మళ్లీ చెబుతా ప్రియా...
ప్రిన్స్, వ్యోమనంది, పూజా రామచంద్రన్ నటీనటులుగా శ్రీ చైత్ర చలనచిత్ర సంస్థ నిర్మించిన సినిమా ‘మరల తెలుపనా ప్రియా’. వాణి ఎమ్.కొసరాజు దర్శకత్వం వహించారు. శేఖర్ చంద్ర సంగీత దర్శకుడు. ప్రసాద్ ల్యాబ్స్ అధినేత రమేశ్ ప్రసాద్ నిర్మాణ సంస్థ లోగోని, హీరో నిఖిల్ పాటల సీడీలను ఆవిష్కరించారు. ‘‘భిన్నమైన వ్యక్తిత్వాలు, నేపథ్యాలు ఉన్న ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య సాగే విభిన్నమైన ప్రేమకథా చిత్రమిది’’ అని వాణి ఎమ్.కొసరాజు అన్నారు.
‘‘శేఖర్‌చంద్ర బాణీలు, భాస్కరభట్ల సాహిత్యం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. నటీనటులతో పాటు విలన్‌గా సుజోమ్యాథ్యూ చక్కగా నటించారు. సినిమా బాగా వచ్చింది’’ అని ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు కె.సురేష్ బాబు, వుడిగ శ్రీనివాస్‌లు తెలిపారు. రాహుల్ రవీంద్రన్, అశ్విన్, ప్రిన్స్, వ్యోమనంది, శేఖర్ చంద్ర, భాస్కరభట్ల తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.