regyularaijesan
-
దొడ్దిదారి బదిలీలపై వీఆర్వోల గుర్రు
జీఓను కాదని ఇష్టారాజ్యం రెగ్యులరైజేషన్ పేరుతో వేధింపులు అందని ఇంక్రిమెంట్లు.. అరకొర జీతాలు హన్మకొండ అర్బన్: దొడ్డిదారిన బదిలీలు చేయడంపై వీఆర్వోలు గుర్రుగా ఉన్నారు. అత్యవసరమైతే తప్ప బదిలీకి అవకాశం లే ని ప్రస్తుత పరిస్థితుల్లో జరిగిన ఈ ఘటనను వారు జీర్ణించుకోలేకపోతున్నారు. ఉన్నతాధికారులకు వాస్తవ పరిస్థితులు వివరించకుండా కొందరు తప్పుదోవ పట్టిస్తున్నారని వీఆర్వోలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయూన్ని వీఆర్వోల సంఘం నాయకులు కలెక్టర్, జేసీలకు వివరించినట్లు సమాచారం. వీఆర్వోల సర్వీసు క్రమబద్ధీకరణలో కలెక్టరేట్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. 2008నుంచి ఈ విషయంలో వీఆర్వోలది అరణ్యరోదనే అవుతోంది. పెరిగిన పీఆర్సీ ప్రకారం సుమారు ఒక్కో వీఆర్వోకి కనీసం రూ. 14వేల వేతనం కోత పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో కలెక్టర్, జేసీ సానుకూలంగానే ఉన్నా కిందిస్థారుు సిబ్బంది కొర్రీలు వేస్తున్నారని మండిపడుతున్నారు. తెరపైకి కొత్త నిబంధనలు జీవో 458ప్రకారం వీఆర్ఏ నుంచి పదోన్నతిపై వీఆర్వో అరుున వారు గరిష్టంగా రెండేళ్ల సర్వీసులో ఒక ఏడాది ఎలాంటి రిమార్కు లేకుండా ఉంటేనే సర్వీసు రెగ్యులర్ చేస్తారు. ఇంతకాలం ఇలాగే చేశారు. ఇటీవల కొందరు అధికారులు సర్వీసు రెగ్యులరైజేషన్‌కు పోలీస్ విచారణ నివేదిక, సర్వే శిక్షణ పూర్తి చేసి ఉండాలని మెలిక పెట్టారు. దీంతో తాము నష్టపోతున్నామని వీఆర్వోలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ కారణాలతోనే 2008నుంచి వీఆర్వోలకు తహసీల్దార్లు ఇంక్రిమెంట్లు చేయడంలేదు. అదేంటని అడిగితే కలెక్టరేట్ నుంచి సర్వీసు రెగ్యులర్ చేసుకుని రావాలని తేల్చేస్తున్నారు. దొడ్డిదారిలో బదిలీలు ఉద్యోగుల ఇంక్రిమెంట్లు ఏడేళ్లుగా ఆగినా పట్టించుకోని అధికారులు.. నిషేధం ఉన్నా దొడ్డిదారిలో వీ ఆర్వోల బదిలీకి పూనుకున్నారనే విమర్శ విన్పిస్తోం ది. ప్రస్తుత పరిస్థితుల్లో ఉన్నతాధికారులకు మెడికల్ గ్రౌండ్లో దరఖాస్తులు చేసుకున్నవారి వివరాలు పంపి బదిలీలకు ప్రతిపాదనలు చేయాలి. దీన్ని అధికారులు విస్మరించారు. ప్రజాప్రతినిధుల లేఖలు, సంఘం నాయకులకు సిఫార్సులకే ప్రాధాన్యం ఇస్తున్నారని చెబుతున్నారు. ఈ క్రమంలో భారీగా డబ్బులు చేతులు మారినట్లు ఆరోపణలున్నారుు. ఎందుకీ వివక్ష? జిల్లాలో ఇప్పటివరకు సుమారు ఆరుగురు వీఆర్వోలు వివిధ కారణాలతో మెడికల్ గ్రౌండ్లో బదిలీకి అర్జీ పెట్టుకున్నారు. వీరి విషయంలో మందకొడిగా ఉన్న ఫైళ్లు మిగతా బదిలీ విషయంలో అత్యంత వేగంగా ముందుకుసాగాయి. గుట్టుచప్పుడు కాకుండా బదిలీల తతంగం పూర్తవుతోంది. దేవరుప్పుల మండలంలో పనిచేస్తున్న వీఆర్వోను హసన్‌పర్తి మండలానికి తెచ్చేందుకు ఇటీవల ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ మేరకు హసన్‌పర్తి మండలం చింతగట్టు వీఆర్వోను నాగారానికి బదిలీ చేసి ఆ స్థానంలో తాము అనుకున్న వ్యక్తికి పోస్టింగ్ ఇచ్చారనే ఆరోపణ ఉంది.హన్మకొండ మండలంలో పోస్టింగ్ పొందిన వీ ఆర్వో కొంతకాలంగా వరంగల్ మండలంలో డి ప్యూటేషన్‌పై పనిచేస్తున్నాడు. ఆయన్ను హన్మకొండ నుంచి వరంగల్‌కు బదిలీ చేశారు. పరకాలటౌన్ వీఆర్వోను హన్మకొండ మండలం తిమ్మాపూర్‌కు గుట్టుచప్పుడు కాకుండా పోస్టింగ్ ఇచ్చారు. ఈ వ్యవహారాల్లో పెత్త మొత్తంలో డబ్బులు చేతులు మారుతున్నాయని ఆరోపణలు వినిపిన్నాయి. సెక్షన్ వారిని ప్రసన్నం చేసుకుంటే ఏ సెక్షన్ ప్రకారం బదిలీకి దరఖాస్తు చేసుకోవాలో వారే సలహాలిస్తున్నారు. మారుమూల ప్రాంతాల్లో పనిచేస్తూ మంచి స్థానాలకు వెళ్లాలని నిరీక్షించే వారికి మాత్రం నిరాశే మిగులుతోంది. -
కుడా మోసం!
ఎల్ఆర్ఎస్లో లొసుగులే పెట్టుబడిగా దందా యథేచ్ఛగా అధికారుల అవినీతి పర్వం యజమానులకు మేలు చేసేలా పాత పత్రాలతో పనులు ఎగవేసిన మొత్తంలో వాటాల వారీగా పంపకాలు ప్రభుత్వ ఆదాయూనికి భారీగా గండి సాక్షి, హన్మకొండ: అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు అమల్లోకి తెచ్చిన లే అవుట్ రెగ్యులరైజేషన్ చట్టం-2007 (ఎల్ఆర్ఎస్)లోని లొసుగులు అక్రమార్కులకు వరంగా మారాయి. పలువురు కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థ (కుడా) అధికారుల అవినీతి వారికి కాసులను కురిపిస్తుండగా... భూ యజమానులకు మేలు చేకూరుస్తోంది. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు చేరాల్సిన కోట్లాది రూపాయలు దారి మళ్లుతున్నాయి. ఎల్ఆర్ఎస్ పేరిట చేపట్టిన క్రమబద్ధీకరణలో ఎక్కువభాగం అక్రమబద్ధీకరణే జరిగినట్లు సమాచార హక్కు చట్టం ద్వారా సేకరించిన వివరాలు తేటతెల్లం చేస్తున్నాయి. అధికారుల అండతో ప్లాట్ల యజమానులు క్రమబద్ధీకరణ సమయంలో పాత యాజమాన్య పత్రాలు, మార్కెట్ విలువను తక్కువగా చూపుతూ ప్రభుత్వానికి చెల్లించే మొత్తాన్ని భారీగా ఎగవేస్తున్నట్లు రూడీ అయింది. ఈ అక్రమాల్లో ప్రధాన పాత్ర ‘కుడా’ అధికారులదేనని తేలింది. అధికారులకు కాసుల పంట అక్రమ ప్లాట్లను క్రమబద్ధీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం 2007లో లే అవుట్ రెగ్యులరేజైషన్ చట్టాన్ని అమల్లోకి తెచ్చింది. దీని ప్రకారం లే అవుట్లో పార్కు లేనందుకు మార్కెట్ ధర ప్రకారం భూమి విలువలో పది శాతం జరిమానాగా... భూమి ఎంత ఉందో గజాలను బట్టి ప్రభుత్వం నిర్ణయించిన ప్రకారం పెనాల్టీ చెల్లించాలి. ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్న ఆలస్యాన్ని బట్టి మొత్తం భూమి విలువలో కొంత మొత్తాన్ని ప్రభుత్వ ఖాతాలో జమ చేయూలి. దరఖాస్తు చేసే సమయంలో భూమి యాజమాన్య పత్రాలతోపాటు దరఖాస్తులో తెలిపిన అన్ని విషయాలు నిజమేనంటూ నోటరీని సైతం సమర్పించాలి. అనంతరం అసిస్టెంట్ ప్లానింగ్ ఆఫీసర్, సర్వేయర్, డ్రాఫ్ట్‌మన్, జూనియర్ అడ్మినిస్ట్రేషన్ అధికారులు ఫీల్డుకు వెళ్లి దరఖాస్తులో సమర్పించిన అంశాలు సరైనవా... కాదా... అనే అంశాలను పరిశీలించాలి. ఆ తర్వాత మార్కెట్ రేటు, స్థల విస్తీర్ణాన్ని బట్టి ఎల్ఆర్ఎస్ పెనాల్టీని విధించాలి. ప్లానింగ్ అధికారి పరిశీలించిన తర్వాతే సదరు స్థలాన్ని క్రమబద్ధీకరించాలి. అయితే ఎల్ఆర్ఎస్ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత భూముల ధరలు గరిష్టంగా పదిరేట్ల వరకు పెరిగాయి. ఇందుకు తగ్గట్లుగా ఎల్ఆర్ఎస్ ఫీజు, పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని ప్రభుత్వానికి చెల్లిస్తే ఏమొస్తుందని అనుకున్నారో.. ఏమో... కాకతీయ పట్టణాభివృద్ధి సంస్థకు చెందిన పలువురు అధికారులే ఎల్ఆర్ఎస్ చట్టంలోని లొసుగులను ఒడిసిపట్టి అక్రమార్జనకు తెగబడ్డారు. లే అవుట్ క్రమబద్ధీకరణ కోసం దరఖాస్తు అందగానే అక్కడి సిబ్బంది అలర్ట్ అవుతున్నారు. ప్రభుత్వానికి ఎక్కువ మొత్తం చెల్లిస్తే ఏం లాభం... మేం చెప్పినట్లు పాత తేదీలతో ఉన్న ల్యాండ్ డాక్యుమెంట్లతో పని కానిచ్చేద్దాం... మిగిలింది ఫిఫ్టీ-ఫిఫ్టీగా పంచుకుందామంటూ యజమానులతో ఒప్పందం కుదుర్చుకుని దండుకుంటున్నారు. ఇలా భూ యజమానులకు మేలు జరుగుతుండగా.. సదరు అధికారుల జేబులు నిండుతున్నాయి. ప్రభుత్వ ఆదాయూనికి మాత్రం గండిపడుతోంది. సమాచార హక్కు చట్టం ప్రకారం సేకరించిన వివరాలు హన్మకొండ న యీంనగర్లో సర్వే నంబర్లు 5-980, 5-981,5-982లో ఉన్న 1721 చదరపు మీటర్ల స్థలాన్ని 1998లో రేచర్ల శ్రీనివాసరావు కొనుగోలు చేశాడు. ఈ స్థలాన్ని 2003, 2009లో పలు విడతల్లో రేవూరి కిషన్‌రెడ్డికి, అతడి కుటుంబ సభ్యులకు విక్రయించాడు. ఈ మేరకు ఈ ఆస్తికి హక్కుదారులుగా రేవూరి కిషన్‌రెడ్డి, అతడి కుటుంబీకులు ఉన్నారు. ఇందుకు సంబంధించి సేల్స్ డీడ్స్ రికార్డులు ఉన్నాయి. ఈ స్థలాన్ని క్రమబద్ధీకరించాలంటూ 2010 మేలో కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి దరఖాస్తు అందింది. ప్రస్తుతం ఈ భూమికి యజమానిగా ఉన్న రేవూరి కిషన్‌రెడ్డి పేరుతో కాకుండా గత యజమాని అయిన రేచర్ల శ్రీనివాసరావు పేరుతో దరఖాస్తు అందింది. పరిశీలనకు వెళ్లిన ‘కుడా’ అధికారులు ఈ అంశంపె ఎటువంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండానే పాత డాక్యుమెంట్ల ఆధారంగా 1998 మార్కెట్ ధర ప్రకారం ఎల్ఆర్ఎస్ ఫీజు, పెనాల్టీ కింద రూ 4,27,860 చెల్లించాల్సిందిగా నిర్ధారించారు. దరఖాస్తు వివరాల ప్రకారం ఈ మొత్తాన్ని స్థల యజమాని అయిన రేచర్ల శ్రీనివాసరావు చెల్లించాలి. అయితే కార్పొరేషన్ బ్యాంకులో డిమాండ్ డ్రాఫ్టును రేవూరి కిషన్‌రెడ్డి పేరుతో తీసి ‘కుడా’కు అందినట్లు ఉంది. ముందుగా కుదిరిన ఒప్పందమో... కావాలని చేసిన తప్పిదమో.. దరఖాస్తుదారులు ఎవరు, డబ్బులు చెల్లించినవారు ఎవరనేది పరిశీలించకుండా పని పూర్తి చేసినట్లు స్పష్టమవుతోంది. ఎల్ఆర్ఎస్ చట్టం అమల్లో ఉన్న కాలంలో 90 శాతం పనులు ఈ విధంగా అక్రమ పద్ధతిలో కొనసాగినట్లు ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై విచారణ జరిపించాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ‘కుడా’లో అంతా అక్రమమే ఎల్ఆర్ఎస్ పేరుతో ‘కుడా’లో పెద్ద కుంభకోణం జరిగింది. నా ప్రమేయం లేకుండా నా సంతకాలు ఫోర్జరీ చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. ‘కుడా’ అధికారుల అండదండలతోనే ఇది జరిగింది. ఎల్ఆర్ఎస్ అక్రమాలపై విచారణ చేయాలి. - రేచర్ల శ్రీనివాసరావు ఆయనకు తెలిసే జరిగింది సర్వే నంబర్లు 5-980, 5-981,5-982లో ఉన్న 1721 చదరపు మీటర్ల స్థల క్రమబద్ధీకరణకు సంబంధించి ప్రతి పనీ రేచర్ల శ్రీనివాసరావుకు తెలిసే జరిగింది. ఆయనే దగ్గరుండి ఎల్ఆర్ఎస్లో పాల్గొన్నారు. వ్యక్తిగతంగా నన్ను ఇబ్బంది పెట్టేందుకు ఈ రోజు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. - రేవూరి కిషన్‌రెడ్డి -
ఏసీబీ వలలో పెద్దచేప
పట్టుబడ్డ యుఎల్‌సీ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రూ. 50 వేలు లంచం తీసుకుంటూ దొరికిపోయాడు అధికారితో పాటు అతని కుమారుడూ కటకటాలపాలు అవినీతి కూపంలో యుఎల్‌సీ కార్యాలయం అబిడ్స్/కలెక్టరేట్, న్యూస్‌లైన్: అర్బన్ ల్యాండ్ సీలింగ్ (యుఎల్‌సీ)లో విధులు నిర్వర్తించే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. తానే లంచావతారం ఎత్తి తన కొడుకుతో డబ్బులు తీసుకున్న ఆ అధికారి తన కొడుకుతో సహా ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయాడు. ఏసీబీ హైదరాబాద్ రేంజ్-2 డీఎస్పీ శంకర్ రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సరూర్‌నగర్ మండలంలోని నర్సింహాపురి కాలనీలో రెండు ప్లాట్లు రెగ్యులరైజ్ చేసేందుకు అదే ప్రాంతంలో ఉండే తుమ్మలపల్లి బాల్‌రెడ్డి 2005లో నాంపల్లిలోని యుఎల్‌సీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నాడు. తొమ్మిదేళ్లుగా కార్యాలయం చుట్టూ తిరుగుతున్న అతనికి రెగ్యులరైజేషన్ డబ్బులు కట్టినప్పటికీ తన ప్లాట్లను రెగ్యులరైజ్ చేయలేదు. ఇటీవల స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటేశ్వర్రావు రెగ్యులరైజ్ చేస్తానంటూ అందుకు రూ.1.50 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. దాంతో బాల్‌రెడ్డి వెంకటేశ్వర్రావుతో ముందుగా రూ.50వేలు ఇస్తానని, మిగతా మొత్తం తర్వాత ఇవ్వనున్నట్లు ఒప్పందం కుదుర్చుకున్నాడు. గురువారం ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేయడంతో వారు బాల్‌రెడ్డి ఫిర్యాదును స్వీకరించి శుక్రవారం సాయంత్రం వెంకటేశ్వర్రావుకు రూ.50వేలు ఇవ్వాలని సూచించారు. కాగా సాయంత్రం 6 సమయంలో వెంకటేశ్వర్రావు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా తన కొడుకు అమర్దాస్కు డబ్బులు ఇవ్వాలని సూచించాడు. డబ్బులు అమర్దాస్ తీసుకుని వెంకటేశ్వర్రావు తీసుకున్న కొద్ది సేపటికే ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి, ఇన్స్పెక్టర్లు నిరంజన్, నాయుడు, అంజిరెడ్డిల బృందం వెళ్లింది. వారిని పసిగట్టిన వెంకటేశ్వర్రావు తీసుకున్న డబ్బులను సమీపంలో ఉన్న డ్రమ్‌లో పడేశాడు. ఏసీబీ అధికారులు వెంకటేశ్వర్రావును అదుపులోకి తీసుకుని డ్రమ్ములో ఉన్న నగదును స్వాధీనపర్చుకున్నారు. తండ్రీ కొడుకులను ఏసీబీ అధికారులు అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. అవినీతి కూపంలో యుఎల్‌సీ... ఎంజెమార్కెట్-నాంపల్లి ప్రధాన రహదారిలో ఉన్న రాష్ట్ర యుఎల్‌సీ కార్యాలయం అవినీతికి నిలయంగా మారింది. నాలుగు నెలల క్రితమే ఓ ఉన్నతాధికారి రూ.50వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపడగా తిరిగి శుక్రవారం సాయంత్రం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారి రూ.50వేలు లంచం తీసుకుంటూ పట్టుబడడం చర్చనీయాంశంగా మారింది. గత ఏడాదిగా చంద్రవిహార్ భవనంలోని 3వ అంతస్తులో గల యుఎల్‌సీ కార్యాలయం పూర్తిగా అవినీతి నిలయంగా మారింది. నగరంతో పాటు శివారు ప్రాంతాలైన మల్కాజ్గిరి, కుత్బుల్లాపూర్, రాజేంద్రనగర్, శేరిలింగంపల్లి, కూకట్పల్లి, హయత్‌నగర్, సరూర్‌నగర్ మండలాలకు చెందిన వేల ఎకరాల భూమికి ప్రతీ రోజు పెద్ద సంఖ్యలో యుఎల్‌సీ రెగ్యులరైజేషన్ కోసం ప్రజలు తరలివస్తారు. శివారు ప్రాంతాల్లోని కొన్ని మండలాలలో యుఎల్‌సీ రెగ్యులరైజేషన్‌కు లక్షలాది రూపాయలు లంచాలు తీసుకుంటూ యుఎల్‌సీ క్లియరెన్స్ ఇస్తున్నట్లు సమాచారం. ఫిర్యాదు చేయండి: డీఎస్పీ శంకర్‌రెడ్డి యుఎల్‌సీ కార్యాలయంతో పాటు ఏ ప్రభుత్వ కార్యాలయంలోనైనా పనుల కోసం లంచాలు అడిగితే తమకు నేరుగా ఫిర్యాదు చేస్తే ఆయా అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీబీ డీఎస్పీ శంకర్ రెడ్డి సూచించారు. కొంత మంది ఫిర్యాదు చేసేందుకు ముం దుకు రాకపోవడంతో తమకు సమాచారం రావడం లేదన్నారు. ప్రతీ ఒక్కరు ధైర్యంగా లంచగొండి అధికారులపై ఫిర్యాదు చేస్తే ఏసీబీ ఆయా అధికారులను కఠినంగా శిక్షిస్తుందని ఆయన అన్నారు. ఫిర్యాదుల కోసం 9440446134 ఫోన్ నెంబర్లో సంప్రదించాలన్నారు.