publicity stunts
-
మీడియాకు చంద్రగ్రహణం
‘‘వెయ్యి తుపాకులక్కూడా భయపడనుగానీ.. కలానికి మాత్రం భయపడతాను’’ అని కొన్ని వందల సంవత్సరాల క్రితమే చెప్పారు అమెరికా తొలి అధ్యక్షుడు థామస్ జెఫర్సన్. అయితే, ప్రపంచవ్యాప్తంగా ఉదార ఆర్థిక విధానాలు మొదలైనాక, పాలక వర్గాల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ప్రజలలో ప్రభుత్వం పట్ల అనుకూలత పెంచడానికి ‘మేన్యుఫాక్చర్డ్ కన్సెంట్’ విధానాన్ని అనుసరిస్తూ పాలక వర్గాలు అత్యధిక శాతం మీడియాను తమ చెప్పుచేతల్లోకి తీసుకొని ప్రజలను ప్రభావితం చేసే దుర్మార్గపు దశ మొదలైందని ప్రముఖ ప్రజాస్వామ్యవాది, రచయిత ‘నోమ్ చామ్స్కీ’ 90 దశకం ప్రారంభంలోనే చెప్పారు. ప్రపంచం మాట ఎలా ఉన్నా.. తెలుగునాట మాత్రం ‘చామ్స్కీ’ చెప్పిన ప్రోపగాండ మోడల్.. చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా అధికారపీఠం ఎక్కిన తర్వాత ఉధృతరూపం దాల్చింది. 1984లో అప్పటి రాష్ట్ర సీఎం ఎన్టీఆర్‌పై సహచర మంత్రి నాదెండ్ల భాస్కర రావు తిరుగుబాటు చేసిన ఉదంతంలో ప్రజల్ని చైతన్యపర్చిన వైనాన్ని మీడియాలోని ఒక వర్గం ప్రజాసామ్య పరిరక్షణోద్యమంగా అభివర్ణిస్తుంది. వర్తమాన చరిత్రను పరిశీలిస్తే.. సీఎం చంద్రబాబునాయుడు ప్రతిపక్షంలో గెలిచిన 23మంది ఎమ్మెల్యేలను తమ పార్టీలో ఫిరాయింపజేసుకొని, అందులో నలుగురిని ఏకంగా మంత్రుల్ని చేశారు. ఈ ఉదంతంపై ఒక వర్గం మీడియా చంద్రబాబును పల్లెత్తుమాట అనలేదు. తహసీల్దార్ శ్రీమతి వనజాక్షిపై అధికారపార్టీ ఎమ్మెల్యే పాల్పడిన అమానుషదాడి అంశాన్ని సాధారణ అంశంగానే పరిగణించింది. కేవలం ముడుపుల కోసం చేపట్టిన పట్టిసీమ వల్ల ఒనగూడే నిజమైన ప్రయోజనాలేమిటో నిష్పక్షపాతంగా మీడియా వెల్లడించ లేదు. ఇక, పోలవరం ప్రాజెక్టులో జరిగిన విచ్ఛలవిడి అవినీతికి సంబంధించిన వార్తలు ప్రజలకు తెలియకుండా తొక్కిపెట్టింది. కొన్ని మీడియా సంస్థలు గొడుగు పట్టిన కారణంగానే.. ఓటుకు నోటు వంటి సంచలనకేసులో చంద్రబాబు పాత్ర హైలైట్ కాలేకపోయింది. బాహ్యప్రపంచం యావత్తూ ఓటుకునోటు కేసులో చంద్రబాబునాయుడి ప్రమేయాన్ని అర్థం చేసుకోగలిగింది. కానీ.. కొన్ని మీడియా సంస్థలకు ఈ కేసులో ఎటువంటి తప్పు కన్పించినట్లు లేదు. తెలంగాణ రాష్ట్రానికి జరిగిన ఎన్నికల సందర్భంగా మహాకూటమి తరఫున ప్రచారంలో పాల్గొన్న చంద్రబాబు.. తెలుగుదేశం శాసనసభ్యులు టీఆర్ఎస్కు అమ్ముడు పోయారని, వారికి తగిన బుద్ధి చెప్పాలంటూ విమర్శించారు. చంద్రబాబు సొంత రాష్ట్రంలో ఏం చేశారో ఆయనకు ఎందుకు గుర్తుకు రావడం లేదని.. మీడియా ప్రశ్నించలేకపోయింది. సీఎం అధికారిక నివాసంలో ప్రభుత్వ ఖర్చులతో ఏర్పాటు చేసుకున్న టెలికాన్ఫరెన్స్ సౌకర్యాన్ని పార్టీ ప్రయోజనాల కోసం వినియోగించడం సరికాదని, ప్రతిరోజూ లక్షల రూపాయలు ప్రజాధనాన్ని చంద్రబాబు పార్టీ కోసం వాడుకొంటున్నారన్న వాస్తవాన్ని మాత్రం మీడియా ప్రజలకు తెలియపర్చదు. ప్రత్యేకహోదా కంటే ప్యాకేజీ మెరుగు అంటూ చేసిన వాదనలు, చంద్రబాబు లెక్కలేనన్ని ’యు’టర్న్‌లపై అనుకూల మీడియా ఒక్క చర్చ కూడా ఏనాడు తమ ఛానల్స్‌లో పెట్టలేదు. కానీ, అధికారంలోకి వస్తే వైఎస్ జగన్ అమలు చేస్తామన్న నవరత్నాలుపైన, ఏలూరు బీసీ డిక్లరేషన్‌లో ఇచ్చిన హామీలు నెరవేర్చడం ఎలా సాధ్యం? అంటూ గంటల తరబడి డిబేట్లు పెట్టడం, జగన్ అధికారం కోసం అలవికాని హామీ ఇస్తున్నారంటూ అందరితో విమర్శలు చేయించడం ఆంధ్రప్రదేశ్‌లో ఒక వర్గం మీడియాకు నిత్యకృత్యమై పోయింది. జగన్ మీద ఉన్న కేసులపై అనేక అసత్య కథనాల్ని ప్రముఖంగా ప్రచురించడం; జగన్‌ను దూషిస్తూ తెలుగు దేశం మంత్రులు, శాసనసభ్యులు చేసిన విమర్శల్ని పతాక శీర్షికలుగా చేసుకోవడం వంటి నీతిబాహ్యమైన చర్యల్ని అనుకూల మీడియా అనేకం చేశాయి, చేస్తూనే ఉన్నాయి. చంద్రబాబు చేసే విన్యాసాలను ఒక వర్గం మీడియా గొడుగు పడుతున్న తీరు వెనుక ఆర్థిక, వర్గ, కుల ప్రయోజనాలు తప్ప వేరొకటి కనపడదు. చంద్రబాబు వైఫల్యాలను, అవినీతి, అక్రమాలను ఎంతగా వెనకేసుకొస్తున్నప్పటికీ.. ప్రత్యామ్నాయ మీడియా, ప్రత్యేకించి సోషల్ మీడియా ద్వారా ప్రజలు చైతన్యం అయ్యారు. వాస్తవాలు తాత్కాలికంగా మరుగున పడవచ్చునేమోగానీ శాశ్వతంగా గొంతు నొక్కడం ఎవరికీ సాధ్యం కాదు. వ్యాసకర్త: సి. రామచంద్రయ్య, మాజీ ఎంపీ, వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి -
ఇదేం బడాయి..చంద్రబాబు!
బద్వేలు: ముఖ్యమంత్రి ప్రచార యావను చూసి ప్రజలు విస్తుపోతున్నారు. ఇదేం బడాయంటూ నవ్వుకుంటున్నారు. మనం ఎవరికైనా మేలు చేస్తే సాయం పొందిన వ్యక్తులు కృతజ్ఞతలు చెబుతారు. కానీ ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వ తీరు వింతగా ఉంది. సీఎం చంద్రబాబు చేసింది గోరంత చెప్పుకునేది కొండంతగా మారింది. దీంతో పాటు మరీ కోరి కృతజ్ఞతలు చెప్పించుకుంటున్నారని మహిళలు గుసగుసలాడుకుంటున్నారు. సీఎం తీరుతో అధికారులు సైతం ఇబ్బంది పడుతున్నారు. గత సార్వత్రిక ఎన్నికల సమయంలో డ్వాక్రా మహిళల రుణాలు మాఫీ చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ఆ హామీని గాలికొదిలి డ్వాక్రా సంఘాలను నట్టేట ముంచారు. మాఫీ చేస్తారనే ఉద్దేశంతో వారు కంతులు కట్టడం మానేశారు. దీంతో వడ్డీలు, వాటి మీద జరిమానాలు కలిసి తడిపి మోపెడయ్యాయి. ఈ నేపథ్యంలో చాలా సంఘాలు నిర్వీర్యం కాగా మరికొందరు మధ్యలోనే సంఘాలను నుంచి వైదోలగాల్సి వచ్చింది. పసుపు, కుంకుమ పేరుతో రూ.10 వేలు : ఈ నేపథ్యంలో డ్వాక్రా మహిళలు బాబు సర్కారుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని తప్పించుకుని వారిని ప్రసన్నం చేసుకునేందుకు ఒక్కో సభ్యురాలికి పెట్టుబడి నిధి (పసుపు, కుంకుమ) పేరుతో రూ.10 వేలు ఇస్తామని ప్రకటించారు. తీరా సంతోషించే లోపు దీన్ని ఒకే పర్యాయం ఇవ్వడం లేదని నాలుగు విడతలుగా ఇస్తామని చెప్పారు. ఏటా రెండు వేల రూపాయలు వంతున ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఏడాది నాలుగో విడత నిధులు విడుదల చేశారు. ఇందులో కూడా చాలా సంఘాల సభ్యులకు ఇవి కూడా అందలేదు. ఇచ్చిందే అంతంతమాత్రం. మళ్లీ ప్రకటనలు, ప్రచార్భాటాలు చేస్తుండటంపై ఇప్పటికే బాబు సర్కారుపై తీవ్ర విమర్శలున్నాయి. ఇంటింటికి డప్పు : రెండు నెలల కిందట నాలుగో విడత నిదులు మంజూరు చేశారు. జిల్లాలో 32 వేల సంఘాలుండగా వాటిలో 3,21,473 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. 2018 అక్టోబరులో నాలుగో విడతకుగాను రూ.64.29 కోట్లు అవసరం. తామేదో డ్వాక్రా మహిళలకు ఇచ్చిన మాట నిలబెట్టుకున్నట్లు కలరింగ్ ఇవ్వడం ప్రారంభించారు. ‘ఆడపడుచులకు ధన్యవాదాలు... ఇచ్చిన మాట నిలబెట్టుకున్న సీఎం చంద్రబాబు... సీఎం సర్‌కు ధన్యవాదాలు’ అనే స్టిక్కర్లను పంపిణీ చేసి ప్రతి డ్వాక్రా మహిళ ఇంటికి అంటించమని ఆదేశించారు. అసలు నిధులే అందని వారు చాలా మంది ఉన్నారు. డ్వాక్రా రుణాల మాఫీ పేరుతో ఆశలుపెట్టి అప్పుల పాలు చేశారని, ఇప్పుడు స్టిక్కర్లు ఏంటని పలువురు నిలదీస్తున్నారు. దీంతో సంఘాల లీడర్లు, సిబ్బంది ఇబ్బందులు పడుతున్నారు. బలవంతపు అభినందనలు : దీంతో పాటు గ్రామ సహాయకుల జీతాలు పెంచామని, డ్వాక్రా సంఘాల వీఓలకు గౌరవ వేతనం పెట్టామని.. ఇలా రకరకాల వర్గాలతో సీఎం చంద్రబాబు చిత్ర పటాలకు బలవంతపు క్షీరాభిషేకాలు చేయిస్తున్నారు. జిల్లా నుంచి ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసి విజయవాడకు వీఆర్ఏలను తరలించి అభినందన సభ ఏర్పాటు చేయించుకున్నారు. తాము అడిగిన దానిలో కనీసం 50 శాతం కూడా చేయకుండానే తమతో అభినందన సభలు ఆయా వర్గాల ప్రజలు వాపోతున్నారు. డ్వాక్రా మహిళలు, మెప్మా సిబ్బందితో కూడా క్షీరాభిషేకాలు చేయించుకున్నారు. తమకు ఇష్టం లేకున్నా అడిగి మరీ డప్పు కొట్టించుకుంటున్నారని ఆయా వర్గాలు చర్చించుకుంటున్నాయి. -
'ఎంతసేపూ మీకు పబ్లిసిటీ పిచ్చేనా?'
-
'ఎంతసేపూ మీకు పబ్లిసిటీ పిచ్చేనా?'
హైదరాబాద్: తన వల్లే పీవీ సింధుకు ఒలింపిక్స్ లో పతకం వచ్చిందని సీఎం చంద్రబాబునాయుడు గొప్పలు చెప్పుకొంటున్నారని, ప్రజలకు ఇచ్చిన హామీలను గాలికొదిలేసి ఆయనకు ఎంతసేపూ పబ్లిసిటీ పిచ్చేనా? అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ప్రశ్నించారు. కృష్ణ నదికి పుష్కరాలు తానే తీసుకొచ్చానని, పుష్కరాలను తానే సాగనంపుతానని చంద్రబాబు చెప్పుకొంటున్నారని, ఆయన పబ్లిసిటీ స్టంట్లు మితిమీరిపోయాయని విమర్శించారు. హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తన వల్లే పుష్కరాలు వచ్చాయని చంద్రబాబు చెప్పడమేమిటని ఆయన ప్రశ్నించారు. రాయలసీమలో కరువుతో రైతులు, నిరుద్యోగం వల్ల యువత అల్లాడుతున్నారని, ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారని, పరిస్థితులు ఇంత దారుణంగా ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని శ్రీకాంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణ, గోదావరి పుష్కరాల పేరిట దాదాపు రూ. 3,500 కోట్లను అధికార పార్టీ నేతలు దోచుకున్నారని, పుష్కరాల కోసం 10శాతం నిధులను ఖర్చు చేస్తే.. 90శాతం నిధులు అధికార పార్టీ నేతల జేబుల్లోకి వెళ్లాయని ఆయన విమర్శించారు. పుష్కరాలను భక్తితో నిర్వహించాలని తాము కోరుతున్నామని, కానీ సినీఫక్కీలో నిర్వహిస్తూ ఆ పవిత్రతకు భంగం కలిగిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఓటుకు నోటు కేసులో నిందితుడు జెరూసలేం మత్తయ్య గురించి, గ్యాంగ్ స్టర్ నయీం గురించి సీఎం చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని ఆయన నిలదీశారు. నయీంను పెంచి పోషించింది చంద్రబాబేనని ఆరోపణలు వస్తున్నాయని చెప్పారు. తెలంగాణ, ఏపీ ప్రభుత్వాలు రహస్య అవగాహనతో ఓటుకు నోటు కేసును నీరుగార్చాయని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో ఈ రెండు కేసులపై సీబీఐ విచారణ జరిపించాలని శ్రీకాంత్ రెడ్డి డిమాండ్ చేశారు. స్వయంగా మంత్రి అచ్చెన్నాయుడే నయీంతో సెటిల్ మెంట్ చేసుకోమన్నాడంటే.. ఇంకెంతమంది ఆంధ్రా మంత్రులతో నయీంతో సంబంధాలు ఉన్నాయో అర్థమవుతోందని చెప్పారు. బిల్లీరావు, తెల్గీ వంటివాళ్లను తయారుచేసింది చంద్రబాబేనని విమర్శించారు. -
ట్రెండ్‌గా మారిపోయిన వివాదాలు