Rajiv road
-
ఆ స్టీల్ వంతెన బరువు 1,100టన్నులు
సాక్షి, హైదరాబాద్: మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే మార్గంలో రాజీవ్ రహదారిపై ధనుస్సు ఆకారంలో ఉండే ఓ స్టీల్ వంతెన రూపుదిద్దుకుంటోంది. తొలుత ఈ మార్గంలో గజ్వేల్ ఔటర్ రింగురోడ్డుపై ఓ వంతెన నిర్మించగా, ఇప్పుడు దానికంటే మరింత పెద్దదైన ఈ వంతెనను సిద్దిపేట మార్గంలో కుకునూరుపల్లి శివారులో దక్షిణ మధ్య రైల్వే చేపట్టింది. గజ్వేల్ దాటిన తర్వాత కుకునూరుపల్లి పొలిమేరలో రాజీవ్ రహదారిని మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ దాటుతుంది. మనోహరాబాద్–కొత్తపల్లి సింగిల్‌లైన్ భవిష్యత్తులో మరో రెండు లైన్లకు విస్తరించాల్సి ఉంటుందని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. ఈ నేపథ్యంలో మూడు లైన్లకు వీలుగా ‘బో స్ట్రింగ్ గర్డర్’పద్ధతిలో నిర్మిస్తోంది. ఇది కాంక్రీట్‌తో సంబంధం లేకుండా పూర్తిగా స్టీల్‌తో రూపొందుతోంది. 60 మీటర్ల పొడవు, 15 మీటర్ల వెడల్పు, 10.5 మీటర్ల ఎత్తుతో ఉండే భారీ స్టీల్ వంతెనను రోడ్డుతో అనుసంధానిస్తారు. ఇలా హైదరాబాద్ నుంచి సిద్దిపేట వైపు దారిలో ఒకటి, సిద్దిపేట నుంచి హైదరాబాద్ దారిలో మరోటి ఏర్పాటు చేస్తారు. ప్రస్తుతం సిద్దిపేట వైపు దారిలో దాన్ని బిగిస్తున్నారు. ఒక్కోటి 550 టన్నుల బరువుండే స్టీల్‌తో రూపొందించారు. నెలలోగా పూర్తి.. సిద్దిపేట వైపు ఉన్న రోడ్డులో ధనుస్సు ఆకారంలో ఉండే స్టీల్ గర్డర్ ఏర్పాటు పూర్తయింది. దానిమీద 8 ఎంఎం మందంతో స్టీల్ షీట్ అమర్చే పని జరుగుతోంది. రెండురోజుల తర్వాత దానిమీద 250 ఎంఎం మందంతో సిమెంట్ కాంక్రీట్ రోడ్డు నిర్మిస్తారు. నెలరోజుల్లోగా ఈ మార్గంలో వాహనాలకు అనుమతిస్తారు. సిద్దిపేట –హైదరాబాద్ రోడ్డు భాగంలో రెండో గర్డర్ రెండు వైపులా రెండు అండర్ పాస్‌లు నిర్మిస్తున్నారు. వంతెన మీద నుంచి వాహనాలు కిందకు రావటానికి, కిందినుంచి వంతెన మీదకు వెళ్లేందుకు వీలుగా వాటిని నిర్మిస్తున్నారు. గజ్వేల్ శివారులో ఔటర్ రింగురోడ్డును క్రాస్ చేసేందుకు వీలుగా ఇదే పద్ధతిలో చిన్న పరిమాణంలో ఉండే బో స్ట్రింగ్ గర్డర్లతో వంతెన నిర్మాణం పూర్తయింది. దానికి అప్రోచ్ రోడ్ల నిర్మాణం పూర్తి కావాల్సి ఉంది. సిద్దిపేట వద్ద బాక్స్ బ్రిడ్జ్.. కుకునూరుపల్లి వద్ద రైల్వే లైన్ రాజీవ్ రహదారిని క్రాస్ చేస్తుండగా, మళ్లీ సిద్దిపేట బైపాస్ దాటగానే మరోసారి క్రాస్ చేస్తుంది. అక్కడ కూడా వెంతెన నిర్మించాల్సి ఉంది. అయితే అక్కడ, రైల్వే లైన్ రోడ్డు పై నుంచి నిర్మిస్తారు. ఇందుకుగాను నగరంలోని ఒలిఫెంటా వంతెన తరహాలో బాక్సు నమూనా వంతెన నిర్మించనున్నారు. సిమెంట్ క్రాంక్రీట్ ప్రీ ఫ్యాబ్రికేటెడ్ బాక్సు రూపొందించి దాని వీదుగా రైల్వే లైన్ దాటేలా ఏర్పాటు చేస్తారు. -
హైవేలపై అండర్‌పాస్‌లు!
సాక్షి, హైదరాబాద్: రాజీవ్ రహదారి.. రాష్ట్రంలో కీలకమైన రోడ్డు. హైదరాబాద్ – రామగుండం వరకు విస్తరించిన 230 కిలోమీటర్ల ఈ రోడ్డును బాగా గమనిస్తే ఎక్కడా బైపాస్‌లు కనిపించవు. రెండు రోడ్లు కలిసే చోట ప్రత్యామ్నాయ మార్గాలుగా అండర్‌పాస్‌ల ఊసే ఉండదు. వాహనదారులు ఈ రోడ్డు మీదుగా బిక్కుబిక్కుమంటూ సాగాల్సిందే. వేగంగా వాహనాలు దూసుకెళ్లే రోడ్లు ఎలా ఉండకూడదో చక్కటి ఉదాహరణగా నిలిచే రోడ్డు ఇది. జాతీయ రహదారులపై వాహనాలు రయ్‌మంటూ దూసుకెళ్తున్నాయి. ఎదురుగా రోడ్డును ఆనుకునే ఓ ఊరు తారసపడింది. వేగంగా దూసుకొచ్చే వాహనాలు ఊరి వైపు కాకుండా ఆ పక్కనే నిర్మించిన అండర్‌పాస్ గుండా దూసుకుపోయాయి. కాస్త ముందుకు వెళ్లిన తర్వాత మరో రోడ్డు దాటుతున్న సమయంలోనూ వాహన వేగం తగ్గలేదు. అక్కడ మరో అండర్పాస్లోంచి దూసుకుపోయే ఏర్పాటు. చివరకు బైపాస్ ముగిసే చోట కూడా మరో అండర్‌పాస్ ఉండటంతో వాహనాల అదే వేగంతో వెళ్లొచ్చు. రెండు రోడ్ల మీదుగా దూసుకొచ్చే వాహనాలు పరస్పరం ఢీకొనే ప్రమాదం కూడా ఉండదు. మొదటిది వాస్తవం.. రెండోది కల్పన. అయితే ఇప్పుడు జాతీయ రహదారులపై పరిస్థితి మారనుంది. కేంద్ర ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయం వేగంగా దూసుకెళ్లే వాహనాల భద్రతకు భరోసా ఇవ్వనుంది. జాతీయ రహదారులపై ప్రమాదాలను వీలైనంత తగ్గించేందుకు గ్రామాలుండే చోట్ల వాటిపై బైపాస్‌లు, వాటిని అండర్‌పాస్‌లతో జోడించటం అత్యవసరమని కేంద్రం నిర్ణయించింది. విధానపరమైన నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో కచ్చితంగా అమలు చేయాలని ఆదేశించింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ) నిర్మించే రోడ్లపై దీని అమలు ప్రారంభించారు. ఫలితంగా ఇప్పటికే ప్రణాళిక రూపొందించి పనులు ప్రారంభించని రోడ్ల డిజైన్లను మారుస్తున్నారు. ఆయా రహదారులన్నింటిలో అవసరమైన చోట్ల అండర్‌పాస్‌లను నిర్మించేలా కొత్త నమూనాలను రూపొందించారు. ఎలా ఉంటుంది..? చాలా రహదారులపై గ్రామాలున్నాయి. వాహనాలు ఆ గ్రామాల మీదుగా దూసుకుపోతున్నప్పుడు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇలాంటి చోట్ల బైపాస్‌లను నిర్మించి వేరే ప్రాంతాలకు వెళ్లే వాహనాలను వాటి మీదుగా మళ్లించాలి. కానీ భూ సేకరణ, నిర్మాణ వ్యయాల కారణంగా బైపాస్‌లు లేకుండానే రోడ్ల నిర్మాణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు ఎన్హెచ్ఏఐ రోడ్లపై కచ్చితంగా బైపాస్‌లు నిర్మిస్తారు. రోడ్డును ఆనుకుని 500 మీటర్ల కంటే ఎక్కువ మేర గ్రామం విస్తరించి ఉంటే వీటి నిర్మాణం తప్పనిసరి. తాజా నిర్ణయం మేరకు ఈ బైపాస్‌ల ప్రారంభం, ముగిసే చోట అండర్‌పాస్‌లు కూడా నిర్మించాల్సి ఉంటుంది. గ్రామాల వైపు వెళ్లే వాహనాలు, ప్రధాన కారిడార్ మీదుగా వెళ్లే వాహనాల మధ్య ఎలాంటి అయోమయం లేకుండా ఈ అండర్‌పాస్‌లు దారులను విడదీస్తాయి. కొన్ని చోట్ల బైపాస్‌ల మీదుగా మరో రోడ్డు విస్తరించి ఉంటుంది. ఇలాంటి వాటికి రెండో రోడ్డు కలిసే చోట మూడో అండర్‌పాస్ నిర్మించాల్సి ఉంటుంది. మారిన డిజైన్లు.. ప్రస్తుతం హైదరాబాద్–కొడంగల్ మీదుగా విస్తరించే జాతీయ రహదారిలో హైదరాబాద్–మన్నెగూడ మధ్య రెండు చోట్ల కొత్తగా అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. మొయినాబాద్, చేవెళ్ల బైపాస్‌లలో వీటిని నిర్మిస్తారు. ఖమ్మం–కోదాడ మార్గంలో 11 ప్రధాన అండర్‌పాస్‌లు, ద్విచక్ర వాహనాలు, కార్లు వెళ్లగలిగే 9 చిన్న అండర్‌పాస్‌లను ప్రతిపాదించారు. ఖమ్మం–సూర్యాపేట మార్గంలో 12 ప్రధాన అండర్‌పాస్‌లు, 11 చిన్న అండర్‌పాస్‌లను నిర్మించాలని నిర్ణయించారు. ఖమ్మం–అశ్వారావుపేటలో ఎన్ని అండర్‌పాస్‌లు నిర్మించాలనే విషయంలో సర్వే జరుపుతున్నారు. త్వరలో మిగతా చోట్ల కూడా వీటిని ఖరారు చేయనున్నారు. ఆ తర్వాత జాతీయ రహదారుల విభాగం పనులు చేపట్టే రోడ్లపైనా నిర్మించనున్నారు. -
మెదక్ జిల్లాలో బంద్ పాక్షికం..ఉద్రిక్తం
- ముంపు గ్రామాల చుట్టూ పోలీసు వలయం - పోలీసుల ఆధీనంలోరాజీవ్ రహదారి - కార్లు, బస్సుల్లో తనిఖీలు - జాతీయ రహదారి మీదనే కోదండరాం అరెస్టు - గ జ్వేల్‌లో దామోదర్, సునీతారెడ్డి, రేవంత్‌రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు - సిద్దిపేట, ఆందోల్‌లో మల్లన్నసాగర్ కట్టాలంటూ ప్రతి ర్యాలీలు సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూనిర్వాసితులపై ఆదివారం జరిగిన లాఠీచార్జికి నిరసనగా సోమవారం వివిధ పార్టీలు ఇచ్చిన పిలుపు మేరకు మెదక్ జిల్లా బంద్ పాక్షికంగా జరిగింది. తూర్పు మెదక్ జిల్లా ప్రాంతంలోనే కొంత మేరకు బంద్ ప్రభావం కనిపించింది. ముందస్తుగానే ప్రతిపక్ష పార్టీల నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టు చేశారు. భారీ ఎత్తున పోలీసులను మొహరించటంతో సర్వత్రా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. జిల్లా సరిహద్దు ప్రాంతం ఒంటిమామిడి నుంచి కుకునూర్‌పల్లి వరకు దాదాపు 30 కిలోమీటర్ల మేర రాజీవ్ రహదారిని పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకున్నారు. రంగారెడ్డి జిల్లా తుర్కపల్లి, మెదక్ జిల్లా ఒంటిమామిడి గ్రామాల మధ్య రెండు కిలోమీటర్ల పరిధిలో రెండు భారీ చెక్‌పోస్టులు ఏర్పాటు చేశారు. వందల మంది పోలీసు బలగాలను మొహరించారు. ఇద్దరు డీఎస్పీల ఆధ్వర్యంలో చెక్‌పోస్టు పహారా ఏర్పాటు చేశారు. ముంపు గ్రామాల ప్రజలను పరామర్శించేందుకు వెళ్తున్న ప్రొఫెసర్ కోదండరాంను పోలీసులు ఒంటిమామిడి చెక్‌పోస్టు వద్దనే అరెస్టు చేసి జిన్నారం మండలం బొల్లారం పోలీసుస్ట్టేషన్కు తరలించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు దామోదర్‌రాజనర్సింహ, సునీతారెడ్డి, శ్రావణ్, అద్దంకి దయాకర్, టీడీపీ నాయకుడు రేవంత్‌రెడ్డి, బీజేపీ ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి, రఘునందన్‌రావును గజ్వేల్ పట్టణంలో వేర్వేరు సమయాల్లో అరెస్టు చేసి తూప్రాన్, హైదరాబాద్‌లోని ఇతర పోలీసుస్టేషన్లకు తరలించారు. సంగారెడ్డిలో జగ్గారెడ్డిని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు గౌరెడ్డి శ్రీధర్‌రెడ్డిని, తెలంగాణ ప్రజాఫ్రంట్ అధ్యక్షురాలు విమలక్కను కుకునూర్‌పల్లి పోలీసులు అరెస్టు చేశారు. సాయంత్రం 5 గంటల సమయంలో వారిని సొంత పూచీకత్తుపై వదిలారు. పోలీసు వలయంలో ముంపు పల్లెలు వేములఘాట్, పల్లెపహాడ్, ఎర్రవల్లి, ఏటిగడ్డ కిష్టాపూర్, సింగారం, బంజేరుపల్లి తదితర ముంపు గ్రామాలను పోలీసులు చుట్టుముట్టారు. బయటి వ్యక్తులు ఊర్లోకి, ఊరి వ్యక్తులు బయటికి వెళ్లకుండా దిగ్బంధించారు. పోలీసు చర్యలకు నిరసనగా ముంపు గ్రామాల ప్రజలు ఊళ్లలోనే ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ దిష్టిబొమ్మలను దహనం చేశారు. ఎప్పుడేఏం జరుగుతుందో తెలియని భయానక పరిస్థితి పల్లెల్లో నెలకొని ఉంది. సిద్దిపేట, ఆందోల్‌లో ప్రతి ర్యాలీలు ఆందోల్‌లో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో కొందరు రైతులు మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేసి సింగూరును నింపాలని నినాదాలు చేస్తూ ఎంపీపీ కార్యాలయం నుంచి తహసీల్దారు కార్యాలయం వరకు ర్యాలీగా వచ్చి వినతిపత్రం ఇచ్చారు. దీంతో పట్టణంలో కొంత ఉద్రిక్తత ఏర్పడింది. సిద్దిపేటలో ప్రతిపక్ష పార్టీల నేతలు బంద్‌ను విజయంవంతం చేయాలని కోరుతూ దుకాణాలు మూసివేయించగా...వారి వెనకే టీఆర్ఎస్ శ్రేణులు వెళ్లి మల్లన్నసాగర్‌ను త్వరగా పూర్తి చేయాలని కోరుతూ దుకాణాలు తెరిపించాయి. గజ్వేల్ పట్టణంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీ కార్యరక్తల మధ్య కొంత వాగ్వాదం జరిగింది. -
రక్తమోడిన రహదారులు
♦ రోడ్డు ప్రమాదాల్లో ఐదుగురి మృతి ♦ వేర్వేరు చోట్ల ఘటనలు ♦ ప్రజ్ఞాపూర్ వద్ద ముగ్గురు.. ♦ ఔటర్‌పై ఇద్దరు.. దుర్మరణం గజ్వేల్: రాజీవ్ రహదారిపై లారీ, ఆటో ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన మంగళవారం మధ్యాహ్నం గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాపూర్ ఆర్టీసీ డిపో వద్ద చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం... వరంగల్ జిల్లా చేర్యాల మండలం ఐనాపూర్ గ్రామానికి చెందిన ఆలేరు బాల్‌రాజు(28), ఏర్పుల రవీందర్(34), మల్లయ్య(56), కానుగుల కిష్టయ్యలు అదే గ్రామానికి చెందిన దేవరాయ రమేశ్ ఆటో తీసుకుని వ్యవసాయ బోరు మోటార్ల కోసం పైపులు కొనేందుకు గజ్వేల్‌కు వస్తున్నారు. మార్గమధ్యంలోని గజ్వేల్ నగర పంచాయతీ పరిధిలోని ప్రజ్ఞాఫూర్ ఆర్టీసీ డిపో సమీపంలోకి చేరుకోగానే ఎదురుగా వస్తున్న లారీ ఆటోను ఢీకొట్టింది. దీంతో ఆటో నుజ్జునుజ్జయింది. అందులో ఉన్న వారంతా తీవ్రంగా గాయపడగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. మార్గమధ్యంలో మల్లయ్య(56) మృతి చెందగా, బాల్‌రాజు(28), ఏర్పుల రవీందర్(34) చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచారు. కాగా కిష్టయ్య, రమేశ్‌లు చికిత్స పొందుతున్నారు. వీరిలో బాల్‌రాజు, రవీందర్, రమేశ్‌లు హనుమాన్ మాల ధరించి ఉన్నారు. గజ్వేల్ ఎస్ఐ కమలాకర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. హే.. హనుమాన్..! గజ్వేల్: అప్పటివరకు వారంతా హనుమాన్ భజనల్లో మునిగితేలారు. భిక్షను పూర్తి చేసుకున్నారు... గజ్వేల్‌లో వ్యవసాయ బోరుబావుల కోసం పైపులు తేవడానికి ఆటోలో బయలు దేరారు. కానీ ఈ ప్రయాణమే తమకు ఆఖరి మజిలీ అవుతుందనుకోలేదు... విధి లారీ రూపంలో వెంటాడడంతో ముగ్గురి ప్రాణాలు అనంత వాయువుల్లో కలిశాయి. మృతుల పరిస్థితి ఇలా... ప్రమాదంలో మరణించిన బాల్‌రాజుకు మూడేళ్ల క్రితం మానసతో వివాహం కాగా ఏడాదిన్నర కూతురు ఉంది.రెండెకరాలకుపైగా భూమి ఉంది. వ్యవసాయమే ఇతనికి ప్రధాన జీవనాధారం. రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో భార్య మానస దిక్కులేనిదైంది. మరో మృతుడు ఏర్పుల రవీందర్ హమాలీ పనిచేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య రేణుక, ఏడాదిన్నర కూతురు, మూడు నెలల బాబు ఉన్నారు. రెక్కాడితేగానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న వీరు రవీందర్ మరణంతో రోడ్డున పడ్డారు. మల్లయ్యకు ఎకరంలోపే భూమి ఉంది. భార్య సుశీల, నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు. వీరిలో ఇద్దరి పెళ్లిళ్లు అయ్యాయి. ఓ కూతురు వికలాంగురాలు. మల్లయ్య మరణంతో వీరంతా దుఃఖ సాగరంలో మునిగిపోయారు. ఆసుపత్రికి తరలిన ఐనాపూర్ వాసులు ప్రజ్ఞాపూర్ ఘటనలో మృతులు, క్షతగాత్రులంతా వరంగల్ జిల్లా ఐనాపూర్ వాసులే. విషయం తెలియడంతో ఐనాపూర్ సర్పంచ్ విజయేందర్‌తోపాటు గ్రామస్తులు పెద్ద ఎత్తున గజ్వేల్‌కు చేరుకుని అక్కడి నుంచి గాంధీ ఆసుపత్రి తరలివెళ్లారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఔటర్‌పై ప్రమాదం: ఇద్దరి దుర్మరణం లారీని కంటెయినర్ ఢీకొనడంతో ప్రమాదం పటాన్చెరు టౌన్: ఔటర్ రింగ్‌రోడ్డుపై జరిగిన ప్రమాదంలో డ్రైవరు, క్లీనర్ దుర్మరణం చెందారు. లారీ, కంటెయినర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వివరాలు ఇలా.. సోమవారం అర్ధరాత్రి 1.30 గంటల ప్రాంతంలో కంటెయినర్ మూసాపేట (కంటెయినర్ కార్పొరేషన్) వైపు నుంచి ఓఆర్ఆర్ మీదుగా హైదరాబాద్‌లోని ఇతర ప్రాంతానికి వెళ్తుంది. మండలంలోని పాటి పంచాయతీ సమీపంలో ఔటర్ రింగ్‌రోడ్డుపై లారీ, కంటెయినర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కంటెయినర్ నుజ్జునుజ్జయ్యింది. కంటెయినర్ డ్రైవర్ చెన్నప్ప, కంటెయినర్ క్లీనర్ సురేశ్ మరణించారు. క్లీనర్ మృతదేహం క్యాబిన్లో చిక్కుకుపోయింది. లారీలో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. ముందున్న లారీని చూసుకోకండా కంటెయినర్ డ్రైవర్ వెనక నుంచి వెళ్లి ఢీకొట్టడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్టు తెలిసింది. -
ఇసుక అక్రమ రవాణాపై కొరడా
రాజీవ్ రహదారిపై తనిఖీలు ముమ్మరంపలువురిపై కేసులు నమోదు గజ్వేల్/వర్గల్: కరీంనగర్ నుంచి మెదక్ జిల్లా మీదుగా రాజీవ్ రహదారిపై ఓవర్‌లోడ్‌తో, వేబిల్లుల్లేకుండా సాగిస్తున్న ఇసుక రవాణాపై అధికారులు కొరడా ఝలిపించారు. ‘రహదారే అడ్డా’ శీర్షిక న ఈ నెల 4న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంతో తనిఖీలను ముమ్మరం చేశారు. కరీంనగర్ నుంచి హైదరాబాద్ వరకు 170 కిలోమీటర్ల పొడవునా నిఘా ఉంచి ఓవర్‌లోడు, వేబిల్లులతో ప్రమేయం లేకుండా వస్తున్న ఇసుక లారీలను పట్టుకుని కేసులు నమోదు చేస్తున్నారు. మూడు రోజులుగా ఈ ప్రక్రియ సాగుతోంది. తాజాగా శనివారం కరీంనగర్ నుంచి రాజీవ్ రహదారి మీదుగా ఇసుకను తరలిస్తున్న 3 లారీలను వర్గల్ మండలం గౌరారం పోలీసులు పట్టుకున్నారు. సదరు లారీల కాగితాలను పరిశీలించగా వేబిల్లులు లేకుండా ఇసుకను తరలిస్తున్నట్లు తేలింది. దీంతో ఆ లారీల డ్రైవర్లు షేక్ ఎజాజ్, రాంజీ, లింగారెడ్డి, ఓనర్లు రంగారెడ్డి, లింగం, మహ్మద్ ఇఫ్తకార్ అహ్మద్‌లపై గనులు, భూగర్భ చట్టం కింద కేసులు నమోదు చేసినట్లు గౌరారం ఎస్ఐ మధుసూదన్‌రెడ్డి తెలిపారు. ఇసుక లారీలను సీజ్ చేసి కోర్టులో అప్పగిస్తున్నట్లు వెల్లడించారు. -
రాజీవ్ రహదారి పై రవీంద్ర రావు కారు బోల్త