Rajmohan gandhi
-
అమెరికా ఆత్మను తట్టిలేపిన జార్జ్
అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న వారిలో ఏ ఒక్కరు కూడా ప్రస్తుత పరిణామాలు మునుపెన్నడైనా జరిగి ఉంటాయని గుర్తించలేకపోతున్నారు. ఇది నిజంగానే ఆ దేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహనీయ గాథ. అన్నిజాతులకు చెందిన యువ అమెరికన్లు కోవిడ్–19 బారినపడే ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా.. వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఊరేగింపు తీస్తున్నారు. మినియాపోలిస్‌లో నిరాయుధుడైన నల్లజాతీయుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన అమెరికాలో అసాధారణ పర్యవసానాలకు దారి తీసింది. ప్రజలను విడదీస్తున్న రాజకీయాలకు కాలం చెల్లిపోవచ్చునని ఈ పరిణామాలు తెలిపాయి. అయితే ఈ పరిణామాలు ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితం కావని మనం ఆశించవచ్చు. ప్రస్తుతం భారతదేశంలో, అమెరికాలో కనిపిస్తున్న దృశ్యాల మధ్య అసంఖ్యాకమైన పోలికలు కనిపిస్తున్నాయి. ఈ రెండు దేశాల రాజధాని భూభాగాలకు ఆ పోలికల్లో ప్రత్యేక స్థానం ఉందని చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీ పూర్తి స్థాయి రాష్ట్రం కాదు. ఇక వాషింగ్టన్ డీసీ విషయానికి వస్తే అమెరికన్ సెనేట్‌లో దానికి కనీస స్థానం కూడా లేదు. ఇకపోతే ప్రతినిధుల సభలో ఉంటున్న దాని ఏకైక ప్రతినిధికి ఓటు హక్కు కూడా లేదు. జాతిపరమైన సమానత్వం కోసం అమెరికాలోని ప్రతి నగరంలో జరుగుతున్నట్లే, వాషింగ్టన్ డీసీ నగరంలోని జనం కూడా తన కళ్లముందే, తనకు బిగ్గరగా వినబడేటట్లు నిరసన ప్రదర్శనలు చేస్తుండటంపై దేశాధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహంతో ఊగిపోయారు. ఇటుక తరువాత ఇటుకను పేర్చినట్లుగా, బ్యారికేడ్ తర్వాత బ్యారికేడ్ పెట్టినట్లుగా వైట్ హౌస్ వాస్తవ సరిహద్దులను విస్తరింపచేయడానికి ట్రంప్ ప్రయత్నించారు. అయితే మనం 2020వ సంవత్సరంలో ఉంటున్నందున ట్రంప్ అసహ్యకరమైన ప్రయాసను ప్రపంచం మొత్తం గమనించింది. శ్వేతసౌధం పక్కనే ఉన్న చర్చి ముందు ఫోటో దిగుతూ ట్రంప్ పొందిన దురవస్థ కానీ, తన భద్రత కోసం వైట్‌హౌస్ బంకర్లోకి దిగిపోవడం కానీ ప్రపంచం చాలాకాలంపాటు గుర్తుంచుకుంటుంది. ట్రంప్ అబద్దాలను ఎలా గుప్పిస్తారో (వాటిలో ప్రతి ఒక్కదాన్ని ట్రంప్ వీడియోనే ఖండించింది) ఉల్లాసకరంగా గమనించిన తర్వాత, ట్రంప్‌ను పూర్తిగా విశ్వసించే వారు కూడా వైట్ హౌస్ బంకర్‌ని కేవలం తనిఖీ మాత్రమే చేశానని తాను చెప్పిన కథను నమ్మడానికి ఇబ్బందిపడ్డారనే చెప్పాల్సి ఉంటుంది. వచ్చే నవంబర్‌లో ట్రంప్ భంగపాటు, పతనం, బహుశా గద్దె దిగిపోవడం కూడా అమెరికాలో ఈరోజు ప్రధాన వార్త కాదు. సమానత్వం కోసం నేడు సాగుతున్న నిరసనల పరిమాణం, వాటి సర్వవ్యాపకత, అనంతత్వం, జాతిపరమైన వైవిధ్యత మాత్రమే నేడు అమెరికాలో అసలైన వార్తలుగా ఉంటున్నాయి. అమెరికాలో ప్రస్తుతం ఉంటున్న వారిలో ఏ ఒక్కరు కూడా ఇలాంటి పరిణామాలు మునుపెన్నడైనా జరిగి ఉంటాయని గుర్తించలేకపోతున్నారు. ఇది నిజంగానే ఆ దేశ చరిత్రలో ఒక అపూర్వమైన మహనీయ గాథ. నిరసన ప్రదర్శనలకు సంబంధించి నేను సూచించిన నాలుగు లక్షణాల్లో చివరి రెండింటికి మాత్రమే అత్యంత ప్రాధాన్యముంది. అన్నిజాతులకు చెందిన యువ అమెరికన్లు కోవిడ్–19 బారిన పడే ప్రమాదాన్ని కూడా పట్టించుకోకుండా.. వేలాదిగా వీధుల్లోకి వచ్చి ఊరేగింపు తీస్తున్నారు. నిరాయుధుడైన నల్లజాతీయుడు జార్జి ఫ్లాయిడ్‌ని మినియాపోలిస్ అధికారి హత్య చేసిన దృశ్యాన్ని అయిదడుగుల దూరంలోనుంచి కళ్లకు కట్టినట్లుగా చూపించిన ఆ తొమ్మిది నిమిషాల వీడియోను, 17 సంవత్సరాల యువతి డార్నెల్లా ఫ్రేజర్ చిత్రించింది. ఆ వీడియోను ఆమె పోస్ట్ చేసిన తర్వాతే అమెరికా వ్యాప్తంగా కనీవినీ ఎరుగని రీతిలో నిరసన ప్రదర్శనలు చెలరేగాయి. దాని ప్రతిధ్వనులు ప్రపంచమంతా వినిపించాయి. ఆ నిరసనల క్రమంలో లూటీ, కొన్ని హింసాత్మక ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. కానీ ఆ వీడియోను చూశాక పీడితులైన నల్లజాతీయులకు వ్యతిరేకంగా నిరంతరం జరుగుతున్న అన్యాయంపట్ల రగిలిన ఆగ్రహానుభూతులే హింసాత్మక చర్యలకు కారణమయ్యాయి కానీ నిరసనకారుల్లో మెజారిటీ వాటికి ఆమోదం తెలపలేదన్నది వాస్తవం. కానీ నిరసనకారుల్లో చాలామంది న్యాయాన్ని గట్టిగా డిమాండ్ చేస్తూనే చాలావరకు శాంతియుతంగా మెలగాలని నిర్ణయించుకున్నారు. హింసాత్మక ఘటనలకు పాల్పడిన వారి ముఖాలు, వారి నేపథ్యాలు, ఉద్దేశాల గురించి దర్యాప్తులో బయటపడవచ్చు. కానీ ఇలా హింసకు పాల్పడిన వారు సమానత్వాన్ని, న్యాయాన్ని కోరుకున్నారనేందుకు ఎలాంటి సంకేతమూ లేదు. అశాంతిని కఠినంగా అణిచివేయడానికి మద్దతు సాధించడం కోసం కూడా కొంతమంది ఉద్దేశపూర్వకంగా ఇలా చేసి ఉంటారా? ఇది నిజమే అయితే అలాంటివారు ఘోరంగా విఫలమైనట్లే లెక్క. తాను అమెరికా శాంతి భద్రతలు కాపాడే అధ్యక్షుడినని ట్రంప్ ప్రకటించడమే కాకుండా.. డెమోక్రాట్ల ఆధిపత్యంలో ఉన్న నగరాలు, రాష్ట్రాల్లో సాగుతున్న అరాచకత్వాన్ని అణిచివేయడానికి ఫెడరల్ సైన్యబలగాలను పంపడానికైనా వెనుకాడనని హెచ్చరించారు. తన హెచ్చరికను నొక్కి చెప్పడానికా అన్నట్లుగా, ప్రస్తుత అమెరికా త్రివిధ దళాల జాయింట్ చెఫ్‌ల చైర్మన్‌గా వ్యవహరిస్తున్న జనరల్ మార్క్ మిల్లేని కూడా వైట్ హౌస్ పక్కనే ఉన్న దెబ్బతిన్న చర్చికి నడిచివెళ్లేటప్పుడు ట్రంప్ తన వెంట తీసుకుపోయారు. అయితే ట్రంప్ చేసిన హెచ్చరికను ట్రంప్ రక్షణమంత్రిగా రెండేళ్లు పనిచేసిన మాజీ మెరైన్ చీఫ్ జేమ్స్ మ్యాటిస్ తిప్పికొట్టారు. దేశానికి ఐక్యత అతిగొప్ప అవసరంగా ఉంటున్న తరుణంలో ట్రంప్ దేశాన్ని నిలువునా చీల్చివేస్తున్నాడని జేమ్స్ ఏకిపడేశారు. పాలనాపరంగా స్పందించాల్సిన అంశాన్ని సైనికపరం చేయాలన్న ఆలోచనను అమెరికా సైన్య మాజీ అధిపతులు కూడా వ్యతిరేకించారు. ట్రంప్‌తోపాటు చర్చికి నడుచుకుంటూ వెళ్లిన ప్రస్తుత రక్షణమంత్రి మార్క్ ఎస్పర్ కూడా ట్రంప్ హెచ్చరికకు మద్దతునివ్వకపోగా, అమెరికా సైన్యం జోక్యం చేసుకోవలసిన పరిస్థితులు ఇప్పుడు లేవని చెప్పేశారు. అయితే కీలకమైన రాష్ట్రాల్లో తన ప్రత్యర్థి జో బిడెన్ తనకంటే ముందు ఉన్నారని పోల్స్ సూచించిన రోజున ట్రంప్ తన వ్యాఖ్యలను వెనక్కు తీసుకోవలసి వచ్చింది. మళ్లీ నిరసన ప్రదర్శనల వద్దకు వెళదాం. అమెరికాలో ప్రస్తుత ప్రదర్శనలు 2019 చివరినెలలు, 2020 ప్రారంభంలో పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా భారత్‌లో కనిపించిన దృశ్యాలను నాకు గుర్తుకు తెచ్చాయి. కేంద్రప్రభుత్వం పౌరసత్వనిర్ధారణపై తీసుకొస్తున్న కొత్త చట్టం నుంచి ముస్లింలను పక్కకు పెట్టడాన్ని నిరసిస్తూ దేశంలోని అన్ని నగరాల్లోని హిందువులు, సిక్కులు, క్రిస్టియన్లు పెద్ద ఎత్తున ముస్లింలతో కలిసి భారీ నిరసనలకు సిద్ధమయ్యారు. భారత్, అమెరికాలకు సంబంధించి ఇతర రాజకీయ పోలికలు లేక లింకుల గురించి కూడా సులువుగా ఆలోచించవచ్చు. ఉదాహరణకు అమెరికా వీధుల్లో ఈ రోజు జరుగుతున్న అహింసాత్మక నిరనసలు భారత్‌లో చాలా కాలం జరిగిన ఇదే రకమైన పోరాటాలను గుర్తు చేస్తున్నాయని భారతీయులు భావించవచ్చు. భారత్‌లో గాంధీ నిర్వహించిన కేంపెయిన్లనుంచి గ్రహించిన అంశాలనే మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ అతని అనుయాయులు నల్లజాతి హక్కుల ఉద్యమంలో ఉపయోగించిన విషయాన్ని కూడా భారతీయులు ఇప్పుడు గుర్తుకు తెచ్చుకోవచ్చు. అదృష్టవశాత్తూ అమెరికా వీధుల్లో సమానత్వం కోసం ఇస్తున్న పిలుపుల్లో భారతీయుల స్వరాలు కూడా అక్కడక్కడా వినిపించవచ్చు. కానీ అమెరికాలోని ఇతర భారతీయులు హౌస్టన్‌లో ట్రంప్‌కి బ్రహ్మాండంగా స్వాగతమిచ్చారు. దీన్ని అలా పక్కనుంచండి. భారత్‌లో దళితులు, మైనారిటీలు ప్రతి నిత్యం ఘర్షిస్తున్న తీరు అమెరికాలో నల్లజాతీయులు అవిరామంగా సాగిస్తున్న ఘర్షణలకు ఏమాత్రం భిన్నంగా లేదు. అందుకే ఈ రోజు అమెరికాలో జరుగుతున్న ఘటనలనుంచి భారత్‌లో నిర్లక్ష్యానికి గురైన మైనారిటీలు ప్రేరణ పొందవచ్చు. అయితే అదే సమయంలో రెండు దేశాల మధ్య వ్యత్యాసాలు కూడా ఉంటున్నాయని కూడా గమనించాలి. జార్జి హత్యాఘటన నేపథ్యంలో ఇప్పుడు అమెరికాలోని పలు నగరాలు పూర్తి ఆశావాదాన్ని కలిగివుండి, న్యాయంకోసం డిమాండ్ చేస్తున్న అన్ని రకాల జాతులకు చెందిన యువతీయువకులతో నిండి ఉంటున్నాయి. భారతదేశంలోని వీధులు మాత్రం ఇప్పటికీ భయకంపితులవుతున్న, ఆకలితో అలమటిస్తున్న వలస కార్మికులతో నిండి ఉంటున్నాయి. భారత్‌తో పోలిస్తే అమెరికాలోని యూనివర్సిటీలు, కోర్టులు, వార్తాపత్రికలు, టీవీ చానల్స్ వంటివి సమానత్వ హక్కును, వాక్ స్వేచ్ఛా హక్కును ఎత్తిపట్టాలంటూ డిమాండ్ చేయడంలో ఎంతో సాహసాన్ని ప్రదర్శిస్తున్నాయి. పైగా, అమెరికాలో నేడు తలెత్తిన తీవ్ర నిరసనల ధోరణి రేపు కూడా కొనసాగుతుందని గ్యారంటీ ఏమీ లేదు.అదే సమయంలో మినియాపోలిస్‌లో నిరాయుధుడైన నల్లజాతీయుడిని క్రూరంగా హత్య చేసిన ఘటన అమెరికాలో అసాధారణ పర్యవసానాలకు దారి తీసింది. నాణ్యత, పాలన అనేవి ఎంతో విలువైనవని, ప్రజలను విడదీస్తున్న రాజకీయాలకు కాలం చెల్లిపోవచ్చునని ఈ పరిణామాలు తెలిపాయి. అయితే ఈ పరిణామాలు ఒక్క అమెరికాకు మాత్రమే పరిమితం కావని మనం ఆశించవచ్చు. రాజ్‌మోహన్ గాంధీ వ్యాసకర్త ప్రొఫెసర్,ఇలినాయిస్ యూనివర్సిటీ,యూఎస్ -
ఇది పేదలను పట్టించుకోని ప్రజాస్వామ్యం
పశ్చిమ బెంగాల్ గవర్నర్, మహాత్మాగాంధీ, రాజగోపాలాచారి మనవడు, ప్రముఖ జీవిత చరిత్ర కారుడు, మేధావి రాజమోహన్ గాంధీ విజయవాడ విచ్చేసిన సందర్భంగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ ప్రొఫెసర్ అడ్లూరి రఘురామరాజు సాక్షి పాఠకులకోసం ఆయనతో జరిపిన ప్రత్యేక ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు, ప్రపంచంలో ప్రజాస్వామ్యం గురించి సాధారణంగానూ, భారత్‌లో ప్రజాస్వామ్యంపై ప్రత్యేకంగానూ మీ అభిప్రాయాలు వివరించండి.ప్రజాస్వామ్యంపై మహాత్మాగాంధీ అభిప్రాయాలను తెలుపండి గ్లోబల్‌గా మారిపోయిన ప్రపంచం ఇప్పుడు, ఇటీవలి సంవత్సరాల్లో ట్రైబల్‌గా మారిపోయింది. దేశం తర్వాత దేశంలో రాజకీయనాయకులు తమ దేశం ప్రతిఒక్కరిదీ కాకుండా కొద్ది గ్రూపుల స్వంతమై ఉందనే భావాన్ని ముందుకు తెస్తున్నారు. అమెరికాను మళ్లీ వెనక్కు తీసుకెళదాం అంటున్న ట్రంప్ అమెరికా శ్వేత ప్రజలు తమ దేశాన్ని మళ్లీ నల్లజాతి ప్రజలనుంచి, స్పానిష్ మాట్లాడే అమెరికన్ల నుంచి, ఆసియన్ అమెరికన్ల నుంచి తమ స్వాధీనంలోకి తెచ్చుకోవాలనే భావాన్ని ప్రతిపాదిస్తున్నారు. నల్లవారు, శ్వేతేతరులు అమెరికన్లు కాదని చెబుతున్న ఆయన అభిప్రాయం ప్రతి ప్రజాస్వామిక నియమాన్నే కాకుండా అమెరికా రాజ్యాంగాన్ని కూడా ఉల్లంఘిస్తోంది. ఇక్కడ భారత్‌లో కూడా అదేవిధమైన ప్రకటనలు వినిపిస్తున్నాయి. ఇలాంటి ఆలోచన గాంధీ, మన స్వాతంత్య్రోద్యమం పునాదులనే పూర్తిగా వ్యతిరేకిస్తోంది. పైగా ఇది మన రాజ్యాంగానికే అభాస. ప్రతి భారతీయుడికీ భారతదేశం సమానంగా చెందుతుందన్నది గాంధీ 1909లో హింద్ స్వరాజ్ అనే శక్తివంతమైన రచన చేసినప్పటి నుంచే పెట్టుకున్న స్థిరమైన అభిప్రాయం. ఇక ప్రజాస్వామ్యం, అభివృద్ధి విషయానికి వస్తే, ధనబలం ఎన్నికలను ప్రభావితం చేస్తున్నప్పుడు అభివృద్ధి అంటే ఇప్పటికే ధనవంతులైన వారిని మరింత ధనవంతులుగా చేస్తుందనే అర్థం. నేడు మానవ వనరులతో సహా సహజ వనరులను ఆలోచనారాహిత్యంతో ఉపయోగిస్తుండటాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వికలాంగులు, రోగులు, గ్రామీణులు, పేదలు, నిర్వాసితులు, మహిళలు, పిల్లలు తదితరులకు సహకరించని అభివృద్ది ఇప్పటికే బలంగా ఉన్నవారికి, సంపన్నులుగా ఉన్నవారికి మాత్రమే అనుకూలంగా ఉంటుంది. సహజ వనరులను జాగ్రత్తగా, వివేకంతో ఉపయోగించుకోవడానికి బదులుగా వాటిని విచ్చలవిడిగా కొల్లగొడుతున్నట్లయితే భవిష్యత్తు ఇప్పటికంటే భయంకరంగా మారిపోతుంది. ఈ వాస్తవం గురించి జాగరూకత పెరుగుతోంది. మనలో ప్రతి ఒక్కరూ మన అభివృద్ధి చట్రాన్ని తిరగదోడి, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పనకు, గ్రామీణ భారతంలో విద్య, వైద్య స్థాయిలను పెంచుతూ, మన సహజవనరులను భూమి, నీరు, అడవులు, మానవ నైపుణ్యాలను పరిరక్షించేలా ఉద్యమాన్ని ప్రోత్సహించాల్సి ఉంది. నేటివరకు గాంధీ ప్రవచించిన గ్రామస్వరాజ్ ఊహాస్వర్గం గానే ఉంటూ వస్తోందా? కొంతమంది గ్రామస్వరాజ్యాన్ని ఊహాస్వర్గం అని పిలుస్తూండవచ్చు. కానీ మన గ్రామాల్లో జీవితాన్ని పునరుద్ధరించని సుసంపన్న భారత్ గురించిన స్వప్నమే పూర్తిగా ఊహాస్వర్గం అని చెప్పాలి. భారత్‌లోని కోట్లాది మంది ప్రజలందరూ ముంబై, కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, విజయవాడ, చెన్నై వంటి నగరాలకు వలస వెళ్లవచ్చు అని ఆలోచించేవారు తమ మెదడును పరీక్షించుకోవలసి ఉంది. పైగా ఈ అన్ని నగరాలూ ఇప్పటికే నివాసయోగ్యం కాకుండా పోయాయి. అందుకే మన గ్రామాల్లోని జీ వితాన్ని పునరుద్ధరించడమనేది ఈ రోజు యుద్ధప్రాతిపదికపై చేయాల్సిన విధి. ఆధునిక దక్షిణ భారతదేశంపై మీరు ఇటీవల ప్రచురించిన ’’ఎ హిస్టరీ ఫ్రమ్ ది 17త్ సెంచరీ టు అవర్ టైమ్స్’’ గురించి క్లుప్తంగా మా పాఠకులకు చెబుతారా? ప్రాచీన చరిత్ర గురించి రెండు ముక్కల్లో చెప్పడం సాధ్యం కాదు కదా? కానీ, ఆంధ్ర, తెలంగాణ ప్రజలు దక్షిణ భారత దేశం గురించిన ఈ నాలుగు శతాబ్దాల చిత్రణను తప్పకుండా చదువుతారని భావిస్తాను. ఈ పుస్తకరచనలో రెండు తెలుగురాష్ట్రాలకు చెందిన పలువురు స్నేహితులు నాకు ఎంతగానో సహకరించారు. దక్షిణభారత్ గురించి అధ్యయనానికి నోచుకోని పరిణామపూర్వక సందర్భాలను పునశ్చరణ చేయడమే నా ప్రాజెక్టు లక్ష్యం. 17, 18, 19, 20 శతాబ్దాల్లో దక్షిణ భారతదేశం ఎలా ఉండేది. ఈ ప్రాంతాన్ని పాలించిన ఏ పాలకులనుంచి బ్రిటిష్ పాలకులు తమ ఆధిపత్యాన్ని స్థిరపర్చుకున్నారు? బ్రిటన్ ఆక్రమణను అడ్డుకోవడానికి ఇక్కడి పాలకులు చేతులు కలపడానికి ప్రయత్నించారా? ఈ ప్రాంతంలోని అనేక కులాలు, భాషా బృందాల మధ్య ఎలాంటి సంబంధాలు ఏర్పడ్డాయి? వేరుగా ఉన్నప్పటికీ రాజకీయ స్వాతంత్య్రం, సామాజిక న్యాయం కోసం ఇక్కడి పోరాటాలు ఎలా రూపుదిద్దుకున్నాయి? నాలుగు శతాబ్దాల కాలంలో దక్షిణ భారత్‌ను మార్చిన గుర్తించదగిన ఉద్యమాల్లో స్త్రీపురుషుల పాత్ర ఎలాంటింది? అఖిల భారత స్థాయిలో నాయకత్వం కోసం దక్షిణ భారతదేశం గట్టిగా ప్రయత్నిస్తోందా?ఆధునిక దక్షిణ భారత్‌కి ఒక విశిష్టమైన గుణం ఉందా ఇలాంటి ప్రశ్నలే నేను ఈ పుస్తకంలో సంధించాను. పండితులు నా సమాధానాలను విమర్శిస్తారని, నేను లేవనెత్తని ప్రశ్నలను సంధిస్తారని ఆశిసున్నాను. తాము ఇప్పటికే చేస్తున్న పనికి అదనంగా జోడించాల్సిన రంగాలను కనుగొనడానికి కొంతమంది యువ, ప్రతిభావంతులైన రచయితలు, స్కాలర్లు మిమ్మల్ని సంప్రదిస్తే మీరు వారికి ఏం సూచిస్తారు? పలువురు ప్రముఖుల జీవిత చరిత్రలు (గాంధీ, పటేల్, రాజాజీ, దర్బార్ గోపాల్‌దాస్, జిన్నా) రాసిన అనుభవంతో నేను జీవిత చరిత్రలు రాయాలనే సూచిస్తాను. ప్రపంచంలోని ప్రతి వ్యక్తి వారి వారి జీవితాలనుంచి శక్తివంతమైన గాధలను చెప్పగలరు. ఒక పరిశోధకుడు లేక రచయిత మరొక వ్యక్తి గురించి తీవ్రంగా ఆసక్తి కలిగి ఉంటే ఆ వ్యక్తి జీవిత చరిత్ర రాయడమే విలువైనదిగా ఉంటుంది. 1972లో లండన్‌లోని ఒక స్కాలర్ నాకు జీవిత చరిత్ర రచన గురించి రెండు చిట్కాలు సూచించారు. ఒకటి మీరెన్నుకున్న అంశంపై సహానుభూతి, రెండు అతడిని లేక ఆమెను విమర్శించాలని భావించడం. అలాగే చరిత్ర ప్రత్యేకించి చిన్న, పెద్ద ప్రాంతాల చరిత్ర చాలా ఆసక్తికరమైనది. అవిభాజ్య పంజాబ్ గురించి నేను 2013లో నేను రాసిన పుస్తకం ప్రచురించిన తర్వాత చాలామంది దాన్ని ఆదరించారు. దాంతో నేను మరింత పెద్దదైన దక్షిణ భారత్ చరిత్ర గురించి రాయాలనే కుతుహలం పెరిగింది. నిజానికి అవి అసాధారణమైన, అనూహ్యమైన, మరువలేని పరిణామాలను క్రోడీకరించినట్లయితే జిల్లా, తాలూకా, పట్టణం, గ్రామం వంటి వాటి చరిత్ర కూడా ఆసక్తికరంగా ఉంటుంది. ఎ.రఘురామరాజు -
గ్రంధాలయాన్ని సందర్శించిన రాజ్‌మోహన్‌గాంధీ
-
రామప్ప ఆలయం అద్భుతం
మహాత్మాగాంధీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీ వెంకటాపురం: రామప్ప ఆలయ నిర్మాణశైలి, శిల్పకళ అద్భుతమని జాతిపిత మహా త్మాగాంధీ మనుమడు రాజ్‌మోహన్‌గాంధీ అన్నారు. ఇన్టాక్ కన్వీనర్ ప్రొఫెసర్ పాండురంగారావుతో కలసి ఆదివారం ఆయన వరంగల్ జిల్లా వెంకటాపురం మండలంలోని రామప్ప దేవాలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా వారు రామప్ప రామలింగేశ్వరస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామప్ప ఆల యాన్ని అభివృద్ధి చేసి ప్రపంచంలోనే ప్రత్యేక గుర్తింపు వచ్చేలా అభివృద్ధి చేయాల్సిన అవసరముందని రాజ్‌మోహన్ గాంధీ పేర్కొన్నారు. -
రవీంద్ర భారతిలో పీవీ స్మారక ఉపన్యాసం
-
28న పీవీ స్మారకోపన్యాసం
ప్రసంగించనున్న గాంధీ మనవడు రాజ్‌మోహన్‌గాంధీ సాక్షి,హైదరాబాద్: మాజీ ప్రధాని పీవీ నర్సింహారావు జ్ఞాపకార్థం ఈనెల 28న హైదరాబాద్‌లో ‘స్వాతంత్య్రం - సామాజిక న్యాయం’ అంశంపై ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పీవీ ఫౌండేషన్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ కార్యక్రమంలో మహాత్మాగాంధీ మనవడు, ప్రముఖ రచయిత రాజ్‌మోహన్‌గాంధీ స్మారకోపన్యాసం చేస్తారని పేర్కొంది. ఆదివారం ఉదయం రవీంద్రభారతిలో సీనియర్ సంపాదకులు డాక్టర్ కె.రామచంద్రమూర్తి అధ్యక్షతన జరిగే కార్యక్రమంలో పలువురు సీనియర్ జర్నలిస్టులు, యూనివర్సిటీ ప్రొఫెసర్లతో పాటు పీవీ కుటుంబసభ్యులు, పలు రంగాల ప్రముఖులు హాజరుకానున్నారు. రెండేళ్లుగా పీవీ డెవలప్మెంట్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్మారకోపన్యాస కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. తొలి ఏడాది రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, గత ఏడాది అప్పటి కేంద్రమంత్రి గులాంనబీ ఆజాద్ స్మారకోపన్యాసం చేశారు. -
ఏడు స్థానాలకు 206 నామినేషన్లు
న్యూఢిల్లీ: రాజధానిలోని ఏడు లోక్‌సభ స్థానాలకు ఏప్రిల్ 10 జరగనున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు మొత్తం 206 మంది అభ్యర్థులు నామినేషన్లు వేశారు. శనివారంతో నామినేషన్ల గడువు ముగిసే సరికి 206 మంది నామినేషన్లు స్వీకరించినట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది. కపిల్ సిబల్, హర్షవర్ధన్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖులు బరిలో నిలిచిన ఈ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో అన్ని పార్టీల నుంచి నువ్వా-నేనా అనే స్థాయిలోనే అభ్యర్థులు బరిలోకి దిగారని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఏ నియోజకవర్గంలో కూడా ఏ పార్టీ గెలుపు ఖాయమని చేప్పేందుకు వీలులేకుండా అభ్యర్థుల జాబితా కనిపిస్తోందన్నారు. బీజేపీ నేతలు హర్షవర్ధన్, మీనాక్షి లేఖీ, కాంగ్రెస్ నేతలు అజయ్ మాకెన్, ఆప్ నేతలు అశుతోష్, రాజ్‌మోహన్ గాంధీ వంటి ప్రముఖుల గెలుపు కొంతవరకు ఖాయంగానే కనిపిస్తున్నా ఢిల్లీ ఓటరు ఎప్పుడూ ఊహించని రీతిలో తీర్పునిస్తున్నాడని చెబుతున్నారు. 2009లో జరిగిన ఎన్నికల్లో 221 మంది నామినేషన్లు వేసినప్పటికీ ఉపసంహరణ తర్వాత 160 మంది మాత్రమే బరిలో నిలిచారని, ఈసారి కూడా ఉపసంహరణ తర్వాత అసలైన అభ్యర్థుల సంఖ్య ఖరారవుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీ, మరో నటుడు విశ్వజీత్ చటర్జీ, సిట్టింగ్ ఎంపీ కృష్ణాతీరథ్, రమేశ్ కుమార్ వంటి ప్రముఖులు కూడా ఈ ఎన్నికల్లో తలపడుతున్నారు. ఇక తృణముల్ కాంగ్రెస్ కూడా ఢిల్లీలో సత్తాచాటాలని పరితపిస్తోంది. ఈ పార్టీ అభ్యర్థులు చివరిరోజైన శనివారం నామినేషన్లు వేశారు. ఈశాన్య ఢిల్లీ నుంచి బరిలోకి దిగుతున్న భోజ్‌పురి నటుడు మనోజ్ తివారీకి సిట్టింగ్ ఎంపీ జైప్రకాశ్ అగర్వాల్, ఆప్ నేత ఆనంద్‌కుమార్‌ల నుంచి గట్టి పోటీ ఎదురయ్యే అవకాశముందంటున్నారు. ఇక కేంద్ర మంత్రి కృష్ణాతీరథ్‌కు కూడా ఆప్ నేత రాఖీ బిర్లా, బీజేపీ నుంచి నామినేషన్ వేసిన ఉదిత్‌రాజ్ నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. ఇక తృణముల్ కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్న విశ్వజీత్ చటర్జీకి కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ అజయ్ మాకెన్, బీజేపీ నేత మీనాక్షి లేఖీ, ఆప్ నేత ఆశిష్ కేతన్ నుంచి పోటీ ఎదురుకానుంది. ఇలా ఏడు నియోజకవర్గాల్లో కూడా అభ్యర్థుల బలాబలాలు పోటాపోటీగా ఉన్నాయని చెబుతున్నారు. బీజేపీ నుంచి పోటీ చేస్తున్నవారికి స్థానికంగా హర్షవర్ధన్‌కు ఉన్న మంచిపేరు, ప్రధాని అభ్యర్థిగా మోడీ చరిష్మా కలిసివచ్చే అంశంకాగా ఆమ్ ఆద్మీ పార్టీకి అరవింద్ కేజ్రీవాల్ ఉద్యమాలు, 49 రోజుల పాలనలో తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాలు, ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఆయన తీసుకున్న నిర్ణయాలు ఆప్ అభ్యర్థుల విజయానికి అనుకూలాంశాలుగా చెబుతున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు మాత్రం పార్టీ పేరుమీదే గెలుస్తామని చెబుతున్నారు. -
ఆప్.. ఓ ఆశాజ్యోతి!
న్యూఢిల్లీ: దేశ ప్రజల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భవిష్యత్తుపై ఓ నమ్మకాన్ని కల్పించిందని మహాత్మాగాంధీ మనవడు రాజ్‌మోహన్ గాంధీ అన్నారు. 1989లో రాజీవ్‌గాంధీ మరణం తర్వాత రాజకీయాలకు దూరంగా వెళ్లిపోయిన తాను మళ్లీ ఇప్పుడు క్రీయాశీల రాజకీయాల్లోకి రావాలని నిర్ణయించుకోవడానికి ఆమ్ ఆద్మీ పార్టీయే కారణమన్నారు. భారత రాజకీయాల్లో ఆప్ కొత్త ఒరవడిని సృష్టించిందని, అరవయేళ్లుగా తాను దేని కోసమైతే పోరాడుతున్నానో ఆ లక్ష్యాన్ని సాధించే దిశగా ఆప్ వేగంగా అడుగులు వేస్తోంద న్నారు. ఉత్తర ఢిల్లీ నియోజకవర్గం నుంచి పార్లమెంట్‌కు ప్రాతినిథ్యం వహిస్తున్న కాంగ్రెస్ ఎంపీ సందీప్ దీక్షిత్‌కు ప్రత్యర్థిగా రాజ్‌మోహన్ గాంధీని బరిలోకి దింపాలని ఆప్ ఇప్పటికే నిర్ణయించింది. అన్ని విషయాలపై అవగాహన ఉన్న వ్యక్తిగా, చరిత్రకారుడిగా, అన్నింటికి మించి సామాన్య జనాల్లో పేరున్న వ్యక్తిగా చెప్పుకునే రాజ్‌మోహన్‌ను బరిలోకి దించితేనే సందీప్ దీక్షిత్‌కు గట్టి పోటీ ఎదురవుతుందని ఆమ్ ఆద్మీ పార్టీ భావిస్తోంది. ఆప్ అరంగేట్రంతో అసెంబ్లీ ఎన్నికల్లో కుదేలైన కాంగ్రెస్ పార్టీకి పదిహేనేళ్లుగా మూల స్తంభంగా నిలిచిన షీలాదీక్షిత్ చరిత్రకు ఇప్పటికే చరమగీతం పాడిన ఆప్ ఈసారి ఆమె కుమారుడు సందీప్ దీక్షిత్‌కు చెక్ పెట్టేందుకు శతవిధాలా ప్రయత్నిస్తోంది. ఇందుకోసం సరైన ప్రత్యర్థి కోసం అన్వేషించిన ఆప్ నేతలకు రాజ్‌మోహన్ రూపంలో ఆయుధం దొరికినట్లయింది. దీంతో ఆయనను ఈసారి లోక్‌సభ ఎన్నికలో దించడం దాదాపు ఖాయమైపోయింది. ఇల్లినోయిస్ విశ్వవిద్యాలయం నుంచి రీసెర్చ్ ప్రొఫెసర్‌గా కొనసాగుతున్న రాజ్‌మోహన్ తన సమయాన్ని ఇండియా, అమెరికాల మధ్య తిరగడంలోనే గడుపుతున్న సమయంలో కేజ్రీవాల్ గురించి విన్నారు. మచ్చలేని వ్యక్తిగా, నిర్భయుడిగా పలువురు కేజ్రీవాల్ గురించి చెప్పుకోవడంతో కేజ్రీవాల్‌ను కలిశారు. ఈ విషయమై గాంధీ మాట్లాడుతూ... ‘నిజంగానే కేజ్రీవాల్ మచ్చలేని వ్యక్తి. ప్రతి విషయంలోనూ నిజాయతీగా వ్యవహరిస్తున్న ఆయన నిర్భయుడు కూడా. రాజకీయంగా కేజ్రీవాల్ చేస్తున్న పోరాటాలు ఎందరిలోనో ఉత్తేజాన్ని నింపాయి. మరెందరికో స్ఫూర్తినిచ్చాయి. అవసరమైన సమయంలో దూకుడుగా వ్యవహరిస్తూ, సహనాన్ని కోల్పోకుండా ఆయన ముందుకెళ్తున్న తీరు చాలా గొప్పగా ఉంటోంద’ న్నారు. ప్రస్తుత రాజకీయాల గురించి, బీజేపీ, కాంగ్రెస్‌ల గురించి అడిగినప్పుడు ఆయన మాట్లాడుతూ... ‘చాలామందికి నేనే ఇప్పటిదాకా ఏం చేశానో తెలియదు. కానీ ఇటీవలే వచ్చిన ఆప్ ప్రజలకు ఏం చేసిందో చాలా మందికి తెలుసు. గత కొన్ని రోజులుగా నేను చేస్తున్న ప్రచారంతో ఈ విషయం స్పష్టమవుతోంది.1989లో రాజీవ్‌కు ప్రత్యర్థిగా నేను బరిలోకి దిగినప్పుడు నా విషయంలో చాలా తక్కువగా అంచనా వేశారు. అయితే జనతాదళ్ మాత్రం నేను సరైన పోటీనిస్తానని భావించింది. అప్పట్లో బోఫోర్స్, అవినీతి వంటివాటిపై నేను చాలానే పోరాడాను. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. నేనిప్పుడు తప్పకుండా గెలుస్తానని ఆప్ భావిస్తోంది. ఏదేమైనా నేనో విషయం మాత్రం చెప్పగలను. ఈ లోక్‌సభ ఎన్నికల్లో ఆప్ అభ్యర్థులు సాధించే విజయం చాలామందికి ఆశ్చర్యం కలిగిస్తుంది. ఇక బీజేపీ గురించి చెప్పాలనుకుంటే ఆ పార్టీకి మోడీ ఓ గుర్తుగా మారిపోయారు. దేశంలోని ప్రతిమూలకు వెళ్లి ఆయన ప్రచారం చేస్తున్నారు. మరోవైపు ఆ పార్టీ పెద్దలు పొత్తుల కోసం ప్రయత్నిస్తున్నారు. దీనినిబట్టి మోడీ ప్రచారంపై ఆ పార్టీ పెద్దల్లోనే నమ్మకమున్నట్లు కనిపించడంలేదు. అదే ఆప్ విషయానికి వస్తే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటింది. కేవలం ఏడాది వయసున్న పార్టీ దేశవ్యాప్తంగా సత్తా చాటగలదా? అనే అనుమానం చాలామందిలో ఉంది. అయితే ఆప్‌పై ప్రజల్లో ఉన్న విశ్వాసం చాలా గొప్పది. ఇప్పటికే మారుమూల గ్రామాల్లో కూడా ఆప్ గురించి మాట్లాడుకుంటున్నారు. అనూహ్య ఫలితాలు సాధించేందుకు ఇది చాలదా?’ అని అన్నారు. -
ఆప్ లో చేరిన మహాత్మాగాంధీ మనవడు
న్యూఢిల్లీ: మహత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు.అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నఆప్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విధానాలు తనకు నచ్చడంతో పార్టీలో చేరినట్టు రాజ్ మోహన్ తెలిపారు.దేశంలో అవినీతి హెచ్చరిల్లి ధనిక, పేదల మధ్య తారతమ్యం పెరిగిపోయిందన్నారు.అవినీతిని రూపుమాపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నపోరాటం తనను ఆకట్టుకుందన్నారు. ఆప్ తరుపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాగా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై మాత్రం నిరాకరించారు. ఈ 78 ఏళ్ల రాజ్ మోహన్ గాంధీ.. గతంలో ఆమేథీ నుంచి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేశారు. -
జిన్నా ప్రధానైతే దేశ విభజన ఆగేది!
‘‘దేశ విభజనను నివారించడానికి మహాత్ముడు ప్రథమ ప్రధానిగా జిన్నాను ప్రతిపాదించగా ఆయన అనుయాయులే దాన్ని వ్యతిరేకించారు’’. ఇటీవల హైదరాబాద్ వచ్చిన గాంధీ మనుమడు రాజ్‌మోహన్ గాంధీతో ఇంటర్వ్యూ సారాంశం. కాలరేఖపై దేశం చేసే పయనంలో ‘రియర్ మిర్రర్’ ప్రయోజనం ఏమిటి? గతంలోకి జారుతున్న వర్తమానం కనిపిస్తుంది. భవిష్యత్తుపై ప్రభావం చూపగల వెనుకటి దృశ్యాలూ కనిపిస్తాయి. ‘అవర్ రిపబ్లిక్: ఫ్లాషెస్ ఫ్రం రేర్ వ్యూ మిర్రర్’ అనే అంశంపై మాట్లాడేందుకు రాజ్‌మోహన్‌గాంధీ హైద్రాబాద్ లిటరరీ ఫెస్టివల్‌కు విచ్చేశారు. ఆయన మహాత్మాగాంధీకి తండ్రి వైపు, చక్రవర్తుల రాజగోపాలాచారికి తల్లి వైపు మనుమడు. రాజ్‌మోహన్ తన 16వ ఏట నుంచి రాజకీయ రచయిత. గతంలో రాజ్యసభ సభ్యునిగా, ప్రస్తుతం వివిధ విశ్వవిద్యాలయాలలో రాజకీయ చరిత్ర ప్రొఫెసర్‌గా, అంతర్జాతీయ మానవహక్కుల సంఘం జ్యూరీ మెంబర్‌గా సేవలందిస్తున్నారు. బహుగ్రంథ కర్త అయిన ఆయన శాంతిస్థాపన అనే తాతగారి ఆశయ సాధనకు తనదైన మార్గంలో కృషి చేస్తున్నారు. గత శనివారం ఆయన తన తాజా పుస్తకం ‘పంజాబ్: ఎ హిస్టరీ ఫ్రం ఔరంగజేబ్ టు మౌంట్ బాటెన్’ను కొన్న పాఠకులకు ఆటోగ్రాఫ్‌లు ఇస్తూ, ‘సాక్షి’తో మాట్లాడారు. ‘అహాల సంఘర్షణ’ విపరీతాలకు కారణం వ్యక్తుల అహాల మధ్య సంఘర్షణ వల్లే దేశ చరిత్రలో విపరీతాలు చోటు చేసుకున్నాయి. ఉదాహరణకు ఉమ్మడి భారత దేశానికి ప్రధానమంత్రిగా మహమ్మదాలీ జిన్నాను గాంధీజీ ప్రతిపాదించారు. నెహ్రూ, వి.పి.మీనన్ తదితరులు అందుకు అం గీకరించలేదు. గాంధీజీ వైఖ రిని సమర్థిస్తారా? అని ప్రశ్నిస్తే, అవుననే అంటాను. దేశ విభజనను నివారించగలిగితే లక్షలాది మంది ఇరువైపులా హతమయ్యేవారు కాదు. వందల కోట్ల డాలర్ల ప్రజాధనం పరస్పర హననానికి ఆవిరయ్యేది కాదు. రాజకీయ సమానత్వా న్ని ఆచరణలోకి తేవాల్సిన అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం ఎమర్జెన్సీ (1975-1977) రూపంలో నియంతృత్వాన్నీ చవిచూసింది. ఆ తర్వాత ప్రధాని పదవికి పోటీపడ్డ మొరార్జీదేశాయ్-చరణ్‌సింగ్-జగజ్జీవన్‌రామ్‌ల మధ్య ‘అహం’ కారణంగానే ‘జనతాపార్టీ’ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చింది. వీపీ సింగ్-చంద్రశేఖర్-దేవీలాల్ల మధ్య అదే కథ పునరావృతం అయ్యింది. రాజకీయ ఆశయ సాధనకు వ్యక్తులు తమ అహాలను పక్కన పెట్టడం అవసరం. జిన్నాను ప్రధానిని చేయాలన్న మహా త్ముని ప్రతిపాదనకు వ్యతిరేకంగా ఆయన సహచరులు ‘గాంధీ ప్లాన్‌ను చిత్తుచేయడానికి అనుసరించాల్సిన ఎత్తుగడల’తో ఏకమయ్యారు. వారిని నిందించకుండా, వైఫల్యాలకు బాధ్యతవ హిస్తున్నాను అనే ఔదార్యం మహాత్మా గాంధీలో కనిపిస్తుంది. దేశ విభజనను కమ్యూనిస్టులు కూడా ఆపలేకపోయారు. భగత్‌సింగ్ గొప్ప సాహసి. అభ్యుదయవాది. పంజాబ్‌లో అభ్యుదయ రచయితలు, కార్యకర్తలు ఎంద రో ఉన్నారు. కానీ భగత్‌సిం గ్, కమ్యూనిస్టుపార్టీల ప్రభా వం నిర్ణయాత్మక శక్తిగా లేదు. దేశం ఎలాగూ విడిపోతుంది. మనమూ పరిస్థితులకు అనుగుణంగా మారదామని కమ్యూనిస్టు కార్యకర్తల్లో ఎక్కువ మంది భావించారు. దేశ విభజ నను వ్యతిరేకించిన సరిహద్దు గాంధీ (ఖాన్ అ బ్దుల్ గఫార్ ఖాన్) ఇంగ్లిష్ పాలనలో 12 ఏళ్లు జైల్లో ఉంటే పాకిస్థాన్ ఏర్పడ్డాక అంతకంటే ఎక్కుకాలం జైల్లో ఉన్నారు! దేశ విభజనను వ్యతిరేకించిన కారణంగా ఆయన అనుచరు లు వందలాదిగా హత్యలకు గురయ్యారు! బ్రిటిష్ పాలన మంచి చెడ్డలు! ‘లాభం’ కోసం సాగిన బ్రిటిష్ పాలనలో మం చి-చెడ్డలున్నాయి. న్యాయవ్యవస్థ ఏర్పాటు, రాష్ట్రాల పాలనాధికారం తదితర అంశాల్లో వా రు ప్రజాస్వామ్యబద్ధంగానే వ్యవహరించారు. కానీ, వారు భారతీయులకంటే తాము అధికులమని భావించారు. ఒక తెల్ల నిందితునిపై తీర్పు చెప్పేందుకు ఒక భారతీయ న్యాయమూర్తి అర్హుడు కాదు అని ‘లండన్టైమ్స్’ వం టి పత్రికలు అభిప్రాయపడ్డాయి. ఈ ‘ఆధిక్యతాభావం’ గురించి తెల్ల సమాజంలోనే చర్చసాగింది. ఆధిక్యతాభావం తెల్లవాడికి మాత్ర మే ఉన్నదా? మనం ఏర్పరచుకున్న ఆధిక్యతాభావాల మాటేమిటి! ఒకరినొకరు తెలుసుకోవాలి! దేశ విభజన నాటి ఘటనల గురించి చెప్పగలి గినంతగా దక్షిణాది రాష్ట్రాల గురించి చెప్పలేను. సైన్యంలో ప్రాంతాల వారీగా బెటాలి యన్లున్నాయి. వాటివల్ల సమస్యలున్నాయి. అనుకూలతలూ ఉన్నాయి. తమ ప్రాంతం, తమ భాష అనే అభిమానాన్ని తప్పు పట్టాల్సిందేముంది? తమ రాష్ట్రాన్ని, ప్రాంతాన్ని, భాషను ప్రేమించని వారు దేశాన్నెలా ప్రేమిస్తారు? భిన్న మతాలు, ప్రాంతాలు, భాషలు, సంస్కృతులు ఉన్న మన దేశంలో ఏ సమూహానికి ఆ సమూహం విడిగా ఉంటోంది. అదీ ప్రధాన సమస్య. ముందుగా తామేమిటో ఆలోచించాలి. ఇతరులతో మాట్లాడాలి, అర్థం చేసుకోవాలి, అపోహలను గుర్తించాలి. తొల గించుకునేందుకు కృషి చేయాలి. దురదృష్టవశాత్తూ భారతీయులు ఒకరినొకరు తెలుసుకోవడంలో దారుణమైన అలసత్వాన్ని పాటిస్తున్నారు. రచయితలు ఈ ఆవశ్యకతను గుర్తించి తమ పాత్రను నిర్దేశించుకోవాలి. - పున్నా కృష్ణమూర్తి