Samba Shiva rao
-
టీడీపీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు
సాక్షి, అమరావతి: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుపై కేసు నమోదు అయింది. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టిన వ్యవహారంలో సాంబశివరావుపై కేసు నమోదుకు కోర్టు అనుమతి ఇచ్చింది. సాంబశివరావుతోపాటు మరో ఐదుగురుపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో A1 ముద్దాయిగా ఎమ్మెల్యే సాంబశివరావు ఉన్నారు. చదవండి: దొంగ ఓట్లు... ‘పచ్చ’ నోట్లు -
టీఆర్ఎస్పై ఐక్య పోరాటాలు
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ జన సమితి, టీడీపీ, సీపీఎంతో పాటు అన్ని లౌకిక శక్తులతో కలిసి పోరాటాలు చేస్తామని సీపీఐ పేర్కొంది. ప్రభుత్వ వ్యతిరేక కూటమి ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల రీ డిజైన్, టెండర్లు, అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని సీపీఐ రాష్ట్ర మహాసభలు డిమాండ్ చేశాయి. హైదరాబాద్లమంగళవారం జరిగిన మూడో రోజు సభల వివరాలను పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి కూనంనేని సాంబశివరావు మీడియాకు వెల్లడించారు. ప్రాజెక్టుల పేరుతో కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని సీఎం కేసీఆర్ కాజేశారని ఆరోపించారు. సీబీఐ విచారణ జరిపిస్తే కుటుంబంతో సహా ఆయన జైలుకెళ్లడం ఖాయమన్నారు. కేసీఆరే సీబీఐ విచారణ కోరి పారదర్శకత నిరూపించుకోవాలన్నారు. ‘‘నిరుద్యోగులకు ఉద్యోగాలివ్వకుండా గొర్రెలు, మేకలు, చేపల పేరుతో ఆయా వర్గాలకు అంతర్గత అన్యాయం చేస్తున్నారు. ఇంటింటికీ ఉద్యోగమిస్తామన్న టీఆర్ఎస్ ఇప్పుడు మోసం చేసింది. రైతులకు చేసిందేమీ లేదు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లివ్వలేదు. రాష్ట్రంలో 6 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు ఇప్పటికీ బకాయిలు చెల్లించలేదు. కేవలం రూ.5 వేల కోట్లతో పాలమూరులోని పెండింగు ప్రాజెక్టులన్నీ పూర్తి చేయొచ్చు. సీఎం సహాయ నిధి నుంచి పేదలను ఆదుకోవడం లేదు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీల్చడానికి ప్రధాని మోదీతో కేసీఆర్ కుమ్మక్కయ్యారు. రాష్ట్రంలో రెవెన్యూ మిగులు బూటకం. అప్పులు భారీగా పెరిగాయి. తెలంగాణకు కేంద్ర ప్రభుత్వ నిధులు, వినియోగంపై ఆర్థిక సంఘం విచారణ జరిపించాలి. రైతులను ఆదుకోవడంలో, మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైంది. ప్రజా ఉద్యమాలకు కేసీఆర్ ఎందుకు భయపడుతున్నారు? సచివాలయానికి రాని, ప్రజల సమస్యలను వినని సీఎం ప్రజలకెందుకు?’’అని దుయ్యబట్టారు. ఫాసిస్టు మోదీ: అతుల్ కుమార్ కేంద్రంలో ఫాసిస్టు తరహాలో మోదీ పాలన సాగుతోందని సీపీఐ జాతీయ కార్యదర్శి అతుల్‌కుమార్ అంజన్ విమర్శించారు. ‘‘మోదీ పాలన హిట్లర్ తరహాలోనే ఉంది. కార్పొరేట్లకు, సంపన్నులకు, బడా పెట్టుబడిదారులకు ఆయన ఊడిగం చేస్తున్నారు’’అని ఆరోపించారు. -
భావోద్వేగానికి గురైన సాంబశివరావు
విజయవాడ : ఆంధ్రప్రదేశ్ డీజీపీ పదవికి ఉద్యోగ విరమణ చేసిన నండూరి సాంబశివరావు ఆదివారం భావోద్వేగానికి లోనయ్యారు. కొత్త డీజీపీగా డా.ఎం.మాలకొండయ్య ఛార్జ్ తీసుకున్నారు. ఆరు నెలల పాటు మాలకొండయ్య డీజీపీగా కొనసాగనున్నారు. పదవి విరమణ చేసిన సాంబశివరావుకు ఐపీఎస్ అధికారులు ఘనంగా వీడ్కోలు పలికారు. ఎక్స్ డీజీపీ సాంబశివరావును ఐపీఎస్ అధికారులు పోలీసు రథంలో కూర్చోబెట్టి సాధరంగా దాన్ని లాక్కెల్లి వీడ్కోలు పలికారు. కాగా, కొత్త డీజీపీ మాలకొండయ్య రథం తాడును లాగడంతో సాంబశివరావు భావోద్వేగానికి గురయ్యారు. నూతన డీజీపీ మాలకొండయ్యకు రాష్ట్రంలోని ఐపీఎస్ లు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. -
నూతన డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన మాలకొండయ్య
-
'పుష్కరాలకు 31,400 మంది పోలీసులతో భద్రత'
విజయవాడ: కృష్ణా పుష్కరాలకు 31, 400 మంది పోలీస్ సిబ్బందితో భారీ భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు వెల్లడించారు. ఇందులో భాగంగా 30 మంది ఐపీఎస్ అధికారులకు బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిపారు. విజయవాడలో రూ. 20 కోట్లతో కమాండ్ కంట్రోల్.. 1300 సీసీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. చెన్నై- కోల్‌కతా- హైదరాబాద్ జాతీయ రహదార్లపై ట్రాఫిక్ పర్యవేక్షణ బాధ్యతలు ఐజీలు రామకృష్ణ, సంజయ్ జైన్‌కు అప్పగించినట్టు తెలిపారు. విజయవాడలో భక్తుల కోసం 65 చోట్ల పార్కింగ్ సౌకర్యం కల్పించనున్నట్టు చెప్పారు. విజయవాడ, గుంటూరులో 740 ఉచిత బస్సులును ఏర్పాటుచేస్తున్నట్టు డీజీపీ సాంబశివరావు పేర్కొన్నారు. -
ఆర్టీసీలో తాత్కాలిక విభజన
సాక్షి, హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాలకు ఉమ్మడిగా కొనసాగుతున్న ఆర్టీసీని తాత్కాలికంగా విభజించాలని యాజమాన్యం నిర్ణయించింది. విభజన జరగకపోవటంతో సంస్థలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్న నేపథ్యంలో ఆర్టీసీ ఎండీ సాంబశివరావు ఈ నిర్ణయం తీసుకున్నారు. పూర్తి స్థాయి విభజన జరిగేలోపు తాత్కాలిక విభజనతో సమస్యలు దూరం చేయాలని ఎండీ భావిస్తున్నారు. దీన్ని తొలుత ఆర్టీసీ ప్రధాన పరిపాలన కేంద్రం ఆర్టీసీ భవన్‌కు వర్తింపచేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. ప్రధాన కార్యాలయంలో ప్రస్తుతం ఉన్న నలుగురు ఎగ్జిక్యూటివ్ డైరక్టర్లు రెండు రాష్ట్రాల బాధ్యతను పర్యవేక్షిస్తున్నారు. ఇక నుంచి వారిలో ఇద్దరు తెలంగాణ, మిగతా ఇద్దరు ఏపీ బాధ్యతలు చూసేలా ఆయా విభాగాలను వారికి అదనపు బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నారు. ఇక ఇతర విభాగాల అధిపతులను కూడా రెండు ప్రాంతాల మధ్య విభజించి ఏ రాష్ట్రానికి సంబంధించిన బాధ్యతలు ఆ రాష్ట్రం వారే చూసేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించి త్వరలో ఆదేశాలు రానున్నాయి. అయితే ఈ తాత్కాలిక విభజనకు అధికారులు, కార్మిక సంఘాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఒకేసారి పూర్తి విభజన జరగాలని, అందులో జాప్యం లేకుండా చూడాలని వారు పేర్కొంటున్నారు. నేడు కార్మిక సంఘాలతో చర్చలు.. ఆర్టీసీ ఉద్యోగుల వేతన సవరణ, ఇతర సర్వీస్ విషయాలకు సంబంధించి గుర్తింపు పొందిన కార్మిక సంఘ కూటమి ఈయూ- టీఎంయూ నేతలతో అధికారులు సోమవారం చర్చలు జరపనున్నారు. మూడు రోజుల కిందట చర్చలు జరగాల్సి ఉన్నా... సకాలంలో అధికారులు రాకపోవటంతో కార్మిక నేతలు చర్చలను బహిష్కరించారు. -
సిరిసిల్ల.. మెగా క్లస్టర్
సిరిసిల్ల నేత కార్మికుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర చేనేత జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మరమగ్గాల ఆధునికీకరణ పథకాన్ని(పవర్‌లూం క్లస్టర్) మంగళవారం ఆయన సిరిసిల్ల బీవైనగర్‌లోని బాసాని భాస్కర్ అనే నేతకార్మికుని ఇంట్లో ప్రారంభించారు. ఆధునికీకరణకు రూ.30 వేలు వ్యయం కాగా జౌళిశాఖ రూ.15 వేలు సబ్సిడీ మంజూరు చేసింది. పీఎల్సీ ఆధారిత ఎలక్ట్రానిక్ పవర్‌లూంను ప్రారంభించారు. అనంతరం స్థానిక పద్మనాయక కల్యాణ మంటపంలో కార్మికులు, ఆసాములు, యజమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించా రు. నేతన్నల సమస్యలు తనకు తెలుసునని, సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్ ఏర్పాటుకు వచ్చే బడ్జెట్లో సిఫారసు చేస్తామని చెప్పారు. కార్మికలోకానికి, వస్త్ర పరిశ్రమకు ‘కావూరి’ కొన్ని హామీలు ప్రకటించారు. - న్యూస్‌లైన్, సిరిసిల్ల టౌన్/ సిరిసిల్ల రూరల్