపై నియంత్రణ లేదు. 2023–24 విద్యా సంవత్సరం ఫీజులను ఒకసారి గమనిస్తే ఆ విషయం స్పష్టం అవుతుంది. అక్కడ ప్రభుత్వ పరిధిలో నడిచే కళాశాలల్లో కన్వీనర్ కోటా (ప్రభుత్వ కోటా) సీట్లకు రూ.25 వేలు ఫీజు ఉంది. అదే పీపీపీ కళాశాలల్లో కన్వీనర్ కోటాకు రూ.5.50 లక్షలు, రూ.6.65 లక్షలు వరకూ ఉన్నాయి. యాజమాన్య (బీ కేటగిరి) కోటాకు రూ.17 లక్షల నుంచి రూ.18 లక్షల వరకూ ఫీజులున్నాయి. ప్రస్తుతం మన రాష్ట్రంలో గత ఏడాది ప్రారంభించిన ఐదు కొత్త వైద్య కళాశాలల్లో కన్వీనర్ కోటాకు కేవలం రూ.15 వేలు మాత్రమే ఫీజు ఉంది. ఇక గ్రీన్ ఫీల్డ్‌లో కళాశాలలకు అనుబంధంగా ఉండే ప్రభుత్వ బోధనాస్పత్రుల్లో వైద్య సేవలకు ప్రజలు డబ్బు చెల్లించాల్సి ఉంటుంది. ఈ తరహా విధానాన్ని రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదల ప్రయోజనాలకు తూట్లు పొడిచేందుకు కూటమి సర్కారు నడుం బిగించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పేదల ప్రయోజనాలే లక్ష్యంగా పేదల ఆరోగ్య ప్రయోజనాలే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ఏకంగా రూ.8 వేల కోట్లకు పైగా వ్యయంతో 17 కొత్త వైద్య కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టింది. ఏఎస్ఆర్, పార్వతీపురం మన్యం లాంటి గిరిజన ప్రాంతాలు, పల్నాడు, అన్నమయ్య, సత్యసాయి లాంటి వెనుకబడిన జిల్లాల్లో ఈ కళాశాలలకు అనుబంధంగా ఉండే బోధనాస్పత్రుల ద్వారా ఆ ప్రాంత ప్రజలకు చేరువలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుతాయి. పల్నాడు జిల్లా మాచర్ల నియోజకవర్గం వెల్దుర్తి లాంటి మారుమూల గ్రామాల ప్రజలు సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం 150 కి.మీ ప్రయాణించి గుంటూరు వెళ్లాల్సి వస్తోంది. అదే పిడుగురాళ్లలో సూపర్ స్పెషాలిటీ బోధనాస్పత్రి ఏర్పాటుతో పల్నాడు ప్రజలకు చేరువలో వైద్య చికిత్సలు లభిస్తాయి. ఇలా ప్రతి కొత్త జిల్లాలో ఒక బోధనాస్పత్రిని అందుబాటులోకి వచ్చి సూపర్ స్పెషాలిటీ వైద్యం కోసం ప్రజలకు వ్యయప్రయాసలు లేకుండా చేయాలని వైఎస్ జగన్ భావించారు. ఇప్పటి వరకూ ఆయా ప్రాంతాల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలో సూపర్స్సెషాలిటీ ఆస్పత్రులు లేకపోవడంతో ప్రైవేట్ వ్యక్తులు అరకొర వసతులతో నడిపే ఆస్పత్రుల్లో చేసిందే వైద్యం అనే పరిస్థితులున్నాయి. ప్రభుత్వ బోధనాస్పత్రులు అందుబాటులోకి వస్తే ప్రజలకు ఏ చీకూ చింతా లేకుండా పూర్తి ఉచితంగా గుండె, కిడ్నీ, కాలేయం సంబంధిత, క్యాన్సర్ లాంటి పెద్ద జబ్బులకు చికిత్సలు లభిస్తాయి. అంతేకాకుండా 17 కొత్త కళాశాలల ద్వారా 2,550 ఎంబీబీఎస్ సీట్లు అదనంగా సమకూర్చి మన విద్యార్థులు వైద్య విద్య కోసం రష్యా, ఉక్రెయిన్ లాంటి దేశాలు, ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా చేయాలని వైఎస్ జగన్ యోచించారు. మన విద్యార్థులకు తాముంటున్న ప్రాంతాల్లో తల్లిదండ్రుల కళ్లెదుటే వైద్య విద్యను అభ్యసించే అవకాశాలు కల్పించాలనుకున్నారు. ప్రపంచాన్ని గడగడలాడించిన కోవిడ్, లాక్డౌన్ లాంటి ప్రతికూల పరిస్థితులను అధిగమించి కొత్త వైద్య కళాశాలల విషయంలో గత ప్రభుత్వం అడుగులు వేసింది. వైద్య కళాశాలల నిర్మాణానికి నిధుల సమీకరణతో పాటు వైద్య రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఏపీ మెడికల్, ఎడ్యుకేషన్ రీసెర్చ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. తద్వారా కళాశాలల నిర్మాణ భారాన్ని ప్రభుత్వమే భరించి లాభాపేక్ష లేకుండా వాటిని నిర్వహించాలనేది వైఎస్ జగన్ విధానం. తమిళనాడు మోడల్ కావాలిప్రభుత్వాన్ని దోచేసి ప్రైవేట్ వ్యక్తులకు మేలు చేయడం గుజరాత్ మోడల్. అది ప్రజలకు అవసరం లేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు మేలు చేసే తమిళనాడు తరహా 69 శాతం రిజర్వేషన్ మోడల్‌ను ఏపీలో అమలు చేయాలి. సామాన్యులకు వైద్య విద్యను అందుబాటులో లేకుండా చేయడమే చంద్రబాబు విధానం అనే విషయం గత చరిత్రను పరిశీలిస్తే స్పష్టం అవుతుంది. ధనికులకే వైద్య విద్య అందుబాటులో ఉండేలా ఫీజులను ఆయన పాలనలో అమాంతం పెంచారు. 2014–19 మధ్య రూ.2.5 లక్షలుగా ఉన్న ఎంబీబీఎస్ బీ కేటగిరి ఫీజును అమాంతం పెంచారు. రూ.5 లక్షలున్న మెడికల్ పీజీ బీ కేటగిరి ఫీజును రూ.25 లక్షలకు తీసుకుని వెళ్లారు. కొత్త వైద్య కళాశాలల్లో సెల్ఫ్‌ఫైనాన్స్ సీట్లకు సంబంధించిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని చెప్పి మాట తప్పారు. – డాక్టర్ ఆలా వెంకటేశ్వర్లు, గుంటూరు ప్రభుత్వ పరిధిలోనే కొనసాగాలి పీపీపీ విధానంలో గుజరాత్ తరహాలో కొత్త వైద్య కళాశాలలను నిర్వహిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించడంతో ప్రజల్లో అనేక అనుమనాలు రేకెత్తుతున్నాయి. వాటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. ప్రైవేట్ వ్యక్తుల ఆ«దీనంలో కళాశాలలు నడవాలన్నదే గుజరాత్ విధానం అయితే దాన్ని ఇక్కడ అమలు చేయకూడదు. గుజరాత్ తరహా ప్రైవేటీకరణ విధానాలను ఏపీ ప్రజలు ఆహ్వానించరు. ప్రభుత్వ పరిధిలోనే కళాశాలలను నిర్వహించాలి. అప్పుడే పేదలకు మేలు జరుగుతుంది. – సీహెచ్. బాబురావు, సీపీఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు -
కొత్త వాహనంపై 5 శాతం రిబేటు
న్యూఢిల్లీ: స్క్రాపేజీ (తుక్కు) విధానం కింద పాత కార్లను వదిలించుకుని, కొత్త వాహనాలు కొనుగోలు చేసే వారికి 5 శాతం రిబేటు లభిస్తుందని కేంద్ర రహదారి రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ‘ఇలా కొత్త కారు కొనుగోలు చేసే వారికి ఆటోమొబైల్ కంపెనీలు దాదాపు 5 శాతం రిబేటు ఇస్తారు‘ అని ఆయన తెలిపారు. ‘స్క్రాపేజీ విధానంలో నాలుగు అంశాలు ఉన్నాయి. వాటిలో రిబేటు కూడా ఒకటి. దీనితో పాటు కాలుష్యం వెదజిమ్మే పాత వాహనాలపై హరిత పన్ను మొదలైనవి విధించడం, ఫిట్నెస్ టెస్టు, పొల్యూషన్ టెస్టు చేయించుకోవడం తప్పనిసరి చేయడం మొదలైనవి ఉన్నాయి. టెస్టింగ్ కోసం దేశవ్యాప్తంగా ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లు అవసరం. వీటి ఏర్పాటుపై దృష్టి పెడుతున్నాం’ అని మంత్రి చెప్పారు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ఆటోమేటెడ్ ఫిట్నెస్ టెస్ట్ సెంటర్లను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వివరించారు. ఇక స్క్రాపింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడంలో ప్రైవేట్ సంస్థలు, రాష్ట్రాల ప్రభుత్వాలనకు కేంద్రం తగు సహయా సహకారాలు అందిస్తుందని తెలిపారు. టెస్టుల్లో విఫలమైన వాహనాలను నడిపే వారికి భారీ జరిమానాలు విధించడంతో పాటు వాహనాన్ని జప్తు కూడా చేయొచ్చని పేర్కొన్నారు. ఆటోమొబైల్‌కు వరం.. స్క్రాపేజీ విధానం.. ఆటోమొబైల్ రంగానికి వరంగా మారుతుందని గడ్కరీ చెప్పారు. దీనితో అత్యంత లాభసాటి రంగంగా ఆటోమొబైల్ పరిశ్రమ ఎదగగలదని, భారీ స్థాయిలో ఉపాధి కల్పించగలదని పేర్కొన్నారు. ప్రస్తుతం రూ. 4.5 లక్షల కోట్లుగా ఉన్న దేశీ ఆటోమొబైల్ పరిశ్రమ టర్నోవరు.. రాబోయే రోజుల్లో 30 శాతం పైగా వృద్ధి చెందగలదని.. దాదాపు రూ. 10 లక్షల కోట్లకు చేరగలదని గడ్కరీ వివరించారు. టర్నోవరులో రూ.1.45 లక్షల కోట్లుగా ఉన్న ఎగుమతులు.. రూ. 3 లక్షల కోట్లకు చేరగలదన్నారు. స్క్రాపేజీ పాలసీ పూర్తి స్థాయిలో అమల్లోకి వస్తే తుక్కుగా మార్చిన వాహనాల నుంచి.. ఉక్కు, ప్లాస్టిక్, రబ్బరు, అల్యూమినియం వంటి ముడి సరుకు లభ్యత పెరుగుతుందని, దీనితో ఆటోమొబైల్ పరికరాల తయారీ ఖర్చులు 30–40 శాతం దాకా తగ్గగలదని గడ్కరీ చెప్పారు. -
మన స్టేషన్లో రైలు ఆగలేదు..
సాక్షి, అమరావతి: ఈ బడ్జెట్లో ఏపీ మీదుగా వెళ్లే కొత్త రైళ్ల కూతలేవీ వినిపించలేదు. విశాఖ కేంద్రంగా ఏర్పాటైన రైల్వే జోన్‌కు నిధులూ కేటాయించలేదు. ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా ఏపీకి దక్కలేదు. ఇప్పటికే విశాఖపట్టణం, తిరుపతి, గుంటూరు, శ్రీకాకుళం ప్రాంతాలకు ప్రైవేటు రైళ్లను నడిపేందుకు టెండర్లు పిలిచిన సంగతి తెలిసిందే. ఈ తరహా రైళ్లను మరిన్ని ప్రవేశపెట్టనున్నట్టు కేంద్రం బడ్జెట్లో పేర్కొంది. ఈ బడ్జెట్లో రైల్వేలపరంగా ఏపీకి న్యాయం జరుగుతుందని ఆశిస్తే, తీరని అన్యాయమే జరిగిందని రాష్ట్ర ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే పీపీపీ విధానంలో రైల్వేస్టేషన్ల ఆధునికీకరణ, పెండింగ్ ప్రాజెక్టులకు నిధులపై రెండుమూడు రోజుల్లో స్పష్టత వస్తుందని రైల్వేవర్గాలు చెబుతున్నాయి. గతేడాది పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్ల కేటాయింపు గతేడాది (2019 ఫిబ్రవరి) ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఏపీలో పెండింగ్ ప్రాజెక్టులకు రూ.2,442 కోట్లు కేటాయించారు. బడ్జెట్ ప్రసంగంలో కొత్త ప్రాజెక్టు ఏదీ ప్రకటించకున్నా.. ఈ నిధుల్ని ఆ తర్వాత కేటాయించారు. సాధారణంగా పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టాక దక్షిణ మధ్య రైల్వేకు ఎంత కేటాయించారన్న వివరాలపై రైల్వే బోర్డు సమాచారమిస్తుంది. ప్రతిసారీలానే ఈ దఫా బడ్జెట్ ప్రవేశపెట్టిన రెండుమూడు రోజులకు కేటాయింపుల సమాచారాన్ని రైల్వే అధికారులు అధికారికంగా ప్రకటిస్తారు. ఈ ప్రకటనలో.. ఏపీలోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికిగాను అన్ని ప్రాంతాలను కలిపేలా తేజస్ రైళ్లు, రైల్వే వ్యవస్థ ఆధునికీకరణలో భాగంగా ప్రధాన రైల్వేస్టేషన్ల అభివృద్ధికి సంబంధించి వివరాలపై సమాచారం అందుతుందని అధికారులు భావిస్తున్నారు. గతంలో ప్రకటించిన విశాఖ రైల్వేజోన్ పరిపుష్టికి సంబంధించి అంశాలుంటాయని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. -
పేద విద్యార్థులకు ఆన్లైన్ డిగ్రీ
న్యూఢిల్లీ: త్వరలో ప్రారంభించనున్న నూతన విద్యావిధానంలోని పలు అంశాలను నిర్మలా సీతారామన్ వివరించారు. ఉన్నతవిద్యలో నాణ్యతా ప్రమాణాలు పెంచేందుకు, మౌలిక సదుపాయాలు కల్పించేందుకు రుణాలు, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించనున్నారు. పబ్లిక్ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో జాతీయ పోలీస్ యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేస్తారు. వాటిని జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తారు. అలాగే పేదవిద్యార్థులకు ఆన్లైన్లో డిగ్రీ కోర్సులను అందుబాటులోకి తెస్తారు, ఇండియాలో చదివేందుకు ఆసక్తి చూపే ఆసియా–ఆఫ్రికా విద్యార్థులకు ఇండ్–సాట్ పేరిట ప్రత్యేక పరీక్ష నిర్వహించి, ప్రతిభావంతులకు ఉపకార వేతనం కూడా అందించనున్నారు. ముఖ్యాంశాలు.. 1. ఉన్నత విద్య అందుబాటులో లేని బలహీన, ఆర్థికంగా వెనకబడిన తరగతులకు చెందిన విద్యార్థులకు ఆన్లైన్ డిగ్రీ కోర్సులను అందుబాటులోకి రానున్నాయి. దేశంలో టాప్ 100 విద్యాసంస్థల ద్వారా ఈ ప్రోగ్రాం అందుబాటులోకి తీసుకురానున్నట్లు సీతారామన్ ప్రకటించారు. 2. 2020–21 బడ్జెట్‌ను పార్లమెంటులో ప్రవేశ పెట్టిన సందర్భంగా విద్యారంగంలో ప్రవేశపెట్టబోయే నూతన విధానాలపై ఆమె ప్రసంగిం చారు. త్వరలో నూతన విద్యా విధానం తీసుకురాబోతు న్నామని వెల్లడించారు. ఇందుకోసం రూ.99,300 కోట్లు విద్యారంగానికి నిధులు కేటాయించబోతున్నామని ఆమె పేర్కొన్నారు. 3. ప్రత్యేకంగా మరో రూ.3000 కోట్లు నైపుణ్యాభివృద్ధికి వెచ్చిస్తారు. కేంద్ర ఆరోగ్య, నైపుణ్యాభివృద్ధి మరియు ఎంట్రప్రెన్యూర్ షిప్ శాఖల సహకారంతో స్కిల్ ఇండియా మిషన్ కార్యక్రమం చేపడతారు. తద్వారా దేశవ్యాప్తంగా నైపుణ్య వాతావరణం సృష్టించి పౌరుల నైపుణ్యాలను మరింతగా మెరుగుపరుస్తారు. 4. ఉన్నత విద్యాభ్యాసానికి భారత్ కేంద్రంగా మారాలన్న తలంపుతో ‘స్టడీ ఇన్ ఇండియా’ ను రూపొందించారు. ఇందులో భాగంగా ఐఎన్డీ– ఎస్ఏటీ పరీక్షను నిర్వహిస్తారు. ఆసియా, ఆఫ్రికా దేశాలకు చెందిన ప్రతిభ గలిగిన విద్యార్థులకు ఉపకార వేతనాలు అందిస్తారు. 5. కొత్త విద్యా విధానంపై అన్ని రాష్ట్రాల మంత్రులు, ఎంపీలు, ఇతర భాగస్వాములతో చర్చించామని తెలిపారు. దీనిపై రెండు లక్షలకుపైగా సలహాలు, సూచనలు స్వీకరించామన్నారు. త్వరలోనే నూతన విద్యా విధానాన్ని ప్రకటిస్తామని వెల్లడించారు. ఉన్నత విద్యలో నాణ్యతా ప్రమాణాలు, మౌలిక వసతులను అభివృద్ధి చేసేందుకు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆహ్వానించే దిశగా అడుగులు వేస్తున్నట్లు వివరించారు. 6.1 విద్య అనంతరం ఉద్యోగ అవకాశాలు పెరగాలంటూ డిమాండ్లు పెరుగుతున్న దరిమిలా.. 2021 మార్చి నెలనాటికి 150 ప్రతిష్టాత్మక విద్యా సంస్థల్లో అప్రెంటిష్ షిప్‌తో కూడిన డిగ్రీ, డిప్లొమా కోర్సులను కూడా ప్రవేశపెట్టబోతున్నారని ప్రకటించారు. ఇంజినీరింగ్ విద్యార్థులకు దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని సంబంధిత స్థానిక సంస్థల్లో ఏడాదిపాటు అప్రెంటిస్‌షిప్‌కి వీలు కల్పించేందుకు ప్రభుత్వం కొత్త విధానానికి శ్రీకారం చుట్టబోతోందని తెలిపారు. ఆర్థికంగా వెనకబడి, బలహీన వర్గాలకు ఉన్నత విద్య అందించేందుకు డిగ్రీ స్థాయిలో పూర్తిస్థాయి ఆన్లైన్ విద్యా విధానాన్ని అమలు చేయబోతున్నట్లు ప్రకటించారు. 7. జాతీయ పోలీసు యూనివర్సిటీ, జాతీయ ఫోరెన్సిక్ యూనివర్సిటీలను ఏర్పాటు చేయనున్నారు. పబ్లిక్ప్రైవేటు పార్ట్నర్షిప్ (పీపీపీ) విధానంలో చేపట్టే ఈ కార్యక్రమంలో ఈ యూనివర్శిటీలను భ™ జిల్లా మెడికల్ కాలేజీలతో అనసంధానిస్తామని, దీనివల్ల మెరుగైన వైద్యసేవలు లభిస్తాయి. -
హెల్త్‌కు వెల్త్
న్యూఢిల్లీ: ‘‘ఆరోగ్య రంగానికి మా ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తుంది. పౌరుల్ని ఆరోగ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా సాగుతున్నాం’’ అని బడ్జెట్ ప్రసంగం సందర్భంగా చెప్పిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆరోగ్య రంగాన్ని మరింత మెరుగుపరచడానికే ప్రాధాన్యం ఇచ్చారు. ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల ఆధునీకరణపై దృష్టి సారించారు. ఇందుకోసం ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో ఆసుపత్రుల సంఖ్యను పెంచనున్నారు. ఆరోగ్యం అంటే వ్యాధులు సోకితే ఆస్పత్రుల్లో చికిత్స చేయడమే కాదు, ప్రజలు రోగాల బారిన పడకుండా పూర్తి ఫిట్‌గా ఉండేలా చూడడం కూడా. ఇందుకోసం ఈ సారి ప్రజారోగ్యమే అంతిమ లక్ష్యంగా కేంద్రం కొనసాగిస్తున్న ఎన్నో పథకాలను విస్తరించాల్సిన అవసరం గురించి సీతారామన్ వివరించారు. గత బడ్జెట్‌తో పోల్చి చూస్తే ఆరోగ్య రంగ నిధుల్ని 8శాతం పెంచారు. ఆయుష్మాన్ భారత్ విస్తరణ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కలల పథకం ఆయుష్మాన్ భారత్–ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీ–పీఎంజేఏవై) విస్తరించడానికి కేంద్రం ప్రణాళికలు సిద్ధం చేసింది. మెరుగైన చికిత్స కోసం ప్రభుత్వ, ప్రైవేటు (పీపీపీ) భాగస్వామ్యంతో ఆయుష్మాన్ భారత్ పథకం కింద మరిన్ని ఆస్పత్రులను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ఆస్పత్రుల ఏర్పాటు ప్రైవేటు వ్యక్తులకి లాభదాయం కాకపోతే వయబిలిటీ గ్యాప్ కింద ప్రభుత్వమే నిధుల్ని సమకూరుస్తుంది. దీని కోసం దేశవ్యాప్తంగా 112 జిల్లాలను ఎంపిక చేస్తారు. ఇప్పటికే ఆయుష్మాన్ భారత్ పరిధిలోకి వచ్చే ఆస్పత్రులు లేని చోట కొత్త ఆస్పత్రుల్ని ఏర్పాటు చేస్తారు. తద్వారా యువతకు ఎన్నో కొత్త ఉద్యోగాల కల్పన జరుగుతుందని మంత్రి చెప్పారు. ఆయుష్మాన్ భారత్‌కి గత బడ్జెట్లో రూ.6,400 కోట్లు కేటాయిస్తే, ఈ సారీ అంతే మొత్తాన్ని కేటాయించారు. 2018లో ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. భారత్ జనాభాలో దాదాపుగా 40శాతం మందికి లబ్ధి చేకూరేలా, నిరుపేద కుటుంబాలకు ఏడాదికి రూ.5 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ కవరేజీ ఇవ్వడమే ఈ పథకం లక్ష్యం. 10.74 కోట్ల కుటుంబాలకు చెందిన దాదాపుగా 50 కోట్ల మంది ఈ పథకం లబ్ధి దారులుగా ఉన్నారు. ప్రభుత్వ గణాంకాల ప్రకారం 2019, నవంబర్ 25 నాటికి ఆయుష్మాన్ భారత్ కింద 11.4 కోట్ల మందికి ఇ–కార్డుల్ని జారీ చేశారు. ప్రతీ జిల్లాలో ఓ మెడికల్ కాలేజ్ దేశంలోని ప్రతీ జిల్లాలోనూ ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేసేందుకు కేంద్రం కసరత్తు చేస్తోందని పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో వెల్లడించారు. ప్రస్తుతం ఆసుపత్రుల్లో వైద్యుల కొరత ఉందని, దీన్ని అధిగమించడానికి ప్రైవేటు–ప్రభుత్వ భాగస్వామ్యంతో ప్రతీ జిల్లా కేంద్రంలో ఉన్న ఆసుపత్రికి మెడికల్ కాలేజీని అనుంబంధంగా ఏర్పాటు చేస్తామన్నారు. భూమి, మౌలిక సదుపాయాలు ఇచ్చేందుకు ముందుకు వచ్చే రాష్ట్రాల్లో వీటికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. రోగులు– వైద్యుల నిష్పత్తిలో వ్యత్యాసాన్ని తగ్గించేందుకు ఉద్దేశించిన ఈ పథకం వివరాలు త్వరలోనే ప్రకటిస్తామన్నారు. సరిపడినంత స్థాయిలో రెసిడెంట్ డాక్టర్స్ డిప్లొమా/ ఫెలో బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కోర్సులను ఆఫర్ చేసే ఆసుపత్రులను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ముఖ్యాంశాలు.. ► మిషన్ ఇంద్ర ధనుష్ (ప్రభుత్వ వాక్సినేషన్ కార్యక్రమం) కింద అయిదు వైరస్లు సహా 12 కొత్త తరహా వ్యాధుల్ని తీసుకువచ్చారు. ► ప్రజల జీవన విధానంలో వచ్చే మార్పుల కారణంగా వచ్చే ఆరోగ్య సమస్యల నివారణ కోసం ఫిట్ ఇండియా ఉద్యమం, అందరికీ సురక్షిత మంచినీరు అందించడం కోసం జలజీవన్ మిషన్ , దేశంలో పారిశుద్ధ్య వ్యవస్థని మెరుగుపరిచి పరిశుభ్రంగా ఉండడం కోసం స్వచ్ఛ భారత్ మిషన్ ద్వారా నిరుపేదలకు వ్యాధులు సోకకుండా చర్యలు తీసుకుంటున్నారు. ► ఆయుష్మాన్ భారత్ కిందకి వచ్చే ఆసుపత్రుల సంఖ్యను టైర్ 2, టైర్ 3 నగరాల్లో పెంచాలని నిర్ణయం. ప్రస్తుతం ఈ పథకం కింద 20 వేలకుపైగా ఆసుపత్రులు ఉన్నాయి. మరో వెయ్యి ఆస్పత్రులు పెంచడానికి చర్యలు ► ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లా స్థాయిలో మెడికల్ కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలను పెంచడం. ► ప్రజలకు అందుబాటు ధరల్లో మందులు దొరికేలా అన్ని జిల్లాల్లో జన్ ఔషధి కేంద్రాల ఏర్పాటు. జనరిక్ మెడిసిన్స్‌ని విక్రయించే ఈ దుకాణాలను నాలుగేళ్లలో అన్ని జిల్లాల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు. ► వైద్య పరికరాల దిగుమతులు, విక్రయం ద్వారా వచ్చే పన్నుల్ని ఆరోగ్య రంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు వినియోగం. కొన్ని నిర్దిష్ట వైద్య పరికరాల దిగుమతులపై 5శాతం ఆరోగ్య సెస్ విధింపు . ప్రస్తుతం భారత వైద్య పరికరాల రంగం 80 నుంచి 90 శాతం వరకు దిగుమతులపైనే ఆధారపడింది. ఈ నిర్ణయంతో రెండు రకాలుగా ప్రయోజనాలున్నాయని అసోసియేషన్ ఆఫ్ ఇండియన్ మెడికల్ డివైస్ ఇండస్ట్రీకి చెందిన సమన్వయకర్త రాజీవ్ నాథ్ అన్నారు. వైద్య పరికరాల రంగం మేకిన్ ఇండియాకు ఊతమిస్తుందని, మౌలిక సదుపాయాలకు ఈ నిధుల్ని వినియోగించడం వల్ల జాతీయ ఆరోగ్య రంగ భద్రతపై నెలకొన్న ఆందోళనలు తొలగిపోయే అవకాశాలున్నాయని అన్నారు. ► ఆరోగ్య రంగ అధికారులు మిషన్ లెర్నింగ్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తూ వ్యాధులపై పోరాటం చేయాలి. ► క్షయ ఓడిపోతుంది దేశం గెలుస్తుంది అన్న నినాదంతో ట్యూబర్ కొలాసిస్ (టీబీ)పై పోరుబాట. 2025 నాటికి క్షయ వ్యాధి నిర్మూలనే లక్ష్యంగా కేంద్రం అడుగులు. -
కన్నడ కాంగ్రెస్.. అవినీతి ఖజానా
సాక్షి బళ్లారి/తుమకూరు/శివమొగ్గ: సిద్దరామయ్య సర్కారు అవినీతి ఖజానాగా మారితే ఈ పైప్లైన్లు ఢిల్లీకి నేరుగా అనుసంధానమయ్యాయని కర్ణాటక ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ విమర్శించారు. నిధులన్నీ అధిష్టానానికి చేరుతున్నాయన్నారు. శనివారం తుమకూరు, గదగ్, శివమొగ్గల్లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. మే 15 తర్వాత (ఫలితాలు వెలువడ్డాక) కాంగ్రెస్ పార్టీ ‘పీపీపీ(పంజాబ్, పుదుచ్చేరి, పరివార్) కాంగ్రెస్’గా మారబోతోందన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల టికెట్లను, పార్టీ పదవులను.. చివరకు సీఎం సీట్లను వేలం వేస్తోందని విమర్శించారు. సీట్లు, పదవులకోసం టెండర్లు గదగ్ ర్యాలీలో మోదీ మాట్లాడుతూ.. ‘హెలికాప్టర్ స్కామ్, బొగ్గు కుంభకోణం, కామన్వెల్త్ క్రీడల కుంభకోణం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అయితే ఇప్పుడు కాంగ్రెస్ టెండరు వ్యవస్థను ప్రారంభించింది. టికెట్ల పంపిణీ, పార్టీ పదవులకోసం నేతలను ఎన్నుకోవటం, సీఎంలను ఎన్నుకోవటం వంటి వాటికి ఇక్కడ టెండర్లు వేస్తారు. సీఎంగా ఎవరుండాలనేది.. ఎవరెక్కువ నిధులను ఢిల్లీకి పంపిస్తారనే దానిపైనే ఆధారపడి ఉంటుందని కన్నడ కాంగ్రెస్ నేతలకు చెప్పేశారు’ అని మోదీ అన్నారు. ‘కర్ణాటకలో ప్రజల నుంచి దోపిడీ చేసిన మొత్తంలో కొంతమొత్తాన్ని కాంగ్రెస్ నేతలు తీసుకెళ్తారు. మిగిలినదంతా ఓ అవినీతి ఖజానాలో పెడతారు. ఆ ఖజానా పైప్‌లైన్ ఢిల్లీలోనే తెరుచుకుంటుంది. ఇప్పుడు ప్రభుత్వం చేజారితే ఈ డబ్బులు ఆగిపోతాయనే భయం కాంగ్రెస్‌లో స్పష్టంగా కనబడుతోంది’ అని మోదీ పేర్కొన్నారు. కన్నడ మంత్రుల ఆస్తులు ఐదేళ్లలో వందల కోట్లకు ఎలా పెరిగాయో ప్రజలు అర్థం చేసుకోవాలన్నారు. పేదరిక నినాదమేమైంది? తుమకూరు ర్యాలీలోనూ మోదీ మాట్లాడారు. కర్ణాటకలో అధికారం కోసం కాంగ్రెస్, జేడీఎస్‌లు తెరవెనక దోస్తీ చేసుకున్నాయని విమర్శించారు. ‘పేదరికం నినాదంతో కాంగ్రెస్ మొదట్నుంచీ గెలుస్తూ వస్తోంది. కానీ, కాంగ్రెస్ పార్టీ రైతులు, పేదలను పూర్తిగా విస్మరించిందన్నారు. కర్ణాటకకు మంచి భవిష్యత్తుకోసం కాంగ్రెస్‌ను ఓటర్లు శిక్షించాలని పిలుపునిచ్చారు. మహదాయి నదీజలాల వివాదాన్ని మోదీ గుర్తుచేస్తూ.. గోవాలో అధికారంలో ఉన్నప్పుడు ఈ నదీ జలాలను ఎట్టిపరిస్థితుల్లో కర్ణాటకకు ఇవ్వబోమని సోనియా గాంధీ చెప్పిన విషయాన్ని మరవొద్దన్నారు. ‘వారిప్పుడు గోవాలో అధికారాన్ని కోల్పోయారు. దీంతో ఇప్పుడు కన్నడ ప్రజల్లో మహదాయి వివాదాన్ని రెచ్చగొడుతున్నారన్నారు. సమస్యను పరిష్కరించేందుకు చొరవచూపాల్సింది పోయి ట్రిబ్యునల్‌కు పంపించారని మోదీ మండిపడ్డారు. యడ్యూరప్ప చిత్తశుద్ధి భేష్ బీజేపీ సీఎం అభ్యర్థి యడ్యూరప్ప గురించి కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలను అర్థరహితమని మోదీ శివమొగ్గ ర్యాలీలో (యడ్యూరప్ప సొంత జిల్లా) పేర్కొన్నారు. ‘సమాజం పట్ల యడ్యూరప్పకున్న చిత్తశుద్ధి, ఆయన వయసు వంటి వాటిని మరిచిపోయి అర్థరహిత విమర్శలు చేస్తున్నారు. ఈ జిల్లాలోని కాంగ్రెస్ అభ్యర్థులకు ప్రజలు డిపాజిట్లు రాకుండాచేయాలి’ అని అన్నారు. పెద్దనోట్లను రద్దు చేశాక అత్యధికంగా కాంగ్రెస్ నేతల ఇళ్లలోనే భారీగా నోట్లకట్టలు బయటపడ్డాయి. ఈవీఎంకు మోదీ కొత్త నిర్వచనం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు(ఈవీఎం)కు మోదీ కొత్త అర్థం చెప్పారు. ‘ఈవీఎంలో ఈ అంటే ఎనర్జీ ఆఫ్ ది పీపుల్, వి– అంటే పీపుల్స్ ఎలక్టోరల్ వాల్యూ ఎడిషన్, ఎం– పీపుల్స్ మోటివేషన్ ఫర్ ప్రోగ్రెస్..’ అని వివరించారు. -
రైల్వేకు ప్రైవేట్, విదేశీ సాయం
రైల్వేల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)ల కింద ప్రాజెక్టులు చేపడుతున్నామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రైవేటు, విదేశీ సంస్థల భాగస్వామ్యంపై బడ్జెట్లో రైల్వే మంత్రి ప్రస్తావించారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రూ.2,85,652 కోట్లతో 154 కొత్త మార్గాలు, 42 మార్గాల్లో గేజ్ మార్పు, 166 లైన్లలో డబ్లింగ్, 54 మార్గాల విద్యుదీకరణ చేస్తార ని చెప్పారు. వీటిలో ముఖ్యమైనవి.. 1. భోపాల్-ఇండోర్ మధ్య మెట్రో ప్రాజెక్టు కోసం జపాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు రూ. 12 వేల కోట్ల రుణం.. 2. బిహార్‌లో డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల తయారీ ప్లాంట్‌కు జనరల్ ఎలక్ట్రిక్(అమెరికా), అల్‌స్టామ్(ఫ్రాన్స్) లతో రూ. 40 వేల కోట్ల ఒప్పందం. 3. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ నుంచి రూ.96 వేల కోట్ల పెట్టుబడులకు అంగీకారం. 4. రైల్వే పనితీరు మెరుగుకు పీపీపీలో రూ.5,781 కోట్ల సేకరణ.. 5. రూ.8,50,000 కోట్లతో రైల్వే ఆధునికీకరణకు ఎల్ఐసీ నుంచి రూ.1,50,000 కోట్ల సాయం.