రైల్వేకు ప్రైవేట్, విదేశీ సాయం
రైల్వేల్లో ప్రభుత్వ-ప్రైవేటు భాగస్వామ్యం(పీపీపీ), విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐ)ల కింద ప్రాజెక్టులు చేపడుతున్నామని రైల్వే శాఖ అధికారులు తెలిపారు. ప్రైవేటు, విదేశీ సంస్థల భాగస్వామ్యంపై బడ్జెట్లో రైల్వే మంత్రి ప్రస్తావించారని చెప్పారు. ఈ ప్రాజెక్టుల్లో భాగంగా రూ.2,85,652 కోట్లతో 154 కొత్త మార్గాలు, 42 మార్గాల్లో గేజ్ మార్పు, 166 లైన్లలో డబ్లింగ్, 54 మార్గాల విద్యుదీకరణ చేస్తార ని చెప్పారు.
వీటిలో ముఖ్యమైనవి..
1. భోపాల్-ఇండోర్ మధ్య మెట్రో ప్రాజెక్టు కోసం జపాన్ నుంచి మధ్యప్రదేశ్‌కు రూ. 12 వేల కోట్ల రుణం..
2. బిహార్‌లో డీజిల్, ఎలక్ట్రిక్ ఇంజిన్ల తయారీ ప్లాంట్‌కు జనరల్ ఎలక్ట్రిక్(అమెరికా), అల్‌స్టామ్(ఫ్రాన్స్) లతో రూ. 40 వేల కోట్ల ఒప్పందం.
3. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలుకు జపాన్ ఇంటర్నేషనల్ కోపరేషన్ ఏజెన్సీ నుంచి
రూ.96 వేల కోట్ల పెట్టుబడులకు అంగీకారం.
4. రైల్వే పనితీరు మెరుగుకు పీపీపీలో రూ.5,781 కోట్ల సేకరణ..
5. రూ.8,50,000 కోట్లతో రైల్వే ఆధునికీకరణకు ఎల్‌ఐసీ నుంచి రూ.1,50,000 కోట్ల సాయం.