Private bus driver
-
తలపై నుంచి దూసుకెళ్లిన బస్సు చక్రం
ధర్మవరం అర్బన్: కియా సంస్థకు కార్మికు లను చేరవేసే బస్సు డ్రైవర్ సోమవారం తెల్లవారుజామున ధర్మవరం పట్టణంలో భీభత్సం సృష్టించాడు. అతి వేగంగా వాహనాన్ని రాంగ్ రూట్లో నడుపుతూ ఒకరి మృతికి కారణమయ్యాడు. పోలీసులు తెలిపిన మేరకు... ధర్మవరం మండలం పోతుకుంట కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ నాగార్జున తన ఆటోలో ఎర్రగడ్డలు వేసుకుని సోమవారం తెల్లవారుజామున ధర్మవరానికి బయలుదేరాడు. అదే సమయంలో గిర్రాజుకాలనీకి చెందిన రవి తన బంధువైన గీతానగర్ నివాసి నరేంద్ర(24)తో కలిసి ద్విచక్రవాహనంలో ధర్మవరం పట్టణంలోకి ప్రవేశించారు. ఈ రెండు వాహనాలు రైల్వే బ్రిడ్జిపై వెళుతుండగా ఎదురుగా రాంగ్రూట్లో వేగంగా దూసుకొచ్చిన కియా బస్సు ఢీకొట్టింది. ఘటనలో ఆటో డ్రైవర్ నాగార్జున తీవ్రంగా గాయపడ్డాడు. ద్విచక్రవాహనంలో వెనుక కూర్చొన్న నరేంద్ర కిందకు పడగా అతని తల మీదుగా బస్సు చక్రం దూసుకెళ్లింది. తల నుజ్జునుజై అక్కడికక్కడే నరేంద్ర మరణించాడు. ద్విచక్ర వాహనం నడుపుతున్న రవి.. బైకుకు, బస్సుకు మధ్యలో ఇరుక్కుపోయాడు. బస్సు డ్రైవర్ వాహనాన్ని ఆపకుండా అలాగే బైక్‌ను లాక్కెళ్లాడు. మార్నింగ్ వాక్కు వచ్చిన వారు గట్టిగా కేకలు వేస్తున్నా డ్రైవర్ బస్సు ఆపకుండా వేగంగా ముందుకెళ్లాడు. దాదాపు అర కిలోమీటరు దూరం వెళ్లాక బస్సు ఆపి బైకు కింది నుంచి స్థానికుల సాయంతో రవిని పక్కకు లాగారు. బస్సు కింద ఇరుక్కున బైకును వెలికి తీయకుండానే డ్రైవర్ మరోసారి బస్సును ముందుకు దూకించాడు. వేగంగా బస్సును జిగ్‌జాగ్ డ్రైవింగ్ చేస్తూ పోతుకుంట సమీపంలోని పెట్రోల్ బంక్ వద్ద బస్సును ఆపి ఉడాయించాడు. కాగా, ద్విచక్రవాహనంలో ఇరుక్కుపోయిన రవికి కాలు విరిగి ఎముక బయటకు వచ్చింది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న 108 సిబ్బంది అక్కడకు చేరుకుని రవిని ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం హుటాహుటిన బెంగళూరుకు తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్ నాగార్జునను అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఘటనపై ధర్మవరం అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితుడి కోసం గాలిస్తున్నారు. -
కోర్కె తీర్చమని వేధింపులు!
నెల్లూరు(క్రైమ్): కోర్కె తీర్చలేదని ఓ యువతిని, ఆమె కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించిన ఓ యువకుడిపై వేదాయపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల సమాచారం మేరకు.. కొండాయపాళెంకు చెందిన ఓ యువతి ఇంటర్మీడియట్ చదువుకుని ఇంటి వద్దనే ఉంటుంది. ఆ సమయంలో ఆమెకు ప్రైవేట్ బస్సుడ్రైవర్ షేక్ హుస్సేన్‌తో పరిచయం అయింది. ఇద్దరు సన్నిహితంగా మెలిగారు. ఈ విషయం తెలుసుకున్న యువతి కుటుంబ సభ్యులు ఆమెను మందలించడంతో ఆమె హుస్సేన్‌కు దూరంగా ఉంటూ వచ్చింది. దీంతో కోపోద్రిక్తుడైన హుస్సేన్ ఆమెను తనతో మాట్లాడమని, తన కోర్కె తీర్చమని ఫోన్ చేసి వేధిస్తున్నాడు. తాను చెప్పినట్లు వినకపోతే యువతి తమ్ముడిని సైతం చంపుతామని బెదిరించాడు. అయినా ఆమె పట్టించుకోకపోవడంతో వేధింపులను అధికం చేశాడు. ఈ క్రమంలో బాధితురాలి ఇంటి ముందు నిలిపి ఉంచిన బైక్ ఈ నెల 27వ తేదీ తెల్లవారుజామున దగ్ధమైంది. దీంతో బాధిత యువతి శనివారం హుస్సేన్ వేధింపులపై వేదాయపాళెం పోలీసులకు ఫిర్యాదు చేసింది. బైక్‌ను సైతం హుస్సేనే దగ్ధం చేసి ఉండటాడని ఫిర్యాదులో పేర్కొంది. యువతి ఫిర్యాదు మేరకు వేదాయపాళెం పోలీస్‌స్టేషన్ ఎస్సై ఐ. మస్తానయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
బస్సు డ్రైవర్ పై ప్రయాణికుల ఫిర్యాదు
నెల్లూరు : ఓ ప్రయివేటు బస్పు డ్రైవర్ పై ప్రయాణికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మద్యం సేవించి బస్సు నడుపుతున్న బస్సు డ్రయివర్‌పై ప్రయాణికులు సోమవారం ఉదయం నెల్లూరు జిల్లా చిల్లకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రయాణికుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ప్రైవేటు ట్రావెల్స్ బస్సు బోల్తా
ఒకరు మృతి, 15 మందికి గాయాలు యర్రగొండపాలెం మండలం సర్వాయపాలెం సమీపంలో ఘటన యర్రగొండపాలెం, న్యూస్‌లైన్: ఓ ప్రైవేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఒకరిని బలి తీసుకోగా.. 15 మందిని క్షతగాత్రులుగా మార్చింది. హైదరాబాద్‌కు చెందిన భవ్య ట్రావెల్స్ బస్సు ప్రయాణికులను ఎక్కించుకొని ఉదయగిరికి బయలుదేరింది. ఆదివారం ఉదయం యర్రగొండపాలెం మండలంలోని సర్వాయపాలెం సమీపంలోని మలుపువద్దకు రాగానే అదుపుతప్పి ఒక్కసారిగా బోల్తా పడింది. దీంతో మార్కాపురానికి చెందిన చక్కిలం రవితేజ(28) అక్కడికక్కడే మృతి చెందాడు. ఇతనికి బెంగళూరులోని బీబీఎంలో సీటు రావడంతో హైదరాబాదులో తాను చదివిన కళాశాలకు వెళ్లి సర్టిఫికెట్లు తీసుకొని తిరుగు ప్రయాణమయ్యాడు. ఈ లోగానే ఈ విషాదం జరిగింది. పామూరుకు చెందిన పాములపాటి సుజాత, కుశల్‌కుమార్, ఉదయగిరి మండలం నందిపాడుకు చెందిన నల్లబోతుల అనంతమ్మ, హైదరాబాదుకు చెందిన మక్కెన హనుమంతరావు, కీర్తన, సుజాత, దోర్నాల మండలం కటకానిపల్లెకు చెందిన షేక్ నజియా, మార్కాపురానికి చెందిన షేక్ రసూల్, తులసి, దొనకొండ మండలం సంగాపురానికి చెందిన గార్లపాటి మరియమ్మ, బస్సు డ్రైవర్ కొండలరావుతో పాటు మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరికి ప్రథమ చికిత్స అందించిన అనంతరం నరసరావుపేట, మార్కాపురం వైద్యశాలకు తరలించారు. బస్సులో 45 మంది ప్రయాణిస్తున్నారు. సీఐ బీ పాపారావు, ఎస్సై పీ ముక్కంటి హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులకు సేవలందించారు. మార్కాపురం ఎమ్మెల్యే జంకె చొరవ.. మార్కాపురం ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి కారులో హైదరాబాదుకు వెళుతుండగా.. జరిగిన ప్రమాదాన్ని తెలుసుకొని సంఘటనా స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన నలుగురిని తన కారులో మార్కాపురంలోని వైద్యశాలకు తరలించారు. పారిశ్రామికవేత్త రావి రమేష్‌రెడ్డి కూడా ఇదే విధంగా సేవలందించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.