religious places
-
మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల వినియోగంపై సీఎం కీలక నిర్ణయం
లక్నో: ఇక నుంచి మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు అధికారుల అనుమతి తప్పనిసరి చేస్తున్నట్లు ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ వెల్లడించారు. అంతేగాక ప్రార్ధనా ప్రాంగణం నుంచి శబ్ధం బయటకు రాకూడదని తెలిపారు. లౌడ్ స్పీకర్లకు కొత్తగా ఎలాంటి అనుమతులు ఇవ్వకూడదని పేర్కొన్నారు. ‘ప్రతి ఒక్కరికి తమ మత విశ్వాసాలకు తగిన విధంగా ఆరాధించే స్వేచ్ఛ ఉంటుంది కానీ అది ఇతరులకు అసౌకర్యం కలిగించకూడదు’ అని సీఎం యోగి ఆదిత్యనాథ్ అన్నారు. మహారాష్ట్రలోని నాసిక్ పోలీసులు మతపరమైన ప్రదేశాలలో అనుమతి లేకుండా లౌడ్ స్పీకర్ల వినియోగంపై నిషేధం విధించిన మూడు రోజుల తర్వాత యూపీలో యోగి ఈ ప్రకటన చేశారు. ఆజాన్ సమయంలో 15 నిమిషాలు ముందు, తరువాత లౌడ్ స్పీకర్ల ద్వారా హనుమాన్ చాలీసా, భజనలు ప్లే చేయరాదని నాసిక్ పోలీసులు ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. అంతేగాక మహారాష్ట్రలోని అన్ని మతపరమైన ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లను ఉపయోగించేందుకు మే 3లోగా అనుమతులు తీసుకోవాలని పేర్కొన్నారు. చదవండి: మత ఘర్షణల నేపథ్యంలో.. యోగి సర్కార్ కీలక నిర్ణయం కాగా ఇప్పటికే యోగి సర్కార్ మతపరమైన ఉరేగింపులు, ర్యాలీలకు అధికారుల అనుమతులు తప్పనిసరి చేస్తూ మంగళవారం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇకపై యూపీలో మత పరమైన ర్యాలీలకు పోలీసులకు అఫిడవిట్‌ను సమర్పించాలని సీఎం తెలిపారు. అనుమతి లేకుండా ఎలాంటి మతపరమైన ఊరేగింపు జరగకూడదని పేర్కొన్నారు. సాంప్రదాయ మతపరమైన ర్యాలీలకు మాత్రమే అనుమతి ఇవ్వాలని, కొత్త కార్యక్రమాలకు అనుమతి ఇవ్వకూడదని తెలిపారు. -
ఇక మీదట తీర్థ ప్రసాదాలు బంద్
న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా దాదాపు 2 నెలల నుంచి దేశంలోని ఆలయాలన్ని మూసి వేశారు. లాక్డౌన్ 5.0లో దేశవ్యాప్తంగా ఈ నెల 8నుంచి కేంద్రం కొన్ని సడలింపులు ఇవ్వనుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, ప్రార్థన స్థలాలను తెరిచేందుకు అనుమతివ్వనున్నారు. దీనికి అనుగుణంగా కేంద్రం పలు మార్గదర్శకాలను విడుదల చేసింది. (సకల జాగ్రత్తలతోనే పునఃప్రారంభించాలి) 1. ప్రార్థన మందిరాలల్లోకి వచ్చేందుకు, వెళ్లేందుకు వేర్వేరు మార్గాలు ఉండాలి. 2. ప్రవేశ మార్గంలో శానిటైజర్, థర్మల్ స్క్రీనింగ్, మాస్క్ తప్పనసరి. 3. ప్రార్థన మందిరాలకు వచ్చేవారిని దశలవారిగా పంపించాలి. క్యూలైన్లో 2 మీటర్ల భౌతిక దూరం పాటించేలా చూడాలి. 4. భక్తి గీతాలను ఆలపించడానికి వీలులేదు. బదులుగా రికార్డు చేసినవి వినిపించాలి. 5. ప్రసాదం, తీర్థం ఇవ్వడం, పవిత్ర జలం చల్లడం చేయకూడదు. 6. అన్న ప్రసాదం తయారు చేసే సమయంలో, పంచేటప్పుడు భౌతిక దూరం తప్పని సరి. 7. విగ్రహాలను, పవిత్ర గ్రంథాలను తాకకుండా చూడాలి. 8. మతపరమైన సమావేశాలు, జనాలు గుంపులుగా చేరే వేడుకలు నిర్వహించడం నిషేధం. -
సోను నిగమ్‌కు నాడు గూండాయిజం గుర్తురాలేదా?
న్యూఢిల్లీ: మసీదుల్లో, మందిరాల్లో మైకులు పెట్టి ప్రార్థనలు వినిపించడం గుండాయిజమే అంటూ ప్రముఖ పాప్ గాయకుడు సోను నిగమ్ చేసిన ట్వీట్లపై సోషల్ మీడియాలో జోరుగా చర్చ జరుగుతోంది. ఆయనకంటే ముందే స్పందించిన ముంబై హైకోర్టు మసీదుల్లో మైకులను ఎప్పుడో నిషేధించింది. అయినా కోర్టు ఉత్తర్వులు సరిగ్గా అమలు కావడం లేదు. అది వేరే విషయం. ‘మసీదులపై నిలబడి ముల్లాలు ఎందుకు అంత గట్టిగా పిలవాలి అల్లా ఏమీ చెవిటివాడు కాదుకదా!’ అని 15వ శతాబ్దానికి చెందిన బ్రజ్ (పాశ్చాత్య హిందీ కవి) కవి కబీర్ ఇంకా ముందే స్పందించారు. కబీర్ నుంచి సోనూ నిగమ్ వరకు ఎందరో చేసిన వ్యాఖ్యల్లో నిజం లేకపోలేదు. అయితే ప్రతిరోజు మసీదుల్లో, మందిరాల్లోనే వినిపించే ప్రార్థనలే గూండాయిజమా? వినాయకుని నిమజ్జనానికి, దుర్గా పూజకు, క్రిస్మస్ పండగకు మైకుల్లో అదరగొట్టే నినాదాలు, భక్తి గీతాలు, గుండెలు ఆగిపోయే రీతిలో డప్పులు మోగించడం, ఢిల్లీలో జరిగే జాగారణ రాత్రుల్లో తెల్లార్లు మైకుల్లో భజనలు, కీర్తనలు వినిపించడం గూండాయిజం కాదా? ఢిల్లీలో జరిగే జాగారణ కార్యక్రమాల్లో కూడా సోను నిగమ్ కూడా భక్తి గీతాలు ఆలపించారు. అప్పుడు ఆయనకు గూండాయిజం గుర్తురానట్లుంది. ఆధునిక భారతదేశంలో మత విశ్వాసకులు ఉన్నారు. ఛాందసవాదులున్నారు. హేతువాదులున్నారు. దేవుడిని నమ్మని నాస్తికులు ఉన్నారు. ఇందులో ఏ వర్గం వారు కూడా మరోవర్గంపై తమ అలవాట్లను, ఆచారాలను, సిద్ధాంతాలను బలవంతంగా రుద్దేందుకు ప్రయత్నించకూడదు. అలా చేయడమంటేనే గూండాయిజం. ఈ లెక్కన దేశంలో గోవధను నిషేధించడం కూడా గూండాయిజమే. హిందువులు గోవులను పవిత్రంగా భావిస్తారని గోమాంసం తినే ముస్లింలపై నిషేధం విధించడమంటే ఏమిటీ? ఆధునిక భారత దేశంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా మతాల్లోనూ విశ్వాసాల్లోను మార్పు రావాలి. ఏ మతమైనా సర్వమానవ కల్యాణాన్ని కోరుకున్నప్పుడు ఒక వర్గం అభిప్రాయలను మరో వర్గంపై బలవంతంగా రుద్దడం అంటే గూండాయిజం కాదా? అలీగఢ్ ముస్లిం యూనివర్శిటీ గ్రంధాల ప్రకారం మహమ్మద్ ప్రవక్త ఇస్లాం మతాన్ని స్థాపించినప్పుడు మైకులు లేవు. జనాన్ని పోగేసేందుకు గట్టిగా అరచి పిలిచే శక్తిగల యువకులను ప్రవక్త స్వయంగా నియమించారు. వారు మసీదులపైకి ఎక్కి సమావేశం ప్రారంభం అవుతుందన్న విషయాన్ని సూచించడానికి గట్టిగా పిలిచేవారు. అలా పిలిచేవారే కాలక్రమంలో ముల్లాలయ్యారు. కాలక్రమంలో మైకులు రావడంతో వారు కూడా వాటిని ఉపయోగిస్తున్నారు. నేడు ప్రార్థనా సమయాలు అందరికి తెలుసు. అందరి వద్ద గడియారాలున్నాయి. ఇప్పుడు కూడా మైకులు ఉపయోగించడం అవసరమా? ఇతరులను ఇబ్బంది పెట్టడం ఏ దేవుడు కోరుకుంటారు? ఓ సెక్యులరిస్ట్ కామెంట్