రథోత్సవంలో అపశ్రుతి
పందికుంట(వజ్రకరూరు) : మండల పరిధిలోని పందికుంట గ్రామంలో బుధవారం సాయంత్రం శ్రీరామ నవమి వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకుంది. సీతారాముల విగ్రహాలను ఊరేగిస్తుండగా ఒక్కసారిగా రథం కిందపడిపోయింది. భక్తులకు ఎలాంటి హానీ జరగకపోయినా అందులో ఉన్న అర్చకుడికి స్వల్ప గాయాలయ్యాయి.