Pradeep Reddy
-
స్టార్టప్స్‌కు ద్వారక కో-వర్కింగ్ స్పేస్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ఆఫీస్ స్పేస్ కంపెనీ ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్.. స్టార్టప్స్ కోసం ప్రత్యేకంగా 620 సీట్లతో మాదాపూర్‌లో ద్వారక ప్రైడ్‌ను ప్రారంభించింది. దీంతో సంస్థ ఖాతాలో 13 కేంద్రాలకుగాను 3.2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణం అందుబాటులోకి వచ్చింది. మొత్తం 6,500 సీట్ల సామర్థ్యానికి చేరుకున్నామని ద్వారక ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎండీ ఆర్.ఎస్.ప్రదీప్ రెడ్డి సోమవారమిక్కడ మీడియాకు తెలిపారు. 100కుపైగా కంపెనీల కార్యాలయాలు ద్వారక ప్రాజెక్టుల్లో కొలువుదీరాయని చెప్పారు. కొత్తగా 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆరు ప్రాజెక్టులను 2024 మార్చినాటికి జోడిస్తున్నట్టు వెల్లడించారు. తద్వారా మరో 4,500 సీట్లు అందుబాటులోకి రానున్నాయని కంపెనీ డైరెక్టర్ దీప్నా రెడ్డి వివరించారు. అనువైన విధానం..: ఆఫీస్ స్పేస్ పరిశ్రమలో ప్లగ్ అండ్ ప్లే, కో–వర్కింగ్, సర్వీస్డ్ ఆఫీస్ స్పేస్ విభాగాల్లో పోటీ పడుతున్నామని దీప్నా రెడ్డి తెలిపారు. ‘ఐటీ రంగంలో ఒడిదుడుకులు సహజం. అందుకే కంపెనీలకు దీర్ఘకాలిక ఒప్పందం భారం కాకుండా అనువైన విధానాన్ని అమలు చేస్తున్నాం. అంటే ఒప్పందం కుదుర్చుకుని సీట్లను తగ్గించుకున్నా వారిపై భారం ఉండదు. మహిళా వ్యాపారవేత్తలకు చార్జీల్లో డిస్కౌంట్ ఇస్తున్నాం. మహమ్మారి కాలంలో ఆఫీస్ స్పేస్ పరిశ్రమ తిరోగమించింది. ఇదే కాలంలో ద్వారక ఇన్ఫ్రా భారీ ప్రాజెక్టులకుతోడు రెండింతల సామర్థ్యాన్ని అందుకుంది. సాధారణ చార్జీలతోనే ప్రీమియం ఇంటీరియర్స్‌తో ఖరీదైన అనుభూతి కల్పిస్తున్నాం’ అని వివరించారు. -
నారాయణరెడ్డి హత్యకేసు సీబీఐకి అప్పగించాలి
పత్తికొండ టౌన్: చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యకేసును సీబీఐకి అప్పగించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి చెరుకులపాడు ప్రదీప్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం సాయంత్రం పత్తికొండలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పత్తికొండకు వచ్చిన సీఎం చంద్రబాబు చెరుకులపాడు నారాయణరెడ్డి హత్యతో కేఈ శ్యాంబాబుకు సంబంధం లేదని చెప్పడం సిగ్గుచేటు అన్నారు. హత్యకేసుతో టీడీపీ నాయకులకు సంబంధం లేనప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఎందుకు జంకుతున్నారని ఆయన ప్రశ్నించారు. అధికారం కోసం పిల్లనిచ్చిన మామను చంద్రబాబు వెన్నుపోటు పొడిస్తే, కేఈ శ్యాంబాబు ప్రతిపక్ష నాయకులను హత్యలు చేస్తున్నాడని ఆరోపించారు. టీడీపీ ఐదేళ్ల పాలనలో ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు. ఎన్నికల ప్రచారంలో చెప్పుకునేందుకు ఏమీ లేక చంద్రబాబు.. ప్రతిపక్షనేత వైఎస్ జగన్‌ను విమర్శించడమే పనిగా పెట్టుకున్నారన్నారు. పసుపు–కుంకుమ ఇచ్చినందుకు ఆడపడుచులందరూ తమకే ఓట్లు వేయాలని అడుగుతున్న చంద్రబాబు, జిల్లాలో వందలాదిమంది మహిళల పసుపుకుంకుమలు పోవడానికి కారకులైన కోట్ల, కేఈ కుటుంబాలకు టికెట్లు ఇవ్వడం విడ్డూరంగా ఉందన్నారు. నారాయణరెడ్డి హత్యకేసు నిందితులను పక్కనే పెట్టుకుని, నీతిమాటలు వల్లెవేయడం బాబుకే చెల్లిందన్నారు. అధికారం కోసం హత్యారాజకీయాలను ప్రోత్సహిస్తున్న టీడీపీ నాయకులకు ఎన్నికల్లో ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. -
'వారికి జీవితాంతం గెలుపు లేకుండా చేస్తా'
-
నా భర్తను చంపించింది వారే: నారాయణరెడ్డి భార్య
-
నా భర్తను చంపించింది వారే: నారాయణరెడ్డి భార్య
కర్నూలు: పత్తికొండ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి చెరుకులపాడు నారాయణ రెడ్డి హత్యకు కేఈ సోదరులే కారణమని నారాయణరెడ్డి భార్య శ్రీదేవి రెడ్డి, సోదరుడు ప్రదీప్‌రెడ్డి ఆరోపించారు. కేఈ కుమారుడు శ్యాంబాబు, ఎస్సై నాగ తులసీప్రసాద్ హత్యలో కీలకపాత్ర పోషించారని పేర్కొన్నారు. పత్తికొండలో డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఆగడాలు ఎక్కువయ్యాయని అన్నారు. కేఈ దౌర్జన్యాలకు వ్యతిరేకంగా నారాయణరెడ్డి న్యాయ పోరాటం చేస్తున్నారని తెలిపారు. ఇసుక మాఫియాకు వ్యతిరేకంగా పోరాడినందునే నారాయణరెడ్డిని హత్య చేశారని ఆరోపించారు. ఇసుక మాఫియాకు కేఈ కుమారుడు శ్యాంబాబు నేతృత్వం వహిస్తున్నాడని వెల్లడించారు. గన్మెన్లను ఇవ్వాలని ఉన్నతాధికారులను కోరినా పట్టించుకోలేదని వాపోయారు. రెన్యువల్ కోసం ఇటీవలే లైసెన్సెడ్ తుపాకీని నారాయణరెడ్డి డిపాజిట్ చేశారని తెలిపారు. మూడు నెలలైనా రెన్యువల్ చేయకపోవడం వల్లే ఆయన హత్యకు గురయ్యారని పేర్కొన్నారు. తమ కుటుంబంపై ఎన్నేళ్లు కక్ష సాధిస్తారని శ్రీదేవి రెడ్డి ప్రశ్నించారు. హత్య రాజకీయాలు చేసే బదులు ఇంట్లో కూర్చుని చీరలు కట్టుకోవాలని అన్నారు. తన పిల్లలకు తండ్రి లేకుండా చేశారని కన్నీళ్లపర్యంతమయ్యారు. ఏదైతే లక్ష్యం కోసం తన భర్త పోరాడారో దాని కోసం తన ఊపిరి ఉన్నంతవరకు పోరాడతానని పేర్కొన్నారు. -
టీడీపీ నేత ప్రదీప్ రెడ్డిపై కేసు
-
విషయ పరిజ్ఞానంతోనే విజయం
చైతన్యపురి (హైదరాబాద్): విషయ పరిజ్ఞానంతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని విజిలెన్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ. ప్రదీప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లో 'సాక్షి' రాజధాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్‌రెడ్డి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన మెళకువలను వివరించారు. ప్రభుత్వానికి రెవెన్యూ, పోలీసు శాఖలు చాలా కీలకమైనవని తెలిపారు. సమాజానికి దగ్గరగా వెళ్లి సేవ చేసేది పోలీసులేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా ఏకాగ్రతతో ఆందోళన లేకుండా లక్ష్య సాధన కోసం రోజుకు 16 గంటలు కష్టించి చదివితే పోలీసు ఉద్యోగాలను కైవసం చేసుకుంటారన్నారు. అనంతరం సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. నైతిక విలువలు, కుటుంబం, సమాజం పట్ల బాధ్యత వహించే ఉద్యోగాల్లో ప్రధానమైనది పోలీసు ఉద్యోగమని పేర్కొన్నారు. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని, రిక్రూట్మెంట్ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ డెరైక్టర్లు శంకర్‌రెడ్డి, లక్ష్మణ్, పలువురు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. -
మళ్లీ అదే కథ!
కిందపడడమే గాయాలకు కారణమంటూ వెల్లడి అధికారుల తీరుపై ఏఆర్ కానిస్టేబుళ్ల ఆగ్రహం విజయవాడ సిటీ: పోలీసు కమిషనరేట్ అధికారులు పాత కథనే మరోసారి వినిపించారు. నెలల వ్యవధిలో చోటు చేసుకున్న రెండు వేర్వేరు ఘటనల్లో ‘మద్యం మత్తులో కిందపడి గాయపడ్డారు’ అనే అంశాన్నే పోలీసు అధికారులు చెప్పడం గమనార్హం. రెండు వివాదాల్లోను ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు ఆర్.ఎస్.ఐ.లే. అప్పట్లో ఆరోపణలు చేసింది సాధారణ యువకుడైతే, ప్రస్తుతం ఎ.ఆర్. కానిస్టేబుల్ కావడం విశేషం. రెండు ఘటనల్లోనూ అధికారులనే వెనకేసుకురావడంపై ఎ.ఆర్. విభాగం సిబ్బందిలో ఆగ్రహం వ్యక్తమవుతోంది. తాము ముందునుంచీ చెబుతున్నట్లుగానే అధికారులను రక్షించే విధంగా ఉన్నతాధికారుల చర్యలు ఉన్నాయనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడిలా.. గత శనివారం ఆర్మడ్ రిజర్వ్డ్ మైదానంలోని డంపింగ్ యార్డులో ఆర్.ఎస్.ఐ. ప్రదీప్‌రెడ్డి, కానిస్టేబుల్‌కు మధ్య జరిగిన ఘర్షణలో ఎ.ఆర్. కానిస్టేబుల్ శ్రీనివాసరావు ముఖంపై గాయాలయ్యాయి. దీనిపై విచారణ జరిపిన కమిషనరేట్ అధికారులు క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే ఆర్మ్డ్ రిజర్వుడ్‌లో పనిచేస్తూ.. క్రమశిక్షణ లేకుండా వ్యవహరించారని తనిఖీకి వచ్చిన ఆర్.ఎస్.ఐ. గమనించినట్టు తెలిపారు. తాను గమనించిన అంశాలను రికార్డుల్లో నమోదు చేస్తున్న క్రమంలో కానిస్టేబుల్ దాడి చేసి ఆర్.ఎస్.ఐ.ని గాయపరిచాడని, ఈ క్రమంలోనే కానిస్టేబుల్ కిందపడి గాయపడ్డానని వెల్లడించారు. అప్పుడలా.. ట్రాఫిక్ ఎన్ఫోర్స్మెంట్ చర్యల్లో భాగంగా మూడు నెలల కిందట పశువుల ఆస్పత్రి జంక్షన్లో మద్యం మత్తులో వాహనం నడుపుతున్న కల్యాణ్ అనే యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ఘటనలో పోలీసుల చర్యలపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. నిబంధనలకు విరుద్ధంగా వాహనం నడిపితే చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప కొట్టి గాయపరచడమేమిటంటూ పౌరులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగంలోకి దిగిన కమిషనరేట్ పెద్దలు మద్యం మత్తులో ఉన్న కల్యాణ్ మరికొందరితో కలిసి విధులు నిర్వర్తిస్తున్న ఆర్.ఎస్.ఐ.పై దాడికి యత్నించినట్టు తెలిపారు. ఈ క్రమంలోనే మద్యం మత్తులో ఉన్న ఆ యువకుడు తూలి కిందపడి గాయపడ్డాడే తప్ప ఆర్.ఎస్.ఐ. ప్రమేయం లేదంటూ వివరణ ఇచ్చారు. పైగా ఆ యువకుడి ఫిర్యాదుపై సి.ఐ.డి. దర్యాప్తునకు రాసినట్టు తెలిపారు. ఈ విషయాలు పరిశీలిస్తే అధికారులంతా ఒక్కటేననే విషయం మరోసారి రుజవైందని ఎ.ఆర్. కానిస్టేబుళ్లు వ్యాఖ్యానించడం కొసమెరుపు. అధికారులకు బాధ్యత లేదా? కమిషనరేట్ పెద్దలు చెప్పిన దాని ప్రకారం సాయుధ రిజర్వ్డ్ విభాగం క్రమశిక్షణకు మారుపేరుగా ఉంటుంది. అంటే అధికారుల నుంచి సిబ్బంది వరకు ఎంతో క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి. మరి అలాంటప్పుడు విధులు నిర్వహించే సిబ్బంది మద్యం మత్తులో ఉండడానికి పై అధికారులు కారణం కాదా? విషయం వివాదానికి దారితీసింది కాబట్టి వెలుగుచూసింది. బయటకు రాకుండా ఇలాంటి ఘటనలు అనేకం ఉన్నాయనేది సిబ్బంది వాదన. మరి బాధ్యతాయుత ప్రవర్తనపై సుద్దులు చెప్పే పెద్దలు ఎ.ఆర్. ప్రక్షాళనకు చర్యలు చేపడతారా.. చేపడితే ఏ విధమైన మార్పులు తీసుకొస్తారనేది వేచిచూడాల్సిందే.