Sagaramala project
-
ఏపీలో 12 సాగరమాల ప్రాజెక్ట్‌లు: కేంద్రమంత్రి
న్యూఢిల్లీ: సాగరమాల పథకం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, విశాఖపట్నం పోర్టు ట్రస్టు చేసిన 12 ప్రాజెక్ట్ ప్రతిపాదనలను చేపట్టినట్లు కేంద్ర పోర్టులు, షిప్పింగ్ శాఖ మంత్రి శర్బానంద్ సోనోవాల్ తెలిపారు. రాజ్యసభలో మంగళవారం ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు జవాబుగా ఆయన ఈ విషయం వెల్లడించారు. సాగరమాల పథకం కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.412 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. ఈ నిధులను సాగరమాల ప్రాజెక్ట్‌లు చేపట్టే మేజర్ పోర్టులు, నాన్-మేజర్ పోర్టులు, రాష్ట్ర ప్రభుత్వాలు, రాష్ట్ర మారిటైమ్ బోర్డులు ఇతర ప్రభుత్వ సంస్థలకు ఆర్థిక సాయం కింద కేటాయించడం జరుగుతుందని చెప్పారు. ప్రాజెక్ట్ పురోగతిని బట్టి మూడు విడతలుగా నిధులు విడుదల చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సాగరమాల పథకం కింద చేపట్టిన ప్రాజెక్ట్‌లలో ఇప్పటి వరకు అయిదు ప్రాజెక్ట్‌లు పూర్తయినట్లు మంత్రి వెల్లడించారు. విజయవాడ భవానీ ద్వీపంలో పాసింజర్ జెట్టీ నిర్మాణ పనులు, నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెలో ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు, కోస్తా జిల్లాల స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ రెండో దశ పనులు పురోగతిలో ఉన్నట్లు తెలిపారు. కాకినాడ యాంకరేజ్ పోర్ట్‌లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడం, కాకినాడలో ప్రస్తుతం ఉన్న జెట్టీని మెరుగుపరచి సీ ప్లేన్ జెట్టీ అభివృద్ధి చేయడం, భీమునిపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం, కళింగపట్నంలో పాసింజర్ జెట్టీ నిర్మాణం పనులను ఆయా నిర్మాణ సంస్థలకు అప్పగించామని రెండేళ్లలోగా పూర్తవుతాయని మంత్రి చెప్పారు. చదవండి: (బెంగాల్ సీఎం లేఖ.. రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ) -
విజయవాడలో వాటర్ ఏరోడ్రోమ్!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నీటిపై తేలియాడే విమానాశ్రయం అందుబాటులోకి రాబోతోంది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ ఎగువన కృష్ణా నదిపై వాటర్ ఏరోడ్రోమ్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సముద్ర ఆధారిత పర్యాటక రంగాన్ని ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా తొలి దశలో దేశవ్యాప్తంగా 14 చోట్ల వాటర్ ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి కేంద్ర నౌకాయాన శాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు ఏపీ మారిటైమ్ అధికారులు వెల్లడించారు. ఇందులో భాగంగా విజయవాడ ప్రకాశం బ్యారేజీ ఎగువన, తెలంగాణ పరిధిలో నాగార్జున సాగర్ డ్యామ్ వద్ద ఒక్కొక్క వాటర్ ఏరోడ్రోమ్లను అభివృద్ధి చేయనున్నారు. సాగరమాల ప్రాజెక్టులో భాగంగా మొత్తం రూ.450 కోట్లతో వాటర్ ఏరోడ్రోమ్లను అభివృద్ధి చేయనున్నారు. సీ ప్లేన్స్ ద్వారా మారుమూల ప్రాంతాలను సైతం ప్రధాన నగరాలతో అనుసంధానం చేయడంతో పాటు పర్యాటకులను ఆకర్షించే విధంగా వీటిని అభివృద్ధి చేస్తారు. తొలి దశలో 28 రూట్లలో సీ ప్లేన్స్ దేశవ్యాప్తంగా సీ ప్లేన్ సర్వీసులు నడపడానికి మొత్తం 78 రూట్లను ఎంపిక చేయగా.. తొలి దశలో 14 చోట్ల నుంచి 28 రూట్లలో సర్వీసులు నడపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో ఏరోడ్రోమ్‌ల నిర్మాణానికి సమగ్ర ప్రణాళికను తయారు చేసే బాధ్యతను నేషనల్ టెక్నాలజీ ఫర్ పోర్ట్స్, వాటర్ వేస్ అండ్ కోస్ట్ (ఎన్టీసీపీడబ్ల్యూసీ), ఐఐటీ మద్రాస్‌లకు అప్పగించారు. విజయవాడలోని భవానీ ఐలండ్ నుంచి సీ ప్లేన్ సర్వీసులు ప్రారంభించేందుకు కేంద్రం ఇంతకుముందే ప్రతిపాదించినా కోవిడ్–19 వల్ల ముందడుగు పడలేదని ఏపీ మారిటైమ్ బోర్డు డిప్యూటీ సీఈవో బీఎం రవీంద్రనాథ్ రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. సముద్ర ఆథారిత పర్యాటక రంగంలో అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా మెరైన్ మ్యూజియం, ఫ్లోటింగ్ జెట్టీల నిర్మాణం వంటి ప్రతిపాదనలు ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏడు ప్రాంతాల్లో ఫ్లోటింగ్ జెట్టీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధం చేసినట్టు వెల్లడించారు. -
ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్‌లు
సాక్షి, న్యూఢిల్లీ: సాగరమాల కార్యక్రమం కింద దేశంలో కొత్తగా అభివృద్ధి చేయడానికి తలపెట్టిన 91 రోడ్డు, 83 రైల్ ప్రాజెక్ట్‌లలో ఆంధ్రప్రదేశ్‌కు 32 రోడ్డు, 21 రైల్ ప్రాజెక్ట్‌లు కేటాయించినట్లు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. రాజ్యసభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ, ఆంధ్రప్రదేశ్‌లో వివిధ పోర్టులకు సరకుల రవాణాను వేగవంతం, సులభతరం చేసే ప్రక్రియలో భాగంగా రోడ్డు, రైల్ ప్రాజెక్ట్‌లు చేపట్టినట్లు మంత్రి చెప్పారు. రోడ్డు ప్రాజెక్ట్‌లలో కొన్ని పూర్తయ్యాయి. మరికొన్ని పనులు కొనసాగుతున్నాయి. మరికొన్ని డీపీఆర్ రూపకల్పన దశలో ఉన్నాయని ఆయన వివరించారు. రైల్ ప్రాజెక్ట్‌లలో కూడా ఇదే పరిస్థితి ఉన్నట్లు చెప్పారు. ఏపీలోని 9 జిల్లాల్లో సాంప్రదాయ పారిశ్రామిక క్లస్టర్లు సాంప్రదాయ పరిశ్రమలను ప్రోత్సహించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక నిధితో ఒక పథకాన్ని ప్రారంభించినట్లు సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల మంత్రి నితిన్ గడ్కరీ రాజ్యసభలో చెప్పారు. సభలో విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన జవాబిస్తూ ఈ పథకంలో భాగంగా ఖాదీ, కాయర్, విలేజ్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో సాంప్రదాయక పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసి అందుకు తగిన ఆర్థిక సహాయాన్ని అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు (కలంకారీ ఉత్పాదనలు), విజయనగరం (కాయర్ పరుపుల తయారీ), చిత్తూరు (కాయర్ ఉత్పాతదనలు), కృష్ణా (కొండపల్లి బొమ్మలు), తూర్పు గోదావరి (జొన్నాడ ఫుడ్ ప్రాసెసింగ్), చిత్తూరు (చింతపండు ఉత్పాతదనలు), గుంటూరు (మంగళగిరి బంగారు ఆభరణాల తయారీ), తూర్పు గోదావరి (కొబ్బరి నార ఉత్పాదనలు), తూర్పు గోదావరి (కడియపులంక కొబ్బరి పీచు ఉత్పాదనలు) జిల్లాల్లో మొత్తం 9 సాంప్రదాయ పరిశ్రమల క్లస్టర్లను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. గోదావరి కృష్ణా నదుల అనుసంధానంపై డీపీఆర్ సిద్ధం గోదావరి నుంచి కృష్ణ, కృష్ణ నుంచి పెన్నా, పెన్నా నుంచి కావేరీ నదులకు నీటి మళ్ళింపు కోసం నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యుడీఏ) ముసాయిదా ప్రణాళికను రూపొందించినట్లు కేంద్ర జల శక్తి మంత్రి గజేంద్ర సింగ్‌షెకావత్ సోమవారం రాజ్యసభలో వెల్లడించారు. వైఎస్సార్సీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. దుర్భిక్ష పరిస్థితులను ఎదుర్కొంటున్న రాయలసీమ, ప్రకాశం, నెల్లూరు జిల్లాలను ఆదుకునేందుకు గోదావరి నది బేసిన్‌నుంచి కృష్ణా నది బేసిన్‌కు నీరు మళ్ళించే అవకాశాలను పరిశీలించివలసిందిగా కోరుతూ గత ఏడాది ఆగస్టులో ఆంధ్రప్రదేశ్ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తూ గోదావరి కృష్ణా నదుల అనుంసంధానం ప్రాజెక్ట్‌కు ఆర్థికంగా సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరినట్లు మంత్రి చెప్పారు. గోదావరి, కృష్ణా, పెన్నా, కావేరీ నదుల అనుసంధానంపై సవివరమైన ప్రాజెక్ట్‌నివేదికను రూపొందించే బాధ్యతను ఎన్డబ్ల్యుడీఏకు అప్పగించినట్లు మంత్రి తెలిపారు. ఆ సంస్థ సిద్ధం చేసిన ముసాయిదా డీపీఆర్‌పై తమ అభిప్రాయాలను తెలపవలసిందిగా కోరుతూ సంబంధిత రాష్ట్రాలకు పంపించినట్లు షెకావత్ చెప్పారు. గోదావరి కావేరీ లింక్‌ప్రాజెక్ట్‌లో ప్రధానంగా మూడు లింక్‌లు ఉంటాయి. అవి గోదావరి (ఇంచంపల్లి లేదా జానంపేట), కృష్ణా (నాగార్జున సాగర్) లింక్, కృష్ణా (నాగార్జున సాగర్) పెన్నా (సోమశిల) లింక్, పెన్నా (సోమశిల), కావేరీ (గ్రాండ్‌ఆనకట్ట) లింక్‌అని చెప్పారు. ఈ లింక్‌ప్రాజెక్ట్‌ల ద్వారా నిరుపయోగంగా పోతున్న 247 టీఎంసీల నీటిని సద్వినియోగం చేసుకునే వీలు కలుగుతుందని మంత్రి తెలిపారు. గోదావరి కృష్ణా లింక్ ప్రాజెక్ట్ ద్వారా ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా, గుంటూరు, ప్రకాశం, చిత్తూరు, నెల్లూరు జిల్లాల్లో 3.45 లక్షల నుంచి 5.04 లక్షల హెక్టార్ల భూములకు ఏటా సాగునీటి వసతి కల్పించవచ్చని చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ కుడి, ఎడమ కాల్వల కింద ఉన్న ఆయకట్టును స్థిరీకరించవచ్చు. నదుల లింకింగ్‌ప్రాజెక్ట్‌పై సంబంధిత రాష్ట్రాల మధ్య ఏకాభిప్రాయం సాధించిన అనంతరం తుది డీపీఆర్‌ను రూపొందించి, చట్టపరమైన అన్ని అనుమతులు పొందిన తర్వాత ప్రాజెక్ట్ పనులు మొదలవుతాయని ఆయన తెలిపారు. -
డీసీఐని మూసివేసే ప్రసక్తే లేదు: గడ్కరీ
సాక్షి, విశాఖపట్నం: ప్రకాశం జిల్లా ఓడరేవుకు 3వేల ఎకరాలు కేటాయిస్తే పోర్టు నిర్మాణానికి మేము సిద్ధమని కేంద్ర షిప్పంగ్ మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. ఆమేరకు ముఖ్యమంత్రికి ప్రతిపాదనలు అందిస్తామని తెలిపారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రెజ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(డీసీఐ)విషయంలో ఓ నిర్ణయానికి వచ్చామన్నారు. దీనికి సంబంధించిన కేంద్ర కార్యాలయం విశాఖలోనే ఉంటుందని, దానిని మూసివేసే ప్రసక్తే లేదని తెలిపారు. డీసీఐని బలోపేతం చేయడమే మా లక్ష్యమని, దీనికి సంబంధించి కెబినెట్ నోట్ ఇవ్వడం జరిగిందని వెల్లడించారు. డీసీఐ సేవల్లో మరింత పోటీ పెంచి, మరికొన్ని ఉద్యోగాలు కల్పిస్తామని గడ్కరీ తెలిపారు. సాగరమాల ప్రాజెక్ట్‌లో భాగంగా విశాఖ పోర్టుకు అనుబంధంగా శాటిలైట్ పోర్టును ఏర్పాటు చేస్తామని గడ్కరీ చెప్పారు. ప్రధాన పోర్టుల నుంచి వ్యవసాయ, అక్వా ఉత్పత్తు ఎగుమతికి ప్రాధాన్యత కల్పించాలని నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు. అన్నీ మేజర్ పోర్టులలో టూరిజం అభివృద్ధికి ఫ్లోటింగ్ హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటు చేస్తామని తెలిపారు. వాటర్‌వేస్ టూరిజం అభివృద్ధి చేయబోతున్నామని, ముంబై నుంచి గోవాకు టూరిజం క్రూయిజ్‌టు నడుపుతున్నామన్నారు. పోర్టుల ఆధునీకరణ, యాంత్రీకరణంగా గైడ్ చేసేందుకు మద్రాస్ ఐఐటీ సహకారం తీసుకుంటున్నామని తెలిపారు. మురుగు నీరు సముద్రంలో చేరకుండా సీవెజ్ ప్లాంట్ల నిర్మాణం అన్నీ పోర్టులకు తప్పనిసరి చేశామని పేర్కొన్నారు. -
‘సాగరమాల’లో 12 స్మార్ట్‌సిటీలు
పలుచోట్ల తీర ప్రాంత ఆర్థిక మండళ్లను ఏర్పాటు చేస్తాం జీడీపీలో 2% పెరుగుదల నమోదవుతుందని గడ్కారీ వెల్లడి న్యూఢిల్లీ: తీర ప్రాంతాల అభివృద్ధి కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సాగరమాల ప్రాజెక్టు ద్వారా 12 స్మార్ట్‌సిటీలను అభివృద్ధి చేస్తామని, పలు తీరప్రాంత ఆర్థిక మండళ్ల(సీఈజెడ్)ను ఏర్పాటు చేస్తామని కేంద్ర రోడ్డు రవాణా, షిప్పింగ్ శాఖ మంత్రి నితిన్ గడ్కారీ తెలిపారు. ఈ ప్రాజెక్టుతో స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ)లో 2 శాతం పెరుగుదల నమోదవుతుందని చెప్పారు. సాగరమాల ప్రాజెక్టు చేపట్టేందుకు కేంద్ర కేబినెట్ అంగీకరించడం చరిత్రాత్మకమని పేర్కొన్నారు. గురువారమిక్కడ గడ్కారీ విలేకరులతో మాట్లాడారు. ‘‘ఈ ప్రాజెక్టు కింద ముంబైలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ ట్రస్ట్ సమీపంలోని ఎస్ఈజెడ్కు రూ.4 వేల కోట్లు కేటాయించాం. గుజరాత్‌లోని కండ్లా పోర్టు తీరప్రాంత ప్రత్యేక ఆర్థిక మండలి ఏర్పాటు చేస్తాం. ఈ పోర్టు ఆధీనంలో 2లక్షల ఎకరాల భూమి ఉంది. 12 స్మార్ట్ సిటీలతో పాటు పర్యాటకులను ఆకర్షించేందుకు 1,208 దీవులను అభివృద్ధి చేస్తాం. 189 లైట్‌హౌస్‌లను నెలకొల్పుతాం’’ అని మంత్రి వివరించారు. తీరప్రాంతాల్లో సాగరమాల ప్రాజెక్టు అమలుకు సంబంధించి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను ఆరునెలల్లోగా రూపొందిస్తామని చెప్పారు. ఇందులో ఎస్ఈ జెడ్ ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలో నిర్ణయిస్తామన్నారు. సాగరమాల ప్రాజెక్టు ద్వారా పోర్టు ల సామర్థ్యం మరింత పెంచుతామని, ఎగుమతులు-దిగుమతులను పెంచడం, తీరప్రాంతా ల్లో దేశీయ వాణిజ్యాన్ని ప్రోత్సహించడం వంటి చర్యలు తీసుకుంటామని తెలిపారు. తీరప్రాంతాల్లో 12స్మార్ట్‌సిటీలను ఒక్కోదాన్ని రూ.50 వేలకోట్లతో అభివృద్ధి చేస్తామని గతం లో గడ్కారీ ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలంగాణలో 2 జాతీయ జల మార్గాలు సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా కొత్తగా ప్రతిపాదించిన 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేసేందుకు వీలుగా చట్టం చేయాలని కేంద్రం నిర్ణయించింది. గడిచిన 30 ఏళ్లలో కేవలం ఐదింటిని మాత్రమే జాతీయ జల రవాణా మార్గాలను గుర్తించారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లోని కాకినాడ-పుదుచ్చేరి మార్గంలో 1,078 కి.మీ. మేర జల మార్గం ఒకటి. కేంద్రం తాజాగా మరో 101 జాతీయ జల రవాణా మార్గాలను అభివృద్ధి చేయాలని భావిస్తోంది. ఈ జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన రెండు మార్గాలకు చోటు దక్కింది. కృష్ణా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల మీదుగా ఒక జాతీయ జల మార్గం, మంజీరా నదిలో మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మీదుగా మరో మార్గాన్ని కేంద్రం అభివృద్ధి చేయనుంది.