prequarter
-
Australian Open 2023: ఎదురులేని జొకోవిచ్
మెల్బోర్న్: పదోసారి ఆస్ట్రేలియన్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన తొమ్మిదిసార్లు చాంపియన్, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ ఆ దిశగా మరో అడుగు ముందుకేశాడు. శనివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో నాలుగో సీడ్ జొకోవిచ్ 7–6 (9/7), 6–3, 6–4తో 27వ సీడ్ దిమిత్రోవ్ (బల్గేరియా)పై గెలిచి ఈ టోర్నీలో 13వసారి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. 3 గంటల 7 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో జొకోవిచ్ 11 ఏస్‌లు సంధించాడు. 28 విన్నర్స్ కొట్టిన అతడు 22 అనవసర తప్పిదాలు చేశాడు. నెట్ వద్దకు 20 సార్లు దూసుకొచ్చి 15 సార్లు పాయింట్లు గెలిచాడు. ఐదుసార్లు దిమిత్రోవ్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన జొకోవిచ్ తన సర్వీస్‌ను మూడుసార్లు కోల్పోయాడు. మరోవైపు ఐదుసార్లు రన్నరప్, బ్రిటన్ స్టార్ ఆండీ ముర్రే కథ ముగిసింది. తొలి రెండు రౌండ్ మ్యాచ్‌ల్లో ఐదు సెట్లపాటు పోరాడి గెలిచిన ముర్రే మూడో రౌండ్లో మాత్రం పుంజుకోలేకపోయాడు. బాటిస్టా అగుట్ (స్పెయిన్) 6–1, 6–7 (7/9), 6–3, 6–4తో ముర్రేను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. ఐదో సీడ్ రుబ్లెవ్ (రష్యా), తొమ్మిదో సీడ్ హోల్గర్ రూన్ (డెన్మార్క్) కూడా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. 2004 తర్వాత ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో అత్యధికంగా నలుగురు అమెరికా ఆటగాళ్లు ప్రిక్వార్టర్ ఫైనల్‌కు చేరారు. సబలెంకా, గార్సియా ముందంజ మహిళల సింగిల్స్‌లో ఐదో సీడ్ సబలెంకా (బెలారస్), నాలుగో సీడ్ కరోలినా గార్సియా (ఫ్రాన్స్), 12వ సీడ్ బెలిండా బెన్‌చిచ్ (స్విట్జర్లాండ్) ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగు పెట్టారు. మూడో రౌండ్ మ్యాచ్ ల్లో సబలెంకా 6–2, 6–3తో ఎలీజ్ మెర్టెన్స్ (బెల్జియం)పై, గార్సియా 1–6, 6–3, 6–3తో లౌరా సీగెముండ్ (జర్మనీ)పై, బెన్‌చిచ్ 6–2, 7–5తో కామిల్లా జియార్జి (ఇటలీ)పై గెలిచారు. -
Vietnam Open Badminton: ప్రిక్వార్టర్ ఫైనల్లో సిక్కి రెడ్డి–రోహన్ జోడీ
హో చి మిన్ సిటీ: వియత్నాం ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–100 బ్యాడ్మింటన్ టోర్నీ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ (భారత్) జోడీ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. బుధవారం జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌లో తెలంగాణ అమ్మాయి సిక్కి రెడ్డి–రోహన్ కపూర్ ద్వయం 14–21, 21–9, 21–12తో హరిహరన్–లక్ష్మి ప్రియాంక (భారత్) జోడీపై గెలిచింది. పురుషుల సింగిల్స్ విభాగంలో సంచలన ఫలితాలు నమోదయ్యాయి. 2019 ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత, 40వ ర్యాంకర్ సాయిప్రణీత్ రెండో రౌండ్లోనే నిష్క్రమించాడు. తొలి రౌండ్లో ‘బై’ పొంది నేరుగా రెండో రౌండ్ మ్యాచ్ ఆడిన రెండో సీడ్ సాయిప్రణీత్ 21–17, 18–21, 13–21తో 225వ ర్యాంకర్ సతీశ్ కుమార్ (భారత్) చేతిలో ఓడిపోయాడు. తెలంగాణ ప్లేయర్ మేకల కిరణ్ కుమార్ వరుసగా రెండు విజయాలతో ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాడు. తొలి రౌండ్లో కిరణ్ 21–10, 15–21, 21–10తో ప్రపంచ 68వ ర్యాంకర్ శుభాంకర్ డే (భారత్)పై నెగ్గి...రెండో రౌండ్లో 16–21, 21–14, 21–19తో ఫోన్ ప్యా నైంగ్ (మయాన్మార్)ను ఓడించాడు. -
ప్రిక్వార్టర్స్‌లో లక్ష్య సేన్, మాళవిక
సన్‌చెయోన్ (దక్షిణ కొరియా): భారత నంబర్‌వన్ ర్యాంకర్ లక్ష్య సేన్ కొరియా ఓపెన్ వరల్డ్ సూపర్–500 బ్యాడ్మింటన్ టోర్నీలో శుభారంభం చేశాడు. చోయ్ జీ హూన్ (దక్షిణ కొరియా)తో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో ప్రపంచ తొమ్మిదో ర్యాంకర్ లక్ష్య సేన్ 14–21, 21–16, 21–18తో గెలుపొంది ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. భారత్‌కే చెందిన మరో అగ్రశ్రేణి ప్లేయర్ హెచ్ఎస్ ప్రణయ్ మాత్రం తొలి రౌండ్లోనే ఇంటిదారి పట్టాడు. ప్రపంచ 72వ ర్యాంకర్ చీమ్ జూన్ వె (మలేసియా)తో జరిగిన మ్యాచ్‌లో ప్రపంచ 23వ ర్యాంకర్ ప్రణయ్ 17–21, 7–21తో ఓడిపోయాడు. మహిళల సింగిల్స్ తొలి రౌండ్లో మాళవిక బన్సోద్ (భారత్) 20–22, 22–20, 21–10తో ప్రపంచ 24వ ర్యాంకర్ హాన్ వయి (చైనా)పై సంచలన విజయం సాధించింది. పురుషుల డబుల్స్ తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో కృష్ణప్రసాద్ గారగ–పంజాల విష్ణువర్ధన్ గౌడ్ (భారత్) జోడీ 14–21, 19–21తో ప్రమ్యుద–రామ్బితాన్ (ఇండోనేసియా) జంట చేతిలో... సుమీత్ రెడ్డి–బొక్కా నవనీత్ (భారత్) ద్వయం 14–21, 12–21తో ఒంగ్ యె సిన్–తియో ఇ యి (మలేసియా) జోడీ చేతిలో ఓడిపోయాయి. -
మూడో రౌండ్లో జొకోవిచ్
యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టెన్నిస్ టోర్నీ పురుషుల సింగిల్స్ రెండో రౌండ్ మ్యాచ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6–2, 6–3, 6–2తో టలాన్ (నెదర్లాండ్స్)పై నెగ్గాడు. మహిళల సింగిల్స్‌లో 12వ సీడ్ హలెప్ (రొమేనియా) ప్రిక్వార్టర్ ఫైనల్ చేరింది. మూడో రౌండ్లో హలెప్ 7–6 (13/11), 4–6, 6–3తో రిబాకినా (కజకిస్తాన్)పై గెలిచింది. మహిళల డబుల్స్ తొలి రౌండ్లో సానియా మీర్జా (భారత్)–కోకో వాండవే (అమెరికా) జంట 6–4, 4–6, 3–6తో రలుకా (రొమేనియా)–కిచెనోక్ (ఉక్రెయిన్) జోడీ చేతిలో ఓడింది. -
మేరీ పంచ్ అదిరె...
టోక్యో: భారత సీనియర్ బాక్సర్, 2012 ఒలింపిక్స్ కాంస్య పతక విజేత మేరీకోమ్ టోక్యోలో తొలి అడుగును విజయవంతంగా వేసింది. రెండో ఒలింపిక్ పతకాన్ని ఆశిస్తున్న భారత బాక్సింగ్ దిగ్గజం ఆదివారం జరిగిన 51 కేజీల విభాగం తొలి రౌండ్లో 4–1 తేడాతో మిగులినా హెర్నాండెజ్ (డొమినికన్ రిపబ్లిక్)ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన 38 ఏళ్ల మేరీకోమ్ ముందు 23 ఏళ్ల మిగులినా నిలవలేకపోయింది. తర్వాతి పోరులో కొలంబియాకు చెందిన మూడో సీడ్ ఇన్‌గ్రిట్ వలెన్సియాతో తలపడుతుంది. పురుషుల 63 కేజీలవిభాగంలో భారత బాక్సర్ మనీశ్ కౌశిక్‌కు చుక్కెదురైంది. తొలి పోరులోనే అతను ఓటమిపాలై నిష్క్రమించాడు. బ్రిటన్‌కు చెందిన ల్యూక్ మెక్‌కార్మాక్ 4–1తో మనీశ్‌ను ఓడించాడు. -
అయ్యో హలెప్...
పారిస్: పలువురు స్టార్ క్రీడాకారిణుల గైర్హాజరీలో కెరీర్లో మూడో గ్రాండ్‌స్లామ్ టైటిల్ సాధించేందుకు వచ్చిన సదవకాశాన్ని టాప్ సీడ్, ప్రపంచ రెండో ర్యాంకర్ సిమోనా హలెప్ (రొమేనియా) చేజార్చుకుంది. ఫ్రెంచ్ ఓపెన్ టోర్నీలో ఈ మాజీ చాంపియన్ ప్రిక్వార్టర్ ఫైనల్లోనే నిష్క్రమించి ఆశ్చర్యపరిచింది. పోలాండ్ టీనేజర్ ఇగా స్వియాటెక్ కేవలం 68 నిమిషాల్లో 6–1, 6–2తో హలెప్‌ను బోల్తా కొట్టించి పెను సంచలనం సృష్టించింది. గత ఏడాది ఇదే టోర్నీలో హలెప్‌తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో స్వియాటెక్ 1–6, 0–6తో ఓడిపోయింది. ఏడాది తిరిగేలోపు అదే వేదికపై, ప్రిక్వార్టర్ ఫైనల్లోనే హలెప్‌ను స్వియాటెక్ చిత్తు చేయడం విశేషం. ఈ గెలుపుతో 19 ఏళ్ల స్వియాటెక్ తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో క్వార్టర్ ఫైనల్ చేరింది. స్వియాటెక్‌తో ఏకపక్షంగా జరిగిన మ్యాచ్‌లో హలెప్ ఒక్కసారి కూడా బ్రేక్ పాయింట్ అవకాశాన్ని సంపాదించకపోవడం గమనార్హం. మరోవైపు స్వియాటెక్ నాలుగుసార్లు హలెప్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది. క్వాలిఫయర్ల హవా... మహిళల సింగిల్స్ విభాగంలో ఇద్దరు క్వాలిఫయర్లు మార్టినా ట్రెవిసాన్ (ఇటలీ), నదియా పొడొరోస్కా (అర్జెంటీనా) క్వార్టర్ ఫైనల్‌కు చేరుకోవడం విశేషం. ప్రిక్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌ల్లో 159వ ర్యాంకర్ ట్రెవిసాన్ 6–4, 6–4తో ఐదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)ను కంగుతినిపించగా... 131వ ర్యాంకర్ నదియా పొడొరోస్కా 2–6, 6–2, 6–3తో బార్బరా క్రాయికోవా (చెక్ రిపబ్లిక్)పై నెగ్గారు. తద్వారా 2012 తర్వాత ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ చేరిన క్వాలిఫయర్లుగా గుర్తింపు పొందారు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్ స్వితోలినా (ఉక్రెయిన్) 6–1, 6–3తో కరోలినా గార్సియా (ఫ్రాన్స్)ను ఓడించి మూడోసారి ఫ్రెంచ్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్ బెర్త్‌ను ఖరారు చేసుకుంది. ఎదురులేని నాదల్... కెరీర్లో 20వ గ్రాండ్‌స్లామ్ టైటిల్‌పై గురిపెట్టిన పురుషుల సింగిల్స్ డిఫెండింగ్ చాంపియన్ రాఫెల్ నాదల్ (స్పెయిన్) క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. ప్రిక్వార్టర్ ఫైనల్లో రెండో సీడ్ నాదల్ 6–1, 6–1, 6–2తో సెబాస్టియన్ కోర్డా (అమెరికా)పై అలవోకగా గెలిచాడు. మరోవైపు ఇటలీకి చెందిన 75వ ర్యాంకర్ జానిక్ సినెర్ సంచలనం సృష్టించాడు. ఆరో సీడ్ అలెగ్జాండర్ జ్వెరెవ్ (జర్మనీ)తో జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో 19 ఏళ్ల సినెర్ 6–3, 6–3, 4–6, 6–3తో గెలుపొంది రాఫెల్ నాదల్ (2005లో) తర్వాత ఫ్రెంచ్ ఓపెన్ అరంగేట్రంలోనే క్వార్టర్ ఫైనల్ చేరిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. క్వార్టర్ ఫైనల్లో నాదల్‌తో సినెర్ ఆడనున్నాడు. మరో ప్రిక్వార్టర్ ఫైనల్లో మూడో సీడ్, గతేడాది రన్నరప్ డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) 3 గంటల 32 నిమిషాల్లో 6–4, 6–4, 5–7, 3–6, 6–3తో 239వ ర్యాంకర్ హుగో గస్టాన్ (ఫ్రాన్స్)పై గెలిచి వరుసగా ఐదో సంవత్సరం క్వార్టర్ ఫైనల్ చేరాడు. -
సాహో సెరెనా
తొలి రెండు రౌండ్లలో అనామక ప్రత్యర్థులు ఎదురవ్వడంతో అమెరికా మహిళా టెన్నిస్ దిగ్గజం సెరెనా విలియమ్స్ సత్తాకు ఏమంత పరీక్ష ఎదురుకాలేదు. కానీ మూడో రౌండ్లో యూఎస్ ఓపెన్ మాజీ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ రూపంలో సెరెనాకు అసలు సిసలు సవాల్ వచ్చి పడింది. అమెరికా టెన్నిస్ భావితారగా భావిస్తున్న స్లోన్ స్టీఫెన్స్కు గతంలో తనను ఓడించిన రికార్డు కూడా ఉండటం... ఊహించని విధంగా సెరెనా తొలి సెట్ కూడా కోల్పోవడం... వెరసి సెరెనా 24వ గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్ వేటకు మళ్లీ బ్రేక్ పడుతుందా అనే సందేహం కలిగింది. కానీ ఒక్క యూఎస్ ఓపెన్లోనే ‘శతక’ విజయాలు నమోదు చేసిన సెరెనా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడింది. ఆ తర్వాత వరుసగా రెండు సెట్లను నెగ్గి స్లోన్ స్టీఫెన్స్ ఆట కట్టించిన సెరెనా ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. న్యూయార్క్: ఆల్‌టైమ్ అత్యధిక గ్రాండ్‌స్లామ్ సింగిల్స్ టైటిల్స్ నెగ్గిన క్రీడాకారిణిగా మార్గరెట్ కోర్ట్ (24 టైటిల్స్) పేరిట ఉన్న రికార్డును సమం చేసేందుకు... గతంలో వచ్చిన నాలుగు అవకాశాలను వృథా చేసుకున్న అమెరికా టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ ఈసారి మాత్రం ఎలాగైనా తన లక్ష్యాన్ని అందుకునే దిశగా పట్టుదలతో ముందుకు సాగుతోంది. తనకెంతో కలిసొచ్చిన యూఎస్ ఓపెన్ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో ఆరుసార్లు చాంపియన్‌గా నిలిచిన సెరెనా 20వ సారి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం జరిగిన మహిళల సింగిల్స్ మూడో రౌండ్ మ్యాచ్‌లో మూడో సీడ్ సెరెనా 2–6, 6–2, 6–2తో 26వ సీడ్, 2017 యూఎస్ ఓపెన్ చాంపియన్ స్లోన్ స్టీఫెన్స్ (అమెరికా)పై కష్టపడి విజయం సాధించింది. గంటా 44 నిమిషాలపాటు జరిగిన ఈ మ్యాచ్‌లో సెరెనా 12 ఏస్‌లు సంధించి, మూడు డబుల్ ఫాల్ట్‌లు చేసింది. 23 అనవసర తప్పిదాలు చేసిన సెరెనా తన సర్వీస్‌ను రెండుసార్లు కోల్పోయి, ప్రత్యర్థి సర్వీస్‌ను నాలుగుసార్లు బ్రేక్ చేసింది. 2015 తర్వాత మళ్లీ స్లోన్ స్టీఫెన్స్‌తో తలపడిన సెరెనాకు తొలి సెట్లో అనూహ్య ప్రతిఘటన ఎదురైంది. ప్రిక్వార్టర్ ఫైనల్లో 15వ సీడ్ మరియా సాకరి (గ్రీస్)తో సెరెనా తలపడుతుంది. ఇతర మ్యాచ్‌ల్లో అజరెంకా 6–4, 6–2తో ఇగా షియాటెక్ (పోలాండ్)పై, పిరన్కోవా 6–4, 6–1తో 18వ సీడ్ డోనా వెకిచ్ (క్రొయేషియా)పై, అలీజి కార్నె 7–6 (7/4), 6–2తో ఏడో సీడ్ మాడిసన్ కీస్ (అమెరికా)పై, సోఫియా కెనిన్ 7–6 (7/4), 6–3తో ఆన్స్ జెబుర్ (ట్యూనిషియా)పై, మెర్టెన్స్ 7–5, 6–1తో కేథరిన్ మెక్నాలీ (అమెరికా)పై, ముకోవా 6–4, 2–6, 7–6 (9/7)తో సొరానా క్రిస్టియా (రొమేనియా)పై గెలిచారు. అగుట్, ఖచనోవ్ ఇంటిముఖం పురుషుల సింగిల్స్‌లో సీడెడ్ క్రీడాకారుల నిష్క్రమ ణ కొనసాగుతోంది. 8వ సీడ్ బాటిస్టా అగుట్ (స్పెయిన్), 11వ సీడ్ ఖచనోవ్ (రష్యా) మూడో రౌండ్లోనే ఇంటిముఖం పట్టారు. 94వ ర్యాంకర్ వాసెక్ పోస్పిసిల్ (కెనడా) 7–5, 2–6, 4–6, 6–3, 6–2తో బాటిస్టా అగుట్‌ను... 28వ ర్యాంకర్ అలెక్స్ డి మినార్ (ఆస్ట్రేలియా) 6–4, 0–6, 4–6, 6–3, 6–1తో ఖచనోవ్‌ను ఓడించారు. క్వార్టర్ ఫైనల్లో బోపన్న జంట... పురుషుల డబుల్స్ విభాగంలో రోహన్ బోపన్న (భారత్)–డెనిస్ షపోవలోవ్ (కెనడా) జంట క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. రెండో రౌండ్ మ్యాచ్‌లో బోపన్న–షపోవలోవ్ ద్వయం 4–6, 6–4, 6–3తో ఆరో సీడ్ కెవిన్ క్రావిట్జ్–ఆండ్రీస్ మీస్ (జర్మనీ) జోడీని ఓడించింది. వైదొలిగిన మ్లాడెనోవిచ్ జంట మహిళల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ మ్లాడెనోవిచ్ (ఫ్రాన్స్)–తిమియా బాబోస్ (హంగేరి) జంట టోర్నీ మధ్యలో వైదొలిగింది. టోర్నీ ప్రారంభానికి ముందు కరోనా సోకిన పెయిర్ (ఫ్రాన్స్) ప్రైమరీ కాంటాక్ట్ జాబితాలో మ్లాడెనోవిచ్ ఉండటమే దీనికి కారణం. పెయిర్‌తో కాంటాక్ట్ ఉన్న వాళ్లందరికీ న్యూయార్క్ సిటీ ఆరోగ్య విభాగం ఐసోలేషన్లోకి వెళ్లాలని నోటీసులు జారీ చేసింది. క్వార్టర్ ఫైనల్లో జెనిఫర్ బ్రేడీ మహిళల సింగిల్స్‌లో అమెరికాకు చెందిన 28వ సీడ్ క్రీడాకారిణి జెనిఫర్ బ్రేడీ క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఆదివారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో బ్రేడీ 6–1, 6–4తో 2016 యూఎస్ ఓపెన్ చాంపియన్, ప్రపంచ మాజీ నంబర్‌వన్ ఎంజెలిక్ కెర్బర్ (జర్మనీ)పై సంచలన విజయం సాధించింది. తన కెరీర్లో తొలిసారి ఓ గ్రాండ్‌స్లామ్ టోర్నీలో బ్రేడీ క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. -
నాదల్‌దే పైచేయి
మెల్బోర్న్: మైదానం బయట తరచూ తనపై వ్యంగ్య వ్యాఖ్యలు చేసే ఆస్ట్రేలియా టెన్నిస్ స్టార్ నిక్ కిరియోస్తో సోమవారం జరిగిన ప్రిక్వార్టర్ ఫైనల్లో రాఫెల్ నాదల్ పైచేయి సాధించాడు. 3 గంటల 38 నిమిషాలపాటు జరిగిన పురుషుల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రపంచ నంబర్‌వన్, టాప్ సీడ్ నాదల్ 6–3, 3–6, 7–6 (8/6), 7–6 (7/4)తో 23వ సీడ్ కిరియోస్‌ను ఓడించి ఆస్ట్రేలియన్ ఓపెన్‌లో క్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించాడు. నాదల్ డజన్ ఏస్‌లు సంధించి 64 విన్నర్స్ కొట్టాడు. తాజా విజయంతో కిరియోస్తో ముఖాముఖి రికార్డులో నాదల్ 5–3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. ఇతర ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో థీమ్ 6–2, 6–4, 6–4తో పదో సీడ్ గేల్ మోన్ఫిల్స్ (ఫ్రాన్స్)పై, ఏడోసీడ్ జ్వెరెవ్ (జర్మనీ) 6–4, 6–4, 6–4తో 17వ సీడ్ రుబ్లెవ్ (రష్యా)పై, 15వ సీడ్, మాజీ చాంపియన్ వావ్రింకా (స్విట్జర్లాండ్) 6–2, 2–6, 4–6, 7–6 (7/2), 6–2తో నాలుగో సీడ్ మెద్వెదేవ్ (రష్యా)పై విజయం సాధించారు. కెర్బర్ ఓటమి... మహిళల సింగిల్స్ ప్రిక్వార్టర్ ఫైనల్స్‌లో నాలుగో సీడ్ హలెప్ 6–4, 6–4తో మెర్టెన్స్ (బెల్జియం)పై.. ముగురుజా 6–3, 6–3తో తొమ్మిదో సీడ్ కికి బెర్టెన్స్ (నెదర్లాండ్స్)పై... పావ్లీచెంకోవా 6–7 (5/7), 7–6 (7/4), 6–2తో 2016 చాంపియన్ కెర్బర్ (జర్మనీ)పై... కొంటావీట్ 6–7 (4/7), 7–5, 7–5తో ఇగా స్వియాటెక్ (పోలాండ్)పై గెలుపొందారు. -
ప్రిక్వార్టర్స్‌లో శ్రీకాంత్, సాయిప్రణీత్
బాసెల్ (స్విట్జర్లాండ్): స్విస్ ఓపెన్ గ్రాండ్‌ప్రి గోల్డ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో టాప్ సీడ్ కిడాంబి శ్రీకాంత్‌తోపాటు సాయిప్రణీత్, ఆనంద్ పవార్ ప్రిక్వార్టర్ ఫైనల్లోకి ప్రవేశించారు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ రెండో రౌండ్లో ఈ హైదరాబాద్ ప్లేయర్ 21-10, 21-14తో దితెర్ డోమ్కె (జర్మనీ)పై గెలిచాడు. కేవలం 25 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో ఏ దశలోనూ శ్రీకాంత్‌కు పోటీ ఎదురుకాలేదు. ఇతర రెండో రౌండ్ మ్యాచ్‌ల్లో సాయిప్రణీత్ 21-11, 21-13తో బెరినో జియాన్ వోంగ్ (మలేసియా)పై, ఆనంద్ పవార్ 13-21, 22-20, 21-16తో డారెన్ లూ (మలేసియా)పై గెలిచారు. అంతకుముందు మంగళవారం రాత్రి జరిగిన తొలి రౌండ్ మ్యాచ్‌ల్లో శ్రీకాంత్ 21-18, 21-10తో లుకాస్ కొర్వీ (ఫ్రాన్స్)పై, సాయిప్రణీత్ 21-9, 21-9తో లుకా జెడెన్జాక్ (క్రొయేషియా)పై, ఆనంద్ పవార్ (భారత్) 21-11, 21-13తో జోయల్ కోనిగ్ (స్విట్జర్లాండ్)పై, అజయ్ జయరామ్ (భారత్) 21-7, 21-7తో ఐదో సీడ్ హు యున్ (హాంకాంగ్)పై విజయం సాధించారు.