అఫ్జల్‌గంజ్‌లో పోలీసుల కార్డన్‌సెర్చ్
హైదరాబాద్: అఫ్జల్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని జాంబాగ్, పూసలబస్తీ, సుందర్బాగ్లో శనివారం రాత్రి ఈస్ట్‌జోన్ డీసీపీ రవీందర్ ఆధ్వర్యంలో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఇంటింటి వెళ్లి సోదాలు చేశారు. సరైన ధ్రువపత్రాలు లేని 27 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోను స్వాధీనం చేసుకుని ఏడుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల నుంచి అద్దెకు ఉంటున్న వారి వివరాలను కూడా సేకరించారు. దాదాపు 200 మంది పోలీసులు సోదాల్లో పాల్గొన్నారు.