రీపోలింగ్‌లో రిగ్గింగ్!
కొండాపురం: బ్యాలెట్ పేపర్లను చెదలు తినేయడంతో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కొండాపురం మండలం తూర్పుయర్రబల్లి ఎంపీటీసీ పరిధిలో ఆదివారం రీపోలింగ్ నిర్వహించారు. ఈ సెగ్మెంట్ పరిధిలోని పొట్టిపల్లి, ఇస్కదామెర్ల, మన్నంవారిపల్లిలో పోలింగ్ జరిగింది.
అయితే పొట్టిపల్లిలో టీడీపీ కార్యకర్తలు రిగ్గింగ్‌కు పాల్పడ్డారని వైఎస్సార్సీపీ కార్యకర్తలు తెలిపారు. తమ ఏజెంట్లను బయటకు నెట్టేసి ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, ఒక్కొక్కరు రెండు, మూడు ఓట్లు వేశారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు, పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారని, ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళతామన్నారు.