rains downfall
-
India Meteorological Department: 25 నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనం!
న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈ నెల 25వ తేదీ తర్వాత వాయవ్య భారత్ నుంచి వెనక్కి వెళ్లిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) శుక్రవారం వెల్లడించింది. అక్టోబర్ 15 నాటికి నైరుతి రుతుపవనాలు దేశం నుంచి పూర్తిగా నిష్క్రమిస్తాయి. రాబోయే ఐదు రోజుల్లో ఉత్తర, మధ్య భారతదేశంలో వర్షాలు తగ్గిపోతాయని తెలియజేసింది. పశి్చమ రాజస్తాన్ నుంచి నైరుతి రుతుపవనాల తిరోగమనానికి అనువుగా పరిస్థితులు మారుతున్నాయని పేర్కొంది. ఈ రుతుపవనాలతో సాధారణంగా 832.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కావాలి. కానీ, ఈసారి 780.3 మిల్లీమీటర్లు మాత్రమే నమోదైంది. -
ఈ-క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలి: సీఎం జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో వర్షాల కొరత నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం పరిస్థితులు, కంటిన్జెన్సీ ప్రణాళికపై చర్చిస్తున్నారు. ఈ సమీక్ష సమావేశానికి మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, సీదిరి అప్పలరాజు, సీఎస్ జవహర్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులను సీఎం జగన్‌కు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. ఈ క్రమంలో జూన్ నుంచి ఆగస్టు వరకూ రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మి.మీ. కాగా 314.6 మి.మీ. వర్షం కురిసిందని తెలిపారు. 25శాతం తక్కువగా వర్షాలు కురిసినట్టు చెప్పారు. కోనసీమ, కాకినాడ, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, ఎస్పీఎస్ నెల్లూరు, తిరుపతి, పల్నాడు, ప్రకాశం, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైయస్సార్, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వర్షాల కొరత ఉన్నట్టు తెలిపారు. ఇందులో కొన్ని ప్రాంతాలకు ఇరిగేషన్ సదుపాయం ఉన్నందున అక్కడ వర్షాల కొరత ప్రభావం తక్కువగానే ఉందన్నారు. రాష్ట్రంలో మేజర్, మీడియం, మైనర్ ప్రాజెక్టుల్లో నీటి నిల్వల వివరాలను కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌కు అధికారులు తెలిపారు. అన్ని రిజర్వాయర్లలో నీటి సామర్ధ్యం 1174.58 టీఎంసీలు కాగా, 507.88 టీఎంసీల నీరు ఉందని తెలిపిన స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం విద్యుత్ ఉత్పత్తి కోసం దిగువకు నీటిని విడిచిపెడుతోందని అధికారులు చెప్పారు. ముందస్తుగా సాగునీటిని విడుదలచేయడం వల్ల కృష్ణాడెల్టాకు అవసరమైన నీటిని అందించగలిగామన్నారు. సీఎం జగన్ ఆదేశాలు ఇవే.. ► ఈ–క్రాప్ నమోదుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ► రైతుల్ని ఆదుకునే చర్యలకు ఈ డేటా చాలా కీలకం. ► పశువులకు అవసరమైన దాణా, గ్రాసాన్ని సిద్ధంచేసుకోవాలి. ► వర్షాల కొరత నేపథ్యంలో పంటల ప్రత్యామ్నాయ ప్రణాళికపై అవగాహన కల్పించాలి. ► వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఏపీ ఎంఎస్పీ యాక్ట్‌ను ప్రవేశపెట్టాలి. ► రైతులకు నిర్ణయించిన కనీస మద్దతు ధర ఇవ్వకుంటే ఈ చట్టం ప్రకారం చర్యలు. కరెంటు డిమాండు, పంపిణీలపై సీఎం జగన్ సమీక్ష.. గత ఏడాదితో పోలిస్తే గ్రిడ్ నుంచి డిమాండ్ కనీసంగా 18 శాతం వరకూ పెరిగిందని అధికారులు తెలిపారు. వ్యవసాయ రంగం నుంచి కూడా డిమాండ్ పెరిగిందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత సుమారు 3.3 లక్షల కనెక్షన్లు రైతులకు ఇచ్చామని వెల్లడించారు. గాలి లేనందున విండ్ పవర్ గణనీయంగా తగ్గిందన్నారు. అలాగే బొగ్గుకూడా తడి బొగ్గు రావడంతో సామర్థ్యం మేరకు థర్మల్ కేంద్రాలు విద్యుత్‌ను ఉత్పత్తి చేయడంలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. పొడివాతావరణం, వేసవిని తలపించేలా పరిస్థితులు ఉండడం వల్ల అనుకోకుండా అనూహ్యంగా ఈ డిమాండ్ వచ్చిందని తెలిపారు. ప్రతిరోజూ కూడా కనీసంగా 44.25 మిలియన్ యూనిట్ల కరెంటు కొనుగోలు చేస్తున్నామన్నారు. మార్చి నుంచి ఆగస్టు వరకూ సుమారు రూ.2935 కోట్లు వెచ్చించామని చెప్పారు. ఈ సందర్భంగా సీఎం జగన్.. దేశవ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా కూడా విద్యుత్ డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. అయినా ఎక్కడా కూడా రైతులకు, ప్రజలకు ఇబ్బంది రాకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటున్నాం. అధిక రేట్లు ఉన్నా సరే.. ప్రజలకు ఇబ్బంది రాకుండా ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. ఒక్క ఆగస్టు-2023లోనే రూ.966.09కోట్లు విద్యుత్ కొనుగోలు చేశాం. యూనిట్ ధర రూ.7.52 పెట్టి మరీ కొనుగోలు చేస్తున్నాం. ఇంత ఖర్చు చేసి విద్యుత్‌ను సరఫరా చేస్తున్నా నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కూడా పరిస్థితులు దృష్టిలో ఉంచుకుని ఆ మేరకు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇది కూడా చదవండి: భూమి లేని పేదలకు అండగా ఉంటాం.. కౌలురైతుకు వైఎస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో సీఎం జగన్ -
అమర్నాథ్ యాత్ర పునఃప్రారంభం
శ్రీనగర్: జమ్మూకశీ్మర్‌లో అమర్నాథ్ యాత్ర మూడు రోజుల విరామం తర్వాత పునఃప్రారంభమైంది. ప్రతికూల వాతావరణం వల్ల పంజ్తరణి, శేష్నాగ్ బేస్‌క్యాంపుల్లో చిక్కుకుపోయిన యాత్రికులు ఆదివారం మంచు శివలింగ దర్శనానికి తరలివెళ్లారు. భారీ వర్షాలకుతోడు కొండ చరియలు విరిగిపడుతుండడంతో అమర్నాథ్ యాత్రను అధికారులు మూడు రోజుల క్రితం నిలిపివేసిన సంగతి తెలిసిందే. పవిత్ర గుహ చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు కొంత తగ్గుముఖం పట్టడంతో యాత్రికులను అనుమతించాలని నిర్ణయించినట్లు అధికారులు వెల్లడించారు. జమ్మూ–శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేశారు. ఈ రోడ్డుపై పెద్ద సంఖ్యలో వాహనాలు చిక్కుకుపోయాయి. వాటిని తొలగించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. జమ్మూ నుంచి కొత్తగా యాత్రికులను అనుమతించడం లేదు. జమ్మూకశ్మీర్‌లో గురువారం రాత్రి నుంచి ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తున్నాయి. అమర్నాథ్లో మంచు సైతం కురిసింది. సోమవారం నుంచి వర్షాలు పూర్తిగా తగ్గిపోయే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఏపీ వాసి దుర్మరణం రాజాం సిటీ(ఆంధ్రప్రదేశ్): ఉత్తరాఖండ్‌లో జరిగిన ప్రమాదంలో విజయనగరం జిల్లా రాజాం మండలం బొద్దాం గ్రామానికి చెందిన జరజాన రవి రావు మృతి చెందారు. బొద్దాం గ్రామానికి చెందిన రవి రావు హైదరాబాద్‌లో ప్రైవేటు ఉద్యోగి. ఐదు నెలల క్రితమే వివాహమైంది. భార్య కల్యాణితో కలిసి వారం క్రితం కేదార్నాథ్ యాత్రకు బయలుదేరారు. శనివారం రాత్రి ఉత్తరాఖండ్‌లో కురుస్తున్న భారీ వర్షాలతో వీరు ప్రయాణిస్తున్న వాహనం అదుపు తప్పి లోయలో పడింది. ఈ ఘటనలో రవి రావు ప్రాణాలు కోల్పోయారు. కల్యాణితో పాటు మరికొందరిని సహాయక సిబ్బంది రక్షించారు. -
ఆంధ్రప్రదేశ్‌లో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు
-
జాడ లేని వానదేవుడు
ఎండిపోతున్న పంటలు.. తీవ్ర నిరాశలో రైతన్న అప్పులు తీర్చలేక ఆత్మహత్య చేసుకుంటున్న అన్నదాతలు జగదేవ్‌పూర్: మండలంలోని రైతన్నలు వర్షాలు లేక తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు.అనుకున్న సమయానికి వర్షాలు పడకపోవడంతో రైతన్నలు తీవ్ర నిరాశలో ఉన్నారు. ఈ యేడు పంటలు పండి కాలం కలసి వస్తుందనుకున్న రైతన్నలను వరుణ దేవుడు కనికరించడం లేదు. ఫలితంగా సాగు చేయడానికి వర్షాలు లేక రైతన్నలు దిగులు చెందుతున్నారు. మూడేళ్ల నుంచి రైతన్నలు పంట పండించడానికి గొడ్డు ,గోదా , ఇల్లాలి పుస్తెలు, ఇల్లు తాకట్టు పెడుతున్నారు. కొందో గొప్పో అప్పు చేసి వచ్చిన రుక్కముతో పంటలు పండించారు. పంటలు సరిగ్గా పండక పోవడంతో రోజురోజుకు అప్పులు పెరిగి పోతున్నాయి.అప్పులు తీర్చలేక వీధిలేని పరిస్థితుల్లో రైతన్నలు ఆత్మహత్యలే శరణ్యంగా భావిస్తున్నారు.సర్కారు, సార్ల మాట విని మొత్తం మొక్కజొన్న పంటను మాత్రమే వేసినాము.కొందో గొప్పో పత్తి వేస్తే పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందమోనని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.పంటలకు సరిపడ నీళ్లు అందక వేసిన పంట సైతం ఎండిపోతుందని రైతులు వాపోతున్నారు. ఎండిపోతున్న పంటలు అధికారుల సూచన మేరకు మండలంలో గత ఏడాది కంటే ఈ సారి మొక్కజొన్న పంటను 6,400 హెక్టార్లలో సాగు చేశారు. నల్లరేగడి భూముల్లో కొంత బాగనే ఉన్నా ఎర్ర, దుంబ నెలల్లో పంటలు ఆరిపోతున్నాయి. రోహిణిలో వేసిన పంటలు పీలకల దశకు రాగా , మృగశిరలో వేసిన పంటలు తలజుట్టు దశలో ఉన్నాయి. తిగుల్, చేబర్తి, మునిగడప, చాట్లపల్లి, వట్టిపల్లి, రాయవరం తదితర గ్రామాల్లో మొక్కజొన్న పంటలు వానలు లేక పంట తడి ఆరిపోతుంది. అలాగే వానపై ఆధారపడి వరి నాట్లు వేసిన రైతులు కూడా ప్రస్తుతం వానలు లేకా ఆవేదన చెందుతున్నారు. కొన్ని గ్రామాల్లో బోర్లలో భూగర్భజాలాలు అడుగంటడంతో వరి పంటకు తీవ్ర ఇబ్బందిగా ఉంది. బోరులో నీరు తగ్గింది: వానలు సరిగా లేకా బోరులో నీరు తగ్గింది. వానలపై అశతో నాకున్న మూడు ఎకరాల్లో ఎకరం వరి పంట వేశాను. మిగత భూమిలో ఎకరం మొక్కజొన్న, పత్తి పంటలను సాగు చేశాను. గత ఏడాది కంటే ఈ సారి తక్కువగా వానలు పడ్డాయి. ప్రక్కన చెరువు ఉన్నప్పటికి ప్రయోజనం లేదు. వానలు లేకపోతే మొక్కజొన్న, పత్తి పంటలు కూడా చేతికి అందుతాయో లేదోనని అన్నదాత ఆవేదన వ్యక్తం చేశాడు. - యువరైతు, యాదగిరి.