Reconsider
-
2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం
న్యూఢిల్లీ: సివిల్, క్రిమినల్ కేసుల్లో హైకోర్టు లేదా దిగువ కోర్టులి2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన స్టేలు 6 నెలల తర్వాత ప్రత్యేకంగా పొడిగింపు ఆదేశాలివ్వకుంటే వాటంతటవే రద్దవుతాయంటూ 2018లో ఇ2018 తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనంన తీర్పుపై పునఃసమీక్షకు రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీంకోర్టు నిర్ణయించింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 226 ప్రకారం సంక్రమించిన అధికారాలను 2018 నాటి తీర్పుతో హైకోర్టులు కోల్పోయాయంటూ అలహాబాద్ హైకోర్టు బార్ అసోసియేషన్ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాల ధర్మాసనం విచారణ చేపట్టింది. సీనియర్ లాయర్ రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. అప్పటి తీర్పుపై సమీక్షను రాజ్యాంగధర్మాసనానికి అప్పగిస్తామని తెలిపింది. -
క్షమాపణపై పునరాలోచించుకోండి
న్యూఢిల్లీ: కోర్టు ధిక్కరణ కేసులో క్షమాపణ కోరబోనన్న న్యాయవాది ప్రశాంత్ భూషణ్ పునరాలోచించుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది. భేషరతుగా క్షమాపణ చెప్పడానికి ఈనెల 24 దాకా సమయం ఇస్తున్నట్లు తెలిపింది. ప్రశాంత్ భూషణ్ చేసిన కొన్ని ట్వీట్లు న్యాయవ్యవస్థను ధిక్కరించేవిగా ఉన్నాయని, ఆయనను దోషిగా తేలుస్తూ సుప్రీంకోర్టు బెంచ్ ఈనెల 14న తీర్పునిచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో భూషణ్‌కు గరిష్టంగా ఆరునెలల వరకు జైలుశిక్ష లేదా రెండు వేల రూపాయల జరిమానా పడొచ్చు. లేదా రెండు శిక్షలు కలిపి విధించొచ్చు. శిక్ష ఖరారుపై సుప్రీంకోర్టులో గురువారం ఆసక్తికరమైన వాదనలు నడిచాయి. ధిక్కరణ కేసులో శిక్ష ఖరారును మరో బెంచ్ చేపట్టాలని ప్రశాంత్ భూషణ్ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ అరుణ్ మిశ్రా, జస్టిస్ బి.ఆర్.గవాయి, జస్టిస్ కృష్ణ మురారిలతో కూడిన బెంచ్ నిర్ద్వందంగా తిరస్కరించింది. ధిక్కార పూరిత ప్రకటన, న్యాయవ్యవస్థను ధిక్కరిస్తూ చేసిన ట్వీట్లపై క్షమాపణలు చెప్పే విషయంపై నిర్ణయం తీసుకునేందుకు ప్రశాంత్ భూషణ్‌కు ఈనెల 24 దాకా గడువు ఇచ్చిం ది. ఇందుకు ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ తన న్యాయవాదులతో సంప్రదించిన తరువాత కోర్టు ఇచ్చిన సలహాపై నిర్ణయం తీసుకుంటానని తెలిపారు. అంతకుమునుపు అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్ బెంచ్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ ‘ధిక్కరణ కేసులో ఇప్పటికే దోషిగా నిర్ధారించిన నేపథ్యంలో ప్రశాంత్ భూషణ్‌కు అదనంగా ఎలాంటి శిక్ష విధించవద్దని అభ్యర్థించారు. తన ట్వీట్లపై క్షమాపణలు చెప్పరాదన్న ప్రశాంత్ భూషణ్ నిర్ణయంపై పునరాలోచించకపోతే వేణుగోపాల్ అభ్యర్థనను పరిగణించలేమని బెంచ్ స్పష్టం చేసింది. ప్రశాంత్ భూషణ్ తన తప్పును తెలుసుకుంటే తామూ ఉదారంగా వ్యవహరిస్తామని స్పష్టం చేసిన బెంచ్ తదుపరి విచారణను 25వ తేదీకి వాయిదా వేసింది. శిక్ష ఖరారును ఆపడం కుదరదు ధిక్కరణ కేసులో సమీక్ష కోసం వేయనున్న రివ్యూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేవరకూ శిక్ష ఖరారు చేయకూడదనే ప్రశాంత్ భూషణ్ అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. అయితే రివ్యూ పిటిషన్‌పై విచారణ పూర్తయ్యేంతవరకు శిక్ష అమలును నిలిపి ఉంచుతామని తెలిపింది. ఖరారు విచారణను ఇంకో బెంచ్‌కు బదిలీ చేయడం సంప్రదాయలకు విరుద్ధమవుతుందని, గతంలో ఇలా ఎప్పుడూ జరగలేదని బెంచ్ స్పష్టం చేసింది. ప్రతిదానికీ ఒక లక్ష్మణ రేఖ ఉంటుందని, భూషణ్ దాన్ని అతిక్రమించారని కోర్టు అభిప్రాయపడింది. త్వరలో తాను పదవీ విరమణ చేస్తున్న కారణంగా ఈ కేసులో వాయిదాలు కోరరాదని జస్టిస్ అరుణ్ మిశ్రా ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యంలో రాజ్యాంగ విలువలు కాపాడేందుకు సద్విమర్శకు తావు ఉండాలని, ఆ విలువలను కాపాడే ఉన్నత లక్ష్యంతోనే తాను ఆ ట్వీట్లు చేశానని ప్రశాంత్ వివరించారు. ‘‘దయ చూపాలని అడగను. ఉదాత్తంగా వ్యవహరించమనీ కోరను. ఈ కోర్టు ఏ శిక్ష విధించినా సంతోషంగా స్వీకరిస్తా’’అని స్పష్టం చేశారు. -
ఫీజుల పెంపుపై పునరాలోచించండి
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా లాక్డౌన్ అమల్లో ఉన్న నేపథ్యంలో ప్రైవేట్ స్కూళ్లు తమ వార్షిక ఫీజుల పెంపుపై, మూడు నెలలకోసారి ఫీజులు వసూలు చేయడంపై పునరాలోచన చేయాలని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ శుక్రవారం కోరారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రుల సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఫీజుల పెంపుపై తగిన నిర్ణయం తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించారు. కొన్ని రాష్ట్రాలు పాఠశాల ఫీజుల పెంపుపై ఇప్పటికే కొన్ని సానుకూల చర్యలు చేపట్టాయనీ, ఇతరులు కూడా ఇదే మార్గం అనుసరిస్తారని ఆశిస్తున్నట్లు ట్విట్టర్లో పేర్కొన్నారు. కరోనా పోరాటంలో అన్ని పాఠశాలలు కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. ఇలా ఉండగా.. లాక్డౌన్ సమయంలో అనుమతి లేకుండా ప్రైవేట్ స్కూళ్లు ఫీజులు పెంచరాదని ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. స్కూళ్లు మళ్లీ తెరుచుకునేంత వరకూ ట్యూషన్ ఫీజులు మాత్రమే వసూలు చేయాలని ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా చెప్పారు. ఫీజులు చెల్లించాలంటూ పాఠశాలల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రులపై ఒత్తిడి తీసుకురావొద్దని రాజస్తాన్, పంజాబ్, హరియాణా, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వాలు ఆదేశించాయి. అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకోండి: సీబీఎస్ఈ దేశవ్యాప్త లాక్డౌన్ నేపథ్యంలో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు ఉపాధ్యాయుల వేతనాలు, స్కూలు ఫీజుల చెల్లింపులపై అందరి ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) శుక్రవారం కోరింది. కరోనా మహమ్మారి విజృంభిస్తున్న తరుణంలో ఫీజుల అంశంపై తగిన పరిష్కారం కనుగొనాలని రాష్ట్రాలను కోరినట్లు సీబీఎస్ఈ కార్యదర్శి అనురాగ్ త్రిపాఠీ తెలిపారు. -
సీఏఏ-ఎన్నార్సీ-ఎన్పీఆర్ వద్దు
కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ) అమలుపై పునరాలోచన చేయాలని, జాతీయ పౌర పట్టిక(ఎన్నార్సీ), జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)లను వెనక్కి తీసుకోవాలని ప్రధాని మోదీని కోరినట్లు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. రాష్ట్రంలో రెండు రోజుల పర్యటనకుగాను శనివారం కోల్‌కతా వచ్చిన మోదీతో రాజ్‌భవన్‌లో మమత సమావేశమయ్యారు. అనంతరం మమత నేరుగా టీఎంసీ చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొన్నారు. ప్రధాని వచ్చిన సమయంలో కోల్‌కతా విమానాశ్రయం వెలుపల, మార్గమధ్యంలోని ఫ్లై ఓవర్ వద్ద జాతీయ పతాకాలు, నల్ల జెండాలతో ఆందోళనకారులు సీఏఏ వ్యతిరేక నినాదాలు చేశారు. నగరంలోని పలు ప్రాంతాల్లో వామపక్ష సంఘాల కార్యకర్తలు ప్రధాని దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆందోళనల నేపథ్యంలో నగరంలోని కీలకప్రాంతాల్లో పోలీసులను మోహరించారు. సీఏఏ వెనక్కి తీసుకోవాలని కోరా ‘ఇది మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశం. కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన రూ.28 వేల కోట్ల ఆర్థిక సాయం గురించి ప్రధానితో చర్చించాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆందోళనల గురించి ఆయనకు తెలిపాను. సీఏఏ, ఎన్నార్సీ, ఎన్పీఆర్లకు మేం వ్యతిరేకమని చెప్పాను. ఈ విషయంలో కేంద్రం కూడా పునరాలోచన చేయాలని, సీఏఏను వెనక్కి తీసుకోవాలని కోరాను. సామాన్యులపై వివక్ష, వారిని వేరుగా చూడటం, వేధించ డం తగదని చెప్పా’ అని మమత అన్నారు. ‘ఢిల్లీకి వస్తే చర్చిద్దాం’ అని అన్నారని మమత చెప్పారు. బేలూరు మఠంలో ప్రధాని బస మోదీ శని, ఆదివారాల్లో జరిగే కోల్‌కతా పోర్ట్ 150వ వార్షికోత్సవం తదితర కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈ సందర్భంగా నేతాజీ ఇండోర్ స్టేడియంలో జరిగే కార్యక్రమంలో ప్రధానితోపాటు గవర్నర్ ధన్కర్, సీఎం మమత ఒకే వేదికపై కనిపించనున్నారు. శనివారం రాత్రి ఆయన హౌరా జిల్లాలో ఉన్న రామకృష్ణ మిషన్ ప్రధానకార్యాలయం బేలూర్ మఠంలో బస చేశారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ, తదితర ప్రముఖులు ఎందరో ఈ మఠాన్ని గతంలో పలుమార్లు సందర్శించినప్పటికీ ఎవరూ కూడా అక్కడ బస చేయలేదని మఠం అధికారులు తెలిపారు. మమతకు వ్యతిరేకంగా సీపీఎం ఆందోళన ప్రధాని మోదీతో సీఎం మమతా బెనర్జీ సమావేశం కావడంపై వామపక్ష విద్యార్థి సంఘాలు నిరసన తెలిపాయి. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చూస్తూ టీఎంసీ విద్యార్థి విభాగం ధర్నా జరుగుతుండగా అక్కడ పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను విరగ్గొట్టారు. మోదీతో భేటీపై మమతా వివరణ ఇవ్వాలని డిమాండ్ చేశారు. మోదీతో భేటీ.. ఆ వెంటనే ధర్నా.. ప్రధానితో సమావేశం అనంతరం సీఎం మమత నేరుగా అక్కడికి సమీపంలోనే టీఎంసీ విద్యార్థి విభాగం చేపట్టిన సీఏఏ వ్యతిరేక ధర్నాలో పాల్గొనేందుకు వెళ్లారు. సీఏఏ అమలుపై హోం శాఖ జారీ చేసిన గెజిట్‌పై ఆ ధర్నాలో ఆమె మాట్లాడారు. ‘రాష్ట్రంలో సీఏఏ చట్టం కాగితాలపైనే ఉంటుంది. దీనిని అమలు చేసే ప్రసక్తే లేదు. పార్లమెంట్లో మెజారిటీ ఉంది కాబట్టి ఇష్టం వచ్చినట్లు చేయడం కుదరదు’అని తెలిపారు. -
కాంగ్రెస్‌కు మద్దతుపై పునరాలోచిస్తా
లక్నో: మధ్యప్రదేశ్, రాజస్తాన్ లలో ఇటీవల ఏర్పాటైన కాంగ్రెస్ ప్రభుత్వాలకు బహుజన్ సమాజ్ పార్టీ(బీఎస్పీ) అధినేత్రి మాయవతి వార్నింగ్ ఇచ్చారు. తమ కార్యకర్తలపై పెట్టిన కేసులను తక్షణమే ఉపసంహరించుకోకుంటే మద్దతు విషయంలో పునరాలోచిస్తామని స్పష్టం చేశారు. ‘2018 ఏప్రిల్ 2న చేపట్టిన భారత్ బంద్ సందర్భంగా అమాయకులైన మా పార్టీ కార్యకర్తలపై అప్పటి బీజేపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కేసులు పెట్టింది. ఇటీవల అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వాలు ఆ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి. లేకుంటే వెలుపలి నుంచి మద్దతు కొనసాగింపుపై పునరాలోచించాల్సి ఉంటుంది’ అని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ‘ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వాల హామీలు, ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. దీంతో బీజేపీ, కాంగ్రెస్ ప్రభుత్వాల పాలన ఒకే మాదిరిగా ఉందని ప్రజలు భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లోనే కాంగ్రెస్‌కు హెచ్చరిక చేయాల్సిన అవసరం ఏర్పడింది’ అని తెలిపారు. -
శిఖా శర్మకు ఆర్బీఐ చెక్?
సాక్షి, ముంబై: ఆర్థికరంగంలో ఆణిముత్యాలుగా రాణించిన బ్యాంకుల మహిళా ఉన్నతాధికారులకు వరుసగా ఇబ్బందుల్లో చిక్కుకోవడం ఆందోళన పుట్టిస్తోంది. ఇప్పటికే ఐసీఐసీఐ సీఎండీ చందా కొచ్చర్ వీడియోకాన్ రుణాల విషయంలో ఆరోపణలు, ఆమె భర్త సీబీఐ ప్రాథమిక దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. తాజాగా మరో బ్యాంకు అధికారికి ఆర్బీఐ రూపంలో చిక్కులు మొదలయ్యాయి. యాక్సిస్ బ్యాంకు సీఈవో శిఖాశర్మ పదవీకాలం పొడిగింపుపై రిజర్వ్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా అభ్యంతరాలు వ్యక్తం చేసింది. ఈ విషయంలో నిర్ణయాన్ని పునరాలోచించాల్సిందిగా యాక్సిస్ బ్యాంకు బోర్డును కోరడం ఇపుడు ఆసక్తికరంగా మారిది. సీఈవోగా వరుసగా నాలుగోసారి శిఖా శర్మను కొనసాగిస్తూ ఇప్పటికే యాక్సిస్ బ్యాంక్ బోర్డు సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై పునరాలోచన చేయమని ఆర్బీఐ సూచించినట్లు బ్యాంకు వర్గాల సమాచారం. ఈ మేరకు బ్యాంకు ఛైర్మన్ సంజీవ్ మిశ్రాకు ఒక లేఖ రాసినట్టుగా తెలుస్తోంది. ముఖ్యంగా మొండి బకాయిల విషయంలో ఆందోళన వ్యక్తం చేసిన రెగ్యులేటరీ అన్ని బ్యాంకుల ఎగ్జిక్యూటివ్ అపాయింట్ మెంట్ల విషయంలో జాగ్రత్త వహించాలని ఇప్పటికే పలు బ్యాంకులను కోరింది. ఇందులో భాగంగానే శిఖాశర్మ పదవి కొనసాగింపుపై కూడా ఆర్బీఐ సూచనలు చేసింది. దీనికితోడు గత సంవత్సరం అక్టోబర్ లోనే యాక్సిస్ బ్యాంకు మొండి బాకీల అంచనా లెక్కల్లో లోపాలు తలెత్తడంతో ఆర్బీఐ రూ.3 కోట్ల పెనాల్టీ విధించిన సంగతి తెలిసిందే. మరోవైపు దీనిపై వ్యాఖ్యానించడానికి యాక్సిస్ బ్యాంక్ ప్రతినిధి నిరాకరించారు. ఆర్బీఐ, బ్యాంకు మధ్య కమ్యూనికేషన్స్ కచ్చితంగా గోప్యంగా ఉండాలన్నారు. సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ల నియామకాలపై బ్యాంకు బోర్డు ఒక ప్రామాణిక ప్రక్రియను అనుసరిస్తుందనీ, అనంతరం ఈ సిఫారసులను ఆర్బీఐకి పంపిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ ప్రక్రియ పురోగతిలో ఉందనీ, ఈ అంశంపై తుది నిర్ణయంపై తమకు ఎలాంటి సమాచారం లేదని తెలిపారు. అటు ఆర్బీఐ నుంచి కూడా ఈ అంచనాలపై అధికారికంగా ఎలాంటి ప్రకటనా లేదు. కాగా శిఖాశర్మ 2009లో తొలిసారి సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. వరుసగా మూడుస్లారు సీఈవోగా బాధ్యతలు చేపట్టగా, రానున్న జూన్ మాసం నుంచి నాలుగవసారి సీఈవోగా ఆమె పదవీకాలం ప్రారంభం కానుంది. అయితే తొలి నుంచి శిఖాశర్మపై మొండిబాకీల విషయంలో ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఆర్బీఐ అభ్యంతరాలు శిఖా శర్మ నియామకంపై నీలినీడలు కమ్ముకున్నట్టేనని మార్కెట్ వర్గాల విశ్లేషణ. -
ప్రైవేటుకు ‘డయాగ్నస్టిక్’లపై పునరాలోచన
♦ నిధులు పక్కదారి పడతాయన్న విమర్శలతో వెనక్కి తగ్గిన సర్కారు ♦ పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే.. ♦ జిల్లా, ఆపై స్థాయి ఆస్పత్రుల్లో మాత్రం ప్రైవేటుకు ఇవ్వాలనే యోచన ♦ వారం పది రోజుల్లో నిర్ణయం తీసుకునే అవకాశం సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఆసుపత్రుల్లో నెలకొల్పాలనుకున్న డయాగ్నస్టిక్ (వైద్య పరీక్షల) కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాలన్న ప్రతిపాదనపై ప్రభుత్వం పునరాలోచనలో పడింది. ఈ ప్రతిపాదనపై విమర్శలు వ్యక్తం కావడం, అధికారుల్లోనూ భిన్నాభిప్రాయాలు వ్యక్తం కావడంతో... ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించింది. పీహెచ్‌సీలు, ఏరియా ఆస్పత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్ కేంద్రాలను ఏర్పాటు చేసి... జిల్లా, బోధనాస్పత్రుల వంటి వాటిలో ప్రైవేటుకు అప్పగిస్తే సరిపోతుందని భావిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వం త్వరలోనే తుది నిర్ణయం వెలువరించనుంది. అన్ని ఆసుపత్రుల్లోనూ.. పీహెచ్‌సీల నుంచి రాష్ట్రస్థాయి ఆసుపత్రుల వరకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించాలని, మందులు సరఫరా చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ (ఎన్హెచ్ఎం) రాష్ట్రాలను ఆదేశించింది. ఈ మేరకు డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పాలని సూచించింది. ఇందుకు నిధులను ఎన్హెచ్ఎం ఇస్తున్నా... డయాగ్నస్టిక్ కేంద్రాల ఏర్పాటు అంశాన్ని రాష్ట్రాలకే అప్పగించింది. దీనికి సంబంధించి తమిళనాడు ప్రభుత్వం ఆ రాష్ట్రంలోని ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పాలని నిర్ణయించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మొత్తంగా ప్రైవేటు ఏజెన్సీకే అప్పగిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా తొలుత ‘ప్రైవేటు’ బాట పట్టాలనే నిర్ణయిం చింది. కానీ విమర్శలు రావడంతో ప్రభుత్వం వెనక్కి తగ్గింది. ఈ విషయంలో ఒకట్రెండు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి చెప్పారు. ఈ అంశంపై ఏర్పాటైన నిపుణుల కమిటీ వారం పది రోజుల్లో ఒక కీలక నిర్ణ యం తీసుకుని మార్గదర్శకాలు ఖరారు చేస్తుందని ఆయన తెలిపారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆధ్వర్యంలో.. పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రైవేటు ఏజెన్సీలకు డయాగ్నస్టిక్‌లు అప్పగిస్తే వాటిని పర్యవేక్షించే పరిస్థితి ఉంటుందా అని అధికారులకు సందేహం తలెత్తింది. ‘ప్రైవేటు’కు అప్పగిస్తే వైద్య సిబ్బందితో కుమ్మక్కై... వైద్య పరీక్షలు చేయకుండానే చేసినట్లు చూపితే నిధులు పక్కదారి పడతాయని కొందరు అధికారులు సర్కారు దృష్టికి తీసుకొచ్చారు. అందువల్ల పీహెచ్‌సీలు, ఏరియా ఆసుపత్రుల్లో ప్రభుత్వమే డయాగ్నస్టిక్ కేంద్రాలను నెలకొల్పి, ఇప్పటికే ఉన్న టెక్నీషియన్స్‌తో నడిపించాలని యోచిస్తున్నట్లు శాఖ ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. రూ. 4 లక్షలు విలువచేసే ఒక ఆటోమేటిక్ వైద్య పరీక్షల యంత్రాన్ని ఏర్పాటు చేస్తే... రక్త, మూత్ర పరీక్షలను ఆటోమేటిక్‌గా చేసి రిపోర్టులు ఇస్తుందని చెప్పారు. ఆ యంత్రం కూడా ఆస్పత్రిలోనే ఉండిపోతుందని పేర్కొన్నారు. ఇక జిల్లా, బోధనాసుపత్రులు, ఆపై స్థాయి ఆసుపత్రుల్లో మాత్రం డయాగ్నస్టిక్ కేంద్రాలను ప్రైవేటు ఏజెన్సీకే అప్పగించాలని యోచిస్తున్నారు. ఇక్కడ పర్యవేక్షణ ఇబ్బంది కాదని... చిన్న, పెద్ద అని కాకుండా ప్రతీ వైద్య పరీక్షకు నిర్ణీత సొమ్మునే చెల్లించాలని భావిస్తున్నారు. రక్త పరీక్ష చేసినా, అధిక ఖర్చయ్యే బయాప్సీ పరీక్ష చేసినా అన్నింటికీ రూ. 230 చొప్పున ప్రైవేటు ఏజెన్సీకి ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు తెలిసిం ది. వాస్తవానికి ఉచిత వైద్య పరీక్షలు, మం దుల కోసం రూ.70 కోట్ల మేరకు ఎన్హెచ్ఎం కేటాయించనుందని సమాచారం. వైద్య ఉద్యోగ సంఘాలు, కొందరు అధికారులు ప్రభుత్వ ఆధ్వర్యంలోనే డయాగ్నస్టిక్‌లు నెలకొల్పాలని కోరుతున్నారు. -
నదీముఖ రాజధానిపై పునరాలోచన!
తుపాను బీభత్సం నేపథ్యంలో సర్కారు తర్జనభర్జనలు విశాఖ నగరం దెబ్బతిన్న తీరుపై దృష్టి కృష్టా నదికి గతంలో వచ్చిన భారీ వరదలు పరిగణనలోకి.. ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవంటున్న నిపుణులు ప్రభుత్వ పెద్దల ముందు అధికారుల తాజా ప్రతిపాదనలు మళ్లీ తెరపైకి నూజివీడు, విజయవాడ-ఏలూరు మధ్య ప్రాంతం హైదరాబాద్: నదీముఖ రాజధాని (రివర్ వ్యూ) నిర్మాణం విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. అన్ని విధాలా లాభనష్టాలు బేరీజు వేసుకుని నిర్ణయానికి రావాలని భావిస్తోంది. హుదూద్ తుపాను సృష్టించిన బీభత్సం నేపథ్యంలో రాజధాని నిర్మాణంపై తర్జనభర్జనలు మొదలయ్యాయి. గుంటూరు జిల్లా అమరావతి మండలం ైవె కుంఠపురం నుంచి తాడేపల్లి మండలం సీతానగరం వరకు, కృష్ణా జిల్లాలో విజయవాడ సమీపంలోని గొల్లపూడి మొదలుకుని కంచికచర్ల వరకు కృష్ణా నదీ ముఖంగా రాజధాని నిర్మించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. అందుకు అనుగుణంగా ప్రణాళికలు కూడా సిద్ధం చేసింది. సీఎం చంద్రబాబు పలు సమీక్షా సమావే శాలు నిర్వహించారు. చివరకు ల్యాండ్ పూలింగ్ విధానంలో భూ సమీకరణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందుకోసం కోసం ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిటీ శుక్రవారం నుంచి మూడురోజుల పాటు కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పర్యటించాల్సి ఉంది. అయితే హుదూద్ తుపాను నేపథ్యంలో ఈ పర్యటన వాయిదా పడింది. అయితే హుదూద్ తుపాను నేపథ్యంలో రాజధాని విషయంలో ప్రభుత్వం పునరాలోచనలో పడినట్టు తెలిసింది. సముద్రానికి అంచున ఉండటం, గాలుల వేగం ఎక్కువగా ఉండటంతో విశాఖ నగరానికి తీవ్ర నష్టం వాటిల్లింది. విద్యుత్, సమాచార వ్యవస్థ కుప్పకూలింది. పరిశ్రమలు మూసి వేయాల్సిన పరిస్థితి నెలకొంది. తిరిగి పూర్వ స్థితికి చేరుకోవాలంటే కనీసం రెండు, మూడు సంవత్సరాలు పట్టొచ్చని అధికారులు అంటున్నారు. కాగా ప్రస్తుతం రాజధాని నిర్మాణాన్ని సంకల్పించిన ప్రాంతంలో సైతం భారీ వరదలకు ఆస్కారం ఉందని నిపుణులు హెచ్చరించడంతో, ఈ విషయంలో తొందరపాటు నిర్ణయాలు తీసుకోరాదని ప్రభుత్వం భావిస్తున్నట్టుగా మంత్రివర్గ ఉపసంఘంలోని సభ్యుడొకరు చెప్పారు. గతాన్ని ప్రస్తావిస్తున్న నిపుణులు కృష్ణా నదీ ముఖ రాజధాని నిర్మాణానికి పరిస్థితులు అనుకూలం కాదని పలువురు నిపుణులు ఇప్పటికే ప్రభుత్వానికి సూచించారు. ఒకవేళ ఈ ప్రాంతంలోనే నిర్మించాలని భావిస్తే ఉధృతమైన వరదలను సైతం తట్టుకునే స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవలసి ఉంటుందని, ఇందుకు అనుకున్నదానికన్నా రెండింతల ఖర్చు అవుతుందన్న అభిప్రాయం ఉంది. గత చరిత్రను పరిశీలిస్తే కృష్ణా నదికి ప్రతి 20 లేదా 30 సంవత్సరాలకు ఒకసారి ఉధృతంగా వరదలు వస్తుంటాయి. 2009 సెప్టెంబర్ తొలి వారంలో కృష్ణా బ్యాక్ వాటర్ వల్ల కర్నూలు నగరం మునిగిపోయింది. ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ప్రస్తుతం రాజధాని ఏర్పాటు చేయాలనుకుంటున్న ైవైకుంఠపురం నుంచి కంచికచర్ల వరకు కృష్ణా నదికి చేరువగానే ఉంటారుు. దీనివల్ల ఎప్పటికైనా ఇబ్బందులు తప్పవని అధికారులు అంటున్నారు. విజయవాడ, ఏలూరు మధ్య రాజధానిని ఏర్పాటు చేస్తే అన్ని రకాలుగా సురక్షితమని వారు చెప్పినట్లు సమాచారం. కృష్ణా జిల్లా నూజివీడు అయితే అటు విజయవాడ, ఇటు ఏలూరుకు మధ్యలో ఉంటుందని కొందరు రాజధాని వ్యవహారాలను పర్యవేక్షిస్తున్న మంత్రివర్గం ఉపసంఘానికి తెలిపినట్టు తెలిసింది. నూజివీడు విజయవాడకు 44 కిలోమీటర్లు, ఏలూరుకు 34 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సముద్రమట్టానికి 88 మీటర్ల(288 అడుగులు) ఎత్తులో ఉంది. అదే మంగళగిరి 43 మీటర్లు(141 అడుగులు), విజ యవాడ 23 మీటర్లు (75 అడుగులు), అమరావతి 36 మీటర్లు(118 అడుగులు) ఎత్తులోనే ఉంటాయని, అందువల్ల నూజివీడు అనువైందని వివరించినట్లు సమాచారం. గతంలో వరదలు వచ్చినపుడు విజయవాడ థర్మల్ విద్యుత్ కేంద్రంలోకి, పక్కనే ఉన్న రింగ్రోడ్లోకి నీరు రావటం, తుమ్మలపాలెం, పరిటాల, కంచికచర్ల గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడటం, కీసర వద్ద అప్రోచ్ బ్రిడ్జి కూలిపోవటాన్ని వారు ప్రస్తావించినట్లు తెలిసింది. తుపాను, వరదలు ఒకేసారి రావడం, సముద్రం ఆటుపోట్లకు గురైన సమయంలో ఒకవేళ నీటిని కృష్ణా నది నుంచి విడుదల చేసినా సముద్రంలో కలవకుండా వెనక్కు వచ్చే ప్రమాదముందని కూడా అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో పురపాలక శాఖ పరిధిలోని డెరైక్టర్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ గతంలో రాజధాని విషయంలో తయారు చేసిన ఒక నివేదికను కూడా వారు ప్రస్తావిస్తున్నారు. దీనిలో విశాఖపట్నం రాజధానిగా అనువైంది కాదని, కర్నూలు జిల్లా రాయలసీమకు మధ్యలో లేదని, హైదరాబాద్‌కు దగ్గరగా ఉండటం వల్ల అంత వేగంగా అభివృద్ది చెందదని, గుంటూరు జిల్లాలోని నాగార్జునసాగర్ ప్రాంతం అనువైనది అయినా రాష్ట్రంలోని నలుమూలలకు రోడ్డు కనెక్టివిటీ లేదని పేర్కొన్నారు. వరదలను అడ్డుకుంటే ఇబ్బంది ఉండదు: శ్రీధరన్ తుపానులు, వరదలు వంటివి నదీ ముఖ రాజధానికి పెద్ద సమస్య కాదని పట్టణ నిర్మాణ రంగ నిపుణులు, విజయవాడలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ సంచాలకులు ప్రొఫెసర్ డాక్టర్ ఎన్.శ్రీధరన్ తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడారు. ఆమ్స్టర్డామ్, బాన్ తదితర నగరాలు నదులకు ఆనుకునే ఉన్నాయని తెలిపారు. భారీ వర్షాల వల్ల వచ్చే వరదలు, ఆకస్మిక వరదలు వంటి వాటిని తట్టుకునే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటే రాజధాని నిర్మాణానికి ఎలాంటి ఇబ్బందులు ఉండవని ఆయన చెప్పారు. -
పల్లెలకే పరిమితం!
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: ‘సమగ్ర కుటుంబ సర్వే’పై రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచన చేస్తోంది. ఒకే రోజు జిల్లావ్యాప్తంగా సర్వే నిర్వహణకు సరిపడా సిబ్బంది సమకూరే పరిస్థితి లేకపోవడంతో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఈ నేపథ్యంలో సమగ్ర సర్వేను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేయాలని ప్రాథమికంగా నిర్ణయించింది. సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హుల గుర్తింపే లక్ష్యంగా తెలంగాణ సర్కారు ఈనెల 19న రాష్ట్రవ్యాప్తంగా సర్వే చేపట్టాలని నిర్దేశించింది. ఈ సర్వేను ఏకకాలంలో నిర్వహించడం ద్వారా అక్రమార్కులను సులువుగా తొలగించవచ్చని భావించింది. ప్రభుత్వం సంకల్పం మంచిదే అయినా, జిల్లా విషయానికి వచ్చేసరికి ఒకే రోజు సర్వే నిర్వహణ ఆచరణసాధ్యంగా కనిపించడంలేదు. జిల్లాలో 15.12 లక్షల ఇళ్లల్లో సుమారు 60 లక్షల జనాభా వివరాలను సేకరించడం యంత్రాంగానికి కత్తిమీద సామే. ఒక ఎన్యుమరేటరు (సర్వే చేసే వ్యక్తి) సగటున 25 ఇళ్లను సర్వే చేసే అవకాశముంటుందని అంచనా. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా ఒకే రోజు సర్వే నిర్వహించాలంటే దాదాపు 60వేల సిబ్బంది అవసరమని యంత్రాంగం లెక్క గట్టింది. అందుబాటులో 22 వేలే..! ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ‘సమగ్ర సర్వే’కు జిల్లాలో సిబ్బంది కొరత ప్రధాన సమస్యగా తయారైంది. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో నాలుగో తరగతి మినహా అన్ని కేట గిరిల ఉద్యోగులను ఈ విధులకు వినియోగించుకోవాలని భావించిన యంత్రాంగం.. ఉద్యోగుల వివరాలను సేకరించింది. ఈ క్రమంలో 22వేల మంది ఉద్యోగులున్నట్లు అధికారులు తేల్చారు. సర్వేకు అవసరమున్న స్థాయి లో సిబ్బంది సమకూరకపోవడంతో యంత్రాంగం ఆందోళన చెందుతోంది. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్న యంత్రాంగం.. సార్వత్రిక ఎన్నికల విధుల్లో వినియోగించుకున్న సిబ్బందిని తాజా సర్వేకు వినియోగించుకోవాలని యోచిస్తోంది. అంత ఈజీ కాదు.. జిల్లాలోని ప్రైవేటు సంస్థల్లో దాదాపు 10వేల మంది పనిచేస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేస్తున్న మరో 10వేల మంది ఉన్నారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖల్లో పనిచేసే 2 వేల ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులను, బ్యాంకుల్లో పనిచేస్తున్న మరో 8వేల మంది, జంటనగరాల్లోని ప్రభుత్వ శాఖాధిపతుల కార్యాలయాల్లోని 3వేల మంది ఉద్యోగులతో పాటు జీహెచ్ఎంసీలో పనిచేసే 2వేల మంది సిబ్బందిని ఈ సర్వే ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని భావిస్తోంది. ఈ మేరకు కార్యచరణ రచిస్తోంది. అయితే ఈ ఉద్యోగులను సర్వే ప్రక్రియలోకి దించాలంటే ఆయా శాఖల ఉన్నతాధికారుల అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వ, బ్యాంకు సిబ్బందిని సర్వేలోకి దించడం ఆషామాషీ వ్యవహారం కాదని అధికారవర్గాలే అంటున్నాయి. గ్రామాలకే పరిమితం చేస్తే... ప్రస్తుతం జిల్లాలో 15.12 లక్షల కుటుం బాలుండగా.. గ్రామీణ ప్రాంతాల్లో 4.12 కుటుంబాలున్నాయి. దీంతో గ్రామీణ ప్రాంతాలతో పాటు ఆరు మున్సి పాల్టీలలో సర్వే చేసేందుకు 16వేల సిబ్బంది అవసరమని యంత్రాంగం అంచనా వేసింది. ఈ నేపథ్యంలో 19వ తేదీన ‘ఇంటింటి సర్వే’ను జీహెచ్ఎంసీ పరిధిని మినహాయించి గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేస్తే బాగుంటుందనే నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జిల్లా యంత్రాంగానికి సంకేతాలు కూడా ఇచ్చింది. ఈ సర్వేకు కేవలం 16వేల మంది సిబ్బంది మాత్రమే అవసరమని భావిస్తూ.. జీహెచ్ఎంసీ పరిధిలో మరో రోజు సర్వే నిర్వహిస్తే ఎలా ఉంటుందనే అంశంపై తర్జనభర్జనలు పడుతోంది. సిబ్బంది కొరత దృష్ట్యా ఒకే రోజు జంట జిల్లాల్లో సర్వే అసాధ్యం కనుక.. మరో రోజు పొడిగించే అంశంపై కూడా చర్చలు సాగిస్తోంది.