SAARC Convention
-
సార్క్ సదస్సుకు మేమూ వెళ్లం
బంగ్లా, అఫ్గాన్, భూటాన్ ప్రకటన - భేటీ విఫలమయ్యే వాతావరణాన్ని పాక్ సృష్టించిందని ఆరోపణ - సదస్సు వాయిదా పడొచ్చని పాక్ సంకేతాలు.. న్యూఢిల్లీ: ఉగ్రవాదంపై ద్వంద్వనీతి అనుసరిస్తున్న పాకిస్తాన్‌కు గట్టి ఎదురుదెబ్బ! నవంబర్‌లో ఆ దేశ రాజధాని ఇస్లామాబాద్‌లో జరగాల్సిన 19వ సార్క్ దేశాల శిఖరాగ్ర సదస్సుకు తామూ హాజరుకాబోవడం లేదని అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్‌లు బుధవారం ప్రకటించాయి. సదస్సు విఫలమయ్యే వాతావరణాన్ని పాక్ సృష్టించిందని ఆ దేశం పేరు ప్రస్తావించకుండా మండిపడ్డాయి. ఉడీ ఉగ్రవాద దాడి, సీమాంతర చొరబాట్ల నేపథ్యంలో ఈ సమావేశానికి వెళ్లకూడదని భారత్ మంగళవారం నిర్ణయించిన నేపథ్యంలో ఈ దేశాలు పై నిర్ణయం తీసుకున్నాయి. తమ అంతర్గత వ్యవహారాల్లో ఒక సార్క్ దేశం(పాక్) మితిమీరిన జోక్యం వల్ల సమావేశం విఫలమయ్యే పరిస్థితి నెలకొందని బంగ్లాదేశ్ పేర్కొంది. ప్రాంతీయంగా ఉగ్రవాద సమస్య వల్ల గైర్హాజరవుతున్నట్లు అఫ్గాన్ తెలిపింది. ప్రాంతీయ ఉద్రిక్తత వల్ల సదస్సు విజయవంతమయ్యే పరిస్థితి లేదని భూటాన్ పేర్కొంది. 8 సభ్యదేశాలున్న సార్క్(దక్షిణాసియా ప్రాంతీయ సహకార సమితి)లో నాలుగు గైర్హాజరు కానుండడంతో సమావేశం జరిగే పరిస్థితి కనిపించడం లేదు. సార్క్ నిబంధనల ప్రకారం కూటమిలో ఏ దేశమైనా గైర్హాజరైతే సదస్సు రద్దవడమో, వాయిదా పడడమో జరుగుతుంది. కాగా, భారత్ హాజరయ్యేందుకు నిరాకరిస్తే సదస్సు వాయిదా పడే అవకాశముందని పాక్ ప్రధానికి విదేశీ వ్యవహారాల సల హాదారైన సర్తాజ్ అజీజ్ సంకేతాలిచ్చారు. సదస్సును చెడగొట్టేందుకు భారత్ దుష్ర్పచారం చేస్తోందని ఆరోపించారు. అయితే సదస్సును షెడ్యూలు ప్రకారం(నవంబర్ 9,10) నిర్వహించి తీరతామని అంతకుముందు పాక్ విదేశాంగ ప్రతినిధి జకారియా చెప్పారు. భారత్ నిర్ణయం దురదృష్టకరమని, ఆ దేశం గైర్హాజరవుతున్నట్లు అధికారిక సమాచారమేదీ అందలేదన్నారు. 4 దేశాల గైర్హాజరు నేపథ్యంలో సదస్సును వాయిదా వేయాలని భారత్ సూచించింది. సమావేశం వాయిదాపడినట్లు నేపాల్ మీడియా పేర్కొంది. ‘సానుకూల వాతావరణం కావాలి’ సార్క్ సదస్సులో కూటమికి చెందిన అన్ని దేశాలూ పాల్గొనేలా సానుకూల వాతావరణం కల్పించాల్సిన అవసరం ఉందని సార్క్ అధ్యక్ష దేశమైన నేపాల్ పేర్కొంది. సదస్సులో పాల్గొనడం లేదని నాలుగు దేశాలు తమకు చెప్పాయని వెల్లడించింది. కాగా, ఉగ్రశిబిరాలపై పాక్ చర్యలు తీసుకోవాలని అమెరికా కోరింది. -
మాటలు కలిశాయి..!
కఠ్మాండు: చేతులు కలిశాయి.. నవ్వులు విరిశాయి.. పలకరింపులు తోడయ్యాయి.. సార్క్ వేదిక మురిసింది. సార్క్ సదస్సు ముగింపు సందర్భంగా గురువారం భారత ప్రధాని నరేంద్రమోదీ, పాకిస్తాన్ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్‌ల మధ్య జరిగిన ఆత్మీయ కరచాలన సన్నివేశం మొత్తం కార్యక్రమానికే హైలైట్‌గా నిలిచింది. బుధవారం నాటి అంటీముట్టని వైఖరికి భిన్నంగా.. సుదీర్ఘ షేక్‌హ్యాండ్‌తో, మధ్యమధ్య కాసేపు మాట్లాడుకుంటూ ఫొటోలకు ఫోజులిస్తూ.. వారిరువురు అందరి దృష్టిని ఆకర్షించారు. భారత్, పాక్‌ల మధ్య సానుకూల స్నేహసంబంధాలు సార్క్ దేశాలపై ఏ స్థాయిలో ప్రభావం చూపుతాయో సజీవంగా చూపేలా.. వారిద్దరి ఆత్మీయ పలకరింపులను ఇతర సభ్య దేశాధినేతలు, ప్రతినిధులు గట్టిగా హర్షధ్వానాలతో స్వాగతించారు. వచ్చే సంవత్సరం సార్క్ సదస్సు పాకిస్తాన్లో జరగనున్న దృష్ట్యా.. ఈ ఏడాది సార్క్ సదస్సు ముగిసిన అనంతరం ‘ఓట్ ఆఫ్ థ్యాంక్స్’ చెప్పేందుకు షరీఫ్ వెళ్తున్నప్పుడు, తిరిగి వస్తున్నప్పుడు మిగతా నేతలతో పాటు మోదీ కూడా చప్పట్లతో అభినందించారు. బుధవారం సార్క్ సదస్సు ప్రారంభ కార్యక్రమంలో షరీఫ్ ప్రసంగాన్ని పట్టించుకోకుండా మోదీ వార్తపత్రిక చదువుకుంటూ కూర్చున్న విషయం తెలిసిందే. హిమాలయాల పాదాల వద్ద సార్క్ సదస్సు ముగింపు సందర్భంగా కఠ్మాండూకు 30 కిమీల దూరంలోని ప్రఖ్యాత ధూలిఖేల్ రిసార్ట్‌లో నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాల సభ్య దేశాధినేతల కోసం విందును ఏర్పాటు చేశారు. ఈ రిసార్ట్‌ను పర్యాటకుల స్వర్గధామంగా భావిస్తారు. రిసార్ట్ వద్ద భారత ప్రధాని మోదీ మర్రి మొక్కను నాటారు. -
వారిద్దరూ.. చేతులు కలిపారు!
-
వారిద్దరూ.. చేతులు కలిపారు
కఠ్మండ్ : సార్క్ శిఖరాగ్ర సదస్సులో నిన్న ఎడమొహం, పెడమొహంగా కనిపించిన భారత్, పాక్ ప్రధానులు గురువారం ఎట్టకేలకు చేయి చేయి కలిపారు. ఖాట్మండులో జరుగుతోన్న సార్క్ సమావేశాల రెండోరోజు వారిద్దరూ కరచాలనం చేసుకుని... బాగోగులు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రి మహేంద్ర బహదూర్ పాండే ధ్రువీకరించారు. బుధవారం సాయంత్రం నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలా ఇచ్చిన విందులో పాల్గొన్న వీరు రిసెప్షన్ గదిలో కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలిపారు. కాగా ఈ సదస్సులో 26/11 ముంబై దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో నవాజ్ షరీఫ్ ఇబ్బందుల్లో పడ్డారు. ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్న మోడీ పిలుపును సార్క్ దేశాలు ఆహ్వానించడం కూడా షరీఫ్ ఇబ్బందులను పెంచినట్లు అయ్యింది. -
మోదీ.. షరీఫ్.. కటీఫ్!
కఠ్మాండు: సార్క్ సదస్సు వేదికగా భారత్, పాకిస్తాన్ల మధ్య ‘చీర, షాల్’ల డిప్లొమసీ ముగిసింది. ఇరుదేశాల ప్రధానమంత్రులు నరేంద్రమోదీ, నవాజ్ షరీఫ్‌లు బుధవారం సార్క్ దేశాధినేతల ప్రారంభ సదస్సు సందర్భంగా వేదికపై ఎడమొగం, పెడమొగంగా కనిపించారు. కనీసం పలకరించుకోలేదు. సదస్సు వేదికపైకి వచ్చిన షరీఫ్ మోదీని పట్టించుకోకుండా, మోదీ వైపు చూడకుండానే తన స్థానం వద్దకు వెళ్లి కూర్చున్నారు. తరువాత, సదస్సులో ప్రసంగించేందుకు నవాజ్ షరీఫ్‌ను నిర్వాహకులు ఆహ్వానిస్తూ.. ఆయన పేరు పిలిచినప్పుడు.. మోదీ సీరియస్‌గా వార్తాపత్రిక చదువుతూ ఉండిపోయారు. మిగతా నాయకులంతా చప్పట్లు కొట్టి ఆహ్వానించినా.. మోదీ స్పందించకుండా పత్రికాపఠనంలో మునిగిపోయారు. అయితే, ప్రసంగించేందుకు మోదీ పేరును పిలిచినప్పుడు మాత్రం.. మిగతా నాయకులతో పాటు నవాజ్ షరీఫ్ చప్పట్లతో ఆహ్వానించారు. సార్క్ సదస్సు ప్రారంభ కార్యక్రమం ముగిసిన తరువాత దేశాధినేతలనందరినీ అక్కడే ఉన్న మరో గదిలో కూర్చోవాల్సిందిగా ఆహ్వానించారు. మిగతా నేతలంతా వెళ్లేంతవరకు.. మోదీ నేపాల్ ప్రధాని సుశీల్ కొయిరాలాతో మాట్లాడుతూ వేదికపైనే కూర్చున్నారు. ‘ముంబైపై ఉగ్రవాద దాడులు జరిగిన రోజే.. పాక్ ప్రధానితో మోదీ ఎలా కరచాలనం చేయగలరు? ఎలా ఆలింగనం చేసుకోగలరు?’ అని భారతీయ దౌత్యాధికారి ఒకరు వ్యాఖ్యానించారు. కఠ్మాండులోని ఒకే హోటల్లో ఈ ఇద్దరు నేతలు బస చేస్తుండటం విశేషం. సార్క్ సభ్య దేశాలు - హాజరైన అధినేతలు భారత్: నరేంద్రమోదీ, పాకిస్తాన్: నవాజ్ షరీఫ్, శ్రీ లంక: మహింద రాజపక్స, నేపాల్: సుశీల్ కొయిరాలా, బంగ్లాదేశ్: షేక్ హసీనా, భూటాన్: షెరింగ్ తోబ్గే, మాల్దీవులు: అబ్దుల్లా యమీన్, అఫ్ఘానిస్థాన్: అష్రాఫ్ ఘనీ