respiratory system
-
కనిపించని శత్రువు.. ముందే గుర్తిస్తే మందులతో నయం!
ఎలా సోకుతుంది....? వంశపారంపర్యంగా... దుమ్ము,ధూళిలో ఎక్కువగా ఉండేవారికి పని ప్రదేశాలలో శుభ్రత లేకపోతే ఎలర్జీ, జీవన విధానం లక్షణాలు శరీరంలో గాలిగొట్టాలు ముడుచుకుపోవడం పిల్లికూతలు ఊపిరి ఆడనంతగా ఆయాసం ఎడతెరపిలేకుండా దగ్గు రావడం పెదవాల్తేరు (విశాఖతూర్పు): ప్రపంచంలో పూర్తిగా నయమయ్యే వ్యాధులలో ఆస్తమా ఒకటి. చైనాలో క్రీస్తుపూర్వం 2,600 సంవత్సరంలో ఒక వ్యక్తి దగ్గు, ఆయాసంతో బాధపడడంతో తరువాతి కాలంలో ఇది ఆస్తమా అని వైద్యనిపుణులు గుర్తించారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఇచ్చిన పిలుపు మేరకు 1993 సంవత్సరం నుంచి ప్రపంచ దేశాలన్నీ ప్రపంచ ఆస్తమా దినోత్సవాన్ని ఏటా మే 3వ తేదీన జరుపుకుంటున్నారు. ఇది అంటువ్యాధి కాకపోవడంతో రోగుల సంఖ్య గణనీయంగా తగ్గుతోంది. చినవాల్తేరులోని ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో దాదాపుగా 500 మంది ఆస్తమా రోగులు చికిత్స పొందుతున్నారు. ఈ ఏడాది కేంద్ర ఆరోగ్యశాఖ ఆస్తమా దినోత్సవాన్ని ‘క్లోజింగ్ గేప్స్ ఇన్ ఆస్తమా కేర్’ నినాదంతో జరుపుకోవాలని పిలుపు ఇచ్చింది. ఆస్తమా వ్యాధి సాధారణంగా రెండేళ్ల వయసు నుంచి 78 సంవత్సరాల వయసు గల వ్యక్తులలో కనిపిస్తుంది. రెండు వారాలకు మించి దగ్గు, ఆయాసం వుంటే వెంటనే పల్మనాలజిస్టును సంప్రదించాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. ఇది దీర్ఘకాలిక వ్యాధి కాదని వారు స్పష్టం చేస్తున్నారు. భారతదేశంలో 10 నుంచి 15 శాతం మంది ఆస్తమాతో బాధపడుతున్నారని అంచనా. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో మొత్తం 288 పడకలు వుండగా, సూపరింటెండెంట్ పర్యవేక్షణలో నలుగురు ప్రొఫెసర్లు, ముగ్గురు అసోసియేట్, పది మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు, 45మంది పీజీలు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు విధులు నిర్వహిస్తున్నారు. ఈ వ్యాధి గిరిజనులకు ఎక్కువగా సోకుతుండడం విచారకరం. చికిత్స ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో ఆస్తమా రోగులకు సాధారణంగా రెండునుంచి మూడు వారాల పాటు చికిత్స అందిస్తారు. ఈ రోగులు ఇన్హేలర్, కొన్నిరకాల మాత్రలు వాడాల్సి వుంటుంది. ఆస్తమా సోకితే ఆక్సిజన్ స్థాయి పడిపోవడంతో గుండెజబ్బులకు దారితీసే ప్రమాదం వుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఒక్కోసారి వైటల్ ఆర్గానిక్స్, కిడ్నీపై కూడా ప్రభావం చూపే అవకాశం కూడా వుంటుంది. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద ఆస్తమా రోగులకు అన్నిరకాల చికిత్స ఉచితంగానే అందిస్తున్నారు. తీవ్రమైన ఆస్తమాతో బాధపడే రోగులకు వెంటిలేటర్లపై చికిత్స చేస్తారు. ఏరో థెరపీ, ఇన్హీలర్థెరపీ, నిబ్యులైజేషన్ చికిత్సలతో రోగులకు ఇట్టే నయం అవుతుందని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో జర్మనీ, స్విట్జర్లాండ్ దేశాలనుంచి దిగుమతి చేసుకున్న వైద్య పరికరాలతో చికిత్స అందుబాటులో ఉండడం విశేషం. చాలాకాలంగా ఆస్తమా రోగుల్లో మరణాలు నమోదు కాకపోవడం సంతోషకరం. ఓపీలో సేవలు స్థానిక ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రిలో రోజూ ఉదయం 9 గంటలనుంచి మధ్యాహ్నం 2 గంటలు, తిరిగి 2 నుంచి రాత్రి 9 గంటల వరకు ఓపీ విభాగంలో వైద్యసేవలు అందిస్తున్నారు. కోవిడ్ తగ్గుముఖం పట్టడంతో గతనెలనుంచి ఛాతీ ఆస్పత్రిలో మళ్లీ సాధారణ వైద్యసేవలు అన్నీ అందుబాటులోకి వచ్చాయి. ఓపీ విభాగంలో రోజూ 120 మంది వరకు రోగులు వైద్యం పొందుతున్నారు. అవగాహన సదస్సు ప్రపంచ ఆస్తమా దినోత్సవం పురస్కరించుకుని ఆస్పత్రిలో మంగళవారం ఉదయం 10 గంటలనుంచి అవగాహన సదస్సు జరుగింది. వైద్యనిపుణులు ఆస్తమాపై అవగాహన కల్పించి, రోగుల సందేహాలకు సమాధానాలిచ్చారు. ఎయిర్‌కూలర్లు, ఏసీ ఫిల్టర్లను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి. ఆస్తమాని త్వరగా గుర్తిస్తే చికిత్సతో పూర్తిగా నయం అవుతుంది. అంతర్జాతీయ వైద్యనిపుణుల సూచనలతో ఆధునిక చికిత్స చేస్తున్నాం. –డాక్టర్ ఆర్.సునీల్‌కుమార్, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఛాతీ ఆస్పత్రి, చినవాల్తేరు -
ఊదబోయి.. గుటుక్కున మింగేసింది!
మనం అనుకోకుండా చేసే పొరపాట్లకు కొన్నిసార్లు పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. కేరళకు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ .. చిన్నప్పుడు చేసిన ఓ పొరపాటు 25 ఏళ్ల తరువాత బయటపడడంతో ఆమెతోపాటు..డాక్టర్లు ఆశ్చర్యానికి లోనయ్యారు. కేరళలోని కన్నూర్ జిల్లా మట్టన్నూరుకు చెందిన ఓ మహిళ శ్వాస సంబంధిత సమస్యతో డాక్టర్ దగ్గర చూపించుకునేందుకు వెళ్లింది. ఆమెను పరీక్షించిన డాక్టర్లు ఆమె శ్వాసకోసవ్యవస్థలో ఒక విజిల్ ఉన్నట్లు గుర్తించారు. శ్వాసనాళంలో ఉన్న విజిల్ కారణంగా శ్వాససంబంధ సమస్యలు వస్తుండడంతో సర్జరీ చేసి దానిని బయటకు తీశారు డాక్టర్లు. తాను ఓ 25 ఏళ్ల క్రితం ఒకసారి విజిల్ ఊదుతూ పొరపాటున మింగేశానని, అయితే అదిగమనించి ఎక్కువగా నీళ్లు తాగేశానని, అది ఎప్పుడో బయటకు వచ్చేసి ఉంటుందని అనుకున్నాను కానీ ఇంత పని చేస్తుందనుకో లేదని వాపోతోందామె! అప్పట్లో మింగిన ఆ విజిల్ కాస్తా ఆమె శ్వాసనాళంలోకి చేరింది. అప్పటి నుంచి ఇప్పటిదాక అది అక్కడే ఉండడంతో ఆమె రెండు దశాబ్దాలుగా దగ్గుతో సతమతమయ్యేది. ఊపిరి పీల్చుకోవడం కూడ కష్టమయ్యేది. విజిల్ తీశాక ప్రస్తుతం తనకు ఏ సమస్యా లేదంటోంది. చదవండి: (సన్నీ ఇది చాలా విడ్డూరం.. అందుకే అకాల వర్షాలు) -
వాయువు ఆయువు తీస్తోందా?
గుండెల నిండా గాలి పీల్చుకోవాలంటే భయం.. ముఖానికి మాస్క్ లేకుండా బయట అడుగు పెట్టాలంటే వణుకు.. ప్రాణాధారమైన వాయువే.. ఆయువు తీసేస్తుందేమోనన్న ఆందోళన.. ఎందుకో తెలుసా..? అంతా కాలుష్యం మరి.. ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా జాబితా ప్రకారం.. భూమ్మీద వాయు కాలుష్యం అధికంగా ఉన్న 20 నగరాల్లో 14 భారత్‌లోనే ఉన్నాయంటే పరిస్థితి ఏమిటన్నది ఇట్టే తెలిసిపోతుంది. మరి గాలిలో ఉండే కాలుష్యాలు ఏమిటి, ఏ కాలుష్యంతో ఏం ప్రమాదమో తెలుసుకుందామా.. ఓజోన్ వాహనాల పొగ నుంచి వచ్చే నైట్రస్ ఆక్సైడ్లు, సూర్యరశ్మి సమక్షంలో కొన్ని రకాల వాయువులతో కలిసినప్పుడు ఓజోన్ ఏర్పడుతుంది. భూమి చుట్టూ ఆవరించి రక్షణ ఛత్రంగా ఉపయోగపడే ఈ ఓజోన్.. ఇక్కడ మాత్రం ఆరోగ్య సమస్యలకు కారణమవుతోంది. దానివల్ల ఆస్తమా ఇబ్బందులు ఎక్కువైపోతాయి. గొంతు సమస్యలు కలుగుతాయి. దగ్గు, ఊపిరితీసుకోవడంలో ఇబ్బంది.. చివరికి అకాల మరణాలకూ అది కారణమవుతోంది. ఓజోన్‌తో మొక్కలు, పంటలకూ నష్టమే. కార్బన్ మోనాక్సైడ్ వాహనాల నుంచి, కలప, బొగ్గులు మండించినప్పుడు వెలువడే వాయువు కార్బన్ మోనాక్సైడ్. వాహనాల ఇంజిన్లు పాడైనా, వాటి నిర్వహణ సరిగా లేకున్నా కార్బన్ మోనాక్సైడ్ ఎక్కువగా విడుదలవుతుంది. ఈ వాయువు శరీరానికి తగినంత ఆక్సిజన్ అందకుండా అడ్డుకుంటుంది. దీనికి ఎక్కువగా ఎక్కువ పీల్చుకుంటే విపరీతమైన తలనొప్పి. తలతిరగడం, నిస్సత్తువ వంటివి తలెత్తుతాయి. ఎక్కువ గాఢత కలిగిన కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చితే మరణానికీ దారి తీస్తుంది. గుండెజబ్బు పరిస్థితిని మరింత తీవ్రతరం చేస్తుంది. సీసం.. పురాతనమైన పైపులు.. కొన్ని పారిశ్రామిక వ్యర్థాలు, కొన్ని రకాల కృత్రిమ రంగుల నుంచి వెలువడుతుంది. కొంతకాలం కిందటి వరకు పెట్రోలియం ఉత్పత్తుల్లోనూ ఉండేదిగానీ.. ప్రస్తుతం సీసాన్ని తొలగించి శుద్ధి చేస్తున్నారు. సీసం భారలోహం. ఇది పసిపిల్లల్లో మేధోశక్తిని తగ్గిస్తుంది. కొన్నిసార్లు కిడ్నీ సమస్యలకూ కారణమవుతుంది. పెద్దవాళ్లలో గుండెజబ్బులకు కారణం. అతిసూక్ష్మ ధూళికణాలు గాలిలో ఉండే అత్యంత సూక్ష్మమైన దుమ్ము, ధూళికణాలను పర్టిక్యులేట్ మేటర్ (పీఎం) అంటారు. పరిమాణాన్ని బట్టి ఇది పీఎం 10, పీఎం 2.5 అని రెండు రకాలు. వీటిలో పీఎం 2.5 అత్యంత ప్రమాదకరమైనది. థర్మల్ విద్యుత్ కేంద్రాల నుంచి, రోడ్ల నిర్మాణాల సమయంలో, శిలాజ ఇంధనాల్ని మండించినప్పుడు ఈ పీఎం 2.5 కణాలు గాలిలోకి చేరుతాయి. శ్వాస తీసుకున్నప్పుడు నేరుగా ఊపిరితిత్తుల్లోకి చేరి అక్కడి కణజాలాన్ని దెబ్బతీస్తాయి. దీంతో శ్వాసకోశ, ఉబ్బసం సమస్యలు ఎక్కువవుతాయి. క్షయ వంటి వ్యాధులు వచ్చే అవకాశమూ ఉంటుంది. ఆర్సెనిక్ కలపను శుద్ధి చేసేందుకు, కొన్ని ఇతర పారిశ్రామిక అవసరాలకు ఆర్సెనిక్‌ను ఉపయోగిస్తారు. కొన్ని ప్రాంతాల్లోని భూగర్భజలాల్లోనూ ఉంటుంది. ఇది అత్యంత ప్రమాదకారి. తాకితే చాలు.. శరీరంలోకి చేరిపోతుంది. నాడీ మండలం, జీర్ణ వ్యవస్థలతోపాటు పునరుత్పత్తి వ్యవస్థలపై దుష్ప్రభావం చూపుతుంది. ఆస్బెస్టాస్ వాహనాల్లోని క్లచ్‌లు, బ్రేక్ లైనింగ్లతోపాటు భవన శిథిలాల ద్వారా ఆస్బెస్టాస్ కణాలు గాలిలోకి విడుదలవుతుంటాయి. దీర్ఘకాలం ఈ కాలుష్యానికి గురైతే ఆస్బెస్టోసిస్ వ్యాధి వస్తుంది. ఊపిరితిత్తుల కేన్సర్‌తోపాటు మెసోథెలియోమా వ్యాధికీ ఆస్బెస్టాస్ కారణమవుతుంది. తాగేనీటి లో కలసి శరీరంలోకి చేరితే.. పేగులు, కడుపు, ఆహార నాళ కేన్సర్లకు దారితీస్తుంది. బెంజీన్ పొగాకు ఉత్పత్తులు, గ్యాస్ స్టేషన్ల నుంచి బెంజీన్ విడుదలవుతుంది. జిగురు తయారీతోపాటు, ప్లాస్టిక్, నైలాన్లోనూ ఇది ఉంటుంది. ఫర్నిచర్‌ను మెరిపించేందుకు వాడే మైనంలోనూ బెంజీన్ ఉంటుంది. ఇది ఎముక మజ్జలో ఉత్పత్తయ్యే ఎర్ర రక్త కణాలను తగించడంతో రక్తహీనత ఏర్పడుతుంది. తెల్ల రక్త కణాలను, యాంటీబాడీలను కూడా చంపేస్తుంది. సల్ఫర్ డయాక్సైడ్ శిలాజ ఇంధనాల వినియోగంతో సల్ఫర్ డయాక్సైడ్ విడుదలవుతుంది. శ్వాసకోశ సంబంధ వ్యాధులు, గుండెకు సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశముంది. దీన్ని పీలిస్తే ఉబ్బసం సమస్య తీవ్రతరమవుతుంది. సల్ఫర్ తాలూకు ఆక్సైడ్లు ఇతర పదార్థాలతో కలసి శరీరం లోలోపలికి చొచ్చుకుపోగల రసాయనాలు ఉత్పత్తి అవుతాయి. మీథేన్ చెత్తతో కూడిన ప్రతీచోట మీథేన్ ఉత్పత్తి అవుతుంది. చెట్లు ఎక్కువగా ఉన్నచోట కూడా ఇది వెలువడుతుంది. మిథేన్‌ను అధికంగా పీలిస్తే ఊపిరాడని పరిస్థితి ఏర్పడుతుంది. శ్వాస వ్యవస్థ పనితీరుపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. 5 శాతం కంటే ఎక్కువ గాఢతతో ఉండే మీథేన్ వాయువుకు మండే స్వభావం అధికంగా ఉంటుంది. -
పూర్తిగా తగ్గాక కూడా... పక్షవాతాన్ని తెచ్చే జికా!
జికా వ్యాధి సోకిన వారిలో కొందరికి తాత్కాలికంగా అవయవాలు చచ్చుబడిపోతాయా అన్న ప్రశ్నకు అవును అనే సమాధానమే వస్తోంది. కొత్తగా వెలుగు చూస్తున్న పరిశోధనలు ఈ అంశాన్ని గట్టిగా చెబుతున్నాయి. గులియన్ బ్యారీ సిండ్రోమ్ అనే వ్యాధి ఏదైనా ఇతర ఇన్ఫెక్షన్ సోకి నయమైన వారిలో కనిపిస్తుంటుంది. దీని వల్ల శరీరంలో కాళ్ల దగ్గర్నుంచి క్రమంగా ఒళ్లంతా చచ్చుబడిపోతుంది. నిజానికి ఒంటి కండరాలు చచ్చుబడేలా చేసే గులియన్ బ్యారీ సిండ్రోమ్‌ను క్రమంగా తట్టుకుని నిలిస్తే కొన్ని నెలల వ్యవధి తర్వాత పరిస్థితి మామూలుగా కావచ్చు. కండరాలు మళ్లీ మెదడు అదుపులోకి రావచ్చు. కానీ ఒక్కోసారి గులియన్ బ్యారీ సిండ్రోమ్ రోగి శ్వాసవ్యవస్థను ప్రభావితం చేస్తే ఊపిరితిత్తులు పనిచేయకుండా పోవచ్చు. దాంతో అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడి, రోగిని ఇంటెన్సివ్ కేర్‌లో చేర్చాల్సిన అవసరం రావచ్చు. జికా వచ్చిపోయాక గులియన్ బ్యారీ సిండ్రోమ్ రావచ్చని, దాని వల్ల ఒళ్లు చచ్చుబడిపోవడం, క్రమంగా పక్షవాతం లక్షణాలు కనిపించడం జరుగుతుందంటున్నారు పరిశోధకులు. ఈ కొత్త సంగతులన్నీ ‘న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్’లో ప్రచురితమయ్యాయి. ప్రస్తుతం గులియన్ బ్యారీ సిండ్రోమ్‌తో బాధపడేవారిలో లోతైన ఆరోగ్య పరీక్షలు నిర్వహించినప్పుడు వారిలో జికా వైరస్ ఉన్నట్లు తేటతెల్లమైంది. ‘‘అవును... జికా తర్వాత గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చేందుకు అవకాశమున్నట్లు తేలింది. ఆ రెండు వ్యాధుల మధ్య ఉన్న సంబంధం స్పష్టమైంది’’ అంటారు ప్యాన్ అమెరికన్ హెల్త్ ఆర్గనైజేషన్‌లోని కమ్యూనికబుల్ డిసీజెస్ విభాగం డెరైక్టర్ డాక్టర్ మార్కోస్ ఎస్పినాల్. బ్రెజిల్, కొలంబియా, ద డొమెనిక్ రిపబ్లిక్, ఎల్ సాల్వెడార్, హోండురాస్, సురినామ్, వెనిజులా వంటి పలు చోట్ల గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చిన అనేక మంది రోగులకు నిర్వహించిన వైద్య పరీక్షలు నిర్వహించినప్పుడు ఇది తెలిసింది. అంటే మనకు నేరుగా కనిపించే ముప్పే గాక... కనిపించని ముప్పు మరింతగా ఉందని స్పష్టమవుతోంది. అయితే గుడ్డిలో మెల్లలా అనిపించే విషయం ఏమిటంటే... డెంగ్యూకూ, గులియన్ బ్యారీ సిండ్రోమ్‌కు నేరుగా సంబంధం ఉన్నట్లు ఈ అధ్యయనాల్లో నిరూపితం కాలేదు. -
ప్రాణాయామం
ఉజ్జయి ప్రాణాయామం ఈ ప్రాణాయామాన్ని సాధన చేస్తే గొంతు, ముక్కు, చెవుల సమస్యలతోపాటు టీబీ, కఫం, ఉబ్బసం, ఉదర సంబంధిత రోగాలు కూడా నయమవుతాయి. మెదడు వేడి తగ్గుతుంది. శ్వాసకోశ వ్యవస్థ, కాలేయం శక్తిమంతం అవుతాయి. వీర్యపుష్టినిస్తుంది. ఇంకా గుండె వ్యాయామం చేసినట్లే. ఎలా చేయాలంటే... వజ్రాసనం లేదా పద్మాసన స్థితిలో కూర్చుని వెన్నెముకను నిటారుగా ఉంచాలి. ఎడమచేతిని చూపుడు వేలిని, బొటన వేలిని చివరలను కలిపి ఉంచేలా (చిన్ముద్రలో) ఉంచి ఆ చేతిని ఎడమ తొడ మీద పెట్టాలి. కుడి చేతి చూపుడు వేలు, మధ్య వేలిని మూసి బొటన వేలితో ముక్కు కుడిరంధ్రాన్ని, ఉంగరపు వేలు, చిటికెన వేలితో ఎడమ రంధ్రాన్ని పాక్షికంగా మూయాలి. ఇప్పుడు కళ్లు మూసుకుని గొంతుతో శబ్దం చేస్తూ దీర్ఘంగా శ్వాస తీసుకోవాలి. పూర్తిగా శ్వాస తీసుకున్న తర్వాత ముక్కు రంధ్రాలను పూర్తిగా మూసి శక్తి మేరకు అంతర కుంభకం (పొట్ట కండరాలను కదిలించడం) చేయాలి. ఆ తర్వాత తల పెకైత్తి శబ్దం చేస్తూ శ్వాసను వదలాలి. శబ్దం మధురంగా ఉండాలి. అంతేతప్ప తీవ్రస్థాయిలో ఉండకూడదు. ఇలా పది నుంచి 12 సార్లు చేసిన తరవాత విశ్రాంతి తీసుకోవాలి. గమనిక: మొదటి దశలోనే 10 రౌండ్లు చేయడం కష్టం. కాబట్టి ఐదారు రౌండ్లతో సరిపెట్టి, నిదానంగా పెంచుకోవాలి.శ్వాసను తీసుకునేటప్పుడు, వదిలేటప్పుడు కూడా ముక్కు రంధ్రాలను పాక్షికంగా మూసి ఉంచాలి. శబ్దం మొదటి నుంచి చివరి వరకు మృదువుగా ఒకే స్థాయిలో ఉండాలి. హెచ్చుతగ్గులు ఉండకూడదు. -
బ్యాక్ బ్యాలెన్స్
1. గోముఖాసన కాళ్లు రెండు ముందుకు సాగదీసి (స్టెచ్ చేసి) కూర్చొని కుడికాలుని మడిచి కుడిపాదం ఎడమ పిరుదు (హిప్) క్రిందకు తీసుకురావాలి. లేదా కుడిపాదం మీద కూర్చోని ఎడమ కాలుని మడిచి కుడికాలుపై నుండి తీసుకువచ్చి కుడి మోకాలు పైన ఎడమ మోకాలు ఉండేట్లు చూసుకోవాలి. ఒక వేళ ఈ స్థితికి రాలేక పోతే రెండు చేతులు భూమి మీద ముందువైపు ఉంచి, సీటు భాగాన్ని పూర్తిగా పైకి లేపాలి. ముందు వైపు ఒక మోకాలు మీదకు రెండో మోకాలు వచ్చే విధంగా ఫ్రీ చేసుకొని మళ్లీ సీటు భాగం భూమి మీదకు తీసుకురావాలి. అప్పుడు ఎడమ చెయ్యి కింద నుండి వెనుకకు, కుడి చెయ్యి పై నుండి వెనుకకు తీసుకువెళ్లాలి. అలాగే కుడి చెయ్యి పై నుండి వెనుకకు తీసుకువెళ్లి కుడి చెయ్యి కుడి చెవికి పక్కన తాకుతూ కుడి మోచేయి ఆకాశం వైపునకు చూపిస్తూ వెనుక రెండు చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేయాలి. తేలిగ్గా ఇంటర్‌లాక్ చేయగలిగినట్లయితే ఎడమ చేతి మణికట్టును కుడి చేతితో పట్టుకునే ప్రయత్నం చేయాలి. శ్వాస వదులుతూ చేతులు రిలీజ్ చేసి ఈ సారి ఎడమ చెయ్యి పై నుంచి, కుడి చెయ్యి కింద నుండి వెనుకకు తీసుకెళ్లి మళ్లీ వేళ్లు ఇంటర్‌లాక్ చేసే ప్రయత్నం చేయాలి. శ్వాస తీసుకుంటూ కాలును మార్చి ఎడమ పాదం కుడి సీటు కిందకు కుడికాలు ఎడమకాలు పైకి కుడి మోకాలు మీదకు ఎడమ మోకాలు ఉంచి రెండువైపులా చేయాలి. వెనుక చేతి వేళ్లను ఇంటర్‌లాక్ చేయలేనివారు తాడు గానీ, టవల్ గానీ ఉపయోగించవచ్చు. చేతులు రెండూ వెనుక సమాంతర రేఖలోకి తీసుకురావడం, మోచేతులు భూమికి ఆకాశానికి చూస్తూ స్ట్రెయిట్ లైన్లో ఉండటం, మోకాలు మీద మోకాలు ఉండటం ముఖ్యం. ఉపయోగాలు: ఛాతి, ఊపిరితిత్తులు విశాలమై శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. సర్వికల్ స్పాండిలైటిస్‌కి పరిష్కారం. మూత్రపిండాలు, అడ్రినల్ గ్రంధి, ఛాతీ కండరాల టోనింగ్ వల్ల వెన్నెముక బలోపేతం. 2. మరీచాసన సుఖాసనంలో కూర్చొని రెండు కాళ్లు ముందుకు సాగదీయాలి, ఎడమకాలుని మడిచి దాన్ని పైకి, శరీరాన్ని కుడివైపుకి, నడుమును కుడివైపునకు తిప్పుతూ కుడికాలు పాదంతో సహా ముందుకు స్ట్రెచ్ చేయాలి. ఎడమచేతిని ఎడమ మోకాలి చుట్టూ పోనిచ్చి దాని మణికట్టును కుడి చేతితో వెనుక నుండి పట్టుకుని, నడుమును కుడివైపు బాగా వంచి శ్వాస తీసుకుంటూ కుడి భుజం నుండి వెనుకకు చూసే యత్నం చేయాలి. శ్వాస వదులుతూ తిరిగి వెనుకకు సాధారణ స్థితికి తీసుకురావాలి. ఇదే విధంగా రెండవ కాలుతో రెండవ వైపు కూడా చేయాలి. శరీరాన్ని నిటారుగా ఉంచి నడుమును ట్విస్ట్ చేయడం చాలా ప్రధానం. ఫొటోలో చూపినట్టు చేయలేనివారు తాడు లేదా టవల్‌ను ఉపయోగించి చేయాలి. కుర్చీలో కూర్చొని కాళ్లను క్రిందకు ఉంచి కుర్చీని సపోర్టుగా తీసుకుని, కుర్చీ వెనక పట్టుకుంటూ నడుమును ట్విస్ట్ చేయవచ్చు. కంప్యూటర్ మీద వర్క్ చేసేవారు నడుము వెన్నెముక స్ట్రెయిన్‌కు ఇది పరిష్కారం ఉపయోగాలు: నడుము కుడి ఎడమకు ట్విస్ట్ చేయడం వలన కాలేయం, పాంక్రియాటిస్, పొట్ట భాగాలకు టోనింగ్. జీర్ణశక్తికి మంచిది. డయాబెటిస్ పేషెంట్లు చేయవలసిన ఆసనం. వెన్నెముక క్రింది లాక్సిజియల్, సాక్రల్, లంబార్ స్పైన్‌కి చాలా మంచిది. నడుము పక్కన కొవ్వు కరిగిస్తుంది. ముద్రలు...బంధనాలు...కుండలిని గురించి తెలుసుకుందాం... ముద్రలు: వ్యాకోచ - సంకోచం కలిగియుండుటమే ముద్ర. దీనిలో ఆసనం, ప్రాణాయామం, ధ్యానం ఇమిడి ఉంటాయి. గ్రంథుల పనితీరును, డార్మెంట్ సైకిక్ పవర్ సెంటర్‌ని ఉత్తేజపరచడానికి ముద్రలు పనికివస్తాయి. ఉదాహరణకు అశ్వినీముద్ర కోసం పద్మాసనంలో కూర్చోవాలి. చేతులు రెండు మోకాళ్ల మీద భూమివైపుకి అరచేతులు ఉంచి మోకాళ్లను సపోర్ట్‌గా ఉపయోగిస్తూ మూలబంధంలో అనగా గుదము దగ్గర కండరాలను, గుదమును లోపలకు లాగి (సంకోచం) మళ్లీ బయటకు ఫ్రీగా వదిలి (వ్యాకోచం) ఈ విధంగా వ్యాకోచ సంకోచ సమయంలో శ్వాస వదిలి.. ఆపి ఉంచి.. సాధారణ స్థితికి వచ్చేటప్పుడు శ్వాస తీసుకుంటూ రిలాక్స్ అవ్వాలి. ఉపయోగాలు: రెక్టమ్ గుదముకు పెద్ద ప్రేవు చివరి (సిగ్మాయిడ్ కోలన్) భాగాలకు సంబంధించిన పైల్స్, ఫిస్టులా, ఫిసర్ వంటి వ్యాధుల నివారణకు, పరిష్కారానికి ఉపయోగపడుతుంది. గమనిక: ఇందులో ఆసనం - పద్మాసనం. ప్రాణాయామం - శ్వాసను వదిలి బంధించి చేయడం,తరువాత శ్వాస తీసుకుంటూ ధ్యానం చేయడం. ధ్యానం - చాలా ఏకాగ్రతమైన మనసుతో చేసినప్పుడే గుద కండరాల మీద పట్టు దొరుకుతుంది. ఇటువంటి ముద్రలు ఘెరండ సహిత ప్రకారం 26, శివసంహిత ప్రకారం 11, మొత్తం 37 ముద్రలు ఉన్నాయి. బంధనాలు: బంధనం అనగా కండరాలను లాక్ చేసి ఉంచడం. ఇక్కడ వ్యాకోచ-సంకోచాలు ఉండవు. శ్వాస వదిలి కండరాలను బంధించి ఉంచడమే ముద్ర. ఇన్వాలంటరీ మజిల్స్‌ను కూడా బంధనం చేయవచ్చు. శరీరంలోని వ్యవస్థల మీద నియంత్రణ సాధించి వాటి పనితీరును మెరుగు పరచవచ్చు. ఉదాహరణకు త్రిమింధనం: మూలబంధ్, ఉడ్యాన బంధ్, జలందర్ బంధ్. మూల బంధ్ అంటే గుద కండరాలను బంధించడం. ఉడ్యాన బంధ్ అంటే పొట్టకండరాలను బంధించడం. జలందర్ బంధ్ అనగా గడ్డం చాతీమీదకు ఆనించి బంధించడం. పద్మాసనంలో కూర్చొని శ్వాస వదిలి ఈ 3 బంధనాలను ఉపయోగించి 15 లేదా 30 సెకన్ల తరువాత శ్వాసతీసుకుంటూ వెనుకకు యధాస్థితికి రావాలి. ఉపయోగాలు: మూలబంధ్ మలవిసర్జన వ్యవస్థకు, ఉడ్యానబంధ్ జీర్ణవ్యవస్థకు, జలందర్ బంధ్, థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథులకు మంచిది. హఠయోగాలో చివరి భాగమైన కుండలిని గురించి వచ్చేవారం....