Prophet
-
Ramadan 2024: సమతా మమతల పర్వం ఈదుల్ ఫిత్ర్!
అల్లాహు అక్బర్ .. అల్లాహు అక్బర్ .. లాయిలాహ ఇల్లల్లాహు వల్లాహు అక్బర్ అల్లాహు అక్బర్ వలిల్లాహిల్ హంద్ ..! ఈ రోజు ఎటువిన్నా ఈ స్తోత్ర గానమే, ఆ దయామయుని కీర్తిగానమే వినిపిస్తూ హృదయాలను పులకింపజేస్తూ ఉంటుంది. ఊరు, వాడ, పల్లె, పట్నం, చిన్నా పెద్దా, ఆడా మగా, ముసలీ ముతకా అనే తేడా లేకుండా ఎవరి నోట విన్నా ఈ అమృత వచనాలే జాలువారుతూ ఉంటాయి. కొత్తబట్టలు, కొత్తహంగులు, తెల్లని టోపీలు మల్లెపూలలా మెరిసిపోతుంటాయి. అత్తరు పన్నీరు పరిమళాలు, అస్సలాము అలైకుం, ఈద్ ముబారక్‌లు, చిరునవ్వుల కరచాలనాలు, ఆలింగనాల ఆనంద తరంగాలు, అలయ్ బలయ్ లతో విశ్వాసుల హృదయాలు సంతోషసాగరంలో ఓలలాడుతూ ఉంటాయి. సేమ్యాలు, షీర్ ఖుర్మాలు, బగారా, బిర్యానీల ఘుమఘుమలతో, ఉల్లాస పరవళ్ళ హడావిడితో ముస్లిముల లోగిళ్ళు కిలకిల నవ్వుతూ, కళకళలాడుతూ ఉంటాయి. ఇళ్ళలో ఆడాళ్ళ హడావిడికి, పిల్లల సందడికి హద్దులే ఉండవు. ఎందుకంటే ఇది ఒక్కనాటి పండుగ కాదుగదా! నెల్లాళ్ళపాటు భక్తిప్రపత్తులతో జరుపుకున్న పండుగకు అల్విదా చెబుతున్న ముగింపు ఉత్సవం. రమజాన్ నెలరోజులూ ముస్లింల వీధులు ‘సహెరీ’,‘ఇఫ్తార్’ ల సందడితో నిత్యనూతనంగా కొత్తశోభతో అలరారుతుంటాయి. మసీదులన్నీ భక్తులతో కిటకిటలాడుతూ, ప్రేమామృతాన్ని చిలకరిస్తూ వింత అనుభూతుల్ని పంచుతుంటాయి. భక్తులు పవిత్ర గ్రంథ పారాయణా మధురిమను గ్రోలుతూ వినూత్న అనుభూతులతో పరవశించి పోతుంటారు. అవును.., ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాలు, అనుభవాలు, అనుభూతుల సమ్మేళనమే పండుగ. ఇలాంటి ఓ అద్భుతమైన, అపురూప సందర్భమే ‘ఈదుల్ ఫిత్ర్ ’. దీన్నే రమజాన్ పండుగ అంటారు. ముస్లిం సమాజం జరుపుకునే రెండు ముఖ్యమైన పండుగల్లో ఇది మొదటిదీ, అతి పవిత్రమైనదీను. ఈ నెలలో ముస్లింలు అత్యంత నియమనిష్టలతో రోజావ్రతం పాటిస్తారు. భక్తిశ్రద్ధలతో రోజూ ఐదుసార్లు నమాజ్ చేస్తారు. పవిత్రఖురాన్ గ్రంథాన్ని భక్తితో పారాయణం చేస్తూ, దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ముహమ్మద్ ప్రవక్త(స)వారిపై సలాములు పంపుతూ ఉంటారు. దైవనామస్మరణలో అనునిత్యం వారి నాలుకలు నర్తిస్తూ ఉంటాయి. ప్రతిరోజూ తరావీహ్ నమాజులో పాల్గొని తన్మయులవుతుంటారు. దానధర్మాలు చేస్తారు, ఫిత్రాలు చెల్లిస్తారు. ఈ విధంగా రమజాన్ చంద్రవంక దర్శనంతో ప్రారంభమైన ఉపవాసదీక్షలు నెలరోజుల తరువాత షవ్వాల్ మాసం నెలవంక దర్శనంతో సమాప్తమవుతాయి. షవ్వాల్ మొదటితేదీన జరుపుకునే ‘ఈదుల్ ఫిత్ర్’ పర్వదినాన్నే మనం రమజాన్ పండుగ అంటున్నాము. ఈ పండుగ సంబంధం రమజాన్ నెలతో ముడివడి ఉన్న కారణంగా ఇది రమజాన్ పండుగగా ప్రసిద్ధి చెందింది. రమజాన్ ఉపవాస దీక్షలు, పవిత్ర ఖురాన్ అవతరణతో దీని సంబంధం పెనవేసుకు పోయి ఉంది. మానవుల్లో దైవభక్తిని, దైవభీతిని, సదాచారాన్ని, మానవీయ విలువల్ని జనింపజేయడానికి సృష్టికర్త ఉపవాస వ్రతాన్ని విధిగా నిర్ణయించాడు. దైవాదేశ పాలనకు మనిషిని బద్దునిగా చేయడమే ఉపవాస దీక్షల అసలు లక్ష్యం. ఒక నిర్ణీత సమయానికి మేల్కొనడం, సూర్యోదయం కాకముందే భుజించడం(సహెరి), సూర్యాస్తమయం వరకూ పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టకుండా, రోజూ ఐదుసార్లు దైవారాధనచేస్తూ సూర్యాస్తమయం తరువాత రోజా విరమించడం(ఇఫ్తార్), మితాహారం తీసుకోవడం, మళ్ళీ అదనపు ఆరాధనలు అంటే తరావీహ్ నమాజులు చేయడం, మళ్ళీ తెల్లవారు ఝామున లేవడం – ఈవిధంగా రమజాన్ ఉపవాస వ్రతం మనిషిని ఒక క్రమశిక్షణాయుతమైన, బాధ్యతాయుతమైన, దైవభక్తి పరాయణతతో కూడుకున్న జీవనవిధానానికి అలవాటు చేస్తుంది. మానవుల్లో ఇంతటి మహోన్నత విలువలను, సుగుణాలను జనింపజేసే వ్రతాన్ని పరాత్పరుడైన అల్లాహ్ వారికి అనుగ్రహించినందుకు, వాటిని వారు నెలరోజులూ త్రికరణ శుద్ధిగా పాటించ గలిగినందుకు సంతోష సంబరాల్లో తేలిపోతూ కృతజ్ఞతాపూర్వకంగా భక్తి శ్రద్ధలతో పండుగ జరుపుకుంటారు. మరో ముఖ్య విషయం ఏమిటంటే, పవిత్ర రమజాన్ నెలలోనే సమస్త మానవాళి సన్మార్గ దీపిక అయిన మహత్తర గ్రంథరాజం ఖురాన్‌ను దేవుడు మానవాళికి ప్రసాదించాడు. సమస్త మానవజాతికీ మార్గదర్శక జ్యోతి పవిత్ర ఖురాన్. సన్మార్గం చూపే, సత్యాసత్యాలను వేరుపరిచే స్పష్టమైన ఉపదేశాలు ఇందులో ఉన్నాయి. ఈ గ్రంథరాజం మానవులందరికీ సన్మార్గ బోధన చెయ్యడానికి అవతరించిన ప్రబోధనా జ్యోతి. దైవ ప్రసన్నతను చూరగొనడానికి రోజా పాటించడం,‘తరావీహ్ ’లు ఆచరించడం, దానధర్మాలు చేయడంతో పాటు, ఈ నెల చివరిలో‘లైలతుల్ ఖద్ర్’ అన్వేషణలో అధికంగా ఆరాధనలు చేస్తారు. లైలతుల్ ఖద్ర్ అంటే అత్యంత అమూల్యమైన రాత్రి అని అర్థం. ఉపవాసం పాటించడంవల్ల పేదవాళ్ళ ఆకలి బాధలు అర్థమవుతాయన్నారు. సంపన్నులకు, ముప్పూటలా సుష్టుగా తినేవారికి నిరుపేదల ఆకలికేకలు వినబడవు. అలాంటివారు గనక ఉపవాసం పాటించినట్లయితే ఆకలి బాధ ఎలా ఉంటుందో వారికీ తెలుస్తుంది. తద్వారా పేదసాదలను ఆదుకోవడం, వారికి పట్టెడన్నం పెట్టడం ఎంతగొప్ప పుణ్యకార్యమో వారు అనుభవపూర్వకంగా తెలుసుకోగలుగుతారు. ఈ విధంగా రమజాన్ నెల ఆరంభంనుండి అంతం వరకు ఒక క్రమపద్ధతిలో ధర్మం చూపిన బాటలో నడుస్తూ, దైవప్రసన్నత, పుణ్యఫలాపేక్షతో ఈనెలను గడిపినవారు ధన్యులు. నిజానికి ఇలాంటివారే పండుగ శుభకామనలకు అర్హులు. అందుకే ’ఈద్ ’(పండుగ)ను శ్రామికుని వేతనం(ప్రతిఫలం)లభించే రోజు అని చెప్పడం జరిగింది. ఈ విధంగా రమజాన్ పర్వదినం మనిషిని ఒక ఉన్నతమానవీయ విలువలుకలవాడుగా తీర్చిదిద్ది, సమాజంలో శాంతి, సమానత్వం, సామరస్యం, సోదర భావాలకు పునాదివేస్తుంది. ప్రేమ తత్వాన్ని ప్రోదిచేస్తుంది. ఇదే ఈదుల్ ఫిత్ర్ – రమజాన్ పర్వదిన పరమార్ధం. సదాచరణల సంపూర్ణప్రతిఫలం లభించిన సంతోషంలో అంబరాన్నంటేలా సంబురాలు జరుపుకొని ఆనంద తరంగాల్లో తేలియాడే రోజు ఈదుల్ ఫిత్ర్ . – ఆరోజు ముస్లిములందరూ ఈద్ నమాజ్ ముగించుకొని పరస్పరం శుభాకాంక్షలు చెప్పుకుంటారు. పండుగకు ప్రత్యేకంగా తయారు చేసిన సేమియా పాయసాన్ని తమ హిందూ, ముస్లిం, క్రైస్తవ, సిఖ్ఖు సోదరులందరికీ ఆప్యాయంగా రుచి చూపించి తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు.‘ఈద్ ముబారక్’ అంటూ శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఆత్మీయంగా ఆలింగనాలు చేసుకుంటారు. పవిత్ర ఖురాన్ రూపంలో అవతరించిన సృష్టికర్త మహదనుగ్రహం దానవుడి లాంటి మానవుణ్ణి దైవదూతగా మలిచింది. అజ్ఞానం అంధకారాల కారు చీకట్లనుండి వెలికి తీసి, విజ్ఞానపు వెలుగుబాటకు తీసుకు వచ్చింది. నైచ్యపు అగాథాలనుండి పైకిలాగి పవిత్రతా శిఖరాలపై నిలిపింది. మానవుల్లోని పశుప్రవృత్తిని మానవీయ పరిమళంతో పారద్రోలింది. ఆటవికతను నాగరికతతో, అజ్ఞాన తిమిరాన్ని జ్ఞానదీపికతో, అవివేకాన్ని వివేకంతో పారద్రోలి మనుషుల్ని మానవోత్తములుగా సర్వతోముఖంగా తీర్చిదిద్దింది. మానవాళికి ఇంతటి మహదానుగ్రహాలు ప్రసాదించి, వారి ఇహపరలోకాల సఫలతకు పూబాటలు పరిచిన నిఖిల జగన్నాయకునికి కృతజ్ఞతాభివందనాలు చెల్లించుకోవడమే ఈ పండుగ ఉద్దేశ్యం. ఈదుల్ ఫిత్ర్ పర్వదిన శుభాకాంక్షలు – మదీహా అర్జుమంద్ -
‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి బుకర్ ప్రైజ్
లండన్: ఐర్లాండ్ రచయిత పాల్ లించ్ రాసిన ‘ప్రాఫెట్ సాంగ్’ పుస్తకానికి ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్–2023 లభించింది. లండన్‌కు చెందిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన తొలి నవల ‘వెస్ట్రన్ లేన్’ సైతం ఈ బహుమతి కోసం పోటీ పడగా, ప్రొఫెట్ సాంగ్ విజేతగా నిలిచింది. తాజాగా లండన్‌లో బహుమతి ప్రదానోత్సవం జరిగింది. 46 ఏళ్ల పాల్ లించ్ బుకర్ ప్రైజ్ అందుకున్నారు. ఈ బహుమతి కింద ఆయనకు రూ.52,64,932 నగదు లభించింది. దిగజారుతున్న ప్రజాస్వామ్య విలువలు, పెరిగిపోతున్న నిరంశకుత్వం, ప్రబలుతున్న అశాంతి, వలసల సంక్షోభం.. వంటి పరిస్థితుల్లో ఐర్లాండ్‌లో తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి ఓ మహిళ చేసిన పోరాటాన్ని ‘ప్రాఫెట్ సాంగ్’ నవలలో పాల్ లించ్ హృద్యంగా చిత్రీకరించారు. కెన్యాలో జన్మించి లండన్‌లో స్థిరపడిన భారత సంతతి రచయిత చేతన మారూ రాసిన ‘వెస్ట్రన్ లేన్’ నవల టాప్–6లో నిలిచింది. -
భారత్‌పై రివైంజ్ కోసమే ఆత్మాహుతి దాడి ప్లాన్
భారత్‌లో కీలక నేతపై దాడులు చేసేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాది ప్లాన్ చేస్తున్నట్లు రష్యా పేర్కొన్న సంగతి తెలిసిందే. ఈ మేరకు రష్యా బలగాల అదుపులో ఉన్న ఐఎస్ ఉగ్రవాది తామెందుకు ఈ ఆత్మాహుతి దాడికి ప్లాన్ చేశామో ఒక వీడియోలో వివరించాడు. ప్రవక్తను అవమానించినందుకు గానూ ప్రతికారం తీర్చుకోవాలనే ఉద్దేశంతో ఈ దాడికి ప్లాన్ చేసినట్లు పేర్కొన్నాడు. అంతేకాదు భారతదేశ పాలక వర్గాలకు చెందిన ప్రతినిధుల్లో ఒకరిపై దాడి చేసేందుకు పథకం రచించినట్లు తెలిపాడు. ఆ ఉగ్రవాది మధ్య ఆసియా ప్రాంతంలోని ఒక దేశానికి చెందిన వ్యక్తిగా రష్యా పేర్కొంది. గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు టర్కీలో ఉన్నట్లు వెల్లడించింది. అక్కడ అతన్ని ఐఎస్ నాయకులలో ఒకరు ఆత్మాహుతి బాంబర్‌గా నియమించారని, ఇస్తాంబుల్‌లోని వ్యక్తిగత సమావేశాల్లో అతన్ని రిమోట్‌గా ప్రాసెస్ చేస్తారని తెలిపింది. ఈ మేరకు ఆ ఉగ్రవాదిని రష్యాలో రష్యా ఫెడరల్ సెక్యూరిటీ సర్వీస్ (ఎఫ్ఎస్బీ) నిషేధించిన ఐఎస్ ఉగ్రవాది సభ్యుడిగా గుర్తించి అదుపులోకి తీసుకుని విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. (చదవండి: భారత్‌లో ఆత్మాహుతి దాడులకు ప్లాన్.. సూసైడ్ బాంబర్ అరెస్ట్!) -
వివాదాస్పద వ్యాఖ్యలు.. నుపుర్ శర్మకు సమన్ల వెల్లువ
థానె: ఓ టీవీ చర్చా కార్యక్రమంలో మొహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సస్పెండైన బీజేపీ నాయకురాలు నుపుర్ శర్మకు సమన్లు వెల్లువెత్తుతున్నాయి. పలు రాష్ట్రాల పోలీసులు ఆమెకు ఇప్పటికే నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తాజాగా కోల్‌కతా పోలీసులు సమన్లు జారీ చేశారు. ఈ నెల 20వ తేదీన నర్కెల్‌దంగా పోలీస్‌స్టేషన్‌లో హాజరు కావాలని కోరారు. టీఎంసీ మైనారిటీ విభాగం ప్రధాన కార్యదర్శి అబ్దుల్ సొహైల్ ఫిర్యాదు మేరకు నోటీసులిచ్చారు. నుపుర్ శర్మ అభ్యర్థన మేరకు ఆమె హాజరు కావాల్సిన గడువును మరికొద్ది రోజులు పొడిగించినట్లు మహారాష్ట్రలోని థానె జిల్లా భివాండి పోలీసులు తెలిపారు. ఈనెల 22వ తేదీన హాజరై వాంగ్మూలం ఇవ్వాల్సిందిగా నుపుర్ శర్మకు నోటీసులు ఇచ్చినట్లు థానెలోని ముంబ్రా పోలీసులు, 25న హాజరు కావాలంటూ ముంబై పోలీసులు సమన్లు జారీ చేశారు. బెంగాల్లో ఇంకా ఉద్రిక్తతే బెంగాల్‌లోని పలు ప్రాంతాల్లో ఆందోళనలు కొనసాగుతున్నాయి. రైలు మార్గాలపై నుపుర్ దిష్టిబొమ్మలను దహనం చేసి, బైఠాయించడంతో సియల్డా–హష్నాబాద్ మార్గంలో సోమవారం ఉదయం 20 నిమిషాలపాటు రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఈస్టర్న్ రైల్వే తెలిపింది. ముర్షిదాబాద్, నడియా జిల్లాలతోపాటు హౌరాలోని కొన్ని ప్రాంతాల్లో 144వ సెక్షన్ అమలవుతోంది. యూపీలో 325 మంది అరెస్ట్ శుక్రవారం నాటి అల్లర్లకు సంబంధించి యూపీలోని 8 జిల్లాలకు చెందిన 325 మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు తెలిపారు. అల్ల్లర్లకు సూత్రధారి జావెద్ అహ్మద్ అక్రమంగా నిర్మించుకున్న ఇంటిని అధికారులు కూల్చివేయడాన్ని సవాల్ చేస్తూ కొందరు అలహాబాద్ హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఇది అన్యాయం, అక్రమమని బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా ఆరోపించారు. -
నూపుర్ శర్మ వ్యాఖ్యలు.. భారత్‌పై సైబర్ దాడులు.. ఏకంగా 70 వెబ్సైట్లు హ్యాక్
న్యూఢిల్లీ: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ మాజీ నేతల వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ వ్యాఖ్యలు భారత్‌కు భారీ చేటును తీసుకొచ్చాయి. తాజాగా దేశంలోని ప్రభుత్వ, ప్రైవేట్ వెబ్సైట్లను సైబర్ దాడులు మొదలయ్యాయి. మలేషియాకు చెందిన హ్యాక్టివిస్ట్ గ్రూప్ ఆధ్వర్యంలో డ్రాగన్ పోర్స్ మలేషియా, 1877 సంస్థ కురుదేశ్ కోరడర్స్ పేరుతో సైబర్ దాడులకు పాల్పడటం వెలుగు చూసింది. ఇజ్రాయిల్‌లోని భారత ఎంబసీతో పాటు నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చర్ మేనేజ్మెంట్ ఎక్స్టెన్షన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్‌లతో పాటు పలు ప్రముఖ సంస్థల వెబ్సైట్లపై సైబర్ దాడులు చేశారు. దాదాపు 70 వెబ్సైట్లను, పోర్టల్స్‌ను హ్యాక్ చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌కు చెందిన అగ్రిటెక్ కంపెనీలు, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పోర్టల్స్ వంటి ప్రముఖ సంస్థల వెబ్సైట్లు కూడా ఈ జాబితాలో ఉన్నాయి. చదవండి: ప్రవక్తపై కామెంట్లు: మా బాస్‌ను మధ్యలోకి లాగి బద్నాం చేయకండి! -
రెచ్చగొట్టే వ్యాఖ్యలు.. ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌పై కేసు నమోదు
న్యూఢిల్లీ: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీపై ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేశారు. బుధవారం జరిగిన ఓ కార్యక్రమంలో రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు చేశారని ఢిల్లీ స్పెషల్ సెల్‌లోని ఇంటెలిజెన్స్ ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్ విభాగం ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. అలాగే ఆలయ పూజారి యతి నర్సింగానంద్‌పేరును కూడా ఎఫ్ఐఆర్లో చేర్చారు. కాగా ఇప్పటికే మహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన నూపుర్ శర్మపై కూడా ఢిల్లీ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఆమెతోపాటు నవీన్ జిందాల్ జర్నలిస్ట్ సబా నఖ్వీ, షాదాబ్ చౌహాన్, మౌలానా ముఫ్తీ నదీమ్, అబ్దుర్ రెహ్మాన్, గుల్జార్ అన్సారీ, అనిల్ కుమార్‌పై కూడా ఎఫ్ఐఆర్ దాఖలైంది. మొత్తం ఢిల్లీ పోలీసులు రెండు ఎఫ్ఐఆర్లను నమోదు చేశారు. సోషల్ మీడియాలో మత విద్వేశాలను వ్యాప్తి చేసి ప్రజల ప్రశాంత వాతావరణానికి విఘాతం కలిగించారని పోలీసులు ఈ కేసులు నమోదు చేశారు. దేశంలో అశాంతిని సృష్టించే ఉద్ధేశంతో తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేసిన వారిపై కూడా దర్యాప్తు చేస్తామని ఢిల్లీ పోలీసులు తెలిపారు. సంబంధిత వార్త: వివాదాస్పద వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత: మరిన్ని చిక్కుల్లో నూపుర్ శర్మ AIMIM chief Asaduddin Owaisi named in FIR registered by the IFSO unit of Delhi Police over alleged inflammatory remarks yesterday. Swami Yati Narasimhananda's name also mentioned in the FIR. pic.twitter.com/8NpEKdQvI8 — ANI (@ANI) June 9, 2022 -
మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు.. అల్‌కాయిదా స్ట్రాంగ్ వార్నింగ్!
న్యూఢిల్లీ: మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యల ఉదంతపు ప్రకంపనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ వ్యాఖ్యలను ఖండించిన ముస్లిం దేశాల జాబితాలోకి తాజాగా ఉగ్ర సంస్థ ఆల్కాయిదా కూడా చేరింది. ప్రవక్తపై వ్యాఖ్యలకు ప్రతీకారం తీర్చుకుంటామని.. అందుకు దేశవ్యాప్తంగా ఆత్మాహుతి దాడులకు పాల్పడనున్నట్లు ఆల్కాయిదా హెచ్చరికలు జారీ చేసింది. అనుచిత వ్యాఖ్యలు చేసిన వారిని హతమారుస్తామని వార్నింగ్ ఇచ్చింది. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లో దాడులకు దిగుతామంటూ ఓ లేఖ విడుదల చేసింది. ‘‘ మేం, మా పిల్లలు ఒంటినిండా పేలుడు పదార్థాలు చుట్టుకుని వారిని పేల్చేస్తాం. ఢిల్లీ, ముంబై, యూపీ, గుజరాత్‌ల్లోని కాషాయ ఉగ్రవాదులూ! చనిపోయేందుకు సిద్ధంగా ఉండండి’’ అని హెచ్చరించింది. మరో ఉగ్ర సంస్థ ఎంజీహెచ్ కూడా ముహమ్మద్ ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యల చేసినందుకుగానూ నూపుర్ శర్మ బేషరతుగా ప్రపంచానికి క్షమాపణ చెప్పాలని లేకుంటే.. ప్రవక్తను అగౌరవపరిచినందుకు ఏం చేయాలో అది చేస్తాం’’ అంటూ టెలిగ్రామ్‌లో ఒక ప్రకటన విడుదల చేసింది. చదవండి: పరువు హత్య: వేరే కులం వ్యక్తితో ప్రేమ.. పోలంలో.. -
దైవాన్ని దూషించిందని మహిళా ప్రిన్సిపాల్‌కు మరణ శిక్ష
ఇస్లామాబాద్: ప్రవక్త ముహమ్మద్ తర్వాత తదుపరి ప్రవక్త తానేనని ప్రకటించుకున్నందుకు పాకిస్తాన్లో ఓ మహిళకు మరణశిక్ష విధించారు.ఈ కేసులో.. ఆ మహిళ దైవదూషణకు పాల్పడినట్లు విచారణలో తేలిందని అదనపు జిల్లా, సెషన్స్ న్యాయమూర్తి మన్సూర్ అహ్మద్ తుది తీర్పుని వెలువడించారు. వివరాల్లోకి వెళితే.. నిష్టార్ కాలనీలోని ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపాల్ సల్మా తన్వీర్ ఇస్లాం చివరి ప్రవక్త ముహమ్మద్ కాదనేలా తానే తదుపరి ప్రవక్తనంటూ ప్రకటించుకుంది. దీంతో స్థానిక మతాధికారి ఫిర్యాదుపై లాహోర్ పోలీసులు 2013లో తన్వీర్‌పై దైవదూషణ కేసు నమోదు చేశారు. దీనిపై ఆమె తరఫు న్యాయవాది ముహమ్మద్ రంజాన్ తన క్లయింట్‌కు మతి స్థిమితం లేదని కోర్టు ఆ వాస్తవాన్ని పరిగణనలోకి తీసుకోవాలని కోరాడు. అయితే, ప్రాసిక్యూషన్ కోర్టుకు సమర్పించిన పంజాబ్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్, మెడికల్ బోర్డ్ నివేదికలో.. ఆమె మానసిక స్థితిపరంగా బాగానే ఉందని తెలిపింది. దీంతో ఆమె చేసిన ప్రకటన దైవదూషణగా పరిగణిస్తూ తన్వీర్‌కు కోర్టు ఉరి శిక్ష విధించింది. దాంటోపాటు రూ.5 వేలు (పాకిస్తాన్ కరెన్సీలో) జరిమానా కూడా విధించింది. పాకిస్తాన్లో వివాదాస్పద దైవదూషణ చట్టాలు వాటికి నిర్దేశించిన శిక్షలు చాలా తీవ్రంగా ఉంటాయి. 1987 నుంచి అక్కడ దైవదూషణ చట్టం కింద కనీసం 1,472 మందిపై కేసులు నమోదయ్యాయి. చదవండి: China: డ్రాగన్ దుశ్చర్య.. 55 గుర్రాలపై వందమంది చైనా సైనికులు -
దైవ సన్నిధి
గొప్ప ప్రవక్త జార్జివర్‌వర్ ఒక ఆథ్యాత్మిక మహాసభలో ఆత్మవశంలో ప్రసంగిస్తున్నారు. ఇచ్చిన సమయం మించిపోయింది. కాని సందేశం ఆపడం లేదు. ఆయన్ని ఎలా ఆపాలో కూడా తెలియక పెద్దలు సతసతమవుతున్నారు. దాని తర్వాత మరో కార్యక్రమం ఉంది. అందుకే ఈ ఆరాటం అంతా. చివరికి ఒక పెద్ద మనిషి వేదిక మీద నుండి కిందికి దిగివచ్చాడు. వేదికకు ముందు జార్జివర్‌వర్ గారికి ఎదురుగా కూర్చున్నాడు. కూర్చున్నాడే గాని అటు ఇటూ స్థిమితం లేకుండా ఉన్నాడు. అతనిని చూస్తూనే సంపన్నుడు అని ఇట్టే తెలిసిపోతుంది. సమయం మించిపోతుందన్న ఆలోచనతో ఆ సంగతిని గుర్తు చేయడానికి తన చేతికి ఉన్న అత్యంత ఖరీదైన గడియారాన్ని అతడు జార్జి గారికి చూపించాడు. అది చూసి జార్జి ప్రవక్త అవాక్కయ్యాడు. శాంత హృదయంతో ప్రశాంతంగా తన దివ్య సందేశాన్ని ఆపివేశాడు. సభలో కొందరు పరిచారకులు అటు ఇటూ తిరుగుతూ వున్నారు. వారందరూ అక్కడ తమవంతు సహాయ సహకారాలు అందిస్తూ తమ కర్తవ్యాన్ని భక్తిశ్రద్ధతో నిర్వర్తిస్తున్నారు. జార్జివర్‌వర్ చిరునవ్వుతో ఒక పరిచారకుడిని దగ్గరకు రమ్మని పిలిచాడు. ‘‘చూడు బాబూ.. నా ఎదురుగా కూర్చున్న ఆ పెద్దాయన తన అత్యంత ఖరీదైన తన చేతిగడియారాన్ని ఈ మహాసభ సహాయార్థం ఇస్తాననే సంకేతంతో తన వాచ్ చూపిస్తున్నాడు. మీరు వెళ్లి ఆ గడియారాన్ని తెచ్చి హుండీలో వేయండి’’ అని ఆజ్ఞాపించాడు. అనుకోని ఈ ఆకస్మిక సంభవానికి పెద్దాయన తలదించుకొన్నాడు. అంతేకాదు, ఇలా తలదించుకొనే ఇలాంటి పని మరోసారి చేయను అని, చేయకూడదు అని తన హృదయంలో నిశ్చయించుకొన్నాడు. దైవ సన్నిధికి వెళ్లినప్పుడు పారవశ్యంతో కూర్చోవాలిగాని ఎన్ని గంటకు వచ్చాను, ఎన్ని గంటకు వెళ్లాలి అని ఆలోచించకూడదు. – బైరపోగు శామ్యూల్ బాబు -
బలహీనులకు అండ మహా ప్రవక్త
పూర్వం అరబ్బు సమాజంలో కట్టు బానిసత్వం ఉండేది. బానిసను పశువుకంటే హీనంగా చూసేవారు యజమానులు. ఏదైనా తేడా వస్తే గొడ్డును బాదినట్లు బాదేవారు. రెండు పూటలా తిండి దొరికితే చాలన్నట్లు బానిసలు గొడ్డు చాకిరీ చేసేవాళ్లు. ఆ కాలంలో నీగ్రో జాతికి చెందిన హజ్రత్ బిలాల్ (రజి) అనే కట్టు బానిస ఉండేవారు. ఆయన ఒకరోజు తాను ఇస్లామ్ ధర్మం పట్ల ఎలా ఆకర్షితులయ్యారో వివరించారు. ‘‘నాకు ఒకరోజు తీవ్ర చలి జ్వరం సోకింది. బండెడు చాకిరీ చేయించే నా యజమాని అంత జ్వరంలోనూ ఎన్నో కిలోల బార్లీ విసరాలని పురమాయించాడు. చలికి తోడు జ్వరం ఇబ్బందిపెట్టడంతో కంబళి కప్పుకొని పాలు తాగి కాసేపు విశ్రాంతి తీసుకుందామని మేను వాల్చేసరికి నిద్రపట్టింది. అంతలోనే అటుగా వచ్చిన నా యజమాని నేను నిద్రించడం చూసి నన్ను గొడ్డును బాదినట్లు నిర్దయగా కొట్టాడు. చలిజ్వరంతో బాధపడుతున్నానన్న కనికరం కూడా చూపకుండా నా ఒంటిపై కంబళిని లాక్కొని పిండి విసరాలని నిర్బంధించాడు. చేసేదేం లేక రోదిస్తూ బార్లీ గింజలను విసుర్రాయిలో వేసి బలాన్ని కూడగట్టుకుని విసరసాగాను. అంతలో ముహమ్మద్ ప్రవక్త (సఅసం) అటు పక్కనుంచే వెళుతున్నట్లున్నారు. నేను మూలుగుతున్న శబ్దానికి లోనికి వచ్చి ‘‘ఎందుకేడుస్తున్నావు. ఏం కష్టమొచ్చింది’’ అని అడిగారు. దానికి నేను ‘పోపో నీ పని నువ్వు చూసుకో. అందరూ అడిగేవారే కానీ ఆదుకునేందుకు ఎవ్వరూ ముందుకు రారు. పోపో’ అని విసుక్కున్నాను. నా మాటలకు ప్రవక్త మహనీయులు అక్కడినుంచి వెళ్లిపోయారు కానీ కాసేపటికే వారు ఒక చేతిలో వేడి వేడి పాలచెంబు, మరో చేతిలో ఖర్జూరాలను తీసుకొచ్చారు. పాలను తాగించారు. ఖర్జూరాలను తినిపించారు. ఆ తరువాత నన్ను ‘‘వెళ్లి కంబళి కప్పుకొని హాయిగా విశ్రాంతి తీసుకో, నీ బదులు నేను విసురుతాను.’’ అని విసుర్రాయి తిప్పడం మొదలెట్టారు. ఉదయాన్నే లేవగానే రాత్రంతా పట్టిన పిండిని నాకు అప్పజెప్పి వెళ్లిపోయారు. రెండోరోజు రాత్రి కూడా ప్రవక్త మహనీయులు పాలచెంబు, ఖర్జూరాలతో ప్రత్యక్షమయ్యారు. నన్ను వెచ్చటి దుప్పటిలో నిద్రపుచ్చి విసుర్రాయి విసరసాగారు. ఇలా మూడు రోజులు ప్రవక్త మహనీయులు నా పని తన భుజాలపై వేసుకుని నాకు విశ్రాంతి కల్పించారు. మూడోరోజు ఉదయాన్నే ప్రవక్త వెళుతుండగా నేను ఆయనను ఆలింగనం చేసుకుని ‘మీగురించి సమాజం తప్పుగా మాట్లాడుతోంది. మీపై బురదజల్లేందుకు మీగురించి దుష్పచ్రారం చేస్తున్నారు. బానిసలపట్ల జాలి, దయ, కరుణ చూపే మీరు నిజంగా దేవుని ప్రవక్త అని నేను విశ్వసిస్తున్నానని విశ్వాసం ప్రకటించాను.’’ అని చెప్పుకొచ్చారు. బలహీను లకు అండగా నిలిచేవారే నిజమైన నేతలు, ప్రవక్తలు. – ముహమ్మద్ ముజాహిద్ -
ఎర్ర సముద్రం
‘మూసా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం పక్కన నిలబెట్టావేమిటి? ఈజిప్టులోని ఖననవాటికలు సరిపోలేదా?’ అని అస్మదీయులు నిష్టూరంగా పలుకుతున్న ఆ ఘడియలో దైవ సహాయం అందింది! నేటికి వేల సంవత్సరాల క్రితం ఇస్రాయీల్ అనే జాతి ప్రజలు శతాబ్దుల తరబడి ఈజిప్టులో కడు దుర్భరమైన, అవమానకరమయిన జీవితం గడపాల్సి వచ్చింది. ఫిరౌన్ అనే రాజు పీడనకు గురవ్వాల్సి వచ్చింది. ఫిరౌన్ తనకు తాను ‘నేనే దేవుడిని’ అని విర్రవీగేవాడు. తన రాజ్యంలోని అప్పుడే పుట్టిన మగబిడ్డల్ని చంపేసేవాడు. ఇలాంటి దారుణ పరిస్థితుల్లో దేవుడు వారి మధ్యన మహనీయ మూసా (అలైహిస్సలామ్)ను ప్రభవింపజేశాడు. అడుగడుగునా ప్రమాదాలు పొంచి ఉన్న ఆ కాలంలో సత్యాన్ని సమర్థించడానికి ఇస్రాయీల్ ప్రజలు మూసా (అలై)ను దేవుని ప్రవక్తగా అంగీకరించారు. ఆయన ద్వారానే ఆ జాతి వారు ఫిరౌనీయుల చెరనుండి విముక్తి పొందారు. ఇలా ఉండగా, ఒకానొక రాత్రివేళ రాజ్యంలోని అన్ని ప్రాంతాల నుండి ప్రజలు బయలుదేరి దైవప్రవక్త మూసా (అలైహిస్సలామ్)తో కలిసి వేరే ఎర్రసముద్రం వైపునకు సాగిపోవాలని నిర్ణయించుకున్నారు. కానీ ఈ పయన బృందం ఎర్రసముద్రం తీరానికి చేరుకుంటూ ఉన్న సమయంలోనే ఫిరౌన్ చక్రవర్తి ఒక భారీ సేనా వాహినిని తీసుకుని వాళ్లను వెంబడిస్తూ వచ్చాడు! ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయ్యింది పరిస్థితి. మూసా ప్రవక్త అనుయాయులు ఫిరౌన్ సేనల చేతికి చిక్కుకుపోయేలానే ఉన్నారు. వెనుక శత్రు సేనలు, ముందేమో ఎర్ర సముద్రం. దిక్కుతోచని పరిస్థితి. ‘‘మూసా మమ్మల్ని తీసుకొచ్చి ఈ సముద్రం పక్కన నిలబెట్టావేమిటి? ఈజిప్టులోని ఖననవాటికలు సరిపోలేదా?’ అని అస్మదీయులు నిష్టూరంగా పలుకుతున్న ఆ ఘడియలో దైవ సహాయం అందింది. ‘‘మూసా నీ చేతికర్రతో సముద్రంపై కొట్టు’’ అని దైవాదేశమయింది. అల్లాహ్ వాణిని అనుసరించి మూసా ప్రవక్త, సముద్రంపై తన చేతికర్రతో కొట్టాడు. అంతే! సముద్రం రెండు ముక్కలుగా చీలిపోయింది. వాటిలోని ప్రతి భాగం ఓ పర్వతంలా వుంది. ఆ రెండు నీటి గుట్టల మధ్యన ఒక సందు, నీరు ఏ మాత్రం లేని ఓ పొడి దారి ఏర్పడింది. ఆ దారి గుండా మూసా అనుయాయులు సాగిపోవడం గమనించిన ఫిరౌన్ తన సైనికులతో సహా వారిని వెంబడించాడు. మూసా అనుయాయులు సముద్రం దాటే సమయానికి ఫిరౌన్ సేనలు ఆ దారి మధ్యన ఉన్నాయి. దైవాదేశానుసారం అప్పటివరకు ప్రహరీ గోడల్లా నిశ్చలంగా నిలిచి ఉన్న ఆ రెండు నీటి భాగాలు పరస్పరం కలిసిపోయాయి. ఫిరౌన్ తన సేనల సమేతంగా సాగర గర్భంలో కలిసిపోయాడు. దైవప్రవక్త మూసా (అలై) ఇస్రాయీల్ సంతతి వారిని తీసుకుని సీనాయ్ ద్వీపకల్పంలో ప్రవేశించారు. ఈ విధంగా ప్రవక్త మూసా (అలై) ఇస్రాయీల్ జాతిని ఫిరౌన్ చెరనుంచి విడిపించారు. అందుకే ముస్లిములు ముహమ్మద్ ప్రవక్త (సఅసం) సంప్రదాయం ప్రకారం మొహర్రం నెల 10వ తేదీన యౌమే ఆషూరాగా జరుపుకుంటారు. ఆషూరా రోజున ఉపవాసం పాటిస్తారు. – ముహమ్మద్ ముజాహిద్ -
దెయ్యాల రోజు
అనుకోకుండా వాళ్లిద్దరూ కలుసుకున్నారు! ఒకతను చక్రవర్తిలా ఉన్నాడు. చక్రవర్తి కళ లేదు. ఇంకొకతను చక్రవర్తిలా లేడు. చక్రవర్తి కళ ఉంది! చక్రవర్తి కళ ఉన్న వ్యక్తిలోని కాంతి.. చక్రవర్తి కళ లేని వ్యక్తి మీద, ఆ చుట్టపక్కల పడుతోంది.‘‘నిన్నెక్కడో చూశాను..’’ చికాగ్గా అన్నాడు చక్రవర్తిలా ఉన్నతను కళ్లకు చేతులు అడ్డుపెట్టుకుంటూ.‘‘నాకూ అనిపిస్తోంది, మిమ్మల్నెక్కడో చూసినట్లు..’’ చిరునవ్వుతో అన్నాడు చక్రవర్తిలా లేనతను. ‘‘నేను నీతో చికాగ్గా మాట్లాడుతున్నాను కదా! నువ్వు నాతో ప్రవక్తలా నవ్వుతూ ఎలా మాట్లాడ గలుగుతున్నావు?’’ అన్నాడు చక్రవర్తిలా ఉన్నతను. ప్రవక్త నవ్వు ఆపలేదు. చక్రవర్తి చికాగ్గా చూశాడు.‘‘నేను నిన్ను ‘నువ్వు’ అంటున్నాను కదా! నువ్వు నన్నెలా ‘మీరు’ అనగలుగుతున్నావు? నన్ను‘మీరు’ అనడం మానెయ్. అందులో నాకు వ్యంగ్యం కనబడుతుంది. వ్యంగ్యంగా మాట్లాడేవాడు తనను తను గొప్పవాడినని అనుకుంటాడు. నాకన్నా గొప్పవాడు ఇంకొకడు ఉండడం నాకు ఇష్టం లేదు’’ అన్నాడు చక్రవర్తి. మళ్లీ నవ్వాడు ప్రవక్త. ‘‘మీకన్నా గొప్పవాడు ఇంకొకరు లేరు కానీ, మీకన్నా గొప్పది ఇంకొకటి ఉంది’’ అన్నాడు. ‘‘ఏంటది?’’ అన్నాడు చక్రవర్తి.‘‘ప్రేమ’’ అన్నాడు ప్రవక్త. చక్రవర్తి చికాకు ఎక్కువైంది.ప్రవక్త చిరునవ్వు ఎక్కువా కాలేదు, తక్కువా కాలేదు.ప్రవక్తని అసహ్యంగా చూస్తున్నాడు చక్రవర్తి. చక్రవర్తిని ఆపేక్షగా చూస్తున్నాడు ప్రవక్త. ఆ చూపు, ఆ మాట, ఆ నవ్వు.. ఏ జన్మలోనివో గుర్తుకొచ్చింది చక్రవర్తికి! ‘‘నువ్వా!! నిన్ను మళ్లీ చూడాలని నేను అనుకోలేదు. యుగాల తర్వాత కూడా నువ్వు అలాగే యవ్వనంతో ఎలా ఉన్నావ్?’’ అన్నాడు చక్రవర్తి. చక్రవర్తి తనను తను చూసుకున్నాడు. కిరీటం ఉంది. వెలుగు లేదు. ఒంటి మీద మణులున్నాయి. మెరుపు లేదు. ఖడ్గం ఉంది. పదును లేదు. ప్రవక్తను చూశాడు. కిరీటం లేదు. వెలుగుంది. మణుల్లేవు. మెరుపుంది. ఖడ్గం లేదు. పదునుంది. ఆ వెలుగు, మెరుపు, పదును అతడి చిరునవ్వులోంచి కిరణాల్లా ప్రసరిస్తున్నాయి. ‘‘ఈ చీకటి రాత్రి ఎక్కడివీ సూర్యకిరణాలు?’’ విస్తుపోయాడు చక్రవర్తి.‘‘సూర్యకిరణాలు కావు. ప్రేమ కిరణాలు. వేల సూర్యుళ్లనే వెలిగించే ప్రేమ కిరణాలు’’ నవ్వి, చెప్పాడు ప్రవక్త.‘‘నవ్వు ఆపి చెప్పు. నువ్వింకా అలాగే ఎలాగున్నావ్?’’ అని అడిగాడు చక్రవర్తి.‘‘నాలో ప్రేమ ప్రవహిస్తోంది. ప్రేమ ప్రవహించే చోటంతా పచ్చదనం ఉంటుంది. పూల పరిమళం ఉంటుంది. పక్షుల రాగాలు ఉంటాయి.’’‘‘నీ బొంద కూడా ఉంటుంది. ఉరి తీయించినా ఇంకా గాల్లోనే వేలాడుతున్నావా! నీతో పాటు నీ ప్రేమా చచ్చిపోతుందనుకున్నాను..’’ కోపంతో ఊగిపోతున్నాడు చక్రవర్తి. ‘‘నా ప్రేమ తనతో పాటు నన్నూ బతికించుకుంది’’ అన్నాడు ప్రవక్త.‘‘నిన్నొక్కడినేనా.. ఈ గాలిలో తిరుగుతున్న ప్రేమ దెయ్యాలనన్నింటినీనా?’’ విసుగ్గా అన్నాడు చక్రవర్తి.‘‘నేనొకటి చెప్తాను చక్రవర్తీ..’’ అన్నాడు ప్రవక్త. మొదటిసారి అతడు ‘చక్రవర్తీ’ అనడం. ‘‘నేనెవరో గుర్తొచ్చానా?’’ ఆశ్చర్యంగా అడిగాడు చక్రవర్తి. ‘‘ప్రేమ దేన్నీ మర్చిపోనివ్వదు. దేన్నీ వాడిపోనివ్వదు. దేన్నీ దుఃఖపడనివ్వదు. ఆ రోజు జరిగినవన్నీ నాకింకా గుర్తున్నాయి చక్రవర్తీ’’ అన్నాడు ప్రవక్త. ‘ఆ రోజు’ అంటే.. ఏ రోజో చక్రవర్తికి అర్థమైంది. ప్రవక్తను తను ఉరి తీయించిన రోజు. ఉరితీతకు ముందు.. ప్రవక్తతో చాలాసేపు ఘర్షణ పడ్డాడు చక్రవర్తి. ‘నీ ప్రేమ ప్రవచనాలతో యువతను చెడగొడుతున్నావు ప్రవక్తా! యువకులు యుద్ధానికి, యువతులు పద్ధతులకు పనికిరాకుండా పోతున్నారు. చచ్చేముందైనా వాళ్లకు చివరి మాటగా చెప్పు. పనికిమాలిన ప్రేమలకు దూరంగా ఉండమని చెప్పు’ అంటున్నాడు చక్రవర్తి.‘ప్రేమ.. ప్రజల్నీ, రాజ్యాల్నీ దగ్గర చేస్తుంది చక్రవర్తీ. ఒక్క శత్రువైనా మీకు మిగలకుండా చేస్తుంది. అప్పుడిక యుద్ధాలతో, పద్ధతులతో పనేముంది?’‘నీకర్థం కాదు ప్రేమోన్మాదీ.. రాజనీతిజ్ఞుడెవ్వడూ ప్రేమను అంగీకరించడు. పోనీలే పాపం అని ప్రేమించుకోనిస్తే.. చిన్న పువ్వును విసిరి రాజ్యంలోని యువతీయువకులు నా తలపై కిరీటాన్ని పడగొట్టేస్తారు’ అన్నాడు చక్రవర్తి.‘ప్రేమ కన్నా గొప్ప రాజ్యం లేదు. గొప్ప కిరీటం లేదు. అంతిమంగా ప్రేమదే సార్వభౌమత్వం’ అన్నాడు ప్రవక్త.చక్రవర్తి నిట్టూర్చాడు. ప్రవక్త వైపు జాలిగా చూస్తూ అక్కడి నుంచి నిష్క్రమించాడు. వెనకే తలుపులు మూసుకున్నాయి. ‘ప్రేమమూర్తులైన ఈ ప్రవక్తగారిని ప్రేమగా ఉరి తియ్యండి..’అవే చక్రవర్తి చివరి మాటలు. ప్రవక్తవి కూడా అవే చివరి చూపులు అనుకున్నాడు. మళ్లీ ఇలా మనిషిలా దాపురించాడు! ‘‘రాజ్యాలు అంతరించాయి. రాజును నేనూ అంతరించాను. నువ్వూ, నీ ప్రేమా ఇంకా ఇలాగే తగలడ్డాయి. నన్నెందుకిలా వెంటాడుతున్నావు? నా బతుక్కన్నా, నీ బతుకే బాగుందని చెప్పడానికా?’’ అన్నాడు చక్రవర్తి. ‘‘నేను మిమ్మల్ని వెంటాడడం లేదు చక్రవర్తీ. లోకంలోని ప్రేమ వెంటాడుతోంది. ఆ వెంటాడే ప్రేమకు నేనొక హృదయాన్ని మాత్రమే’’ అన్నాడు ప్రవక్త. ఇద్దరూ కాసేపు మాట్లాడుకోలేదు. మాట్లాడుకోని ఆ కాస్త సమయంలో ప్రవక్త చక్రవర్తిని ప్రేమిస్తూ కూర్చున్నాడు. చక్రవర్తి ప్రవక్తను ద్వేషిస్తూ కూర్చున్నాడు. అయితే ఎక్కువసేపు అతడలాద్వేషించలేకపోయాడు. ప్రేమ ద్వేషాన్ని మింగేసింది!‘‘ఈ లోకాన్ని కూడా నీ ప్రేమకు బందీని చెయ్యాలని వచ్చావా వాలెంటైన్?’’ అని అడిగాడు చక్రవర్తి. ‘‘ప్రేమ బందీని చెయ్యదు క్లాడియస్. బంధనాల నుంచి స్వేచ్ఛను ఇస్తుంది’’ అన్నాడు ప్రవక్త. చక్రవర్తికి ద్వేషం అనే బంధనం నుంచి విముక్తి లభించింది. ప్రవక్త వెంట గాలిలో పైకి లేచాడు. మాధవ్ శింగరాజు -
గొప్పలు.. తప్పులు
ఇద్దరు స్నేహితులు వెళుతున్నారు. వారిలో ఒకడికి గొప్పలు చెప్పుకోవడం అలవాటు. అందరికన్నా తానే అధికుడినని చెప్పి ఆనందించడం అతని స్వభావం. స్వతహాగా మంచివాడే. పరోపకారే. కానీ, ఈ ఒక్క గుణంతో పదిమందిలో పలచబడిపోతుంటాడు. అయితే ఆ విషయం అతనికి తెలియదు. పైకి మాత్రం అందరూ అతని గొప్పతనాన్ని అంగీకరించినట్టే కనిపించి, ఆహా ఓహో అన్నా, చాటుగా నవ్వుకునేవారు. ఇప్పుడు కూడా స్నేహితునితో, తన ఊరిలో తనకన్నా ఎక్కువ సంపన్నుడు లేడని, తనకన్నా ఎక్కువగా ఊళ్లోవాళ్లు ఎవరినీ గౌరవించరనీ, తాను లేకపోతే ఊరిలో పనులేమీ జరగవనీ కోతలు కోయడం ప్రారంభించాడు. వారలా మాట్లాడు కుంటూ, ఆ ఊరి దేవాలయం ముందుకు వచ్చారు. గొప్పలు కోసే వ్యక్తితో ‘‘ఆ గోపురం ఎంత ఉన్నతంగా ఉందో, దేవుని ముందు ఎంత వినయంగా ఒదిగి ఉందో’’ అన్నాడు స్నేహితుడు. గొప్పలు పోయే వ్యక్తి ఆ గోపురం వైపు చూశాడు. స్నేహితుడి మాటలో ఆంతర్యం అర్థమైంది. అత్యున్నతమైన ఆ కట్టడంతో పోల్చి చూస్తే తాను కీటకం వంటి వాడిని అనుకున్నాడు. అతనిలోని అహంభావం, గొప్పలు చెప్పుకునే గుణం అణగారి పోయాయి. మరెన్నడూ అతను గొప్పలు చెప్పుకోలేదు. వినయంగా ఉన్నాడు. అప్పటివరకూ అతన్ని చాటుమాటుగా ఎగతాళి చేసిన వారే అతన్ని బాహాటంగా గౌరవించడం మొదలు పెట్టారు. అందుకే జీసస్ అన్నారు... తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును అని. మహా ప్రవక్త ప్రబోధించాడు అహంకారం అనర్థదాయకం అని! -
మదీనాలో మస్జిద్ నిర్మాణం
సురాఖ సిగ్గుతో చితికిపోతూ, పశ్చాత్తాప హృదయంతో ప్రవక్త సన్నిధిలో తలవంచుకొని నిలుచున్నాడు. తాను తప్పుచేశానని, క్షమించమని అభ్యర్థించాడు. ప్రవక్త మహనీయులు అతణ్ని క్షమించారు. తరువాత యధాప్రకారం ప్రయాణం కొనసాగిస్తూ మదీనాకు సమీపంలో ఉన్నటువంటి ’ఖుబా’ అనే గ్రామానికి చేరుకున్నారు. ఈలోపు హజ్రత్ అలీ కూడా మక్కా నుండి వచ్చి ప్రవక్తను కలుసుకున్నారు. అలీ రాకతో మక్కా విషయాలు కూడా తెలిశాయి. ప్రవక్తమహనీయులు ఖుబాలో బసచేస్తున్నందున ప్రార్థనకోసం అక్కడ ఒక మస్జిద్ నిర్మించారు. ప్రవక్త స్వయంగా ఆ మస్జిద్ నిర్మాణంలో పాలుపంచుకున్నారు. దైవారాధనకోసం నిర్మించిన మొట్టమొదటి మస్జిద్ అదే. ఖుబా మస్జిద్ లో నమాజ్ చేసిన వారికి ‘ఉమ్రా’ (కాబా దర్శనం) చేసినంత పుణ్యం లభిస్తుంది. ప్రవక్త మహనీయులు ఖుబా చేరుకున్నారన్న శుభవార్త మదీనా అంతటా పాకడంతో అక్కడి ప్రజల ఆనందం అవధులు దాటింది. కనీవినీ ఎరుగని రీతిలో మదీనా ప్రజలు ఘనస్వాగతం పలికారు. ఆ మహనీయుని ఆతిథ్యభాగ్యం తమకే దక్కాలని ప్రతి ఒక్కరూ భావించారు. కాని ప్రవక్త వాహనం ఒక్కొక్క ఇంటినీ దాటుకుంటూ చివరికి అబూ అయ్యూబ్ అన్సారీ అనే ఒక సహచరుని ఇంటివద్ద ఆగి అక్కడే కూర్చుండి పోయింది. ప్రవక్తవారి ఆతిథ్యభాగ్యం తమకే లభించినందుకు అబూ అయ్యూబ్ దంపతులు ఆనందంతో పొంగిపొయ్యారు. భూప్రపంచంలో ఎవరికీ దక్కని అదృష్టం తమకే దక్కినందుకు మురిసిపోయారు. కొన్నాళ్ళపాటు వారి ఇంట్లోనే విశ్రాంతి తీసుకున్న ప్రవక్త, మదీనాలో దైవారాధనకోసం ఒక మస్జిద్ నిర్మించాలని సంకల్పించారు. దానికోసం స్థలాన్ని కూడా ఎంపికచేశారు. ఆ స్థలం నజ్జార్ తెగకు చెందిన ఇద్దరు అనాథ అన్నదమ్ములది. వారు సంతోషంగా స్థలం దానం చేయడానికి సిద్ధమయ్యారు. ప్రవక్త వారిని అభినందిస్తూ, ఉచిత ప్రతిపాదనను సున్నితంగా తిరస్కరించి స్థలానికి పైకం చెల్లించారు. తరువాత కొద్దిరోజుల్లోనే మస్జిద్ నిర్మాణం పూర్తయింది. అదే ‘మస్జిదె నబవి’ గా ప్రసిద్ధిగాంచింది. తరువాత ప్రవక్తమహనీయులు ఎక్కువ సమయం మసీదులోనే గడిపేవారు. ధర్మానికి సంబంధించిన విధివిధానాలు, నైతిక, మానవీయ విలువలను గురించి ప్రజలకు తెలియజెప్పేవారు. ప్రేమ, దయ, జాలి, కారుణ్యం, సహనం, సానుభూతి, పరోపకారం తదితర విషయాలు బోధించేవారు. విశ్వాసం అంటే ఏమిటి, విశ్వసించినవారి బాధ్యతలేమిటి, దైవప్రసన్నత, పరలోక సాఫల్యం పొందడానికి ఏంచేయాలి? అన్నటువంటి అనేక ప్రాపంచిక, పారలౌకిక విషయాలను విడమరచి చెప్పేవారు. – ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మరికొన్ని విశేషాలు వచ్చేవారం) -
సహనం... ఆయన సందేశం
ప్రవక్త జీవితం అవిశ్వాసులు కుట్రలు, కుతంత్రాలు పన్నుతూనే ఉన్నారు. ప్రవక్తను ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టవచ్చో, అన్నిరకాల మాయోపాయాలూ పన్నుతున్నారు. కుటుంబాల మధ్య, రక్తసంబంధీకుల మధ్య, చివరికి భార్యాభర్తల మధ్య చిచ్చుపెట్టడానికి శక్తివంచన లేని ప్రయత్నాలు ప్రారంభించారు. ప్రవక్త వారి అల్లుళ్ళ దగ్గరికి వెళ్ళి, భార్యల్ని వదిలేయమని ఒత్తిడి తేవడం లాంటి నీచత్వానికీ వారు వెనుకాడలేదు. ప్రవక్త నడిచే దారిలో ముళ్ళకంప పరవడం, ఊడ్చిన చెత్తా చెదారం, పారేసే మేక పేగులు ఆయనపై విసరడం లాంటి చేష్టలకు పాల్పడ్డారు. ఈ క్రమంలోనే ‘అల్ లహబ్’ సూరా అవతరించింది. అందులో ప్రవక్తను రకరకాలుగా హింసిస్తున్న అబూ లహబ్, ఆయనపై పొట్టపేగులు విసిరిన అతడి భార్య ఉమ్మెజమీల్ను గురించి ప్రస్తావన ఉంది. ఇది తెలుసుకున్న జమీల్ పట్టరాని కోపంతో ఊగిపోతూ కాబాకు వెళ్ళింది. ఆ సమయంలో ముహమ్మద్ ప్రవక్త(స), హ. అబూబక్ ్ర(ర) అక్కడే కూర్చొని ఉన్నారు. ఉమ్మెజమీల్ ఉగ్రరూపాన్ని చూసిన అబూబక్ ్రకంగారుపడ్డారు. పైగా ఆమె చేతిలో ఓ పెద్దరాయి కూడా ఉంది. ప్రవక్తకు ఏమైనా హాని తలపెడుతుందేమోనని భయపడ్డారు. ఇదే విషయం ప్రవక్తకు చెప్పారు. అప్పుడు ప్రవక్త, ‘నువ్వేమీ కంగారుపడకు. నేనామె కళ్ళకు కనబడను’ అన్నారు. నిజంగానే ఆమెకు ప్రవక్త కనిపించలేదు. ఆమె అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఒకరోజు ప్రవక్త మహనీయులు యథాప్రకారం కాబాలో ప్రార్థన చేసుకుంటున్నారు. అప్పుడు అబూజహల్ అనే మరో దుర్మార్గుడు పెద్ద బండరాయి పెకైత్తుకొని సాష్టాంగంలో ఉన్న ప్రవక్తపై వెయ్యాలని ముందుకు నడిచాడు. అతని మిత్రబృందమంతా కొద్దిదూరంలో నిలబడి, ఈ రోజుతో ముహమ్మద్ కథ ముగిసినట్లే అని ఉత్కంఠతో, ఊపిరిబిగబట్టి చూస్తున్నారు. కాని బండరాయి నెత్తినవేద్దామని అంత దూకుడుగా వెళ్ళినవాడు అడుగు ముందుకు వేయలేక, చెమటలు కక్కుతూ అక్కడే ఆగిపోయాడు. అది చూసి అందరూ అవాక్కయ్యారు. మిత్రులు అతని దగ్గరిగా వెళ్ళి, ‘ఏమిటి.. ఏమైంది.. అలా వణికిపోతున్నావు?’ అన్నారు. ‘కళ్ళ ముందు అగ్నిగుండం భగభగ మండుతుంటే కళ్ళకు కనబడ్డం లేదా? అంగుళం కదిలినా మాడిమసైపోనా?’ అన్నాడు అబూజహెల్.ఈ మాటలు వాళ్ళను మరింత ఆశ్చర్యానికి గురిచేశాయి. ‘ఇదంతా నాటకం. మాకు కనబడని అగ్నిగుండం నీకే కనబడుతోందా? ముహమ్మద్‌కు భయపడి, తప్పించుకోవడానికి ఇదొక ఎత్తుగడ’ అన్నారు. అందులో ఒకడు అతని చేతిలో రాయి తీసుకొని, ప్రవక్త వైపు పోబోయాడు. అంతే! వాడు కూడా ఎత్తిన అడుగు ముందుకు వేయలేక ఠక్కున ఆగిపోయాడు. బతుకు జీవుడా అనుకుంటూ జావగారిన ముఖంతో వెనక్కి పరుగందుకున్నాడు. అలా ఆ రోజు గడిచి పోయింది. అయినప్పటికీ ఆ దుర్మార్గులు తమ ఆగడాలను మానుకోలేదు. ఒకరోజు నమాజ్ చేస్తున్న ప్రవక్త మెడపై అశుద్ధంతో నిండిన ఒంటె పేగుల్ని తెచ్చివేశారు. అంతలో చిన్నారి ఫాతిమా యాదృచ్ఛికంగా అక్కడికి రావడం తటస్థించింది. తండ్రి మెడ, వీపుపై ఒంటె ప్రేవుల్ని చూసి తల్లడిల్లిపోతూ ఆమె వాటిని తొలగించారు. ఎవరెన్ని చేసినా, సహనంతో వ్యవహరించాలనే గొప్ప సందేశాన్ని అలా మహమ్మద్ ప్రవక్త తన ఆచరణ ద్వారా అందరికీ చాటారు.సత్యసందేశాన్ని ఆపడానికి ప్రవక్తనే లక్ష్యంగా చేసుకున్న అవిశ్వాసులు తమ పథకాలు విఫలం కావడంతో, ఆయన అనుచరులపై విరుచుకు పడి, అమానుషంగా హింసించడం మొదలుపెట్టారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతాది వచ్చేవారం) -
దేవుడు ఒక్కడే అనండి...సాఫల్యం పొందుతారు!
రోజులు గడిచి పోతున్నాయి. ప్రియ ప్రవక్త(స) సందేశప్రచారం వల్ల విశ్వాసుల సంఖ్య క్రమక్రమంగా పెరగసాగింది. అవిశ్వాసులకు ఈవిషయం మింగుడుపడడం లేదు. ముహమ్మద్‌ను ఇలాగే వదిలేస్తే, అతని ధర్మం విస్తరిస్తుంది. అతను విజయం సాధిస్తాడు. మన పరువు ప్రతిష్టలు గంగలో కలిసిపోతాయి. మన నగరం అభాసు పాలవుతుంది. మన వ్యాపారాలు మందగించి పోతాయి. ఇంకా ఉపేక్షించడం ఎంతమాత్రం సరికాదు. ఏదో ఒకటి తేల్చేయాల్సిందే’ అని అంతా కలిసి మరోసారి అబూతాలిబ్ వద్దకు వెళ్ళారు. ‘అయ్యా! మీరు మాపెద్దలు. మాకు అత్యంత గౌరవనీయులు. ఇదివరకు కూడా ఒకసారి తమర్ని కలిశాం. అబ్బాయి విషయంలో కాస్త మాకు న్యాయం చేయండి. మా తాత ముత్తాతల ధర్మాన్ని గురించి, మా దేవతా విగ్రహాల గురించి, మా బుద్ధీజ్ఞానాల గురించి మాట్లాడ వద్దని ముహమ్మద్‌కు నచ్చజెప్పండి. లేదంటారా, మీరు పక్కకు తప్పుకోండి అతని సంగతి మేముచూసుకుంటాం. ఎలాగూ మీరు కూడా అతని మాటలు వినీ వినీ విసుగెత్తే ఉంటారు. మీకు కూడా కాస్త ప్రశాంతత లభిస్తుంది.’ అని మొరపెట్టుకున్నారు. అబూతాలిబ్ సంకట స్థితిలో పడి పొయ్యారు. వీళ్ళను ఎలా శాంతపరచాలో అర్థం కావడం లేదు. ఇక లాభం లేదనుకొని ముహమ్మద్ ప్రవక్తను పిలవనంపారు. ‘బాబూ ! వీళ్ళంతా మనజాతి అగ్ర నాయకులు. గొప్ప ధనసంపన్నులు. నువ్వేదో కొత్తమతాన్ని ప్రచారం చేస్తున్నావని ఫిర్యాదు చేస్తున్నారు. బాబూ ! ఎందుకొచ్చినగొడవ. నువ్వువాళ్ళజోలికి పోకు, వాళ్ళూనీజోలికి రారు’. అన్నారు అనునయంగా ‘బాబాయ్..! వాళ్ళ శ్రేయోసాఫల్యాలు ఎందులో ఎక్కువ ఉన్నాయో, ఆవైపుకు వాళ్ళను పిలవ వద్దని అంటున్నారా ?’. ‘శ్రేయో సాఫల్యాలా ..! ఏమిటది..?’ ‘ఒక్కమాట .. ఒకే ఒక్క సద్వచనం. దాన్ని వాళ్ళు ఉచ్చరిస్తేచాలు. అరేబియా అంతా వారికి దాసోహమంటుంది.ప్రపంచమంతా వారి పాదాక్రాంతమవుతుంది’. అన్నారుముహమ్మద్ . ఇది విని అబూజహల్ ఉత్సాహంగా ముందుకొచ్చాడు. ‘దైవసాక్షి! ఒక్కసారి కాదు, పదిసార్లు వల్లిస్తాం. ఏమిటో చెప్పు.’ అన్నాడు అబూజహెల్ .. అప్పుడు ప్రవక్త మహనీయులు, ’దేవుడు ఒక్కడే’ అని పలకండి. గౌరవప్రతిష్టలు మీ పాదాక్రాంతమవుతాయి. దైవకారుణ్యం మీపై వర్షిస్తుంది’. అన్నారు ప్రవక్తమహనీయులు. దీంతో ఒక్కసారిగా వారిముఖ కవళికలు మారిపొయ్యాయి. ఆగ్రహంతో వారికళ్ళుఎరుపెక్కాయి. పళ్ళు పదునెక్కాయి. ‘ఇదేనా నువ్వు చెప్పదలచుకున్నమాట. సరే చూడు నీగతి ఏమవుతుందో..!’అంటూ, పళ్ళునూరుతూ విసవిసా వెళ్ళిపోయారు. - ముహమ్మద్ ఉస్మాన్ ఖాన్ (మిగతా వచ్చేవారం) -
దైవవాణి అవతరణా పరంపర!
ప్రవక్త జీవితం ముహమ్మద్ (స) తలపెకైత్తి చూశారు. దైవదూత జిబ్రీల్ భూమ్యాకాశాల మధ్య శూన్యంలో ఆసనంలో కూర్చుని ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన ముహమ్మద్ (స) మనసు దైవంపట్ల కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. దేవా! నువ్వు మహా కరుణగలవాడవు. ఈ దాసుని పట్ల నీ ప్రేమకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అనిపించింది మనసుకు. దూతను చూడగానే ముచ్చెమటలు పోశాయి. శరీరం కంపించసాగింది. మొదటిసారి హిరా గుహలో కూడా ఆయన నిలువెల్లా వణికిపోయారు. గాలిలో ఆకులు ఊగినట్లు. కాని అప్పటి వణుకుకు, ఇప్పటి వణుకుకు, అప్పటి భయానికి, ఇప్పటి భయానికి చాలా వ్యత్యాసం ఉంది. అప్పటి స్థితి అత్యంత భయానకమైనది. ఇప్పటి స్థితి ఆనందంతో కూడుకున్నది. ఇందులో ఆత్మసంతృప్తి, ఆత్మసంతోషం ఉన్నాయి. అదేస్థితిలో ఆయనగారు ఇంటికి వచ్చేశారు. వచ్చీరాగానే ‘ఏమైనా కప్పు.. ఏమైనా కప్పు’ అన్నారు. వెంటనే బీబీఖదీజా ఓ వస్త్రం తెచ్చి కప్పారు. అంతలో అదే దూత దైవవాణితో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వస్త్రం కప్పుకుని పడుకున్నవాడా! లే, లేచి (ప్రజలను) హెచ్చరించు. నీ ప్రభువు ఘనతను చాటిచెప్పు. నీ దుస్తులను పరిశుభ్రంగా ఉంచుకో. మాలిన్యానికి దూరంగా ఉండు. ఎక్కువ పొందాలనే కాంక్షతో ఉపకారం చేయకు. నీ ప్రభువుకొరకు సహనం వహించు. (అల్ ముద్దస్సిర్ 1-7) దైవవాణి అవతరణతో అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. గుండెమంట చల్లారింది. మేధస్సుకు ప్రశాంతత చేకూరింది. మనసుకు స్థిమితం, నిలకడ ప్రాప్తమైంది. ఇక బీబీ ఖదీజా విషయమైతే చెప్పనే అక్కరలేదు. ఆమె ఆనందానికి అవధులే లేవు. ముఖవర్ఛస్సు దేదీప్యమానంగా వెలిగిపోతోంది. మనసంతా సంతోషంతో విరబూసిన పూదోట అయిపోయింది. ఎందుకంటే ఆమె నిరీక్షణ ఫలించింది. కోరిక ఈడేరింది. దైవవాణి అవతరించింది. ఇక తరువాత దైవవాణి అవతరణా పరంపర కొనసాగుతూనే ఉంది. దైవసందేశం వస్తూనే ఉంది. కాని దైవ నిర్ణయమేమిటోగాని, అకస్మాత్తుగా మళ్ళీ దైవవాణి అవతరణ ఆగిపోయింది. సందేశప్రచారపరంపర ప్రారంభం కాగానే తిరస్కారుల నుండి వ్యతిరేకత కూడా మొదలైంది. వ్యతిరేకించడానికి పెద్దపెద్ద కారణాలేమీ అవసరం లేదు. చిన్నసాకు చాలు. దైవవాణి ఆగిపోవడం నిజంగా పెద్దవిషయమే. ఇక తిరస్కారులు ఊరుకుంటారా! వారు దీన్నొక ఆయుధంగా ఉపయోగించుకున్నారు. ‘అబ్బో, ఈయనగారు దైవప్రవక్త అట. నాలుగు రోజులపాటు ఆకాశవాణితో ముచ్చట్లు నడిచాయి. జిబ్రీల్ రాకపోకలూ సాగాయి. అంతలోనే అంతా మాయం. మాటాముచ్చట అంతా బంద్. సోదరా ముహమ్మద్! నీ ప్రభువు నీపై ఆగ్రహం చెందాడేమో చూడు. అందుకే ముఖం చాటేశాడు’ అంటూ తిరస్కారులు వ్యంగ్యబాణాలు సంధించడం మొదలుపెట్టారు. వహీ ఆగిపోవడమనేది నిజంగా చాలా బాధాకర విషయమే, దానికంటే ఎక్కువ గోరుచుట్టుపై రోకటిపోటులా ఈ వ్యతిరేకుల వ్యంగ్యబాణాలు మనసును ఇంకాస్త బాధిస్తున్నాయి. ముహమ్మద్ (స) చాలా అశాంతికి గురయ్యారు. కాని ఎక్కువ రోజులు గడవకముందే హ.జిబ్రీల్ (అ) మళ్ళీ వచ్చేశారు. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
దైవవాణికోసం నిరీక్షణలో... ప్రవక్త జీవితం
తరువాత ముహమ్మద్ (స) ఇంటికి తిరిగొచ్చారు. ఆయన ముఖారవిందం విచారంగా ఉంది. రకరకాల ఆలోచనలతో ఆయన మనసు నిండిపోయింది. ‘ఈ బలహీన భుజస్కంధాలపై దౌత్యభారమా ! దీని పర్యవసానం ఏమి కానుందో!? దీన్ని నేను ఎలా మోయగలను? ప్రజల్ని సత్యంవైపు, సన్మార్గం వైపు ఎలా పిలవడం? వీరు మార్గవిహీనులై, దైవానికి దూరంగా ఉన్నారు. సత్యానికి దూరంగా ఉన్నారు. విగ్రహారాధన, బహుదైవారాధన వీరి నరనరాల్లో జీర్ణించుకుపోయి ఉంది. మూఢాచారాల్లో పీకలదాకా మునిగి ఉన్నారు. అన్నిరకాల దుష్కార్యాలు, దుర్మార్గాలు వారిని పరివేష్టించి ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో నా కర్తవ్యం ఏమిటి? దాన్ని నేను నిర్వర్తించడం ఎలా??’ మనసులో ఆలోచనల తుఫాను చెలరేగింది. దీంతో ఆయన దైవవాణి కోసం నిరీక్షించసాగారు. నిరీక్షణ. దైవదూత కోసం .. దైవవాణి కోసం ... వరఖా బిన్ నౌఫిల్ ధృవీకరించిన దూతకోసం.. ఖదీజా విశ్వసనీయంగా చెప్పిన దైవదూత కోసం..! కానీ ఫలించలేదు. జిబ్రీల్ దూత రాలేదు.. ఎలాంటి దైవవాణీ అవతరించలేదు... మళ్ళీ మనసులో అలజడి, పెనుతుఫాను.. ‘ఇప్పుడు నేనేంచేయాలి.. నా కర్తవ్యం ఏమిటి? ప్రజలకు ఏమి సందేశమివ్వాలి?’ ఈ విషయాలు చెప్పడానికి జిబ్రీల్ (అ) ఎందుకు రాలేదు? జిబ్రీల్ రాక ఎందుకు ఆగిపోయింది. మళ్ళీ సందేశం ఎందుకు తేలేదు! ఒకటే ఆలోచన. మనసంతా అంధకారమైన భావన. నిర్మల తేజంతో ప్రకాశించే సుందరవదనం కళా విహీనమైపోయింది. మనసును చీకట్లు ముసురుకున్నాయి. అటు బీబీ ఖదీజా పరిస్థితి కూడా ఇంచుమించు ఇలాగే ఉంది. ఆమె మనసులో కూడా ఆందోళన మొదలైంది. రేయింబవళ్ళు లోలోనే కుమిలిపొయ్యారు. కాని ఎక్కడా బయట పడలేదు. భర్తకు ధైర్యవచనాలు చెబుతూ, ఊరడించడానికి శక్తిమేర ప్రయత్నించేవారు. ముహమ్మద్ (స) మళ్ళీ హిరాగుహను ఆశ్రయించారు. రేయింబవళ్ళు అక్కడే దైవధ్యానంలో గడిపేవారు. తన ప్రభువుతో సంభాషించేవారు. ప్రభూ! నువ్వే కదా నన్ను ప్రవక్తగా నియమించావు. మళ్ళీ అంతలోనే విడిచిపెట్టావా స్వామీ? అని మొరపెట్టుకునేవారు. బాధతో గుండెలు అవిసిపోయేవి. ఆందోళన.. ఆక్రందన.. ఏమీ అర్థంకాని పరిస్థితి.. ఏమీ పాలుపోక ఎటెటో తిరిగేవారు.. రాళ్ళురప్పల మధ్య.. కొండకోనల మధ్య.. ఒక్కోసారి తనువుచాలిద్దామన్నంత నిరాశతో కొండశిఖరం పైకి ఎక్కేవారు. అంతలో హజ్రత్ జిబ్రీల్ దూత వచ్చేవారు. ఆయన్ని శాంతపరిచేవారు. ‘ముహమ్మద్ ! మీరు నిస్సందేహంగా దైవప్రవక్తే.’ అని భరోసా ఇచ్చేవారు. దీంతో ఆయనకు సాంత్వన చేకూరేది. వెనుదిరిగి వెళ్ళిపోయేవారు. కొద్దిరోజుల తరువాత మళ్ళీ అదే పరిస్థితి ఎదురయ్యేది. మళ్ళీ పర్వత శిఖరంపైకి చేరుకునేవారు ఆత్మత్యాగం చేద్దామని! హజ్రత్ జిబ్రీల్ మళ్ళీ వచ్చి ఆయన్ని ఓదార్చేవారు, ఆయన వెనుదిరిగి వెళ్ళేవారు. ఆయన మనసు ఎంత గాయపడి ఉండాలి! ఆత్మ ఎంతగా రోదించి ఉండాలి! మనోమస్తిష్కాలపై ఎంతటి భారం పడిఉండాలి! దైవవాణి అవతరణ ఆగిపోవడం మామూలు శిక్షకాదు. దైవం నన్ను వదిలేశాడా అన్న భావన గుండెలో గునపాలు గుచ్చినంతగా బాధించేది. ఇవే ఆలోచనలు మనసును తొలుస్తుండగా, ఒకరోజు ఆయన ఎటో బయలు దేరారు. అకస్మాత్తుగా ఆకాశం నుండి ఓ శబ్దం వినిపించింది. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం) -
దైవసందేశహరునిగా ముహమ్మద్ (స)
ప్రవక్త జీవితం బీబీ ఖదీజా మనసులో సంతోషం పరవళ్ళు తొక్కుతోంది. కాని అదేసమయంలో చిన్నపాటి భయం, సందేహం కూడా పట్టిపీడిస్తోంది. ఎందుకైనా మంచిది వరఖ బిన్ నౌఫిల్ దగ్గరికెళ్ళి సందేహ నివృత్తి చేసుకుందామనుకున్నారు. వృద్ధుడైన వరఖ ఆమెకు వరసకు సోదరుడవుతాడు. వివిధ మతధర్మాలను కాచివడపోసిన సుప్రసిద్ధ పండితుడు. గొప్పతత్వవేత్త. మహా జ్ఞాని. ఎటువంటి చిక్కుసమస్యకైనా చిటికెలో పరిష్కారం చూపగల వివేకి. మతగ్రంథాలపై మంచి పట్టుకలిగిన పండితుడు. ఖదీజా వెంటనే ఆయన దగ్గరికి వెళ్ళారు. పూర్తి వృత్తాంతమంతా పూసగుచ్చినట్టు వివరించారు. అంతా శ్రధ్ధగా ఆలకించిన వరఖ ముఖకవళికలు ప్రసన్నంగా మారిపొయ్యాయి. ‘‘దైవం మహా పవిత్రుడు. శుభం ఖదీజా, శుభం.! ఈ వరఖ ప్రాణం ఎవరి గుప్పిట్లో ఉందో ఆ మహత్తరశక్తి సాక్షిగా చెబుతున్నా విను... ఖదీజా! నువ్వు చెప్పిన విషయాలు నిజమే అయితే ముహమ్మద్ ముందు ప్రత్యక్షమై, ఆయనతో సంభాషించిన ఆ అపరిచిత మానవ రూపం నిస్సందేహంగా దైవదూతే. మూసాప్రవక్త(అ) దగ్గరికి వచ్చిన మహా దూత జిబ్రీలే ఈయన దగ్గరికీ వచ్చాడు. సంతోషంగా ఇంటికి వెళ్ళు. ముహమ్మద్‌ను తనదినచర్య యధావిధిగా కొనసాగించమని చెప్పు. త్వరలోనే నేనతన్ని కలుసుకుంటాను’. అన్నాడు వరఖా పరమ సంతోషంగా.. ఖదీజా వడివడిగా ఇంటికి చేరుకున్నారు. వచ్చీరాగానే సేదదీరుతున్న ముహమ్మద్ (స) నుద్దేశించి, ‘శుభాభినందనలు. దేవుడు మీ మొరను ఆలకించాడు. మీరిప్పుడు దేవుని ప్రవక్త. అన్నయ్య వరఖాకు మీ వృత్తాంతమంతా వినిపించాను. అంతా విని పూర్వగ్రంథాల వెలుగులో, అపార అనుభవంతో ఆయన చెప్పిన విషయం ఇది. త్వరలోనే ఆయన మిమ్మల్ని కలుసుకోబోతున్నారు’. అంటూ అభినందనల్లో ముంచెత్తారు ఖదీజా. తరువాత ముహమ్మద్ (స) ప్రదక్షణ కోసం కాబా మందిరానికి బయలు దేరారు. దారిలో వృద్ధ పండితుడు వరఖా ఎదురుపడ్డాడు. కుశల ప్రశ్నలు వేశాడు. ‘‘అబ్బాయీ! విషయం ఏమిటి? ‘హిరా గుహలో నువ్వు ఏం చూశావూ?’ అంటూ ఆరా తీశాడు. ముహమ్మద్ (స) జరిగిన విషయమంతా ఏకరువు పెట్టారు. అంతా సావధానంగా విన్న వరఖా ‘‘బాబూ! నీకు అభినందనలు తెలుపుతున్నాను. మూసా ప్రవక్త దగ్గరికి వచ్చినై దెవదూతే నీ దగ్గరికీ వచ్చాడు. ఇప్పుడు నువ్వు దైవ ప్రవక్తవు. మానవజాతికి మార్గం చూపడానికి దైవం నిన్ను ఎన్నుకున్నాడు. నువ్వీ విషయం బహిరంగంగా ప్రకటిస్తే, నీ జాతే నిన్ను తిరస్కరిస్తుంది. హింసిస్తుంది. బహిష్కరిస్తుంది. నీపై యుద్ధం ప్రకటిస్తుంది.ప్రవక్తలొచ్చి సన్మార్గ పథం చూపిన ప్రతిసారీ ప్రజలు ఇలానే వ్యవహరించారు. అలాంటి రోజే గనక వచ్చి అప్పటికి నేను బతికుంటే నీకు పూర్తి సహకారం అందిస్తాను. నీకు తోడు నీడగా ఉంటాను. శాయశక్తులా నిన్ను ఆదుకుంటాను’. అంటూ ఎంతో ప్రేమానురాగాలతో ముహమ్మద్ (స) నుదుటిని చుంబించాడు వరఖా. - ముహమ్మద్ ఉస్మాన్‌ఖాన్ (మిగతా వచ్చేవారం)