
కూసుమంచి : ప్రజలకు ప్రభుత్వ పథకాలను వర్తింపజేయడం, గ్రామాలను అభివృద్ధి చేయడమే లక్ష్యమని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. గురువారం కూసుమంచి మండలంలో పర్యటించారు. పెరిక సింగారం గ్రామంలో రూ.9.80 కోట్లతో చేపట్టనున్న రహదారి విస్తరణకు, పెరికసింగారం, మల్లేపల్లి గ్రామాల్లో డబుల్‌బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు మంత్రి శంకుస్థానన చేశారు. కల్యాణలక్ష్మి చెక్కులు అందజేశారు. జక్కేపల్లి ఎస్సీ కాలనీలో రూ.20 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా సభలో ఆయన మాట్లాడుతూ..ప్రజలకు ఇచ్చిన హామీ లన్నీ నెరవేరుస్తామన్నారు. అభివృద్ధి లక్ష్యంగానే ముందుకు సాగుతున్నామని, తమ కృషి లో ప్రజలు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జక్కేపల్లి కాలనీవాసులను మంత్రి సమస్యలు అడిగి తెలసుకు న్నారు. సీసీరోడ్లు, డ్రెయినేజీలు, విద్యుత్‌లైన్లు, శ్మశానంలో చేతిపంపులు కావాలని కోరగా వెంటనే సంబంధిత అధికారులను పిలిచి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, ఎమ్మెల్సీ బాలసాని లక్ష్మీనారాయణ, డీసీసీïబీ చైర్మన్ మువ్వా విజయ్‌బాబు, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, జెడ్పీ సీఈఓ మారుపాక నాగేష్, ఎంపీపీ రామసహాయం వెంకటరెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు వడ్త్యి రాంచంద్రునాయక్, సీడీసీ చైర్మన్ జూకూరి గోపాలరావు, ఆత్మకమిటీ చైర్మన్ మద్ది మల్లారెడ్డి, వైస్ ఎంపీపీ బారి శ్రీనివాస్, సర్పంచ్‌లు అజ్మీర నాగమణి, బుర్రి నాగమణి, తాళ్లూరి రవి, ఎంపీటీసీ సభ్యులు బాణోతు వీరభద్ర మ్మ, జూకూరి విజయలక్ష్మి, తహసీల్దార్ కృష్ణ, ఎంపీడీఓ విద్యాచందనతో పాటు పలుశాఖల అధికారులు, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు, టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.