rex tillerson
-
ట్రంప్ క్లారిటీ ఇచ్చారు.. వాళ్లే తేల్చుకోవాలి
న్యూయార్క్ : జెరూసలేం భూభాగ పరిధి, స్థితిగతులపై తుది నిర్ణయం తీసుకోవాల్సింది ఇజ్రాయెల్ వాసులు, పాలస్తీనీయన్లు మాత్రమేనని అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ అన్నారు. తమ అధ్యక్షుడు కేవలం జెరూసలేం ఇజ్రాయెల్ రాజధానిగా గుర్తిస్తున్నామని మాత్రమే చెప్పారని, ఇక దాని పరిధి విషయం వారే తేల్చుకోవాలని అన్నారు. ప్యారిస్‌లో ఫ్రెంచ్ విదేశాంగ మంత్రి జీన్ యెస్ లెడ్రియాన్తోపాటు జరిగిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆయన (డోనాల్డ్ ట్రంప్) ఇజ్రాయెల్ ఫైనల్ స్టేటస్ విషయంలో చాలా స్పష్టంగా ఉన్నారు. సరిహద్దులువంటి అంశాలను ఆయన ఇరువురి చర్చలకు వదిలేసినట్లు తెలిపారు. ఇద్దరు కలిసి చర్చంచుకొని ఒక నిర్ణయానికి రావొచ్చని అన్నారు. ఇజ్రాయెల్ రాజధానిగా జెరూసలేంను గుర్తిస్తున్నామంటూ ట్రంప్ ఈ వారంలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే. ఈ ప్రకటనతో దాదాపు కొన్ని దశాబ్దాలుగా ఇజ్రాయెల్ విషయంలో ఉన్న అమెరికా పాలసీ విధానం మొత్తాన్ని మార్చేశారు.ట్రంప్ నిర్ణయం అరబ్ ముస్లి దేశాలకు తీవ్ర ఆగ్రహం తెప్పించింది. యురోపియన్ ఖండంలోని కొన్ని దేశాలు కూడా తీవ్రంగా విమర్శించాయి. -
స్వీయ ప్రయోజనాలే ముఖ్యం
ఉగ్రవాదం విషయంలో పాకిస్తాన్‌తో కఠినంగా వ్యవహరించాలని, భారత్‌కు ప్రాధాన్యమిచ్చేలా దక్షిణాసియా విధానానికి రూపకల్పన చేయాలని అమెరికా నిర్ణయించినట్టు కథనాలు హోరెత్తుతుండగా ఆ దేశ విదేశాంగమంత్రి రెక్స్ టిల్లర్ సన్ తొలిసారి మన దేశంలో రెండురోజులు పర్యటించారు. డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడయ్యాక ఆ దేశం నుంచి వచ్చిన రెండో ఉన్నతస్థాయి నేత టిల్లర్సన్. గత నెలలో అమెరికా రక్షణ మంత్రి జేమ్స్ మాటిస్ వచ్చారు. ఇరు దేశాలకూ ఉమ్మడి లక్ష్యాలుండటం, ఇవి రెండూ మరింత సాన్నిహిత్యం కావాలని కోరుకోవడం మొత్తంగా ప్రపంచానికీ, ప్రత్యేకించి ఆసియాకూ ప్రయోజనకర మని ప్రధాని నరేంద్రమోదీ, టిల్లర్సన్లు అభిప్రాయపడ్డారు. అమెరికా నుంచి గత కొంతకాలం నుంచి వెలువడుతున్న అనుకూల సంకేతాల ప్రభావంవల్ల కావొచ్చు మన పాలకులకు ఆశావహ దృక్పథం ఏర్పడింది. అంతక్రితం మాటెలా ఉన్నా రెండు దశాబ్దాల నుంచి మన దేశంపై అమెరికా సానుకూల వైఖరితోనే ఉంటున్నది. అయితే పాకిస్తాన్ విషయానికొచ్చేసరికి మాత్రం ఎంతో కొంత అటు వైపే మొగ్గు ఉంటోంది. అంతకు అనేక దశాబ్దాల ముందు నుంచి పాకిస్తాన్‌తో ముడిపడి ఉన్న బంధమే ఇందుకు కారణం. డోనాల్డ్ ట్రంప్ రాకతో ఇదంతా మారిపోతుందన్న అభిప్రాయం మన పాలకులకు కలిగింది. అధ్యక్ష ఎన్నికల ప్రచారం సందర్భంగా ఆయన పాకిస్తాన్ పోకడలపై విరుచుకుపడటమే ఇందుకు కారణం. దానికి కొనసాగింపుగా మొన్న ఆగస్టులో పాకిస్తాన్‌ను తీవ్రంగా తప్పు బడుతూ ట్రంప్ మాట్లాడారు. పాక్ గూఢచార సంస్థ ఐఎస్ఐపై నిప్పులు చెరి గారు. ఉగ్రవాద ముఠాలకు ఆశ్రయం ఇవ్వడం మానుకోనట్టయితే చర్యలు తప్ప వని హెచ్చరించారు. అయితే రెండు నెలలు గడవకముందే ఉగ్రవాదుల విష యంలో పాకిస్తాన్ సహకారానికి పొంగిపోతూ వ్యాఖ్యానాలు చేశారు. ఆ వెంటనే వైట్‌హౌస్ చీఫ్ జాన్ కెల్లీ పాక్ గొప్ప భాగస్వామ్య దేశమని ప్రశంసిస్తే... టిల్లర్ సన్ దక్షిణాసియా సుస్థిరతలో పాకిస్తాన్‌ది కీలక పాత్ర అన్నారు. అమెరికా ఇలా పరస్పర విరుద్ధమైన వైఖరులను ప్రదర్శిస్తున్న దశలో టిల్లర్సన్ భారత్ పర్య టనకు ప్రాముఖ్యముంది. మన దేశం వచ్చే ముందు ఆయన అఫ్ఘానిస్తాన్ వెళ్లారు. అటునుంచి పాకిస్తాన్ వెళ్లి అక్కడి నేతలతో మాట్లాడారు. దక్షిణాసియాలోనే కాదు...ఆసియా–పసిఫిక్ ప్రాంతంలో సైతం భారత్ పాత్ర అత్యంత కీలకమైనదని టిల్లర్సన్ భావిస్తున్నారు. నిబంధనల చట్రంలో, ఇతర దేశాల సార్వభౌమాధికారాన్ని గుర్తిస్తూ భారత్ బాధ్యతాయుతంగా ఎదిగితే... ఆ పక్కనున్న చైనా ఆ స్థాయి బాధ్యతను ప్రదర్శించకుండా, అప్పు డప్పుడు అంతర్జాతీయ విధానాలకు, నిబంధనలకు విరుద్ధంగా ఎదిగిందని గతవారం వాషింగ్టన్లో టిల్లర్సన్ ఒక సెమినార్లో చెప్పారు. అలాగే భద్రతకు సంబంధించి భారత్‌కున్న ఆందోళన, ఆత్రుత తమవి కూడానని అభయ మిచ్చారు. ఇవి యధాలాపంగానో, యాదృచ్ఛికంగానో చెప్పిన మాటలు కాదు. మన దేశం పర్యటించే ముందు ఉద్దేశపూర్వకంగా చెప్పినవే. అమెరికా దృష్టిలో మనకెంత ప్రాధాన్యమున్నదో, అది మన నుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పడమే ఆయన ప్రసంగం సారాంశం. గతంలో తనకూ, ఇతర పాశ్చాత్య దేశాలకుండే ఉగ్రవాద బెడదను ఒకరకంగా...మన దేశానికుండే ఉగ్రవాద బెడదను మరోలా చూసే వైఖరితో ఉన్న అమెరికా ఇప్పుడు ఆ రెండింటినీ ఒకేలా చూస్తున్నట్టు చెప్పడం కొత్త పరిణామం. పాకిస్తాన్ చైనాకు దగ్గరవుతున్నదన్న అనుమానాలు, అఫ్ఘాన్ భద్రత, పునర్నిర్మాణం అంశాల్లో ఇకపై భారత్ ప్రమేయం కూడా పెంచా లన్న అభిప్రాయంవంటివి ఇందుకు దోహదపడ్డాయి. పైగా చైనాను కట్టడి చేయా లన్న తన వ్యూహంలో భారత్ కీలక పాత్ర పోషించవలసి ఉంటుందని అది లెక్కే స్తున్నది. అందుకే భారత్ వచ్చేముందు పాకిస్తాన్ వెళ్లిన టిల్లర్సన్ ఆ దేశ ప్రధాని అబ్బాసీతో నిష్కర్షగానే మాట్లాడారు. పాకిస్తాన్‌తోనూ, చైనాతోనూ భారత్‌కున్న సమస్యల నేపథ్యంలో అమెరికా తాజా వైఖరి సహజంగానే మనకు ఆశావహంగా అనిపిస్తుంది. రెండు దశా బ్దాలుగా పాకిస్తాన్ తీరుతెన్నుల గురించి మనం ఎంతగా చెబుతున్నా ఖాతరు చేయని అమెరికాలో ఈ మార్పు రావడం మంచి పరిణామమేనన్న అభిప్రాయం విశ్లేషకుల్లో కూడా ఉంది. అయితే దక్షిణాసియాలోగానీ, ఆసియా–పసిఫిక్ ప్రాంతంలోగానీ పూర్తిగా స్వీయ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వ్యవ హరించడమే మన దేశానికి అన్నివిధాలా శ్రేయస్కరం. ఈ విషయంలో అమెరికాయే మనకు ఆదర్శం. ఆర్థిక సంస్కరణల అనంతరం రెండు దశా బ్దాలుగా మన దేశంతో ఆర్ధిక, వాణిజ్య రంగాల్లో ఎంతో సన్నిహితంగా ఉంటున్నా, మన మార్కెట్ల వల్ల అపారంగా లాభపడుతున్నా ఉగ్రవాదంపై జరిగే పోరాటంలో మన దేశానికి అది ఏనాడూ పెద్దగా సహకరించలేదు. ముఖ్యంగా 2008లో ముంబై నగరంపై జరిగిన ఉగ్రవాద దాడి వెనక ఉన్న కుట్రను వెలికితీయడంలో అది సాయపడలేదు. కనీసం తనకు పట్టుబడిన లష్కరే తొయిబా ఏజెంట్ డేవిడ్ హెడ్లీని దర్యాప్తు నిమిత్తం మన దేశానికి అప్ప గించేందుకు సిద్ధపడలేదు. తమ దేశం వచ్చి తమ అధికారుల సమక్షంలో ప్రశ్నించడానికి మాత్రమే వీలుకల్పించింది. పైగా ఏదో ఒక కారణం చూపి ఆ దేశానికి ఆయుధ సామగ్రి అమ్ముకుంటూనే ఉంది. చిరకాల మిత్రదేశం పాకిస్తాన్‌కు ఆగ్రహం తెప్పించరాదన్నదే దీని వెనకున్న ఉద్దేశం. మన దేశం కూడా అదే తరహాలో ఇప్పుడు స్వీయ ప్రయోజనాల సాధనకు కృషి చేయాలి. మన ఇరుగుపొరుగు దేశాలతో సమస్యలున్నప్పుడు వాటితో చర్చించడం, పరిష్కారానికి కృషి చేయడంతోపాటు అమెరికాతో సహా అందరి మద్దతూ కూడగట్టుకోవడం ముఖ్యమే. అయితే ఈ క్రమంలో మన భద్రత, మన ప్రయోజనాలే గీటురాళ్లుగా స్వీయ విధానాన్ని రూపొందించుకోవాలి. ఆచితూచి అడుగేయాలి. -
భారత్.. మా విశ్వసనీయ భాగస్వామి
వాషింగ్టన్ : అమెరికాకు భారత్ అత్యంత విశస్వసనీయ భాగస్వామి అని అమెరికా సెక్రెటరీ ఆఫ్ స్టేట్ రెక్స్ టిల్లర్సన్ బుధవారం స్పష్టం చేశారు. ఇరు దేశాలు పరస్పర సహకారంతో ముందుకు నడుస్తాయని ఆయన ప్రకటించారు. ప్రపంచంలోని అతి పెద్ద ప్రజాస్వామ్య దేశాలైన అమెరికా-భారత్‌లు.. వందేళ్ల భవిష్యత్ కోసం కలసి ముందుకు సాగుతాయని చెప్పారు. కొంత కాలంగా భారత్‌తో ప్రజాస్వామ్య బంధం బలుపడుతోందని చెప్పిన ఆయన.. ఇది మరింద ధృఢతరం కావాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. ఇండో-పసిఫిక్ రీజియన్‌లో శాంతి, భద్రత, స్థిరత్వం కోసం భారత్‌తో కలిసి అమెరికా పనిచేస్తుందని చెప్పారు. ఉగ్రవాదాన్ని నిర్మూలించేందుకు భారత్ కలిసి పోరాటం చేస్తామని ఆయన ప్రకటించారు. ఆర్థిక, వాణిజ్య పరంగానూ అమెరికా-భారత్ మధ్య సంబంధాలు అవసరమని ఆయన చెప్పారు. గతంలోనూ, ఇప్పుడు భారత్ పలు ఆర్థిక సంస్కరణలను విజయవంతంగా అమలు చేసిందని కితాబిచ్చారు. భారత్‌పై ప్రశంసలు వర్షం కురిపించిన ఆయన.. చైనాపై అదే స్థాయిలో తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్యంపై అంతర్జాతీయ చట్టాలకు చైనా సవాలు చేస్తోందని ఆయన విమర్శించారు. మొదటి నుంచి చైనాతో అమెరికా నిర్మాణాత్మక సంబంధాలనే కోరుకుందని ఆయన అన్నారు. అయితే భారత్ వంటి పొరుగు దేశాల సార్వభౌమాధికారాలకు నష్టం కలిగించే రీతిలో చైనా వ్యవహరిస్తోందని ఆయన చెప్పారు. ఇటువంటి సమయంలో భారత్‌కు విశ్వసనీయమైన భాగస్వామి కావాలి. మా భాగస్వామ్య విలువలు ప్రపంచ శ్రేయస్సుకు, శాంతి సుస్థిరతలను కాపాడే విధంగానే ఉంటాయని నమ్మకంగా చెబుతున్నానని టిల్లర్సన్ వెల్లడించారు. -
క్లింటన్, బుష్, ఒబామా ఫెయిల్.. నేను మాత్రం అవ్వను
న్యూయార్క్ : అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి ఉత్తర కొరియాపై అసహనం వ్యక్తం చేశారు. అంతేకాదు, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌కు ఓ కొత్త పేరును తగిలించారు. కిమ్ జాంగ్‌కు 'పొట్టి రాకెట్ మనిషి' (లిటిల్ రాకెట్ మ్యాన్) అంటూ పేరు పెట్టారు. తమ విదేశాంగ కార్యదర్శి అనవసరం తన శక్తిని వృధా చేసుకుంటున్నారని, అసలు ఉత్తర కొరియాతో చర్చలు ముమ్మాటికి అనవసరం అంటూ తీవ్రంగా మండిపడ్డారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్లో పలు ట్వీట్ల వర్షం కురిపించారు. ఉత్తర కొరియాతో చర్చలకు సిద్ధమని అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్ సన్ చెప్పిన విషయం తెలిసిందే. అయితే, దీనిపై స్పందించిన ట్రంప్.. 'మిస్టర్ టిల్లర్ సన్.. మీ శక్తిని సంరక్షించుకోండి. పొట్టి రాకెట్ మనిషి(కిమ్ జాంగ్ ఉన్)కి మనం ఏం చేయాలో అదే చేద్దాం. ఆ దేశంతో చర్చలు అనవసరం.. మా రెక్స్ టిల్లర్సన్ మా అద్భుతమైన విదేశాంగ కార్యదర్శి అనవసరం ఆయన శక్తిని వృధా చేసుకుంటున్నారు. ఆ పొట్టి రాకెట్ మనిషితో చర్చలు అనే మాట టైం వేస్ట్ తప్ప మరొకటి కాదు.. అయినా 25 ఏళ్ల తర్వాతనే నేను ఆ పొట్టి రాకెట్ మనిషితో ఎందుకు పోరాడాల్సి వస్తుంది ఎందుకంటే.. క్లింటన్ ఫెయిలయ్యారు.. బుష్ ఫెయిలయ్యారు.. ఆఖరికి ఒబామా కూడా ఫెయిలయ్యారు.. కానీ నేను మాత్రం ఫెయిలవ్వను' అంటూ వరుసగా ట్రంప్ ట్విట్టర్లో రాసుకొచ్చారు. -
'కిమ్‌తో డైరెక్టుగా మాట్లాడే మార్గం ఉంది'
బీజింగ్ : ఉత్తర కొరియాతో నేరుగా మాట్లాడగల కమ్యునికేషన్ వ్యవస్థ తమకు ఉందని, దానిని ఇప్పటికీ కొనసాగిస్తున్నామని అమెరికా విదేశాంగ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ చెప్పారు. ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితుల నెలకొన్నిప్పటికీ, దేశాధ్యక్షులు ఒకరిపై ఒకరు దూకుడుగా వ్యవహరిస్తున్నప్పటికీ చర్చలకు కావాల్సిన ఏర్పాట్లు ఉన్నాయని చెప్పారు. అయితే, ఉత్తర కొరియా అసలు చర్చలకు సిద్ధంగా ఉందా లేదా అనే విషయాన్ని ప్రస్తుతం తమ అధికారులు విచారణ చేస్తున్నారన్నారు. వెంటనే అణు పరీక్షలు ఆపేయాలని, శాంతియుత పరిస్థితులు స్థాపించాలని ఇప్పటికే పిలుపునిచ్చామని తెలిపారు. 'ప్యాంగ్యాంగ్తో కమ్యూనికేషన్‌కు మాకు లైన్స్ ఉన్నాయి. మేం అంత గడ్డు పరిస్థితుల్లో లేము.. ప్యాంగ్ యాంగ్తో మాట్లాడేందుకు రెండు నుంచి మూడు చానల్స్ మాకున్నాయి. మేం వారితో మాట్లాడగలం.. మాట్లాడతాం' అని ఆయన స్పష్టం చేశారు. అయితే, ఎలాంటి చానల్స్ ఉన్నాయనే ప్రశ్నకు మాత్రం ఆయన సమాధానం చెప్పలేదు. బీజింగ్‌లో చైనా అధ్యక్షుడు జీజిన్పింగ్ను కలిసిన సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. -
‘రష్యా ఫెయిలైంది.. అందుకే మేం దిగాం’
వాషింగ్టన్: సిరియా విషయంలో రష్యా విఫలమైందని అమెరికా ఆరోపించింది. రసాయన ఆయుధాల బారి నుంచి సిరియాను రక్షిస్తామని 2013లో తీసుకున్న బాధ్యతను నిర్వర్తించడంలో ఆ దేశం ఘోర వైఫల్యం చెందిందని అమెరికా ప్రభుత్వ సహాయ కార్యదర్శి రెక్స్ టిల్లర్సన్ మండిపడ్డారు. వచ్చేవారమే ఆయన మాస్కో పర్యటనకు వెళ్లనున్న నేపథ్యంలో తాజాగా చేసిన ఈ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ట్రంప్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రతినిధిగా తొలిసారి రష్యాలో వచ్చే వారం టిల్లర్సన్ అడుగుపెట్టనున్నారు. ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు చేసుకునేందుకు, ద్వైపాక్షిక సంబంధాలు మెరుగుపరుచుకునేందుకు, గతంలో చేసుకున్న ఒప్పందాలను మరింత పటిష్టం చేసుకునేందుకు అమెరికా ప్రతినిధిగా టిల్లర్సన్ రష్యా పర్యటనకు వెళబోతున్నారు. ఈలోగా, భారత కాలమానం ప్రకారం శుక్రవారం తెల్లవారుజామున 6 గంటల ప్రాంతంలో సిరియాలోని షైరత్ వైమానిక స్థావరంపై సుమారు 60 వరకు తోమహాక్ క్షిపణులను అమెరికా ప్రయోగించింది. తిరుగుబాటుదారుల ఆధీనంలో ఉన్న ప్రాంతంపై సిరియా వైమానిక దళం పాల్పడిన రసాయన దాడులకు ప్రతీకారంగానే ఈ క్షిపణి దాడి చేసినట్లు చెప్పింది. ఈ దాడిని ప్రస్తుతానికి సిరియాకు అండగా ఉన్న రష్యా, ఇరాన్‌లు ఖండించాయి. ఈ నేపథ్యంలో రష్యా విఫలమైనందునే తాము రంగంలోకి దిగామంటూ అమెరికా తరుపున టిట్టర్సన్ ప్రకటన చేశారు. అంతేకాదు, సిరియా పాలకుడు బషర్ అల్ అస్సాద్ ఆదేశాలతోనే రసాయన విషవాయువుల బాంబుదాడులు జరిగాయని తమకు పూర్తి సమాచారం ఉందని కూడా ప్రకటించారు. అమాయకులైనవారిని విషవాయువులతో పొట్టన పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. -
మన మధ్య దలైలామా వద్దు
బీజింగ్: చైనా, ప్రవాసంలో ఉన్న టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలైలామా మధ్య చర్చలకు చొరవ చూపుతామన్న అమెరికా విదేశాంగ మంత్రి రెక్స్ టిల్లర్సన్ వ్యాఖ్యలపై చైనా తీవ్రంగా స్పందించింది. చైనాకు వ్యతిరేకంగా దలైలామాను పురమాయించే యత్నాలను అమెరికా మానుకోవాలని, దాని వల్ల అమెరికాకు ఎలాంటి ప్రయోజనం కలగక పోగా, చైనా–అమెరికా సంబంధాలు దెబ్బతింటాయని చైనీస్ పీపుల్స్ పొలిటికల్ కన్సల్టేటివ్ కాన్ఫరెన్స్ విలువలు, మత వ్యవహారాల కమిటీ చైర్మన్ ఝూ వీకున్ హెచ్చరించారు.