సిరిసిల్ల నేత కార్మికుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర చేనేత జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు.
సిరిసిల్ల నేత కార్మికుల ఆదాయం పెంచడమే ప్రభుత్వ ధ్యేయమని కేంద్ర చేనేత జౌళిశాఖ మంత్రి కావూరి సాంబశివరావు అన్నారు. దేశంలోనే మొట్టమొదటిసారిగా మరమగ్గాల ఆధునికీకరణ పథకాన్ని(పవర్‌లూం క్లస్టర్) మంగళవారం ఆయన సిరిసిల్ల బీవైనగర్‌లోని బాసాని భాస్కర్ అనే నేతకార్మికుని ఇంట్లో ప్రారంభించారు. ఆధునికీకరణకు రూ.30 వేలు వ్యయం కాగా జౌళిశాఖ రూ.15 వేలు సబ్సిడీ మంజూరు చేసింది.
పీఎల్‌సీ ఆధారిత ఎలక్ట్రానిక్ పవర్‌లూంను ప్రారంభించారు. అనంతరం స్థానిక పద్మనాయక కల్యాణ మంటపంలో కార్మికులు, ఆసాములు, యజమానులు, అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం నిర్వహించా రు. నేతన్నల సమస్యలు తనకు తెలుసునని, సిరిసిల్లలో మెగా పవర్ క్లస్టర్ ఏర్పాటుకు వచ్చే బడ్జెట్‌లో సిఫారసు చేస్తామని చెప్పారు. కార్మికలోకానికి, వస్త్ర పరిశ్రమకు ‘కావూరి’ కొన్ని హామీలు ప్రకటించారు.
- న్యూస్‌లైన్, సిరిసిల్ల టౌన్/
సిరిసిల్ల రూరల్