Priyanka Chopra
-
కొత్త పెళ్లికూతురికి పసుపుతో భయంకరమై ఎలర్జీ వచ్చిందట! ఫోస్ట్ వైరల్
గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా సోదరుడు సిద్ధార్థ్ చోప్రా తన ప్రేయసి, నటి నీలమ్ ఉపాధ్యాయను ( ఫిబ్రవరి 7న) పెళ్లి చేసుకున్నాడు. ఎంతో ఘనంగా జరిగిన ఈ వివాహ మహోత్సవానికి భార్యాభర్తలు ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ వచ్చి సందడి చేశారు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన ఫోటోలు, మరీ ముఖ్యంగా ఆడపడుచు హోదాలో ప్రియాంక స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచింది. 'సిడ్నీ కి షాదీ' తన సోదరుడి వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌ను హల్దీ వేడుకతో ప్రారంభిస్తున్నట్లు ఫ్యాన్స్‌తో పంచుకుంది. హల్దీ, బారాత్, వెళ్లి వేడుకల్లో డ్యాన్స్ చేసి అందర్నిఫిదా చేసింది. భర్త నిక్, కుమార్తెతో కలిసి కొత్త జంట సిద్ధార్థ్ చోప్రా, నీలం ఉపాధ్యాయతో పాటు, నిక్ జోనాస్ తల్లిదండ్రులుతో కలిసి స్పెషల్‌గా ఫొటోలకు పోజులిచ్చింది. అయితే తాజాగా మరో విషయం నెట్టింట వైరల్‌గా మారింది.ప్రియాంక చోప్రా 'భాభి', నీలం ప్రీవెడ్డింగ్ వేడుకల అయిన హల్దీ వేడుక (ఫిబ్రవరి 5న)లో స్కిన్ ఎలర్జీతో బాధపడిందట. 'హల్దీ' మూలంగా తనకు అలర్జీ వచ్చిందని నీలం వెల్లడించింది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీని ప్రకారం మెడ , కాలర్‌బోన్ ప్రాంతం చుట్టూ భయంకరమైన చర్మ అలెర్జీ స్పష్టంగా కనిపిస్తోంది. బహుశా సేంద్రీయ పసుపుకాకపోవడంతో ఆమెకు ఎలర్జీ వచ్చినట్టుంది. ముందుగా టెస్ట్ చేసినప్పిటికీ, ఎలర్జీ వచ్చిందని ఇన్స్టాగ్రామ్ స్టోరీలో వాపోయింది. ఈ ఫోటోలు నీలం నల్లపూసలతో కూడా మంగళసూత్రాన్ని కూడా చూపించింది. ఎండలో ఉండటం వల్ల ఇలా వచ్చిందా; అప్లయ్ చేయడానికి కొన్ని రోజుల ముందు ప్యాచ్ టెస్ట్ కూడా చేసా, అన్నీ బాగానే ఉన్నాయి. దీనికేంటి పరిష్కారం, అసలు ఎందుకిలా అయింది.. దయచేసి ఎవరైనా సలహా చెప్పండి అంటూ అభ్యర్థించింది.ఇదీ చదవండి :బిలియనీర్‌తో పెళ్లి అని చెప్పి, రూ.14 కోట్లకు ముంచేసింది : చివరికి!పసుపుతో అలెర్జీ వస్తుందా? పసుపు సాధారణంగా చాలా మందికి సురక్షితమైనది . ప్రయోజనకరమైనది. కానీ కొందరిలో దుష్ప్రభావాలను కలిగిస్తుంది. సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఇది చెడు ప్రభావాన్ని చూపిస్తుంది. అత్యంత ముఖ్యమైన దుష్ప్రభావం అలెర్జీ. దీనివల్ల చర్మంపై దద్దుర్లు, దురద, వాపు మచ్చలు వచ్చే అవకాశం ఉంది. దీన్ని చర్మంపై పూసినప్పుడు కాంటాక్ట్ డెర్మటైటిస్ లాంటి అలెర్జీ ప్రతిచర్యలకు కారణమవుతుంది. ఒక్కోసారి శ్వాస ఆడకపోవడంలాంటి కనిపించవచ్చు. ఇంకా లోపలికి తీసుకుంటే విరేచనాలు, వికారం,కడుపు నొప్పి వంటి తేలికపాటి జీర్ణ సమస్యల నుండి ఇనుము లోపం, పిత్తాశయ సమస్యలు, తక్కువ రక్తంలో చక్కెర స్థాయిలు వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు.ఎవరు జాగ్రత్తగా ఉండాలి?పిత్తాశయ వ్యాధి ఉన్నవారు పసుపును నివారించాలి. ఎందుకంటే ఇది పరిస్థితిని మరింత దిగజార్చవచ్చు. ఆస్ప్రిన్, వార్ఫరిన్ వంటి రక్తాన్ని పలుచబరిచే మందులు వాడేవారు పసుపు రక్తస్రావం పెంచే అవకాశం ఉన్నందున దానిని నివారించాలి. గర్భిణీలు , పాలిచ్చే స్త్రీలు కూడా పసుపును జాగ్రత్తగా వాడాలి.పసుపులో ఉండే పదార్ధం కర్కుమిన్, యాంటీ ఇన్ఫ్లమేటరీ , యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటుంది, ఇవి అలెర్జీ లక్షణాలను తగ్గించడంలో సహాయపడతాయి. అయితే, ఇది వ్యక్తులను బట్టి మారుతూ ఉంటుంది.దురదలు, దద్దుర్లు తగ్గించే యాంటిహిస్టామైన్ లాంటి మందులను వాడాలి. సమస్య బాగా తీవ్రంగా ఉంటే కార్టికోస్టెరాయిడ్, అనాఫిలాక్సిస్ లాంటి మందులను వైద్యుల పర్యవేక్షణలో వాడాలి. ఇంకా సమస్య తీవ్రతను బట్టి సబ్లింగ్యువల్ ఇమ్యునోథెరపీ అవసరం అవుతుంది. ఏదిఏమైనా సమస్యను వైద్యుడి దృష్టికి తీసుకెళ్లి, తగిన పరీక్షల అనంతరం నిపుణుల సలహా మేరకు చికిత్స తీసుకోవాలి.కాగా సిద్ధార్థ్ చోప్రా పెళ్లి చేసుకున్న నీలం ఉపాధ్యాయ తెలుగు, తమిళ సినిమాల్లో హీరోయిన్గా నటించింది. 2012లో నక్షత్ర అనే మూవీతో తెలుగులో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. తరువాత 2013లో హీరో అల్లరి నరేష్‌కు జోడీగా యాక్షన్ 3డి మూవీలో హీరోయిన్గా నటించింది నీలం. ఆ తరువాత తమిళ మూవీల్లో కూడా నటించింది. -
ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి.. సెలబ్రేషన్స్ మామూలుగా లేవుగా!
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ముంబయిలోని ఓ రిసార్ట్‌లో కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో వివాహ వేడుకను సెలబ్రేట్ చేసుకున్నారు. ప్రియాంక సోదరుడు సిద్దార్థ్ చోప్రా తన ప్రియురాలు నీలం ఉపాధ్యాయ మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ పెళ్లిలో ప్రియాంక చోప్రా తన డ్యాన్స్‌తో అదరగొట్టింది. బాలీవుడ్ సాంగ్స్‌కు స్టెప్పులు వేస్తూ పెళ్లి వేడుకల్లో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.తన సోదరుడి పెళ్లి ప్రియాంక సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. మండపం వద్దకు సోదరుడిని తీసుకురావడంతో పాటు డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. కుటుంబ సభ్యులతో పాటు తన భర్త నిక్ జోనాస్లో కలిసి ఈ పెళ్లి వేడుకలో అలరించింది. అంతేకాకుండా డ్యాన్స్ చేస్తూ అందరినీ ఆకట్టుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియురాలి మెడలో మూడు ముళ్లు.. ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి వేడుక (ఫోటోలు)
-
సిద్ధార్థ్ చోప్రా సంగీత్ పార్టీలో ప్రియాంక చోప్రా,నిక్ (ఫొటోలు)
-
సోదరుడి పెళ్లిలో ప్రియాంక చోప్రా.. కూతురిని ఎలా రెడీ చేసిందో చూశారా?
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా ప్రస్తుతం ముంబయిలో బిజీబిజీగా ఉంది. తన సోదరుడు సిద్ధార్థ్ చోప్రా పెళ్లికి కుటుంబ సమేతంగా ఇండియాకు వచ్చేసింది. తాజాగా జరిగిన హల్దీ వేడుకలో ప్రియాంక డ్యాన్స్ చేస్తూ సందడి చేసింది. అంతే తన ముద్దుల కూతురితో కలిసి పెళ్లి వేడుకల్లో పాల్గొంది. మామయ్య వివాహా వేడుకల్లో మాల్టీ మేరీ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. భారతీయ సంప్రదాయ దుస్తులైన లెహంగా ధరించి మెహందీ వేడుకలో మెరిసింది. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక చోప్రా తన ఇన్‌స్టాలో షేర్ చేసింది.కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లో అడుగుపెట్టిన ప్రియాంక చోప్రా సోదరుడి పెళ్లి కోసమని ముంబయికి వెళ్లిపోయింది. సిద్దార్థ్ చోప్రా పెళ్లి కోసం ఆమె భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ కూడా ఇవాళ ఇండియా చేరుకున్నారు. ప్రియాంక చోప్రా తన కూతురు మాల్టి మేరీతో కలిసి మెహందీ వేడుకల్లో స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది. ఇది చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. ఈ వివాహా కోసం ప్రియాంక అత్తమామలు డెనిస్ జోనాస్, కెవిన్ జోనాస్ కూడా భారతదేశానికి వచ్చేశారు. ఈ పెళ్లి వేడుకల్లో ప్రియాంక కజిన్ సిస్టర్ మన్నారా చోప్రా కూడా పాల్గొన్నారు. కాగా.. ప్రియాంక సోదరుడు సిద్ధార్థ్ చోప్రా నటి నీలం ఉపాధ్యాయను శుక్రవారం వివాహం చేసుకోబోతున్నారు.మహేశ్ బాబు సినిమాలో ప్రియాంక చోప్రా..రాజమౌళి- మహేశ్ బాబు కాంబోలో తెరకెక్కిస్తోన్న అడ్వంచరస్ చిత్రంలో ప్రియాంక చోప్రా కీలక పాత్ర చేయనున్నట్లు తెలుస్తోందియ ఇటీవల హైదరాబాద్‌లోని చిలుకూరి బాలాజీ ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన ఆమె న్యూ జర్నీ బిగిన్స్ అంటూ ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. తాజాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని.. నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే మరో టాక్ వినిపిస్తోంది. అయితే దీనిపై మరింత స్పష్టత రావాల్సి ఉంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
ప్రియాంక చోప్రా సోదరుడి హల్దీ వేడుక (ఫోటోలు)
-
మహేశ్ మూవీలో విలన్?
మహేశ్‌బాబు మూవీలో విలన్‌గా నటించనున్నారట ప్రియాంకా చోప్రా. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఓ భారీ ఫారెస్ట్ అడ్వెంచరస్ యాక్షన్ ఫిల్మ్ రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంకా చోప్రా ఓ కీలక పాత్రకు ఎంపికయ్యారనే వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ఇటీవల ప్రియాంకా చోప్రా హైదరాబాద్ రావడం, కొన్ని రోజులు ఇక్కడే ఉండటం వంటి అంశాలు ఈ మూవీలో ఆమె భాగమయ్యారనే విషయాన్ని పరోక్షంగా స్పష్టం చేస్తున్నట్లుగా ఉన్నాయి. కాగా ఈ మూవీలో ప్రియాంకా చోప్రా హీరోయిన్గా నటిస్తున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. కానీ ఆమె చేయనున్నది హీరోయిన్ రోల్ కాదని, నెగటివ్ షేడ్స్ ఉన్న విలన్ రోల్ చేయనున్నారనే టాక్ వినిపిస్తోంది. ఈ విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక ఇటీవల మహేశ్–ప్రియాంక పాల్గొనగా హైదరాబాద్‌లో షూట్ జరిగింది. ఇది టెస్ట్ షూట్ అని, కాదు రెగ్యులర్ షూట్ అని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాలపై స్పష్టత రావాల్సి ఉంది. -
సోదరుడికి పెళ్లి కూతురిని వెతికి పెట్టిన ప్రియాంక చోప్రా.. అదేలాగంటే?
బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యామిలీలో పెళ్లి సందడి నెలకొంది. ఆమె సోదరుడు సిద్ధార్థ్ చోప్రా ఓ ఇంటి వాడు కానున్నారు. తన ప్రియురాలైన నీలం ఉపాధ్యాయను ఆయన పెళ్లాడనున్నారు. ఈ పెళ్లి కోసమే ప్రియాంక చోప్రా తన భర్త నిక్ జోనాస్‌తో కలిసి ఇండియా చేరుకుంది. తాజాగా సోదరుడి పెళ్లికి హాజరైన ఫోటోలను ఇన్‌స్టా వేదికగా షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.అయితే ప్రియాంక చోప్రా తన సోదరుడు సిద్ధార్థ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. సిద్ధార్థ్ తనకు కాబోయే భార్య నీలం ఉపాధ్యాయను ఓ డేటింగ్ యాప్‌లో కలిశాడని వెల్లడించింది. ఆ తర్వాత వీరిద్దరి పరిచయం ప్రేమకు దారి తీసిందని తెలిపింది. అయితే ఆ డేటింగ్లో యాప్‌లో ప్రియాంక చోప్రా పెట్టుబడి పెట్టడం మరో విశేషం. అంతేకాదు ఆమె యాప్‌కు బ్రాండ్ అంబాసిడర్ కూడా.ఈ విషయంపై ప్రియాంక చోప్రా మాట్లాడుతూ.. "మేము యూఎస్‌కు చెందిన డేటింగ్ యాప్‌ను ఇండియాకు కూడా తీసుకొచ్చాం. నా సోదరుడు తన కాబోయే భార్యను మా యాప్ ద్వారానే కలిశాడు. అతనికి సరైన జోడీ దొరకడంతో నాకు కృతజ్ఞతలు కూడా చెప్పాడు. అ తాను ఎప్పుడూ డేటింగ్ యాప్‌ను ఉపయోగించలేదని తెలిపింది. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా కలవాలని అనుకున్నా. ఆ విధంగా నేను ఈ తరానికి చెందిన వ్యక్తిలా అనిపించకపోవచ్చు.' అని అన్నారు.సోషల్ మీడియా ద్వారా ప్రియాంక చోప్రా..ప్రియాంక తన భర్త, అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను ట్విటర్ ద్వారా కలుసుకుంది. ప్రియాంకకు మొదట నిక్ జోనాస్ సోషల్ మీడియాలో కనెక్ట్ అయ్యాడు. ఆ తర్వాత మనం కలవాలని కొంతమంది స్నేహితులు చెప్పారని ప్రియాంకకు సందేశం పంపించాడు. దీంతో ఒక రోజు తర్వాత ప్రియాంక స్పందించడంతో.. ఆ తర్వాత ఇద్దరూ ఆస్కార్ వేడుక తర్వాత ఓ పార్టీలో కలుసుకున్నారు. 2017లో ఇద్దరూ కలిసి మెట్ గాలాకు హాజరయ్యారు. అనంతరం 2018 ఏడాది చివర్లో ఇండియాలోనే వివాహం చేసుకున్నారు. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
దీపిక రికార్డ్ బద్దలు కొట్టిన ప్రియాంక?
-
ఆ మాటలతో డిప్రెషన్లోకి వెళ్లాను
‘‘నేను 19 ఏళ్లకే చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాను. అయితే సినిమా రంగంలోని వారు ఎలా ఉంటారనే విషయం అప్పటికి నాకు తెలియదు. ఓ దర్శకుడు నా కాస్ట్యూమ్స్ గురించి అభ్యంతరకరంగా మాట్లాడిన మాటలకి బాధపడి, డిప్రెషన్లోకి వెళ్లాను’’ అని హీరోయిన్ ప్రియాంకా చోప్రా అన్నారు. ఇటీవల జరిగిన ఓ సమ్మిట్‌లో ΄పాల్గొన్న ప్రియాంకా చోప్రా కెరీర్ తొలినాళ్లలో తనకు ఎదురైన ఘటనల గురించి మాట్లాడారు. ‘‘ఓ సినిమా షూటింగ్ కోసం సెట్‌కి వెళ్లాను.నాకు ఎలాంటి దుస్తులు కావాలో నా కాస్ట్యూమ్ డిజైనర్‌కు చెప్పండి అని డైరెక్టర్‌తో అన్నాను. నా ముందే నా కాస్ట్యూమ్ డిజైనర్‌కి ఫోన్ చేసిన ఆయన... ‘కథానాయిక లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కు వస్తారు. అందుకే ప్రియాంక దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి.. తన లోదుస్తులు కనిపించాలి’ అంటూ పలుమార్లు ఆ పదాన్ని ఉపయోగించాడు.ఆ మాటలు విన్నప్పుడు చాలా నీచంగా, బాధగా అనిపించింది. దీంతో నేను డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి ఆ డైరెక్టర్ నన్ను చిన్నచూపు చూస్తే ఆ సినిమా చేయనని చెప్పేశాను. ఆ తర్వాత ఆ మూవీ చేయలేదు. ఇన్నేళ్ల నా కెరీర్లో ఇప్పటివరకు కూడా ఆ దర్శకుడితో పని చేయలేదు’’ అని పేర్కొన్నారు ప్రియాంకా చోప్రా. -
19 ఏళ్ల వయసు..అలా చూపిస్తేనే థియేటర్‌కి వస్తారన్నాడు: హీరోయిన్
సినిమా అనేది రంగుల ప్రపంచం. ప్రతి ఒక్కరు ఎంతో ఆశతో ఇండస్ట్రీలోకి వస్తారు. అవకాశాల కోసం ఎదురు చూసి..చాన్స్ వచ్చినప్పుడే తమను తాము నిరూపించుకుంటారు. ఇప్పుడు పై స్థాయిలో ఉన్నవారంతా ఒకప్పుడు ఎన్నో అవమానాలు, బాధలు భరించి వచ్చినవాళ్లే. ముఖ్యంగా హీరోయిన్లు అయితే చాలా ‘ఇబ్బందులను’ ఎదుర్కొవాల్సి వస్తోంది. అవకాశాల పేరుతో మోసం చేసేవాళ్లు కొంతమంది అయితే.. అవకాశం ఇచ్చి అవమానించే వారు మరికొంతమంది. ఇలాంటి వాళ్లను తట్టుకొనే ఈ స్థాయికి వచ్చానని అంటోంది గ్లోబల్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra). తన కెరీర్ ప్రారంభంలో ఎన్నో అవమానాలు ఎదుర్కొన్నానని, 19 ఏళ్ల వయసులోనే ఓ డైరెక్టర్ తన గురించి చెడుగా ప్రవర్తించాడని, ఆయన అన్న మాటలకు డిప్రెషన్లోకి వెళ్లాని చెప్పింది. నీచంగా మాట్లాడాడుతాజాగా జరిగిన ఫోర్బ్స్ పవర్ ఉమెన్స్ సమ్మిట్‌లో ప్రియాంక పాల్గొని కెరీర్ ప్రారంభంలో తనకు ఎదురైన అవమానాల గురించి చెప్పుకొచ్చింది. ‘19 ఏళ్ల వయసులో నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాను. అప్పటికే చిత్ర పరిశ్రమలో ఎలా ఉంటారో కూడా తెలియదు. ఓ సినిమా కోసం సెట్లోకి వెళ్లాను. దర్శకుడిని కలిసి ఇప్పుడు నాకు ఎలాంటి దుస్తులు కావాలో ఒక్కసారి మా కాస్ట్యూమ్ డిజైనర్‌కి చెప్పండి’ అని అడిగాను. అతను నా ముందే స్టైలిస్ట్ ఫోన్ చేసి నీచంగా మాట్లాడాడు.అలాంటి దుస్తులే వేసుకోవాలిఆ డైరెక్టర్ నా స్టైలిస్ట్‌కి ఫోన్ చేసి.. ‘హీరోయిన్ లోదుస్తులు చూపిస్తేనే ప్రేక్షకులు థియేటర్‌కి వస్తారు. కాబట్టి ప్రియాంక ధరించే దుస్తులు చాలా చిన్నవిగా ఉండాలి. తన లోదుస్తులు కనిపించాలి. తను కూర్చోగానే లోదుస్తులు కనిపించాలి.. అంటూ పదే పదే ఆ పదాన్నే ఉపయోగించాడు. హిందీలో ఆ మాటలు విన్నప్పడు నీచంగా అనిపించిది. చాలా బాధ కలిగింది. డిప్రెషన్లోకి వెళ్లాను. మా అమ్మ దగ్గరకు వెళ్లి అతడు నన్ను అంత చిన్నచూపు చూస్తే నేను ఎప్పటికీ ఎదగలేను అని చెప్పేశాను. ఆ మరుసటి రోజే వెళ్లి నేను ఈ సినిమా చేయలేనని చెప్పాను. ఇప్పటికీ ఆ దర్శకుడితో నేను కలిసి పని చేయలేదు. నన్ను ఎలా చూపించుకోవాలని అనేది నా ఛాయిస్. దృష్టికోణం అనేది నిజం. నేను ఎలాంటి దృష్టితో చూస్తానో అదే నా ఐడెంటిటీగా మారుతుంది’ అని ప్రియాంక చెప్పుకొచ్చింది.మహేశ్‌కి జోడీగాబాలీవుడ్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన ప్రియాంక..పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి తన మకాంని మార్చింది. 'క్వాంటికో' టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్లో మంచి గుర్తింపు సంపాదించుకుంది. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి అక్కడ అగ్ర హీరోయిన్ల లిస్ట్‌లో చేరిపోయింది. ఈ గ్లోబల్ బ్యూటీ ప్రస్తుతం రాజమౌళి-మహేశ్‌బాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రంలో హీరోయిన్గా నటిస్తోంది. -
మహేష్ బాబు - రాజమౌళి సినిమాలో ఆమె మెయిన్ హీరోయిన్ కాదా..!
-
ప్రియాంక చోప్రా..రెమ్యునరేషన్ ఇన్నికోట్ల..!
-
ఓటీటీలో ఆస్కార్ నామినేటెడ్ 'అనూజ' చిత్రం
ఓవైపు హాలీవుడ్లో వరుస చిత్రాలతో బిజీగా గడుపుతూనే.. మరోవైపు అవకాశం వచ్చినప్పుడల్లా నిర్మాతగా కూడా నిరూపించుకుంటుంది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా (Priyanka Chopra). తాను నిర్మాతగా తెరకెక్కించిన 'అనూజ' (Anuja) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన కూడా వచ్చేసింది. తాజాగా ఈ షార్ట్ ఫిలిం ఆస్కార్ షార్ట్ లిస్ట్‌లో స్థానం దక్కించుకొని సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. ఆడమ్ జే గ్రేవ్స్ ఈ లఘు చిత్రానికి దర్శకత్వం వహించారు. జీవిత గమనాన్ని మార్చే సినిమాగా అనూజ అందరినీ మెప్పిస్తుందని ప్రియాంక చోప్రా పేర్కొంది. ఇలాంటి అద్భుతమైన ప్రాజెక్టులో తాను భాగమయ్యినందుకు గర్వపడుతున్నాని ఆమె తెలిపింది.ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో అనూజ చోటు దక్కించుకోవడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ అభిమానులు అనూజ చిత్రం కోసం ఎదరుచూస్తున్నారు. అయితే, ఫిబ్రవరి 5 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ అవుతుందని అధికారికంగా ఆ సంస్థ ప్రకటించింది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో చోటు దక్కించుకున్న ఈ చిత్రం తప్పకుండా అవార్డ్ సాధిస్తుందని మేకర్స్ నమ్మకంతో ఉన్నారు. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు.బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. మన దేశం నుంచి రేసులో అనూజ చిత్రం ఉండటం విశేషం. -
సెట్లో ఫోన్లు నిషిద్ధం.. మహేశ్‌బాబు సహా అందరితో అగ్రిమెంట్!
రాజమౌళి (SS Rajamouli) సినిమా అంటే అంచనాలు ఆకాశాన్నంటాల్సిందే! అందులోనూ తెలుగు సూపర్‌స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)తో అంటే బాక్సాఫీస్‌ను బ్లాస్ట్ చేసేందుకు జక్కన్న ఏదో గట్టిగా ప్లాన్ చేశాడనే అర్థం. వీరిద్దరి కాంబోలో ఇటీవలే #SSMB29 సినిమా లాంచ్ చేశారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగం ప్రేక్షకుల ముందుకు రావడానికి కనీసం రెండేళ్లయినా పట్టొచ్చని టాక్! ఈ చిత్రంలో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) నటించనున్నట్లు ఒక వార్త తెగ వైరలవుతోంది.షూటింగ్ షురూ?!ఇప్పటికే తన సినిమా కోసం ఒక సింహాన్ని లాక్ చేసినట్లు ఓ పోస్ట్ పెట్టాడు రాజమౌళి. అంటే మహేశ్‌బాబును తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేశానని చెప్పకనే చెప్పాడు. అలాగే షూటింగ్ షురూ అని కూడా హింట్ ఇచ్చాడు. ఈ పోస్టుకు మహేశ్‌బాబు స్పందిస్తూ.. ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను అని రిప్లై ఇచ్చాడు. ప్రియాంక చోప్రా.. ఫైనల్లీ అని కామెంట్ పెట్టింది. ఇదిలా ఉంటే తన సినిమా కోసం రాజమౌళి చాలా జాగ్రత్తపడుతున్నాడట! అగ్రిమెంట్ఎట్టి పరిస్థితుల్లోనూ కథ, షూటింగ్ క్లిప్స్, సినిమాలో నటించేవారి గురించి ఎలాంటి వివరాలు బయటకు రాకుండా చర్యలు తీసుకుంటున్నాడట. ఈ విషయంలో చిత్రయూనిట్‌కు హెచ్చరికలు జారీ చేశాడట. నటీనటులు, సాంకేతిక నిపుణులతో నాన్ డిస్క్లోజ్ అగ్రిమెంట్ (NDA) చేయించినట్లు తెలుస్తోంది. మహేశ్‌బాబు, ప్రియాంక చోప్రాతోనూ ఈ ఒప్పందంపై సంతకం చేయించారట! ఈ అగ్రిమెంట్ ప్రకారం సినిమాకు సంబంధించిన ఏ చిన్న విషయాన్ని కూడా యూనిట్ సభ్యులు బయటకు చెప్పేందుకు వీల్లేదు. లీక్ చేశారంటే భారీ మూల్యం..దర్శకనిర్మాతల అనుమతి లేకుండా ఎవరైనా సమాచారాన్ని లీక్ చేస్తే భారీ మూల్యం చెల్లించక తప్పదు. అలాగే హీరోతో సహా సెట్లో ఉన్న ఎవరూ ఫోన్లు తీసుకురావడానికి అనుమతి లేదని తెలుస్తోంది. అంతర్జాతీయ స్థాయిలో తీస్తున్న సినిమా కాబట్టి ఆమాత్రం జాగ్రత్తలు పాటిస్తే తప్పేం కాదంటున్నారు సినీప్రియులు. జక్కన్న ప్లాన్ బానే ఉంది.. మరి ఆచరణ ఏమేరకు సాధ్యమవుతుందో చూడాలి! View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) చదవండి: గేమ్ ఛేంజర్ డిజాస్టర్‌పై స్పందించిన అంజలి.. బాధేస్తోందంటూ.. -
మహేశ్‌బాబు సినిమా కోసం 'ప్రియాంక చోప్రా' భారీ రెమ్యునరేషన్
మహేశ్‌బాబు(Mahesh Babu) - దర్శకధీరుడు రాజమౌళి SSMB29 భారీ ప్రాజెక్ట్ ప్రారంభమైంది. అయితే, ఇందులో ప్రియాంక చోప్రా(Priyanka Chopra) కూడా నటిస్తున్నారు. ఆమె రెమ్యునరేషన్ గురించి నెట్టింట పెద్ద చర్చ నడుస్తుంది. ప్రియాంక చోప్రా సుమారు దశాబ్ధం పాటు బాలీవుడ్లో టాప్ హీరోయిన్గా కొనసాగారు. అదే సమయంలో ఆమె హాలీవుడ్లో అవకాశాలు దక్కించుకుని పలు ప్రాజెక్ట్‌లలో నటించడమే కాకుండా నిర్మాతగా కూడా అక్కడ రాణిస్తున్నారు. ప్రస్తుతం ఆమె అమెరికాలో స్థిరపడ్డారు. అయితే సుమారు పదేళ్ల తర్వాత ఒక ఇండియన్ (తెలుగు) సినిమాలో ప్రియాంక నటిస్తుండటం విశేషం. ఆమె ఎప్పుడో 2015 సమయంలో ఒప్పుకున్న 'ది స్కై ఈజ్ పింక్' చిత్రం 2019లో విడుదలైంది. బాలీవుడ్లో ఇదే ఆమె చివరి సినిమా.భారీ రెమ్యునరేషన్బాలీవుడ్కు మించిన రెమ్యునరేషన్లు తెలుగు చిత్ర పరిశ్రమ ఇస్తుంది. టాలీవుడ్లో ఇప్పటివరకు అత్యధిక పారితోషికం కల్కి సినిమా కోసం దీపికా పదుకోన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా కోసం ఆమె ఏకంగా సుమారు రూ. 20 కోట్లు తీసుకున్నట్లు అప్పట్లో భారీగా వార్తలు వచ్చాయి. అయితే, SSMB29 ప్రాజెక్ట్ కోసం ప్రియాంక చోప్రా ఏకంగా రూ.25 కోట్లు రెమ్యునరేషన్‌గా తీసుకుంటున్నట్లు నెట్టింట ప్రచారం జరుగుతుంది. కానీ, హాలీవుడ్ మీడియా మాత్రం సుమారు రూ. 40 కోట్లు వరకు ఉంటుందని కథనాలు ప్రచురించాయి. ఆమెకు అంత పెద్ద మొత్తంలో పారితోషికం ఇచ్చేందుకు నిర్మాత కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట.అంత మొత్తం ఇవ్వడానికి కారణం ఇదేప్రియాంక చోప్రా మార్కెట్ బాలీవుడ్లో భారీగానే ఉంది. చాలా గ్యాప్ తర్వాత ఆమె నటించిన సినిమా వస్తుండటంతో హిందీ బెల్ట్‌లో మంచి బిజినెస్ చేసే ఛాన్స్ ఉంది. ఆపై హాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కూడా ప్రియాంక అప్పీయరెన్స్ సినిమాకు ప్లస్ అవుతుంది. SSMB29 ప్రాజెక్ట్‌ను హాలీవుడ్ రేంజ్లో జక్కన్న ప్లాన్ చేశాడు. దీంతో సులువుగా అక్కడి మార్కెట్‌కు సినిమా రీచ్ అవుతుందని తెలుస్తోంది. ఈ లెక్కలన్నీ వేసుకునే ప్రియాంక చోప్రాకు భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు టాక్. ఒకవేళ ఈ ప్రాజెక్ట్ రెండు భాగాలుగా వస్తే.. అప్పుడు ఆమె రెమ్యునరేషన్ లెక్కలు మారిపోతాయి. ఏదేమైనా అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోయిన్గా ప్రియాంక చోప్రా రికార్డ్ క్రియేట్ చేశారని ఆమె అభిమానులు చెప్పుకుంటున్నారు.హాలీవుడ్లో ఫుల్ బిజీబాలీవుడ్లో ఎన్నో సూపర్‌హిట్ సినిమాలలో నటించిన ప్రియాంక 'క్వాంటికో' అనే టెలివిజన్ సిరీస్‌తో హాలీవుడ్ చిత్ర పరిశ్రమకు దగ్గరయ్యారు. ఆ తర్వాత బేవాచ్, ఏ కిడ్ లైక్ జాక్,లవ్ అగైన్,టైగర్, వుయ్ కెన్ బీ హీరోస్, ది వైట్ టైగర్ తదితర చిత్రాలలో నటించి ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాకుండా పలు షోలకు హోస్ట్‌గా వ్యవహరించి అక్కడి వారిని మెప్పించారు. హాలీవుడ్‌కి చెందిన ప్రముఖ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ని ప్రేమించి పెళ్లాడిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకు అదనపు గుర్తింపు లభించింది. -
సింహాన్ని లాక్ చేసిన రాజమౌళి.. స్పందించిన మహేశ్‌బాబు, ప్రియాంక
మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమా పనులు ప్రారంభమయ్యాయి. ఇండియన్ సినిమా హిస్టరీలోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా ఈ మూవీపై అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే హైదరాబాద్ శివారు ప్రాంతంలోని అల్యూమినియం ఫ్యాక్టరీలో 'SSMB 29' చిత్రాన్ని లాంచ్ చేశారు. చిత్ర యూనిట్‌తో పాటు మహేశ్‌బాబు(Mahesh Babu) ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అయ్యాయి. కానీ, ఈ సినిమా కార్యక్రమానికి సంబంధించి చిత్ర యూనిట్ నుంచి ఆ సమయంలో ఎలాంటి అధికారిక ప్రకటన అయితే వెలువడలేదు. అయితే, తాజాగా జక్కన్న తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక ఫోటో షేర్ చేసి అభిమానుల్లో జోష్ పెంచాడు.మహేశ్‌బాబు అభిమానుల దృష్టి అంతా SSMB29 సినిమాపైనే ఉంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రాజమౌళి( S. S. Rajamouli) ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక వీడియోను పంచుకున్నారు. ఒక సింహాన్ని లాక్ చేసినట్లు అందులో ఉంది. అంటే మహేశ్‌ను తన ప్రాజెక్ట్ కోసం లాక్ చేసినట్లు చెప్పేశాడు. జక్కన్న పోస్ట్‌కు కామెంట్ బాక్స్‌లో మహేశ్‌బాబు కూడా 'ఒక్కసారి కమిట్ అయితే నా మాట నేనే వినను..' అంటూ రెస్పాండ్ అయ్యాడు. ఆపై నమ్రతా శిరోద్కర్ (Namrata Shirodkar) కూడా చప్పట్ల ఎమోజీతో చిత్ర యూనిట్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పింది. అయితే, 'ఫైనల్లీ' అంటూ బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా (Priyanka Chopra) కామెంట్ బాక్స్‌లో రియాక్ట్ కావడం విశేషం. ఇలా జక్కన్న చేసిన పోస్ట్‌కు చాలామంది సెలబ్రిటీలు స్పందిస్తున్నారు. జక్కన్న పాస్‌పోర్ట్ చూపిస్తూ సింహం ఫోటోతో పోజ్ ఇచ్చారు. దీంతో SSMB29 సినిమా షూటింగ్ ప్రారంభమైనట్లేనని మహేశ్ అభిమానులు అనుకుంటున్నారు.'ఫైనల్లీ' తేల్చేసిన ప్రియాంక చోప్రాహీరోయిన్ ప్రియాంక చోప్రా ఇప్పటికే హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. SSMB29 ప్రాజెక్ట్ కోసమే ఆమె ఇక్కడకు వచ్చినట్లు తేలిపోయింది. తాజాగా రాజమౌళి చేసిన పోస్ట్‌కు ఫైనల్లీ అంటూ ఆమె రెస్పాండ్ అయ్యారు. దీంతో మహేశ్‌బాబు- ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో ప్రియాంక చోప్రానే హీరోయిన్ అని క్లారిటీ వచ్చేసింది. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడిన ప్రియాంక. చాలా రోజుల తర్వాత హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని పరోక్షంగా క్లారిటీ వచ్చేసింది. త్వరలో అధికారికంగా ప్రకటన రావచ్చు అని తెలుస్తోంది.‘ఆర్ఆర్ఆర్’తో ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళి.. ఇప్పుడు హాలీవుడ్ రేంజ్లో ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నట్లు తెలుస్తోంది. భారతీయ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకూ చూడని సరికొత్త ప్రపంచాన్ని ఈ చిత్రంలో రాజమౌళి ఆవిష్కరించబోతున్నారని రచయిత విజయేంద్రప్రసాద్ ఇప్పటికే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథ రెండు భాగాలుగా రానుంది. తొలి భాగాన్ని 2027లో విడుదల చేస్తారని ప్రచారంలో ఉంది. ఈ ప్రాజెక్ట్‌లో హాలీవుడ్ నటీనటులతో పాటు టెక్నీషియన్స్ కూడా ఇందులో భాగం కానున్నారు. View this post on Instagram A post shared by SS Rajamouli (@ssrajamouli) -
ఆస్కార్ నామినేషన్స్‌లో ప్రియాంక చోప్రా చిత్రం.. ఏ విభాగంలో అంటే?
ఈ ఏడాది జరగనున్న 97వ ఆస్కార్ నామినేషన్స్‌లో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా చిత్రం స్థానం దక్కించుకుంది. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేషన్స్‌లో నిలిచింది. తాజాగా ప్రకటించిన ఆస్కార్ నామినేషన్స్ లిస్ట్‌లో అనూజ చిత్రం పోటీ పడుతోంది. గార్మెంట్ ఫ్యాక్టరీలో పనిచేసే తొమ్మిదేళ్ల బాలిక జీవితంగా ఆధారంగా ఈ మూవీని గునీత్ మోంగా, ప్రియాంక చోప్రా నిర్మాతలుగా తెరకెక్కించారు. దీంతో బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో డోవ్ కోట్, ది లాస్ట్ రేంజర్, ది లియోన్, ది మ్యాన్ వు కుడ్నాట్ రిమేన్ సైలెంట్ చిత్రాలతో పోటీపడనుంది. ఈ కేటగిరీలో దాదాపు 180 సినిమాలు పోటీ పడగా..ఈ ఐదు చిత్రాలు నిలిచాయి. కాగా.. ప్రియాంక చోప్రా నిర్మాతగా తెరకెక్కించిన అనూజ షార్ట్ ఫిల్మ్ త్వరలోనే నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది. కంగువా, ది గోట్ లైఫ్ చిత్రాలకు నిరాశ.. Short on time, big on talent, here are this year's nominees for Live Action Short Film. #Oscars pic.twitter.com/Wx0TZIpUen— The Academy (@TheAcademy) January 23, 2025 -
చిలుకూరు బాలాజీని దర్శించుకున్న హీరోయిన్ ప్రియాంక చోప్రా (ఫొటోలు)
-
రామ్ చరణ్ భార్యకు ప్రియాంక చోప్రా ధన్యవాదాలు.. ఎందుకంటే?
ప్రముఖ చిలుకూరి బాలాజీ అలయాన్ని బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ఆమె ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలను ప్రియాంక తన ఇన్‌స్టాలో పంచుకున్నారు. శ్రీ బాలాజీ కొత్త అధ్యాయం ప్రారంభమైంది.. ఆ దేవుని దయతో మనందరం సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నట్లు రాసుకొచ్చారు. అంతే కాకుండా రామ్ చరణ్ భార్య ఉపాసనకు ధన్యవాదాలు తెలిపారు. అయితే అమెరికన్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా లాస్ ఎంజెల్స్‌లో స్థిరపడ్డారు. వీరిద్దరి మాల్టీ మేరీ అనే కుమార్తె కూడా ఉన్నారు. అయితే ఇటీవలే ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. దీంతో ప్రియాంక చోప్రా టాలీవుడ్ క్రేజీ ప్రాజెక్ట్‌లో పని చేయనుందా? అని ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు.ఎస్ఎస్ఎంబీ29లో ప్రియాంక చోప్రా?మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ప్రియాంక హైదరాబాద్‌కు వచ్చారని టాక్ వినిపిస్తోంది. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు గతంలో తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని టాలీవుడ్ ఫ్యాన్స్ భావిస్తున్నారు. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే టాక్ వినిపిస్తోంది. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
SSMB29 కోసం హైదరాబాద్ లో ల్యాండ్ అయిన ప్రియాంక చోప్రా...!
-
లాస్ ఏంజెల్స్ టు హైదరాబాద్
ప్రముఖ హీరోయిన్ ప్రియాంక చోప్రా హైదరాబాద్‌లో అడుగుపెట్టారు. అందులో విషయం ఏముందీ అనుకోవచ్చు. సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌తో పెళ్లి తర్వాత అమెరికాలోని లాస్ ఏంజెల్స్‌లో స్థిరపడ్డారు ప్రియాంక. ఇప్పుడు ఇలా హైదరాబాద్‌లో అడుగుపెట్టడానికి కారణం ఏంటి? అనేది హాట్ టాపిక్‌గా మారింది. మహేశ్‌బాబు హీరోగా రాజమౌళి దర్శకత్వంలో రూ΄పొందనున్న సినిమా కోసమే ఆమె భాగ్యనగరానికి చేరుకున్నారని టాక్. ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా నటించే హీరోయిన్ల జాబితాలో ప్రియాంకా చోప్రా, కియారా అద్వానీ, ఇండోనేషియా నటి చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్ వంటి వారి పేర్లు తెరపైకి వచ్చాయి. ఫైనల్‌గా ప్రియాంకా చోప్రాని కథానాయికగా ఫిక్స్ చేశారని భోగట్టా. ప్రియాంకా చోప్రా లాస్ ఏంజెల్స్ నుంచి హైదరాబాద్‌కి చేరుకోవడంతో ఈ మూవీ చిత్రీకరణ కోసమే ఆమె వచ్చారనే రూమర్లు వినిపిస్తున్నాయి. మరి... ఈ వార్త ఎంతవరకూ నిజమో తెలియాల్సి ఉంది. -
నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను...మీరే అసలైన హీరోలు: ప్రియాంక
అమెరికాలోని లాస్ ఏంజలెస్ కార్చిచ్చు( Los Angeles Wildfire ) సంక్షోభం ఇంకా కొనసాగుతుంది. ఇప్పటికే వేలాది మంది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. పెద్ద పెద్ద నిర్మాణాలన్నీ బూడిద పాలయ్యాయి. మంటలు ఇంకా చల్లారలేదు. ఎటు చూసినా విధ్వంసమే. లాస్ ఏంజెలెస్‌లోనే బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా(Priyanka Chopra ) నివాసముంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ కార్చిచ్చు సంక్షోభంపై ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. మంటలకు ఆహుతైన భవనాలను, అడవి ప్రాంతానికి సంబంధించిన ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తూ.. మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్న అగ్నిమాపక సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.‘హృదయం భారంగా ఉంది. నా బాధను మాటల్లో చెప్పలేకపోతున్నాను. ఈ కార్చిచ్చు నుంచి నా కుటుంబాన్ని కాపాడిన అగ్నిమాపక సిబ్బందికి జీవితాంతం రుణపడి ఉంటాను. స్నేహితులు, సహచరులు ఎంతోమంది నివాసాలను కోల్పోయారు. వేరే ప్రాంతాలకు తరలివెళ్లారు. ఈ మంటల కారణంగా ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. ఈ ప్రాంతాన్ని పునర్నిర్మించుకోవడానికి అధిక స్థాయిలో మద్దతు అవసరం. ఈ విధ్వంసం నుంచి ప్రజలను కాపాడడం కోసం అగ్నిమాపక సిబ్బంది, వాలంటీర్లు వారి ప్రాణాలను పణంగా పెట్టి పని చేశారు. మీరే నిజమైన హీరోలు’ అని ప్రియాంక రాసుకొచ్చింది.ఇంటితో సహా సర్వం కోల్పోయిన వారికి అంత అండగా ఉండాలని, విరాళాలు ఇచ్చి ఆదుకోవాలని కోరారు.పెళ్లి తర్వాత హాలీవుడ్‌కి మకాంబాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా 2000 సంవత్సరంలో మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఆమె సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి, బాలీవుడ్లో వరుస సినిమాలు చేసి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ప్రముఖ సింగర్, యాక్టర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకొని హాలీవుక్కి మకాం మార్చింది. అమెరికాలో స్థిరపడ్డ ప్రియాంక కేవలం హాలీవుడ్ చిత్రాలపైనే దృష్టి పెట్టారు. ‘సిటాడెల్ సీజన్– 1’వెబ్ సిరీస్‌లో నటించిన ఆమె ప్రస్తుతం సీజన్ 2లో బిజీగా ఉన్నారు.రాజమౌళీ- మహేశ్ సినిమాలో హీరోయిన్గా ప్రియాంకమహేశ్బాబు(Mahesh Babu) హీరోగా రాజమౌళి ఓ సినిమా తెరకెక్కించనున్న సంగతి తెలిసిందే. ‘ఎస్ఎస్ఎమ్బి 29’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం రూపొంనుంది. ఈ సినిమా కోసం పొడవాటి జుట్టు, గుబురు గడ్డం, మీసాలతో సరికొత్త లుక్‌లోకి మారిపోయారు మహేశ్‌బాబు. దుర్గా ఆర్ట్స్‌పై కేఎల్ నారాయణ నిర్మించనున్న ఈ సినిమా 2025లో ప్రారంభం కానుంది. దాదాపు 1000 కోట్ల బడ్జెట్‌తో రెండు భాగాలుగా రూపొందనున్న ఈ సినిమాలో పలువురు విదేశీ నటులు కనిపించనున్నారు. భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషల్లోనూ ఈ మూవీని అనువదించనున్నారు. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ అడ్వెంచర్ సినిమాకి రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కథ అందించారు. ఇదిలా ఉంటే... ఈ చిత్రంలో మహేశ్‌బాబుకి జోడీగా ప్రియాంకా చోప్రా నటించనున్నారనే వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇదే నిజమైతే చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత దక్షిణాదిలో ప్రియాంకా చోప్రా నటించినట్లు అవుతుంది. 2002లో తమిళ చిత్రం ‘తమిళన్’ హీరోయిన్గా పరిచమైన ప్రియాంక.. ఆ తర్వాత బాలీవుడ్‌కే పరిమితం అయింది. రామ్‌చరణ్‌కి జోడీగా ‘జంజీర్’ (2013) చిత్రంలో నటించినప్పటికీ అది స్ట్రైట్ బాలీవుడ్ మూవీ. View this post on Instagram A post shared by Priyanka (@priyankachopra) -
బికినీలో ప్రియాంక చోప్రా.. కొత్త ఏడాది సెలబ్రేషన్స్ (ఫోటోలు)
-
మహేశ్‌బాబు - రాజమౌళి సినిమాలో స్టార్ హీరోయిన్
మహేశ్‌బాబు - రాజమౌళి కాంబినేషన్ చిత్రంపై రూమర్స్ భారీగా వస్తూనే ఉన్నాయి. వారిద్దరూ కలిసి సినిమా తీస్తున్నట్లు ప్రకటన వచ్చిన సమయం నుంచి ఈ ప్రాజెక్టపై ప్రేక్షకులు అమితాసక్తిని చూపుతున్నారు. టైటిల్ వంటి తదితర వివరాల కోసం నెట్టింట ఆరా తీస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలో హీరోయిన్ ఎవరు అనే అంశం సోషల్‌మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.SSMB 29 పేరుతో ఈ ప్రాజెక్ట్ పాన్ వరల్డ్ స్థాయిలో తెరకెక్కనుంది. యాక్షన్ అడ్వెంచర్ మూవీగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ 2025 మార్చి నుంచి ప్రారంభం కానుంది. అయితే, దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో హీరోయిన్ను ఫైనల్ చేశారని తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌కు బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా అయితే ఆ పాత్రకు న్యాయం చేయగలదని చిత్ర యూనిట్ భావించిందట. ఈ కథలో హీరోతో పాటు హీరోయిన్ పాత్రకు కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉందని టాక్. అందుకే ఆమెను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆమె పలు హాలీవుడ్ చిత్రాలలో కూడా నటించిన విషయం తెలిసిందే. ప్రియాంకా చోప్రాను డైరెక్టర్ రాజమౌళి పలుమార్లు కలిసినట్లు బాలీవుడ్ మీడియా కూడా వెల్లడించింది. ఈ సినిమాలో నటించేందుకు ఆమె కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. అయితే, ఇండోనేషియా నటి 'చెల్సియా ఎలిజబెత్ ఇస్లాన్' ఈ చిత్రంలో నటిస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. చెల్సియా తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో రాజమౌళిని ఫాలో అవుతుండడంతో ఆ వార్తలు నిజమేనని నమ్మారు. మరి ఆమె పాత్ర ఈ చిత్రంలో ఏ మేరకు ఉంటుందో తెలియాల్సి ఉంది.గ్లోబల్ లెవెల్లో భారీ బడ్జెట్‌తో రాజమౌళి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా దాదాపు పూర్తి అయినట్లు తెలుస్తోంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో సాగే ఈ కథలో ఎక్కువగా విదేశీ నటులు కనిపించనున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి. దుర్గా ఆర్ట్స్‌పై కె.ఎల్.నారాయణ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.