విష్ణువర్ధన్‌కు టైటిల్
కోల్‌కతా: ఆసియా టెన్నిస్ టూర్ టోర్నమెంట్లో హైదరాబాద్ ప్లేయర్ విష్ణువర్ధన్ విజేతగా నిలిచాడు. బుధవారం జరిగిన పురుషుల సింగిల్స్ ఫైనల్లో విష్ణు 6-3, 6-4తో భారత్‌కే చెందిన రంజిత్ విరాళీ మురుగేశన్‌పై విజయం సాధించాడు. ఆరంభంలో తన సర్వీస్‌ను కోల్పోయిన విష్ణు ఆ వెంటనే తేరుకున్నాడు. పదునైన సర్వీస్‌లకు విజృంభించడంతోపాటు రంజిత్ సర్వీస్‌ను బ్రేక్ చేసి తొలి సెట్‌ను దక్కించుకున్నాడు. రెండో సెట్లో తొమ్మిదో గేమ్‌లో రంజిత్ సర్వీస్‌ను బ్రేక్ చేసిన విష్ణు ఆ తర్వాత తన సర్వీస్‌ను కాపాడుకొని సెట్‌తోపాటు మ్యాచ్‌ను సొంతం చేసుకున్నాడు.