వారిద్దరూ.. చేతులు కలిపారు | Modi, Sharif shake hands, chat at reception | Sakshi
Sakshi News home page

వారిద్దరూ.. చేతులు కలిపారు

Nov 27 2014 1:57 PM | Updated on Aug 15 2018 2:20 PM

వారిద్దరూ.. చేతులు కలిపారు - Sakshi

వారిద్దరూ.. చేతులు కలిపారు

సార్క్ శిఖరాగ్ర సదస్సులో నిన్న ఎడమొగం, పెడమొగంగా కనిపించిన భారత్, పాక్ ప్రధానులు గురువారం చేయి చేయి కలిపారు.

కఠ్మండ్ : సార్క్ శిఖరాగ్ర సదస్సులో నిన్న ఎడమొహం, పెడమొహంగా కనిపించిన భారత్, పాక్ ప్రధానులు గురువారం ఎట్టకేలకు చేయి చేయి కలిపారు. ఖాట్మండులో జరుగుతోన్న సార్క్‌ సమావేశాల రెండోరోజు  వారిద్దరూ కరచాలనం చేసుకుని... బాగోగులు తెలుసుకున్నారు. ఈ విషయాన్ని నేపాల్ విదేశాంగ మంత్రి మహేంద్ర బహదూర్ పాండే ధ్రువీకరించారు.  బుధవారం సాయంత్రం నేపాల్‌ ప్రధాని సుశీల్‌ కొయిరాలా ఇచ్చిన విందులో పాల్గొన్న వీరు రిసెప్షన్ గదిలో కూర్చొని మాట్లాడుకున్నట్లు తెలిపారు.  

కాగా ఈ సదస్సులో 26/11 ముంబై దాడి ఘటనను ప్రస్తావిస్తూ ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు చేయడంతో నవాజ్‌ షరీఫ్‌ ఇబ్బందుల్లో పడ్డారు. ఉగ్రవాదాన్ని ఐక్యంగా ఎదుర్కోవాలన్న మోడీ పిలుపును సార్క్‌ దేశాలు ఆహ్వానించడం కూడా షరీఫ్‌ ఇబ్బందులను పెంచినట్లు అయ్యింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement