Rupee Decline
-
తక్షణం తగ్గినా.. భవిత ‘బంగారమే’!
పుత్తడిపై కస్టమ్స్ సుంకాలు 15% నుంచి 6%కి తగ్గిస్తున్నట్లు వార్షిక బడ్జెట్ ప్రసంగంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించిన వెంటనే ఇటు స్పాట్లో అటు ఫ్యూచర్స్ మార్కెట్లలో రూ.4,000 వరకూ పడిపోయిన పసిడి ధరలు.. ఇదే రీతిలో ముందు ముందు ఆభరణ ప్రియులకు అంతే సంతోషాన్ని కలిగించే అవకాశాలు తక్కువగా ఉన్నాయి. అంతర్జాతీయ అంశాలతో పాటు దేశీయంగా రూపాయి విలువ పతనం ఇందుకు కారణం.→ భౌగోళిక ఉద్రిక్తతలను మొదట ప్రధాన కారణంగా చెప్పవచ్చు. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతలు, దీనికి పశ్చిమ దేశాల మద్దతు అలాగే చైనాతో అమెరికాకు ఉన్న రాజకీయ ఉద్రిక్తతలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అనిశ్చితికి దారితీసే అంశాలు. ఎలాంటి ఉద్రిక్తతలు నెలకొన్నా.. పెట్టుబడి సాధనంగా ఇన్వెస్టర్ బంగారం వైపే చూస్తాడనడంలో సందేహం లేదు. → ఇక రెండో అంశానికి వస్తే.. అమెరికాతో సహా పలు దేశాలు సరళతర వడ్డీరేట్ల విధానంలోకి మారినప్పటికీ ఆ విధానాన్ని ఎంతవరకూ కొనసాగిస్తాయో తెలియని పరిస్థితి. సరళతర వడ్డీరేట్ల విధానంతో బంగారంలో కొనుగోళ్లు పెరుగుతాయి. అయితే ఈ విధానం కొనసాగింపునకు ప్రపంచవ్యాప్తంగా ద్రవ్యోల్బణం సమస్యలు, సవాళ్లు ఉన్నాయి. → కీలక మూడవ అంశం.. రూపాయి విలువ. డాలరుతో రూపాయి మారకం విలువ సరికొత్త కనిష్ట స్థాయి రికార్డులను కొనసాగిస్తోంది. బుధవారం ఆల్‌టైమ్ కనిష్టం 83.71 వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 83.72 కనిష్టాన్ని తాకింది. → భౌగోళిక ఆర్థిక అనిశ్చితి అంశాల నేపథ్యంలో... అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్ న్యూయార్క్ కమోడిటీ ఎక్సే్చ ంజ్లో ఈ నెల 16వ తేదీన ఔన్స్ కు (31.1గ్రా) ఆల్‌టైమ్ హై 2,489 డాలర్లను తాకిన పసిడి ఆగస్టు కాంట్రాక్ట్ ధర అటు పై కొంత తగ్గినప్పటికీ... పటిష్ట స్థాయిలోనే కొనసాగుతోంది. అంతర్జాతీయ ఫ్యూ చర్స్లో 18 డాలర్లు అధికంగా 2,425 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. భారత్‌లో రూపాయి క్షీణిస్తూ... అంతర్జాతీయంగా ధర పెరుగుదల ధోరణే కొనసాగిస్తే దేశీయంగా సైతం బంగారం మున్ముందుకే సాగుతుందనడంలో సందేహం లేదు. పెట్టుబడులకు ప్లస్సే... దేశీయంగా శుభకార్యాల్లో భారతీయులు పసిడి కొనుగోళ్లకు ఎంత ప్రాధాన్యత ఇస్తారో అందరికీ తెలిసిన అంశమే. ఇది ఎలాగూ తప్పని అంశం. ఇక పసిడి పెట్టుబడులకు ఇది తగిన అవకాశమనడంలో సందేహం లేదు. వినియోగదారులకు ధరల తగ్గుదల ఇప్పుడు ప్రయోజనకరంగా ఎలానూ ఉంటుంది. తక్కువ ఖర్చులు అలాగే 2.5% వార్షిక వడ్డీని అందించే సావరిన్ గోల్డ్ బాండ్స్ వంటి డిజిటల్ ఆప్షన్లలో పెట్టుబడి పెట్టడానికి ఇది సరైన సమ యం అనడంలో సందేహం లేదు.దేశీయంగా రెండోరోజూ భారీ తగ్గుదల బడ్జెట్లో నిర్ణయంతో దేశీయంగా రెండవరోజూ బుధవారమూ దేశీయంగా ధరలు భారీగా తగ్గాయి. దేశ రాజధానిలో 99.9 స్వచ్ఛత ధర 10 గ్రాములకు రూ.650 తగ్గి, రూ. 71,650కి చేరింది. 99.5 స్వచ్ఛత ధర కూడా ఇంతే స్థాయిలో దిగివచ్చి రూ. 71,300కు దిగివచి్చంది. ఇక మంగళవారం రూ.4 వేల వరకూ తగ్గిన వెండి ధర బుధవారం అక్కడక్కడే 87,500 వద్ద ముగిసింది. దేశ రాజధాని ముంబైలో 99.9, 99.5 స్వచ్ఛత ధరలు వరుసగా రూ. 451, రూ.449 తగ్గి రూ.69,151, రూ.68,874కు దిగివచ్చాయి. వెండి ధర రూ.57 తగ్గి రూ.84,862 వద్ద ముగిసింది. -
రూపాయి... పతనాల రికార్డు
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ ‘కనిష్ట పతన రికార్డులు’ కొనసాగుతున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో శుక్రవారం రూపాయి విలువ 19 పైసలు నష్టపోయి 77.93కు పతనమైంది. క్రూడ్ ఆయిల్ ధరల తీవ్రత, దేశం నుంచి విదేశీ నిధులు భారీగా వెనక్కు మళ్లడం, ఈక్విటీ మార్కెట్ల పతనం, అంతర్జాతీయంగా డాలర్ బలోపేత ధోరణి రూపాయి బలహీనతలకు ప్రధాన కారణాలు. రూపాయి గురువారం ముగింపు 77.74. ఇంట్రాడేలో జీవితకాల కనిష్ట స్థాయి 77.81ని చూసింది. అయితే శుక్రవారం ట్రేడింగ్‌లో 77.81 వద్దే ప్రారంభమైంది. 77.79 స్థాయిని దాటి ఏ దశలోనూ బలపడలేదు. ప్రస్తుత పరిస్థితుల్లో రూపాయి 80 వరకూ బలహీనపడే అవకాశం ఉందన్న అంచనాలున్నాయి. ఇక ఈ వార్త రాస్తున్న రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ బలహీనంగా 77.90 వద్ద ట్రేడవుతోంది. ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ పటిష్టంగా 104.20 వద్ద ట్రేడవుతోంది. ఇక బ్రెంట్, నైమెక్స్ క్రూడ్ బేరల్‌కు 120 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి. ఇదిలావుండగా, జూన్ 3తో ముగిసిన వారంలో దేశ ఫారెక్స్ నిల్వల పరిస్థితి 601.057 బిలియన్ డాలర్లుగా ఉంది. అంతక్రితం వారంతో పోల్చితే 306 మిలియన్ డాలర్లు తగ్గాయి. -
సెన్సెక్స్ మైనస్.. నిఫ్టీ ఫ్లస్..!
ముంబై: రికార్డు ర్యాలీతో దూసుకెళ్తున్న సూచీలకు బుధవారం చిన్న బ్రేక్ పడింది. ఆర్థిక రంగ షేర్లలో విక్రయాలు తలెత్తడంతో ట్రేడింగ్ ఆద్యంతం ఆటుపోట్లకు లోనైన సూచీలు... చివరి గంట కొనుగోళ్లతో మిశ్రమంగా ముగిశాయి. సెన్సెక్స్ 37 పాయింట్ల నష్టంతో 44,618 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 5 పాయింట్ల లాభంతో 13,114 వద్ద నిలిచి తన ముగింపు రికార్డును నిలుపుకుంది. ఆర్థిక రంగ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లకు స్వల్ప కొనుగోళ్ల మద్దతు లభించింది. అంతర్జాతీయ మార్కెట్ల నష్టాల ట్రేడింగ్, రూపాయి 13 పైసల క్షీణత మన మార్కెట్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి. ఇంట్రాడేలో సెన్సెక్స్ 560 పాయింట్ల రేంజ్లో 44,730 – 44,170 మధ్య కదలాడింది. నిఫ్టీ 145 శ్రేణిలో 13,129–12,984 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. నగదు విభాగంలో బుధవారం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) రూ. 357 కోట్లను ఇన్వెస్ట్ చేయగా.. దేశీ ఫండ్స్(డీఐఐలు) రూ. 1,636 కోట్ల విలువైన అమ్మకాలు చేపట్టాయి. భారీ నష్టాల నుంచి రికవరీ...: అంతర్జాతీయ మార్కెట్ల బలహీన సంకేతాలతో మన మార్కెట్ స్వల్ప నష్టంతో మొదలైంది. ప్రారంభం నుంచే అధిక వెయిటేజీ కలిగిన బ్యాంకింగ్, ఫైనాన్స్ రంగ షేర్ల పతనంతో సూచీలు భారీ పతనాన్ని చవిచూశాయి. ఒకదశలో సెన్సెక్స్ 44,170, నిఫ్టీ 12,984 వద్ద ఇంట్రాడే కనిష్టాలను నమోదు చేశాయి. ఆటో షేర్ల ర్యాలీ...: పండుగ సీజన్ కలిసిరావడంతో నవంబర్‌లో వాహన విక్రయాల జోరు కారణంగా బుధవారం ఈ రంగ షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించింది. బజాజ్ ఆటో, ఎంఅండ్ఎం టాటా మోటర్స్, మారుతీ సుజుకీ, ఆశోక్ లేలాండ్ షేర్లు 1–3 శాతం స్థాయిలో లాభపడ్డాయి. -
కరోనా 2.0 పంజా!
కొన్ని దేశాల్లో రెండో దశ కరోనా కేసులు పెరుగుతుండటంతో అంతర్జాతీయంగా ఆర్థిక రికవరీ ఆశలకు గండి పడింది. దీంతో ప్రపంచ మార్కెట్లతో పాటే మన మార్కెట్ కూడా సోమవారం భారీగా నష్టపోయింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు తగ్గి 76.03కు చేరడం, మన దేశంలో కూడా కరోనా కేసులు అంతకంతకూ పెరిగిపోతుండటం, ద్రవ్యోల్బణ, పారిశ్రామికోత్పత్తి గణాంకాలు నిరాశపరచడం... ప్రతికూల ్రçపభావం చూపించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 552 పాయింట్ల నష్టంతో 33,229 పాయింట్ల వద్ద, ఎన్ఎస్ఈ నిఫ్టీ 159 పాయింట్లు పతనమై 9,814 పాయింట్ల వద్ద ముగిశాయి. ఈ రెండు సూచీలు చెరో 1.6 శాతం మేర నష్టపోయాయి. వరుసగా మూడో ట్రేడింగ్ సెషన్లోనూ ఈ సూచీలు పతనమయ్యాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ పుంజుకోవడంతో నష్టాలు ఒకింత తగ్గాయి. బ్యాంక్, ఆర్థిక, రియల్టీ, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఇంధన, ఫార్మా రంగ షేర్లలో వేల్యూ బయింగ్ చోటుచేసుకుంది. రోజుకు లక్ష కరోనా కేసులు... కరోనా వైరస్‌కు పుట్టినిల్లయిన చైనాతో పాటు అమెరికాతో సహా పలు దేశాల్లో మళ్లీ కరోనా కేసులు ప్రబలుతున్నాయి. మొత్తం మీద ప్రపంచవ్యాప్తంగా కొత్త, పాత కరోనా కేసులు కలిపి రోజుకు లక్షకు పైగా తేలుతున్నాయి. దీంతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ రికవరీపై ఆందోళన నెలకొంది. ఇక మన దగ్గర గత మూడు రోజులుగా రోజుకు 10,000 మేర కరోనా కేసులు వస్తుండటంతో మార్కెట్ సెంటిమెంట్ దెబ్బతిన్నది. రోజంతా నష్టాలు... ఆసియా మార్కెట్ల బలహీనతతో సెన్సెక్స్, నిఫ్టీలు నష్టాల్లోనే ఆరంభమయ్యాయి. రోజంతా నష్టాలు కొనసాగాయి. ఒక దశలో సెన్సెక్స్ 857 పాయింట్లు, నిఫ్టీ 247 పాయింట్ల మేర పతనమయ్యాయి. యూరప్ సూచీలు నష్టాల నుంచి ఒకింత రికవరీ కావడం, అమెరికా ఫ్యూచర్లు కూడా రికవరీ బాట పట్టడం, రిలయన్స్ ఇండస్ట్రీస్ పుంజుకోవడంతో మన దగ్గర మధ్యాహ్నం తర్వాత నష్టాలు తగ్గాయి. ఆసియా మార్కెట్లు 1–5 శాతం రేంజ్లో, యూరప్ మార్కెట్లు 1 శాతం రేంజ్లో నష్టపోయాయి. ► ఇండస్ఇండ్ బ్యాంక్ 7 శాతం నష్టంతో రూ.490 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా నష్టపోయిన షేర్ ఇదే. ► స్టాక్ మార్కెట్ నష్టపోయినా పలు షేర్లు ఏడాది గరిష్ట స్థాయిలకు ఎగిశాయి. లుపిన్, క్యాడిలా హెల్త్‌కేర్ తదితర షేర్లు ఈ జాబితాలో ఉన్నాయి. ► మారటోరియం కాలంలో రుణాలపై వడ్డీ, టెలికం కంపెనీల ఏజీఆర్ » కాయిల విషయమై సుప్రీంకోర్టులో విచారణలు ఈ వారంలోనే ఉండటంతో బ్యాంక్, ఆర్థిక రంగ షేర్లపై ప్రతికూల ప్రభావం పడింది. మొండిబకాయిలకు సంబంధించి అనిశ్చితులు అధికంగా ఉండటంతో ప్రస్తుతానికైతే ఈ రంగ షేర్లకు దూరంగా ఉండమని కొంతమంది నిపుణులు సూచిస్తున్నారు. ► సెన్సెక్స్ 30 షేర్లలో నాలుగు షేర్లు–రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, సన్‌ఫార్మా, ఓఎన్జీసీలు మాత్రమే లాభపడ్డాయి. మిగిలిన 26 షేర్లు నష్టపోయాయి. మళ్లీ 77 దిశగా రూపాయి? 76.03 వద్ద ముగింపు ∙ఆరు వారాల కనిష్టం డాలర్ మారకంలో రూపాయి విలువ మళ్లీ 77 దిశగా కదులుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ సోమవారం 19 పైసలు పతనమై 76.03 వద్ద ముగిసింది. ఇది ఆరు వారాల కనిష్ట స్థాయి. విదేశీ నిధులు వెనక్కు వెళుతుండటం, బలహీన ఈక్విటీ మార్కెట్, కరోనా కేసులు పెరుగుతుండటం వంటి అంశాలు దీనికి నేపథ్యం. గత శుక్రవారం రూపాయి ముగింపు 75.84. రూపాయికి ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). ప్రపంచవ్యాప్తంగా కోవిడ్–19 రెండవ దశ ప్రారంభమయ్యే అవకాశం ఉందన్న ఆందోళనలూ ఉన్నట్లు ఫారెక్స్ ట్రేడర్లు పేర్కొంటున్నారు. ఆల్‌టైమ్ హైకి రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలయన్స్ జియో ప్లాట్‌ఫామ్స్‌లో మరో రెండు దిగ్గజ సంస్థలు ఇన్వెస్ట్ చేయడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రాడేలో ఆల్‌టైమ్ హై,రూ.1,627ను తాకింది. చివరకు 1.6 శాతం లాభంతో రూ.1,615 వద్ద ముగిసింది. ఈ ఏడాది మార్చి 23న రూ.867కు పడిన ఈ షేర్ మూడు నెలల్లోనే 80 శాతానికి పైగా ఎగియడం విశేషం. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్ పాక్షిక చెల్లింపు షేర్లు(పార్ట్లీ పెయిడప్ షేర్స్) మదింపు ధర రూ.646తో పోల్చితే 8 శాతం లాభంతో రూ.698 వద్ద ముగిశాయి. -
ఆరంభ లాభాలు ఆవిరి
ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు జోరుగా సాగడంతో సోమవారం స్టాక్ మార్కెట్ ఆరంభ లాభాలను కోల్పోయి నష్టాల్లో ముగిసింది. ప్రపంచ మార్కెట్లు బలహీనంగా ట్రేడవడం, మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతుండటం, డాలర్‌తో రూపాయి మారకం విలువ 19 పైసలు నష్టపోయి 75.73కు చేరడం, పై స్థాయిల్లో లాభాల స్వీకరణ చోటు చేసుకోవడం, యూరప్ మార్కెట్లు నష్టాల్లో ఆరంభం కావడం.... ప్రతికూల ప్రభావం చూపించాయి. ఇంట్రాడేలో 659 పాయింట్లు లాభపడిన బీఎస్ఈ సెన్సెక్స్ చివరకు 81 పాయింట్ల నష్టంతో 31,561 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడేలో 9,440 పాయింట్లకు ఎగసిన ఎన్ఎస్ఈ నిఫ్టీ చివరకు 12 పాయింట్ల నష్టంతో 9,239 వద్దకు చేరింది. ఇంట్రాడే గరిష్ట స్థాయి నుంచి చూస్తే, సెన్సెక్స్ 801 పాయింట్లు, నిఫ్టీ 220 పాయింట్లు చొప్పున పతనమయ్యాయి. ఆర్థిక రంగ షేర్లలో అమ్మకాలు..... కరోనా అనిశ్చితిని తట్టుకోవడానికి పలు ఆర్థిక రంగ కంపెనీలు కేటాయింపులు పెంచాయి. దీంతో మొండి బకాయిలు ఎగబాకుతాయన్న ఆందోళనతో ఈ రంగ షేర్లలో అమ్మకాలు వెల్లువెత్తాయి. ► ఐసీఐసీఐ బ్యాంక్ 5% నష్టంతో రూ.320 వద్ద ముగిసింది. సెన్సెక్స్‌లో బాగా పడిన షేర్ ఇదే. ► నేటి(మంగళవారం) నుంచి 15 రైళ్లు నడవనుండటంతో ఐఆర్సీటీసీ షేర్ 5 శాతం అప్పర్ సర్క్యూట్‌తో రూ.1,303 వద్ద ముగిసింది. ► దేశీయంగా విమాన సర్వీసులను ఈ నెల 18 నుంచి అనుమతించవచ్చన్న వార్తలతో స్పైస్‌జెట్, ఇండిగో షేర్లు 4% మేర లాభపడ్డాయి. ► కొన్ని ప్రాంతాల్లో షోరూమ్స్ ప్రారంభమై, వాహన విక్రయాలు మొదలుకావడంతో వాహన షేర్లు జోరుగా పెరిగాయి. మళ్లీ రూ. 10 లక్షల కోట్లకు రిలయన్స్ మార్కెట్ విలువ రైట్స్ ఇష్యూకు రికార్డ్ డేట్‌ను ఈ నెల 14గా నిర్ణయించడంతో రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్ ఇంట్రాడేలో 3.4% లాభంతో రూ.1,615కు ఎగసింది. ఆల్‌టైమ్ హై ధరకు మరో రూ.3 మాత్రమే తక్కువ. దీంతో ఈ కంపెనీ మార్కెట్ క్యాప్ మళ్లీ రూ.10 లక్షల కోట్లకు ఎగబాకింది. గత 4 ట్రేడింగ్ సెషన్లలో ఈ షేర్ 10% మేర ఎగసింది. చివరకు ఈ షేర్ 1% లాభంతో రూ.1,576 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ రూ.9,99,565 కోట్లుగా ఉంది. -
బేర్ ‘విశ్వ’రూపం!
అమెరికా–చైనా మధ్య వాణిజ్య యుద్ధభయాలు, కార్పొరేట్ల ఆదాయాలు బలహీనంగా ఉండటం, రూపాయి క్షీణత, జమ్మూకశ్మీర్ పరిణామాలు.. అన్నీ కలగలిసి సోమవారం మార్కెట్లను కూలదోశాయి. ఇన్వెస్టర్ల సెంటిమెంటుపై ఇవన్నీ ప్రతికూల ప్రభావాలు చూపడంతో సెన్సెక్స్ 418 పాయింట్లు క్షీణించి కీలకమైన 36,700 పాయింట్ల దిగువకు పతనమైంది. అయిదు నెలల కనిష్ట స్థాయికి క్షీణించింది. ఇక నిఫ్టీ సైతం 135 పాయింట్లు పతనమై 10,863 పాయింట్ల వద్ద క్లోజయ్యింది. నిఫ్టీ, సెన్సెక్స్ రోజంతా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనయ్యాయి. సెన్సెక్స్ ఒక దశలో 700 పాయింట్ల దాకా కూడా పతనమైంది. చివర్లో కొంత కోలుకుని 418 పాయింట్ల తగ్గుదలతో (1.13 శాతం) 36,699.84 వద్ద క్లోజయ్యింది. సెన్సెక్స్ 36,417 – 36,844 పాయింట్ల కనిష్ట, గరిష్టస్థాయిల మధ్య తిరుగాడింది. ‘మార్కెట్ హెచ్చుతగ్గులకు అనేక ప్రతికూలాంశాలు కారణమయ్యాయి. జమ్మూకశ్మీర్ పరిణామాలతో రాజకీయ సంక్షోభం తలెత్తవచ్చన్న ఆందోళనలు, విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లకు (ఎఫ్‌పీఐ) సర్‌చార్జీ నుంచి మినహాయింపునకు సంబంధించి కొత్తగా మరే సంకేతాలు లేకపోవడం వంటివి కూడా మార్కెట్ హెచ్చుతగ్గులకు కారణమయ్యాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలోనూ అమ్మకాలు వెల్లువెత్తాయి. ఆటో, బ్యాంకింగ్ రంగాల షేర్లు ఆఖర్లో కొంత రికవర్ కాగా.. బలహీన రూపాయి వల్ల ఐటీ రంగ షేర్లు ఆసాంతం లాభాల్లోనే కొనసాగాయి. అంతర్జాతీయంగా వాణిజ్య యుద్ధాలకు సంబంధించిన చర్చలకు ప్రతికూలతలు ఉండటం, ఎఫ్‌పీఐలు రిస్కులకు దూరంగా ఉండాలని భావిస్తుండటం వంటి అంశాల వల్ల.. మార్కెట్ల కన్సాలిడేషన్ కొనసాగే అవకాశం ఉంది‘ అని జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో రీసెర్చ్ విభాగం హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. విపక్షాల ఆందోళనల మధ్య.. జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదానిచ్చే ఆర్టికల్ 370ని రద్దు చేస్తూ కేంద్ర ప్రభుత్వం సోమవారం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అన్ని రంగాల సూచీలు క్షీణతలోనే.. ఐటీ మినహా.. అన్ని రంగాల సూచీలు క్షీణించాయి. ఎనర్జీ 2.7 శాతం తగ్గగా.. మెటల్, బ్యాంక్, ఆటో, ఎఫ్ఎంసీజీ, ఇన్ఫ్రా, ఫార్మా తదితర సూచీలు తగ్గాయి. ఇక బీఎస్ఈ స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ సూచీ కూడా 1 శాతం పైగా తగ్గాయి. యస్ బ్యాంక్ 8 శాతం డౌన్.. ఇప్పటికే కొట్టుమిట్టాడుతున్న యస్ బ్యాంక్ షేర్లకు అంతర్జాతీయ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ రూపంలో మరో షాక్ తగిలింది. అసెట్ క్వాలిటీ దిగజారుతుండటం, ఎన్‌బీఎఫ్‌సీలకు భారీగా రుణాలిచ్చి ఉండటం వంటి ప్రతికూల అంశాల కారణంగా బ్యాంక్ రేటింగ్‌ను డౌన్‌గ్రేడ్ చేసే అంశం ఇంకా పరిశీలనలోనే ఉందంటూ మూడీస్ వెల్లడించింది. రెండు నెలల్లో మూడీస్ ఇలాంటి హెచ్చరికలు జారీ చేయడం ఇది రెండోసారి కావడంతో బ్యాంక్ షేరు భారీగా తగ్గింది. సెన్సెక్స్ షేర్లలో యస్ బ్యాంక్ అత్యధికంగా 8.15 శాతం క్షీణించింది. ఇక దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లకు కూడా రేటింగ్ సెగ తప్పలేదు. రిలయన్స్ రేటింగ్‌ను న్యూట్రల్ నుంచి అండర్పెర్ఫార్ఫ్కి తగ్గించడంతో పాటు టార్గెట్ రేటును రూ. 1,350 నుంచి రూ. 995కి తగ్గిస్తున్నట్లు బ్రోకరేజి సంస్థ క్రెడిట్ సూసీ ప్రకటించింది. దీంతో రిలయన్స్ షేరు 3.48 శాతం క్షీణించి రూ. 1,141 వద్ద క్లోజయ్యింది. టాటా మోటార్స్ 5.25 శాతం, పవర్‌గ్రిడ్ 4.42 శాతం, కోటక్ బ్యాంక్ (3.13 శాతం) తగ్గాయి. మరోవైపు భారతి ఎయిర్టెల్, టీసీఎస్, టెక్ మహీంద్రా, హెచ్డీఎఫ్సీ, బజాజ్ ఆటో అత్యధికంగా లాభపడిన వాటిల్లో ఉన్నాయి. డీహెచ్ఎఫ్ఎల్ 10 శాతం పతనం.. ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహెచ్ఎఫ్ఎల్) షేరు మరింత పతనమైంది. ఆడిటర్ బాధ్యతల నుంచి డెలాయిట్ తప్పుకుందన్న వార్తలతో 10% క్షీణించింది. బీఎస్ఈలో 41.95 వద్ద క్లోజయ్యింది. ఒక దశలో 12.43% క్షీణించి 52 వారాల కనిష్టమైన రూ. 40.85 స్థాయికి కూడా తగ్గింది. ఎన్ఎస్ఈలో 10.07 శాతం క్షీణతతో రూ. 41.95 వద్ద ముగిసింది. బీఎస్ఈలో 22.03 లక్షలు, ఎన్ఎస్ఈలో 1.97 కోట్ల షేర్లు చేతులు మారాయి. డెలాయిట్ ఆడిటింగ్ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు వార్తలు వచ్చినప్పటికీ.. తమకు ఎలాంటి సమాచారం లేదంటూ డీహెచ్ఎఫ్ఎల్ వివరణనిచ్చింది. డీహెచ్ఎఫ్ఎల్కు రూ. 90,000 కోట్ల రుణభారం ఉంది. నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల సంపద ఆవిరి లార్జ్ క్యాప్, మిడ్.. స్మాల్ క్యాప్ అనే తేడా లేకుండా మార్కెట్లో అమ్మకాల వెల్లువ కొనసాగుతుండటంతో గడిచిన నెల రోజుల్లో రూ. 15 లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరైపోయింది. జూలై 5న రూ. 153.58 లక్షల కోట్లుగా ఉన్న బీఎస్ఈ మార్కెట్ క్యాపిటలైజేషన్ 10 శాతం తగ్గి సోమవారం నాటికి రూ. 138 లక్షల కోట్లకు పడిపోయింది. ఇదే వ్యవధిలో సెన్సెక్స్ 8 శాతం క్షీణించింది. ఇక కరెన్సీ యుద్ధాలు..! అమెరికా, చైనాల మధ్య వాణిజ్య యుద్ధం ఇక కరెన్సీ వార్‌కు దారితీయనుందన్న భయాలతో వివిధ దేశాల కరెన్సీ విలువలు కుప్పకూలాయి. ఈ ప్రభావం రూపాయి మారకంపై కూడా ప్రభావం చూపింది. ఒకే రోజు 113 పైసలకు పైగా కుప్పకూలింది. కొత్తగా మరో 300 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా ఎగుమతులపై 10 శాతం సుంకాలు విధించాలన్న అమెరికా నిర్ణయం ప్రభావాలను ఎదుర్కొనే క్రమంలో ఎగుమతిదారులకు ఊతమిచ్చే ఉద్దేశంతో సొంత కరెన్సీ విలువను చైనా తగ్గించుకోనుందన్న(డీ వేల్యూ) వార్తలు వచ్చాయి. దీంతో డాలర్‌తో పోలిస్తే చైనా యువాన్ విలువ 7.03 స్థాయికి క్షీణించింది. ప్రపంచ మార్కెట్లు అల్లకల్లోలం.. అమెరికా సుంకాల దాడిని ఎదుర్కొనేందుకు చైనా కరెన్సీ అస్త్రాన్ని ప్రయోగించడం ప్రపంచ మార్కెట్లను అతలాకుతలం చేసింది. ఆసియాలో కీలక సూచీలు భారీగా క్షీణించాయి. షాంఘై కాంపోజిట్ ఇండెక్స్ 1.6 శాతం, జపాన్ నికాయ్ 1.7 శాతం మేర తగ్గాయి. హాంకాంగ్‌లో ప్రజాస్వామ్య అనుకూలవాదుల ఆందోళనలు కూడా తోడవడంతో హాంగ్‌సెంగ్ మూడు శాతం దాకా పడింది. ఈ ప్రభావాలతో అటు యూరప్ స్టాక్స్ కూడా రెండు శాతం దాకా క్షీణించాయి. అమెరికాలో కీలక సూచీలు డోజోన్స్ ఏకంగా 2.6 శాతం, నాస్డాక్ 3.3 శాతం మేర పడ్డాయి. రూపాయి విలవిల... ఆరేళ్లలో అతిపెద్ద పతనం! డాలర్ మారకంలో ఒకేరోజు 113 పైసలు డౌన్ 70.73 వద్ద ముగింపు నాలుగు నెలల కనిష్టస్థాయి ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ సోమవారం ఒక్కసారిగా కుప్పకూలింది. ఒకేరోజు 113 పైసలు (1.62 శాతం) పతనం అయ్యింది. 70.73 వద్ద ముగిసింది. ఇది నాలుగు నెలల కనిష్టస్థాయి. గడచిన ఆరు సంవత్సరాల్లో (2013 ఆగస్టు తరువాత) రూపాయి ఒకేసారి ఈ స్థాయిలో పతనం కావడం ఇదే తొలిసారి. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో గడచిన మూడు రోజుల ట్రేడింగ్‌లో రూపాయి భారీగా 194 పైసలు నష్టపోయింది. మూడు ప్రధాన కారణాలు... ► అమెరికా–చైనా వాణిజ్య భయాలతో విదేశీ ఇన్వెస్టర్ల ఈక్విటీ మార్కెట్ అమ్మకాలు ► అమెరికా డాలర్ మారకంలో చైనా విదేశీ మారకద్రవ్యం– యువాన్ భారీ పతనం. 2008 తరువాత మొట్టమొదటిసారి డాలర్ మారకంలో చైనా యువాన్ 7% పతనమైంది. ఇది అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం కొత్త దశకు సంకేతమని హెచ్డీఎఫ్సీ సెక్యూరిటీస్ క్యాపిటల్ మార్కెట్స్ వ్యూహకర్త వీకే శర్మ పేర్కొన్నారు. ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ కరెన్సీ రీసెర్చ్ హెడ్ రాహుల్ గుప్తా కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ► కశ్మీర్ అంశంపై అనిశ్చితి. ఈ మూడు ప్రతికూలతలతో నిజానికి రూపాయి మరింత పతనం కావాల్సి ఉంది. అయితే అంతర్జాతీయంగా తక్కువ ధర వద్ద ట్రేడవుతున్న క్రూడ్ ధరలు రూపాయి పతనాన్ని కొంత నిలువరించాయి. ఒడిదుడుకుల ట్రేడింగ్ ట్రేడింగ్ మొదట్లో రూపాయి 70.20 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.74 కనిష్టాన్ని చూసింది. 70.18 గరిష్టస్థాయిని తాకినా.... అంతకుమించి బలపడలేకపోయింది. అక్టోబర్ 9వ తేదీన రూపాయి చరిత్రాత్మక కనిష్ట స్థాయి 74.39 వద్ద ముగిసింది. అయితే క్రూడ్ ధరల భారీ పతనం, మోదీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుందన్న సంకేతాలతో రూపాయి కీలక నిరోధం 68.50 వద్దకు చేరింది. రూపాయి మరింత బలోపేతం కావడానికి ఈ నిరోధం కీలకం. ఇక్కడ నుంచి రూపాయి మరింత బలపడలేకపోయింది. బంగారం భగభగ ► కరెన్సీల పతనం, వాణిజ్య యుద్ధం నేపథ్యం ► ఔన్స్‌కు 1,482 డాలర్లకు దూకుడు ► దేశీయంగానూ కొత్త రికార్డులు ► ఢిల్లీలో రూ. 37 వేలకు చేరువ న్యూఢిల్లీ/న్యూయార్క్: అమెరికా–చైనా వాణిజ్య యుద్ధం తీవ్రత నేపథ్యంలో అంతర్జాతీయంగా పలు దేశాల కరెన్సీలు డాలర్ మారకంలో పతనం కావడం పసిడికి వరమైంది. అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్– న్యూయార్క్ మర్కంటైల్ ఎక్సే్చంజ్‌లో ఔన్స్ (31.1గ్రా) ధర సోమవారం భారీగా పెరిగింది. ఒకదశలో 1,481.75 డాలర్ల గరిష్టాన్ని తాకింది. గడచిన ఆరేళ్లలో పసిడి ఈ స్థాయిని చూడ్డం ఇదే తొలిసారి. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటలకు పసిడి ధర గత శుక్రవారం ధరతో పోల్చితే, 20 డాలర్ల లాభంతో 1,477 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. వాణిజ్య యుద్ధం, అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి పరిస్థితుల నేపథ్యంలో పసిడిని పెట్టుబడులకు సురక్షితమైనదిగా ఇన్వెస్టర్లు భావిస్తున్నారు. అంతర్జాతీయంగా పలు దేశాల ఈక్విటీ మార్కెట్లు తీవ్ర నష్టాలతో ట్రేడవుతుంటే, చైనా కరెన్సీ యువాన్ ఏకంగా 7 శాతం పతనమైంది. దేశీయంగా రూపాయి ఎఫెక్ట్ తోడు... అంతర్జాతీయంగా పరుగుకు తోడు, డాలర్ మారకంలో రూపాయి విలువ 1.6 శాతంపైగా పతనం చెందడంతో దేశంలో బంగారం ధర ఒక్కసారిగా మెరిసింది. ఢిల్లీలో సోమవారం ధర 10 గ్రాములుకు (99.9 ప్యూరిటీ) రూ.800 పెరిగి రూ.36,970కి చేరింది. 99.5 ప్యూరిఈ ధర కూడా రూ.800 ఎగసి రూ.36,800కి చేరింది. బంగారంతోపాటు వెండి ధర కూడా ఢిల్లీలో భారీగా కేజీకి రూ.1,000 పెరిగింది. రూ.43,100కి చేరింది. ఈ వార్త రాసే రాత్రి 10.30 గంటల సమయానికి దేశీయ ఫ్యూచర్స్ మార్కెట్– మల్టీ కమోడిటీ ఎక్సే్చంజ్‌లో 10 గ్రాముల పసిడి ధర క్రితం శుక్రవారం ధరతో పోల్చి రూ.988 లాభంతో రూ.37,259 వద్ద ట్రేడవుతోంది. ఒక దశలో రూ.37,347ను కూడా తాకింది. కాగా వెండి ధర రూ.991 లాభంలో రూ.42,355 వద్ద ట్రేడవుతోంది. ఇదే రీతిన ట్రేడింగ్ ముగిస్తే, మంగళవారం దేశంలో పసిడి ధరలు మరింత పరుగు పెట్టే అవకాశం ఉంది. -
ఎగుమతుల క్షీణతతో మార్కెట్ డీలా..
రూపాయి బలహీనత ప్రభావం - 189 పాయింట్లు క్షీణించి 27,878కు సెన్సెక్స్ - 41 పాయింట్లు క్షీణించి 8,477కు నిఫ్టీ ఎగుమతుల డీలాకు రూపాయి క్షీణత తోడవడంతో సోమవారం స్టాక్ మార్కెట్ నష్టాల్లో ముగిసింది. జీఎస్టీ బిల్లుపై ఎలాంటి కదలిక లేకపోవడంతో బ్లూ-చిప్ షేర్లు కుదేలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ కీలకమైన 28 వేల పాయింట్ల దిగువకు, ఎన్ఎస్ఈ నిఫ్టీ 8,500 పాయింట్ల దిగువకు పడిపోయాయి. సెన్సెక్స్ 189 పాయింట్లు క్షీణించి 27,878 పాయింట్ల వద్ద నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 8,477 వద్ద ముగిశాయి. బ్యాంకింగ్ జోరు..: అయితే బ్యాంకులను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ఇంద్రధనుష్ కార్యక్రమాన్ని ప్రకటించడంతో బ్యాంక్ షేర్లు 15 శాతం దూసుకుపోయాయి. రియల్టీ, క్యాపిటల్ గూడ్స్, ఆయిల్, గ్యాస్, వాహన, విద్యుత్, ఎఫ్ఎంసీజీ షేర్లు పతనబాట పట్టినప్పటికీ, బ్యాంక్‌లు, కన్సూమర్ డ్యూరబుల్స్ షేర్లు లాభపడటంతో స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీల నష్టాలు కొంత మేరకు తగ్గాయి. ఒక దశలో 328 పాయింట్ల వరకూ పతనమైన సెన్సెక్స్ చివరకు 189 పాయింట్ల నష్టంతో 27,878 పాయింట్ల వద్ద ముగియగా, నిఫ్టీ 41 పాయింట్ల నష్టంతో 8,477 వద్ద ముగిసింది. బ్యాంక్ ఆఫ్ బరోడా 15 శాతం, కెనరా బ్యాంక్ 13.4 శాతం, బ్యాంక్ ఆఫ్ ఇండియా 9 శాతం, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 5 శాతం, పంజాబ్ నేషనల్ బ్యాంక్ 4 శాతం, ఎస్బీఐ 4 శాతం చొప్పున పెరిగాయి.