safety and security
-
సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్: భారత్‌లో అత్యుత్తమ కార్లు ఇవే..
వెహికల్ అంటే.. ఒక్క మైలేజ్ మాత్రమే కాదు, సేఫ్టీ కూడా అని వాహన ప్రియులు తెలుసుకున్నారు. కాబట్టి చాలామంది కార్ల కొనుగోలుదారులు సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ ఉన్న కార్లనే కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రముఖ కార్ల తయారీ సంస్థలు అధిక సేఫ్టీ ఫీచర్స్ ఉన్న కార్లను మార్కెట్లో విక్రయిస్తున్నాయి. ఈ కథనంలో సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన టాప్ 5 కార్లను గురించి తెలుసుకుందాం.హ్యుందాయ్ వెర్నాగత ఏడాది దేశీయ మార్కెట్లో అడుగుపెట్టిన కొత్త హ్యుందాయ్ వెర్నా.. గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకుంది. వెర్నా అడల్ట్ సేఫ్టీలో 34 పాయింట్లకు 28.18 పాయింట్లు, కిడ్స్ సేఫ్టీలో 49 పాయింట్లకు 42 పాయింట్ల స్కోర్ సాధించి.. మొత్తం మీద 5 స్టార్ సేఫ్టీ రేటింగ్ కైవసం చేసుకుంది.రెండు ఇంజిన్ ఆప్షన్స్ కలిగిన హ్యుందాయ్ వెర్నా.. మొత్తం ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏడీఏఎస్ ఫీచర్స్ పొందుతుంది. ఈ సెడాన్ ప్రారంభ ధర రూ. 11 లక్షలు కాగా.. టాప్ వేరియంట్ ధర రూ. 17.42 లక్షల వరకు ఉంది.ఫోక్స్‌వ్యాగన్ వర్టస్గ్లోబల్ ఎన్సీఏపీ టెస్టులో 5 స్టార్ రేటింగ్ సొంతం చేసుకున్న మరో కారు ఫోక్స్‌వ్యాగన్ కంపెనీకి చెందిన వర్టస్. ఇది పిల్లల సేఫ్టీలో 49కి గానూ 42 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 34కి గానూ 29.71 పాయింట్లు స్కోర్ సాధించింది. ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, హై-స్పీడ్ వార్ణింగ్, సెన్సార్లతో కూడిన రియర్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు కలిగిన ఈ కారు ధరలు రూ. 10.90 లక్షల నుంచి రూ. 19.41 లక్షల మధ్య ఉన్నాయి.టాటా నెక్సాన్సేఫ్టీ అంటే ముందుగా గుర్తొచ్చేది దేశీయ దిగ్గజం టాటా మోటార్స్ కార్లు. కంపెనీ కారైన నెక్సాన్ సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ పొందిన కార్ల జాబితాలో ఒకటి. ఇది కిడ్స్ సేఫ్టీలో 44.52 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 32.22 పాయింట్లు సాధించి.. అత్యుత్తమ సేఫ్టీ ఫీచర్స్ కలిగిన కారుగా నిలిచింది.ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, బ్లైండ్ స్పాట్ మానిటర్‌తో కూడిన 360 డిగ్రీ కెమెరా, రెయిన్ సెన్సింగ్ వైపర్లను కలిగి ఉన్న ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లను టాటా నెక్సాన్ కారులో చూడవచ్చు. నెక్సాన్ ధరలు రూ. 8 లక్షల నుంచి రూ. 15.50 లక్షల మధ్య ఉన్నాయి.టాటా హారియర్టాటా కంపెనీకి చెందిన సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించింది మరో కారు హారియర్. ఇది పిల్లల భద్రతలో 49కి 45 పాయింట్లు, పెద్దల రక్షణలో 34కు 33.05 పాయింట్ల స్కోర్ సాధించింది. రూ. 14.99 లక్షల నుంచి రూ. 25.89 లక్షల మధ్య ధరతో అందుబాటులో ఉన్న హారియర్.. ఏడు ఎయిర్‌బ్యాగ్‌లు, లెవెల్ 2 అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, ఏబీఎస్ విత్ ఈబీడీ, క్రూయిజ్ కంట్రోల్, డ్రైవర్ అటెన్షన్ అలర్ట్, హిల్ డిసెంట్ కంట్రోల్ వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది.మహీంద్రా స్కార్పియో ఎన్రూ. 13.85 లక్షల నుంచి రూ. 24.54 లక్షల మధ్య ధరతో లభించే మహీంద్రా స్కార్పియో గ్లోబల్ ఎన్సీఏపీ క్రాష్ టెస్టులో 5 స్టార్ సాధించిన అత్యుత్తమ కార్లలో ఒకటి. ఇది అడల్ట్ సేఫ్టీలో 34కు 29.25 పాయింట్లు, అడల్ట్ సేఫ్టీలో 49కు 28.93 పాయింట్లు సాధించి సురక్షితమైన కార్ల జాబితాలో ఒకటిగా నిలిచింది.మహీంద్రా స్కార్పియో ఎన్.. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ అసిస్ట్ కంట్రోల్, ఫ్రంట్ అండ్ రియర్ కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్స్ పొందుతుంది. 6 సీటర్, 7 సీటర్ కాన్ఫిగరేషన్లలో లభించే ఈ కారు 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ పొందుతుంది.ఇదీ చదవండి: మార్కెట్లో మరో పవర్ఫుల్ బైక్ లాంచ్: ధర ఎంతో తెలుసా?సేఫ్టీలో 5 స్టార్ రేటింగ్ సాధించిన ఇతర కార్లు➤స్కోడా స్లావియా➤టాటా సఫారి➤స్కోడా కుషాక్➤ఫోక్స్‌వ్యాగన్ టైగన్➤టాటా పంచ్➤మహీంద్రా ఎక్స్‌యూవీ300➤టాటా ఆల్ట్రోజ్➤టాటా నెక్సాన్➤మహీంద్రా ఎక్స్‌యూవీ700 -
పట్టాలపై లైఫ్‌లైన్
నర్సు ఓల్గా.. ఇంటెన్సివ్ కేర్ యూనిట్ అంతటా విరామం లేకుండా తిరుగుతూనే ఉన్నారు. రోగుల ఆక్సిజన్ స్థాయిలను తనిఖీ చేసి నోట్ చేసుకుంటున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న రోగులను ఓ కంట కనిపెడుతున్నారు. ఓ ఆస్పత్రిలో ఇదో సాధారణ దృశ్యం. కానీ ఆమె పనిచేస్తున్నది నడుస్తున్న రైలులో. వైద్యం అందిస్తున్నది యుద్ధంలో గాయాలపాలైన సైనికులకు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించడానికి ఉక్రెయిన్ ఈ రైలాస్పత్రిని నడుపుతోంది. ఆ దేశ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో ఇప్పుడిది కీలక భాగంగా మారింది. యుద్ధంలో గాయపడిన సైనికుల కోసం తూర్పు ఉక్రెయిన్‌లోని చాలా నగరాల్లోని ఆసుపత్రుల్లో పడకలు లేవు. అవి ఖాళీ చేయడానికి కొందరిని సుదూర ప్రాంతాలకు తీసుకెళ్లాల్సి వస్తుంది. అంబులెన్సుల్లో సుదూర ప్రయాణంతో సైనికుల ప్రాణాలకే ముప్పుకావచ్చు. రష్యా దాడుల నేపథ్యంలో హెలికాప్టర్ అంబులెన్స్‌లు కూడా ఉపయోగించలేరు. ఈ క్లిష్ట స్థితిలో రైళ్లు సైనికుల ప్రాణాలను కాపాడుతున్నాయి. గాయపడిన సైనికులను ఆస్పత్రికి తీసుకెళ్లేలోగానే ఇందులోని బోగీలు పూర్తి స్థాయి ఇంటెన్సివ్ కేర్ యూనిట్లుగా పనిచేస్తున్నాయి. ఆర్మీ డాక్టర్లు, ఇతర సిబ్బంది సైనికులకు రైలులోనే సేవ లు అందిస్తున్నారు. కదులుతున్న రైలులో ఐసీయూ యూనిట్ నడపడం చాలా కష్టమైన పని. అయినా సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారు. ‘ఇక్కడ మా సామర్థ్యం చాలా పరిమితం. ఏదైనా జరిగితే బయటి కన్సల్టెంట్‌ను పిలవలేం. రక్తస్రావాన్ని ఆపడానికి చిన్న చిన్న ఆపరేషన్లు వంటివి చేస్తాం. పెద్ద పెద్ద శస్త్రచికిత్సలు చేయలేం’అని డాక్టర్స్ చీఫ్ ఒకరు తెలిపారు. పర్యాటక రైలు కాస్తా ఆస్పత్రిగా.. యుద్ధం ప్రారంభంలో ప్రపంచాన్ని ఆకట్టుకున్న ఉక్రెయిన్ సమయస్ఫూర్తికి రైలాస్పిత్రి ఒక ఉదాహరణ. 2022 ఫిబ్రవరిలో దేశంపై రష్యా దాడులు ప్రారంభించినప్పుడు ఉక్రెయిన్ వద్ద ఎటువంటి మెడికల్ రైలు బోగీలు లేవు. గాయపడిన సైనికులను సాధారణ రైళ్లలోకి కిటికీల గుండా బలవంతంగా ఎక్కించేవారు. దీనికి పరిష్కారం ఆలోచించిన ఉక్రెయిన్ రైల్వే.. సాధారణ రోజుల్లో పర్యాటకులను కార్పాతియన్ పర్వతాలకు తీసుకెళ్లడానికి ఉపయోగించే రైళ్లను పునరుద్ధరించింది. అలా ఆస్పత్రి రైలుకు రూపకల్పన జరిగిందని ఉక్రెయిన్ రైల్వే ప్యాసింజర్ ఆపరేషన్స్ సీఈఓ ఒలెక్సాండర్ పెర్తోవ్స్కీ చెప్పారు. గంటకు 50 మైళ్ల వేగంతో.. ఈ రైలు గంటకు 80 కిలోమీటర్లు (50 మైళ్లు) వేగంతో ప్రయాణిస్తుంది. సాధారణ రైలు వేగంలో సగమే అయినప్పటికీ ఐసీయూ మాత్రం అటూఇటూ కదిలిపోతూంటుంది. దీంతో పనిచేసేటప్పుడు సిబ్బంది చాలా అదనపు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంబులెన్స్ రైళ్లను మొదట 1850లలో క్రిమియన్ యుద్ధం సమయంలో ఉపయోగించారు. కానీ ఈ ఆధునిక వెర్షన్లలో వెంటిలేటర్లు, లైఫ్ సపోర్ట్ యంత్రాలు, అ్రల్టాసౌండ్ స్కానర్లు, పోర్టబుల్ ఎయిర్ కండిషనర్లు ఉన్నాయి. ప్రతి క్యారేజీలో నిరంతర విద్యుత్ కోసం జనరేటర్లుంటాయి. బోగీల్లో పిల్లల చిత్రాలు, ఉక్రెయిన్ జాతీయ జెండాలు ఉంటాయి. గాయపడిన సైనికులకు ఇవి కొంత ఓదార్పును అందిస్తాయి. రెండు భిన్న దృశ్యాలు.. తొమ్మిది గంటల ప్రయాణం తరువాత రైలాస్పత్రి ఒక నగరంలోని రైల్వేస్టేషన్‌లోకి ప్రవేశించగానే.. అంబులెన్సులు సైనికుల కోసం ఎదురు చూస్తుంటాయి. ఐసీయూ లోని నర్సులు సైనికులను ప్లాట్‌ఫామ్‌పై ఎదురుచూస్తున్న వైద్యులకు అప్పగిస్తారు. స్టేషన్ నుంచి అంబులెన్సులు బయల్దేరి వెళ్లాక ఊపిరి పీల్చుకుంటారు. వారికి ఎదురుగా కొత్తగా రిక్రూట్ అయిన సైనికులతో ఓ రైలు బయలుదేరడానికి సిద్ధంగా ఉంటుంది. తల్లిదండ్రులకు వీడ్కోలు పలుకుతూ పిల్లలు కనపడతారు. సాయంత్రానికి ఆ యువసైనికులు అపస్మారక స్థితిలోనో, తీవ్ర గాయాలతోనే అదే రైల్వే స్టేషన్‌కు చేరుకుంటారు. ఈ రెండు దృశ్యాలకు ప్రత్యక్ష సాకు‡్ష్యలు రైలాస్పత్రి సిబ్బందే. యుద్ధం మిగుల్చుతున్న అంతులేని విషాదమిది. ‘యుద్ధ క్షేత్రం నుంచి తీవ్రంగా గాయపడి వచ్చే సైనికులను చూడటం బాధాకరమైన విషయమే. కానీ, వారికి సేవ చేస్తున్నామన్న తృప్తి మాత్రం మాకు మిగులుతుంది’అని చెబుతున్నారు ఐసీయూ నర్సు ఓల్గా. 2015లో సైన్యంలో నర్సుగా చేరిన ఆమె.. 2022 నుంచి యుద్ధంలో గాయపడిన సైనికులకు చికిత్స అందిస్తున్నారు. అలసిపోయాం.. యుద్ధం చెల్లించుకుంటున్న మూల్యానికి ఈ రైలాస్పత్రి ఓ చిన్న ఉదాహరణ. ‘రష్యన్ విసిరిన గ్రెనేడ్‌తో నా చేతులు, భుజాలు, వీపుపై తీవ్ర గాయాలయ్యాయి. పేలుడు శబ్దాలు నా వినికిడి శక్తినే దెబ్బతీశాయి. నేనే కాదు.. చాలా మందికి మనోధైర్యం ఉంది. కానీ చాలా అలసిపోయారు. ఇలాంటప్పుడు ఏదేమైనా కానీ భారమంతా దేవుడిదే అనుకుంటాం’అని చెబుతున్నారు రష్యా డ్రోన్ దాడిలో గాయపడి రైలు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న 35 ఏళ్ల సైనికుడు. అలసట యుద్ధక్షేత్రంలోని సైనికుల మనోధైర్యాన్ని దెబ్బతీస్తోందనడానికి ఇదో ఉదాహరణ. ఇద్దరు పిల్లల తండ్రి అయిన ఈయన 18 నెలల నుంచి డోనెట్స్క్ ప్రాంతంలోని పదాతిదళంలో యాంటీ ట్యాంక్ గన్నర్‌గా పనిచేస్తున్నారు. ఇన్ని రోజుల్లో కేవలం 45 రోజులు మాత్రమే ఫ్రంట్‌లైన్‌కు దూరంగా ఉన్నారు. గాయాల నుంచి ప్రేరణ.. ఈయనకు కొన్ని పడకల దూరంలో కూర్చున్న స్టానిస్లావ్ మూడు నెలల క్రితం స్వచ్ఛందంగా సైన్యంలో చేరారు. అతడున్న కందకంపైన డ్రోన్ దాడి జరగడంతో ఊపిరితిత్తులకు గాయమైంది. పక్కటెముకలు విరిగాయి. అయినా స్టానిస్లావ్ పూర్తి భిన్నమైన మానసిక స్థితిలో కనిపించారు. ‘‘గాయపడ్డాక నాలో ఆత్మస్థైర్యం తగ్గలేదు. నేను మరింత ప్రేరణ పొందాను’’అని చిరునవ్వుతో చెబుతున్నారు. యుద్ధంలో ఉక్రెయిన్ విజయం సాధిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
గూగుల్ అకౌంట్... వాడకుంటే డిలీటే!
మీ గూగుల్ అకౌంట్‌ను ఈ మధ్య అసలే వాడటం లేదా? దాని వంక కన్నెత్తి చూసి రెండేళ్లయిందా? అయితే అది ఇక శాశ్వతంగా డిలీట్ అయిపోతుంది. ఈ మేరకు కొత్త పాలసీని 2023 డిసెంబర్ 1 నుంచి గూగుల్ అందుబాటులోకి తెస్తోంది. దీనికి సంబంధించిన వివరాలన్నీ తెలియజేస్తూ గూగుల్ ఈ వారమే తన యూజర్లందరికీ మెయిల్స్ పంపింది. తాను అందించే అన్ని సరీ్వసులు, ప్రొడక్టులకూ ఇది వర్తిస్తుందని స్పష్టం చేసింది. ‘మా యూజర్లు అకౌంట్‌ను వాడటం మానేసినా వారి డేటా పూర్తిగా గోప్యంగా, సురక్షితంగా ఉండేలా చూడటమే మా లక్ష్యం. అకౌంట్ డిలీషన్ అందులో భాగమే’’ అని గూగుల్ ప్రకటించింది. వీటికి వర్తిస్తుంది ► గూగుల్ అకౌంట్‌ను రెండేళ్ల పాటు సైన్ ఇన్ చేయకపోతే, వాడకపోతే. ► ఒకసారి డిలీట్ చేసిన అకౌంట్ తాలూకు జీ మెయిల్ అడ్రస్‌ను ఇంకెవరికీ కేటాయించబోరు. ► సేఫ్టీ, సెక్యూరిటీ కారణాల రీత్యా తన పాలసీని ఇలా అప్డేట్ చేస్తున్నట్టు గూగుల్ తెలిపింది. ► అయితే అకౌంట్‌ను డిలీట్ చేసే ముందు గూగుల్ పలుమార్లు రిమైండర్ మెయిల్స్ పంపుతుంది. అవి సదరు అకౌంట్‌తోపాటు యూజర్ తాలూకు రికవరీ అకౌంట్‌కు కూడా వెళ్తాయి. ► ఏదైనా చర్య తీసుకోవడానికి కనీసం 8 నెలల ముందు నుంచే ఈ మెయిల్స్ రావడం మొదలవుతుంది. మీ గూగుల్ అకౌంట్ యాక్టివ్‌గా ఉండాలంటే... ► తరచూ లాగిన్ అవుతూ ఉన్నా... ► కనీసం రెండేళ్లకు ఒకసారైనా లాగిన్ అయినా... ► గూగుల్ డ్రైవ్ వాడినా... ► మెయిల్ పంపినా, చదివినా... ► యూట్యూబ్‌లో వీడియో చూసినా... ► ఏ గూగుల్ యాప్ డౌన్లోడ్ చేసినా... ► థర్డ్ పార్టీ యాప్, సరీ్వస్ లను గూగుల్ ద్వారా సైన్ ఇన్ చేసినా మీ గూగుల్ ఖాతాకు ఎలాంటి ఢోకా ఉండదు. మినహాయింపులున్నాయ్.. గూగుల్ అకౌంట్ డిలీషన్ పాలసీకి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వాటి ప్రకారం రెండేళ్ల పాటు వాడకంలో లేని అకౌంట్లను డిలీట్ చేసే కొత్త విధానం ఈ కింది వాటికి వర్తించదు ► యూట్యూబ్ చానల్స్, ఖాతాకు, కామెంట్లున్న గూగుల్ అకౌంట్ ► డబ్బులతో కూడిన గిఫ్ట్ కార్డులున్న జీ మెయిల్ అకౌంట్ ► పబ్లిషిడ్ అప్లికేషన్ ఉన్న అకౌంట్ – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉన్నట్లుండి ఫోన్ ఛార్జింగ్ పడిపోతోందా?
Smart Phone Safety Tips: భయపెట్టడానికి కాదు.. ఇది ముమ్మాటికీ మీ స్మార్ట్‌ఫోన్ ప్రమాదంలో పడిందని చెప్పడానికే!. ట్రోజాన్స్, స్పైవేర్, రాన్సమ్వేర్, యాడ్వేర్, వార్మ్స్, ఫైల్‌లెస్ వండర్స్.. ఇలా రకరకాల పేర్లు, వెర్షన్లతో జరిగేవన్నీ సైబర్ఎటాక్స్ గురించి దాదాపు అందరికీ తెలిసిందే. లాక్డౌన్ టైం నుంచి ఆన్లైన్ క్లాసులు, ఆఫీస్ మీటింగ్‌లంటూ ఎన్నో విధాలుగా స్మార్ట్‌ఫోన్ వాడకం పెరిగింది. ఇదే సైబర్ నేరాల సంఖ్య పెరగడానికి కారణమైందని సైబర్ సెక్యూరిటీ సంస్థలు చెప్తున్నాయి. యాప్‌లు, మెసేజ్‌లు, ఈ-మెయిల్స్, లింక్స్ ద్వారా యూజర్ మొబైల్స్‌లోకి వైరస్ నుంచి పంపి వారి విలువైన సమాచారాన్ని సేకరిస్తుంటారు. ఈ నేపథ్యంలో కొత్త తరహాలో సాగుతున్న సైబర్‌దాడులు, ఫోన్లో వైరస్ ఉనికి ఎలా గుర్తించాలి? వైరస్ బారి నుంచి స్మార్ట్‌ఫోన్‌ను ఎలా కాపాడుకోవాలి? నిపుణులేమంటున్నారో చూద్దాం. ఎలా గుర్తించాలంటే.. ♦ ఫోన్ ఒక్కోసారి స్లో అవుతుంది. సమస్య ఏంటో తెలియక కొందరు స్పేస్ ఫ్రీ చేస్తుంటారు. లేదంటే రీస్టార్ట్ చేస్తారు. అయినా ఫోన్ పనితీరు మారదు!. ఎందుకంటే ఆ ఫోన్ డాటా అప్పటికే ప్రమాదంలో పడినట్లేనని సైబర్ నిపుణులు చెప్తున్నారు. ♦ ఫోన్ రీఛార్జి, ఏదైనా బిల్లులు చెల్లించినప్పుడు, ట్రాన్జాక్షన్స్ జరిపినప్పుడు.. వెంటనే ఫోన్ కాల్స్, మెసేజ్‌లు(అన్మార్క్) వస్తుంటాయి. ♦ ఎలాంటి యాప్స్ ఓపెన్ చేసినా.. యాడ్స్ విపరీతంగా డిస్ప్లే అవుతుంటాయి. ♦ కాంటాక్ట్ లిస్ట్‌లోని నెంబర్ల నుంచి సందేశాలు, లింక్‌లు వస్తాయి. క్లిక్ చేస్తే డాటా రిస్క్‌లో పడినట్లే!. ♦ ఫోన్ పర్ఫార్మెన్స్ పూర్తిగా నెమ్మదిస్తుంది. ♦ కొత్త యాప్‌ల ద్వారా కూడా వైరస్, మాల్వేర్ ఫోన్ ఛాన్స్ ఉంటుంది. ♦ సైబర్ ఎటాక్ ప్రభావంతో ఇంటర్నెట్ డేటా కూడా త్వరగతిన అయిపోతుంది. ♦ ఫోన్ బ్యాటరీ టైం తగ్గిపోవడం.. లేదంటే ఉన్నట్లుండి సడన్‌గా బ్యాటరీ పర్సంటేజ్ పడిపోతుంది. ♦ యూజర్ ప్రమేయం లేకుండా అవతలి వాళ్లకు ఫోన్ నుంచి ఫోన్‌కాల్స్, మెసేజ్‌లు వెళ్తుంటాయి. అలాగే యాప్‌ల కొనుగోళ్లు జరుగుతుంది. ఏం చేయాలంటే.. ► యాంటీవైరస్ స్కాన్ ద్వారా గుర్తించొచ్చు. ► యాప్స్.. సైబర్ దాడులకు ఒక ముఖ్యకారణం. అందుకే యాప్ స్టోర్లలో వెరిఫై చేసుకున్నాకే డౌన్లోడ్ చేసుకోవాలి. ► టెక్స్ట్ మెసేజ్, లింక్స్ విషయంలో జాగ్రత్త అవసరం. ► మొబైల్ ట్రాన్జాక్షన్స్ టైంలో వచ్చే యాడ్స్, లింక్స్‌ను క్లిక్ చేయొద్దు. అప్రమత్తంగా ఉండాలి. ► అలానే రివ్యూలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే సదరు యాప్స్‌ని డౌన్లోడ్ చేసుకోవాలి. ► యాప్ పేరులో అక్షర దోషాలు, అన్వయ దోషాలు ఉంటే మాత్రం వాటి జోలికెళ్లద్దు ► ఒకవేళ ఫోన్లో పై సమస్యలేవైనా ఎదురైతే.. అవసరం లేని యాప్స్(ప్లేస్టోర్, ఏపీకే అయినా) తొలగించాలి. ► అవసరం అనుకుంటే ఫోన్ ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఉత్తమం. - సాక్షి, వెబ్ స్పెషల్ క్లిక్ చేయండి: సరికొత్త ఆఫర్...మనీ యాడ్ చేస్తే...20 శాతం బోనస్..! -
‘కాపలా లేని రైల్వే గేట్లను ఎత్తేస్తాం’
సాక్షి, హైదరాబాద్/సికింద్రాబాద్: దక్షిణ మధ్య రైల్వేలో ప్రయాణికుల భద్రత విషయంలో రాజీలేకుండా పని చేస్తున్నామని జీఎం వినోద్‌కుమార్ అన్నారు. ప్రమాదాలను గణనీయంగా తగ్గించడానికి ప్రయాత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నారు. బుధవారం ఆయన కార్యాలయంలో మీడియతో మాట్లాడారు. 6 నెలలుగా ప్రమాదాల నివారణకు నిర్విరామంగా పనులు సాగుతున్నాయని తెలిపారు. ప్రమాదాల సంఖ్య 116 నుంచి 73కు తగ్గిందని అన్నారు. దక్షిణ మధ్య రైల్వేను జీరో ప్రమాదాల స్థాయికి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నామన్నారు.. గతేడాది 200, ఈ ఏడాది 300 కిలో మీటర్లు నూతనంగా ట్రాక్‌ల నిర్మాణం చేపట్టామన్నారు. తద్వారా ఎక్కువ సర్వీసులను నడిపి వెయిటింగ్ లిస్టు లేకుండా చేసే దిశగా ముందడుగు వేశామన్నారు. కాపలా లేని రైల్వే గేట్లను జీరో స్థాయికి తీసుకొస్తామని అన్నారు. గతేడాది 136, ఈ ఏడాది 132 కాపలా లేని రైల్వే గేట్లు తొలగించామని తెలిపారు. వచ్చే మూడేళ్లలో మన్మాడ్ జోన్‌ను పూర్తి ఎలక్ట్రిక్ లైన్ జోన్‌గా మారుస్తామన్నారు. సికింద్రాబాద్ గణపతి ఆలయం వద్ద మల్టీలెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ నిర్మాణానానికి రాష్ట్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నాని తెలిపారు. రైల్వేలో మౌలిక సదాపాయాల కల్పనకు నిధుల కొరత లేదన్నారు. -
సురక్షిత ప్రయాణం
జనగామ: ఆర్టీసీ ప్రయాణం సురక్షితం..సుఖవంతం అనే నినాదం ప్రతి బస్సుపైనా కనిపిస్తుంది. అంకితభావం కలిగిన డ్రైవర్లు ఈ నినాదాన్ని అక్షర సత్యంగా మార్చారు. ప్రైవేట్ వాహనాలతో పోలిస్తే ఆర్టీసీ ప్రయాణం సురక్షితమన్న భావన ప్రజలకు కల్పించడంలో సఫలీకృతులయ్యారు. జిల్లాలో ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు స్వల్పం. ఈ నెల19 నుంచి ప్రారంభమైన ఆర్టీసీ రోడ్డు భద్రతా వారోత్సవాలు 25 వరకు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా ఆర్టీసీ డ్రైవర్లు, సిబ్బందికి అధికారుల ప్రమాదాల నివారణపై అవగాహన కల్పిస్తున్నారు. ఆర్టీసీలో ప్రతి సంవత్సరం రోడ్డు భద్రతా వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ప్రమాదాల నివారణపై డ్రైవర్లకు అవగాహన కల్పిస్తున్నారు. బస్సు కండీషన్, డ్రైవింగ్ చేసే సమయంలో ఏకాగ్రత.. ప్రయాణికులతో ఎలా ఉండాలనే దానిపై నిపుణులతో ప్రత్యేక తరగతులను నిర్వహిస్తున్నారు. బస్సును ఈ రోజు పూర్తి ఏకాగ్రతతో నడిపిస్తాను, అవసరమైన సమయంలో వేగాన్ని నియంత్రణ చేస్తూ, ప్రయాణికులకు సుఖవంతమైన, సురక్షితమైన ప్రయాణ సౌకర్యాన్ని అందిస్తానని డ్రైవర్లతో ప్రతిజ్ఞ చేయిస్తున్నారు. ఉత్తమ డ్రైవర్లకు బహుమతులను అందిస్తున్నారు. తగ్గిన ప్రమాదాలు... ఆర్టీసీ బస్సులో ప్రయాణం సురక్షితనే భావన ప్రయాణికుల్లో బలంగా నాటుకు పోయింది. ఎందుకంటే ఆర్టీసీ బస్సుల ద్వారా జరిగిన ప్రమాదాలు చాలా తక్కువగా నమోదయ్యాయి. ముఖ్యంగా డ్రైవర్‌పై పని ఒత్తిడి తక్కువ. మూడేళ్లుగా జనగామ జిల్లా పరిధిలో ఆర్టీసీ ప్రమాదాలు తక్కువనే చెప్పుకోవచ్చు. 2015తో పోలిస్తే 2016లో ప్రమాదాల సంఖ్య తగ్గింది. 2015లో ఆర్టీసీ బస్సు ప్రమాదంలో నలుగురు వ్యక్తులు మృతి చెందారు. చిన్నవి, పెద్దవి కలుపుకుని జరిగిన ప్రమాదాల్లో 12 మంది క్షతగాత్రులయ్యారు. 2016లో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకరు మృత్యువాత పడగా..మేజర్, మైనర్ ప్రమాదాల్లో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 2015తో పోలిస్తే మూడు శాతం మేర ప్రమాదాలు తగ్గుముఖం పట్టాయి. 2017 ఏప్రిల్‌లో సిద్దిపేట జిల్లా కేంద్రంలో జనగామ డిపోకు చెందిన బస్సు ఢీకొని ఓ మహిళ చనిపోగా.. తొమ్మిది రోడ్డు ప్రమాదాల్లో పలువురికి స్వల్ప గాయాలయ్యాయి. జాతీయ రహదారిపై.. వరంగల్–హైదరాబాద్, సిద్దిపేట–విజయవాడ జాతీయ, స్టేట్ హైవేలపై ప్రైవేట్ వాహనాల రోడ్డు ప్రమాదాలు ఎక్కువే. అతివేగం, మద్యం మత్తులో వాహనాలను నడుపుతూ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా.. అమాయకులను బలి చేస్తున్నారు. జనగామ జిల్లాలో 2015 సంవత్సరంలో జాతీయ, రాష్ట్ర రహదారిలో 320 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగగా..ఇందులో 170 మందికి పైగా మృతి చెందారు. 350 మందికి పైగా తీవ్ర, స్వల్ప గాయాలయ్యాయి. డ్రంకెన్ డ్రైవ్, పోలీసు పెట్రోలింగ్, నిరంతర నిఘా పెంచడంతో 2016లో ప్రమాదాల సంఖ్య 292కు తగ్గి పోయింది. ఈ ప్రమాదాల్లో 133 మంది అక్కడికక్కడే చనిపోగా.. 299 మంది గాయాల పాలయ్యారు. 2017లో 265 వరకు రోడ్డు ప్రమాదాలు జరుగగా..100కు పైగా మృతి చెందారు. నేడు ఫ్యామిలీ కౌన్సెలింగ్.. తరుచూ రోడ్డు ప్రమాదాలు చేస్తున్న డ్రైవర్లకు కుటుబ సభ్యులతో కౌన్సెలింగ్ ఇస్తారు. డ్రైవర్ ఇంటి నుంచి వెళ్లే క్రమంలో ఎలాంటి చికాకులు ఉండకుండా సంతోషంగా ఉండేలా చూసుకోవాలని కుటుంబ సభ్యులకు వివరిస్తారు. బస్సులో ప్రయాణిస్తున్న ఎన్నో కుటుంబాలు డ్రైవర్‌పై ఆధారపడి ఉంటాయన్న విషయాన్ని గర్తుంచుకోవాలని సూచిస్తారు. 23న బస్సు కండీషన్‌పై అవగాహన బస్సు కండీషన్, ప్రమాదాన్ని గమనించి వేగాన్ని ఎలా అదుపు చేసుకోవాలనే దానిపై మంగళవారం అవగాహన కలిగిస్తారు. గతంలో రోడ్డు ప్రమాదాలు చేసిన డ్రైవర్లకు ఉత్తములతో శిక్షణ ఇప్పిస్తారు. అవసరమైన సమయంలో వారిని శిక్షణ కోసం రీజియన్‌కు పంపిస్తారు. 24న ఉత్తమ డ్రైవర్లకు సత్కారం వారోత్సవాల ముగింపులో ఉత్తమ సేవలందించిన డ్రైవర్లను బుధవారం సత్కరిస్తారు. మిగతా వారికి స్ఫూర్తిగా నిలిచేలా వారి ఫొటోలను ప్రదర్శిస్తారు. విజయాలు అందరికి తెలిసేలా వారి సర్వీసు రికార్డులో ఫొటోలు ఉంచుతారు. 25న సేవా కార్యక్రమాలు రోడ్డు భద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని గురువారం రక్తదాన శిబిరాలు, సేవా కారక్రమాలను చేపడుతారు. డ్రైవర్లు రక్తదానం చేసి తమలోని మానవత్వాన్ని చాటుకుంటారు. అత్యవసర సమయంలో ఈ రక్తాన్ని వినియోగిస్తారు. ప్రయాణికుల సేవలో.. జనగామ డిపో పరిధిలో 125 బస్సులు నిత్యం 40 వేల మంది ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానం చేర్చుతున్నాయి. ఆర్టీసీలో రోడ్డు ప్రమాదాలు చాలా తక్కువ. వంద శాతం యాక్సిడెంట ఫ్రీ జోన్‌గా జనగామను తీర్చి దిద్దేందుకు డ్రైవర్లకు ఎప్పటికప్పుడు సలహాలు, సూచనలు అందిస్తున్నాం. గత మూడేళ్లుగా పరిశీలిస్తే ప్రమాదాలను చాలా వరకు నియంత్రించగలిగాం. – శ్రీనివాసరావు, జనగామ డిపో మేనేజర్ ఆర్టీసీ రూల్స్ పాటించాలి వాహన డ్రైవర్లు, యజమానులు ఆర్టీ రూల్స్ ప్రకారం నడుచుకోవాలి. అన్ని అనుమతులు పొందిన తర్వాతనే వాహనాన్ని రోడ్డు ఎక్కించాలి. ముఖ్యంగా ఫిట్నెస్, ఇన్సూరెన్స్, లైసెన్స్ ఉండేలా చూసుకోవాలి. ఓవర్‌లోడ్ ఉంటే కేసులు తప్పవు. నిబంధనలు పాటించని వాహనాలపై కేసులు నమోదు చేస్తూ..అవగాహన కలిగిస్తున్నాం. మధ్యం సేవించి ఎవరూ కూడా డ్రైవింగ్ చేయరాదు. ద్విచక్రవాహన చోదకులు హెల్మెట్ వాడకం తప్పనిసరి చేసుకోవాలి. – రమేష్‌రాథోడ్, డీటీఓ, జనగామ -
ప్రాణాలు తీస్తున్న లిఫ్ట్‌లు
లిఫ్ట్‌లు కొన్ని సందర్భాల్లో ప్రాణాంతకంగా మారుతున్నాయి. బహుళ అంతస్తులు ఉండే అపార్ట్మెంట్స్, షాపింగ్ మాల్స్‌లో సౌకర్యవంతం కోసం లిఫ్ట్‌లు ఏర్పాటు చేస్తున్నారు. అయితే వాటి వినియోగంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో అక్కడక్కడా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. వీటిపై పూర్తి అవగాహన పెంచుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. పాతగుంటూరు : రాజధానిలోని రెండు జిల్లాల్లో జనాభా ఎంత పెరిగినా అందరికీ నివాసయోగ్యమైన అక్షయపాత్రలా మార్చినవి అపార్ట్మెంట్లే. వేల కుటుంబాలు తల దాచుకుంటున్నది ఈ బహుళ అంతస్తుల భవనాల్లోనే. అందరికీ కింద ఫ్లోర్లే దొరకవు గనుక పై అంతస్తుల్లోనైనా నివాసం తప్పనిసరి. అన్ని మెట్లు ఎక్కలేని వారిని రివ్వున పైకి చేర్చే లిఫ్ట్‌లు ఉండటంతో ఇక చింతే లేదు. అయితే అంతటి మేలు చేసే లిఫ్ట్ వినియోగంలో ఏ మాత్రం ఏమరుపాటు ఉన్నా ప్రాణాల మీదకు వచ్చేంత ప్రమాదాలు పొంచి ఉన్నాయనేది గమనించాల్సిన అంశం. పలువురి మృతి.. ఈ నెల 3న లిఫ్ట్‌ల కారణంగా ఇరువురు మృతి చెందిన ఘటనలు చోటు చేసుకున్నాయి. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో కొంతకాలంగా మరమ్మతులకు గురైన విషయం తెలియక డోర్ తెరుచుకుని ఉన్న ఖాళీ లిఫ్ట్‌లోకి వెళ్లి ప్రమాదానికి గురై వ్యక్తి మృతి చెందాడు. అలాగే, ప్రకాశం జిల్లా చీరాలలో మొదటి గేటు వేసి రెండో గేటు మూసే క్రమంలో మరో వ్యక్తి లిఫ్ట్ బటన్ నొక్కడంతో అది పైకి వెళ్లడంతో గేటుకు గోడకు మధ్యలో తల ఇరుక్కుపోవడంతో అతని తల ఛిద్రమై అక్కడికక్కడే మృతి చెందాడు. రెండు నెలల క్రితం నగరంలోని ఓ జిమ్ ప్రారంభోత్సవంలో పాల్గొనేందుకు వచ్చిన హీరో నిఖిల్ గ్రిల్ లిఫ్ట్‌లో అంతరాయం ఏర్పడడంతో సుమారు 20 నిమిషాల పాటు ఇరుక్కు పోయారు. గ్రిల్స్‌ను తొలగించడంతో హీరో సుక్షితంగా బయటకు వచ్చిన ఘటన జరిగింది. ఇలాంటి ఘటనలు దాదాపు అపార్ట్‌మెంట వాసులందరికి ఓ హెచ్చరిక లాంటివి. ప్రతి ఒక్కరూ తమ భవనాల్లోని లిఫ్ట్‌ల నిర్వహణ ఎలా ఉందో తరచూ చూసుకోవాల్సి తరుణమిది. ప్రస్తుతం మూడు రకాల లిఫ్ట్‌లు వినియోగంలో ఉన్నాయి. 1–గ్రిల్స్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌కు ఉన్న రెండు డోర్లు గ్రిల్‌తో రూపొందించడంతో గాలి, వెలుతురు ఉంటుంది. రెండు డోర్లు లాక్ అయిన తర్వాత కిందకైనా పైకి అయినా మూవ్ అవుతుంది. సరిగా లాక్ అవకపోతే హెచ్చరిస్తుంది. పిల్లలు గ్రిల్లో చేతులు పెట్టి ప్రమాదాలకు గురవుతున్న కారణంగా ప్రస్తుతం వీటి డిమాండ్ తగ్గింది. 2–ఆటోమేటిక్ డోర్ లాక్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌కు లోపల గ్రిల్ ఉంటే బయట ఆటోమేటిక్‌గా దానంతట అదే మూసుకుపోయే డోర్ ఉంటుంది. లోపల డోర్ లాక్ అయిన వెంటనే ఇది కూడా లాక్ అవుతుంది. ప్రస్తుతం ఈ లిఫ్ట్‌ల వినియోగం అధికంగా ఉంది. గాలీ, వెలుతురు తక్కువగా ఉంటుంది. కరెంట్ పోయినపుడు రన్నింగ్‌లో ఉన్న లిఫ్ట్ ఆగిపోతే చీకటిమయమవుతుంది. అందులో ఉన్నవారు ఇబ్బంది పడకముందే జనరేటర్ ఆన్‌చేసి లిఫ్ట్ పని చేసేలా చూడాలి. జనరేటర్ పని చేయకపోతే మాత్రం కష్టం. కొత్తగా నిర్మిస్తున్న అపార్ట్మెంట్లలో వీటికి డిమాండ్ ఎక్కువగా ఉంది. అపార్ట్మెంట్ నిర్మాణంలో ఉండగానే కొందరు తాత్కాలికంగా లిఫ్ట్‌ని ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇది సరైన విధానం కాదు. పూర్తిస్థాయిలోనే లిఫ్ట్ ఏర్పాటు చేసుకోవాలి. 3–స్ప్రింగ్ డోర్ లిఫ్ట్ : ఈ లిఫ్ట్‌లను ఆస్పత్రులు, పెద్ద పెద్ద హోటళ్లలో ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటి డోర్లు తాము చేరవలసిన అంతస్తు రాగానే వాటంతట అవే తెరుచుకుంటాయి. లోపలికి వెళ్లగానే డోర్లు మూసుకుంటాయి. వీటి నిర్వహణకు లిఫ్ట్ బాయ్ ఎల్ల పుడూ అందుబాటులో ఉంటాడు. అతనే ఆపరేట్ చేస్తాడు. వీటిలో అంతగా ప్రమాదాలకు ఆస్కారం ఉండదు. అపార్ట్మెంటు లిఫ్ట్‌లు నలుగురు, ఐదుగురికి మాత్రమే పరిమితమైతే వీటిల్లో ఒకేసారి పదిమంది వరకు ఎక్కే వెసులుబాటు ఉంది. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ♦ లిఫ్ట్‌కు ఉన్న రెండు డోర్లు పూర్తిగా లాక్ కానిదే పని చేయదు. అలా లేకపోయినా పని చేస్తుందంటే అది పాడైనట్లు గుర్తించాలి. ♦ దయచేసి డోర్ లాక్ చేయండి.. వంటి రికార్డ్ చేసిన హెచ్చరిక వాఖ్యాలు లేదా బీప్ సౌండ్ లేకుండా లిఫ్ట్ పని చేసినా అది ఉపయోగించడం క్షేమం కాదు. ♦ లిఫ్ట్ సామర్థ్యానికి మించి ఎక్కువమంది ఎక్కినా మధ్యలోనే ఆగిపోవడం, త్వరగా చెడిపోవడం జరుగుతుంది. ♦ రెండు డోర్లు పూర్తిగా లాక్ అవకముందే తాము చేరుకోవలసిన లేదా దిగవలసిన అంతస్తు బటన్ నొక్కరాదు. ఈ విషయంలో నిర్లక్ష్యం చేస్తే లిఫ్ట్ గమ్యాం చేరుకోకముందే ఆగిపోవడానికి ఆస్కారం ఉంటుంది. ♦ పెద్దల తోడు లేకుండా పిల్లలను పంపించకూడదు. పిల్లలు దానిని ఆట వస్తువుగా భావించి, కిందకు, పైకి వెళ్లేందుకు పదే పదే లిఫ్ట్ బటన్లను వినియోగించడం వలన అది చెడిపోయే అవకాశం ఉంటుంది. ♦ ప్రతి నెలా లేదా కనీసం మూడు నెలలకు ఒకసారైనా లిఫ్ట్ సాంకేతిక నిపుణులతో సర్వీసు చేయిస్తే మంచి కండీషన్లో పని చేస్తుంది. ♦ పాడైన లిఫ్ట్‌ను ఎట్టి పరిస్థితుల్లో వినియోగించరాదు. ♦ అపార్ట్మెంట్లో నివసించే వారందరూ లిఫ్ట్ వినియోగంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలి. ♦ లిఫ్ట్ వినియోగం.. తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సాంకేతిక నిపుణులతో అవగాహన సదస్సులు నిర్వహించడం మంచిది. మూడు నెలలకోసారి సర్వీసింగ్ తప్పనిసరి.. మేం అన్ని జాగ్రత్తలు తీసుకునే లిఫ్ట్‌లను ఫిట్ చేస్తాం. లిఫ్ట్ వినియోగానికి సంబంధించి బోర్డును లిఫ్ట్ బయట, లోపల అందరికి కనిపించేలా ఏర్పాటు చేస్తున్నాం. అయితే మూడునెలలకోసారైనా సర్వీసింగ్ చేయించాలి. ఏమైనా విడిభాగాలు పోతే వెంటనే వేయించాలి. – హర్షవర్ధన్, బిల్డర్, గుంటూరు -
సర్వం సిద్ధం
♦ నేడు రాష్ట్రపతి ఎన్నికలు ♦ ఢిల్లీకి ఎంపీలు ♦ చెన్నైకు ఎమ్మెల్యేలు ♦ కరుణ ఓటు వేసేనా ♦ ఎన్నికలకు పీఎంకే దూరం ♦ అన్నాడీఎంకే కార్యాలయం ముట్టడికి యత్నం రాష్ట్రపతి ఎన్నికలకు అసెంబ్లీ ఆవరణలో సర్వం సిద్ధం చేశారు. ఆ పరిసరాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు. సభ్యుల కోసం ఓటింగ్‌కు తగ్గ అన్ని వివరాలు, సూచనలతో బోర్డుల్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రానికి చెందిన ఎంపీలు అందరూ ఢిల్లీ పయనమయ్యారు. ఎమ్మెల్యేలు అందరూ చెన్నైకు చేరుకుంటున్నారు. సాక్షి, చెన్నై రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పదవీ కాలం ముగియనుండడంతో 14వ కొత్త రాష్ట్రపతి ఎన్నిక నిమిత్తం సోమవారం ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలోని ఎన్డీయే అభ్యర్థిగా రామ్‌నాథ్ కోవింద్, కాంగ్రెస్ నేతృత్వంలోని ప్రతి పక్షాల అభ్యర్థిగా మీరా కుమార్ ఆ పదవి కోసం పోటీ పడుతున్నా రు. ఇప్పటికే ఈ ఇద్దరు చెన్నైలో పర్యటించి రాజ కీయ పక్షాల ఎమ్మెల్యేలు, ఎంపీల మద్దతును సేకరించారు. రాష్ట్రంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా జయలలిత మరణంతో ఓ స్థానం ఖా ళీగా ఉంది. మిగిలిన సభ్యులు తమ ఓటు హక్కు ను వినియోగించుకోనున్నారు. డీఎంకే, కాంగ్రెస్, ఐయూఎంఎల్‌కు చెందిన ఎమ్మెల్యేలు ఓటింగ్ ని మిత్తం చెన్నైకు ఆదివారమే చేరుకున్నారు. అన్నాడీఎంకే ఉప ప్రధాన కార్యదర్శి దినకరన్ మద్దతు ఎ మ్మెల్యేలు ఒకరిద్దరు మినహా తక్కిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు చెన్నై చేరుకుంటున్నారు. ఇక, అన్నాడీఎంకేలో ఉన్న మనిదనేయ జననాయగ కట్చి ఎమ్మెల్యే తమీమున్ అన్సారి మాత్రం తన ఓటు మీరాకుమార్‌కు అని ప్రకటించడం గమనార్హం. ఎంపీలందరూ ఢిల్లీలో: ఇక, డీఎంకేకు చెందిన ఎంపీ కనిమొళి, తిరుచ్చిశివ, ఆర్ఎస్ భారతి, టీకేఎస్ ఇళంగోవన్, సీపీఎం రంగరాజన్, సీపీఐ డి.రాజా తమ ఓట్లను ఢిల్లీలోని పార్లమెంట్ ఆవరణలోని పోలింగ్ కేంద్రంలో వినియోగించుకోనున్నారు. ఇక, అన్నాడీఎంకే చెందిన రాజ్యసభ, పార్లమెంట్ సభ్యులు అందరూ ఢిల్లీలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీళ్లంతా ఆదివారం సాయంత్రం ఢిల్లీ బయలు దేరి వెళ్లారు. ముందుగా ఎంపీలతో సీఎం పళనిస్వామి భేటీ అయ్యారు. మాజీ సీఎం పన్నీరు సెల్వం వెన్నంటి ఉన్న ఎంపీలను తమ వైపునకు తిప్పుకునే రీతిలో ఢిల్లీలో పావులు కదపాలని తమ శిబిరం ఎంపీలకు సూచించినట్టు సమాచారం. ప్రత్యేక ఏర్పాట్లు: ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎమ్మెల్యేలు సిద్ధం కావడంతో సచివాలయం ఆవరణలో అసెంబ్లీ సమావేశ మందిరం, పరిసరాల్లో ప్రత్యేక ఏర్పాట్లు జరిగాయి. అసెంబ్లీ లాబీ ఆవరణలోకి మీడియాకు అనుమతి నిరాకరించారు. ఓటు హక్కు వినియోగించుకునే సభ్యులు ప్రవేశ మార్గంలో ఉన్న పుస్తకంలో సంతకంచేసినానంతరం లోనికి వెళ్లే రీతిలో ఏర్పాట్లు చేశారు. వారి వెంట ఎవర్నీ అనుమతించరు. ఎన్నికల అధికార్లుగా వ్యవహరిస్తున్న అసెంబ్లీ కార్యాదర్శి(ఇన్) భూపతి, సంయుక్త కార్యదర్శి సుబ్రమణియన్ సభ్యుల గుర్తింపు కార్డులు, ఇతర కార్డులను పరిశీలిస్తారు. తదుపరి ఓటింగ్ హాల్లోకి ఒక్కొక్కర్ని మాత్రమే అనుమతించనున్నారు. బ్యాలెట్ పేపర్, పెన్ను స్వయంగా ఎన్నికల వర్గాలు అందిస్తాయి. ఆ పెన్ను ద్వారా మాత్రమే ఎవరికి ఓటు అన్నది నమోదు చేయాల్సి ఉంటుంది. బ్యాలెట్ బాక్సులు, పేపర్లు అన్ని సిద్ధం చేయడంతో పాటు, అక్కడక్కడ సభ్యులకు ఓటింగ్ నిబంధనలను సూచించే బోర్డులను ఏర్పాటు చేశారు. ఉదయం ఎనిమిదిన్నర గంటల సమయంలో కేంద్ర ఎన్నికల పర్యవేక్షణాధికారి అన్సు ప్రకాష్, రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ, ఎన్నికల ఏజెంట్ల సమక్షంలో బ్యాలెట్ బాక్సులు, పేపర్లను స్ట్రాంగ్ రూముల నుంచి బయటకు తీస్తారు. పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఎన్నికలు జరుగుతాయి. ఎన్నికల దృష్ట్యా, సచివాలయం, అసెంబ్లీ పరిసరాల్లో భద్రత కట్టుదిట్టంచేయడంతోపాటు వాహనాలకు ఆంక్షలు విధించారు. ఇక, కేంద్ర సహాయ మంత్రి, కన్యాకుమారి ఎంపీ పొన్ రాధాకృష్ణన్ బీజేపీ అభ్యర్థికి ఏజెంట్‌గా వ్యవహరించనున్నారు. ఆయన తన ఓటును చెన్నైలో వినియోగించుకోనున్నారు. అలాగే, కేరళకు చెందిన అబ్దుల్ ఎమ్మెల్యే కూడా చెన్నైలో ఓటు వేయనున్నారు. అయితే, డీఎంకే అధినేత కరుణానిధి ఓటు వేయడానికి వచ్చేది అనుమానమే. ఆయన విశ్రాంతిలో ఉండడం ఇందుకు నిదర్శనం. కరుణ ఓటు హక్కువినియోగించుకుంటారా అని మీడియా డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ను ప్రశ్నించగా, వేచి చూడాలని సూచించారు. పీఎంకే దూరం: రాష్ట్రపతి ఎన్నికలను పీఎంకే బహిష్కరించింది. లోక్‌సభ ఎన్నికల్లో ధర్మపురి నుంచి పీఎంకే యువజన నేత అన్భుమణి రాందాసు పార్లమెంట్‌కు ఎన్నికైన విషయం తెలిసిందే. ఆ పార్టీకి ఒకే ఒక సభ్యుడు రాష్ట్రంలో ఉన్నారు. అసెంబ్లీలో ఆ పార్టీ సభ్యులే లేరు. ఉన్న ఒక్క సభ్యుడు ఓటు ఎవరికి వేస్తారోనన్న ప్రశ్న బయలుదేరింది. అయితే, తాము ఎన్నికల్ని బహిష్కరిస్తున్నామని, ఎవ్వరికీ ఓటు వేయబోమని పీఎంకే అధినేత రాందాసు ప్రకటించారు. తమిళ ప్రజల మీద కేంద్రం చూపుతున్న చిన్నచూపునకు నిరసనగా ఎన్నికల్ని బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. ఇక, రాష్ట్రం మీద కేంద్రం వైఖరిని నిరసిస్తూ పెరియార్ ద్రవిడ కళగం నేతృత్వంలో అన్నాడీఎంకే కార్యాలయం ముట్టడియత్నం ఆదివారం సాగింది. బీజేపీకి మద్దతు ఇవ్వొద్దని నినదిస్తూ ఆ కళగం వర్గాలు రాయపేటలోని అన్నాడీఎంకే కార్యాలయాన్ని ముట్టడించేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు.