న్యూఢిల్లీ: మహత్మా గాంధీ మనవడు రాజ్ మోహన్ గాంధీ ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)లో చేరారు.అవినీతికి వ్యతిరేకంగా పోరాడుతున్నఆప్ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ విధానాలు తనకు నచ్చడంతో పార్టీలో చేరినట్టు రాజ్ మోహన్ తెలిపారు.దేశంలో అవినీతి హెచ్చరిల్లి ధనిక, పేదల మధ్య తారతమ్యం పెరిగిపోయిందన్నారు.అవినీతిని రూపుమాపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ చేస్తున్నపోరాటం తనను ఆకట్టుకుందన్నారు.
ఆప్ తరుపున ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. కాగా ఎక్కడ నుంచి పోటీ చేస్తారనే దానిపై మాత్రం నిరాకరించారు. ఈ 78 ఏళ్ల రాజ్ మోహన్ గాంధీ.. గతంలో ఆమేథీ నుంచి మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి వ్యతిరేకంగా పోటీ చేశారు.