Raghuram reddy
-
ముగ్గురు మంత్రులం ఉన్నాం..
ఖమ్మం: గత ఎన్నికల్లో తమను కడుపులో పెట్టుకుని అత్యధిక మెజార్టీతో గెలిపించగా ముగ్గురికి మంత్రి పదవులు దక్కడంతో ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తున్నామని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాంరెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఖమ్మంలోని జెడ్పీ సెంటర్ నుండి ముస్తఫానగర్, చర్చికాంపౌండ్, ప్రకాష్‌నగర్, బోసుబొమ్మ సెంటర్ మీదుగా గాంధీచౌక్ వరకు శుక్రవారం రాత్రి రోడ్‌షో నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చికాంపౌండ్ సెంటర్లో మంత్రి పొంగులేటి మాట్లాడుతూ బీఆర్ఎస్, బీజేపీ ఒకటేనని, ఆ రెండు పార్టీల నడుమ లోపాయికారి ఒప్పందం ఉందని తెలిపారు. మాజీ సీఎం కేసీఆర్ తాను చేసిన తప్పుల నుండి కాపాడుకోడానికి బీజేపీతో జత కడుతున్నారని చెప్పారు. ఎన్నో మోసపూరిత హామీలు ఇచ్చి మాయమాటలతో పదేళ్లు రాజ్యమేలారని విమర్శించారు. కనీసం పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లు కూడా ఇవ్వలేకపోయారని చెప్పారు.కాంగ్రెస్ హయాంలో నియోజకవర్గానికి 3,500 ఇళ్లు కట్టిస్తామని చెప్పినప్పటికీ మంత్రి తుమ్మల ఖమ్మం నియోజకవర్గానికి అదనంగా ఇళ్లు కావాలని అడిగారని తెలిపారు. గృహనిర్మాణ శాఖకు మంత్రిగా ఉన్న తాను ఖమ్మంకు ఆరు వేల ఇళ్లు మంజూరు చేస్తానని ప్రకటించారు. ఎంపీగా రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే కేంద్రం నుంచి అదనంగా నిధులు వస్తాయని తెలిపారు.నిరుపేదలందరికీ ఇళ్లు..మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఖమ్మంలో రోడ్ల వెంట, కాల్వగట్ల వెంట గుడిసెలు వేసుకుని ఉంటున్న వారందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ప్రకటించారు. వెంకటగిరి, బైపాస్ బ్రిడ్జిలు, దానవాయిగూడెం ఫిల్టర్ బెడ్, పుట్టకోట బెడ్ తన హయాంలో నిర్మించినవేనని తెలిపారు.ఖమ్మం ప్రజలు ప్రశాంతంగా అన్నదమ్ముల్లా కలిసిమెలసి ఉండాలంటే రఘురాంరెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలన్నారు. జిల్లా నుంచి డిప్యూటీ సీఎం భట్టితో పాటు తామిద్దరం కలిసి ఖమ్మంను అన్నిరంగాల్లో అభివృద్ధి చేసి రాష్టంలోనే ఆగ్రగామిగా ఉంచుతామని తెలిపారు. కాగా, కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెబుతున్న వారు ధైర్యం ఉంటే రేవంత్‌రెడ్డిని తాకాలని సూచించారు.మతోన్మాద బీజేపీ మరోమారు గెలిస్తే ప్రజల మధ్య మతవిద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని విభజిస్తుందని తెలిపారు. అనంతరం అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే ముగ్గురు మంత్రుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి పాటుపడతానని తెలిపారు. ఈ రోడ్డు షోలో డీసీసీ అధ్యక్షుడు దుర్గాప్రసాద్, నాయకులు మహ్మ ద్ జావీద్, బాలసాని లక్ష్మీనారాయణ, సాధు రమేష్‌రెడ్డి, దొబ్బల సౌజన్య తదితరులు పాల్గొన్నారు. -
మతతత్వ శక్తులను ఓడించండి
ఖమ్మం వన్‌టౌన్: మతతత్వ, ఫాసిస్ట్ శక్తులను ఓడించి దేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడాలని రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, ఎంపీ రేణుకా చౌదరి పిలుపునిచ్చారు. ఖమ్మం లోక్‌సభ కాంగ్రెస్ అభ్యర్థిగా రామసహాయం రఘురాంరెడ్డి గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఖమ్మంలో భారీ ర్యాలీ నిర్వహించారు. నామినేషన్ దాఖలు అనంతరం మీడియా పాయింట్ వద్ద మంత్రులు, ఎంపీ, ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా పొంగులేటి మాట్లాడుతూ, దేశం కోసం గాంధీ కుటుంబం ఎన్నో త్యాగాలు చేసిందని, సోనియా, రాహుల్ ప్రధాని పదవిని సైతం వదులుకున్నారన్నారు.మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, రఘురాంరెడ్డి కుటుంబం ప్రజలందరికీ తెలుసునని, జిల్లా నాయకుల అభిప్రాయాలు తీసుకున్నాకే అధినాయకత్వం ఆయనను అభ్యర్థిగా ఎంపిక చేసిందని చెప్పారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు, సీపీఎం నేత పోతినేని మాట్లాడుతూ మతాన్ని అడ్డుపెట్టుకుని మోదీ అధికారంలోకి రావాలని చూస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్ఎస్ను ఓడించాలనే లక్ష్యంతోనే కాంగ్రెస్‌తో కలిసి పనిచేస్తున్నామని కూనంనేని వెల్లడించగా, భువనగిరి తప్ప మిగతా అన్ని స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు ఉంటుందని సీపీఎం నేత సుదర్శన్ తెలిపారు. కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి మాట్లాడుతూ తనది ఖమ్మం జిల్లానేనని.. ప్రజలు, ప్రభుత్వ అవసరాల కోసం ఏళ్ల క్రితమే తమ భూములు ఇచ్చామని చెప్పారు. ఈ ర్యాలీలో ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. -
ప్రాజెక్టులపై నోరు మెదపని బాబు
ఖాజీపేట: జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల గురించి ముఖ్యమంత్రి చంద్రబాబు నోరు మెదపకపోవడం దారుణమని మాజీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి విమర్శించారు.వైఎస్సార్ సీపీ అధికారంలోకి రాగానే రాజోలు జలాశయం నిర్మించి కేసీ కాలువ ఆయకట్టు స్థిరీకరించి రైతులకు రెండుకార్లకు సాగునీరు ఇచ్చేలా కృషిచేస్తామన్నారు. ఖాజీపేటకు చెందిన శ్రీ వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు పీవీ రాఘవరెడ్డి, కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సుంకేశుల ఆంజనేయ స్వామి ఆలయం నుంచి ఖాజీపేట వరకు భారీ ర్యాలీ నిర్వహిం చారు. ఈ సందర్భంగా ఖాజీపేటలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ ఎంపీ ప్రారంభించారు. అనంతరం ఖాజీపేట బస్టాండ్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ కేసీ కాలువకు సాగునీటి కోసం మైదుకూరు ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో తామంతా కలిసి మైదుకూరు కూడలిలో ప్రతి ఏటా ధర్నాలు, జాతీయ రహదారులపై రాస్తారోకోలు చేపడితే గానీ కేసీ కాలువకు నీరు వచ్చే పరిస్థితి లేదన్నారు. నేడు శ్రీశైలంలో సాగునీరు పూర్తిగా తగ్గిపోతోందన్నారు. ఈ ప్రాజెక్టును నమ్ముకుంటే రైతులకు కష్టమన్నారు. అందుకే రాజోలు నిర్మిస్తే అక్కడ 3 టీఎంసీలు నీరు నిల్వ ఉంచి రెండు కార్లకు రైతులకు నీరు అందించేందుకు, కాలువ పరిధిలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. రాజోలు కోసం దువ్వూరు నుంచి కడప వరకు భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించి ధర్నా చేశామన్నారు. మరుసటి రోజు జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు ఆ ప్రాజెక్టుపై నోరు మెదపక పోవడం దారుణమన్నారు. తెలుగుగంగ కాలువకు, వెలుగోడు నుంచి 0నుంచి 18 నంబరు వరకు కాలువ బలహీనంగా ఉందన్నారు. దీని వల్ల జిల్లాకు నీరు తక్కువ వస్తోందని కాలువను ఆధునికీకరించమని నాలుగేళ్లుగా మంత్రిని కలిసి విన్నవించినా పట్టించుకోలేదన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జనార్ధన్‌రెడ్డి, ఖాజీపేట మాజీ ఉపసర్పంచ్ గంగాధర్‌రెడ్డి, బి.మఠం నాయకుడు వీరనారాయణరెడ్డి, తోపాటు మైదుకూరు నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవరత్నాలతో నే అందరికీ మేలు ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలు అనే గొప్ప పథకాలను ప్రవేశపెట్టారని వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. ఆ పథకాలు అమలైతే ప్రతి పేద, బడుగు బలహీన వర్గాల వారందరికీ మేలు జరుగుతుందన్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి వేలు చేయాలని పరితపించిన వ్యక్తి మన వైఎస్సార్ అన్నారు. నేడు వైఎస్ జగన్ కూడా ప్రతి ఒక్కరికి వేలు చేయాలన్న పట్టుదలతో ఉన్నారన్నారు. ఆయన ముఖ్యమంత్రి అయితే రాష్ట్రంతోపాటు మన జిల్లా కూడా అభివృద్ధి చెందుతుందన్నారు. మైనార్టీలకు మేలు చేసిన ఏకైక వ్యక్తి వైఎస్సార్ దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి ప్రతి ముస్లింకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మేలు చేశారని, అందుకు ప్రతి ముస్లిం వైఎస్సార్‌కు రుణపడి ఉంటారని కడప ఎమ్మెల్యే అంజద్ బాషా అన్నారు. ఖాజీపేటలో షాదీఖానా అసంపూర్తిగా ఉందన్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తెలుగు గంగ ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిల్వ చేస్తాం వచ్చే ఎన్నికల్లో విజయం సాధించి అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రాజోలు నిర్మించి కేసీ కాలువ ఆయకట్టును స్థిరీకరిస్తామని, తెలుగు గంగకు 12 టీఎంసీల నీరు నిల్వ చేస్తామని, చెన్నూరు చక్కెర ఫ్యాక్టరీని తెరిపిస్తామని ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. ఖాజీపేట లోని అగ్రహారం సొసైటీలో 12వందల మంది పేరుతో రూ. 2.50కోట్లు దోచుకున్నారని చెప్పారు. దీనిపై విచారణ జరుగుతుంటే టీడీపీ నాయకుడు పుట్టా సుధాకర్‌యాదవ్ అడ్డుపడుతున్నాడని ఆరోపించారు. పుట్టా.. అందులో నీ వాటా ఎంత అని ప్రశ్నించారు. మైదుకూరు మున్సిపాలిటీకి రూ. 5కోట్లు ఇస్తానన్న ముఖ్యమంత్రి మాట తప్పారన్నారు. 2014–15 ఏడాది కాలంలో చేసిన పనులు నేడు చేసినట్లు టీడీపీ నాయకులు రూ.3కోట్లు దొంగ బిల్లులు పెట్టుకుని దోచుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. టీడీపీ నాయకులు వస్తే నిలదీయండి టీడీపీ నాలుగున్నరేళ్ల పాలనలో ఏం అభివృద్ధి చేశారో గ్రామాలకు వచ్చే టీడీపీ నాయకులను చొక్కా పట్టుకుని నిలదీయాలని వైఎస్సార్సీపీ కడప పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు సురేష్‌బాబు కోరారు. చంద్రబాబు ఎన్నికల ముందు 600 హామీలు ఇచ్చి అందరిని మోసం చేశారన్నారు. బీజేపీతో లోపాయికారి ఒప్పందం పెట్టుకుని జగన్‌పై నిందలు వేయడం టీడీపీ నాయకుల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమన్నారు. బీజేపీ ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన ఏకైక పార్టీ వైఎస్సార్సీపీ అని గుర్తు చేశారు. నిధులు ఇవ్వకుండా పాలన అన్యాయం టీడీపీ పాలనలో జెడ్పీటీసీలకు, ఎంపీటీలకు ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయకుండా టీడీపీ నాయకులకు నిధులు విడుదల చేసి పాలన చేయడం చంద్రబాబుకు సిగ్గుచేటని వైఎస్సార్సీపీ బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి వెంకటసుబ్బయ్య విమర్శించారు. జన్మభూమి కమిటీల పేరుతో అర్హులకు అన్యాయం చేస్తున్నారన్నారు. -
ప్రాజెక్టులను పట్టించుకోని సీఎం
దువ్వూరు (చాపాడు): సాగునీటి వనరులు ఉన్నప్పటికీ రాజోలి ప్రాజెక్టు నిర్మాణం చేపట్టకపోవడంతో రైతులు సాగునీటికి ఏటా ఇబ్బందులు పడుతున్నారని.. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాపై వివక్ష చూపుతున్నారని.. మన జిల్లా వాసి, ప్రతిపక్ష నేత అయిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకుంటే సంపూర్ణంగా సాగునీటిని తెచ్చుకోవచ్చని మైదుకూరు ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్ర ఆరో రోజు ఆదివారం దువ్వూరుకు చేరుకుంది. ఈ సందర్భంగా వైఎస్సార్ కూడలిలో బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కేసీ ఆయకట్టుకు సాగునీటిని అందించేందుకు రాజోలి రిజర్వాయర్‌కు వైఎస్ఆర్ శంకుస్థాపన చేశారని, ఆయన మరణానంతరం పనుల గురించి సీఎం పట్టించుకోలేదన్నారు. దీని నిర్మాణం పూర్తయితే జిల్లాలోని 1.18 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందన్నారు. చంద్రబాబు జన్మభూమి కమిటీల పేరుతో పచ్చచొక్కా నాయకులకు పెత్తనాలు ఇచ్చాడని, అధికారులను డమ్మీలుగా చేశారన్నారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేస్తున్నాడని అన్నారు. అసెంబ్లీని బాయ్‌కాట్ చేయటం న్యాయమే కదా.. ఎన్నికల్లో ఓడిపోయిన, పోటీ చేయని వ్యక్తులకు చంద్రబాబు మంత్రి పదువులు కట్టబెట్టారని, ఇదే క్రమంలో వైఎస్సార్సీపీలో గెలిచి సిగ్గు లేకుండా టీడీపీలోకి వెళ్లిన వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇవ్వటం సమంజసమా అన్నారు. ఇలాంటి ప్రజాప్రతినిధులపై ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఫిర్యాదు చేసినా స్పీకర్ చర్యలు తీసుకోలేదు. ఈ క్రమంలో చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీని బాయ్‌కాట్ చేయటం సమంజసమే కాదా అని రఘురామిరెడ్డి ప్రజలను అడిగారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, ఎమ్మెల్యేలు శ్రీకాంత్‌రెడ్డి, అంజాద్‌బాషా, కోరుముట్ల శ్రీనివాసులు, పార్లమెంట్ కన్వీనర్లు అకేపాటి అమర్నాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్‌రెడ్డి, ఎమ్మెల్యే తనయులు ఎస్. నాగిరెడ్డి, ఎస్. శ్రీనివాసుల రెడ్డి, రైతు విభాగం జిల్లా కన్వీనర్ సంబటూరు ప్రసాద్‌రెడ్డి రామచంద్రారెడ్డి,చాపాడు జెడ్పీటీసీలు బాలనరసింహారెడ్డి, చాపాడు, దువ్వూరు ఎంపీపీలు తెలిదెల వెంకటలక్షుమ్మ, కానాల చంద్రావతమ్మ, శంకర్‌రెడ్డి, వీరనారాయణరెడ్డి, శ్రీమన్నారాయణరెడ్డి, గోపిరెడ్డి ఓబుళ్‌రెడ్డి పాల్గొన్నారు. -
బాబు దగ్గరున్న నల్లధనం ఎక్కడా లేదు
ఎవ్వరి దగ్గరా లేనంత నల్లధనం చంద్రబాబు నాయుడి దగ్గర ఉందని వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు రఘురాం రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి మండిపడ్డారు. ఆయన చెబుతున్న రూ. 10 వేల కోట్ల నల్లధనం చంద్రబాబు బినామీదేనని అన్నారు. చంద్రబాబు అవినీతి గురించి ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఇప్పటికే చెప్పామని, దానిపై విచారణ చేసి నల్లధనాన్ని వెలికితీయాలని ఎమ్మెల్యేలు రఘురాంరెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి డిమాండ్ చేశారు. -
పోలీస్ గస్తీ @ జీపీఎస్
తాడేపల్లిగూడెం : రాత్రి వేళ వీధుల్లో గస్తీకి వెళ్లే పోలీసులు నిర్దేశిత మార్గాల్లో తిరుగుతున్నారా లేదా అనే విషయూన్ని ఎప్పటికప్పుడు గుర్తించేందుకు జీపీఎస్ విధానాన్ని అమలు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కె.రఘురామ్‌రెడ్డి చెప్పారు. శనివారం తాడేపల్లిగూడెం వచ్చిన ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దీనివల్ల గస్తీ సిబ్బంది సక్రమంగా విధులు నిర్వర్తిస్తున్నారా లేదా అనే విషయం స్పష్టంగా తెలుస్తుందన్నారు. ఇందుకోసం ప్రతి పోలీస్ స్టేషన్‌కు ఐదు మొబైల్ ఫోన్లు ఇస్తామన్నారు. బీట్‌కు వెళ్లే పోలీసులు వీటిని తీసుకెళ్లాల్సి ఉంటుందని చెప్పారు. ఏలూరులో కంట్రోల్ రూమ్ నుంచి జీపీఎస్ విధానంలో వారు ఎక్కడెక్కడ తిరుగుతున్నారనే విషయూన్ని గుర్తిస్తామన్నారు. ఇందుకు అవసరమైన సాఫ్ట్వేర్ సిద్ధమవుతోందని చెప్పారు. పట్టణాల్లోని ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు, నిర్వహణ కోసం తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటు తేలికే అరుునప్పటికీ, నిర్వహణ కాస్త కష్టంగా ఉందన్నారు. వీటి నిర్వహణలో దుకాణాల యజమానులను భాగస్వాములుగా చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు సంబంధించి బ్లాక్ స్పాట్స్ గుర్తింపు, నిర్వహణ తదితర విషయాలపై అవగాహన కోసం ఇంజినీరింగ్ అధికారుల సాయంతో కసరత్తు చేస్తున్నామని ఎస్పీ చెప్పారు. రహదారులపై తేలికగా, ప్రమాదాలకు లోను కాకుండా వాహన చోదకులు, పాదచారులు ఎలా వెళ్లాలనే విషయాలపై కార్యాచరణ రూపొం దించనున్నట్టు పేర్కొన్నారు. రోడ్డు భద్రత, ప్రమాదాల నివారణ విషయంలో హైదరాబాద్, కర్నూలు ప్రాంతాల్లో అమలు చేస్తున్న విధానాలను అధ్యయ నం చేసి, ఇక్కడ అమలు చేసేవిధంగా ప్రణాళికలు సిద్ధం చేస్తామన్నారు. ఈ విధానాలను తణుకు, తాడేపల్లిగూడెం పట్టణాల్లో ప్రయోగాత్మకంగా అమలు చేసే యోచన ఉందని చెప్పారు. స్కీమ్‌లు, వైట్ కాలర్ నేరాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. ద్విచక్ర వాహనాలను దొంగిలించి వాటి విడిభాగాలను విజయవాడ ఆటోనగర్, గుంటూరు మాయాబజార్‌కు తరలిస్తున్న ముఠాలపై ప్రత్యేక దృష్టి సారించామన్నారు. వాహనాలను కొనే సందర్భంలో వాటి తాలూకా కాగితాలతోపాటు, ఇంజిన్, చాసిస్ నంబర్లను సరిచూసుకోవాలని సూచిం చారు. వాహనాల తనిఖీల విధుల్లో ఉండే పోలీ సులు తప్పనిసరిగా యూనిఫాం ధరించాలని, నేమ్ ప్లేటు తగిలించుకోవాలన్నారు. ఎవరైనా అందుకు విరుద్ధంగా తనిఖీలకు వస్తే వారి ఐడెంటిటీ కార్డులు చూపించమని అడగాలన్నారు. ఇళ్లకు తాళాలు వేసి రెండు మూడు రోజులపాటు బయటకు వెళ్లేవారు తాళాలు వెనుకకు ఉండేలా జాగ్రత్తపడాలని, వరండాలో రాత్రి పూట లైట్లు వెలిగే ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన అలారంలను ఏర్పాటు చేసుకుంటే మంచిదన్నారు. తాము ఊరు వెళ్తున్న విషయూన్ని పోలీసులకు తెలి యజేస్తే ఆ ఇళ్ల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకునే అవకాశం ఉంటుందన్నారు. బాణసంచా విక్రయాలపై నిఘా దీపావళి సందర్భంగా బాణసంచా తయారీ, అమ్మకాలపై ప్రత్యేక నిఘా ఉంటుందని ఎస్పీ చెప్పారు. బాణసంచా తయారీ, నిల్వలు, అమ్మకాలను లెసైన్సు కలిగిన వ్యాపారులే చేయాలన్నారు. వీటికి సంబంధించి రెవెన్యూ. పోలీసు అధికారుల నుంచి అనుమతి తీసుకోవాలన్నారు. అందుకు విరుద్ధంగా వ్యవహరించే వ్యాపారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
'ఏపీ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి'
కడప: రాష్టానికి వచ్చే కేంద్ర ప్రభుత్వ నిధులను రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ఏ మేరకు ఖర్చు చేస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్‌రెడ్డి, రఘురామ్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఏపీ రాజధాని ఎంపిక విషయంలో అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని సూచించారు. రాయలసీమకు జరగుతున్న అన్యాయంపై అసెంబ్లీలో నిలదీస్తామని చెప్పారు. చంద్రబాబు నాయుడు నియంతలా వ్యవహరిస్తున్నారని శ్రీకాంత్‌రెడ్డి అంతకుముందు విమర్శించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలేవీ ఇప్పటివరకు నెరవేర్చలేదని తెలిపారు. -
'సీమలో ఇద్దరు సీఎంలు'
వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడగు ప్రజలకు రక్షణ కల్పించాలని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యేలు ఆదినారాయణరెడ్డి, రఘురాంరెడ్డి, అంజాద్ బాషాలు జిల్లా కలెక్టర్‌ను కోరారు. ఆదివారం జిల్లా కలెక్టర్‌ను కలసి మున్సిపల్ ఛైర్మన్ ఎన్నిక సందర్భంగా జమ్మలమడుగులో చోటు చేసుకుంటున్న పరిణామాలను వివరించారు. అనంతరం విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడుతూ.. జమ్మలమడుగులో కోరం ఉన్నా మున్సిపల్ ఛైర్మన్ ఎన్నికను ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. అలాగే జమ్మలమడుగులో 144 సెక్షన్ విధించిన టీడీపీ నేతలు విధ్వంసం సృష్టించారని ఆరోపించారు. రాయలసీమలో ఇద్దరు సీఎంలు ఉన్నారని అన్నారు. వారిలో ఒకరు సీఎం చంద్రబాబు కాగా, మరోకరు సీఎం రమేష్ అని వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు వెల్లడించారు. -
‘బెల్టు’ లేస్తోంది!
అసాంఘిక కార్యకలాపాలను అణచివేసేందుకు ఎస్పీ చేపట్టిన వినూత్న కార్యక్రమాన్ని ఆ శాఖ సిబ్బందే నీరుగారుస్తున్నారు. ఫోన్ చేసి ఫిర్యాదు చేయండి.. తక్షణ చర్యలు తీసుకుంటాననే రఘురామిరెడ్డి మాటలకు విలువ లేకుండా చేస్తున్నారు. న్యాయం దేవుడెరుగు.. ఫిర్యాదు చేసినం దుకు బాధితులే బెదిరింపులు ఎదుర్కొంటున్నారు. కర్నూలు, న్యూస్‌లైన్: ఫ్యాక్షన్ ఖిల్లాగా పేరొందిన కర్నూలు జిల్లాలో నేరాల నియంత్రణకు మీతో మీఎస్పీ అనే వినూత్న కార్యక్రమానికి ఎస్పీ రఘురామిరెడ్డి ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీన శ్రీకారం చుట్టారు. ఫిర్యాదుపై తీసుకున్న చర్యలను మూడు రోజుల్లో సంబంధిత పోలీసుస్టేషన్ సిబ్బంది బాధితులకు తెలియజేసేలా కార్యక్రమాన్ని రూపొందించారు. ఎంతో సదుద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమం అమలులో క్షేత్ర స్థాయి అధికారులు కొందరు మామూళ్ల మత్తులో నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రతి వారం ఫోన్ ద్వారా బాధితుల నుంచి వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించడం ద్వారా శాంతి భద్రతలను పరిరక్షించవచ్చనేది ఎస్పీ భావన. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారమిచ్చే వారి పేర్లను గోప్యంగా ఉంచుతామని ఎస్పీ స్వయంగా ప్రకటించడంతో జిల్లా నలుమూలల నుంచి ఫిర్యాదులు అందుతున్నాయి. అయితే క్షేత్ర స్థాయి పోలీసు అధికారులు ఫిర్యాదుదారుల పేర్లను బయటపెడుతుండటంతో కొన్ని ప్రాంతాల్లో సమస్యలు తలెత్తుతున్నాయి. రుద్రవరం మండలం ఆలమూరులో పాఠశాల, దేవాలయం సమీపంలోనే మద్యం షాపు ఉండటంతో మహిళలు, విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గ్రామస్తులు ఫిర్యాదు చేశారు. వీరి వివరాలు స్థానిక పోలీసులు బయటపెట్టడంతో వారి అవస్థలు వర్ణనాతీతంగా ఉన్నట్లు సమాచారం. కల్లూరు మండలం తడకనపల్లెలో రాముడి గుడి పక్కనే పాఠశాల వద్ద బెల్టు షాపు నిర్వహిస్తున్నారు. ఉల్లిందకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో రేమడూరు గ్రామంలో బస్టాండు వద్దనున్న దేవాలయం సమీపాన మద్యం బెల్టు దుకాణం ఉంది. గ్రామస్తులు మీతో మీ ఎస్పీకి ఫిర్యాదు చేసినా క్షేత్ర స్థాయి అధికారులు పెడచెవిన పెట్టారు. జిల్లా వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొంది. బెల్టు దుకాణాల నిర్వాహకులతో మామూళ్లు దండుకుంటున్న కొందరు పోలీసు అధికారులు వీటిని నిర్మూలించేందుక ఎంతమాత్రం ముందుకు రాని పరిస్థితి నెలకొంది. పెద్దకడుబూరు మండలం బసాపురం గ్రామంలో నిర్వహిస్తున్న బెల్టు షాపు విషయమై గ్రామస్తులు గత అక్టోబర్ 18న ఎస్పీకి ఫిర్యాదు చేసినా పట్టించుకునే వారు కరువయ్యారు. కర్నూలు మండలం బి.తాండ్రపాడు గ్రామంలో మహిళల మరుగుదొడ్డి పక్కనే బెల్టు దుకాణం నడుస్తోంది. మందుబాబులు అక్కడే గంటల తరబడి ఉండటం వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కోడుమూరు మండలం పులకుర్తి గ్రామంలో బెల్టు షాపులను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. రెండుసార్లు ఎస్పీకి ఫిర్యాదు చేసినా అడ్డుకట్ట పడలేదు. కల్లూరు చెన్నమ్మ సర్కిల్లో మద్యం దుకాణాల ఎదుట మందుబాబుల ఆగడాలు మితిమీరుతున్నాయని మహిళలు ఫిర్యాదు చేసినా అటకెక్కింది. స్థానిక పోలీసులు పెడచెవిన పెట్టడం విమర్శలకు తావిస్తోంది. తుగ్గలి మండలం రాంపురం గ్రామానికి చెందిన నాయకుడు ఒకరు నాటుసారా వ్యాపారం సాగిస్తున్నట్లు నవంబర్ 15న ఎస్పీకి ఫిర్యాదు అందినా అటువైపు సిబ్బంది కన్నెత్తి చూసేందుకు సాహసించడం లేదు. జిల్లా కేంద్రానికి రాలేక సమస్యలతో సతమతమయ్యే మహిళలు, వృద్ధుల కోసం ఎంతో ఉన్నతాశయంతో ఎస్పీ ప్రవేశపెట్టిన ఈ కార్యక్రమం క్షేత్రస్థాయి అధికారుల అలసత్వంతో అభాసుపాలవుతోంది. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ ప్రత్యేక టీమ్‌ను ఏర్పాటు చేసుకొని ‘మీతో మీ ఎస్పీ’ ఫిర్యాదులపై స్పందిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
రఘురాముడి శాంతి మంత్రం
కర్నూలు, న్యూస్‌లైన్: నిరుద్యోగ యువత ఫ్యాక్షన్ బారిన పడకుండ పోలీసు యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. జిల్లాలో ఫ్యాక్షన్ విస్తరించడానికి నిరక్షరాస్యత, యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లేకపోవడమే ప్రధాన కారణంగా గుర్తించి ఎస్పీ రఘురామిరెడ్డి యువతలో మార్పు తీసుకొచ్చేందుకు తనదైన శైలిలో చర్యలకు శ్రీకారం చుట్టారు. వెనుకబడిన ఆదోని సబ్‌డివిజన్ పరిధిలోని కోసిగి, ఆలూరు, మాదవరం, మంత్రాలయం సమీప ప్రాంతాలకు చెందిన యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎస్పీ ప్రత్యేక చర్యలు చేపట్టారు. కృష్ణపట్నం పోర్టులో పర్మనెంట్, ప్రైవేటు సెక్యూరిటీ ఉద్యోగాలు ఇప్పించేందుకు రంగం సిద్ధం చేశారు. ఇందులో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఆదోని సబ్ డివిజన్ పరిధిలోని 380 మంది యువకులకు సెక్యూరిటీ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అదనపు ఎస్పీ వెంకటరత్నం, ఏఆర్ డీఎస్పీ రుషికేశ్వర్‌రెడ్డి, కేఎస్ఎస్పీఎల్ సెక్యూరిటీ సీనియర్ మేనేజర్ పి.కె.మనోహర్‌బాబు, ఆర్ఐ రంగముని, ఆర్ఎస్ఐలు సోమశేఖర్‌నాయక్, నారాయణ, ఇతర పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు. 18 సంవత్సరాలు నిండి, 27 సంవత్సరాల లోపు వయస్సు కలిగి 167 సెం.మీ ఎత్తు, ఛాతీ గాలి పీల్చకుండ 81 సెం.మీ, గాలి పీల్చిన తర్వాత 86 సెం.మీ ఉండాలి. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయినవారు ఈ ఉద్యోగాలకు అర్హులు. దీంతో పాటు అభ్యర్థులకు పులప్స్ పరీక్షలు నిర్వహించారు. పుట్టిన తేదీ, ఎత్తు ఆధారంగా ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు మూడు నెలల శిక్షణ ఉంటుంది. శిక్షణ కాలంలో ఉచిత భోజన వసతి సౌకర్యం కల్పించడంతో పాటు స్టైఫండ్ కింద రూ.1500 చెల్లిస్తామని సీనియర్ మేనేజర్ పి.కె.మనోహర్ తెలిపారు. శిక్షణ పూర్తయిన తర్వాత రూ.7,500(పీఎఫ్, ఈఎస్ఐతో పాటు) ఇస్తామని, ఉచిత భోజన వసతి సౌకర్యం, మెడికల్, యూనిఫామ్ వంటి అన్ని సౌకర్యాలు ఉచితంగా కల్పిస్తామని పేర్కొన్నారు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులు రెండు సంవత్సరాలు పనిచేయాల్సి ఉంటుందని, అభ్యర్థుల్లో విద్యార్హతలను పరిగణలోకి తీసుకుని కృష్ణపట్నం పోర్టులోని సీసీ టీవీ, మెరైన్, కోస్టల్, టెక్నికల్, మార్షల్స్, వీఐపీ సెక్యూరిటీ వంటి విభాగాల్లో ఉపాధి కల్పిస్తారు. మలి విడతలో ఆత్మకూరు, కర్నూలు: మలివిడతలో కర్నూలు నగరంలోని మురికివాడల్లో నివసించే యువతతో పాటు ఆత్మకూరు ప్రాంతానికి చెందిన చెంచులు, ఆసక్తి ఉన్న ఇతర ప్రాంత నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించేందుకు ఎస్పీ చర్యలు చేపట్టారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాలకు చెందిన యువకులు నిరుద్యోగులుగా ఉండటంతో ఫ్యాక్షన్ వైపు ఆకర్షితులవుతున్నట్లు తమ పరిశీలనలో తేలిందని ఎస్పీ వెల్లడించారు. తమ పిల్లలు హింస వైపు ఆకర్షితులు కాకుండా తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. యువతలో మార్పు తీసుకువచ్చేందుకు పోలీసు శాఖ చేపట్టిన ఈ చిన్న ప్రయత్నానికి అందరూ సహకరించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.